
సాక్షి, తిరువూరు(కృష్ణా): ఏ కొండూరు పోలీసుస్టేషను పరిధిలోని కంభంపాడులో ఐదు రోజుల క్రితం బాలికను కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు మోసగించిన కేసును ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ డీఎస్పీ విజయరావు ఆదివారం విచారణ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు.. వల్లంపట్లకు చెందిన ఎం.గోపికృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితం వివాహం అయింది. ఆషాఢ మాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకెళ్లాడు. ఆ అధ్యాపకుడిని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఏకొండూరు పోలీసుస్టేషనుకు తీసుకొచ్చారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారిణ చేసి పోలీసులు బాలికను తిరువూరులోని స్వధార్‌హోంకు తరలించారు. ఫోక్సా చట్టం కింద నమోదైన కేసును డీఎస్పీ విచారణ చేస్తున్నారు. ఏ కొండూరు పోలీసుస్టేషనులో ఉన్న నిందితుడిని కూడా డీఎస్పీ ప్రశ్నించారు. తిరువూరు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, నూజివీడు టౌన్, తిరువూరు సెక్టార్ 2, ఏ కొండూరు ఎస్‌ఐలు కనకదుర్గ, అవినాష్, ప్రవీణ్‌కుమార్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment