tara chowdary
-
తారాచౌదరి బావ అరెస్ట్
బంజారాహిల్స్: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమేగాక తన ఆస్తులపై కన్నేసి ఇబ్బందులకు గురి చేసిన మేన బావపై సినీ నటి తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు చావా రాజ్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఉదయ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి ఇంటికి 2016 నవంబర్‌లో వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్ అతని సోదరి సుజాత ఇద్దరూ వచ్చారు. తారా చౌదరిని పెళ్లి చేసుకుంటానని రాజ్‌కుమార్ చెప్పగా నీకు ఇంతకు ముందే పెళ్ళి అయింది కదా ఎలా చేసుకుంటావంటూ ఆమె ప్రశ్నించింది. మొదటి భార్యకు విడాకులు ఇస్తాడని అతని సోదరి సుజాత చెప్పింది. అందుకు తారా చౌదరి ఒప్పుకోకపోవడంతో రాజ్‌కుమార్ ఆమెను బెదిరించి లోబర్చుకున్నాడు. అనంతరం గణపతి కాంప్లెక్స్ సమీపంలోని ఆమె అపార్ట్మెంట్లోనే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్‌కుమార్ ఆమె ఆస్తులను అమ్మి డబ్బు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాడు. అందుకు తారాచౌదరి నిరాకరించడంతో వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. రెండేళ్లుగా తాము భార్యాభర్తల్లా కలిసి ఉన్నామని తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ఈ నెల 10న తారా చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిరోజూ స్టేషన్‌కు వచ్చి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తుండటంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం గుంటూరులో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులకు నటి తారా చౌదరి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమేగాక తన ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్నాడని సినీ నటి రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సినీ నటి తారా చౌదరి శ్రీనగర్‌కాలనీ సమీపంలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలోని అపార్ట్మెంట్లో ఉంటోంది. 2016లో ఆమెకు వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్ తన సోదరి సుజాతతో కలిసి గుంటూరులోని తారా చౌదరి ఇంటికి వచ్చాడు. తాను తారా చౌదరిని పెళ్ళి చేసుకుంటానని చెప్పగా ఇంతకుముందే పెళ్లయినందున ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది. దీంతో రాజ్‌కుమార్ సోదరి సుజాత కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాల్సిందిగా తెలిపింది. అనంతరం అతను పలుమార్లు విజయవాడ, హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చి తాను విడాకులు తీసుకుంటానని ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెస్పాడు. అనంతరం ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీవనం చేయసాగారు. అందరికీ తన తారా చౌదరిని తన భార్యగా పరిచయం చేసేవాడు. కొద్ది రోజుల అనంతరం తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని నీ ఆస్తులు విక్రయించి ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, గత రెండేళ్లుగా రాజ్‌కుమార్ తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు చావా రాజ్‌కుమార్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆడపడచు పై దాడి చేసిన తారా చౌదరి
-
నా జీవితంపై త్వరలో సినిమా తీస్తా..
హైదరాబాద్ : తనకు జరిగిన అన్యాయంపై త్వరలో సినిమా తీస్తానని సినీ నటి తారా చౌదరి అన్నారు. ఆమె సోమవారం ఈ విషయాన్ని సాక్షితో వెల్లడించారు. సినిమా కథకు కసరత్తు జరుగుతుందని, సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తానే చేపట్టే అవకాశముందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన లాభాలతోనే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఓ భారీ బడ్జెట్ సినిమాను తీసి, తర్వాత తన జీవిత కథ ఆధారంగా మరో సినిమా ఉంటుందన్నారు. ప్రజా సేవే ధ్యేయంగా తాను జీవితంలో ముందుకు వెళతానన్నారు. -
తారా చౌదరి ఇంట్లో గొడవ...ముగ్గురిపై కేసు
హైదరాబాద్:సినీ నటి తారా చౌదరి నివాసంలో గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ ఫేజ్-3 వివేకానంద స్కూల్ సమీపంలో సినీ నటి తారాచౌదరి అలియాస్ రావిళ్ల రాజేశ్వరి నివాసముంటోంది. నివాసంతో పాటు సినిమా కార్యాలయం కూడా అక్కడ కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె నివాసంలో రామినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో తారాచౌదరిని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె...గత కొద్ది రోజుల నుంచి సినిమాలో హీరో వేషం కోసం తన కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వీరమాచినేని సందీప్ అనే యువకుడిని పిలిపించింది. దీంతో సందీప్ తన స్నేహితుడు ఉదయ్, రాజేష్‌ను వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ హల్చల్ చేస్తున్న దుర్గాప్రసాద్‌ను సందీప్ అడ్డుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తన భార్యతో గొడవ పడుతుంటే మధ్యలో మీకెందుకంటూ ప్రసాద్ వారిని నెట్టివేశాడు. సందీప్ రాయితో కొట్టడంతో ప్రసాద్‌కు గాయాలయ్యాయి. గొడవ పెద్దది కావటంతో తారాచౌదరి రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వారందరినీ స్టేషన్‌కు తరలించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్, ఉదయ్, రాజేష్‌లపై పోలీసులు ఐపీసీ 448, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
