కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యాయత్నం | contract lecturer commits suicide attempt in nalgonda district | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యాయత్నం

Published Thu, Sep 15 2016 1:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

contract lecturer commits suicide attempt in nalgonda district

మోత్కూరు: నల్గొండ జిల్లా మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. కాంట్రాక్టర్ లెక్చరర్ మల్లికార్జున్ గురువారం కళాశాల ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. తోటి లెక్చరర్లు తక్షణమే స్పందించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కాంట్రాక్టు ప్రతీ సంవత్సరం రెన్యువల్ అవుతుంది. ఈ సారి తన పేరు రెన్యువల్‌కు ప్రిన్సిపల్ సిఫార్సు చేయకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మల్లికార్జున్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement