నా తమ్ముడి ప్రాణాలకు హాని జరిగితే నరికేస్తా: తారా చౌదరీ
వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుందనే ఆరోపణలపై అరెస్టైన సినీ నటి తారా చౌదరీ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తన బావతో ఓ స్కార్పియో వాహనం విషయంలో వివాదం చోటు చేసుకుంది. వాస్తవానికి స్కార్పియో వాహనం తన బావ పేరుతో ఉన్న .. తాను రుణ వాయిదాలను చెల్లించాని తారా చౌదరీ తెలిపింది. అయితే తన బావ వద్ద ఉన్న స్కార్పియో వాహనం తనదేనని వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదును సీఐ బాలసుబ్రమణ్యం పట్టించుకోలేదని తారా ఆరోపణలు చేసింది. ఆతర్వాత తన తమ్ముడు భాస్కర్ ను తన బావకు సంబంధించిన కొందరు మనుషులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కు గురైన తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు ఉంది అని తారా చౌదరీ రోదిస్తూ మీడియాకు మొరపెట్టుకుంది.
తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు కలిగిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించింది. తన తమ్ముడి ప్రాణాలకు హాని జరిగితే నడిరోడ్డు మీదే నరికేస్తా అని పోలీస్ స్టేషన్ వద్ద హడావిడి చేసింది. తన తమ్ముడు కిడ్నాప్ కు గురయ్యాడని తారా చౌదరీ ఇచ్చిన ఫిర్యాదును తాము తీసుకుని.. విచారణ చేపట్టామని సీఐ బాలసుబ్రమణ్యం తెలిపారు.