డబుల్‌ ఇంజిన్‌ సర్కారులో డబుల్‌ అనారోగ్యం: ఖర్గే | Congress President Mallikarjun Kharge Attack on BJP | Sakshi
Sakshi News home page

డబుల్‌ ఇంజిన్‌ సర్కారులో డబుల్‌ అనారోగ్యం: ఖర్గే

Published Wed, Oct 25 2023 11:39 AM | Last Updated on Wed, Oct 25 2023 12:02 PM

Congress President Mallikarjun Kharge Attack on BJP - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది చిన్నారులకు ఇన్ఫెక్షన్‌ కలిగిన రక్తాన్ని ఎక్కించారు. ఈ నేపధ్యంలో ఈ చిన్నారులు హెచ్‌ఐవి, ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ తదితర వ్యాధుల బారిన పడ్డారు. దీనిపై  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అటు కేంద్రం, ఇటు యూపీ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను రెట్టింపు అనారోగ్యానికి గురి చేసిందని’ వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో మల్లికార్జున్ ఖర్గే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను రెట్టింపు అనారోగ్యానికి గురి చేసింది. యూపీలోని కాన్పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియాతో బాధపడుతున్న 14 మంది చిన్నారులకు వ్యాధి సోకిన రక్తాన్ని ఎక్కించారు. ఫలితంగా ఆ పిల్లలకు హెచ్‌ఐవీ ఎయిడ్స్,హెపటైటిస్ బీ, సీ తదితర తీవ్రమైన వ్యాధులు సోకాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ క్షమించరాని నేరానికి అమాయక పిల్లలు శిక్షను అనుభవించాల్సి వస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఎన్నడైనా జవాబుదారీతనాన్ని కలిగివున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. 

కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ (ఎల్‌ఎల్‌ఆర్) ఆసుపత్రిలో 14 మంది పిల్లలకు వ్యాధి సోకిన రక్తాన్ని ఎక్కించారు. ఆ తర్వాత వారు పలు వ్యాధులకు గురయ్యారని తేలింది. ఈ చిన్నారులు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్, ఫరూఖాబాద్, ఇటావా, ఔరైయా, కన్నౌజ్‌లతో సహా వివిధ జిల్లాలకు చెందినవారు.
ఇది కూడా చదవండి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌పై ఇజ్రాయెల్‌ ఆగ్రహం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement