abduction
-
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
మణిపూర్‌లో ఆరని కాష్టం.. మళ్ళీ అల్లర్లు
ఇంఫాల్: నాలుగు నెలల క్రితం మణిపూర్‌లో రగిలిన హింస తాలూకు కాష్టం ఇంకా మండుతూనే ఉంది. తాజాగా వారం రోజుల క్రితం ఆగస్టు 29న మరోసారి ఇంఫాల్‌లో హింసాకాండ రగులుకుంది. ఈ హింసలో మరో 8 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. దీంతో ఇంఫాల్‌లో మిగిలిన కుకీ కుటుంబాలను బలవంతంగా కొండ ప్రాంతాలకు తరలించాయి సాయుధ దళాలు. మెయిటీలు అత్యధికంగా నివసించే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లంబులానే ప్రాంతం నుండి అక్కడ మిగిలి ఉన్న స్వల్ప సంఖ్యాకులైన కుకీలను బలవంతంగా కొండప్రాంతానికి తరలించాయి అక్కడి భద్రతా దళాలు. శుక్రవారం అర్ధరాత్రి సాయుధ దళాలు తమ ఇంటిని తలుపులను బలంగా కొట్టి నిద్రలో ఉన్నవారికి ఎక్కడికి వెళ్ళేది చెప్పకుండా తరలించారని అన్నారు అక్కడ నివసించే ఓ పెద్దాయన. లంబులానే ప్రాంతం నుండి తరలించబడింది రెవరెండ్ ప్రిమ్ వైఫే, హెజాంగ్ కిప్జెన్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1,2 తేదీల్లో అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా కేంద్ర భద్రతా దళాలు కనీసం తమ వస్తువులను వెంట తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతోనే తమను బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారని అక్కడే ఉన్న బులెట్ ప్రూఫ్ వాహనాల్లోకి ఎక్కించి కుకీలు ఎక్కువగా నివసించే కంగ్పోక్పి జిల్లాలోని మోట్‌బంగ్ ప్రాంతానికి తరలించారని అన్నారు. కేంద్ర భద్రతా దళాలు మాకు భద్రతా కల్పించాల్సింది పోయి ఇలా బలవంతంగా మమ్మల్ని తరలించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాము. భారతదేశం లాంటి మహోన్నత దేశం సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటంలో విఫలమై సంఘ వ్యతిరేక శక్తుల ప్రలోభాలకు లొంగిపోయి పౌరులకు భద్రత కల్పించడంలో మన వ్యవస్థ దారుణంగా విఫలమైందని అన్నారు. ఈ బలవంతపు తరలింపులో భద్రతా దళాలు మొత్తం 10 కుటుంబాలకు చెందిన 24 మందిని తరలించామని భద్రతా దళాలు చెబుతున్నాయి. ఆగస్టు 27న లంబులానే ప్రాంతంలో అల్లరి మూకలు మూడు పాతబడ్డ ఇళ్లను దహనం చేశారని మిగిలిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని సమాచారం రావడంతో వారిని హుటాహుటిన అక్కడి నుండి సురక్షితమైన ప్రాంతానికి తరలించామని తెలిపారు. మెయిటీలకు గిరిజన తెగగా గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన నేపథ్యంలో మే 3న మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. నెలరోజులకు పైగా కొనసాగిన ఈ హింసాకాండలో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 50000 మంది తమ ఇళ్లను విడిచిపోయారు. రాష్ట్రమంతటా ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టే అనిపించినా ఈ మధ్యనే పశ్చిమ ఇంఫాల్‌లో మళ్ళీ అల్లర్లు జరగడంతో ఇంఫాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు -
పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం
అమరావతి: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవం లేదని సాక్ష్యాధారాలతో సహా మరోసారి నిరూపితమైంది. నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యధాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఐపీసీ 363, 369 (కిడ్నాప్, అపహరణ)సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసుల సంఖ్య కేవలం 867గా ఉంది. శాంతిభద్రతల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు లక్షకు 7.4 శాతంగా ఉంటే ఆంధ్రాలో కేవలం 1.6 గా ఉంది. రెండేళ్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే, దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 14714 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. 10680 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోనూ 10252 కేసులతో బీహార్ మూడో స్థానంలోనూ ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడో అట్టడుగున 18వ స్థానంలో ఉంది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఆంధ్ర ప్రదేశ్ చాలా ముందుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సరైన అవగాహన లేకుండా పవన్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరైనా తెలివిగల్లోళ్లు పవన్ పక్కన ఉంటే నివేదికను చక్కగా వివరించే అవకాశమైనా ఉండేది. విషయ సంగ్రాహక శక్తి తక్కువగా ఉన్నందునో, వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కొరవడినందునో.. ప్రతి విషయాన్ని వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేస్తూ పవన్ ఎప్పటికప్పుడు జనం ముందు నవ్వులపాలవుతున్నారు. -
కోటీశ్వరుడి కూతురు.. జాగింగ్ వెళ్లడమే శాపమైంది..
కోటీశ్వరుని కూతురు.. వృత్తిరీత్యా టీచర్.. గౌరవప్రదంగా సాగిపోతున్న జీవితం. దానికి తోడు ఎంత తిన్నా.. తరగని సంపదలు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచే వ్యక్తిత్వం ఆమెది. అందిరినీ కలుపుకుపోయే తత్వం.. శత్రుత్వం అనే మాటే తెలియదు. ఉదయాన్నే 4 గంటలకే వ్యాయామం వెళ్లడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు. కానీ ఓ రోజు ఉదయం.. అదే చివరి వ్యాయామం అయింది. అంత మంచి ఆవిడకు ఏమైంది? ఆవిడను ఎవరు హతమార్చారు? ఆమె పేరు ఎలిజా ఫ్లెచర్(34). ఆవిడ తండ్రి కోటీశ్వరుడు. వారు అమెరికాలోని టెన్నిసీ నగరంలో నివసిస్తున్నారు. ఫ్లెచర్ వృత్తిరీత్యా టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటు తల్లిగా.. టీచర్‌గా తన విధిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. కావాల్సినంత డబ్బు.. జీవితం సుఖంగా సాగుతుంది. అయితే.. ఫ్లెచర్‌కు ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకే వ్యాయామానికి వెళ్లే అలవాటు ఉంది. ఆ రోజు అలాగే వ్యాయామానికి వెళ్లింది. అనుకోని అతిథి.. ఫ్లెచర్ రోడ్డు వెంట జాకింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎదురయ్యాడు ఓ కరుడుగట్టిన నేరస్తుడు. యూనివర్శిటీ ఆఫ్ మెంఫీస్ క్యాంపస్ వద్ద ఆమె మార్గానికి అడ్డుతగిలాడు. చీకటిగా ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లాడు. గన్‌తో తలపై కాల్చేశాడు. బాధితురాలు ఫ్లెచర్ మృతదేహాన్ని ఓ కొండ ప్రాంతంలో గుర్తించామని పోలీసులు తెలిపారు. అటాప్సీ నివేదికల ప్రకారం బాధితురాల్ని గన్‌తో తల వెనక భాగంలో కాల్చినట్లు తేలింది. ఎలా పట్టుబడ్డాడంటే.. ఆ మరుసటి రోజే క్లియోథా అబ్స్టన్ అనే నిందితున్ని అరెస్టు చేశారు పోలీసులు. ఆమె మృతదేహం లభ్యమైన సమీప ప్రాంతంలోనే సర్వేలెన్స్ ఆధారంగా అబ్స్టన్ను పట్టుకున్నట్లు చెప్పారు. అయితే.. ఫ్లెచర్‌పై దాడి జరిగిన ప్రాంతంలో వదిలిన చెప్పుల జోడు ఆధారంతో డీఎన్ఏ రిపోర్టుల ద్వారా నిందితున్ని గుర్తించామని వెల్లడించారు. మరణశిక్ష విధించాలని డిమాండ్.. గత ఏడాది సెప్టెంబర్ 2న ఈ ఘటన జరిగగా.. ప్రస్తుతం కోర్టు విచారణ జరుపుతోంది. దోషికి మరణశిక్ష విధించాలని బాధితురాలు తరుపు న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. నేరస్తుడు బాధితురాలిపై వ్యవహరించిన తీరు హేయమైనదని చెప్పారు. ఫ్లెచర్ కుటుంబ సభ్యులు కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి కేసుల్లో చట్టాన్నే అనుసరించి శిక్ష విధించాల్సి వస్తుందని న్యాయమూర్తి తెలిపారు. నేర చరిత్ర.. గతంలోనే అబ్ట్సన్కు చాలా నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో ఓ మర్డర్ కేసులో ఇప్పటికే 20 ఏళ్ల శిక్షను అనుభవించాడు. కాగా.. 2021 ఆగష్టులో అబ్ట్సన్ తనపై దాడి చేశాడని అలిసియా ఫ్రాంక్లిన్ అనే మహిళ ఆరోపించారు. తనను గన్‌తో బెదిరించి ఖాలీగా ఉండే అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాడని తెలిపారు. అనంతరం తన కళ్లకు గంతకు కట్టి.. కారు వెనక భాగంలో పడేసి అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఘనటపై ఆమె పోలీసులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కానీ పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
పాకిస్తాన్లో దారుణం.. యువతి కిడ్నాప్‌నకు యత్నం.. ప్రతిఘటించడంతో..
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. 18 ఏళ్ల హిందూ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు. పూజా ఓద్ అనే యువతిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. పూజా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పాకిస్తాన్లో ఇటువంటి ఘటనలు కొత్తదేం కాదు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. పాకిస్తాన్ మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన పలువురిని బలవంతంగా అపహరించి, మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతియేడు ఈ తరహా ఘటనలు చూస్తున్నామని ఆవేదన చెందారు. మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేసేలా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందూ కమ్యూనిటీ 1.60 శాతం, సింధ్ ప్రావిన్స్‌లో 6.51 శాతం ఉన్నట్లు ఆ దేశ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ప్రీతితో మాట్లాడితే చంపేస్తాం.. యువకుడి కిడ్నాప్!
తన సహోద్యోగితో మాట్లాడుతున్నాడని, అది సహించని ఇద్దరు వ్యక్తులు.. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో సోమవారం చోటు చేసుకుంది. సదరు యువకుడు సాహిల్ తన ఉద్యోగం ముగించుకొని ఇంటి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై అతన్ని అడ్డుకుని కారులోకి బలవంతంగా ఎక్కించుకుని నిర్మానుష్యంగా ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దారుణంగా హింసించారు. సాహిల్ వద్ద ఉన్న రూ.2వేలు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. తన సహోద్యోగి ప్రీతితో మాట్లాడితే చంపేస్తామని వారు హెచ్చరించారని సాహిల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తులను స్థానికంగా ఉండే రాహుల్, నరేష్‌గా పోలీసులు గుర్తించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే మరకత లింగం
సాక్షి, చెన్నై: తంజావూరులోని ఓ వ్యక్తి బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే పచ్చవర్ణ మరకత(ఎమరాల్డ్) లింగం బయట పడింది. తిరుక్కువలై ఆలయంలో అపహరణకు గురైన ఆ విగ్రహం లాకర్లోకి ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంజావూరు అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో పురాతన విగ్రహం ఉన్నట్టు చెన్నైలోని విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం శుక్రవారం ఆ ఇంట్లోని అరుణా భాస్కర్‌ను ప్రశ్నించారు. తమ ఇంట్లో ఏమీ లేవని, తన తండ్రి స్వామియప్పన్ మరణించారని, అంతకుముందు ఆయన వద్ద ఉన్న మరకత లింగం బ్యాంక్ లాకర్లో ఉండొచ్చని చెప్పారు. దీంతో బృందం లాకర్‌ను తెరిచి చూశారు. అందులో పచ్చవర్ణ మరకత లింగం బయట పడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఆ విగ్రహం మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని తిరుక్కువలై శివాలయంలో మూడేళ్ల క్రితం చోరీకి గురైనట్టు తేలింది. దీంతో అధికారులు శనివారం ఆ విగ్రహాన్ని చెన్నైలోని కార్యాలయంలో భద్రపరిచారు. -
స్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది
లక్నో: ‘‘అసలే రోజులు బాగాలేవు.. ఒంటరిగా బయటకు వెళ్లకూడదు.. స్నేహితులు, షికార్లు అంటూ బయట తిరగడం మంచిది కాదు.. అసలు ఎవర్ని నమ్మేలా లేవు రోజులు’’ అంటూ తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతుండటం ఆ యువతికి నచ్చలేదు. ఇల్లు జైలులా కనిపించింది. దాంతో ఇంటి నుంచి బయపటడి.. స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు జీవించాలని ఆశించింది. ఈ క్రమంలో అర్థరాత్రి అందరూ నిద్రిస్తుండగా.. ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆంక్షలున్నప్పటికి ఇంట్లో ఉన్నంత కాలం సురక్షింతగా ఉన్న యువతి బయట అడుగుపెట్టిన మరుక్షణమే మృగాడి చేతికి చిక్కి.. అత్యాచారానికి గురయ్యింది. బాధితురాలిని కాపాడటం కోసం వచ్చిన ఆమె అంకుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. వివారాలు.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన బాధితురాలు ఇంట్లో తనకు ఫ్రీడం ఇవ్వటం లేదని భావించి.. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. కారులో అటుగా వెళ్తోన్న నిందితుడు యువతి దగ్గరకు వచ్చి.. కత్తితో బెదిరించి కారులో తీసుకెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ హెచ్చరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెని వెతకడం ప్రారంభించారు. వీరిని గమనించిన యువతి సాయం కోసం పెద్దగా ఏడ్వడం ప్రారంభించింది. దాంతో బాధితురాలి అంకుల్ ఆమెని కాపాడటం కోసం.. పరిగెత్తాడు. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈలోపు మిగతా కుటుంబ సభ్యులు అక్కడకు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఛీఛీ ఇదేం పని, 7వ తరగతి పిల్లాడితో ముగ్గురు పిల్లల తల్లి.. -
వివాదంగా మారిన ఎమ్మెల్యే ప్రేమ వివాహం
చెన్నై: అన్నాడీఎంకే కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అది కాస్త ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ప్రభు తమ కుమార్తెని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ.. సౌందర్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను అప్పగించాలంటూ మద్రాస్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. ఈ కేసును మద్రాస్ హై కోర్టు ధర్మాసనం రేపు విచారించనుంది. ఇక వివాహం అనంతరం ప్రభు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘దానిలో ఇష్టపూర్వకంగానే మా వివాహం జరిగింది. దీనిలో ఎవరి బలవంతం లేదు. మేం నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నాం. నేను తనను కిడ్నాప్ చేశాననే మాట అవాస్తవం. వివాహం అనంతరం మేం సౌందర్య తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం వారి ఇంటికి వెళ్లాం. కానీ వారు మమ్మల్ని తిరస్కరించారు. ఈ పెళ్లికి మా తల్లిదండ్రుల అనుమతి ఉంది’ అని తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే ప్రేమ వివాహం ) ఇక సౌందర్య మాట్లాడుతూ.. ‘నేను ప్రభుని ప్రేమించాను. వివాహం చేసుకోవాలని నన్ను ఎవరు బలవంతం చేయలేదు’ అని తెలిపారు. సౌందర్య తండ్రి ఆమె ఊరి గుడిలో అర్చకుడిగా పని చేస్తున్నారు. కులాంతర వివాహం కావడంతో వారు ఈ వివాహాన్ని అంగీకరించడం లేదని సమాచారం. -
ఆ ఐదుగురు చైనాలోనే ఉన్నారు
న్యూఢిల్లీ: గత వారం అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ వైపు ఉన్నట్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ధృవీకరించిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘భారత సైన్యం పంపిన హాట్‌లైన్ సందేశానికి చైనా పీఎల్ఏ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన యువకులు వారి పక్షాన ఉన్నట్లు చైనా ధ్రువీకరించింది. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇప్పుడే చెప్పలేం) China's PLA has responded to the hotline message sent by Indian Army. They have confirmed that the missing youths from Arunachal Pradesh have been found by their side. Further modalities to handover the persons to our authority is being worked out. — Kiren Rijiju (@KirenRijiju) September 8, 2020 అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబన్సిరి జిల్లా నుంచి శుక్రవారం తప్పిపోయిన ఐదుగురు పౌరులు భారత సైన్యానికి పోర్టర్లు, గైడ్లుగా పనిచేస్తున్నారు. మొత్తం ఏడుగురు అదృశ్యం కాగా వారిలో ఇద్దరు తప్పించుకుని వచ్చి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు దీని గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
భారతీయుల కిడ్నాప్.. చైనా స్పందన
న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య డ్రాగన్ దళాలు గత వారం ఐదుగురు భారతీయులను సరిహద్దుల దగ్గర నుంచి కిడ్నాప్ చేశాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే సెప్టెంబర్ 5న ట్వీట్ ద్వారా మొదటిసారి ఈ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దీని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయుల అదృశ్యం గురించి చైనా సైన్యానికి హాట్‌లైన్ మెసేజ్ పంపించామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ క్రమంలో చైనా ఇలా స్పందించడం గమనార్హం. ‘ఆ ప్రాంతంలో ఐదుగురు భారతపౌరుల అదృశ్యం గురించి భారత సైన్యం పీఎల్ఏకు సందేశం పంపించిందనే దాని గురించి కూడా మా దగ్గర ఎటువంటి వివరాలు లేవు’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిజియన్ జావో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌ను తామెప్పుడూ గుర్తించలేదన్న చైనా.. అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేసింది. (చదవండి: ఆగని డ్రాగన్ ఆగడాలు) వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగ్కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం అపహరించింది. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని రావడంతో...ఈ విషయం వెలుగు చూసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 37-పసిఘాట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ట్విటర్లో ‘కొన్ని నెలల ముందు, ఇలాంటి సంఘటన జరిగింది. మరోమారు పునరావృతం అయ్యింది. చైనాకు తగిన సమాధానం ఇవ్వాలి’ అని ట్వీట్ చేయడంతో అని ఈ విషయం మొదట వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని అపహరించారని.. జిల్లాలోని నాచో గ్రామం నుంచి పీఎల్ఏ వారిని కిడ్నాప్ చేసిందని ఎరింగ్ తెలిపారు. -
కశ్మీర్లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్
కశ్మీర్: రాష్ట్రంలో బీజేపీ నాయకులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతవారం ముష్కరులు ఓ బీజేపీ నేతను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్థానిక బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కశ్మీర్‌లోని బారాముల్లా మునిసిపల్ కమిటీ వాటర్‌గామ్ వైస్ ప్రెసిడెంట్ మెరాజుద్దీన్ మల్లాను ఉత్తర కశ్మీర్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లా బుధవారం ఈ ప్రాంతంలో రోడ్డుపై నడుస్తున్నప్పుడు కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనను అపహరించి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం భద్రతా దళాలు భారీ ఎత్తున రంగంలోకి దిగాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’) బందీపోర్లో గత బుధవారం బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారి, అతని సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యను బీజేపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. మళ్లీ ఈ బుధవారం మరో బీజేపీ నాయకుడిని కిడ్నాప్ చేయడం గమనార్హం.(బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు) -
ఇది మరో ‘రోజా’ కథ..!
రాయ్‌పూర్: మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, మధుబాల జంటగా నటించిన రోజా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ అభిమానుల మదిలో ఈ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తీవ్రవాదుల చేత కిడ్నాప్‌కు గురైన తన భర్తను కాపాడుకోవడం ఓ సాధారణ మహిళ చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథా సారాంశం. అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కు గురైన కానిస్టేబుల్ కోసం భర్త భార్య చేసిన ప్రయత్నం అందరిని అబ్బురపరుస్తుంది. వివరాలు.. సంతోష్ కట్టం(48) అనే వ్యక్తి బీజాపూర్‌లోని భోపాలపట్నంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న కిరాణా సామాన్లు తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. నాటి నుంచి కనిపించకుండా పోయాడు. అయితే సంతోష్ అప్పుడప్పడు చెప్పకుండా బయటకు వెళ్లేవాడు. రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాడు. దాంతో సునీత మొదట్లో పెద్దగా ఆందోళన చెందలేదు. రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో సునీతలో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో సంతోష్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని తెలిసింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఆ తర్వాత ఇరుగుపొరుగు వారి సాయంతో తన భర్తను వెతకడం ప్రారంభించింది. (పోలీసు క్యాంటీన్లో కీచక పర్వం) ఈ విషయం గురించి సునీత మాట్లాడుతూ.. ‘మా ఇల్లు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉండే సుక్మా జిల్లాకు పక్కనే ఉంది. దాంతో ఇక్కడ అప్పుడప్పుడు ఇలాటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే నా భర్త కిడ్నాప్ విషయం తెలిశాక నేను పెద్దగా ఆందోళణ చెందలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాక నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు. ఇరుగు పొరుగు వారి సాయంతో నా భర్తను వెతకడం ప్రారంభించాను’ అని తెలిపారు. ఈ క్రమంలో మే 6న సునీత, ఆమె కుమార్తె, స్థానిక రిపోర్టరు, ఇరుగుపొరుగు వారితో కలిసి అడవిలోకి వెళ్లింది. నాలుగు రోజుల తర్వాత మావోల చెరలో ఉన్న తన భర్తను కనుగొన్నది. అయితే సునీత తన భర్తను కనుగోవడం ఒక్క రోజు ఆలస్యమైన తీవ్ర పరిణామాలు చూడాల్సి వచ్చేది. ఎందుకంటే మే 11న మావోయిస్టులు ‘జన్ అదాలత్’ నిర్వహించి సంతోష్‌ను ఏం చేయాలనే విషయాన్ని డిసైడ్ చేసేవారు. కానీ సునీత సమాయానికి తన భర్తను కనుగొని.. మావోయిస్టులను వేడుకోవడంతో వారు సంతోష్‌ను విడుదల చేశారు. కానీ అతడు ఇక మీదట పోలీసుగా విధులు నిర్వహించకూడదని మావోలు హెచ్చరించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ‘తన భర్త క్షేమం కోసం ఓ మహిళ కష్టాలు లెక్కచేయకుండా.. ఎంత దూరమైన వెళ్తుంది. నేను కూడా అదే చేశాను’ అని చెప్పుకొచ్చారు. చదవండి: సొంత గూటికి చేరేలోపే.. -
ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..
సాక్షి, తిరువూరు(కృష్ణా): ఏ కొండూరు పోలీసుస్టేషను పరిధిలోని కంభంపాడులో ఐదు రోజుల క్రితం బాలికను కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు మోసగించిన కేసును ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ డీఎస్పీ విజయరావు ఆదివారం విచారణ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వల్లంపట్లకు చెందిన ఎం.గోపికృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితం వివాహం అయింది. ఆషాఢ మాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకెళ్లాడు. ఆ అధ్యాపకుడిని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఏకొండూరు పోలీసుస్టేషనుకు తీసుకొచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారిణ చేసి పోలీసులు బాలికను తిరువూరులోని స్వధార్‌హోంకు తరలించారు. ఫోక్సా చట్టం కింద నమోదైన కేసును డీఎస్పీ విచారణ చేస్తున్నారు. ఏ కొండూరు పోలీసుస్టేషనులో ఉన్న నిందితుడిని కూడా డీఎస్పీ ప్రశ్నించారు. తిరువూరు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, నూజివీడు టౌన్, తిరువూరు సెక్టార్ 2, ఏ కొండూరు ఎస్ఐలు కనకదుర్గ, అవినాష్, ప్రవీణ్‌కుమార్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. -
ఏలియన్స్ మమ్మల్ని ఎత్తుకెళ్లాయి
వాషింగ్టన్ : మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధరణ మానవుడికైతే ఏలియన్స్ ఉనికి గురించి తెలుసుకోవడం మహా సరదా. ఇప్పటికి అమెరికాలో రహస్యంగా ఏలియన్స్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయని జనాల్లో ఓ బలమైన నమ్మకం. వీటి ఆధారంగా తెరకెక్కిన హలీవుడ్ చిత్రాలకు లెక్కేలేదు. ఈ క్రమంలో ఏలియన్స్, యూఎఫ్ఓల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అమెరికాకు చెందిన పార్కర్. తను, తనతో పాటు మరో వ్యక్తిని ఏలియన్స్ అపహరించాయి అంటున్నారు. అయితే ఈ సంఘటన 1973 ప్రాంతంలో జరిగిందని తెలిపారు. వివరాలు.. ‘1973 ప్రాంతంలో నేను, హిక్సన్ ఓ షిప్‌యార్డ్‌లో కూలీలుగా పని చేసేవాళ్లం. ఓ రోజు మేమిద్దరం విధులు ముగిసిన తర్వాత చేపలు పడుతూ కూర్చున్నాం. ఆ సమయంలో మా వెనక ఏదో వాహనం ఆగిన శబ్దం వినిపించింది. తిరిగి చూస్తే.. నీలం రంగు వెలుతురు మా వైపు రావడం కనిపించింది. ఆ వెనకే ఓ 30 అడుగుల భారీ నౌక లాంటిది అక్కడ దిగింది. అందులో నుంచి మూడు చిన్న వింత ఆకారాలు బయటకు వచ్చాయి. వాటిని చూడగానే మేం ఇద్దరం స్తంభించిపోయాం. ఆ వింత జీవులు మమ్మల్ని తాము వచ్చిన వాహనం వైపు లాగడం ప్రారంభించాయి. లోపలికి వెళ్లిన తర్వాత మేమిద్దరం గాలిలో తేలుతున్నాం’ అన్నారు పార్కర్. ఇంతలో ఆ వింత జీవులు తమ శరీరం మీద ఉన్న పెద్ద కన్ను వంటి ఆకారంతో తమని పరీక్షించాయన్నారు. కాసేపటి తర్వాత ఆ వింత జీవులు తామిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాయో అక్కడే వదిలి వెళ్లాయన్నారు. తమకు స్పృహ వచ్చే సరికి తామిద్దరూ ఆకాశం వైపు చేతులు ఎత్తి సాయం కోసం ఆర్ధిస్తున్నట్లు ఉన్నామని గుర్తు చేసుకున్నారు. తమ అర చేతులకు గాయాలు కూడా అయినట్లు గుర్తించామన్నారు. అయితే ఈ విషయాన్ని చెప్పినప్పుడు తొలుత అధికారులు ఎవరూ నమ్మలేదు. మేం తాగి ఉన్నాం అనుకున్నారు. కానీ మేం పాలిగ్రాఫ్ పరీక్ష(నిజ నిర్థారణ పరీక్ష)లో పాస్ కావడంతో మా మాటలను నమ్మారు. ఆ తర్వాత ఈ విషయం గురించి వాషింగ్టన్ పోస్ట్‌లో కూడా వచ్చింది అన్నారు. కాగా హిక్సన్ 2011లో మరణించాడు. -
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి
న్యూఢిల్లీ: వ్యాపార పనుల నిమిత్తం ముంబయి నుంచి ఢిల్లీకి వచ్చి ఫైవ్‌స్టార్ హోటల్లో దిగిన ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసే ప్రయత్నం బెడిసికొట్టడంతో ఓ మహిళ ఊచలు లెక్కిస్తోంది. వివరాలు.. ముంబయిలోని మెరైన్ ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ బిజినెస్ పనుల నిమిత్తం గురువారం ఢిల్లీ వెళ్లి చాణక్యపురిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో దిగాడు. కొద్దిసేపటి తర్వాత తనకు తెలిసిన ఓ మహిళ ఫోన్ చేసి కలుస్తానని చెప్పింది. అతడు సరే అనడంతో మరో మహిళతో కలిసి హోటల్ రూమ్‌కి వెళ్లింది. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు మహిళలు ఆయన్ని కారులో తీసుకెళ్లారు. అనంతరం ఢిల్లీ పోలీసులకు ఓ కాల్ వచ్చింది. తమ సంస్థ ఎండీని ఎవరో కిడ్నాప్ చేశారని, రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్నారని మెరైన్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్లో చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన వివరాలు కనుక్కొని విచారణ చేపట్టారు. ఎండీ బస చేసిన హోటల్ రూమ్‌లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఆయన ఇద్దరు మహిళలతో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఆ కారు నంబరు ఆధారంగా పోలీసులు లక్ష్మీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లగా మహిళ కనిపించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇంట్లో సోదాలు నిర్వహించారు. తాళం వేసిన ఓ గదిని తెరిచిచూడగా బాధితుడు కనిపించాడు. దీంతో ఆయన్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆ మహిళ సహా ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుల్లో బాధితుడు బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం!
సాక్షి, తిరువూరు : తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం సమీపంలోని ఒక నివాసంలో చోరీ జరిగింది. అటవీశాఖలో పనిచేస్తున్న పెరికె మోహినీ విజయలక్ష్మి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చా రు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో తమ నివాసంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. మూడు రోజులుగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.3 లక్షల నగదు, 300 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. విలువైన దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం చోరీకి గురయ్యాయి. క్లూస్ టీం దర్యాప్తు మచిలీపట్నం క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్ ప్రాథమిక సమాచారం సేకరించిన అనంతరం తిరువూరు సర్కిల్లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా అగంతకులు చోరీలకు పాల్పడుతున్నందున ముందస్తు బందోబస్తు కల్పించాలని, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, గుర్తుతెలియని వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసుస్టేషనుకు సమాచారం అందించాలని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
ఉగ్రచెర నుంచి ముగ్గురికి విముక్తి
శ్రీనగర్ : ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 11 మందిలో ముగ్గురిని శుక్రవారం విడుదల చేశారు. ముగ్గురు పోలీసుల కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు జమ్ము కశ్మీర్ డీజీపీ శేష్ పాల్ వైద్ తెలిపారు. వీరిలో ఇద్దరు కుల్గాంకు, ఒకరు పుల్వామాకు చెందినవారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు గురు, శుక్రవారాల్లో దక్షిణ కశ్మీరులో పోలీసు కుటుంబాలకు చెందిన 11 మందిని అపహరించడంతో కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నాడనే ఆరోపణలతో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షకీల్ అహ్మద్‌ను గురువారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. రెండు రోజుల క్రితం పోలీసులు తమ కుటుంబీకుల ఇళ్లపై దాడి చేసిన నేపథ్యంలో.. దానికి ప్రతీకారంగా కశ్మీర్ ఉగ్రవాదులు పోలీసుల కుటుంబీకులను అపహరించినట్టు తెలుస్తోంది. -
దారి మళ్లిన ఓలా, తప్పించుకున్న మహిళ!
సాక్షి, బెంగుళూరు: సురక్షిత ప్రయాణానికి హామీ అంటూ ఊదరగొట్టే ప్రయివేటు క్యాబ్ సర్వీసులు ప్రయాణీకుల భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళల పట్ల క్యాబ్ డ్రైవర్ల అకృత్యాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా.. ఓలా క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ మహళపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం చేయాలని చూశాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. బనాస్వాడిలో నివాసముండే ఓ మహిళ గురువారం ఉదయం ఓలా క్యాబ్‌లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయానికి బయలుదేరారు. వాహనం ఎయిర్‌పోర్టును సమీపించగానే ఒక్కసారిగా డ్రైవర్ వాహనాన్ని మరో మార్గంలోకి మళ్లించాడు. వాహనం హైదరాబాద్ వైపుగా దూసుకుపోతుండడంతో మహిళ డ్రైవర్ని ప్రశ్నించింది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్, నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. అయితే, వాహనం ఓ టోల్ ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్యాబ్‌ను అడ్డగింగి ఆమెను కాపాడారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ ఫూటుగా తాగి ఉన్నాడని.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చిక్కజలా ఎస్సై తెలిపారు. ఈ వ్యవహారంపై ఓలా సంస్థ స్పందిచింది. డ్రైవర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. -
కానిస్టేబుల్ ఒంటి నిండా తూటాలే...!
మరో దారుణ ఘటన. రెచ్చిపోయిన ఉగ్రవాదులు ఓ కానిస్టేబుల్‌ను బలి తీసుకున్నారు. అపహరించి మరీ ఒంటి నిండా తూటాలు దింపారు. సోషల్ మీడియాలో ఫోటోలు సర్క్యూలేట్ కావటంతో కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉగ్ర పంజా దాటికి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం సోఫియాన్ జిల్లా కచ్‌దూరా ప్రాంతంలో జావెద్ అహ్మద్ దార్ అనే పోలీస్ కానిస్టేబుల్‌ను టెర్రరిస్టులు అపహరించారు. ఇంటి సమీపంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఉన్న అతన్ని తుపాకులు చూపించి శాంట్రో కారులో ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న బలగాలు పెద్ద ఎత్తున్న గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే శుక్రవారం ఉదయం కుల్గాంలోని పరివాన్ వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటి నిండా బుల్లెట్లే... కాగా, అతని శరీరం బుల్లెట్లతో ఛిద్రమైనట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని సోఫియాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు హాజ్ యాత్రలో ఉండగా, వారికి అధికారులు సమాచారం అందించారు. ఈ ఏప్రిల్‌లో కచ్‌దూరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కశ్మీర్ పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ బృందంలో జావెద్ కూడా ఉన్నాడు. చంపే ముందు అతన్ని హింసించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే మిలిటెంట్లు గత కొంత కాలంగా ప్రతీకార దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత నెలలో ఔరంగజేబ్ అనే రైఫిల్మన్ను ఇదే రీతిలో క్రూరంగా ప్రాణాలు తీశారు. -
మహిళా జర్నలిస్ట్ అదృశ్యం.. కలకలం
లాహోర్: రాజకీయాల్లో సైన్యం జోక్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళా జర్నలిస్ట్ అదృశ్యం పాకిస్థాన్‌లో కలకలం రేపింది. ప్రముఖ పాత్రికేయురాలు, ఉద్యమకారిణి గుల్ బుఖారి అపహరణకు గురయ్యారన్న వార్తతో పాక్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం సాయంత్రం ఓ టీవీ ప్రోగ్రాం చర్చా వేదికలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆమెను అడ్డగించిన కొందరు దుండగులు తమ వెంట తీసుకెళ్లారు. అయితే బుధవారం ఉదయం ఆమె సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ కోణంలోని అంశం కావటంతో పాక్ మీడియా ఛానెళ్లలో రాత్రంతా హైడ్రామా నడిచింది. ఎవరి పని?... వక్త్ టీవీలో ఓ టాక్‌షోలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో లాహోర్ కంటోన్మెట్ ప్రాంతం వద్ద ఆమెను కొందరు వ్యక్తులు అడ్డగించి తమ వెంట తీసుకెళ్లినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసులే ఆమెను అపహరించి ఉంటారని అంతా ఆరోపించారు. పాకిస్థాన్ ప్రభుత్వపాలనలో సైన్యం జోక్యం ఎక్కువైందంటూ మొదటి నుంచి ఆమె తన వాదనను వినిపిస్తున్నారు. దీనికి తోడు జర్నలిస్టుల హక్కుల సాధనకై ఆమె సారథ్యంలోనే పోరాటం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని, ఆమెకు ఏమైనా హని జరిగితే పరిస్థితులు మరోలా ఉంటాయని జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి. కానీ, అధికారులు మాత్రం ఆ ఆరోపణలు తోసిపుచ్చగా, ఈ ఉదయం ఆమె ఇంటికి తిరిగొచ్చారు. పలువురి సంఘీభావం.. గుల్ బుఖారి కిడ్నాప్‌కు గురయ్యారన్న వార్తలపై పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) నేత మరయమ్ నవాజ్ ఆమె సురక్షితంగా తిరిగి రావాలంటూ ఓ ట్వీట్ చేశారు. సీనియర్ జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు కూడా ఆమెకు సంఘీభావం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఘటన జరగటం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఆమె స్పందిస్తేనే అసలు ఏం జరిగిందన్న విషయం తెలిసేది. బ్రిటీష్-పాక్ సంతతికి చెందిన గుల్ బుఖారి ప్రస్తుతం ‘ది నేషన్’ ఒపీనియన్ ఎడిటోరియల్ విభాగంలో పని చేస్తున్నారు. I strongly condemn the abduction of Gul Bukhari in Lahore. Armed invasion on Wana Town to physically eliminate Ali Wazir & Gul Bukhari’s abduction shows that the forces of fascism are using the absence of political government for crushing dissent. — Afrasiab Khattak (@a_siab) 5 June 2018 Gul Bukhari is a political activist and social media voice in Pakistan. Reports suggest she was abducted by agents of the state. This is just weeks before an election. https://t.co/Bg0Em5nBty — Saeed Shah (@SaeedShah) 5 June 2018 Several journalists confirming @gulbukhari was forcibly picked up while on her way to attend a TV talk show. She has been a consisted critic of the military’s alleged intervention in the Pakistani politics. — Umer Ali (@IamUmer1) 5 June 2018 I hope better sense prevails and she returns unharmed. This is simply not acceptable. https://t.co/Cel2h1TMx3 — Maryam Nawaz Sharif (@MaryamNSharif) 5 June 2018 -
టీచర్ కొట్టాడని విద్యార్థి ఆత్మహత్య
ఖమ్మం: నగరంలోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. టీచర్ మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గోపాలపురం వద్ద ఉన్న శ్రీ విద్య నికేతన్ పాఠశాలలో ప్రశాంత్ (14) అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అతడిని ఉపాధ్యాయుడు కొట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్.. రేప్.. మర్డర్
బులంద్ షహర్: ఉత్తర ప్రదేశ్‌లో మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేయడంతో పాటు, ఆమెపై అత్యాచారం అనంతరం హత్య చేశారు. బులంద్ షహర్లో 12వ తరగతి చదువుతున్న మైనర్ యువతి మంగళవారం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ట్యూషన్ ముగించుకుని సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న యువతిని.. కొందరు యువకులు మారుతీ ఆల్టో కారులో కిడ్నాప్ చేశారు. రెండు రోజులు పాటు యువతిపై అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేశారు. శవాన్ని ఒక సరస్సు పక్కన పడేసి అదేకారులో దుండగులు వెళ్లిపోయారు. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న యువతిని పట్టపగలు కిడ్నాప్ చేస్తున్న ఘటన సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారం మేరకు పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై యూపీలోని విపక్ష పార్టీలన్నీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదని సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. -
పాక్‌లో హిందూ బాలికపై దారుణం
కరాచీ : పాకిస్తాన్‌లోని హిందువులపై అకృత్యాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌లో గ్రామంలో నివాసముంటున్న ఒక హిందూ బాలికను ముగ్గురు సాయుధులైన ముస్లింలు అపహరించారు. అనంతరం బలవంతపు మత మార్పిడి చేసి.. వివాహం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లోని డాన్ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఈ ఘటనపై బాలిక తండ్రి హీరో మేఘవార్.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాన్ తెలిపింది. రెండు రోజులు కిందట ముగ్గురు సాయుధలైన వ్యక్తులు తమ ఇంటిలోని ప్రవేశించి.. అందరినీ బంధించినట్లు మేఘవార్ చెప్పారు. అనంతరం మైనర్ కుమార్తె (14 సంవత్సరాలు)ను వారు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక నేతలను, పోలీసులను సంప్రదించినా ఎవరినుంచి స్పందన రాలేదని ఆయన చెప్పారు. చివరగా నసీర్ లుంజో అంనే వ్యక్తి.. తమ కుమార్తెను బలవంతపు మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు తెలిసిందని అన్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. మేఘవార్ సింథ్ ఎస్ఎస్పీ అధికారిని కలిశారు. ఈ ఘటనపై వెంటనే ఆయన స్పందించి.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు.. బాలికను వెతికించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా.. బాలిక మతమార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్ ఒకటి పోలీసులకు అందిందని తెలిసింది. దీనిపై మేఘవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పెళ్లిని వ్యతిరేకిస్తూ సింధ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సింధ్ హైకోర్టు జనవరి17న విచారించనుంది. -
కళ్ల ముందే ‘కొట్టేశారు’!
-
కళ్ల ముందే ‘కొట్టేశారు’!
హైదరాబాద్ : బంగారం కొనేందుకు మైసూర్ నుంచి తెచ్చిన రూ.1.26 కోట్లు అపహరణకు గురైన ఘటన శనివారం రాత్రి నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలను అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాజేంద్ర బంగారం వ్యాపారి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో బంగారం వ్యాపారం చేస్తున్నారు. బంగారం కొనుగోలు నిమిత్తం 1.26 కోట్ల రూపాయలు ఇచ్చి తన పనిమనుషులు సంకిత్, సప్నిల్, సంగప్పను మైసూర్ నుంచి హైదరాబాద్ పంపారు. వారు శనివారం మధ్యాహ్నం నగరానికి చేరుకుని బషీర్‌బాగ్‌లోని స్కైలాన్అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్–202లో దిగారు. అయితే, బంగారం తాను ఆశించిన రేటుకు లభించే అవకాశం లేనందున తిరిగి మైసూర్ వచ్చేయండంటూ రాజేంద్ర అదేరోజు రాత్రి పనివాళ్లకు ఫోన్ చేశారు. దీంతో సంకిత్, సప్నిల్, సంగప్ప వెనుదిరిగేందుకు బయలుదేరారు. అపార్ట్మెంటు లిఫ్ట్‌లో నుంచి పార్కింగ్ వైపు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వీరిని అడ్డగించారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు.. ఆ బ్యాగులో ఏముందంటూ..వారిని బెదిరించి, కొట్టి బ్యాగును లాక్కున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సంకిత్, సప్నిల్, సంగప్పల నుంచి నగదు బ్యాగును బలవంతంగా లాక్కుని ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ఇక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయనందున నిందితులను ఇంతవరకు గుర్తించలేకపోయామని ఏసీపీ పేర్కొన్నారు. అదుపులో నగదు, నిందితులు? నగదు అపహరణకు గురైన తరువాత నాలుగు టీంలుగా దిగిన నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పోలీసులు కమిషనర్ కార్యాలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీటి ద్వారా నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులను నిందితులుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులతోపాటు సుమారు రూ.కోటి నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
నన్ను కేసులో ఇరికించారు: టాప్ హీరో
కొచ్చి: ‘నేను అమాయకుడిని. నా నిర్దోషితత్వాన్ని నిరూపించుకుంటా. నన్ను కుట్రపూరితంగా ఇరికించార’ని ప్రముఖ మలయాళ హీరో దిలీప్ వ్యాఖ్యానించారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని వాపోయారు. దిలీప్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను కొచ్చికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలువా ప్రాంత సబ్‌జైలుకు తరలించారు. జైలు బయట కొంత మంది యువకులు ‘వెల్కమ్ టు సెంట్రల్ జైలు’ అంటూ నినాదాలు చేశారు. దిలీప్ చివరిసారిగా 2016లో ‘వెల్కమ్ టు సెంట్రల్ జైలు’లో నటించారు. కొచ్చిలోని ఆయన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు దిలీప్ తరపు న్యాయవాది కె. రామకుమార్ తెలిపారు. తదుపరి విచారణ కోసం దిలీప్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కూడా న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ కేసులో ఆయన పాత్రను నిర్ధారించే 19 సాక్ష్యాలను సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు. -
లైంగిక వేధింపులు: తొలిసారి పెదవివిప్పిన నటి!
ముంబై: గత ఫిబ్రవరిలో ప్రముఖ మలయాళం నటిని కిడ్నాప్ చేసి.. ఆమె కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంత పరిచింది. ఆమె ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఈ ఘటనపై అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆమె డ్రైవర్ మార్టిన్‌తోపాటు.. ఈ దుర్మార్గానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పల్సర్ సునిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి నటి తనపై జరిగిన దుర్మార్గంపై పెదవి విప్పారు. మలయాళం మ్యాగజీన్ వనితకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె కేవలం డబ్బు కోసమే తనపై ఈ దారుణం జరిగిందని తాను అనుకోవడం లేదని, దీని వెనుక కుట్ర ఉందని కుండబద్దలు కొట్టారు. 'సినీ నటులను లోకేషన్ నుంచి తీసుకుపోయే ఒక డ్రైవర్ ఇంతటి సాహసానికి ఎలా ఒడిగట్టగలడు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం నా దగ్గర సమాధానం లేదు. ఈ ఘటన వెనుక నా శత్రువులు ఉన్నారని నేను చెప్పడం లేదు. కానీ కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశారని వారు అంటున్నారు. కానీ ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు. నన్ను తొలిచివేస్తున్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కావాలి. అప్పటివరకు నేను పోరాడుతూనే ఉంటాను' అని ఆమె స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో తన పోరాటం, తనకు ఉన్న ప్రత్యర్థుల గురించి వివరిస్తూ.. 'సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు కానీ, శాశ్వత శ్రతువులు కానీ ఉండరని అంటారు. కానీ నా విషయంలో నాకు శాశ్వత స్నేహితులు, శాశ్వత శత్రువులు సినీ పరిశ్రమలో ఉన్నారు. నేను చేయని తప్పులకు ఏనాడూ నేను క్షమాపణలు చెప్పను. అహంకారిగానైనా పేరు తెచ్చుకుంటాను కానీ, క్షమాపణలు చెప్పి, రాజీపడి అవకాశాల కోసం ఒకరి వద్ద దేబరించుకోను' అని నటి పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలపై మౌనంగా ఉండవద్దని, ఇతర బాధితులు కూడా ముందుకొచ్చి తమ గోడును ప్రపంచానికి తెలుపాలని ఆమె సూచించారు. -
మళయాళ నటి కేసులో త్వరగా శిక్ష పడాలి: కేంద్రమంత్రి
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఇలాంటి కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడాలన్నారు. ఈ కేసులో నేరస్థులకు కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని ఆయన అన్నారు. అప్పుడే మరెవ్వరూ ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారన్నారు. ఇలాంటి కేసుల్లో విచారణ వేగంగా జరిగి, శిక్ష కూడా త్వరగా పడేందుకు వీలుగా తాము ఒక బిల్లు తీసుకొస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ కేసుల విషయంలో రాజకీయ చిత్తశుద్ధి, దర్యాప్తు నైపుణ్యం, త్వరగా శిక్షలు పడటం అనేవి చాలా అవసరమని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. పలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా నటించిన ప్రముఖ మళయాళ నటి అహహరణ, లైంగిక దాడి కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడితో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజా అరెస్టులతో కలిపి మొత్తం తొమ్మిది మందిని పట్టుకున్నట్లయింది. Strongly condemn the kidnap of Kerala actress; exemplary punishment should be given to the criminals so that it acts as a deterrent /1 — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 20 February 2017 We are bringing a bill for speedy trial & conviction. Political will, investigative skill & quick punishments are the need of the hour /2 — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 20 February 2017 -
మా గుండె పగిలింది: బాలీవుడ్ షాక్
ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటనపై సినీలోకమంతా గళం విప్పుతోంది. బాధితురాలికి ఎదురైన భయానక అనుభవంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మలయాళీ సూపర్ స్టార్లు మమ్మూటీ, మోహన్‌లాల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ తదితరులు జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితురాలైన నటికి అండగా నిలిచారు. పలువురు దక్షిణాది నటులు కూడా ఈ ఘటనతో షాక్ తిన్నారు. నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి. నువ్వు మళ్లీ కార్యరంగంలోకి రావాలని కోరుకుంటున్నా, నిన్నెంతో ప్రేమిస్తున్నా అంటూ సమంత ట్వీట్ చేసింది. తాను కూడా ఆమె వెన్నంటే మద్దతుగా ఉంటానని, ప్రపంచంలోని ప్రేమ, శక్తి ఆమె వెన్నంటి ఉంటుందని హీరో సిద్ధార్థ ట్వీట్ చేశాడు. 'ఒక మహిళపై ఇలాంటి అరాచకం చోటుచేసుకోవడం తీవ్ర దురదృష్టకరం. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించడమే కాదు.. పశువుల కన్నా హీనంగా ప్రవర్తించిన నేరగాళ్లను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా శిక్షలు ఉదాహరణగా నిలిచిపోవాలి. అలాంటివాళ్లు అసలు మనుషులే కాదు' అంటూ మోహన్‌లాల్ ఫేస్బుక్లో తీవ్రంగా స్పందించారు. ఇక బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా, అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్, ఫర్హాన్ అఖ్తర్ తదితరులు మలయాళి నటిపై జరిగిన దారుణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన గురించి తెలిసి తన గుండె పగిలిందని హీరోయిన్ శ్రద్ధాకపూర్ పేర్కొన్నారు. ఈ దేశంలో మహిళల భద్రత కోసం ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకొని మహిళల భద్రత కోసం కృషి చేయాలని కోరారు. -
భగ్గుమన్న సినీలోకం.. దిగ్భ్రాంతి, విషాదం
కొచ్చిలోని దర్బార్ హాల్లో ఆదివారం గంభీరమైన విషాద వాతావరణం నెలకొంది. మలయాళీ సినీ ప్రముఖుల ముఖాల్లో ఆవేదన, దిగ్భ్రాంతి కనిపించాయి. తమ స్నేహితురాలు, తమకు తెలిసిన ఒక మంచి నటి శుక్రవారం రాత్రి అపహరణకు గురై.. లైంగిక వేధింపుల బారిన పడటం.. సినీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. బాధితురాలైన ఆ నటికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం దర్బార్ హాల్లో మలీవుడ్ నటులు, రాజకీయ నాయకులు, ప్రజలు ఒకచోట గుమిగూడారు. ఏదిఏమైనా బాధితురాలైన సినీనటికి న్యాయం చేసేవరకు అండగా ఉంటామని, ఆమెకు మద్దతుగా నిలబడతామని ప్రతిన బూనారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి మంజూ వరీర్ మాట్లాడుతూ 'ఈ నేరం వెనుక క్రిమినల్ కుట్ర ఉన్నట్టు స్పష్టమవుతున్నది. మనం ఇప్పుడు చేయాల్సింది తనకు అండగా నిలబడి.. దోషులకు శిక్ష పడేలా చేయడమే. మహిళలకు గౌరవం దక్కాలి. ఇంట్లో అయినా బయట అయినా వారిని గౌరవంగా చూడాలి' అని ఆమె పేర్కొన్నారు. కఠినమైన పరిస్థితులు ఎదురైనా.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడిన బాధితురాలి ధైర్యాన్ని ఆమె కొనియాడారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే రేప్, నేరపూరిత కుట్ర, కిడ్నాప్ అభియోగాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి మాట్లాడుతూ బాధితురాలైన నటి ఎంతోమందికి ఆప్తురాలు అని, ఆమెకు ప్రతి ఒక్కరి మద్దతు ఉందని, ప్రజలు, సినీ ప్రముఖులు, పోలీసులు,ప్రభుత్వం అందరూ ఆమె వైపే నిలబడ్డారని పేర్కొన్నారు. ఆమెకు తాను కూడా అండగా ఉంటానని, ఆమె ధైర్యంగా నిలబడాలని ఆయన సూచించారు. యువ హీరో దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ జరిగిన ఘటన తనను కలిచివేసిందని, భయాందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో మహిళలను గౌరవంగా చూస్తారని తాను గర్వపడేవాడినని, కానీ ఘటనతో ఆ గర్వం ఛిన్నాభిన్నమైందని ఫేస్బుక్లో పేర్కొన్నాడు. -
నటి కిడ్నాప్: టీవీ చానెల్ దారుణమైన కథనం!
పలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా నటించిన ప్రముఖ మలయాళీ నటి అహహరణ, లైంగిక దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నటి డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కేరళలో పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో అధికార సీపీఎంకు చెందిన కైరాలి టీవీ ప్రసారం చేసిన కథనాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నటిపై లైంగిక దాడి జరిగిదంటూ వివరాలను ఆ చానెల్ ప్రసారం చేయడంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నది. నటి కిడ్నాప్, దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఆమె డ్రైవర్‌తో, ఆమెకు సంబంధం ఉందంటూ ఓ తలాతోక లేని కథనాన్ని కైరాలీ టీవీ ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. పలు మీడియా చానెళ్లు కూడా మొదట నటి పేరును వెల్లడించాయి. అయితే, చట్టప్రకారం లైంగిక దాడికి గురైన బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధన ఉండటంతో ఆ తర్వాత తమ తీరును మార్చుకున్నాయి. కైరాలీ టీవీ అత్యుత్సాహం, అసంబద్ధ కథనాలపై ప్రముఖ మలయాళీ నటి రిమా కల్లింగల్ ఫేస్బుక్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సాటి వ్యక్తి తన జీవితంలోనే అత్యంత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు సానుభూతి చూపాల్సిందిపోయి.. సెన్సేషనల్ కథనాల పేరిట దారుణంగా ప్రవర్తిస్తారా అని ఆమె మండిపడ్డారు. నటుడు పృథ్వీరాజ్ కూడా మీడియా తీరుపై మండిపడ్డారు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్పుడు కథనాలు, సెన్సేషనలైజ్ చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. దీంతో దిగివచ్చిన కైరాలీ టీవీ యాజమాన్యం తన ప్రసారాల పట్ల క్షమాపణలు చెప్పింది. -
ఫాదర్ థామస్ ను సురక్షితంగా విడిపిస్తాం!
యెమన్ లో అపహరణకు గురైన భారతీయ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ ను సురక్షితంగా విడిపించేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. యెమన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించిన తనను విడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫాదర్ థామస్ ఉజన్నాలిల్ ఓ వీడియో సందేశంలో పోప్ ఫ్రాన్సిస్ ను, భారత ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వీడియో సందేశంపై సుష్మా మంగళవారం ట్విట్టర్ లో స్పందించారు. ఫాదర్ థామస్ భారతీయుడని, ప్రతి భారతీయుడి ప్రాణం తమకు విలువైనదని, ఆయనను విడిపించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని సుష్మా ట్వీట్ చేశారు. గతంలో అపహరణకు గురైన ఫాదర్ అలెక్స్ ప్రేమ్ కుమార్ ను, జుడియత్ డిసౌజాను ఆఫ్గనిస్తాన్ నుంచి విడిపించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కేరళకు చెందిన ఫాదర్ థామస్ ను గత మార్చిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. -
పీహెచ్సీలో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
వేలూరు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించిన రోగులు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వేలూరు అడుకంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేలసంఖ్యలో రోగులు వస్తుంటారు. కాగా ఆసుపత్రిలోని ప్రసవ వార్డులో ఆర్కాడు తాలుకా కలవైకి చెందిన కల్పన ఎనిమిది రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కల్పన శనివారం ఉదయం చిన్నారిని బెడ్‌పైనే ఉంచి మరుగుదొడ్డికి వెళ్లింది. అనంతరం బయటకు వచ్చిన ఆమెకు చిన్నారి కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి తెలిపింది. సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలాఉండ గా చిన్నారిని ఒక మహిళ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. దీంతో రోడ్డుపై వెళుతున్న సదరు మహిళను అడ్డుకుని సహరోగులు విచారించారు. విచారణలో తన పేరు మహేశ్వరి అని, చిన్నారి తన కుమార్తెకు జన్మించినందువల్లే తీసుకెళుతున్నట్లు తెలిపింది. అయితే మహేశ్వరి కుమార్తె ఎనిమిది నెలల గర్భవతి గుర్తించిన వారు చిన్నారిని ఆమె నుంచి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తరహాలోనే తరచూ చిన్నారులు మాయమవుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
మంత్రి కుమారుడు సేఫ్.. వీడని మిస్టరీ!
కిడ్నాప్‌నకు గురైన మంత్రి తనయుడు ఎట్టకేలకు మిలిటెంట్ల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. గత మే 20న పాకిస్తాన్ లోని సమస్యాత్మక ప్రాంతం బలోచిస్తాన్ కు చెందిన మంత్రి సర్దార్ ముస్తఫా తారీన్ కుమారుడు అసద్ తారీన్ ను కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంతలో కొందరు సాయుధులు పిషిన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో అసద్ ను అడ్డగించి అపహరించారు. అసద్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో డోలాంగి ఏరియాలో అసద్ తారీన్ను తాము రక్షించామని పిషిన్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ వాహిద్ కాకర్ తెలిపారు. పాక్-ఆఫ్గన్ సరిహద్దుల్లో దొరికిన అసద్ ను పటిష్ట భద్రత మధ్య అక్కడి నుంచి క్వెట్టాకు తరలించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను ఆయన బహిర్గతం చేసేందుకు నిరాకరించారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అసద్‌ను రక్షించారా.. లేక కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని వారికి ఇచ్చివేసి కాపాడారా అన్న విషయంపై ఇప్పటివరకూ స్పష్టతలేదు. గతంలోనూ సల్మాన్ తసీర్ అనే వ్యక్తి కిడ్నాప్‌నకు గురైన ఐదేళ్ల తర్వాత ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే. -
ఎలియన్స్ నన్ను అపహరించి..
గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? భూమి మీద కాకుండా వేరే గ్రహంపై కూడా జీవం ఉనికి ఉందా? అన్నది కచ్చితంగా నిర్ధారణ కాకపోయినా.. ఎలియన్స్ విషయంలో ఎన్నో ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసలు ఎలియన్స్ ఉన్నారా? లేరా? అన్నదే పెద్ద చిక్కుముడి అంటే.. ఓ మహిళ అయితే ఈ విషయంలో అనేకానేక విస్మయకర విషయాలు చెప్పింది. ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు తనను గ్రహాంతరవాసులు అపహరించుకుపోయారని, తన పడకగది గోడల నుంచి గ్రహాంతర వాసులు తరచూ బటయకు వచ్చి తనను తీసుకెళుతారని బ్రిటన్‌కు చెందిన లీసా చెప్పుకొచ్చింది. తన గది గోడల నుంచి బయటకు వచ్చే ఎలియన్స్ తరచూ తనను తీసుకెళ్లేవారని, అలా వాటితో వెళ్లడం వల్ల అవి తన కుటుంబసభ్యుల్లా మారిపోయావని ఆమె తెలిపింది. ఎర్త్ మిస్టరీ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఎలియన్స్‌పై తన శరీరాన్ని తరచూ పరిశీలించేవని, అలా చేస్తుంటే అవి తనను రేప్ చేస్తున్నాయా అనే భావన కలిగేదని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేదని పరిశోధకులు భావిస్తున్నారు. -
జిగిషాను అపహరించి.. హతమార్చారు!
ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు న్యూఢిల్లీ: ఏడేళ్ల కిందట దేశ రాజధాని హస్తినను కుదిపేసిన ఐటీ ఉద్యోగిని జిగిషా ఘోష్ హత్యకేసులో ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈకేసులోని ముగ్గురు నిందితులనూ దోషులుగా తేల్చింది. నిందితులు అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, రవికపూర్ పై హత్య, నేరపూరిత కుట్ర, అపహరణ, దోపిడీ అభియోగాలు రుజువైనట్టు పేర్కొంది. 2009 మార్చిలో జిగిషా దారుణ హత్యకు గురైంది. ఢిల్లీ వసంత్ విహార్ లోని ఐటీ కంపెనీ నుంచి నోయిడాలోని తన ఇంటికి జిగిషా బయలుదేరింది. కంపెనీ క్యాబ్ ఆమెను ఇంటివద్ద దిగబెట్టినప్పటికీ.. ఆమె ఇంటికి చేరలేదు. కొన్నిరోజుల తర్వాత ఆమె మృతదేహం సూరజ్ కుండ్ లో లభించింది. ఆమె మొబైల్ ఫోన్లను నిందితులు ఒకదానిని వెళుతున్న ట్రాక్ లో, మరోదానిని రోడ్డుపై వదిలేశారు. ముగ్గురు నిందితులు దోపిడీ చేసే ఉద్దేశంతోనే జిగిషాను ఆమె అపార్ట్ మెంట్ వద్దే అపహరించి.. అనంతరం హత్యచేశారు. జిగీషా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు కనుగొనడంతో ఈ హత్య మిస్టరీనే కాకుండా 2009 సెప్టెంబర్ 30న జరిగిన మహిళా జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసు చిక్కుముడి కూడా ముడింది. దోపిడీ చేసే ఉద్దేశంతోనే నిందితులు సౌమ్యను, జిగిషాను హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. -
పెళ్లి చేసుకుని..
