ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తున్నాడని, అతని బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని మండలంలోని మల్లికార్జునపురం
అతని బారి నుంచి మహిళలకు రక్షణ కల్పించండి
తోటపల్లిగూడూరు : ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తున్నాడని, అతని బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని మండలంలోని మల్లికార్జునపురం గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన ప్రశాంత్ మల్లికార్జునపురానికి చెందిన దారా స్వామిదాసు కుమార్తె విజితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రశాంత్ కొద్ది కాలంగా మల్లికార్జునపురంలోనే భార్యా పిల్లలతో కాపురం ఉంటున్నాడు. బేల్దారి పని చేసుకునే అతను సైకోలా వ్యవహరిస్తున్నాడు.
మహిళలు ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా, ఇంట్లో స్నానాలు చేస్తున్నా రహస్యంగా చూడటం, ఫొటోలు తీయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోని రోడ్డు పక్కన నివాసమున్న ఓ ఇంట్లో మగవాళ్లు ఎవరూ లేని సమయం చూసి మల్లికార్జున్ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.