Contract lecturer
-
పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనం పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాన్ని పెంచుతూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం మెమో జారీ చేశారు. వీరికి సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టు అధ్యాపకులు రూ.35,120 పొందుతుండగా తాజా ఆదేశాల ప్రకారం అది రూ.40,270కి పెరగనుంది. ఈ వేతనాలు ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి అమలులోకి వస్తాయని మెమోలో పొందుపరిచారు. దీనివల్ల 316 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు జరగనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు పెంచినందుకు పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన ఎంటీఎస్‌ను అమలు చేసినందుకు మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధననాయుడు, బి.కృష్ణ పేర్కొన్నారు. -
ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..
సాక్షి, తిరువూరు(కృష్ణా): ఏ కొండూరు పోలీసుస్టేషను పరిధిలోని కంభంపాడులో ఐదు రోజుల క్రితం బాలికను కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు మోసగించిన కేసును ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ డీఎస్పీ విజయరావు ఆదివారం విచారణ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వల్లంపట్లకు చెందిన ఎం.గోపికృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితం వివాహం అయింది. ఆషాఢ మాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకెళ్లాడు. ఆ అధ్యాపకుడిని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఏకొండూరు పోలీసుస్టేషనుకు తీసుకొచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారిణ చేసి పోలీసులు బాలికను తిరువూరులోని స్వధార్‌హోంకు తరలించారు. ఫోక్సా చట్టం కింద నమోదైన కేసును డీఎస్పీ విచారణ చేస్తున్నారు. ఏ కొండూరు పోలీసుస్టేషనులో ఉన్న నిందితుడిని కూడా డీఎస్పీ ప్రశ్నించారు. తిరువూరు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, నూజివీడు టౌన్, తిరువూరు సెక్టార్ 2, ఏ కొండూరు ఎస్ఐలు కనకదుర్గ, అవినాష్, ప్రవీణ్‌కుమార్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్య
ఆమె వందలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే గురువు. కానీ ఆ మాతృమూర్తికి ఏ కష్టమొచ్చిందోగానీ మూడేళ్ల బాబుతో పాటు పొత్తిళ్లలో చిన్నారిని వదిలి శాశ్వతంగా వెళ్లిపోవాలనుకుంది. పేగుబంధాన్ని తెంచుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఏడిస్తే పరుగు పరుగున వచ్చి అక్కున చేర్చుకోవాల్సిన తల్లి.. విగతజీవిలా ఎందుకు పడి ఉందో తెలియని పరిస్థితి ఆ చిన్నారులది. ఈ సంఘటన చూసిన వారి కళ్లు చెమరుస్తున్నాయి. సోంపేట: కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా తెర్లాం గ్రామానికి చెందిన తెర్ల నూకరాజుతో, అదే జిల్లా చౌదంటివలస గ్రామానికి చెందిన గేదెల సింహాచలం (గీత)తో 2012, మార్చి9న వివాహం జరిగింది. నూకరాజు ఏపీజీవీబీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, గీత ప్రభుత్వ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 2016లో విజయనగరం నుంచి బొరివంక ఏపీజీవీబీ బ్రాంచికి నూకరాజుకు బదిలీ అయింది. గీత కూడా అదే సంవత్సరం విజయనగరం నుంచి సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా బదీలీపై వచ్చారు. వీరు ఏడు నెలల క్రితం రాజా పంతుల కాలనీలోని ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి మూడేళ్ల బాబు చేతన్‌తో పాటు ఐదు నెలల పాప హయాతి ఉన్నారు. వివాహం అయిననాటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో గీత కుంగిపోయి శుక్రవారం ఉదయం బెడ్రూమ్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విగత జీవి పడి ఉన్న తమ కుమార్తెను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 24 నుంచి ఆమె ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్‌కు వెళ్లాల్సి ఉంది. మూడు రోజులుగా గొడవలు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఇంటి ఓనర్ వద్దకు వెళ్లిన నూకరాజు.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వాళ్లు వచ్చేసరికి ఆమె మెయిన్‌హాల్‌లో కింద పడి ఉంది. దీనిపై నూకరాజును విచారించగా.. తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చే సరికి గీత చీరతో ఉరివేసుకుని ఉందన్నారు. వెంటనే చీర కోసి రక్షించే ప్రయత్నం చేశానని, దుస్తులు మార్చి ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి కిందకు దించానని పోలీసులు, ఇంటి యజమానికి వివరించారు.కాగా, మూడు రోజులుగా నూకరాజు, గీత మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులుగా బ్యాంకు బ్రాంచిలోనూ నూకరాజు ముభావంగా ఉండేవాడని, భోజనం కూడా సరిగ్గా చేయక పోయేవాడని బ్యాంకు సిబ్బంది వివరిస్తున్నారు. నూకరాజుకు స్వగ్రామంలో కొందరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గృహహింస, అధిక కట్నం వేధింపులతోనే.. నూకరాజు తనను చాలాకాలం నుంచి అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని తరుచూ గీత చెబుతుండేదని తండ్రి సత్యనారాయణ తెలిపారు. వీటితో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్.ఐ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేశారు. íసీఐ సన్యాసినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కష్టమే!