నాగోలు: రెండో వివాహం చేసుకుని కులం పేరుతో భర్త, అతని కుటుంబ సభ్యుల దూషించడంతో ఓ మహిళ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్బీ నగర్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన ఎమ్ నాగలక్ష్మీ అలియాస్ రమ్య(27) ఎలక్ట్రిసిటీ డిపార్టెమెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. వివాహిత అయిన రమ్య భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో కూతురితో కలిసి నగరంలో నివాసం ఉంటోంది. కాగా, నల్లగొండకు చెందిన గట్టు సుమన్ బాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొత్తపేటలోని స్వర్ణకంచి షాపింగ్ మాల్ లో సేల్స్ బాయ్ గా పనిచేస్తున్న సుమన్ రమ్యను పెళ్లి చేసుకుని ఆమెకు అండగా ఉంటానని చెప్పి నమ్మించి ఈ ఏడాది ఫిబ్రవరి 8న కంచీపురం లో వివాహం చేసుకున్నాడు. మన్సూరాబాద్ లోని మల్లికార్జుననగర్ లో కుటుంబసభ్యులకు తెలియకుండా కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న సుమన్ కుటుంబసభ్యులు గట్టు ఉదయ్ కుమార్, లక్ష్మీలు ఇంటికి వచ్చి సుమన్ ను వదిలేసి వెళ్లిపోవాలని రమ్యను బెదిరించారు. ఈ క్రమంలో వీరు రమ్యను కులం పేరుతో దూషించారు. ఆ తర్వాత సుమన్ ఇంటికి రాకుండా ముఖం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న రమ్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆఫ్ఘాన్‌లో భారతీయ మహిళ కిడ్నాప్
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తైమని ప్రాంతంలో భారతీయ మహిళను గురువారం రాత్రి ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఆఫ్ఘాన్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమెను విడిపించేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కిడ్నాప్‌ను గురైన సదరు మహిళ ఆగాఖాన్ ఫౌండేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు ఆఫ్ఘాన్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కిడ్నాప్ అయిన మహిళను క్షేమంగా విడిపించేందుకు ఆఫ్ఘాన్లోని భారతీయ రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు ఆ దేశ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌నకు గురైన సదరు మహిళ భారత్‌లోకి కొల్‌కతాకు చెందిన వారని ఉన్నతాధికారులు చెప్పారు. -
కాబూల్‌లో భారతీయ మహిళ కిడ్నాప్
కాబూల్: ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో భారతీయ మహిళ కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. ఆగా ఖాన్ ఫౌండేషన్‌లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన జూడిత్ డిసౌజా(40)ను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి కిడ్నాప్ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కాబూల్‌లోని టైమాని ఏరియాలో కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్‌కు గురైన మహిళ ఆచూకి కోసం ఆప్ఘన్ ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కిడ్నాప్ ఘటన తరువాత కొంత సమయం వరకు ఆమె ఫోన్ ఆన్‌లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారతీయ మహిళ కిడ్నాప్ ఘటనలో చర్యలు వేగవంతం చేయాలని భారత విదేశాంగ శాఖ ఆప్ఘన్ అధికారులను కోరింది. కిడ్నాప్‌కు పాల్పడింది ఉగ్రవాదులా లేక ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. -
బాలిక కిడ్నాప్ - అత్యాచారం
ముగ్గురు యువకులు పదమూడేళ్ల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి తల్లి బయటకు వెళ్లగా, అదే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ముగ్గురు యువకులు ముఖానికి ముసుగులు ధరించి వచ్చి ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లి సమీప ప్రాంతంలో అత్యాచారం చేసి పరారయ్యారు. దీనిపై బాలిక తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బాలిక కిడ్నాప్.. తండ్రి హత్య!
కలహండి: ఒడీషాలోని కలహండి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పద్నాలుగేళ్ల గిరిజన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. విడిపించడానికి వెళ్లిన తండ్రిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లాలోని సనచెరగావ్ గ్రామానికి చెందిన దయానిధి మాఝి(50) కూతురు ఈ నెల 22 నుంచి కనిపించకుండా పోయింది. కూతురు కోసం వెతుకుతున్న దయానిధి.. సోమవారం కిడ్నాప్ చేసిన దుండగులను గుర్తించి విడిపించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు దయానిధిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక జిల్లా అసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో దయానిధిని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం దయానిధి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి బాలిక కిడ్నాప్, తండ్రి హత్యలపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై దిలిప్ కుమార్ తెలిపాడు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
టెక్ ఎగ్జిక్యూటివ్‌ను కిడ్నాప్ చేసి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు దుండగులు.. ఐటీ కంపెనీ సీనియర్ మేనేజర్‌ను కిడ్నాప్ చేసి, విచక్షణారహితంగా కొట్టి, దోపిడీకి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. సుమిత్ చక్రవర్తి అనే ఉద్యోగి బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు ఆండ్రూస్ గంజ్ బస్టాప్ వద్ద కంపెనీ బస్ కోసం ఎదురు చూస్తుండగా, ఆయన వద్దకు ఇద్దరు యువకులు వచ్చి తమను బీఎస్ఎఫ్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. మహారాణి బాగ్‌కు వెళ్లేందుకు దారి అడిగారు. కొన్ని నిమిషాల తర్వాత మరో వ్యక్తి కారులో వచ్చి నోయిడా సెక్టార్ 20కు వెళ్లే దారి అడిగాడు. ముందు వచ్చిన ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇవ్వాలని కోరగా మూడో వ్యక్తి అంగీకరించాడు. వారితో పాటు రావాలని ముగ్గురు యువకులు కోరగా, సుమిత్ నిరాకరించాడు. అయితే ముగ్గురు బలవంతంగా ఆయనను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. కారులోపల మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. కారులో నలుగురు దుండగులు సుమిత్తో గొడపపెట్టుకుని చేయిచేసుకున్నారు. ముఖంపైన, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టారు. సుమిత్ రింగులు, మొబైల్ ఫోన్, పర్స్ లాక్కున్నారు. దుండగులు మధ్యలో కారు ఆపి ఆయనతో డెబిట్ కార్డు పిన్ నెంబర్ అడిగారు. ఏటీఎంకు వెళ్లి ఆయన ఎకౌంట్ నుంచి 40 వేల రూపాయలు డ్రా చేశారు. అనంతరం నోయిడా హైవే వైపు గంటసేపు ప్రయాణించారు. పారి చౌక్ వద్ద కారు ఆపి సుమిత్‌ను బయటకు తోసివేశారు. ఆయన ఎడ్రెస్, వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, ఈ విషయం పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు. సుమిత్ ఆటోలో ఇంటికి వెళ్లగా, ఆయన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమిత్ గాయాల తీవ్రతను చూసి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోరంగా తిడుతూ నన్ను ఎత్తుకెళ్లాడు!
బెంగళూరు: పెయింగ్ గెస్ట్ గది ఎదురుగా ఫోన్లో మాట్లాడుతున్న తనను అమాంతం ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడని, తనను అనరాని మాటలంటూ, 'వేశ్య' అని ఘోరంగా తిడుతూ అతడు తనపై అఘాయిత్యం చేయబోయాడని బెంగళూరు బాధితురాలు వెల్లడించింది. బెంగళూరులోని కట్రిగుప్ప వద్ద గత నెల 23న తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఎవరో ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు. ఈ కేసులో నత్తనడకన విచారణ జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు తనపై అత్యాచార యత్నం చేయబోయిన వ్యక్తిని తాను గుర్తిస్తానని స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కేకలు పెట్టిన ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ' నా పెయింగ్ గెస్ట్ గది ఎదురుగా నేను ఫోన్లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వెనుకవైపు నుంచి వచ్చి అమాంతం నన్ను ఎత్తుకున్నాడు. నన్ను ఓ జంతువులా పట్టుకొని దగ్గర్లో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లాడు. నాకు ఏం జరుగుతుందో కూడా కొంతసేపు అర్థం కాలేదు. నన్ను కిందపడేసి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతనితో పోరాడాను. అతన్ని వెనక్కినెట్టి పరిగెత్తాను. నా జట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి మళ్లీ నేలపై పడేశాడు. నేను గట్టిగా అరుస్తూ ఏడ్చాను. ఎవరూ నన్ను రక్షించేందుకు ముందుకురాలేదు. చివరకు అతని చేయి గట్టిగా కోరికి.. అతన్ని నుంచి తప్పించుకొని నా గదివైపు పరిగెత్తాను' అని బాధితురాలు వివరించింది. బాధితురాలి కుటుంబసభ్యులు మణిపూర్‌కు చెందినవారు. బెంగళూరులోనే పుట్టిన పెరిగిన ఆమె ప్రస్తుతం ఓ బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది. -
సీసీటీవీ షాకింగ్: యువతిని ఎత్తుకెళ్లి..
బెంగళూరు నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన పేయింగ్ గెస్ట్‌హౌస్ ఎదురుగా 25 ఏళ్ల యువతి ఫోన్లో మాట్లాడుతుండగా ఆమెను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు తీసుకెళ్లి ఆమెపై బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. దక్షిణ బెంగళూరులోని కట్రిగుప్పెలో ఏప్రిల్ 23న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని బాధితురాలు బలంగా ప్రతిఘటించింది. అతని చేతిని గట్టిగా కొరికి.. అతని బారి నుంచి తప్పించుకుంది. అనంతరం తన పెయింగ్ గెస్ట్ గదికి వచ్చి తనపై జరిగిన అకృత్యాన్ని వివరించింది. బాధితురాలు కల్యాణ్ నగర్‌లోని బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది. గత నెల 23న రాత్రి ఆమె స్నేహితుడు తన పెయింగ్ గెస్ట్ రూమ్ సమీపంలోని మారెమ్మ ఆలయం వద్ద బాధితురాలిని దిగబెట్టాడు. ఆ తర్వాత ఫోన్ రావడంతో అక్కడే తచ్చాడుతూ ఆమె ఫోన్లో మాట్లాడింది. ఇదే అదనుగా భావించిన దుండగుడు వెనుక వైపునుంచి ఆమెను చుట్టేసుకొని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. సమీపంలో ఉన్న పాదచారులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దుండగుడి నుంచి తప్పించుకున్న ఆమె అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేయకుండా పెయింగ్ గెస్ట్ రూమ్ యాజమాని తనను ఒత్తిడి చేశాడని, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు చెప్తున్నది. -
కిడ్నాపర్లే డబ్బులు ఇచ్చి వదిలేశారు
అగర్తల : కిడ్నాపర్ల చేతిలో తన్నులు తిన్నాడు. వాళ్లు తిట్టిన తిట్లు భరించాడు. అంతేకాదు వాళ్లు చెప్పిన పనులన్నీ చేశాడు. మంచివాడు మా రాజన్ సాహ. మా మాటే వింటాడోయి... అంటూ కిడ్నాపర్ల చేత శెభాష్ అనిపించుకున్నాడు. అతడిని విడుదల చేయాలని కిడ్నాపర్లు నిర్ణయించారు. అతడికి కొంత నగదు ఇచ్చి మరీ విడిచిపెట్టారు. అదీ కూడా కిడ్నాప్ అయిన 16 ఏళ్లకు. దీంతో రాజన్ బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి వారి ద్వారా రాజన్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో జీవిస్తున్న రాజన్ సాహ అనే వ్యక్తికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు. ఓ అమ్మాయి. రాజన్ అరటి పళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో 2000 సంవత్సరంలో అగర్తలకు దక్షిణంగా 35 కిలో మీటర్ల దూరంలోని జంపుజాయిలాలో అరటిపళ్లు టోకున కొనుగోలు చేసేందుకు ఎప్పటిలాగా వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సాయుధలైన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర తీవ్రవాదులు రాజన్ సాహతోపాటు మరో ఇద్దరు వ్యాపారులను కిడ్నాప్ చేశారు. కళ్లకు గంతలు కట్టి బంగ్లాదేశ్ లోని చిట్టిగాంగ్ పర్వత శ్రేణి ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ అటవీ ప్రాంతంలోని తమ స్థావరాలకు తీవ్రవాదులు తీసుకెళ్లారని... అయితే ఆ ప్రాంతం ఎక్కడ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేనని నాటి సంఘటనలు మంగళవారం తనను కలసిన విలేకర్లకు పూసగుచ్చినట్లు రాజన్ సాహ వివరించారు. తీవ్రవాదుల స్థావరం తన పట్ల ఎంత ఘోరంగా వ్యవహరించిందని... నగదు ఇస్తే వదిలేస్తామంటూ వారు డిమాండ్ చేసేవారని... తన వద్ద నగదు లేదని ఎన్ని సార్లు చెప్పిన వారు వినకుండే చిత్రహింసలు పెట్టేవారని... ఆహారం కూడా సరిపడనంత పెట్టేవారు కాదని.... దీంతో తీవ్ర అనారోగ్యం పాలైయానని... కిడ్నాపర్ల చెరలో ఉన్న సమయంలో అతడు పడిన బాధలను రాజన్ తలచుకుని కన్నీరు మున్నీరు అయ్యాడు. కానీ ఏ రోజూ అక్కడి నుంచి పారిపోవాలని మాత్రం ప్రయత్నించలేదని చెప్పాడు. అయితే ఖాళీ సమయాల్లో మాత్రం వీరి నుంచి విముక్తి కల్పించాలని దేవుని ప్రార్థన చేసేవాడినని చెప్పాడు. తన మొర దేవుడు అలకించాడని... కిడ్నాపర్ల మనస్సు కరిగి... ఇంటికి వెళ్లంటూ కొంత నగదు ఇచ్చి... పంపేశారని రాజన్ చెప్పాడు. కాగా తనతో కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యాపారులను మరో చోటకు తరలించారని రాజన్ గుర్తు చేసుకున్నారు. అయితే తీవ్రవాదుల చెరలో ఉన్న రాజన్‌ను విడిపించేందుకు అతడి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. పోలీసు ఉన్నతాధికారులతోపాటు మంత్రులను కూడా కలిశారు. కానీ ప్రయోజనం శూన్యం. చివరికి కోర్టును ఆశ్రయించగా... అతడు మరణించినట్లు అధికారులు కోర్టుకు మరణ ధృవీకరణ ప్రతం అందజేశారు. దీంతో రాజన్‌పై అతడు కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. ఆ తరుణంలో రాజన్ ఇంటికి రావడం చూసి... కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజన్ పెద్ద కుమారుడు కోల్‌కత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఒక్కగాని ఒక్క కుమార్తె వివాహం చేసుకుని మెట్టినింట ఆనందంగా ఉంటోంది. దేవుని దయతో తన భర్త ఇంటి క్షేమంగా తిరిగి వచ్చాడని రాజన్ భార్య సుమిత్ర సంతోషంతో తెలిపింది. -
కేరళ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి లిబియాలో అపహరణకు గురయ్యాడు. కాజీకోడ్ జల్లాకు చెందిన రేగి జోసెఫ్ (43) ను లిబియా రాజధాని ట్రిపోలి లో అక్కడ తిరుగుబాటు దళాలు గతనెల 31న కిడ్నాప్ చేశారు. రాజధానికి సమీపంలో సోక్ అల్ జముయా కార్యాలయంలో విధులు నిర్వర్తిసుండగా దాడిచేసిన ప్రభుత్వ వ్యతిరేక దళాలు జోసెఫ్ తో పాటు మరో ముగ్గుర్ని అపహరించారు. జోసెఫ్ ఆల్ దివాన్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. భార్య షినుజ, ముగ్గురు కుమార్తెలుతో గత రెండు సంవత్సరాలుగా ఆయన లిబియా నివసిస్తుండగా, భార్య స్థానిక టిఎంసి హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్నారు. కాగా తన కుమారుడు కిడ్నాప్ వ్యవహారంపై తన కోడలు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్టు జోసెఫ్ తండ్రి పుల్లు వెలిల్ తెలిపారు. మరోవైపు కాజీకోడ్ ఎంపీ ఎంకె రాఘవన్ స్పందిస్తూ జోసెఫ్ కుటుంబానికి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. -
హవ్వా.. చైనా జనాలకు చీమకుట్టినట్లైనా లేదు
బీజింగ్: మానవత్వం భారతదేశంలో రానురాను తగ్గిపోతుందని గగ్గోలుపడిపోతుంటాంకానీ చైనాతో పోల్చుకుంటే మాత్రం మనమే నయం అనిపిస్తుందేమో. అవును.. చైనాలో మానవత్వం ఎప్పుడో మంటగలిచిపోయిందని ఈ విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది. చైనాలో సాధారణంగా చిన్నపిల్లల కిడ్నాప్‌లు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ విషయం ఎంతో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అసలు ప్రజలకు ఇలాంటి అంశాలపై ఎంతమేరకు ఆందోళన ఉంటుందో, ఎలా తమ బాధ్యతను నిర్వర్తిస్తారో తెలుసుకునేందుకు కొందరు యువకులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒక చిన్నపిల్లాడిని బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో నిల్చోబెట్టి అందరూ చూస్తుండగా క్లోరో ఫామ్ ముక్కుకు పెట్టి ఎత్తుకెళ్లిపోతున్నట్లుగా ప్రవర్తించారు. ఇలా పార్క్‌లలో, రెస్టారెంట్లలో, వీధుల్లో, కళాశాల వద్ద పరిపరి విధాలుగా కిడ్నాప్ చేస్తున్నట్లుగా నటించారు. కానీ, ఇదంతా చూస్తున్న ఆ చుట్టుపక్కలవారు కనీసం ఆ కిడ్నాపర్‌ను అడ్డుకోలేదు కదా... కనీసం ఆందోళన కూడా పడలేదు. మాకే సంబంధం లేదన్నట్లుగా కనీసం చీమకుట్టినట్లయినా లేకుండా కనిపించారు. ఏ ఒక్కరూ అతడిని గల్లా పట్టుకొని అడుగుతారేమోనని ఆశగా చూసిన అంతా బాధ్యతా రహితంగానే కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. -
క్రైమ్ షో చూసి.. కిడ్నాప్ డ్రామాకు స్కెచ్!
