
నా జీవితంపై త్వరలో సినిమా తీస్తా..
హైదరాబాద్ : తనకు జరిగిన అన్యాయంపై త్వరలో సినిమా తీస్తానని సినీ నటి తారా చౌదరి అన్నారు. ఆమె సోమవారం ఈ విషయాన్ని సాక్షితో వెల్లడించారు. సినిమా కథకు కసరత్తు జరుగుతుందని, సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తానే చేపట్టే అవకాశముందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన లాభాలతోనే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఓ భారీ బడ్జెట్ సినిమాను తీసి, తర్వాత తన జీవిత కథ ఆధారంగా మరో సినిమా ఉంటుందన్నారు. ప్రజా సేవే ధ్యేయంగా తాను జీవితంలో ముందుకు వెళతానన్నారు.