టీఆర్ఎస్లో చేరనందుకే నాపై వివక్ష: రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాను లేవనెత్తిన అంశాలపై ఏ విచారణకైనా సిద్ధమని టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో తాను ప్రస్తావించిన విషయాలపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని, దాన్ని తిరస్కరించినందుకే తనను హింసిస్తున్నారని ఆరోపించారు. తనకు ఎవరితోనో సంబంధాలున్నాయని అమ్మాయిలతో ఫోన్‌చేసి తిట్టిస్తున్నారని, పైగా తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తారాచౌదరి వ్యవహారంలో తన ప్రమేయాన్ని బయటపెట్టాలని సవాల్ విసిరారు. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా నిజామాబాద్ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు, హైదరాబాద్ లో సమాచార శాఖ తీసిన వీడియో క్లిప్పింగులు, ఇతర దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. ఉరిశిక్ష పడిన వారికి కూడా తమ వాదనను వినిపించే అవకాశం ఉంటుందని, తన విషయం లో వివక్ష చూపడం భావ్యంగా లేదన్నారు. -
నటి తారా చౌదరిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ : నటి తారా చౌదరిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే తారాచౌదరి ఇంటికి విజయవాడకు చెందిన ఆమె స్నేహితుడు దుర్గాప్రసాద్ ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం దుర్గాప్రసాద్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సోమవారం ఉదయం తారాచౌదరి ఇంటికి వచ్చి చంపేస్తానని బెదరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. గతంలోనూ తారా చౌదరి తన పట్ల వాచ్మెన్ సుబ్రహ్మణ్యం అసభ్యంగా ప్రవర్తించి, దాడికి యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
వాచ్మెన్పై నటి తారా చౌదరి ఫిర్యాదు
హైదరాబాద్: నటి తారా చౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సెక్స్ రాకెట్ కేసులో ఒకప్పుడు రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారిన ఆమె తాజాగా వాచ్మెన్ వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. సోమవారం రాత్రి హఠాత్తుగా ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అయ్యింది. తన పట్ల వాచ్మెన్ సుబ్రహ్మణ్యం అసభ్యంగా ప్రవర్తించి, దాడికి యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి తాము నివాసం ఉండే అపార్ట్మెంట్ ఎదురుగా ఉండే కిరాణ దుకాణం యజమాని కూడా సహకరిస్తున్నాడని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన రావెళ్ల రాజేశ్వరి.. అలియాస్ తారా చౌదరి గతంలో తనను వేధిస్తున్నారని, ప్రాణభయం ఉందంటూ అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు తనకు సినిమా అవకాశాలు ఇస్తానని రచయిత చిన్నికృష్ణ మోసం చేశారంటూ ఆత్మహత్యాయత్నం చేసి కలకలం సృషించింది. ఆ తర్వాత తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారంటూ ఆమె గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా కెక్కింది. -
'సీఐపై ఫిర్యాదు చేసినందుకు దాడి'
గుంటూరు: ఓ సీఐ అవినీతి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాననే కక్షతో తనను కిడ్నాప్ చేసి హతమార్చేందుకు యత్నించారని ఓ యువకుడు తెలిపాడు. వినుకొండకు చెందిన రావెళ్ళ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ టౌన్ సీఐ శివసుబ్రమణ్యం పట్టణంలోని అవినీతికి పాల్పడుతున్నడని వారం రోజుల కిందట ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరాలు అందించాడు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్న సీఐ కక్ష కట్టాడు. ఈ క్రమంలో మంగళవారం వినుకొండలో సిద్దార్థనగర్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతున్నాను. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న కొండలు, రామకృష్ణ, అప్పారావు, ముకేష్, వెంకట్, శ్యామ్ వాహనాన్ని అడ్డగించారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని అటవీప్రాతంలోకి తీసుకువెళ్లి సీఐపై ఫిర్యాదు చేస్తావా అంటూ దుర్భాషలాడి కరల్రతో తీవ్రంగా కొట్టారు. అటువైపుగా వ్యక్తులు వస్తున్నట్లు అలికిడి కావటంతో పక్కకు వెళ్లడంతో అక్కడినుంచి తప్పించుకుని ఇంటికి చేరాడు. సోదరి తారాచౌదరి సాయంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. తన సోదరి సోమవారం సాయంత్రం కారులో వస్తుండగా కారును అటకాయించి దుర్భాషలాడారని వివరించాడు. సీఐ నుంచి ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని కలిసి కోరనున్నట్లు తెలిపాడు. -
నా తమ్ముడి ప్రాణాలకు హాని జరిగితే నరికేస్తా: తారా చౌదరీ
వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుందనే ఆరోపణలపై అరెస్టైన సినీ నటి తారా చౌదరీ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన బావతో ఓ స్కార్పియో వాహనం విషయంలో వివాదం చోటు చేసుకుంది. వాస్తవానికి స్కార్పియో వాహనం తన బావ పేరుతో ఉన్న .. తాను రుణ వాయిదాలను చెల్లించాని తారా చౌదరీ తెలిపింది. అయితే తన బావ వద్ద ఉన్న స్కార్పియో వాహనం తనదేనని వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదును సీఐ బాలసుబ్రమణ్యం పట్టించుకోలేదని తారా ఆరోపణలు చేసింది. ఆతర్వాత తన తమ్ముడు భాస్కర్ ను తన బావకు సంబంధించిన కొందరు మనుషులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కు గురైన తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు ఉంది అని తారా చౌదరీ రోదిస్తూ మీడియాకు మొరపెట్టుకుంది. తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు కలిగిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించింది. తన తమ్ముడి ప్రాణాలకు హాని జరిగితే నడిరోడ్డు మీదే నరికేస్తా అని పోలీస్ స్టేషన్ వద్ద హడావిడి చేసింది. తన తమ్ముడు కిడ్నాప్ కు గురయ్యాడని తారా చౌదరీ ఇచ్చిన ఫిర్యాదును తాము తీసుకుని.. విచారణ చేపట్టామని సీఐ బాలసుబ్రమణ్యం తెలిపారు.