న్యూఢిల్లీ: కొన్ని రోజుల కిందట అదృశ్యమైన నోయిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ షిప్రా మాలిక్ ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరింది. అయితే ఆమె హఠాత్తుగా అదృశ్యమై.. కిడ్నాప్ డ్రామా సృష్టించడానికి కారణాలు ఏమిటన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీవీ సీరియల్ 'క్రైమ్ పెట్రోల్' ప్రేరణతో షిప్రా ఈ బూటకపు కిడ్నాప్ తంతును సృష్టించిందని, ఆమెను ఎవరూ అపహరించలేదని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రాథమిక విచాణ జరిపిన పోలీసులు.. అసలు షిప్రా మాలిక్ అపహరణ జరుగలేదని స్పష్టం చేశారు. ఇంట్లో సమస్యలు, కుటుంబసభ్యుల పట్ల అసంతృప్తితోనే ఫిబ్రవరి 29న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తన ఇష్టప్రకారమే ఇంటిని వీడిన ఆమె పలు ప్రదేశాల్లో తిరిగిందని, గత మూడురోజుల్లో హర్యానాలోని ఓ ఆశ్రమంలోనూ ఆమె గడిపిందని పోలీసులు తెలిపారు. తమ విచారణలో ఆమె వెల్లడించిన వివిధ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షిప్రా మాలిక్ మొదట తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి గుర్గావ్కు తీసుకెళ్లారని, ఆ తర్వాత వదిలేశారని పేర్కొంది. ఆ తర్వాత మాట మార్చింది. ఈ నేపథ్యంలో ఆమె మానసికి పరిస్థితిని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఆమె బూటకపు అపహరణ డ్రామా ఆడిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు!
లిబియాలో కిడ్నాపైన ప్రొఫెసర్ల కోసం వారి కుటుంబ సభ్యుల ఆవేదన * 7 నెలల కింద బలరాం, గోపీకృష్ణలను బంధించిన ఐసిస్ ఉగ్రవాదులు * ఇప్పటికీ అందని క్షేమ సమాచారాలు * కన్నీటితో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు * లిబియా, ట్రిపోలీ, ఢిల్లీ.. ఎక్కడా లభించని భరోసా * ఇల్లు గడవడం కష్టంగా ఉందన్న గోపీకృష్ణ కుటుంబం * ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బలరాం భార్యాపిల్లలు సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ఎలా ఉన్నారో.. ఎప్పుడొస్తారో తెలియదు.. నాన్న ఎప్పుడొస్తాడన్న పిల్లలకు ఏం చెప్పాలో తెలియదు.. నాన్నపై బెంగతో పిల్లలు ఏడుస్తుంటే, తమ కంట కన్నీటిని అదిమిపెట్టి వారినెలా ఓదార్చాలో తెలియదు.. తోడు నీడగా ఉండే వారు లేక, అసలు తమవారి పరిస్థితి ఏమిటో తెలి యక కుమిలిపోవడమే వారికి మిగిలింది. లిబి యాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో చిక్కిన తెలంగాణ, ఏపీలకు చెందిన ప్రొఫెసర్లు చిలువేరు బలరాం కిషన్, తిరువీధుల గోపీకృష్ణ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది.. గతేడాది జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అందులో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లను 2 రోజుల్లోనే విడిచి పెట్టిన ఉగ్రవాదులు... కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరాం కిషన్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను విడుదల చేయలేదు. దీంతో దాదాపు ఏడు నెలలుగా వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు లిబియాలోని భారత అధికారులతో నిత్యం సంప్రదిస్తున్నా.. తమ వారి క్షేమ సమాచారం తెలియక విలవిల్లాడుతున్నారు. గడువులన్నీ తీరినా.. బలరాం కిషన్, గోపీకృష్ణల విడుదలకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి విడుదలైన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు, భారత దౌత్య అధికారులు చెప్పిన గడువులన్నీ ఇప్పటికే తీరిపోయాయి. బందీల కుటుంబ సభ్యులైతే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు ప్రధాని మోదీని సైతం కలసి వారిని విడిపించాలని వేడుకున్నారు. విదేశాంగ శాఖ కార్యాలయం బందీల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు భరోసానిస్తూ వచ్చింది. అటు లిబియాలోని దౌత్యాధికారులు సైతం సిర్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల సహాయంతో సంప్రదింపులు జరిపి ఇద్దరు ప్రొఫెసర్ల విడుదల కోసం ప్రయత్నించారు. కానీ పురోగతి లేకపోవడంతో ఏం చేయాలో, బందీల కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ వారమే కీలకం లిబియాలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఉగ్రవాదులతో చర్చలు జరిపేం దుకు సానుకూల వాతావరణం ఏర్పడుతోం దని దౌత్యాధికారులు చెబుతున్నారు. ఈ వారంలో కొంత పురోగతి ఉండొచ్చని బందీల కుటుంబ సభ్యులకు భరోసానిస్తున్నారు. ఈనెల 29న ప్రొఫెసర్ గోపీకృష్ణ పుట్టినరోజు కావడంతో.. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన పుట్టినరోజుకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యే అవకాశముందని.. అది విడుదలపై సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఇక వారం కింద బలరాం, గోపీకృష్ణల సెల్ఫోన్లు పనిచేశాయని... దీంతో వారు క్షేమంగానే ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఏ ఘటన జరిగినా సిర్త్ ఆస్పత్రికి తప్పక సమాచారం వస్తుందని చెబుతున్నారు. ఏమీ అర్థం కావడం లేదు ‘‘రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. సిర్త్ యూనివర్సిటీ, ఢిల్లీ అధికారులకు రోజూ ఫోన్లు చేస్తున్నా.. స్పందన కనిపించడం లేదు. ఇప్పటికే ఏడు నెలలవుతోంది. పిల్లల ఫీజులు, కుటుంబ వ్యయం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈనెల 29న నా భర్త (గోపీకృష్ణ) పుట్టినరోజు. ఆ రోజుకయినా ఆయన క్షేమ సమాచారం తెలుస్తుందన్న ఆశతో బతుకుతున్నాం. మా వారి విడుదల కోసం మరింతగా ప్రయత్నించాలని ప్రధాని మోదీని కోరుకుంటున్నాం..’’ - కల్యాణి, గోపీకృష్ణ సతీమణి ఇంత పెద్ద దేశం ఇద్దరినీ విడిపించలేదా? ‘‘మనది ఎంతో పెద్దదేశం.. శక్తివంతమైనది.. ఈ ఇద్దరిని ఎందుకు విడిపించలేకపోతోంది? మా వారు క్షేమంగా ఉన్నారని చెబుతున్నా... అసలు ఆచూకీని ఇంత వరకు చెప్పలేకపోతున్నారు. పెద్ద పదవుల్లో ఉన్న వారందరినీ కలసి వేడుకున్నాం. ఏమీ పాలుపోవడం లేదు. గత ఆదివారం మా వారికి ఫోన్ చేస్తే రింగ్ అయింది, కానీ ఎత్తలేదు. మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ లేదు. నాన్న ఎప్పుడొస్తారని పిల్లలు అడుగుతున్నారు. ఏం చెప్పాలి..? ఈ నెలాఖరులో లిబియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మా వారి విడుదల జరుగుతుందని దౌత్యాధికారులు చెబుతున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నాం..’’ - శ్రీదేవి, బ లరాం సతీమణి -
కిడ్నాపర్లకే కుర్రాడి మస్కా
భువనగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా భువనగిరిలో బుధవారం ఉదయం కిడ్నాప్‌కు గురైన బాలుడు కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. స్థానిక అర్బన్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కొడుకు అరుణ్‌సాయి(12) దేదిప్య ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం స్నేహితులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుండగా.. గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి వ్యానులో తీసుకెళ్లారు. వ్యాన్ రాయగిరి వద్దకు చేరుకోగానే చెడిపోవడంతో..అదును చూసి కిడ్నాపర్ల కళ్లుకప్పి కారులో నుంచి అరుణ్ సాయి బయటకు దూకి తప్పించుకున్నాడు. రాయగిరి గ్రామంలోకి వెళ్లి ఓ వ్యక్తి సాయంతో తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాలుడిని తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
వాళ్ల వద్ద ఏకే 47లు, జీపీఎస్: ఎస్పీ
-
వాళ్ల వద్ద ఏకే 47లు, జీపీఎస్: ఎస్పీ
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడి చేసిన ఉగ్రవాదులను ఆ దాడికి ముందే చూసిన ఏకైక వ్యక్తి.. గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్. ముందురోజే ఉగ్రవాదులు ఆయనమీద దాడిచేసి, ఆయన కారు లాక్కుని అందులోనే పఠాన్‌కోట్ వరకు వెళ్లారు. తొలుత ఎవరో దోపిడీ దొంగల పని అనుకున్నా.. తర్వాత మాత్రం వాళ్లే ఉగ్రవాదులని తెలిసింది. ఎస్పీ సల్వీందర్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఉన్నట్టుండి తమ కారుకు అడ్డంగా కొందరు రావడంతో కారు ఆపామని, నలుగురైదుగురు వ్యక్తులు తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. వెనక్కి జరగమని గట్టిగా చెప్పారన్నారు. వాళ్లు మిలటరీ జాకెట్లు వేసుకుని ఉన్నా.. టెర్రరిస్టులేనని అర్థం అయ్యిందన్నారు. ఉర్దూలో మాట్లాడుతూ తమను బాగా వెనకసీటు వద్దకు పంపేసి.. తమ ముఖాలను కూడా కిందకు వంచేశారన్నారు. పైకి చూసినా, ఏమైనా మాట్లాడినా కాల్చిపారేస్తామని బెదిరించినట్లు తెలిపారు. వాళ్ల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నాయని, జీపీఎస్ పరికరాలు కూడా ఉండటంతో పఠాన్‌కోట్ దారి తనను అడగలేదని తెలిపారు. వాళ్లు ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల్లో మాట్లాడారని, తన మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారని అన్నారు. తన కళ్లకు గంతలు కట్టేశారని, దాంతో తర్వాత వాళ్లు ఏ ఫోన్లో మాట్లాడారో, ఏం జరిగిందో చూడలేకపోయానని అన్నారు. వాళ్లు తమ కమాండర్‌తో మాట్లాడినట్లు అర్థమైందని, సలాం, ఆలేకుం సలాం అన్నారని సల్వీందర్ చెప్పారు. అయితే.. వాళ్లకు తాను జిల్లా ఎస్పీనని తెలియదని కూడా ఆయన తెలిపారు. -
హయత్ నగర్లో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ సిటీ: హయత్‌నగర్‌లో ఓ డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. అరణ్య కాలనీలో ఉంటున్న బొర్ర రమేశ్ గౌడ్ అనే డాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..బొర్ర రమేశ్ గౌడ్, దుర్గా రాణి అనే ఇద్దరు గతంలో ఓ ఆసుపత్రి పెట్టారు. విభేదాలు రావడంతో ఆసుపత్రిలో వాటాను రమేశ్ అమ్మేసుకున్నాడు. దీనికిగానూ దుర్గారాణి, రమేశ్‌కు రూ.30 లక్షల విలువైన చెక్‌లను ఇచ్చింది. ఆ చెక్‌లు చెల్లకపోవడంతో రమేశ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది. మరో క్లినిక్ ప్రారంభిద్దామని రమేశ్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పోచంపల్లి వెళ్తుండగా కొత్తగూడెం చౌరస్తా వద్ద కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. కరీంనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. తాము మావోయిస్టులమని ఈ విషయం ఎవరికైనా చెబితే భార్యాబిడ్డలను హతమారుస్తామని బెదిరించారు. అనంతరం రమేశ్‌ను ఘట్కేసర్ వద్ద విడిచిపెట్టి పారిపోయినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడి కిడ్నాప్ కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 4వ తరగతి విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేశారు. సదరు బాలుడు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సమీప బంధువుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం
-
హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: హైదరాబాద్‌లో వ్యాపారస్థుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నార్సింగ్ పోలీసులు రెస్క్యూ చేసి దుండగుల నుంచి వ్యాపారి రమేశ్ చంద్ అగర్వాల్‌ను కాపాడారు. వివరాలు.. అల్కాపూర్ వద్ద రెండు కార్లలో వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేసి వ్యాపారి రమేశ్ కుమార్ అగర్వాల్‌ను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనలో రమేశ్‌తో ఉన్న మరో వ్యాపారి ప్రమోద్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రమోద్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ప్రమోద్‌కు చికిత్స అందిస్తున్నారు. వ్యాపారి రమేశ్ చంద్ అగర్వాల్ కుమారుడు ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు దుండగులను పట్టుకున్నారు. -
విశాఖ టీడీపీలో ముసలం
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ముగ్గురు టీడీపీ నాయకులను మావోయిస్టులు అపహరించి వారం గడుస్తున్నా ప్రభుత్వం వారి విడుదలకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో.. మూడు మండలాల్లో పార్టీ కేడర్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మణికుమారి మీడియాకు తెలిపారు. పాడేరు ఏజెన్సీ పరిధిలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు వారం క్రితం విశాఖ జిల్లా టీడీపీ కార్యదర్శి ముక్కల మహేశ్ , జీకే వీధి మండల అధ్యక్షుడు ఎం బాలయ్య పడాలు, ఉపాధ్యక్షుడు వి.బాలయ్యను మావోయిస్టులు అపహరించారు. అయితే, వీరి విడుదల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పార్టీ స్థానిక నాయకులకు ఆగ్రహం కలిగించింది. సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం విశాఖ వచ్చిన సందర్భంగా అపహరణకు గురైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను కలసి విడుదలకు కృషి చేయాలని కోరారు. అయినా, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో పాడేరు నియోజకవర్గంలోని చింతపల్లి, జేకే వీధి, జి.మాడుగుల మండలాలకు చెందిన నాయకులు అందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తామని వారు చెప్పినట్టు మణికుమారి తెలిపారు. కాగా మరో వైపు కొయ్యూరు, పాడేరు మండలాలకు చెందిన టీడీపీ కేడర్ కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
కిడ్నాప్ కథ సుఖాంతం..
