autobiography
-
అన్ని పక్షాలు కలిస్తేనే ప్రభుత్వం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వమంటే అధికార పక్ష సభ్యులే కాదని, అన్ని పార్టీల సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వమని, కేవలం 65 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను మాత్రమే ప్రభుత్వంగా భావించడం పొరపాటని పేర్కొన్నారు. ఎన్నికల సమ యంలో మాత్రమే వేర్వేరుగా పోరాడాలని, ఎన్నికల తర్వాత అన్ని వర్గాలు కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం సాగించాల్సి ఉంటుందని అన్నారు. తమిళనాడు, మహారాష్ట్రల మాజీ గవ ర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకా న్ని ఆదివారం తాజ్ కృష్ణ హోటల్లో హరియణా, ఒడిశా గవర్నర్లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తదితరులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.అప్పట్లో చర్చలతో సమస్యలు పరిష్కారమయ్యేవి‘పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంత సమయం మైక్ ఇస్తారో.. ప్రధాన ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం మైక్ ఇస్తారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువే అయినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాలా విషయాలు లేవనెత్తేవారు. కమ్యూనిస్టులు కూడా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారు. అసెంబ్లీ వాయిదా పడితే పాలక పక్షం, ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వాతావరణం నెలకొల్పేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 13 నెలల ప్రజాపాలనలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడిని కూడా సస్పెండ్ చేయలేదు..’ అని సీఎం చెప్పారు.అన్ని పార్టీల సహకారం అవసరం‘రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీల సహకారం అవసరం. సమస్యలొస్తే తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి అవుతాయి. అలాంటి సంస్కృతి తెలంగాణలో కూడా పెరగాలి. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలి. సమీపంలోని అమరావతితో కాదు. హైదరాబాద్ విశ్వనగరంలా మారాలంటే మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. రీజినల్ రింగ్ రోడ్డు, రిజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టులపై కేంద్రం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.అందుకు కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రాష్ట్రానికి సముద్ర మార్గం లేనందున డ్రైపోర్టును, ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీని తెలంగాణకు ఇచ్చేలా ప్రధానిని అడగాలి. గోదావరి నీటి వినియోగం పూర్తిగా జరగాలనే ఉద్దేశంతోనే రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాణహిత–చేవెళ్ల చేపట్టారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర భూభాగాన్ని తెలంగాణకు ఇవ్వాలి. ఇందుకు విద్యాసాగర్‌రావు, బీజేపీ పెద్దలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.విద్యార్థి రాజకీయాల్లేకుంటే చైతన్యం ఉండదు‘వర్సిటీల్లో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను ప్రోత్సహించాలి. విద్యార్థి రాజకీయాలు లేకుంటే చైతన్యం ఉండదు. సమస్యలకు పరిష్కారం తొందరగా దొరకదు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు అందుతాయి. జూన్ రెండో తేదీ నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యాసాగర్రావుగారి వ్యక్తిగతం ఎవరూ విమర్శించరని రేవంత్ చెప్పారు. రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న తమిళనాడు రాష్ట్రానికి, అలాగే ఆర్థిక కేంద్రం మహారాష్ట్రకు ఒకేసారి గవర్నర్‌గా పనిచేసిన ఆయన..జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచారని కొనియాడారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కరీంనగర్‌కు చెందిన విద్యాసాగర్‌రావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన పనితీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, మాజీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు.అన్ని పార్టీలు అభివృద్ధి కోసం పోరాడాలియువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని విద్యాసాగర్‌రావు అన్నారు. మూసీ నది పరిరక్షణ అత్యవసరమని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాని సూచించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రైవేటు బిల్లులు ఆమోదింపజేసిన ఘనత ఉందని, ఈ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని అనుసరించాలని ఆకాంక్షించారు. -
బాపూ సమరం తెరపై చూపుదాం
‘రక్త మాంసాల దేహంతో అలా ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్మరు’ అన్నాడు ఐన్‌స్టీన్. టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్, జె.ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా దాకా... ఎందరో గాంధీజీ వల్ల ప్రభావితం అయ్యారు. గాంధీజీ ఆత్మకథ పిల్లలందరూ చదవాలి. లేదా కనీసం ఆయన పై వచ్చిన సినిమాలు చూడాలి. గాంధీపై వచ్చిన కొన్ని సినిమాలు. అలాగే గాంధీ గారి వల్ల వచ్చిన సినిమాలుమోడర్న్ టైమ్స్: 1936లో వచ్చిన ఈ సినిమా నేటికీ గొప్ప క్లాసిక్‌గా నిలిచి ఉంది. యంత్రం కంటే మానవుడే గొప్పవాడు అని చెప్పే సినిమా అది. చార్లి చాప్లిన్ ఈ సినిమా తీసి నటించడానికి కారణం గాంధీ మహాత్ముడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ లండన్ వెళ్లినప్పుడు అక్కడ చార్లీ చాప్లిన్‌ను కలిశాడు. అప్పటి వరకూ చార్లీ చాప్లిన్ యంత్రాలు మనుషులను శ్రమ నుంచి విముక్తి చేస్తాయని భావించాడు. కాని గాంధీజీ చెప్పిన మాటల వల్ల యంత్రాలు మనిషికి సహాయం చేయడం కంటే అతడికి పని కోల్పోయేలా చేయడమే గాక బానిసగా చేసుకుంటున్నాయని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రభావంతోనే చాప్లిన్ మోడర్న్ టైమ్స్ తీశాడు.ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ: భారతదేశంలో గాంధీ అడుగు పెట్టి బ్రిటిష్ వారిపై పోరాడక ముందు దక్షిణాఫ్రికాలో ఆయన వర్ణ వివక్షపై పోరాడాడు. గాంధీలోని పోరాటగుణం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచే సాహసం దక్షిణాఫ్రికాలోనే రూపుదిద్దుకున్నాయి. అక్కడ ఒక చలిరాత్రి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి గాంధీని కిందకు దించి అవమానించారు, ఆయన దగ్గర టికెట్ ఉన్నా, నల్లవాళ్లు ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించకూడదని. ప్రతి వ్యక్తికీ ఆత్మగౌరవంతో, స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో, సమాన భావనతో జీవించే హక్కు ఉందని చాటడమే గాంధీజీ జీవన సందేశం. అది ‘ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా’లో చూడవచ్చు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలైంది. రజత్ కపూర్ గాంధీగా నటించాడు.లగే రహో మున్నాభాయ్: గాంధీజీ అంటే చౌరస్తాలో కనిపించే ఒక విగ్రహం కాదు, గాంధీ జయంతి రోజు స్కూళ్ల సెలవుకు కారణమయ్యే ఒక వ్యక్తి కాదు... గాంధీజీ అంటే జీవన మార్గదర్శి. జీవితం నిర్భయంగా సాగాలంటే గాంధీజీ అనుసరించిన మార్గంలో నడిస్తే చాలు. ఆశ, దురాశ, అవినీతి, ఆడంబరం... ఇవన్నీ లేకపోతే జీవితం సులభంగా ఉంటుందని చెప్పే సినిమా ‘లగే రహో మున్నాభాయ్’. 2006లో వచ్చిన ఈ సినిమా గాంధీజీని కొత్త తరానికి మరోసారి పరిచయం చేసింది. అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాణి సాధించాడు. వీధి రౌడీగా ఉండే ఒక వ్యక్తి గాంధీ ప్రభావంతో ఎలా మారాడనేది కథ. సంజయ్ దత్ హీరో.గాంధీ మై ఫాదర్: ఇది మొదట తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. మహాత్ములు విశాల ప్రజానీకం కోసం ఎన్ని త్యాగాలు చేసినా కుటుంబం దృష్టికోణంలో వాళ్లేమిటి అనేది కూడా ముఖ్యమే. మహాత్మునిగా గాంధీజీ ఆరాధ్యనీయుడు. కాని సొంత కొడుకు దృష్టిలో ఆయన గొప్ప తండ్రిగా ఉన్నాడా? గాంధీ కుమారుడు హరిలాల్ తన తండ్రి గాంధీలా లేదా గాంధీ అనుయాయుల్లా ఏనాడూ వెలుగులోకి రాలేదు. తండ్రి మీద ఎన్నో ఫిర్యాదులు పెట్టుకున్నాడు. అతని ఆత్మకథ ఆధారంగా తీసిన సినిమా ‘గాంధీ మై ఫాదర్’. 2007లో వచ్చిన ఈ సినిమాలో గాంధీ కుమారుడు హరిలాల్గా అక్షయ్ ఖన్నా నటించాడు.గాంధీ: మన మహాత్ముని సినిమాను మన దర్శకులు తీయలేకపోయినా బ్రిటిష్ డైరెక్టర్ తీశాడు. ఏ బ్రిటిషర్ల మీద గాంధీజీ పోరాడారో ఆ బ్రిటిష్ జాతి నుంచి అటెన్ బరో వచ్చి ఈ సినిమా తీసిప్రాయశ్చిత్తం చేసుకున్నాడని భావించాలి. గాంధీ జీవితంపై సినిమా తీసేందుకు 1952 తర్వాత నుంచి ప్రయత్నాలు జరిగాయి. రిచర్డ్ అటెన్ బరోనే 1960ల్లోనే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 1980 నవంబర్‌లో అటెన్ బరో ఈ సినిమా షూటింగ్ప్రారంభించారు. 1981 మే నెలలో షూటింగ్ పూర్తి అయింది. గాంధీ పాత్రను బెన్ కింగ్స్లే పోషించారు. నెహ్రూ పాత్రలో రోషన్ సేథ్, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే పాత్రలో హర్‡్ష నాయర్ నటించారు. 1982 నవంబర్ 30న ఢిల్లీలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమాను అమెరికా, బ్రిటన్ లలో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు గొప్ప స్పందన వచ్చింది. గొప్ప కలెక్షన్లు సాధించింది. ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. మహాత్మాగాంధీని తెరపై కళ్లకు కట్టినట్లు చూపిన బెన్ కింగ్స్లేకి ఆస్కార్ అవార్డు లభించింది. -
Duvvuri Subbarao: వృద్ధి, వడ్డీ రేటు మార్పులకు ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు. సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్బీఐ చీర్లీడరుగా ఉండాలన్న డిమాండ్‌కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు. చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. -
కమెడియన్ బ్రహ్మానందం మరో టాలెంట్.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బ్రహ్మానందం పేరు చెప్పగానే మనలో చాలామంది ముఖంపై ఆటోమేటిక్‌గా నవ్వు వచ్చేస్తుంది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోవడం, వయసు అయిపోవడంతో సినిమాలు బాగా తగ్గించేశారు. ఇలాంటి టైంలో తనలోని వేరే టాలెంట్స్‌ని బయటకు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు అలా ఓ పని చేయగా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) బ్రహ్మానందం అనగానే కమెడియన్ అనే గుర్తొస్తుంది. అయితే ఆయనలో మంచి ఆర్టిస్టు కూడా ఉన్నాడు. చాలాసార్లు దేవుడి చిత్రాల్ని తన చేతులతో గీశారు. వాటిని పలువురు హీరోలకు బహుమతిగా ఇచ్చారు. లాక్డౌన్ టైంలో బ్రహ్మీలో డ్రాయింగ్ ప్రతిభ బయటపడింది. ఇప్పుడు ఏకంగా ఈయనలో రైటప్ ఉన్నాడని తెలిసింది. 'నేను' పేరుతో తన జీవితాన్నే పుస్తకంగా రాసి ప్రచురించేశారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. 'నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది. ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతిఒక్కరికీ ఈ బుక్ ఇన్సిపిరేషన్ అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, దీన్ని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని చిరు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇకపోతే ఈ పుస్తకం ధర రూ.275. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇది అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/0wg2p7LqNF — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
ఇస్రో చైర్మన్ ఆత్మకథ
తిరువనంతపురం: ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్ కాలేజీకి పాత డొక్కు సైకిల్ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు. -
పీవీఆర్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ అన్‌స్టాపబుల్ పేరుతో ఆటోబయోగ్రఫీ
పీవీఆర్ సంస్థ దక్షిణాది నిర్వాహకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనా చాబ్రియా తన జీవిత చరిత్రను అన్ స్టాపబుల్ పేరుతో రాసుకున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నె, రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాజేష్, మైక్ సెట్ శ్రీరామ్, ఆటో అన్నాదురై, నిర్మాత యువరాజ్ గణేశన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనే ముందు తాను మీనా చాబ్రియా గురించి తెలుసుకోదలచానన్నారు. దీంతో ఆమెకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే విడాకులు పొందిన ఇద్దరు పిల్లల తల్లి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చూస్తే.. తనకు తన తల్లి జ్ఞాపకం వచ్చిందన్నారు. సినిమా రంగంలోకి తాను ప్రవేశించిన కొత్తలో నటిగా నువ్వు ఏం చేస్తావు? అని పలువురు ఎగతాళి చేశారన్నారు. అయితే అలాంటి అవమానాలను దాటి ఎదిగి తాను అన్ స్టాపబుల్ గా నిలిచానన్నారు. దీన్ని పేరుగా పెట్టిన మీనా చాబ్రియా రాసిన పుస్తకం మంచి సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తాను పుస్తకాలు ఎక్కువగా చదవనని, అయితే ఈ పుస్తకాన్ని చదవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే తాను మహిళ ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటించడం వల్ల తనకు పురుషులంటే ద్వేషం అని భావించరాదన్నారు. తనను స్త్రీ పక్షపాతివా అని కూడా అడుగుతున్నారన్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని చెడు అనేది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందని నటి ఐశ్వర్యా రాజేష్ అభిప్రాయపడ్డారు. -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా: హ్యారీ
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై రాజు చార్లెస్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సంచలన ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అన్న ప్రిన్స్ విలియంతో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో బయట పెట్టారాయన. ‘‘2021లో ఒకసారి మేమిద్దరం మా నాన్న సమక్షంలోనే తలపడ్డాం. మీరిలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మమ్మల్ని విడదీశాడు’’ అని వివరించారు. ‘‘రాచ కుటుంబీకుల పెళ్లిళ్లు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబేలోని సెయింట్ పాల్స్ కెథడ్రెల్లో మెగన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియం ఒప్పుకోలేదు’’ అన్నారు. రాచరికపు జీవితపు ఒత్తిడిని తట్టుకోలేకు ఒక దశలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు చెప్పారు! ‘‘17 ఏళ్ల వయసులో తొలిసారిగా కొకైన్ వాడా. అంత థ్రిల్లింగ్‌గా ఏమీ అన్పించలేదు. తర్వాత ఎలన్ కాలేజీలో చదువుతున్న సమయంలో బాత్రూంలో గంజా తాగాను. కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా. 17 ఏళ్లప్పుడే వయసులో నాకంటే పెద్దావిడతో తొలి లైంగికానుభవం రుచి చూశా’’ అని వివరించారు. ‘‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం బాధించింది. నిద్ర పోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకుని ఓదార్చలేదు. మరణించిన నా తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’’ అని చెప్పుకొచ్చారు. కెమిల్లాను పెళ్లి చేసుకోవాలని తండ్రి భావించినప్పుడు వద్దని తాను, విలియం బతిమాలామన్నారు. హ్యారీ బయట పెట్టిన ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు రాజ కుటుంబం తిరస్కరించింది. -
నెహ్రూ ఆత్మకథకు పొంగిపోయిన రవీంద్రుడు
జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో 1934–35 మధ్య కాలంలో తన ఆత్మకథ (టువార్డ్ ఫ్రీడమ్) రాసుకున్నారు. బానిస సంకెళ్లు తెంచుకుని, దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న దశలో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచానపడి ఉన్నారు. కూతురు ఇందిర చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల, తరచూ రవీంద్రుడి శాంతినికేతన్‌కు పంపు తుండేవారు. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్ టాగూర్ ఆమెను ‘ప్రియదర్శిని’ అన్నారు. అప్పటి నుండి ఆమె ఇందిరా ప్రియ దర్శిని అయ్యింది. పండిట్ నెహ్రూకు సాహిత్యం, కళల పట్ల ఉన్న అవ్యా జమైన ప్రేమ జగద్విదితం. ఆయన ఆత్మకథను చదివి ‘విశ్వ కవి’ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. 1936 మే 31న శాంతినికేతన్ నుండి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది: ‘‘ప్రియమైన జవహర్లాల్! మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం. చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటినీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులనన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకూ సాధించిన విజయాలకు మించిన మహో న్నతమైన వ్యక్తిత్వం మీది – అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయతీ అయిన ఒక నిఖార్స యిన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది.’’ సాహిత్యకారుడు అయిన నెహ్రూకు, అమృతా షేర్గిల్, సరోజినీ నాయుడు, ఫ్రెంచ్ సాహిత్యకారుడు రోమా రోలా వంటి దిగ్గజాల నుండి ఉత్తరాలు వస్తుండేవి. ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణింపబడుతూ ఉండేది. జైలు నుండి నెహ్రూజీ తన కూతురికి రాసిన ఉత్తరాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారి త్రక, స్వాతంత్య్రోద్యమ అంశాలు; దేశ, కాల పరిస్థితుల గురించి చర్చించారు. తరువాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తక రూపంలో వెలువడ్డాయి. పిల్లల పట్ల ఆయనకు గల ప్రత్యే కమైన శ్రద్ధ, ప్రేమల వల్ల ఎన్నో సంస్థలకు, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చాచా నెహ్రూగా శాశ్వతత్వం పొందారు. అందుకే ఆయన పుట్టినరోజు 14 నవంబర్‌ను పిల్లల దినంగా జరుపుకొంటున్నాం. జాతీయ సంస్థల్ని ప్రారంభించి నిలబెట్టింది నెహ్రూజీ అయితే, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది మోదీజీ. తొలి ప్రధాని నుండి ఇటీవలి కాలం వరకు ఏ ప్రధానీ చేయని ‘ఘన’మైన పనులు ఇప్పటి ప్రధాని చేశారు. పటేల్ విగ్రహం నెలకొల్పారు. దాన్ని ఐక్యతా విగ్రహం అన్నారు. బావుంది. ప్రారంభోత్సవ సభలో నేటి హోంమంత్రి కనబడలేదు. విగ్రహం తొలి హోంమంత్రిది కదా? పైగా వేల సంఖ్యలో మత గురువుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలది మతానికేం సంబంధం? ఏమీ మాట్లాడలేక వారసత్వ పాలనకు నెహ్రూయే కారణమని నిందిస్తారు. ఆయన మరణానంతరం జరిగిన సంఘటనలకు నెహ్రూ ఎలా బాధ్యులవుతారు? ఆ రోజుల్లో ఆసేతు హిమాచలం స్వాతంత్య్ర సమర యోధులు లక్షలమంది ఉండి ఉంటారు. వారందరిలోకి నాయ కత్వ లక్షణాలు, చురుకుదనం, విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, విదేశాంగ విధానాల మీద పట్టు, చదువు, సంస్కారం అన్నీ పుణికిపుచ్చుకుని ఉన్నారు గనుక నెహ్రూ తొలి ప్రధాని కాగలిగారు. సుదీర్ఘ కాలం ఆ పదవిలో మనగలిగారు. మనిషిలో ఎంతో సంయమనం ఉంటేగానీ అలా నిలబడలేరు. ధనం, స్థాయి, స్థోమత ఏమీ లేనివాడు త్యాగం చేయడానికి ఏముం టుంది? కానీ, నెహ్రూజీకి ఇవన్నీ ఉండి కూడా అన్నింటినీ త్యజించి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం గొప్ప. పైగా కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడై ఉండి, నిరీశ్వరవాది కావడం అంతకన్నా గొప్ప! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త రచయిత, సామాజికాంశాల వ్యాఖ్యాత -
Ketaki Sheth: ఫొటోస్టూడియో ఆటోబయోగ్రఫీ
ఒకసారి కళ్లు మూసుకొని స్మార్ట్‌ఫోన్ కెమెరాలు లేని ఫొటోస్టూడియోల కాలంలోకి వెళ్లండి. దీపావళి పండగరోజు అక్కయ్య, అన్నయ్యలతో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో గుర్తుందా? ‘రెడీ... అనగానే అలా కళ్లు మూయవద్దు తల్లీ’ అని సుతిమెత్తగా మందలించిన మీ ఊరిలోని ఫొటోగ్రాఫర్ గుర్తున్నాడా? ఫిల్టర్లు, మొబైల్ ఫోన్ అప్లికేషన్లు లేని ఆ కాలంలో స్టూడియోలలోని అద్భుతమైన బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ గుర్తుకొస్తున్నాయా? కేతకి సేథ్ తన ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో ఆ కాలంలోకి తీసుకువెళుతుంది. పదండి ఒకసారి... సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చిన తరువాత ‘ఫొటో స్టూడియో’లు తగ్గిపోయాయి. ఉన్నవి ఆనాటి వెలుగును కోల్పోయాయి. ఎన్నో కుటుంబాలతో అనుబంధాలు పెనవేసుకున్న అలనాటి ఫొటోస్టూడియోల గత వైభవాన్ని ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో మన కళ్ల ముందుకు తీసుకువస్తుంది ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ కేతకి సేథ్. 2014లో నార్త్ ముంబైలోని ‘జగదీష్ ఫొటోస్టూడియో’లోకి కేతకి అడుగుపెట్టినప్పుడు అది ఫొటో స్టూడియోలా లేదు. గతకాల వైభవంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ఇక అది మొదలు 2018 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 67 పాత ఫొటోస్టూడియోలను సందర్శించింది. ఆ జ్ఞాపకాలను రికార్డ్ చేసింది. దిల్లీలోని ‘ఫొటోఇంక్’ గ్యాలరీలో తొలిసారిగా ‘ఫొటోస్టూడియో’ పేరుతో ఫొటోఎగ్జిబిషన్ నిర్వహించింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కేతకి ప్రాజెక్ట్‌పై ‘ఫొటోస్టూడియో’ పేరుతో నాణ్యమైన పుస్తకం కూడా వచ్చింది. తాజాగా... పాతతరానికి సంబంధించిన కొత్త ఫొటోలతో ముంబైలో చెమౌల్డ్ ప్రిస్కాట్ రోడ్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కేతకి. ఈ ఫొటోలలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఫొటోస్టూడియోలు ఉండడం విశేషం. అప్పట్లో ఇమేజ్–క్రేజ్ బాగా ఉండేది. స్క్రీన్‌కి అవతలి ప్రపంచాన్ని ఊహించేవారు కాదు. అందమైన ప్రకృతి దృశ్యాల నుంచి అభిమాన తారల వరకు ఎన్నో బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ స్టూడియోలలో కనిపించేవి. ఆ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ఈ ఎగ్జిబిషన్లో కనిపించి కనువిందు చేస్తాయి. కేతకి తన ప్రయాణంలో నాటి ఫొటోగ్రాఫర్లతో మాత్రమే కాదు, ఫొటోస్టూడియోలలో బ్యాక్‌గ్రౌండ్ పెయింటింగ్స్ గీసే ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడింది. అలనాటి ఫొటోస్టూడియో యజమానులతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు. ఫొటోస్టూడియోలు తమ ఆటోబయోగ్రఫీని చెప్పుకుంటున్నట్లుగా ఉంది! ‘గతంలో ఎన్నో ఫొటో ఎగ్జిబిషన్లకు వెళ్లాను. కాని వాటన్నిటికంటే ఈ ఎగ్జిబిషన్ నాకు బాగా దగ్గరైంది. నా కాలంలోకి, సొంత ఇంట్లోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. గ్యాలరీ నుంచి బయటికి వచ్చినా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది’ అంటుంది ఫొటో ఎగ్జిబిషన్‌కు వెళ్లివచ్చిన అరవై అయిదు సంవత్సరాల పూర్ణ. ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్ సూపర్‌హిట్ అయిందని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుంది! -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్‌లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్‌లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్‌లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్‌లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్‌లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్‌గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్‌లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్‌లో (అవివాహితులకు) అబార్షన్‌ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె. -
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, తిరుపతి: తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించారు. ఈ సందర్బంగా గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదవండి: ‘పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు తిరుమల శ్రీవారిని దర్శించకున్న సీజేఐ తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. -
GS Varadachary: ఒక ‘డీఫ్యాక్టో ఎడిటర్’ ఆత్మకథ
వరదాచారిగారు తెలుగు పత్రికారంగానికీ, తెలుగు పత్రికారంగ చరిత్రకూ చేసిన ఉపకారం ఎనలేనిది. ఆయా రంగాలలో ఉత్తమస్థాయిని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మకథను రాసితీరాలని నా భావన. అవి కేవలం వారి సొంత కథలు కావు. ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన ఆయా రంగాల తాలూకు చరిత్రను, మొత్తంగా దేశ చరిత్రను చెబుతాయి. అనేకమైన పనుల ఒత్తిడుల మధ్య ‘జ్ఞాపకాల వరద’ చదవడం ప్రారంభించి ఆ వరదలో ఎక్కడా ఆగకుండా మునకలేస్తూ, 272 పేజీల పుస్తకాన్ని ఒక్కరోజులోనే పూర్తి చేయగలిగాను. వరదాచారి పండిత పత్రికా రచయిత, ఆపైన బహుముఖ కార్యదక్షులు, బహుళ వ్యాపకులు, తాను పనిచేస్తూనే, ఇతరులతో పని చేయిస్తూ, అందులోనే శిక్షణను మేళవిస్తూ, డెస్క్‌నే ఒక తరగతి గదిగా మలచుకుంటూ, ఒక నిష్కామబుద్ధితో మెరిక ల్లాంటి ఎందరో పత్రికారచయితలను తయారు చేసినవారు. ఈ దృష్ట్యా, పొత్తూరి వంటివారు ఆయనను ‘ప్రొఫెసర్’ అని పిల వడం ఎంతైనా అర్థవంతం. ఆ మాటను సార్థకం చేస్తూ, తెలుగు విశ్వ విద్యాలయంలో జర్నలిజం శాఖలో అధిపతిగానూ, అధ్యా పకులు గానూ రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం, ప్రెస్ క్లబ్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఇటీవలి కాలంలో వయోధిక పాత్రికేయ సంఘం మొదలైన సంస్థలతో క్రియాశీల సంబంధం లేకుండా, ఆయన పండిత పత్రికా రచయిత గానే ఉండిపోయి ఉంటే, ఈ రంగంలో తిరుమల రామచంద్ర వంటి పండిత ప్రకాండులలో ఒకరయ్యేవారని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది. జర్నలిస్టులతోపాటు భవిష్య నిధి సభ్యత్వం కలిగిన కార్మికులందరికీ లాభం చేకూర్చిన పింఛను పథకం మొదట వారి మెదడులోనే అంకురించి మొక్క అయిం దంటే– ఆయన వ్యక్తిత్వ, వ్యాపకాలకు చెందిన మరో పార్శ్వం ఎంత విలువైనదో, ఎంత స్ఫూర్తిదాయ కమో తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరుకు చెందిన ఒక వైష్ణవ కుటుంబానికి చెంది, దానిని అంటి పెట్టు కుని ఉండే సంప్ర దాయ గాఢతను, పరి భాషను, పాండిత్య స్పర్శను వరదాచారి బాల్యం నుంచే రంగ రించుకున్నారు. చిన్న ప్పుడు ఏర్పడిన కులమతవర్గాతీత స్నేహాలు ఆయనలో భావ వైశాల్యాన్ని, హృదయ వైశాల్యాన్ని పెంచి విస్తృత మానవ సంబంధాలవైపు నడిపించాయి. తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ ఉన్న వైష్ణవ కుటుంబాలు చాలావరకూ నేటి తమిళనాడు నుంచి వలస వచ్చాయన్న చారిత్రక సమాచారం మనం ఎరిగినదే. అలాంటి అనుభవాలు, మూలాలు ఆ తరహా కుటుంబాలలో ఒక విధమైన కార్యదక్షతను, క్రియా శీలాన్ని, ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పిల్లలను పెంచి పెద్దజేసే లక్షణాన్ని అలవరచడం సహజమే. తండ్రి కృష్ణమాచారిగారిలో ప్రస్ఫుటంగా కనిపించే ఈ లక్షణాలే మనకు తెలిసిన రూపంలోని వరదాచారిగారినే కాక, ఆయన సోదరులను కూడా ఉన్నతవిద్యాపరంగానూ, ఇతరత్రానూ ప్రయోజకులుగా తీర్చిదిద్దినట్టు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఈ పుస్తకం నాలో కలిగించిన గొప్ప తెలివిడి ఏమిటంటే – అప్పటికి విద్య, ఉద్యోగాలపరంగా ముందుందనుకునే ఆంధ్రప్రాంతపు కుటుం బాల కన్నా కూడా వరదాచారి కుటుంబం అన్నివిధాలా ముందడు గులో ఉందన్న సంగతి! ఆ విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దిన కృష్ణ మాచారిగారే ఈ ఆత్మకథలో నాకు అసలు హీరోగా కనిపిస్తారు. వరదాచారిగారి ఆత్మకథ చదువుతుంటే, ఎంత నమ్మకం లేని వారికైనా ‘విధి’ని నమ్మక తప్పదేమోననిపిస్తుంది. మూడు, నాలుగు పత్రికలలో సంపాదకులయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి తప్పిపోవడానికి, అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ పత్రికారంగంలో ఉన్నతమైన ఎడిటర్ స్థానాన్ని ఆయన అందుకోలేకపోవడానికి కేవలం విధి తప్ప మరో కారణం లేదని అనిపిస్తుంది. మరోవైపు, ‘ఆంధ్రభూమి’ దినపత్రికకు గోరాశాస్త్రి ఎడిటర్ కావడానికి పూర్వ రంగంలో ప్రముఖపాత్ర నిర్వహించినదీ ఆయనే. వరదాచారిగారి అమోఘ జ్ఞాపకశక్తికి అద్దంపట్టే ‘జ్ఞాపకాల వరద’ అనేక కోణాలలో విలువైనది. వారి స్వీయచరిత్రనే కాక, ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన తెలుగు పత్రికారంగ చరిత్రను, అందులో భాగంగా దేశ, రాష్ట్ర రాజకీయ, సామాజిక, సాంస్కతిక చరిత్రనూ చెబుతుంది. కల్లూరి భాస్కరం (జి.ఎస్. వరదాచారి జీవన సాఫల్య అభినందన సభ, ‘పరిణత పాత్రికేయం’ ఆవిష్కరణ సందర్భంగా..) -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: పిల్లలకు బంధాలు కావాలి
‘ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటా వినం. కాని పిల్లలు పుట్టాక అన్నీ మెల్లగా అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి. తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి. తల్లి తరఫు ఉన్నవారూ తండ్రి తరఫు ఉన్నవారూ అందరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు’ అంది నీనాగుప్తా. జీవితం ఎవరికైనా ఒక్కో దశలో ఒక్కోలా అర్థం అవుతుంది. క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో కుమార్తెను కన్న నీనా పిల్లల గురించి చెబుతున్న మాటలు వినదగ్గవి. ఆమె తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ గురించి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ‘వివ్ రిచర్డ్స్ (క్రికెటర్)తో నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లితో సంబంధం లేకుండా బిడ్డను కనాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఎందరో మిత్రులు ఎన్నో రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు. కాని నేను ఎవ్వరి మాటా వినలేదు. ముందుకే వెళ్లాను. మసాబా పుట్టింది. కాని సింగల్ పేరెంట్‌గా పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. ఆ విధంగా నేను మసాబాకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు బంధాలు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. వారి వైపు ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులు అందరూ కావాలి. మసాబాకు ఆ విధంగా తండ్రి వైపు నుంచి పెద్ద లోటును మిగిల్చాను’ అంది నటి నీనా గుప్తా. ఆమె రాసిన ‘సచ్ కహూ తో’ ఆత్మకథ మార్కెట్లో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఆమె ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’కు హాజరయ్యింది. ‘మాది తిండికి హాయిగా గడిచే కుటుంబం. కాని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల పిల్లలుగా మేము ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దగా లేకపోయినా మా అమ్మ చాలా సతమతమయ్యేది. ఆమె బాధ చూసి నాకు చాలా బాధ కలిగేది. బాల్యంలో అలాంటి ప్రభావాలు గాఢమైన ముద్ర వేస్తాయి’ అందామె. నీనా గుప్తా నటిగా పూర్తిగా నిలదొక్కుకోని రోజులవి. హటాత్తుగా వివ్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చాను అని పత్రికలకు చెప్పి సంచలనం సృష్టించింది. 1989లో కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనగా, కుతూహలంగా గమనించారు. ఇప్పుడు ఆమె నటిగా, కుమార్తె ఫ్యాషన్ డిజైనర్‌గా సక్సెస్‌ను చూస్తున్నారు. కాని ఈలోపు ఎన్నో జీవితానుభవాలు. ‘మసాబాను నెలల బిడ్డగా ఇంట్లో వదిలి నేను పనికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి షూటింగ్‌కి కూడా తీసుకెళ్లి షాట్‌కు షాట్‌కు మధ్యలో పాలు ఇచ్చేదాన్ని. ఆమె రంగు, రూపం... వీటిని చూసి పిల్లలు కామెంట్లు చేసేవారు. తండ్రి కనిపించేవాడు కాదు. నా కూతురుకు ఏది ఎలా ఉన్నా ‘యూ ఆర్ ది బెస్ట్’ అని చెప్తూ పెంచుకుంటూ వచ్చాను. కాని మనం ఎంత బాగా పెంచినా బంధాలు లేకుండా పిల్లలు పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్పదలుచుకున్నాను’ అందామె. అలాగే ఒంటరి స్త్రీని సమాజం ఎంత అభద్రతగా చూస్తుందో కూడా ఆమె వివరించింది. ‘సింగిల్ ఉమెన్‌గా ఉండటం వల్ల నేను ఇబ్బంది పడలేదు కానీ నా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైనా పార్టీకి వెళ్లి ఏ మగాడితోనైనా ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మగాడి భార్య తుర్రున పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేసేది. సింగిల్ ఉమెన్ అంటే పురుషులను వల్లో వేసుకునేవారు అనే ఈ ధోరణి అన్యాయం’ అని నవ్వుతుందామె. స్త్రీలను వారి దుస్తులను బట్టి జడ్జ్ చేయడం అనే మూస నుంచి బయడపడాలని నీనా గట్టిగా చెబుతుంది. ‘నేను ఢిల్లీలో ఎం.ఏ సంస్కృతం చదివాను. కాలేజ్‌కు చాలా మోడ్రన్ బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. సంస్కృతం చదువుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వస్తుంది ఏమిటి అని ఏ ఆడపిల్లా నాతో మాట్లాడేది కాదు. నేను ఆ పక్కనే ఉండే మరో కాలేజ్‌కు వెళ్లి క్యారెమ్స్ ఆడుతూ కూచునేదాన్ని. చివరకు ఫస్ట్ ఇయర్లో నాకు మంచి మార్కులు రావడం చూసి అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు’ అందామె. ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ‘ముంబైలో నా కెరీర్ మొదలులో రచయిత గుల్జార్, నేను రోజూ బాడ్మింటన్ ఆడటానికి కారులో వెళ్లేవాళ్లం. ఇద్దరం షార్ట్స్ వేసుకుని పక్కపక్కన కూచుని వెళ్లేవాళ్లం. ఇన్నేళ్ల తర్వాత మొన్న నేను షార్ట్స్‌లో ఆయన ఇంటికి వెళ్లి నా ఆత్మకథ కాపీ అందించాను. అది నెట్లో చూసి ‘హవ్వ.. గుల్జార్ గారిని కలవడానికి వెళ్లి ఈ వయసులో షార్ట్స్ వేసుకుంటావా’ అని ట్రోలింగ్. అరె.. ఏమిటిది? ఎండగా ఉంది వేసుకున్నాను... లేదా కాళ్లు బాగున్నాయని వేసుకున్నాను. మీకేంటి నొప్పి’ అంటుందామె. నీనా గుప్తాకు నటిగా ఎంత ప్రతిభ ఉన్నా ఆమెకు కమర్షియల్ సినిమాల్లోకాని పార్లల్ సినిమాల్లో కాని లీడ్ రోల్స్ రాలేదు. ‘షబానా ఆజ్మీ తన సినిమాల్లో వేసిన పాత్రలన్నీ వేయాలని నాకు ఉంటుంది. ఆర్ట్ సినిమాల్లో కూడా అన్నీ హీరోయిన్ పాత్రలు షబానా, స్మితా పాటిల్, దీప్తికి దక్కాయి. అది నాకు బాధే. కాని ఇప్పుడు నేను లీడ్ రోల్స్ చేసి హిట్స్ కొడుతున్నాను. అది ఆనందం’ అంటుందామె. నీనా గుప్తా అమెరికాలో తీస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో తెలుగు పనిమనిషిగా నటిస్తోంది. ఆమె నటించిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ‘స్త్రీలుగా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది గమనించుకుని యూ ఆర్ ది బెస్ట్ అనుకోండి. అదే మీ సక్సెస్‌మంత్ర’ అందామె. ఆమె నిజమే చెబుతోంది. అందుకే ఆమె పుస్తకం పేరు ‘సచ్ కహూ తో’. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
మానవత్వానికి ప్రతీక డాక్టర్ నోరి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ చికిత్సలో ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు చేస్తోన్న కృషి అమోఘమని, మూర్తీభవించిన మానవత్వానికి ఆయన ప్రతీకని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కితాబునిచ్చారు. శనివారం కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన నోరి దత్తాత్రేయుడు స్వీయ ఆత్మకథ ‘ఒదిగిన కాలం’పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న వివిధ రం గాల ప్రముఖులు ఆయన సేవల్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అమెరికాలో అత్యున్నత వైద్యపరిశోధనను అందుబాటులోకి తెచ్చారని, దేశీయంగానూ ఈ పరిశోధనను అభి వృద్ధి చేసేలా నోరి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. తెలుగు సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని, తన ఆత్మకథలో అనేక అం శాలు, జీవితపార్శా్వలు, అనుభవాలను పొందుపరిచారని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు విశ్వ యోగి విశ్వంజీ మాట్లాడుతూ.. భారత్‌లో కేన్సర్ పరిశోధనా కేంద్రంతోపాటు ప్రతీ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిగేలా చూడాలన్నారు. తెలుగుబిడ్డగా ఎంతో గర్వపడుతున్నాను: దత్తాత్రేయుడు హైదరాబాద్‌లో తెలుగు ప్రజల, మిత్రుల సమక్షం లో తన ఆత్మకథ పుస్తకావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని దత్తాత్రేయుడు అన్నారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు జరిపిన కృషిని గుర్తుచేసుకున్నారు. తెలుగుబిడ్డగా తానెంతో గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ డా.నోరి సతీమణి డా.సుభద్ర, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ ప్రభాకరరావు, డా.పి.జగన్నాథ్, వోలేటి పార్వతీశం, డా.సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమాల్లోకి రాకముందే పెళ్లి.. ఏడాదిలోపే విడిపోయాం: నటి
బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా కంటే కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కల మహిళగానే ఆమెకు గుర్తింపు ఎక్కువ. దాదాపు 20 ఏళ్ల క్రితమే సింగిల్ పేరెంట్‌గా మారి.. తల్లీతండ్రి తానే అయి మసాబా గుప్తాను పెంచారు. తాజాగా విడుదలైన నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ సినీ అభిమానులతో పాటు సామాన్యులను కూడా బాగా అలరించింది. తన కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి తెలియని తన జీవిత విశేషాలను దీనిలో వెల్లడించారు నీనా గుప్తా. మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం కంటే ముందే అంటే సినిమాల్లో రాకముందే తనకు వివాహం అయ్యిందని.. కానీ ఆ బంధం ఏడాది పాటు కూడా నిలవలేదని తన ఆత్మకథలో వెల్లడించారు నీనా గుప్తా. ఆ వివరాలు.. ‘‘నా మొదటి భర్త పేరు అమ్లాన్ కుమార్ ఘోస్. మేమిద్దరం ఓ ఇంటర్ కాలేజ్ ఇవేంట్లో కలుసుకున్నాం. ఆ పరిచయం అలా పెరిగి ప్రేమగా మారింది. అప్పుడు అమ్లాన్ ఢిల్లీ ఐఐటీలో చదవుతుండేవాడు. నేను డిగ్రీ చదువుతున్నాను. మేం ఎక్కువగా ఢిల్లీ ఐఐటీ పరిసరాల్లో కలుసుకునేవాళ్లం. చాలా రోజుల పాటు మా ప్రేమ గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. ‘‘కానీ కొన్నాళ్ల తర్వాత మా ప్రేమ గురించి మా అమ్మకు చెప్పాను. ఆమెకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి నన్ను మరింత కంట్రోల్ చేయడం ప్రారంభించింది. ఓ సారి అమ్లాన్ తన స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్తున్నాడు. వారితో నేను వెళ్లాలని భావించాను. కానీ మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. అతడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్లు అన్నది. అప్పటికే మాపై నిఘా ఎక్కువ్వయ్యింది. వీటన్నింటిని భరించే బదులు వివాహం చేసుకోవడం మేలని భావించాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. ‘‘నేను బెంగాలీ అమ్మాయిని కాకపోవడంతో అమ్లాన్ తల్లిదండ్రులు, బంధువులు మా వివాహానికి అంగీకరించరని మాకు తెలుసు. వారికి మా పెళ్లి గురించి చెప్పలేదు. అందుకే నా కుటుంబ సభ్యులు, మా ఇద్దరి స్నేహితుల సమక్షంలో ఆర్మ సమాజ్‌లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత మేం రాజేంద్ర నగర్లో ఓ చిన్న ఇంటికి మారం. అమ్లాన్ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నేను డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్శిటీలో సాంస్క్రిట్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి జాయిన్ అయ్యాను’’ అన్నారు నీనా గుప్తా. ‘‘కానీ తర్వాత నాకు నాటకాలవైపు మనసు మళ్లింది. థియేటర్ యాక్టర్ కావాలని కలలు కన్నాను. నటన మీద నాకున్న ఆసక్తి అప్పుడే నాకు తెలిసింది. కాకపోతే దురదృష్టం కొద్ది అమ్లాన్ ఆలోచలను ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తను కేవలం ఇంటిని, తనను బాగా చూసుకునే భార్య కావాలని కోరుకున్నాడు. నేను ఇంటి పట్టునే ఉండి, తనను చూసుకోవాలని ఆశించాడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి’’ అని రాసుకొచ్చారు నీనా గుప్తా. ‘‘పెళ్లైన ఏడాదిలోపే మా ఇద్దరి దారులు వేరని మాకు అర్థం అయ్యింది. మేం కలిసి ఉండలేమని కూడా తెలిసింది. దాంతో విడిపోయాం. అమ్లాన్ అంకుల్ ఒకరు మా విడాకుల విషయంలో సాయం చేశారు. నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత నటిగా మారడం, రిచర్డ్స్‌తో ప్రేమ, సహజీవనం, మసాబా జననం జరిగిపోయాయి. నేను, అమ్లాన్ ఎప్పుడు పెద్దగా అరుచుకుని గొడవపడలేదు.. ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకోలేదు. స్నేహపూర్వకంగానే విడిపోయాం. తను చాలా మంచి వ్యక్తి’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. -
నీనా గుప్తా ఆత్మకథ..‘నిజం చెప్పాలంటే’
తన జీవితాన్నితాను ఇష్టపడినట్టుగా జీవించడానికి తన మార్గాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన నటి నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ వెలువరించింది. సినిమా అభిమానుల కంటే స్త్రీలు తప్పక చదవాల్సిన ఆత్మకథ కావచ్చు ఇది. పెంగ్విన్ సంస్థ ఇటీవల ప్రచురించిన నటి నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే) సినిమా అభిమానులను, పాఠకులను కుతూహల పరుస్తోంది. అందులో నీనా గుప్తా తన జీవితంలోని అనేక అంశాలను ‘దాదాపుగా నిజాయితీ’తో చెప్పే ప్రయత్నం చేసిందని విమర్శకులు అంటున్నారు. అందులో కొన్ని విశేషాలు: సతీష్ కౌశిక్‌తో పెళ్లి ‘నటుడు సతీష్ కౌశిక్ నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. స్నేహితుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను చేరడానికి కారణం అతడే. ముంబైలో నాకు అండా దండగా ఉండేవాడు. నేను వివియన్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చి మసాబాకు జన్మనిచ్చాక సతీష్ ‘నన్ను పెళ్లి చేసుకో. నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుంది’ అన్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సింగిల్ మదర్‌గా నేను, తండ్రి లేని పిల్లగా నా కూతురు మనలేరు అని అతడు నా కోసం బాధ పడ్డాడు.’ అని రాసింది నీనా. బయటపడ్డ ప్రాణాలు ‘మసాబా పుట్టిన మూడు నెలలకే నేను పని చేయడం మొదలెట్టాను. ది స్వోర్డ్ ఆఫ్ టిపూ సుల్తాన్ సీరియల్లో చిన్న పాత్ర దొరికింది. అది చేస్తున్నప్పుడే సెట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సంజయ్ ఖాన్ సకాలంలో స్పందించి మంటలార్పే ప్రయత్నంలో తనూ సగం కాలిపోయాడు. సెట్ బయట మసాబా ఉందప్పుడు. తనకు ఆరోగ్యం బాగలేదు. ఎలా ఉందో చూద్దామని నేను బయటకు వెళ్లినప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయాను. ఆ ప్రమాదంలో 55 మంది చనిపోయారు’ అని రాసిందామె. సుభాష్ ఘాయ్ ‘చోలీ’ ‘ఖల్ నాయక్ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. దర్శకుడిగా తనకు ఏది కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. అప్పుడు అతను సంతృప్తి చెందాడు. మంచి దర్శకుడు రాజీపడడు. సుభాష్ ఘాయ్ అందుకే మంచి దర్శకుడు’ అని రాసిందామె. ఇలాంటివే అనేక విశేషాలు ఆమె ఆత్మకథలో ఉన్నాయి. ∙ -
గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జీవితం సినిమా స్టోరీకి తీసిపోదు. తెరమీద ఎంత అందంగా వెలిగిపోయారో.. నిజ జీవితంలో అంతకు మించిన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సింగిల్ పేరెంట్స్‌ని ఇప్పటికి వింతగా చూస్తారు మన సమాజంలో. అలాంటిది ఆమె 90లలోనే సింగిల్ పేరెంట్‌గా మారారు. మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేశారు. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. ఈ క్రమంలో నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి నా స్నేహితుడు సతీష్ కౌశిక్ నా దగ్గరకు వచ్చాడు. ‘‘దీని గురించి ఏం బాధపడకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పుట్టబోయే బిడ్డ మన బిడ్డ అవుతుంది. తను నీలా తెల్లగా పుడితే ఇబ్బంది లేదు. అలా కాకుండా డార్క్ కలర్లో ఉంటే.. నా పోలిక అని చెప్పవచ్చు. అప్పుడు ఎవరు అనుమానించరు’’ అన్నాడు’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. సతీష్ కౌశిక్, నీనా గుప్తా ఇద్దరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రోజుల నుంచి స్నేహితులు. అయితే సతీష్ ప్రతిపాదనను తిరస్కరించారు నీనా. ఆ తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. తనకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక అంశాలను తన బయోగ్రఫీలో వెల్లడించారు నీనా గుప్తా. ఇక పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీ తనను చెడుగా చూసేదని చెప్పారు. ఆ ప్రభావం తన కెరీర్ మీద కూడా పడిందని వివరించారు. ఫలితంగా తనకు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇచ్చేవారని వెల్లడించారు. 2018 నుంచి తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత బదాయి హో, వీరి దే వెడ్డింగ్ ముల్క్ వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు నీనా గుప్తా. చదవండి: నిజం చెప్పాలంటే.. -
ఆ పాట కోసం దుస్తులు విప్పమన్నారు : ప్రియాంక
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా స్టార్ హీరోయిన్గా ఎదిగి గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు ప్రియాంక చోప్రా. ‘బెవాచ్’తో హాలీవుడ్లో అడుగుపెట్టి ప్రియాంక అక్కడ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో 2018లో అమెరికా సింగర్ నిక్ జోన్స్ పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె అమెరికాకు మాకాం మార్చి హాలీవుడ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తన ఆటోబయోగ్రఫి రాయాలని నిశ్చయించుకున్నారు. వెంటనే ‘అన్ఫినిష్డ్’ పేరుతో స్వయంగా తన ఆత్మకథను రాసుకున్నారు. అది పూర్తి చేసి ఇటీవల ఫిబ్రవరి 9న ఈ బుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ప్రస్తావించిన కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా సైతం ఇలాంటి చేదు సంఘటనలను చుశారా! అని ఆమె ఆత్మకథ చదివిన వారంత విస్తుపోతున్నారు. ఇక నిర్మోహమాటంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడంతో ప్రియాంకపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యూపీలోని ఓ చిన్న గ్రామం నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలవడం.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం వరకు ప్రతి విషయాలను ప్రియాంక ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. అయితే కేరీర్ ప్రారంభంలో తనను దర్శకులు చులకనగా చూసేవారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. ఈ పుస్తకంలో ‘ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసే సమయంలో ఆ చిత్ర దర్శకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా దుస్తులను విప్పేయాలని చెప్పినట్లు చెప్పారు. ఒక్కొక్కొ షాట్లో ఒక్కొ వస్త్రం విప్పుతూ లోదుస్తులు కనిపించాలన్నాడు. అలా అయితే ఈ సాంగ్ చేయనని నిక్కచ్చిగా చెప్పాను. అయినా ఆ డైరెక్టర్ వినకుండా నన్న బలవంత పెట్టాడు. అయితే శరీరం కనిపించకుండా స్కిన్ కలర్ దుస్తులు ధరిస్తానని చెప్పడంతో ఆ డైరెక్టర్ కోపంతో అరిచాడు. ఇక ఇదే విషయాన్ని స్టైలిస్ట్‌కు చెప్పగా అతడు కూడా ఇదే మాట చెప్పాడు. మీరు ఏలాంటి దుస్తులు ధరించిన తప్పనిసరి మీ లోదుస్తులు కనిపించాలన్నాడు. అలా అయితేనే ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్‌కు వస్తారన్నాడు. అయితే అలా చేయడం నాకు ఇష్టం లేదని, ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు డైరెక్టర్‌కు చెప్పేశాను. అంతటితో ఈ వివాదం ఆగలేదు. నేను మరో మూవీ సెట్స్‌లో ఉన్నప్పుడు ఆ దర్శకుడు వచ్చి నాతో వాగ్వాదానికి దిగాడు. ఇక చివరకు ఈ విషయంలో హీరో సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకోవడంలో వివాదం సద్దుమనిగింది’ అని ఆమె రాసుకొచ్చారు. ఇక 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ అయ్యాక సినిమాలో నటించాలనే ఆశతో మొదట్లో ఓ మూవీ ఆడిషన్స్‌కు వెళ్లానని, అక్కడ నిర్మాత తనను చూట్టు తిరగమని చెప్పి కాసేపు అలాగే తదేకంగా చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత తన చెస్ట్ చిన్నగా, బటక్స్ పెద్దగా ఉన్నాయని, శరీరంలో మార్పు చేసుకోవాలని సలహా ఇచ్చినట్లు ఆమె పుస్తకంలో వివరించారు. కాగా ప్రియాంక తన ఆత్మకథ తానే స్వయంగా రాసుకోవడంతో ఈ పుస్తకాన్ని కోనేందుకు అభిమానులు నుంచి ప్రముఖుల వరకు ఎగబడుతున్నారంట. దీంతో మార్కెట్లో ఈ బుక్ విపరీతంగా అమ్ముడు పోతున్నట్లు సమాచారం. (చదవండి: చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నా) (‘సలార్’ స్పెషల్ సాంగ్‌లో ప్రియాంక చోప్రా!) (పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక) -
‘డ్రెస్ జిప్ విరగడంతో.. బిగుసుకుపోయాను’
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని.. బాలీవుడ్లో తన సత్తా చాటి.. హాలీవుడ్లో దూసుకెళ్తు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియాంక చోప్రా. హాలీవుడ్ వరకు కొనసాగిన తన ప్రయాణం గురించి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ఫినిష్డ్ పేరుతో ఆటోబయోగ్రఫీ తీసుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన జీవితంలో ఎదుర్కొన్న ఓ అత్యంత ఇబ్బందికర పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు ప్రియాంక. 2019లో ప్రియాంక తొలిసారి కేన్స్ వేదికపై మెరిశారు. రాబర్టో కావల్లి క్రిషేయన్స్ వారు డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ షిమ్మరింగ్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ సీక్విన్ డ్రెస్‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై హోయలోలికించారు ప్రియాంక. వేదిక గ్లామర్‌ని మరింత పెంచారు. అయితే రెడ్ కార్పెట్ మీదకు వెళ్లడానికి కొన్ని నిమిషాల ముందు ఆమె ధరించిన డ్రెస్ జిప్పర్ విరిగిపోయిందట. ఈ ఊహించని పరిణామానికి ఆమె భయంతో బిగుసుకుపోయారట. నాడు తాను అనుభవించిన టెన్షన్ గురించి ప్రియాంక ఇన్‌స్టాగ్రమ్ వేదికగా వెల్లడించారు. (చదవండి: ఆ అనుభూతే వేరు) ‘‘ఈ ఫోటోలో నేను పైకి చూడటానికి ఎంతో చిల్ అవుతున్నట్లు.. సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాను. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లోలోపల నేను టెన్షన్, భయంతో బిగుసుకుపోయాను. ఎందుకంటే కేన్స్ వేదిక మీదకు రావడానికి నిమిషాల ముందు.. రాబర్ట్ కావిల్లి డిజైన్ చేసిన వింటేజ్ బ్లాక్ అండ్ రోజ్ కలర్ డ్రెస్ ధరిస్తుండగా.. అనుకోకుండా దాని జిప్పర్ విరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు... కాసేపు నా బుర్ర పని చేయలేదు. కానీ నాకు అద్భుతమైన టీం ఉంది. వారు కేవలం ఐదు నిమిషాల్లో సమస్యను పరిష్కరించారు. కేన్స్ వేదికకు వచ్చే సమయంలో కార్లో నా డ్రెస్‌ని కుట్టి సమస్యను పరిష్కరించారు. పెద్ద ప్రమాదం నుంచి నన్ను కాపాడారు. కానీ ఆ టెన్షన్ మాత్రం నాలో అలానే ఉంది’’ అంటూ వెల్లడించారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాలను తన అన్ఫినిష్డ్లో పొందుపరిచానని తెలిపారు ప్రియాంక చోప్రా. అలానే గతంలో మిస్‌వరల్డ్ సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలిపారు ప్రియాంక. తాను ధరించిన డ్రెస్‌కు టేప్ అంటుకుందని.. తాను అలానే స్టేజ్ మీదకు వెళ్లానని తెలిపారు ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ఆ అనుభూతే వేరు
‘‘మన తొలి పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చే అనుభూతే వేరే. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం’ అన్నారు ప్రియాంకా చోప్రా. ‘అన్ఫినిష్డ్’ టైటిల్‌తో తన ఆత్మకథను పుస్తకరూపంలో తీసుకొస్తున్నారామె. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లోకి రానుంది. ఈ ఆటోబయోగ్రఫీ ప్రింటింగ్ ఇంకా పూర్తి కాలేదట. అయితే పూర్తయిన కవర్ పేజీ ప్రింట్‌ని ప్రియాంకకు ఇచ్చారట. కొత్త పుస్తకం ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడటానికి ఆ కవర్ పేజీని వేరే పుస్తకానికి చుట్టి సరదా పడ్డానని ప్రియాంక పేర్కొన్నారు. ‘అన్ఫినిష్డ్’లో తన బాల్యం, నటిగా మారడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లడం వంటి విషయాలన్నీ ప్రస్తావించారట ప్రియాంక. -
నేను రక్షకుడిని కాదు!
లాక్డౌన్ సమయంలో ఎంతోమంది తమ ప్రాంతాలు చేరుకునేందుకు సహాయపడ్డారు నటుడు సోనూ సూద్. ‘మా పాలిట రక్షకుడిలా వచ్చావు’ అని దీవెనలందించారు వలస కార్మికులు. సూపర్ హీరో అని సోషల్ మీడియాలో ఒకటే పొగడ్తల వర్షం. అయితే ఇప్పుడు సోనూ సూద్ మాత్రం ‘నేను రక్షకుడిని కాను’ అంటున్నారు. ‘ఐయామ్ నో మెసయ్యా’ (నేను రక్షకుడిని/కాపాడేవాడిని కాదు అని అర్థం) అనే టైటిల్‌తో తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ పుస్తకం డిసెంబర్లో విడుదల కానుంది. ‘ఇది నా జీవిత కథ. కేవలం నాది మాత్రమే కాదు. ఎన్నో వేలమంది వలస కార్మికుల కథ’ అన్నారు సోనూ సూద్. -
అన్ఫినిష్డ్ పూర్తయింది
‘‘నేను ఇక్కడ వరకూ ఎలా వచ్చానో మీకు చాలావరకూ తెలుసు. నా ప్రయాణాన్ని పూర్తిగా ఈ పుస్తకం ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘అన్ఫినిష్డ్’ గురించి అన్నారు ప్రియాంకా చోప్రా. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఈ పుస్తకం కవర్ ఫోటోను, విడుదల తేదీని ప్రకటించారామె. జనవరి 19న ఈ ‘అన్ఫినిష్డ్’ పుస్తకం మార్కెట్లోకి రానుంది. ఇందులో ప్రియాంక తన బాల్యం, నటిగా తన ప్రయాణం, హాలీవుడ్‌కి వెళ్లడం వంటి విషయాలన్నీ చర్చించారట. ‘‘ఈ పుస్తకంతో మీ అందర్నీ నాతో పాటుగా ప్రయాణం చేయిస్తాను అని అనుకుంటున్నాను’’ అన్నారు ప్రియాంక. -
ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?
పాశ్చాత్య పాప్ సంగీతంలో కుర్రకారును ఉర్రూతలూగించడంతో పాటు తన తరానికి విషాదాశ్రుతుషారాల నిషానందిస్తున్న ‘మారియా కేరి’ పేరును పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గాయనిగా, గేయ రచయితగా, మ్యూజిక్ కంపోజర్‌గా, ఆల్బమ్ మేకర్, నటిగా పలు పాత్రలు పోషిస్తున్న ఆమెను ‘గ్రామీ అవార్డు’ ఎప్పుడో వరించింది. న్యూయార్క్‌లోని బెడ్ఫోర్డ్లో 50 ఎకరాల స్థలంలో సువిశాల భవంతిలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వస్తోన్న ఆమె ప్రతి క్రిస్మస్ పండగకు కుటుంబ సభ్యులతోపాటు బంధు మిత్రులతో కలిసి కొలరాడోలోని పర్వత ప్రాంతాలకు వెళ్లడం అలవాటు. మారియా కేరి ఆస్తి విలువ నాలుగువేల కోట్ల రూపాయలు ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె ఓ సాధారణ కుటుంబంలోనే జన్మించి ఈస్థాయికి వచ్చారంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ఆమె తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో, ఎన్ని కన్నీళ్లను కార్చారో. ఆమె తన జీవిత విశేషాలను వివరిస్తూ రాసిన ‘ది మీనింగ్ ఆఫ్ మారియా కేరి’ పుస్తకం మొన్న సెప్టెంబర్ 29వ తేదీన మార్కెట్లోకి వచ్చింది. (చదవండి : జపాన్‌లో సంచలనం సృష్టించిన ట్విట్టర్ హత్యలు) తన ఆరేళ్ల వయస్సులోనే తన కళ్ల ముందు తన తల్లిని అన్న గోడకేసి బాదిన భయంకర దృశ్యం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో పాటు తన సోదరి తనకు కొకైన్, వాలియమ్ మత్తు మందులను అలవాటు చేసి వేశ్య గృహానికి తనను అమ్మేసేందుకు ప్రయత్నించడం, చిన్నప్పటి నుంచే జాతి విద్వేషాన్ని అనుభవించిన వైనాలను ఆమె తన పుస్తకంలో వివరించారు. తండ్రి నీగ్రో, తల్లి శ్వేత జాతీయురాలికి పుట్టిన మారియా జీవితానుభాలు అన్నీ ఇన్నీ కావు. సోని మ్యూజిక్ ప్రెసిడెంట్ టామ్మీ మొటోలాను 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత ఐదేళ్లకే ఆయనతో విడిపోయారు. ఆ తర్వాత నికీ కానన్‌ను పెళ్ల చేసుకున్న ఆమె ఆయనతో కూడా ఐదేళ్లకే విడిపోయారు. తన మాజీ భర్తలంతా తనను ఓ ఏటీఎం యంత్రంగా చూడగా, బాయ్ ఫ్రెండయిన బేస్ బాల్ ప్లేయర్ డెరిక్ జెటర్ తనను మనిషిగా చూస్తారని ఆమె తన పుస్తకంలో వివరించారు. జెటర్ తల్లి ఐరిష్ యువతికాగా, తండ్రి నీగ్రో అవడమే తమ మధ్య సామీప్యతకు ఓ కారణం కావచ్చని ఆమె చెప్పారు.(చదవండి : కరోనా నియంత్రణలోనే ఉంది: ఉత్తర కొరియా) సరిగ్గా 50 ఏళ్లు నిండిన మారియా కేరిది అపురూపమైన అందం. ఇద్దరు పిల్లలున్న మారియా కేరి ప్రస్తుతం బెడ్‌ఫోర్డ్‌లోని సువిశాల భవంతిలో ఎక్కువగా ఒంటరిగానే గడుపుతున్నారు. అణువణువున సాయుధ అంగరక్షకుల పహరా మధ్య ఆమె గదుల నిండా కుక్క పిల్లలను, పిల్లులను పెంచుకుంటూ చూయింగ్ గమ్ నములుతూ కాలక్షేపం చేస్తున్నారు. -
నిజం చెప్పాలంటే..
లాక్డౌన్లో ఒక్కొక్కరూ ఒక్కో పనిలో బిజీగా ఉంటే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఆమె బయోగ్రఫీ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. దీని గురించి మాట్లాడుతూ –‘‘మీ ఆత్మకథ ఎందుకు రాయకూడదు? అని చాలా మంది చాలాసార్లు నన్ను అడిగారు. కానీ నేనంత ఎక్స్ట్రార్డనరీ పనేం చేయలేదు కదా అని రాయాలనుకోలేదు. కరోనా వల్ల ఇంటికే పరిమితం కావడంతో రాయాల్సి వచ్చింది.. రాసేశాను. జనం చదువుతారో లేదో నాకు తెలియదు. చదివితే నచ్చుతుందో లేదో తెలియదు. నా ఆటోబయోగ్రఫీ నాలుగైదు నెలల్లో బయటకు రాబోతోంది. ఒకవేళ కుదిరితే చదవండి. బోర్‌గా అనిపిస్తే పక్కన పెట్టేయండి. నా ఆటోబయోగ్రఫీ పేరు ‘సచ్ కహు తో (నిజం చెప్పాలంటే)’’ అన్నారు నీనా గుప్తా. -
నా కథ చెబుతాను
క్వారంటైన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగించుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ ఖాళీ సమయంలో తన ఆత్మకథ రాస్తున్నారు. ఈ ఆటోబయోగ్రఫీలో సినీ ప్రయాణం ఎలా సాగింది? నటుడిగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? చూసిన విజయాలు, వైఫల్యాలు, కుటుంబం, తనను ప్రభావితం చేసినవాళ్లు.. వంటి విషయాలన్నీ ప్రస్తావించనున్నారని తెలిసింది. హార్పర్‌కోలిన్స్ పబ్లిషర్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లోకి రానుంది. -
బిల్లివ్వకుండా కాఫీ తాగండి
ఫ్రాయిడ్‌ను తెలుగు చేసినవాడిగా, ‘మిసిమి’ సంపాదకుడిగా, బౌద్ధ రచనల మీద విశేష కృషి చేసి తన పేరునే అన్నపరెడ్డి బుద్ధఘోషుడుగా మార్చుకున్న ‘కళారత్న’, ‘బౌద్ధరత్న’, ‘సద్ధర్మ మహోపాధ్యాయ’ అన్నపరెడ్డివెంకటేశ్వర రెడ్డి స్వీయచరిత్ర ‘ఓ అనాత్మవాది ఆత్మకథ’. 192 పేజీల ఈ పుస్తకాన్ని పల్లవి పబ్లికేషన్స్ ప్రచురించింది. ‘ఏసుర్లు’ 1933లో జన్మించారు. 21 సంవత్సరాల వయసులో 13 ఏళ్ల లక్ష్మీకాంతమ్మను పెళ్లాడారు. పుస్తకంలోని రెండు ఘట్టాలు. ‘‘నా వివాహానంతరం నా భార్యను మా ఊరు తీసుకెళ్తూ, తూముబారి ఊరి మధ్యలో బస్సు దిగి(కారు దిగి)– కారుకు బస్సుకు తేడా అప్పటి పల్లెటూరి జనాలకు తెలియదు– ఇంటికి నడిచి వెళ్తుంటే, ఆమె నా వెనుకనే వెన్నంటి నడుస్తుంటే, పెద్దవాళ్లు చూసి, ‘‘ఏంట్రోయ్! నీ పెళ్లాం మడాలు (మడమలు) తొక్కుతూ నడుస్తుంది. కొంచెం దూరంగా నడవమను. ఇది పల్లెటూరు, బస్తీ కాదు’’ అనేవారు. ‘‘తెనాలి గురించి, అది కళా సాహిత్య రంగాలకు ఎలాంటి ‘బౌద్ధిక వాతావరణాన్ని’ సృష్టించిందో చెప్పాలి. దీనికొక చిన్న ఉదాహరణ: నేను వి.యస్.ఆర్. కళాశాలలో చేరిన తరువాత హితశ్రీ(కథకుడు; అసలు పేరు మతుకుమల్లి వెంకట నరసింహ ప్రసాదరావు), డాక్టర్ జి.వి. కృష్ణారావు (కీలు బొమ్మలు నవలా రచయిత), మా ఆంగ్లశాఖలో పనిచేసే పి.సత్యనారాయణ (బైటింగ్ క్రిటిక్), నేను గాఢ స్నేహితుల మయ్యాము. రోజూ కళాశాల వదిలిన తరువాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నలుగురం సైకిళ్ల మీద తెనాలి నడిబొడ్డున బోస్ రోడ్డులో వీనస్ థియేటర్ పక్కన ఉన్న హోటల్ డె ప్రెసిడెంట్ (ఆ హోటలుకు ఆ పేరు పెట్టడంలో తెనాలి సాహితీ వైభవం తెలుస్తుంది) కు కాఫీ సేవనానికి వెళ్లేవాళ్లం. మేము రోజూ రావడాన్ని, అదే మూల ఒక టేబుల్ వద్ద కూర్చోవడాన్ని హోటల్ యజమాని గ్రహించాడు. ఒక రోజు, మా వద్దకు వచ్చి ‘‘మీలాంటి సాహితీమూర్తులు మా హోటలకు వచ్చి సాహితీ చర్చ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. దీనిని నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పి, మా బల్లకు సంబంధించిన సర్వరును పిలిచి, ‘‘ఆ నలుగురు ఎన్నిసార్లు కాఫీ అడిగితే అన్నిసార్లు ఇవ్వు. బిల్లు మాత్రం రాయవద్దు’’ అని ఆదేశించాడు. మేము రాత్రి పది గంటల దాకా కూర్చునేవాళ్లం. అప్పటికే బల్లలు, కుర్చీలు ఖాళీచేసి సర్దివేసేవారు. కాని మా బల్లను ఖాళీ చేయమని అడిగేవారు కాదు. ఒక హోటలు నడుపుకునే యజమానికి అంతటి సంస్కారం ఉందంటే ఊహించండి, నాటి క్లైమేట్ ఆఫ్ ఒపీనియన్.’’ ఓ అనాత్మవాది ఆత్మకథ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి పల్లవి పబ్లికేషన్స్ ఫోన్ : 9866115655 -
కోరేది ఏమీ లేదు ప్రేమ తప్ప
1972లో వచ్చిన చలం ఆత్మకథలో ‘ఇది చలం సొంత అభిరుచుల విషయం. ఇది అతని జీవిత కథకి అనవసరం. యిష్టమున్నవాళ్ళు చదవండి’ పేరుతో రాసినదాన్లోంచి కొంత భాగం ఇక్కడ. నాకు ఈ లోకానికి సంబంధించిన ఆశలు, అభిరుచులు చాలా తక్కువ. అందుకనే నాకు డబ్బు అవసరం వుండేది కాదు. ఏ కొంచెం వున్నప్పటికినీ దాంతోనే గడుపుకునేవాణ్ని. వాంఛలు నాకు చాలా స్వల్పం. మా తిండి, మా బట్ట తప్ప అంతకంటే పెద్ద పెద్ద ఇబ్బందులు జన్మలో ఎప్పుడూ వుండేవి కావు. రంగనాయకమ్మ గారు, మా పిల్లలు అందరూ అట్లాంటి వాళ్ళే. ఎంతసేపటికి మేము వాస్తవంలో కన్న కలలలోనే బతికేవాళ్లం. కలలు అంటే అవి ఏవో పెద్ద పెద్దవి కావు. మా అవసరాలు అని చెప్పుకోవాలి. మేము చాలా హాయిగా తిరగాలి. మేము ఒకళ్ళ నొకళ్ళం ప్రేమించుకోవాలి. మమ్మల్ని ప్రేమించేవాళ్ళు మా దగ్గరికి రావాలి. ఇట్టానే వుండేవి మా కోర్కెలు. జీవితమంతా అంతే. నా ఆశయం– నాకే ఆరోగ్యం వుంటే కట్టుకున్న బట్ట తప్ప ఇంకేమి లేకండా వూరినించి వూరికి తిరగాలని. నా ప్రియురాళ్ళు, నాకొచ్చిన స్త్రీలు, అట్లాంటివాళ్లే తటస్తించారు. వాళ్ళు ఎట్లాంటివాళ్ళయినా, నా దగ్గరికి రాగానే అట్లానే అయిపోయేవాళ్ళు. మొదట్లో కంప్లయింట్ చేసేవారు. ఎప్పుడు ఇంట్లో నిలవనియ్యవేం? రోడ్లంబడి, కాలవలంబడి, లాక్కుపోతుంటావేం? అని. నేను అనుకుంటాను. ఈ జీవితంలో అనారోగ్యం వల్ల నాకా భాగ్యం లభించకపోయినా, పరలోకంలోనన్నా ఈ శరీరం లేనప్పుడైనా (లేని) చెయ్యి చెయ్యి పట్టుకుని ఏ చీకూ చింతా లేకండా నవ్వుతో, ఏదీ అక్కర లేకండా, ఏ విధమైనది బైటనించి అవసరం లేకుండా (లేని) నడుములు పట్టుకుని అట్లా తేలిపోతే మేం వుండాలి. నిశ్చయంగా నాకు తెలుసు, ఈ లోకమే కాకండా అనేక లోకాలు ఉన్నాయని, ఎవరు వాంఛించే లోకం వాళ్ళకి కటాక్షింపబడుతుందని. ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తే దైవం ఎంతో క్రూరుడులాగా కనపడుతాడు గాని, తక్కిన లోకాలు అనంతమైన, దయామయమైన లోకాలలో మనం ప్రేమించే దైవం మన కోర్కెల్ని, సంతోషాల్ని, మన అందాల్ని, ఆశయాన్ని తప్పకండా తీరుస్తుందని నా నమ్మకం. అక్కడైనా నేను కోరేది ఏమీలేదు. వుత్త ప్రేమ. నాతో పక్కన ఒకర్ని వొకరు ప్రేమిస్తో నాతో తిరిగే మిత్రులుంటే చాలు. ఆ విధంగా నా జీవితం వుండాలని నా ఆశ. నా దృష్టి అట్లాంటి ఆశయం మీద వుండబట్టి నాకేదీ ఇది కావాలి, అది కావాలని వుండేది కాదు. ఈ నాటికీ ఏదీలేదు. అదేమి నాకు తృప్తినివ్వదని నాకు తెలుసు. అందుకనే నా కథల్లోను, నాటకాల్లోను, సంపాయించుకోవాలని కోర్కె పడేవాళ్ళు, గొప్పవాళ్ళు కనపడరు. ఎంతసేపటికి వున్నవేవో వొదిలించుకుందామనే తప్ప, కావాలని, ఇది తెచ్చుకుందామనే మనుషులే కనపడరు నా రచనల్లో. ఎంతసేపటికి ప్రేమ కోసం బంధువుల్ని, బంధాల్ని వొదిలించుకోవడం కోసం, ఈ బంధాల్నించి ఇంకో విశాలమైన ప్రేమలోకి పోవడం కోసం, అంతే తప్ప అంతకంటే వాళ్ళకి వేరే ఏమీ అక్కర లేదు. -
ప్రతిధ్వనించే పుస్తకం : అక్రమ సంతానం
అక్రమ సంతానం మరాఠీ రచయిత శరణ్‌కుమార్ లింబాళె స్వీయచరిత్ర. అనువాదం రంగనాథ రామచంద్రరావు. శరణ్‌కుమార్ తల్లి మాసామాయీ. ఈమెది మహర్ కులం. తండ్రి హనుమంత లింబాళె. మాసామాయీ మొదటి భర్త విఠల్ కాంబ్లే. నాటి భూస్వామ్య వ్యవస్థలో జమీందారులు, పటేళ్లు దళిత స్త్రీలను ఉంపుడుగత్తెలుగా చేసుకునేవారు. అట్లా మాసామాయీ హనుమంత లింబాళె ఉంపుడుగత్తెగా శరణ్‌కుమార్‌ను కనడం జరిగింది. ఇలా పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన తండ్రి పేరు నమోదుకు అవకాశం లేక, పాఠశాలలో చేరినప్పుడు శరణ్‌కుమార్ పడిన ఆవేదన కర్ణుని తలపిస్తుంది. మాసామాయీ మొదటి భర్త విఠల్ కాంబ్లే ద్వారా ఇద్దరు పిల్లలనూ, హనుమంత లింబాళె ద్వారా శరణ్కుమార్నూ, తరువాత మరో పటేల్ ద్వారా మరికొంతమంది పిల్లలను కనడమూ– ఇదంతా సవర్ణుల చేతిలో నిక్షిప్తమైన రొట్టె కోసమా? ఆకలికీ కామానికీ మధ్య బంధింపబడటమా? ఏమిటీ ఫ్యూడల్ నికృష్ట దోపిడీ అని పలుమార్లు వాపోతారు రచయిత. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు తోటి పిల్లలు రాళ్లు విసురుతూ ‘మహర్, మహర్’ అని పిలిచిన పరిస్థితులూ, మహర్ అంటూ జుట్టు కత్తిరించడానికి నిరాకరించిన క్షురకుడి అవమానమూ, జారపుత్రుడు– అక్రమ సంతానం అంటూ హేళన చేసిన రోజులూ– వీటన్నింటినీ అధిగమించి లింబాళె చదువు కోసం పడ్డ పెనుగులాట, ఒకరిద్దరు వ్యక్తుల సహకారం ఫలితంగా బీఏ, ఎంఏ పూర్తి చేయడం, కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ ద్వారా పీహెచ్డీ పొంది, ప్రస్తుతం నాసిక్ కేంద్రంగా పనిచేస్తున్న యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ పూనా ప్రాంతీయ కేంద్రానికి అధిపతి కావడం... ఈ ప్రయాణమంతా ఆత్మకథ వెల్లడిస్తుంది. రచయిత అమ్మమ్మ సంతామాయీ. ఆమె మొదటి భర్త చనిపోయాక ఆమెతో జీవితం గడిపిన వ్యక్తి మహమ్మద్ దస్తగిర్ జమీర్(దాదా). తన జీవితాన్ని మార్చటంలో దాదా సహకరించిన గొప్ప గుణం తెలియజేస్తూ, ప్రజా జీవితంలో ఉన్న సంక్లిష్టత వివరించారు రచయిత. దాదా మరణం తర్వాత ముస్లింలు అతని ఖననానికి వస్తారా? సంతామాయీ, మాసామాయీలు చనిపోయినప్పుడు కర్మకాండలకు జనం వస్తారా? తన పుట్టుకే అనైతికంగా ఘోషింపబడిన తర్వాత తాను ఏ నియమాలు పాటించాలి? ఇలా అనేక ప్రశ్నలతో వ్యవస్థ అవలక్షణాలను ఇందులో కళ్లకు కట్టారు రచయిత. -ఎస్ శంకరరావు -
బాలీవుడ్ హీరోకు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ప్రశంస
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ తన ఆత్మకథలో సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె తన ఆటోబయోగ్రఫీని విడుదల చేయడంతో ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. తన మాజీ భర్త ఒక మత్తు బానిస అని, అతడి స్నేహితుడితో శారీరక సంబంధం కలిగి ఉండేవారని, ఆయనకు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారంటూ ఇలా తన ఆత్మకథలో ఎక్కువ భాగం ఇమ్రాన్ ఖాన్‌ను విమర్శిస్తూనే రాశారు. అంతేకాకుండా తన పైశాచికత్వంతో భార్యను వేధించాడంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రంపై కూడా వివాదాస్పద ఆరోపణలు చేశారు. అయితే పలువురు వ్యక్తులను కటువైన పదజాలంతో విమర్శిస్తూ రాసుకొచ్చిన రేహమ్... 445 పేజీలతో కూడిన తన ఆత్మకథలో కేవలం ఒకే ఒక వ్యక్తిని పొగడటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంతో మర్యాద కలిగిన వ్యక్తి అంటూ రెహమ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అసలైన వ్యక్తిత్వం అంటే ఇదే.. గతంలో ఒక ప్రఖ్యాత చానల్లో జర్నలిస్టుగా పని చేసిన రెహమ్ ఖాన్.. ఓ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కాసేపు ముచ్చటించారట. ‘2008లో డోంట్ డిలే... క్లెయిమ్ టుడే అనే కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్, భారత్ నుంచి కొంత మంది ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చింది. అందరిలోనూ ప్రధాన ఆకర్షణగా ఉన్న షారుఖ్ ఖాన్‌తో మాట్లాడాను. వృత్తి పట్ల అతడి నిబద్ధత అమోఘం. అంత పెద్ద సెలబ్రిటీ అయినా కొంచెం కూడా పొగరు లేదు. అతడి ప్రొఫెషనలిజం చూస్తే నాకు ముచ్చటేసింది. మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన తన మూలాల్ని మర్చిపోలేదు. నిజమైన వ్యక్తిత్వం అంటే అదే. షారుఖ్ ఎంతో మర్యాదస్తుడు’ అంటూ రేహమ్ ఖాన్ తన పుస్తకంలో రాశారు. -
పుస్తక రూపంలో ప్రియాంక ఆత్మకథ
మాజీ ప్రపంచ సుందరి, బాలీవూడ్ అగ్రశ్రేణి నటి ప్రియాంక చోప్రా.. రిషి కపూర్, ట్వింకిల్ ఖన్నా, నసీరుద్దీన్ షాల సరసన చేరారు. ఈ బాలీవుడ్ దిగ్గజాల దారిలోనే కలం చేత పట్టి ప్రియాంక తన ఆత్మకథ రాశారు. ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్’ ప్రచురిస్తున్న ఈ పుస్తకానికి ‘అన్‌ఫినిష్ఢ్’గా నామకరణం చేశారు. 2019లో మార్కెట్లోకి రాబోతున్న ఈ ఆత్మకథలో ప్రియాంక సేకరించిన వ్యాసాలు, కథలు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, పరిశీలించిన సంఘటనలను వివరించారు. ఈ పుస్తకాన్ని ఎంతో నిజాయితీగా, సరదాగా, ముక్కు సూటిగా, ఎవరినీ విమర్శించకుండా రాశానన్నారు ప్రియాంక. గతంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటకి చెప్పలేదని, కానీ ఈ పుస్తకంలో వివరించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. పుస్తకం గురించి వివరిస్తూ.. పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్ సంస్థ కు చెందిన మానసి సుబ్రమణ్యం, ప్రియాంక రాసిన ఆత్మకథ గురించి వివరిస్తూ.. ‘ఈ పుస్తకం ప్రియాంక ఆత్మకథకు మాత్రమే కాదు.. మహిళల మేనిఫెస్టో’గా అభివర్ణించారు. అన్ఫినిష్డ్ పుస్తకం చదివాక మహిళలు ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడుతుందని, ఎవరినైన ప్రభావితం చేయగలిగే శక్తి ప్రియంకకు ఉందని సుబ్రమణ్యం తెలిపారు. -
కత్రినా పెళ్లి కూతురాయెనె!