యూజీసీ నిబంధనల ప్రకారం అది కుదరదు: కడియం ఏం చేయాలన్నది తరువాత నిర్ణయిస్తాం అన్ని వర్సిటీల్లో కామన్ అకడమిక్ కేలండర్ అమలు డిగ్రీలో 6 నెలల ప్రాజెక్టు వర్క్.. పూర్తికాగానే ఉపాధి లభించేలా చర్యలు వర్సిటీలకు రూ.1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధ్యం కాదు. యూజీసీ జారీ చేసిన జీవో 14 ప్రకారం ఇది కష్టం. అయితే దీనిపై ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తాం. ప్రభుత్వపరంగా విధాన నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది..’’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో స్థితిగతులు, నియామ కాలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై బుధవారం సచివాలయంలో ఆయా వర్సిటీ ల వీసీలతో కడియం సమీక్ష సమావేశం నిర్వ హించారు. యూజీసీ నిబంధనల ప్రకారం జాతీయ స్థాయిలో నియామక నోటి ఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, సర్వీసుకు వెయిటేజీ మాత్రమే ఉందని కడియం స్పష్టం చేశారు. నియామకాల సమయంలో దీనిపై చర్చిస్తా మని తెలిపారు. అయితే వర్సిటీల్లో ప్రస్తుతం ఎంత మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు, వారి నియామక ప్రక్రియ ఏమిటి, నిబంధ నలు ఏం చెబుతున్నాయి, క్రమబద్ధీ కరణ విషయంలో ఏం చేయాలన్న దానిని వీసీలు సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు వర్క్ వర్సిటీల్లో సంప్రదాయ కోర్సులే కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సు ల ను రూపొందించాలని వీసీలకు కడియం సూచించారు. సాధారణ డిగ్రీ కోర్సుల్లోనూ 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్/శిక్షణ ఇచ్చేలా సర్టి ఫికెట్ కోర్సును ప్రవేశపెట్టాలని.. తద్వారా విద్యార్థి కోర్సు పూర్తి చేయ గానే ఉపాధి లభిం చేలా చర్యలు చేప ట్టాలని చెప్పారు. ప్రభుత్వం వన్‌టైమ్ గ్రాంటు ఇస్తుందని, భవిష్యత్తులో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధార పడకుండా సొంత వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. కానిస్టేబుల్, ఇంజనీర్ల పరీక్షలు నిర్వహించడం ద్వారా జేఎన్టీయూ హెచ్ వనరులను సమకూర్చుకున్నట్లు ఇతర యూనివర్సిటీలు చేయాలని చెప్పారు. ఒక్కో యూనివర్సిటీ ఒక్కోలా కాకుండా అన్నింటిలో కామన్ అకడమిక్ కేలండర్ అమలు చేయాలని... యూనివర్సిటీల్లో అన్ని సర్వీసులను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. బీఎడ్ రెండో దశ కౌన్సెలింగ్‌పై ప్రశ్నించగా.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని, 11 కొత్త కాలేజీలు తమకు ప్రవేశాలు వద్దని రాసిస్తే, కౌన్సెలింగ్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వర్సిటీలకు రూ.1,000 కోట్లు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలని, ఇందుకోసం వర్సిటీలకు రూ.1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని కడియం వెల్లడించారు. వర్సిటీల అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. పాత యూనివర్సిటీల్లో మరమ్మతులు, పెయిం టింగ్, కొత్త యూనివర్సిటీలకు అదనపు గదులు, మౌలిక సదుపాయాలు కల్పించేం దుకు చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశిం చారు. వర్సిటీల్లో రిటైర్మెంట్ వయసు పెంపుపైనా చర్చించామని, అంతకంటే ముందు వర్సిటీల్లో పదోన్నతులు కల్పించా లని వీసీలను ఆదేశించారు. తర్వాత ఏర్పడే ఖాళీల భర్తీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అయితే గతంలో యూని వర్సిటీల్లో ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టినందున... ప్రస్తుతమున్న విద్యార్థుల సంఖ్యతో బోధన–బేధనేతర సిబ్బందిని హేతుబద్ధీకరణ చేయాలని ఆదేశించారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీ్దకరించాలి
కరీంనగర్‌సిటీ : కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వా, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు నిరవధిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్ష సోమవారం 5వ రోజుకు చేరింది. దీక్షాశిబిరాన్ని విశ్వా, డాక్టర్, నగేశ్, జిల్లా మా జీ అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మా జీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సందర్శించి మద్ద తు పలికారు. గతంలో కేసీఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌పై హామీ ఇచ్చిన వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశార ని విమర్శించారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తామన్న కేసీఆర్ నేడు ముఖం చాటేశారని, కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్లు సాధించుకునేంత వరకు ఈ పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్ ఉన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవేందర్, నర్సింహరాజు, నాయకులు రాజమహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ అధ్యాపకులపై వేటు
కాంట్రాక్ట్ అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు చంద్రబాబు ఎన్నికల హామీకి గ్రహణం వెనక్కు తగ్గబోమని జేఏసీ నేతల స్పష్టం తణుకు : కాంట్రాక్ట్ అధ్యాపకులపై ప్రభుత్వం కత్తి కట్టిందా..? చెప్పిన మాట వినడంలేదంటూ బ్లాక్ మెయిల్‌కు దిగుతోందా..? మూడ్రోజులు గడువు పెట్టి హెచ్చరిక నోటీసులు జారీ చేయడాన్ని చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 27 రోజులుగా సమ్మెబాట పట్టిన ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కొందరు అధ్యాపకులు భయపడి విధుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నా చాలామంది మాత్రం తాడోపేడో తేలేవరకు సమ్మెను వీడమని నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విజయవాడలో చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్యాంకుమార్, పల్లి సుబ్బారావు ఏలూరులో 48 గంటల పాటు నిరవధిక దీక్ష చేపట్టారు. పట్టించుకోని ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కరించాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జిల్లావ్యాప్తంగా 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 264 మంది పనిచేస్తుండగా డిగ్రీ కళాశాలల్లో 60 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరంతా 27 రోజులుగా సమ్మెలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం నుంచి వారు ఆమరణ దీక్షను చేపట్టారు. ఎన్నికల ముందు క్రమబద్ధీకరణకు హామీ ఎన్నికలకు ముందు టీడీపీ కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో వారు చంద్రబాబు హామీని నమ్మి టీడీపీకి ఓటేసి గెలిపించారు. తమకు వేతనం పెరుగుతుందని, ఉద్యోగానికి భద్రత ఏర్పడుతుందని అధ్యాపకులు భావించారు. అధికారం చేపట్టిన మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 16వ నంబర్ జీవో ఇచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసింది. దీంతో మన రాష్ట్రంలోని అధ్యాపకులు సమ్మె బాట పట్టి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జూనియర్ లెక్చరర్ల కాంట్రాక్ట్ ఈ నెల 31తో ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం గురువారం జీవో జారీ చేయడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ వైఖరిపై విమర్శల వెల్లువ అధ్యాపకులు ఉద్యమ బాట పట్టడంతో కళాశాలల్లో విద్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాబోధన చివరి దశలో ఉన్న తరుణంలో అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికీ సగం సిలబస్ కూడా పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్స్ ఎలా నెగ్గుకురావాలో తెలియక ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. మార్చి ఒకటి నుంచి పరీక్షలు మొదలు కానుండటంతో ఎలా ప్రిపేర్ కావాలోనని విద్యార్థులు సతమతమవుతున్నారు. అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చి తర్వాత చేతులెత్తేసి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. నోటీసులకు భయపడం నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు. పేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠాలు బోధిస్తాం. ఇప్పటివరకు కాంట్రాక్ట్ అధ్యాపకుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించారు. వచ్చే ఏడాది కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. జి.శ్యాంబాబు, కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల జేఏసీ జిల్లా నాయకులు హామీని నెరవేర్చమంటున్నాం కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదు. ప్రభుత్వ కళాశాలల్లో అత్యధికశాతం ఉత్తీర్ణత కాంట్రాక్ట్ అధ్యాపకుల వల్లే జరుగుతోంది. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం. వెనక్కు తగ్గేది లేదు. జి.జాషువా, సివిక్స్ అధ్యాపకుడు, తణుకు -
కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రస్తుత మున్న వేతనాలపై 50 శాతం పెంపునకు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం సంతకం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక్కో లెక్చరర్‌కు రూ.18 వేలు ఉండగా, దానిని రూ.27 వేలకు పెంచేందుకు ఇటీవల ఆర్థిక శాఖ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆ ఉత్తర్వుల జారీకి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాష్ట్రంలోని 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రయోజనం చేకూరనుంది. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం
∙ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అనంతపురం రూరల్: కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ కళాశాల విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. అధ్యాపకుల సమ్మెకు శనివారం ఆయన మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరుబాట సాగిద్దామని పిలుపు నిచ్చారు. 15ఏళ్లుగా తక్కువ వేతనాలకే పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కాంట్రాక్టు అధ్యాపకులు చేసిన కృషి మరువలేనిదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సుప్రీం కోర్డు సైతం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందన్నారు. అయినా న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అధ్యాపకుల పోస్టులను క్రమబద్డీకరించాలన్నారు. సమ్మెకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు ప్రటించారు. కొర్రపాడు హూస్సేన్ పీరా, కాంట్రాక్టు అధ్యాపకులు యర్రెప్ప, హనుమంతరెడ్డి, ప్రభాకర్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఆ హామీ ఏమైంది?
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాంట్రాక్టు లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హమీలు ఏమయ్యావని ప్రశ్నించారు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన వైఎస్ఆర్ సీపీ నేతలు వారికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల ఆవేదనలో న్యాయం ఉందన్నారు. ఎంతో సహనం, ఓర్పుతో ఇన్నాళ్లు ఉన్నారని, వీరి డిమాండ్ల పరిష్కారంతో ప్రభుత్వకి నష్టం ఉండదన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు మూడు దశల్లో వీరికి న్యాయం చేస్తూ కొంత భద్రత కల్పించుకుంటూ వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వం కూడా పదో వేతన సవరణతో పాటు జీతాలు పెంచాల్సి ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మేరకు వీరందరినీ క్రమబద్ధీకరణ చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ముఖ్యమంత్రి ఖాతరు చేయకపోవడం దారుణమన్నారు. 16 ఏళ్లుగా సేవలు చేరుుంచుకొని ఇప్పటికీ రెగ్యులర్ చేయకపోతే ఈ వర్గాన్ని కూడా చంద్రబాబు మోసం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. అశలు పెట్టడం, తరువాత ఆర్థిక పరిస్థితి బాగోలేదని మోసపూరిత మాటలు చెప్పడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమాలన్నీ కిరికిరి (జన్మభూమి) కమిటీలకు అప్పజెప్పారని, కలెక్టర్, ఉన్నతాధికారులు సైతం పేదవాడికి పింఛను మంజూరు చేసే స్థితిలో లేరన్నారు. అధికారులు చేయలేక, లబ్ధిదారులను కిరికిరి కమిటీల వద్దకు వెళ్లాలని చెబుతున్నారని.. ఆ మాటలు చెప్పేందుకు ఐఏఎస్ అధికారి అవసరం లేదని క్లర్కు చాలన్నారు. ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకొనే పరిస్థితి జిల్లాలో లేదని ధర్మాన అన్నారు. మద్దతు ధర లేక బస్తా రూ. 800 చొప్పున దళారులకు అప్పగించాల్సిన దయానీయ పరిస్థితి ఉందన్నారు. పనికి మాలిన కార్యక్రమాలకు కొట్లాది రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు మేధావుల బతుకు తెరువుకు ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. రానున్న బడ్జెట్ సమావేశంలో ఈ ప్రస్తావనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీసుకువచ్చేలా ఆయన దృష్టికి తీసుకెళ్తానని కాంట్రాక్టు లెక్చరర్లకు హామీ ఇచ్చారు. అలాగే జగన్‌ను కలిసేందుకు సహకరిస్తానన్నారు. మేధావులకు గౌరవం లేదు:రెడ్డి శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ జాతి గర్వపడే ఉద్యోగంలో ఉన్న మేధావులకు ఈ రాష్ట్రంలో కనీస గౌరవం లేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి, పార్టీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు పైడి మహేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్రప్రసాద్, పొందూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.సారుుకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి కామేశ్వరి, నాయకులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మండవల్లి రవి, శ్రీకాకుళం పట్టణ పార్టీ అధ్యక్షుడు సాధు వైకుంఠరావు పాల్గొన్నారు. వచ్చే నెల 2న చలో విజయవాడ కాంట్రాక్టు లెక్టరర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదన్నారు. వచ్చే నెల రెండో తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. ధర్నాలో సంఘ ప్రతినిధులు కె.ఎస్.యాదవ్, హనుమంతు రాంమోహన్ దొర, కె.నర్సింగరావు, ఐ.వేణుగోపాలరావు, చౌదరి నగేష్, డి.లక్ష్మున్నాయుడు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
– వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ కర్నూలు (న్యూసిటీ): కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదురుగా ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.ముందుగా రాజ్‌విహార్ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంఏ నవీన్‌కుమార్ మాట్లాడుతూ...తాము 16 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా ఎటువంటి భద్రత లేదన్నారు. డిసెంబరు 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, జొహరాపురం నాయకులు హరికృష్ణ, సురేష్, ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జవహర్‌బాబు, నాయకుడు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వజూనియర్ కళాశాల (టౌన్ మోడల్) ప్రిన్సిపల్ చెన్నయ్య, కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం నాయకులు పి.రంగస్వామి, జి.నాగమల్లేషుడు, సునీత, సుభద్ర, కాంతమ్మ, వరలక్ష్మి, గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
మోత్కూరు: నల్గొండ జిల్లా మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కాంట్రాక్టర్ లెక్చరర్ మల్లికార్జున్ గురువారం కళాశాల ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. తోటి లెక్చరర్లు తక్షణమే స్పందించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కాంట్రాక్టు ప్రతీ సంవత్సరం రెన్యువల్ అవుతుంది. ఈ సారి తన పేరు రెన్యువల్‌కు ప్రిన్సిపల్ సిఫార్సు చేయకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మల్లికార్జున్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
చెప్పినట్లు వినకుంటే... పరీక్షల్లో ఫెయిలే
అనంతపురం : శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ లెక్చరర్ కీచక పర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని... తన కోరిక తీర్చాలని కాంట్రాక్ట్ లెక్చరర్ గంగాధర్ బెదిరించాడు. లేకుంటే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో గంగాధర్‌ను ఎగ్జామ్ వింగ్ నుంచి యూనివర్శిటీ అధికారులు తప్పించి.. చేతులు దులుపేసుకున్నారు. యూనివర్శిటీ అధికారుల చర్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అతడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. -
జీతం కోసం ఎదురు చూపు...
-రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 446 -కాంట్రాక్టు లెక్చరర్లు 3,776 మంది -ఇప్పటి వరకు ఎన్ని నెలల జీతం రావాల్సి ఉంది 3 -ఎంత మొత్తం... రూ.20.40 కోట్లు సాక్షి, చిత్తూరు రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగభద్రత లేక అల్లాడిపోతున్నారు. చాలీచాలని జీతాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఇవి కూడా నెలనెలా సక్రమంగా రాకపోతుండటంతో వారు అప్పుల పాలవుతున్నారు. కుటుంబపోషణ భారమై మానసిక వేదన అనుభవిస్తున్నారు. పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ రాత మారలేదని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 446 జూనియర్ కళాశాలల్లో 3,776 మంది పని చేస్తున్నారు. రెగ్యులర్లతో సమానంగా సేవలందిస్తున్నా... 2000లో కాంట్రాక్టు ఒప్పంద అధ్యాపక వ్యవస్థ వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్య గణనీయంగా మెరుగుపడింది. అంతకుమునుపు జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం కేవలం 23 మాత్రమే. ప్రస్తుతం ఇది సుమారు 75 శాతానికిపైగా ఉంది. ఉత్తీర్ణత కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో మూల్యాంకణ సేవలందిస్తున్నా వీరికి జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల కనీస చట్టాలు ఈఎస్ఐ, పీఎఫ్ లాంటివి కూడా అమలు చేయకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వీరికి జీతం లేకుండా కేవలం రెండు నెలలు మాత్రమే సెలువులు ఇస్తున్నారు. ఇప్పటికీ కాంట్రాక్ట్ రెన్యువల్ లేదు.... కళాశాలలు ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు రాకపోవడంతో లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. ఒప్పందం పునరుద్ధరించకపోవడంతో ఇప్పటి వరకు వారికి జీతాలు కూడా రాలేదు. అప్పటి విద్యాశాఖ కమిషనర్ సత్యనారాయణకు కాంట్రాక్టును రెన్యువల్ చేయాలని ఇప్పటి వరకు 3 సార్లు వినతి పత్రం సమర్పించారు. దీనికి స్పందించిన కమిషనర్ ఆర్థిక శాఖకు రెండు సార్లు ఫైల్ పంపారు. ఆ శాఖ రెండు సార్లు ఫైల్‌ను తిప్పిపంపింది. ఎందుకు ఫైల్‌ను తిప్పిపంపింది అనేది కూడా ఆర్థిక శాఖ అధికారులు చెప్పడంలేదని ఒప్పంద లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల నుంచి జీతాలు రాక దుర్భర జీవితం అనుభవిస్తున్నామని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ముఖ్యమంత్రులు మారని రాతలు... 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టు లెక్చరర్ల పద్ధతిని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారినా కాంట్రాక్టు లెక్చరర్ల స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. సమాన పనికి సమాన జీతం అమలు కాకపోవడంతో వీరి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్లు ఊపందుకోవడంతో 2011లో జీవో నెం3 విడుదల చేశారు. దీని ప్రకారం రెగ్యులర్ లెక్చరర్ల మూలవేతనాన్ని కాంట్రాక్టు లెక్చరర్ల వేతనంగా ఇవ్వాలి. దీని ప్రకారం అందరికీ రూ.18 వేల జీతం చెల్లిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దీన్ని తంగలో తొక్కారు. 10 వ పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. రెగ్యులర్ చేస్తామనే హామీ ఏమైంది బాబూ.. 16 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 2012 రాజమండ్రిలో చేపట్టిన సమ్మేకు చంద్రబాబు నాయుడు సంఘీభావం ప్రకటించి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. 2014లో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత యనమల రామకృష్ణుడు చైర్మన్‌గా కమిటీ వేశారు. సమన్వయకర్తగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌ను నియమించారు. ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు విధించగా.. 2 సంవత్సరాలు పూర్తై ఇప్పటి వరకు నివేదిక సమర్పించ లేదు. 1010 పద్దు కింద జీతాలు ఇవ్వాలి.. జీతాలు 1010 పద్దుకింద చెల్లించాలి. జీతం సక్రమంగా రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా చితికిపోతున్నాం. ఏప్రిల్, మేనెలల్లో జీతాలు రాకపోవడంతో ఆ రెండు నెలలూ కష్టాలు ఎదుర్కొంటున్నాం. గురుకుల పాఠశాలల్లో పని చేసే కాంట్రాక్టు అధ్యాపకులకు ఆ రెండు నెలలకూ జీతం చెల్లిస్తున్నారు. మాకు కూడా చెల్లించాలి. -శ్రీనివాసరావు తెలగనీడి, కెమిస్ట్రీ లెక్చరర్, గురజాల, గుంటూరు. తక్షణమే పీఆర్సీ అమలు చేయాలి.. జీవో నెం3 ప్రకారం జీతాలు చెల్లించాలి. పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల ప్రతినెలా రూ.19 వేలు నష్టపోతున్నాం. రెగ్యులర్లతో సమానంగా పని చేస్తున్నా.. జీతం మాత్రం తక్కువ ఇస్తున్నారు. దీన్ని సవరించాలి. మెటర్నిటీలీవ్లు తీసుకుంటే జీతం కట్ చేస్తుచేస్తున్నారు. ఇది దారుణం. వెంటనే పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - రామిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కాంట్రాక్ట్ లెక్చరర్, బల్లికురువ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రకాశం జిల్లా. రెగ్యులర్ చేయాలి... 16 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా రెగ్యులర్ చేయడం లేదు. ఇన్నేళ్లు విద్యావ్యవస్థకు సేవలందించాం. కనీసం జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఒట్టి మాటగానే మిగిలిపోయింది. నెలరోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన సబ్ కమిటీ రెండు సంవత్సరాలైనా నివేదిక సమర్పించలేదు. కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే రెగ్యులర్ చేయాలి. ముఖ్యమంతి మాట నిలబెట్టుకోవాలి. - చంద్రశేఖర్‌రెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్, ప్రభుత్వజూనియర్ కళాశాల, కడప -
కేన్సరని తెలిసినా కరుణించలేదు
వ్యాధితో బాధపడుతూ బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్న కాంట్రాక్ట్ లెక్చరర్ శైలకుమారి పోస్టింగ్ ఇవ్వలేదని డీవీఈఓ కార్యాలయం ముందు నిరాహార దీక్ష నెల్లూరు(టౌన్) : ఆరోగ్యం బాగాలేదని తనను నెల్లూరుకు బదిలీ చేయాలని ఇంటర్ బోర్డు కమిషనర్ నుంచి తీసుకువచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడతో ఆర్డర్‌ను పక్కనబెట్టడంతో మహిళా కాంట్రాక్టు లెక్చరర్ సోమవారం డీవీఈఓ కార్యాలయం ఎదుట నిరహార దీక్షకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన కందగడ్డల శైలకుమారి 2011 నుంచి కందుకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ కాంట్రాక్టు అధ్యాపకురాలుగా పనిచేస్తుంది. అప్పటి నుంచి ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రతినెలా నెల్లూరు క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో తనను నెల్లూరుకు బదిలీ చేయాలంటూ గతనెల 16వ తేదీన ఇంటర్ బోర్డు కమిషనర్ సత్యనారాయణను కలిసింది. విచారించిన ఆయన హెల్త్ గ్రౌండ్ కింద 28న వెంకటాచలం జూనియర్ కళాశాలకు బదిలీ చేస్తూ ఇచ్చారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బదిలీ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే ఆమె బదిలీకి అడ్డంకిగా మారింది. మరో అధ్యాపకురాలికి వెంకటాచలంలో పోస్టింగ్.. వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ విభాగంలో రెగ్యులర్ అధ్యాపకురాలిని జూన్‌లో జరిగిన బదిలీల్లో నెల్లూరు డీకేడబ్ల్యూలో పోస్టింగ్ ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకులకు బదిలీల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో వెంకటాచలంలో విద్యార్థులు నష్టపోతారనే కారణంగా డీకేడబ్ల్యూలో కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న విజయలక్ష్మీని తాత్కాలికంగా వెంకటాచలం కళాశాలకు బదిలీచేశారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న శైలకుమారికి వెంకటాచలంలో పోస్టింగ్ లేదని ఆర్జేడీ పరంధామయ్య చెబుతున్నారు. రెగ్యులర్ అధ్యాపకురాలి బదిలీతో డిస్ట్రబెన్స్ ఏర్పడిందని విజయలక్ష్మికి వెంకటాచలంలో పోస్టింగ్ ఇచ్చామంటున్నారు. కేవలం డబ్బులకు అమ్ముడుపోయి ఇలా చేశారని, ఆర్జేడీ తన బదిలీకి అడ్డు పడుతురని నిరాహారదీక్షకు దిగినట్లు శైలకుమారి చెబుతోంది. కమిషనర్ ఆదేశాలు ప్రకారం పోస్టింగ్ కల్పిస్తాం : పరంధామయ్య, ఆర్జేడీ శైలకుమారి ఆర్డర్ విషయంలో కమిషనర్‌కు విన్నవిస్తాం. ప్రస్తుతం వెంకటాచలంలో పోస్టింగ్ ఖాళీగా లేదు. కమిషనర్ ఆదేశాలు ప్రకారం నిర్ణయం తీసుకుని అమలుచేస్తాం, ఈనెల 8న కాంట్రాక్టు అధ్యాపకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఈ కౌన్సెలింగ్‌లో వచ్చిన ప్రకారం పోస్టింగ్ ఇస్తామని చెప్పాం. -
సీఎం దృష్టికి కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు
శ్రీకాకుళం : కాంట్రాక్టు లెక్చరర్ల కంటిన్యుయేషన్, రెగ్యులరైజేషన్ తదితర సమస్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఇటీవల నివేదిక అందజేసినట్లు తెలుగునాడు రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర ఫౌండర్, చైర్మన్ డి.లక్ష్మునాయుడు తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్లు అందరూ కష్టకాలంలో ఉన్నందున ప్రతి ఒక్కరూ సహనంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వన భారతి–జనహారతి కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు పి.మల్లేశ్వరరావు, కార్యదర్శి రవికుమార్, సంఘ కోశాధికారి బి.హేమరాజు, కె.ముకుందరావు, కె.శ్రీనివాసరావు, ఎ.దశరథరావు తదితరులు పాల్గొన్నారు. -
అభద్రత అంచున..బోధన
దశాబ్దాల సర్వీసున్నా తప్పని దిగులు రెన్యువల్స్ పూర్తిచేయని సర్కారు 4నెలలుగా అందని జీతాలు కాంట్రాక్టు లెక్చరర్లతో ఇబ్బందులు శ్రీకాకుళం న్యూకాలనీ:ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగానే విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని అర్హతలు, అనుభవం,ప్రతిభ ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ లెక్చరర్ల(సీఎల్స్)పై రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 2015-16 విద్యాసంవత్సరానికి డిసెంబర్ 31వరకే రెన్యువల్స్ చేశారు. ఈ తేదీ ముగిసినా ఇప్పటివరకూ రెన్యువల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు జారీకాలేదు. దీంతో సీఎ ల్స్ అయోమయంలో ఉన్నారు. 4నెలలుగా వీరికి జీతాలు కూడా అందడం లేదు. 470 మంది వరకు సీఎల్స్.. జిల్లాలోని 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 12 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జూనియర్ కళాశాలల్లో 390 మంది, డిగ్రీ కళాశాలల్లో దాదాపు 70 మంది వరకు జనరల్ సబ్జెకులకు, ఒకేషనల్ కోర్సుల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో 120 మంది మహిళలు ఉన్నారు. మెజారిటీ సీఎల్స్ 8 ఏళ్లకుపైబడి నుంచి పనిచేస్తున్నారు. కనీసం 50 శాతం మంది దశాబ్దం పూర్తిచేసుకున్నవారు సైతం ఉన్నారు. గతంలో పార్డుటైం, గంటల ప్రాతిపదికన ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులను తీసుకునేవారు. కాంట్రాక్ట్ వ్యస్థకు బీజం 2000లో అప్పటి ప్రభుత్వం పార్ట్‌టైం స్థానంలో కాంట్రాక్టు వ్యవస్థకు బీజం వేశారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు గుర్తుచేస్తున్నారు. అక్కడి నుంచి వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం రూ.నెలకు 18వేలు చెల్లిస్తున్నా షరతులుపేరిట నరకయాతన చవిచూస్తున్నామని సీఎల్స్ వాపోతున్నారు. ఇన్నేళ్గు పనిచేస్తున్నా ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాట్యూటీ వంటి సౌకర్యాలు లేవు. కనీసం భద్రత లేని ఉద్యోగాలతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామని వీరంతా ఆందోళన చెందతున్నారు. రెన్యువల్స్ గడువు ముగిసినా.. 2015-16 విద్యాసంవత్సరానికి సీఎల్స్‌కు డిశంబర్ 31వరకే రెన్యువల్స్ చేశారు. గడువు ముగిసినా దీనిపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పాఠాలు బోధిస్తునే మరోపక్క అభద్రతాబావానికి గురవుతున్నారు. తెలంగాణాలో మాదిరి రెగ్యులర్ చేయాలి ఐదేళ్లు అనుభవం ఉన్న కాంట్రాక్టు లెక్చలర్లును తెలంగాణా రాష్ట్రంలో రెగ్యులర్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం జీవోలను విడుదలచేసింది. పొరుగు రాష్ట్రంలో అమలవుతున్న విధానం ఇక్కడెందుకు వీలుకాదు. రెన్యువల్స్‌ను పొడిగిస్తున్నట్లు వెంటనే ప్రకటించాలి. బకాయి జీతాలు విడుదలచేయాలి. - డి. అక్ష్మున్నాయుడు, అధ్యక్షుడు, జిల్లా కాంట్రాక్టు లెక్చలర్లు సంఘ ప్రతినిధి చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలి రెగ్యులరైజ్ చేస్తానని 2014 తన ఎన్నికల మేనిఫేస్టోలో చంద్రబాబు హామీఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు విన్నావించాం. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు తన హామీని నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలి. - కె.బాలకృష్ణ, జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు క్రమబద్ధీకరణ ప్రభుత్వ నిర్ణయం రెన్యువల్స్ గడువు ముగిసినమాట వాస్తవమే. సీఎల్స్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కజిల్లాకే పరిమితమైనదికాదు. రాష్ట్రవ్యాప్త సమస్య. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బకాయి జీతాలకు చర్యలు తీసుకుంటాం. - ఆర్.పున్నయ్య, డీవీఈఓ, ఇంటర్మీడియెట్ విద్య