-
కిడ్నాప్ కథ సుఖాంతం..
తణకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. రెండు రోజుల కింద పాఠశాలకు వెళ్లి కిడ్నాప్‌కు గురైన హేమంత్(5)ను ఆగంతకులు గురువారం ఆటోలో వచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లారు. హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించిన విషయం తెలిసిందే. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా... ఆ చిన్నారిని తోసేసి.. ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలించారు. దాంతో భయపడిన ఆగంతకుడు బాలున్ని ఇంటి దగ్గరే వదిలి వెళ్లాడు. తమ కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
స్కూల్ విద్యార్థి కిడ్నాప్
రొంపిచెర్ల(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రొంపిచెర్ల హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న నాని అనే విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. ఈ మేరకు విద్యార్థి తల్లి శాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు... శాంతమ్మ- ప్రసాద్ దంపతులు కుటుంబ కలహాలతో 6నెలల నుంచి వేరువేరుగా ఉంటున్నారు. రొంపిచెర్ల మండలం వారణాసివారిపల్లెలోని పుట్టింట్లోనే శాంతమ్మ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. భర్త ప్రసాద్ సొంత ఊరైన పుంగనూరు మండలం ఒంటిమిట్ట గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. బుధవారం పాఠశాలకు వెళ్లిన నాని ఇంటర్వేల్ సమయంలో బయటకు వచ్చాడు. అదే సమయంలో మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నానిని కిడ్నాప్ చేయడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని శాంతమ్మకు తెలిపారు. ఆమె రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదుచేసింది. తన భర్త తరపు వ్యక్తులే తన కుమారున్ని కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
-
నోట్లో గుడ్డలు కుక్కి..గొంతు కోసి చంపేశారు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా జవహార్ నగర్లో రాకేష్ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డిని బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దుండగులు రూ. 8లక్షలు డిమాండ్ చేసినట్టు రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జవహార్ నగర్‌లోని సాకేత్ టవర్స్ పక్కనున్న అపార్ట్ మెంట్లో రాకేష్ రెడ్డి మృత దేహం ఉందని బంధువులు ఇచ్చిన సమాచారంతో బుధవారం రాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అతడి నోటికి గుడ్డ కట్టి తీవ్రంగా కొట్టి, గొంతుకోసి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రి తరలించారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాకేష్ రెడ్డి సోదరి విడాకులు వ్యవహారంలో ఆమె భర్తతో తలెత్తిన గొడవలు..రాకేష్ రెడ్డి మృతికి కారణమై ఉంటాయా అన్న కోణం లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. -
నలుగురు కానిస్టేబుళ్లను హతమార్చిన నక్సల్స్
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఘటన చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకానికి నలుగురు పోలీసు కానిస్టేబుళ్లు బలయ్యారు. సోమవారం అపహరించుకుపోయిన ఈ నలుగురు కానిస్టేబుళ్లను మావోయిస్టులు కాల్చిచంపి.. రోడ్డుపై పడేశారు. ఇక్కడి బీజాపూర్ జిల్లా గుద్మా గ్రామ శివార్లలోని రహదారిపై బుధవారం వారి మృతదేహాలు లభించాయి. బీజాపూర్ జిల్లా బెద్రే పోలీసు స్టేషన్లో జయరాం యాదవ్, మంగ్లు సోడి, రామా మజ్జి, రాజు తెల్లంలు సహాయ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. సోమవారం (13న) వారు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. మావోయిస్టులు అపహరించుకు వెళ్లారు. అనంతరం వారిని కాల్చి చంపేశారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసు బలగాలకు గుద్మా గ్రామ శివార్లలో రోడ్డుపై నలుగురు కానిస్టేబుళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సల్వాజుడుంలో చురుకుగా వ్యవహరిస్తూ ఆదివాసీలను వేధిస్తున్నందునే ప్రజాకోర్టులో వారిని హతమార్చినట్లు మావోయిస్టు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పేరుతో ఘటనా స్థలంలో లేఖ వదిలారు. కానిస్టేబుళ్లను మావోయిస్టులు హతమార్చడంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తవ్రంగా మండిపడ్డారు. నక్సల్స్‌ది అమానుష, పిరికి పందల చర్య అని విమర్శించారు. పోలీసు బలగాలను నైతికంగా దెబ్బకొట్టేందుకే వారు ఈ పనికి ఒడిగట్టారన్నారు. -
కిడ్నాప్ కాదు..ప్రియుడితోనే వెళ్లింది
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కిడ్నాపైన వివాహిత రాధిక విషయంలో గుట్టు రట్టైంది. ఈనెల 6న రాజేంద్రనగర్‌లో కిడ్నాపైన రాధిక కేసును పోలీసులు ఛేదించారు. రాధికది కిడ్నాప్ కాదని, ప్రియుడు రిజ్వాన్‌తో కలిసి కోల్‌కతాకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపారు. డబ్బుల కోసమే ప్రియుడుతో కలిసి రాధిక వాట్సాప్ ద్వారా భర్తను బ్లాక్ మెయిల్ చేసిందని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా 2011లో నిందితుడు రిజ్వాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరు వివాహం చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయారని డీసీపీ పేర్కొన్నారు. కాగా వివాహిత మహిళ కిడ్నాప్ విషయం కలకలం రేపింది. రాధికను కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేస్తున్నట్లు వాట్సప్ లో ఫోటోలు.. భర్తకు పంపి రిజ్వాన్ డబ్బు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
మహబూబాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్
వరంగల్: ఇంట్లో ఉన్న వ్యాపారిని ఎవరో పిలుస్తున్నారని చెప్పి..బయటకు వచ్చాక కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. పట్టణానికి చెందిన వెంశెట్టి సోమయ్య(56) ఎరువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు సంతానం అమెరికాలో స్థిరపడటంతో ఇంటి వద్ద భార్య భర్తలు మాత్రమే ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కొందరు వ్యక్తులు వచ్చి ఇంట్లో ఉన్న సోమయ్యను బయటకు పిలిచి వ్యానులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బయటకు వెళ్లిన భర్త ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గతంలో వెంశెట్టి సోమయ్య, వెంశెట్టి కృష్ణ ల మధ్య కోల్డ్‌స్టోరేజ్‌కు సంబంధించిన గొడవలు ఉండటంతో.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
హమ్మయ్య.. అమ్మానాన్నలను చేరింది
థానే: ఎట్టకేలకు ఓ పద్నాలుగేళ్ల బాలిక కిడ్నాపర్ల చెర నుంచి బయటపడింది. దాదాపు నెల రోజుల అనంతరం తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఉలన్ సాగర్ కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక గత మే 9నుంచి కనిపించకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తప్పిపోయినవారి జాబితాలో చేర్చి కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపులు మొదలు పెట్టారు. అయితే, పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నెల జూన్ 16న ఆ బాలిక బందీల చెరనుంచి తప్పించుకుని ముంబయిలోని దాదార్ ప్రాంతానికి చేరుకుంది. ఆమెను పోలీసులు చివరికి తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం కిడ్నాపర్లు ఆమెను గుజరాత్ తీసుకెళ్లి అమ్మేశారు. ఇందులో పూజా షద్దార్ అలియాస్ రుమా, శోభా జాదవ్ అనే ఇద్దరు వ్యక్తుల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆ బాలికను గుజరాత్‌లోని గోవింద్ మఖ్వానా (60) అనే వ్యక్తికి రూ.65 వేలకు అమ్మేసినట్లు వివరాలు వెల్లడించారు. దీంతో పోలీసులు మఖ్వానాను, రాజు వాజా అనే ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారు. -
హైదరాబాద్ లో యువతి కిడ్నాప్
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ఓ యువతిని కొందరు దుండగులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన మంజూష(22) అనే యువతి కూకట్‌పల్లిలోని సోదరి ఇంటికి 15 రోజుల కిందట వచ్చింది. అయితే సోమవారం రాత్రి మార్కెట్‌కు వెళ్లిన మంజూషను కారులో వచ్చిన కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
'రెండేళ్ల తర్వాత నాకొడుకు గొంతువిన్నా'
లాహోర్: దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తన కుమారుడి గొంతు విన్నానని పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ఆదివారం మీడియాకు తెలిపారు. ఒక కొత్త ఫోన్ నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అందులో మాట్లాడింది తన కొడుకేనన్న విషయం గుర్తుపట్టానని చెప్పారు. గిలానీ కుమారుడు అలి హైదర్ ను 2013లో తెహ్రిక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి అతడు ఏమై పోయాడు ఎక్కడున్నాడన్న విషయం ఇంత వరకు తెలియరాలేదు. ఉన్నట్లుండి రెండేళ్ల తర్వాత హైదర్ నుంచి ఫోన్ రావడంతో గిలానీ ఆనందంతో ఉప్పొంగారు. తాను బాగానే ఉన్నానని, మీరు, మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని అడిగారని చెప్పారు. ఎనిమిది నిమిషాలపాటు తన కుమారుడితో మాట్లాడానని, అతడు సురక్షితంగా తిరిగొస్తాడన్న నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు తన వద్ద నుంచి ఏమి డిమాండ్ చేయడం లేదని, జైళ్లో ఉన్న తమ అగ్ర నేతలను మాత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని గిలానీ చెప్పారు. అయితే, వారిలో కొందరని ఇప్పటికే వదిలేశారని, కానీ తాలిబన్లు మాత్రం తన కుమారుడిని వదిలిపెట్టకుండా మాట తప్పారని అన్నారు. సంకెళ్లతో బంధించి ఉన్నహైదర్కు చెందిన వీడియోను ఇటీవలె తాలిబన్లు పాక్ ప్రభుత్వానికి విడుదల చేశారు కూడా. -
ఎత్తుకెళ్లి.. సామూహిక లైంగిక దాడి
మీరట్: ఎన్ని చట్టాలు తెచ్చినా.. వాటినెంత కఠినంగా మార్చినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ కర్మాగారంలో పనిచేస్తున్న పదిహేనేళ్ల బాలికను నూర్ నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద అడ్డుకున్న ఇద్దరు యువకులు బెదిరించి ఆటోలో తీసుకెళ్లారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో కొట్టారు. చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక స్పృహకోల్పోవడంతో జురాన్పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను గుర్తించిన జురాన్పూర్కు చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వివరాలు సేకరించి నిందితుల కోసం గాలింపులు జరుపుతున్నారు. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
ఆరు బోగీల్లో మొత్తం 129 గ్రాముల బంగారు నగల అపహరణ ఒంగోలు: చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో(రైలు నం.12759) శనివారం రాత్రి కొంతమంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఒంగోలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రాత్రి 11.30 గంటల అనంతరం రైలు ఆగేందుకు చైన్ లాగిన దుండగులు మొత్తం ఆరు బోగీల్లో కిటికీల పక్కన ఉన్న మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. అమ్మనబ్రోలు, ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ల మధ్య రైలును ఆపి 10 నుంచి 12 మందితో కూడిన ముఠా ఈ దోపిడీకి పాల్పడ్డట్లు రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైంది. రైలు సికింద్రాబాద్ చేరిన తర్వాత పలువురు మహిళలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెళ్లికూతుర్ని చూద్దామని వెళ్లి బుక్ అయ్యాడు..