ప్రజెంట్ బీటౌన్‌లో పెళ్లి గాలి బాగా వీస్తోంది. విరాట్ కోహ్లితో ఆల్రెడీ హీరోయిన్ అనుష్కా శర్మ ఏడడుగులు వేశారు. మరో కథానాయిక సోనమ్ కపూర్ కూడా తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజాతో వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ టైమ్‌లో పెళ్లికూతురు గెటప్‌లో కనిపించారు కత్రినా కైఫ్. తాను ఆ గెటప్‌లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కత్రినా. అంతే... కత్రినా పెళ్లి కూతురాయెనే అని బీటౌన్‌లో టామ్ టామ్ చేశారు కొందరు. అయితే కత్రినా కైఫ్ పెళ్లికూతురయ్యారు కానీ నిజ జీవితంలో కాదు. సినిమా జీవితంలో. ఆనంద్. ఎల్. రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జీరో’. ఇందులో కత్రినా కైఫ్, అనుష్కా శర్మ కథానాయికలు. ఈ సినిమాలో కత్రినా పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆల్కహాల్‌కు ఎడికై్టన అమ్మాయి పాత్రలో కత్రినాకైఫ్, సైంటిస్ట్‌గా సక్సెస్ సాధించాలని స్ట్రగులయ్యే పాత్రలో అనుష్కా శర్మ కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాలో షారుక్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘జీరో’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘జబ్ తక్ హై జాన్’ తర్వాత షారుక్, అనుష్క, కత్రినా కలిసి నటించిన ఈ సినిమా పై బాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. లైఫ్ జర్నీతో బుక్: కత్రినా తన లైఫ్ జర్నీని ఒక పుస్తక రూపంలో (ఆటోబయోగ్రఫీ) రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ ఆటోబయోగ్రఫీ కోసం ఆల్రెడీ ఒక పబ్లిషింగ్ హౌస్‌తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారమ్. ఈ బుక్‌లో ముఖ్యంగా తన బాల్యాన్ని, లండన్, జపాన్, ఇండియా ఇలా వివిధ దేశాల్లో ఉండటం వల్ల తన లైఫ్‌లో సంస్కృతులు చూపిన ప్రభావం, బాలీవుడ్లో 15 ఏళ్ల కెరీర్‌ను ఎక్కువగా ప్రస్తావించనున్నారట. ఈ బుక్ ఇన్స్పిరేషనల్గా ఉండబోతోందట. -
ధోని బలవంతం మీద తప్పక చేశాను!
సాక్షి, కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్లలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఒకరు. తనకు ముందు ఉన్న కెప్టెన్ల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్లిన గంగూలీ కెరీర్ చివరి రోజుల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. గంగూలీ భాదను చూడలేక ఆయన తండ్రి రిటైర్ కావాలంటూ సూచించారట. ఈ విషయాలను తన ఆత్మకథ ‘ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లో గంగూలీ రాసుకున్నారు. త్వరలో సౌరవ్ ఆత్మకథ విడుదల కానున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. 2008 నవంబర్‌లో నాగపూర్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగో టెస్ట్ గంగూలీకి చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ‘ఆ టెస్టుకు ముందు రిటైర్మెంట్పై ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాగ్‌పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పల్ప స్కోరుకే 9 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నా వద్దకు వచ్చాడు. కొద్దిసేపు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవాలని సూచించగా ఒప్పుకున్నాను. అయితే అదే రోజు అంతకుముందే కెప్టెన్‌గా చేయాలని నన్ను కోరగా నేను సున్నితంగా తిరస్కరించాను. మళ్లీ ఆసీస్ చివరి వికెట్ సమయంలో వచ్చి కొద్దిసేపు కెప్టెన్‌గా చేయాలంటూ ధోని బలవంతం చేయగా తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. సరిగ్గా నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి అప్పటికీ సరిగ్గా 8 ఏళ్లు పూర్తయ్యాయి. దాంతో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి మూడు ఓవర్లు ఫీల్డింగ్ సెట్ చేసిన తర్వాత మహీ ఇక నువ్వే చూసుకో అన్నాను. ఎందుకంటే నేను పూర్తిస్థాయిలో ఏకాగ్రత చూపించలేని కారణంగా చివరి వికెట్ తీసే వరకూ కెప్టెన్‌గా ఉండలేకపోయానంటూ’ గంగూలీ వివరించారు. ‘ఆ సిరీస్‌కు ముందు అనిల్ కుంబ్లేను కలిసి నన్ను జట్టులోకి తీసుకుంటారా.. నీకు ఏమైనా తెలుసా అని అడిగాను. మళ్లీ నేను కెప్టెన్ అవుతానా.. నా సేవలు టీమిండియాకు అవసరమవుతాయా అని కుంబ్లేతో చర్చించాను. పరిస్థితులు డిమాండ్ చేస్తే నువ్వు జట్టులోకి రావడంతో పాటు మళ్లీ కెప్టెన్ అవుతావని కుంబ్లే ధైర్యం చెప్పాడు. భారత కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోల్‌కతా వీధుల్లో తిరగడానికి ఇబ్బంది పడే వాడిని. మారువేషంలో వీధుల్లో తిరుగుతూ దుర్గాదేవిని గంగలో నిమజ్జనం చేసే వరకూ ఆసక్తిగా ఉత్సవాల్లో పాల్గొనేవాడినని’ పలు విషయాలు దాదా నెమరువేసుకున్నారు. -
కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడింది.. కారణం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన మౌలిక వసతుల అభివృద్ధిని, ప్రగతిని తొలిసారి ఓటర్లు తేలికగా తీసుకొని.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు మద్దతు ఇచ్చారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైన కీలకాంశాల్లో ఇది ఒకటి.. అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 27న జైపూర్ సాహిత్యోత్సవంలో విడుదల కాబోతున్న తన ఆత్మకథ ‘సిటిజెన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్’లో పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ ఓటర్లు మా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను గుర్తించలేదు. నేను అధికారంలోకి రాకముందు ఢిల్లీ ఎలా ఉందో వారికి తెలియదు అని ఆమె పేర్కొన్నారు. ‘ఓటర్లలో తొలిసారి ఓటు హక్కు వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. 15 ఏళ్ల కిందట ఢిల్లీ ఎలా ఉందో వారు చూడలేదు. ఢిల్లీలోని నిరంతర విద్యుత్, ఫ్లైఓవర్లు, మెట్రోరైలు, పలు కొత్త యూనివర్సిటీలు అన్ని కూడా తమ సహజమైన హక్కులుగా వారు భావించారు. వాటిని పెద్దగా లెక్కచేయలేదు. ఆ సంతోషకర భావన అన్నది వారిలో వ్యక్తం కాలేదు’ అని దీక్షిత్ రాసుకొచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని, ప్రజల మనోభావాలను అతను ఓట్లుగా మలుచుకుంటాడని భావించలేదని ఆమె అంగీకరించారు. ‘నేనే స్వయంగా ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ స్థానాన్ని 25వేల ఓట్ల మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయాను. ఆప్‌ను మేమంతా తక్కువగా అంచనా వేశాం’ అని పేర్కొన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన షుంగ్లూ కమిటీ ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని విస్మరించిందని నిందించారు. -
సంచలన విషయాలు వెల్లడించిన సమంత!
ప్రముఖ పాప్ సింగర్, ఒకప్పటి గ్లామర్ గర్ల్ సమంతా ఫాక్స్ తన ఆత్మకథలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఫరెవర్’ పేరిట వెలువరించిన తన జీవితకథలో లైంగిక దాడి, మోసం, జాతీయ క్షమాపణ వంటి విషయాలను వెల్లడించారు. కొలంబియాలో డ్రగ్స్ మాఫియా అధినేత పార్టీలో పాటలు పాడేందుకు గతంలో తనకు 50వేల డాలర్లు ఇచ్చారని ఆమె వెల్లడించారు. దక్షిణ అమెరికాలో పాప్ కచేరిలో నిర్వహిస్తున్నప్పుడు ఓ వ్యక్తి తన మేనేజర్ వద్దకు వచ్చి తన కూతురు 21వ పుట్టినరోజు వేడుకల్లో పాటలు పాడాలని నేరుగా 50వేల డాలర్లు ఇచ్చాడని ఆమె తెలిపారు. అతను చాలా ధనికుడై ఉంటాడని, అందుకే తన కూతురి పుట్టినరోజు వేడుకలకు తనను పిలిచాడని అప్పట్లో భావించానని ఆమె పేర్కొన్నారు. అయితే, చుట్టూ మెషిన్ గన్లతో సాయుధులు కాపలా ఉన్న పెద్ద బంగ్లాలోకి తనను తీసుకున్నారని, అక్కడ జరిగిన పార్టీలో తాను పాటలు పాడానని తెలిపారు. అప్పటి బుష్ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించిందని, అలాంటి సమయంలో డ్రగ్స్ మాఫియా అధినేత ఇంట్లో తాను పాటలు పాడినట్టు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మేనేజర్ డేట్స్ ఇవ్వడంలో గందరగోళానికి గురయ్యాడని, దీంతో సంగీత కచేరికి ఒక రోజు ఆలస్యంగా వెళ్లామని గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని, అంతేకాకుండా లక్ష డాలర్లు పరిహారంగా చెల్లించేవరకు నిర్వాహకులు తమను బందీగా పెట్టుకున్నారని ఆమె తెలిపారు. అప్పుడు తన వెంట ఉన్న తండ్రి డబ్బు మొత్తం తీసుకొని ఇంగ్లండ్ వెళ్లిపోయాడని, దీంతో ఉచితంగా ఓ సంగీత కచేరి నిర్వహించి.. ఎలాగోలా డబ్బులు సేకరించి పాస్ పోర్టులు విడిచిపించుకొని.. పనామాకు తిరిగొచ్చామని తెలిపింది. ప్రముఖ పాప్ స్టార్ డేవిడ్ క్యాసిడైతో అర్ధనగ్న ఫొటోషూట్ సందర్భంగా అతను లైంగిక ఉద్దీపనకు గురయ్యాడని, ఆ తర్వాత డిన్నర్ సందర్భంగా రెస్టారెంట్‌లోని టాయ్ లెట్ లో తనపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని, కానీ తాను తీవ్రంగా ప్రతిఘటించి.. అతన్ని తోసేశానని ఆమె పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో పాప్ కచేరి అనుభవాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ సంగీత కచేరి సందర్భంగా పురుషులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు చొక్కాలు విప్పి డ్యాన్స్ చేశారని, ఇది తనకు చిత్రంగా, కొంచెం ఎబ్బెట్టుగా తోచిందని ఆమె రాసుకొచ్చారు. -
శత్రువు చెడ్డవాడు కాదు
‘‘ప్రత్యర్థిని అగౌరవపరచకుండానే నేనతడిని ఓడించగలనని అర్థమైంది’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ లో ఒకచోట రాసుకున్నారు నెల్సన్ మండేలా. విధానాలకు వ్యక్తులు ఎలాగైతే బాధ్యులు కారో, జాతి వివక్షకు తెల్లజాతి అధికారులు అలా బాధ్యులు కారని ఆయన విశ్వాసం. మండేలా ఏనాడూ నేరుగా తెల్ల అధికారులతో తలపడలేదు. జాతి విచక్షణ వ్యవస్థతోనే ఆయన పోరాటం. నల్లవాళ్లందరూ తక్షణం జోహన్నెస్‌బర్గ్‌ను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని హుకుం జారీ అయినప్పుడు ఒక వ్యక్తి మండేలా దగ్గరికి వచ్చాడు. ‘‘మమ్మల్ని కాపాడండి. నేను, నా భార్యాపిల్లలు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారు. నా ఉద్యోగం తీసేశారు. చావడం తప్ప వేరే దారిలేదు. ఏదో ఒకటి చెయ్యండి. నా కుటుంబం కూలిపోకుండా చేతులు అడ్డుపెట్టండి’’ అని మండేలాను వేడుకున్నాడు. వెంటనే అధికారి దగ్గరికి వెళ్లాడు మండేలా. ‘‘చూడండి, కార్యకర్తగా కాదు... ఒక మనిషిగా నేను మీ దగ్గరకు వచ్చాను. నేను మీ ముందుకు తేబోతున్న సమస్య పరిష్కారానికి పూర్తిగా మీ మీదే ఆధారపడి వచ్చాను’’ అన్నాడు. మండేలా మాటతీరులో తనపై కనిపించిన గౌరవభావం ఆ తెల్ల అధికారిని కదిలించింది. ‘‘ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపొమ్మని చెప్పండి’’ అని నిరభ్యంతర పత్రం రాసిచ్చాడు! లోకంలో ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. చెడ్డ మనుషులు ఉండరు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయి. జాతి వివక్ష అమాయక ప్రజల్ని బలి తీసుకుంటుందనీ, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవలసి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు మండేలా. ఇంత గొప్ప వ్యక్తిని ఏ దేశం మాత్రం గౌరవించదు? మండేలాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మన ‘భారత రత్న’నూ ఇచ్చుకున్నాం. మండేలా 2013 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