చెన్నై: మలి వయసులో తోడు కోసం పెళ్లి ప్రకటన ఇచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. ఏదో అనుకుంటే ....ఇంకేదో అయిందన్నది ఈ పెద్దాయనకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. చివరికి సమయస్ఫూర్తిగా వ్యవహరించి పెళ్లి మాట దేవుడెరుగు .. బతుకు జీవుడా అనుకుంటూ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డ వైనం చైన్నై తాంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు చెన్నైకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రామ్మూర్తి. భార్యనుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఆయనకు..ఆలోచన వచ్చిందే తడవు...వధువు కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అనుకున్నట్టుగానే స్పందన కూడా బాగానే వచ్చింది. వైష్టవి అనే 35ఏళ్ల మహిళ ఫోన్ చేసి.. కోయంబేడు బస్‌స్టాప్‌కు రమ్మని ...మిగతా వివరాలు మాట్లాడుకుందామని చెప్పింది.. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. పెళ్లికూతుర్ని చూడాలని ఆతృతగా వెళ్లిన రామ్మూర్తితో వైష్ణవి కలిసి మాటలు కలిపింది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఇంతలో నలుగురు యువకులు హఠాత్తుగా చుట్టుముట్టి రామ్మూర్తిపై దాడి చేశారు. నిమిషాల్లో వైష్ణవితోపాటు, ఆ నలుగురు యువకులు ఆయన్నిఎత్తి కారులో వేశారు. రెండు రోజులు నగరమంతా తిప్పారు. చివరికి ఒక బ్యాంక్ దగ్గరికి తీసుకువెళ్లి రామ్మూర్తి ఖాతాలో ఉన్న రూ.35 లక్షలు డ్రా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన రామ్మూర్తి తెలివిగా వ్యవహరించి తాను కిడ్నాప్ అయిన విషయాన్ని బ్యాంక్ అధికారుల చెవిన వేశాడు. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది తాంబరం పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన పోలీసు బృందం స్పాట్‌కు చేరుకుంది. అయితే దీన్ని గమనించిన ఆ ముఠా ..వైష్ణవితో పాటు అక్కడ నుంచి ఉడాయించింది. దాంతో బతుకు జీవుడా అనుకున్న రామ్మూర్తి ..అక్కడ నుంచి బయటపడ్డాడు. -
గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన పింఛన్‌దారులు
అశ్వరావుపేట (ఖమ్మం): సకాలంలో పింఛను పంపిణీ చేయలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కార్యాలయంలోనే పింఛనుదారులు నిర్బంధించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లిలోఈ నెల మంజూరైన పింఛను ఇప్పటి వరకు ఇవ్వకుండా జాప్యం చేయడంతో ఆగ్రహం చెందిన పింఛను దారులు గ్రామ కార్యదర్శిని నిర్బంధించి, పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. -
రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాల అపహరణ
కోనరావుపేట(కరీంనగర్): కొందరు గుర్తుతెలియని దుండగులు రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను అపహరించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని రామాలయంలో సోమవారం జరిగింది. వివరాలు.. కోనరావుపేట మండలంలోనే ప్రముఖ రామాలయం మామిడిపల్లి గ్రామంలో ఉంది. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోరంకిలో భారీ దొంగతనం
రూ.21 లక్షల విలువైన సొత్తు అపహరణ పోరంకి (పెనమలూరు) : పోరంకి గ్రామం నారాయణపురం కాలనీలో గురువారం వేకువజామున ఓ ఇంటి తాళాన్ని దొంగలు పగులగొట్టి రూ.21 లక్షలు విలువ చేసే సొత్తు అపహరించుకుపోయారు. పెనమలూరు పోలీ సులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి నారాయణపురం కాలనీలోని ప్లాట్ నంబరు 11లో కాంట్రాక్టర్ పెందుర్తి రంగవరప్రసాద్, పాపాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. కాగా దంపతులు బ్యాంక్ పనిమీద ఈనెల 26న జిల్లాలోని రుద్రపాక గ్రామానికి వెళ్లారు. రంగవరప్రసాద్ ఇంట్లో పని చేసే మహిళ గురువారం ఉదయం వచ్చి చూడగా ఆయన ఇంటి తాళం పగులగొట్టి ఉంది. పక్కనే ఉన్న వారి బంధువులకు ఈ విషయాన్ని చెప్పింది. వారు అందజేసిన సమాచారంతో తూర్పు డివిజన్ ఏసీపీ మహేశ్వరరాజు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. దీనిపై సమాచారం అందుకున్న రంగవర ప్రసాద్ దంపతులు తిరిగి వచ్చి బీరువాలో దాచిన దాదాపు 70 కాసుల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి వస్తువులు, రూ.90 వేల నగదు, 12 పట్టుచీరలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. మేనల్లుడి పెళ్లి ఉండటంతో బంగారమంతా ఇంట్లోనే ఉంచామని, అవన్నీ చోరీకి గురయ్యాయని బాధిత దంపతులు పోలీసులకు వివరించారు. పెళ్లి కోసం ఉంచిన వస్తువులు ఎత్తుకెళ్లారు కాగా రంగవరప్రసాద్ మేనల్లుడు పాలడుగు రాజేష్‌కుమార్ పెద ఓగిరాలలో ఉంటున్నాడు. అతనికి తండ్రి లేడు. రాజేష్‌కుమార్ నిశ్చి తార్థం వచ్చేనెల 22న వివాహం మార్చి నాలుగో తేదీన ఉంది. ఈ పెళ్లిని వీరే జరి పించాల్సి ఉంది. వివాహం కోసం రాజేష్ 20 కాసుల బంగారాన్ని మేనమామ ఇంటిలో ఉంచాడు. అపహరణకు గురైన సొత్తులో అవి కూడా ఉన్నాయి. పెనమలూరు పోలీస్‌స్టేషన్ సిబ్బందితోపాటు సీసీఎస్ సీఐ సుబ్బారావు సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉన్నా.. ఇదిలా ఉండగా, కాలనీలో దొంగలు 44, 45 ప్లాట్లతో పాలు పలు ఇళ్లలో చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వాటి యజమానులు ఇళ్లలో ఉండటంతో దొంగల ప్రయత్నం ఫలించలేదు. కాలనీలో సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉన్నా దొంగలు చాకచక్యంగా భారీ చోరీకి పాల్పడటంతో స్థాని కులు, పోలీసులు కంగుతిన్నారు. రంగవరప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆఫీసులో దాచిన బంగారం మాయం సత్యనారాయణపురం : ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగుల కొట్టి నగలు, నగదు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం అడివి శేషగిరిరావు వీధిలో సి.హెచ్.దుర్గారావు నివసిస్తున్నారు. ఇతను ఇటీవల ఇల్లు ఖాళీ చేసి పటమటకు వెళ్లి పోయారు. గతంలో ఉన్న ఆ ఇంటిని ఆఫీసుగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బ్యాంక్‌నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఆఫీసులో ఉంచారు. ఎప్పటిలానే బుధవారం తాళ ం వేసి వెళ్లారు. గురువారం వచ్చి చూసే సరికి తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా అల్మారాలో ఉంచిన తొమ్మిది గ్రాముల నగలు, రెండు వేల నగదు కనిపించలేదు. దీంతో సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సింగ్‌నగర్‌లో మరో ఘటనలో... మధురానగర్ : సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంటిలో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ ఎక్సెల్‌ప్లాంట్ రోడ్డులో బొకెనాల శాంతి కుటుంబం నివాసం ఉంటోంది. శాంతి 27న ఇంటికి తాళం వేసి తల్లితో కలసి గొల్లపూడి నల్లకుంటలో ఉంటున్న చెల్లెలి ఇంటికి వెళ్లారు. 28వ తేదీ రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి వెనుక తలుపు తెరచి ఉంది. ఇంట్లోని బీరువా పగులగొట్టి ఉంది. ఇంట్లోని 57 గ్రాముల బంగారు వస్తువులు, బ్రాస్లెట్, రింగ్, చెవిదిద్దులు, పట్టీలు,30 వేల నగదు మాయమయ్యాయి. శాంతి తల్లి మిర్యాల సత్యవతి ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ పరిస్థితిని పరిశీలించారు. -
చిన్నారి అపహరణ...విడుదల
హైదరాబాద్: బాలికను కిడ్నాప్ చేసి... చెవి పోగులు, కాళ్ల పట్టాలు తీసుకొని వదిలేసిన ఘటన కాప్రా జమ్మిగడ్డలో కలకలం సృష్టించింది. జవహర్ నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.... జమ్మిగడ్డ భరత్ నగర్ లో ఉండే దారావత్ రాజు, స్వరూప దంపతుల కుమార్తె ధృతి (5). స్థానిక హిందూ బ్రిలియంట్ స్కూల్ లో ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తన ఇంటి ముందు ఆడుకుంటున్న ధృతి వద్దకు ఓ మహిళ వచ్చి తనతో వస్తే చాక్లెట్ కొనిస్తానని చెప్పి...ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని సాకేత్ సమీపంలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్దకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ గల్లిలో బాలిక చెవులకు ఉన్న 2 గ్రాముల బంగారు పోగులు, 5 తులాల కాళ్లపట్టీలను తీసుకుని పారిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సమీప ఠాణాలకు సమాచారం ఇచ్చారు. రాత్రి 7.20కి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కుషాయిగూడ పోలీసులకు సాకెత్ వద్ద చిన్నారి ధృతి ఏడుస్తూ కనిపించగా వారు జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా బాలికను అపహరించిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సినీఫక్కీలో చోరీ
* బంగారం దొరికిందని నమ్మబలికి.. * మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు అపహరణ * హాలియాలో ఘటన హాలియా: గుర్తుతెలియని వ్యక్తులు మహిళకు మాయమాటలు చెప్పి సినీఫక్కీలో బంగారు పుస్తెలతాడును అపహరించారు. ఈ ఘటన హాలియాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనుముల గ్రామానికి చెందిన పావనగండ్ల సత్యవతి కొద్దిరోజులుగా నడుమునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చూపించుకునేందుకు ఉదయం ఆటోలో హాలియాకు వచ్చింది. మిర్యాలగూడ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఫలానా ఆస్పత్రి ఎక్కడా అంటూ సత్యవతిని అడిగింది. తనకు కూడా తెలియదని సత్యవతి బదులిచ్చింది. దీంతో సదరు గుర్తుతెలియని మహిళ మాటలు కలిపి సత్యవతితో కలిసి ముందుకు సాగింది. ఇంతలో మరో ఇద్దరు, ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎదురొచ్చి మాది రూ.3 లక్షల విలువ గల బంగారు కడ్డీ పోయిందని, అది మీకు దొరికిందా అని అడిగారు. దీంతో సత్యవతి, సదరు గుర్తుతెలియని మహిళ దొరకలేదని సమాధానం చెప్పడంతో వారు వెళ్లిపోయారు. బంగారు కడ్డీ దొరికిందని.. బంగారం పోయిందని అడిగిన వారు నాలుగు అడుగులు ముందుకేసిన తరువాత సదరు గుర్తుతెలియని మహిళ ఆ బంగారు కడ్డీ నాకే దొరికిందని సత్యవతితో చెప్పింది. ఎవ్వరికి చెప్పనంటే ఇందులో సగం నీకు ఇస్తానని సత్యవతితో పేర్కొంది. ఇక్కడ ఎవరైనా చూస్తారని, కాస్త ముందుకెళ్లి చెరిసగం పంచుకుందామని నమ్మబలికింది. దీంతో ఇద్దరూ కలిసి ఎస్సీ కాలనీవైపు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో గుర్తుతెలియని వ్యక్తి వద్దకు వెళ్లి బేరసారాలు మొదలు పెట్టారు. బంగారు కడ్డీ తుంచడం వీలుకాదని.. నీ మెడ మీద ఉన్న బంగారు పుస్తెలతాడు ఇస్తే ఈ బంగారు కడ్డీ ఇస్తామని చెప్పారు. అందుకు సత్యవతి ససేమిరా అనడంతో ఆ గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. నమ్మకం లేకపోతే మా సెల్ నంబర్ తీసుకో అంటూ హుంకరించాడు. దీంతో చేసేది లేక సత్యవతి బంగారు పుస్తెలతాడు ఇచ్చి, ఆ కడ్డీని తీసుకుంది. సెంటర్‌కు వచ్చి ఈ విషయాన్ని ఫోన్లో భర్తకు తెలపడంతో మోసపోయావంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ సురేష్‌కుమార్‌తో కలిసి ఎస్సీ కాలనీకి వచ్చి చూసే సరికి వారు అక్కడి నుంచి పరారయ్యారు. తీరా పోలీసులు ఆ బంగారు కడ్డీని పరీక్షించగా నకిలీదని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
ఉపాధ్యాయ దంపతులు కిడ్నాప్
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయ దంపతులు అపహరణకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు దంపతులను అపహరించుకు వెళ్లారు. భూవివాదంగానే వారిని కిడ్నాప్ చేసి ఉంటారని బంధువులు భావిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దంపతుల కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏకంగా ఏటీఎమ్‌ను ఎత్తుకెళ్లారు
హైదరాబాద్: దొంగలు ఏటీఎమ్‌లో నగదు దోచుకోవడానికి యత్నించడం, సాధ్యం కాకపోతే ఏకంగా ఏటీఎమ్లనే ఎత్తుకెళ్తున్నారు. ఎన్ని భద్రత చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఎస్బీఐ ఏటీఎమ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో 10.40 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు సమాచారం. -
సినీఫక్కీలో దోపిడీ
- ఆర్కెస్ట్రా నిర్వాహకుడికి టోకరా - రూ.1.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ పెదకాకాని: సినీ ఫక్కీలో ఆర్కెస్ట్రా అభిమానిగా పరిచయమై అతని బండిపైనే వచ్చి రూ.1.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు భాగ్యనగర్ రెండో లైనుకు చెందిన షేక్ శివనాగూర్ వలి పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్కెస్ట్రా పార్టీ నిర్వహిస్తుంటాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీరు ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ కదూ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘త్వరలో తమ ఇళ్ల వద్ద ఫంక్షన్ ఉంది ఆర్కెస్ట్రా కావాలి, నువ్వు వస్తే మా వాళ్లు బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇస్తారు’ అని చెప్పాడు. అందుకు అంగీకరించిన శివనాగూర్‌వలి తన బైక్‌పై ఆ గుర్తు తెలియని వ్యక్తిని వెనుక కూర్చోబెట్టుకుని అతను చెప్పిన వైపు బండి తిప్పాడు. సుమారు 12.30 గంటల సమయంలో మండల పరిధిలోని గడ్డిపాడు ఇన్నర్‌రింగ్ రోడ్డుకు చేరుకున్నారు. అగతవరప్పాడు సమీపంలో పక్కనే ఉన్న మట్టిరోడ్డులోకి బండి పోనియమనడంతో కొంతదూరం పోయేసరికి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బురదగా ఉండి బండి ఇరుక్కుపోయింది. వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి ముందుగా బండి దిగి బలంగామొఖంపై గుద్ది అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. వంటిపై ఉన్న బంగారు వస్తువులన్నీ ఇవ్వాలంటూ కొట ్టడంతోపాటు చంపుతానని బెదిరించడంతో శివనాగూర్‌వలి ప్రాణ భయంతో వణికిపోయాడు. ఆయన వద్ద ఉన్న నాలుగు ఉంగరాలు, చైన్, బ్రాస్లెట్, సెల్‌ఫోన్, సొనాటా వాచ్‌ని దోచుకుని పరారయ్యాడు. అర్ధరాత్రి రోడ్డుపైకి చేరిన బాధితుడు రోడ్డుపై వెళ్లేవారి సూచన మేరకు పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన సంగతి పోలీసులకు వివరించాడు. ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి గుంటూరు అర్బన్ నార్త్‌జోన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు, పెదకాకాని సీఐ కొంకా శ్రీనివాసరావు, సిబ్బంది చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.