మనకు తెలియని యం.ఎస్
తాజా పుస్తకం ఆమె సుప్రభాతం శ్రీ వేంకటేశ్వరునికి మేలుకొలుపు. ఆమె దివ్యగానం ముక్కోటి దేవతలకు పవిత్రార్చన. ఆమె స్వరం గాంధీజీకి ప్రాణం. ఆమె గాత్రం కోట్లాది మందికి హృదయంగమం. ఆ గాన మాధుర్యం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సొంతం. ఆమె గురించి ఇప్పటి వరకు వేలాది వ్యాసాలు వచ్చాయి. వందలాది కథనాలు వెలువడ్డాయి. పుస్తకాలకు లెక్కేలేదు. కాని ప్రముఖ జర్నలిస్ట్ టి.జె.ఎస్ జార్జ్ రాసిన ఎమ్మెస్ బయోగ్రఫీ– ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ ఎక్కువ మంది పాఠకుల మన్ననను పొందింది. దానిని హైదరాబాద్‌కు చెందిన హెచ్‌బీటీ సంస్థ ‘మనకు తెలియని ఎం.ఎస్’గా తెలుగులో ప్రచురించింది. ప్రముఖ రచయిత్రి ఓల్గా దీనిని తెలుగులోకి అనువదించారు. ఈ రోజు అంటే నవంబర్ 24 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. ముఖ్యవక్తగా కర్ణాటక గాయకుడు, ప్రజామేధావి టి.ఎం. కృష్ణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రచురణకర్త గీతా రామస్వామి, అనువాదకురాలు ఓల్గా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ టీజేఎస్ జార్జ్ 2004లో ఇంగ్లిష్‌లో రాశారు. 20016 వరకూ ఈ పుస్తకం గురించి నాకు తెలీదు. ఈ పుస్తకం గురించి ఇప్పటిదాకా తెలీకుండా ఎలా ఉన్నానా? అని ఆశ్చర్యపోయా. అంటే కర్ణాటక సంగీతంలోని ఒక వర్గం లాబీ మొత్తం దాన్ని బయటకు రాకుండా చేసింది. ఎందుకంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే ప్రపంచానికి తెలుసు. కాని ఈ పుస్తకం ఆమెది దేవదాసీ కుటుంబ నేపథ్యం అని చెబుతోంది. ఈ సంగతి నలుగురికీ తెలియకూడదని ఆ లాబీ భావించినట్టుంది. 2016లో ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేసినప్పుడు కొన్ని సమీక్షలు వెలువడితే తెప్పించుకొని చదివాను. అరే.. ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులోకి ఎందుకు ప్రచురించకూడదు అని అనిపించింది. అదే సమయంలో కొంచెం సంశయం కూడా పొందాను. నిజానికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కళ అంతా దేవదాసీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే వచ్చింది. అయినా ఆమె బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే గుర్తింపు పొందింది. ఈ వైరుధ్యాన్ని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎలా ఎదుర్కొన్నది, రోజువారి జీవితంలో ఈ ద్వంద్వ అస్తిత్వాన్ని ఎలా సమన్వయం చేసుకుంది... వంటి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలియచేయవచ్చు అనిపించింది. అదీగాక ఒక మహా గాయకురాలి గెలుపు ఓటములు రెండూ మనకు అవసరమే. ఎమ్మెస్ ఎందుకు బ్రాహ్మణీకంలో లీనమయ్యింది... ఆమెను స్వీకరించిన బ్రాహ్మణీకం ఎందుకు మరో గాయని రావు బాలసరస్వతిని తిరస్కరించింది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకోటి ఏమనిపించిందంటే బ్రాహ్మణ కళాకారుల గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ పుస్తకం బయటకు వస్తే దేవదాసీ వంటి కమ్యూనిటీల గురించి రాసేవాళ్లు కూడా వస్తారు అనిపించింది. ఎమ్మెస్ మూలాలు దేవదాసి కుటుంబంతో ఉన్నాయని తెలిస్తే ఆ సమూహం తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుందనిపించింది. ఇక ఈ పుస్తక రచయిత జార్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు అయుండి కర్ణాటక సంగీతంతో అసలు పరిచయం లేకపోయినా ఇంత అద్భుతంగా రాశాడు అంటే అదే భారతదేశంలోని వైవిధ్యం. బ్రాహ్మణుడు అయి ఉంటే ఈ పుస్తకాన్ని ఇంత సున్నితంగా రాసి ఉండేవాడు కాదేమో. ఒక్కమాటలో చెప్పాలంటే ఇట్సె వండర్ఫుల్ బుక్. ఈ పుస్తకాన్ని తెలుగులోకి చేయాలి అనుకోగానే నా మనసులోకి వచ్చిన వ్యక్తి ఓల్గానే. ఎందుకంటే ఇది ప్రాథమికంగా స్త్రీవాదాన్ని సూచించే రచన. వీ ఆర్ రిట్రీవింగ్ ఫెమినిస్ట్ హిస్టరీ. నేను అడగగానే వెంటనే యెస్ అంది. అప్పటిదాకా తాను చేస్తున్న పని పక్కనపెట్టి ఈ అనువాదం తీసుకుంది. ప్రస్తుతం మా సంస్థ జీవిత కథల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఈ నెల 29న గౌరీ లంకేష్ పుస్తకం విడుదల కానుంది. తర్వాత రావు బాలసరస్వతి బయోగ్రఫీ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ పాఠకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచన కూడా రేకెత్తిస్తాయని భావిస్తాను. సుబ్బులక్ష్మి మూలాలను చెప్పే పుస్తకం – గీతా రామస్వామి, ప్రచురణకర్త గీత అడగ్గానే చాలా సంతోషమేసింది. ఎమ్మెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పాటలు బాగా వింటాను. కొన్ని కొన్ని పాటలను కొన్నాళ్లు పొద్దున్నే వినేదాన్ని. మనసుకు హాయిగా ఉంటుందని. ఆమె పాడిన శ్రీరంగపుర విహార లాంటి పాటలను చాలా ఇష్టంగా వింటుంటాను. ఎమ్మెస్ దేవదాసీ అని అప్పుడెప్పుడో ‘హిందూ’లో చదివాను. అప్పటిదాకా నాకు తెలియదు. తెలియగానే షాక్ అయ్యాను. ఇంతకాలం తెలియకుండా ఎలా దాచారు వీళ్లు అనిపించింది. ఇప్పుడు బయోగ్రఫీ అనగానే అవన్నీ తెలుసుకోవచ్చనిపించింది. గతంలో నేను ‘సరిద మాణిక్యమ్మ’ అని దేవదాసీని 1990లలో కలిసాను. ఆమె ఎంత గొప్పదంటే ‘దావదాసీ రామయాణాన్ని’ నటరాజ రామకృష్ట బృందానికి నేర్పించి దానిని పునర్ముఖం చేసింది. అలాంటి ఆవిడను ఎంతో దయనీయమైన స్థితిలో చూశాను. ‘మా కళలన్నీ ఇతరులు నేర్చుకున్నారమ్మా. కాని మాకు మాత్రం ఇప్పుడు ఏమీ లేదు’ అని ఆమె అనడం నాకు చాలా బాధనిపించింది. అప్పటి నుంచి దేవదాసీల గురించి ఆలోచిస్తూనే ఉన్నా. ముత్తు లక్ష్మీరెడ్డి, బెంగుళూరు నాగరత్నమ్మ, మైసూరు జెట్టి తాయమ్మ వంటి దేవదాసీల పోరాటాలు.. జీవితాలు అధ్యయనం చేశాను. ఈ మధ్య నేను రాసిన ‘గమనమే గమ్యం’ అనే నవల్లో కూడా ఒక దేవదాసీ పాత్ర ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎం.ఎస్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నా. నిజానికి అప్పటికి నేను పని చేస్తున్న పుస్తకం ఈ విషయానికి పూర్తిగా వ్యతిరేకమైనది. అది ‘నైనా దేవీ’ అనే టుమ్రీ గాయనీ గురించి. ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ చాలా డిఫరెంట్. ఆమె బ్రాహ్మిణ్. రాజా రామమోహన్‌రాయ్ మనవరాలు. అయినా సరే దేవదాసీలాంటి వాళ్లు పాడే పాటలు నేర్చుకొని పాడింది. అదీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అయినా దాన్ని పక్కన పెట్టి ఇది చేశాను. కారణం.. ఎమ్మెస్ అంటే ఉన్న ఇష్టమే కాకుండా నేను తెలుసుకోవాలనుకున్న చాలా విషయాలున్నాయనిపించింది. అన్నట్టుగానే ఈ పుస్తకం నాకెంత జ్ఞానం ఇచ్చిందంటే మొత్తం కర్ణాటక సంగీతాన్నే అర్థం చేయించింది. కర్ణాటక సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుంది అనేది ఈ పుస్తకం చెబుతుంది. అన్ని బయోగ్రఫీల్లాంటి బయోగ్రఫీ కాదు ఇది. చాలా ప్రత్యేకమైంది. జార్జ్ చాలా రీసెర్చ్ చేశాడు. సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుందో తెలిపే పుస్తకం – ఓల్గా, రచయిత్రి -
అనుకున్నదొక్కటి, అయిందొకటి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఉండగా తనను ప్రధానమంత్రిని చేస్తారని అనుకున్నట్టు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 1996 నుంచి 2012 వరకు జరిగిన పరిణామాలపై తాను రాసిన ‘ద కొలిషన్ ఇయర్స్’ పుస్తకంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ‘2012 రాష్ట్రపతి ఎన్నిక సమయంలో జూన్ 2 సాయంత్రం సోనియా గాంధీని కలిశాను. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపిక చేసేందుకు, వారికి ఏవిధంగా మద్దతు కూడగట్టాలనే దానిపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారని, మీకు ప్రత్యామ్నాయం ఎవరో సూచించాలని ఈ సందర్భంగా సోనియా నన్ను అడిగారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడతానని చెప్పాను. ఎటువంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అన్నాను. నా వైఖరిని సోనియా ఎంతోగానో మెచ్చుకున్నారు. భేటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌ను ఖరారు చేస్తారని అనుకున్నాను. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైతే, సోనియా.. నన్ను ప్రధానిగా ప్రతిపాదిస్తారని భావించాను. అయితే నేను ఊహించిన దానికి భిన్నంగా రాష్ట్రపతి ఎన్నిక కోసం నాతో పాటు, హమిద్ అన్సారీ పేరును సోనియా ప్రతిపాదించారు. జూన్ 13న సోనియా, మమతా బెనర్జీ కలిశారు. ప్రణబ్, హమిద్ అన్సారీలను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్టు మమతకు సోనియా తెలిపారు. మా ఇద్దరితో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అనే విషయంపై ములాయం సింగ్ యాదవ్‌తో చర్చించిన తర్వాత చెబుతానని మమతా బెనర్జీ తెలిపినట్టు తర్వాత నాతో సోనియా చెప్పారు. మా ఇద్దరినీ కాదని ములాయం, మమత.. ఏపీజే అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, సోమనాథ్ ఛటర్జీ పేర్లను వారు తెరపైకి తెచ్చారు. మరోసారి సోనియాతో మమత భేటీ అయ్యారు. ప్రణబ్, అన్సారీ.. వీరిద్దరిలో ఎవరు ఆమోదయోగ్యం కాదో చెప్పాలని మమతను సోనియా కోరారు. జూన్ 14న సోనియాను కలిశాను. మమత బెనర్జీతో చర్చించిన విషయాలను నాకు చెప్పారు. ములాయంతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెప్పకపోవడం, భేటీ వివరాలను మీడియాకు వెల్లడించడంతో మమతపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించడం మంచిదని సోనియా అన్నారు. ఏకే ఆంటోని, చిదంబరం, అహ్మద్ పటేల్, నేను, ప్రధాని ఈ సమావేశంలో పాల్గొన్నాం. నా అభ్యర్థిత్వంతో పార్టీ, ప్రభుత్వంలో తలెత్తె పరిణామాల గురించి చర్చించాం. సోనియా, తాను కలిసి తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్టు ఆ రోజు సాయంత్రం నాకు మన్మోహన్ సింగ్ సమచారం ఇచ్చార’ని ప్రణబ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. 2004 సాధారణ ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని చేపట్టేందుకు సోనియా గాంధీ నిరాకరించడంతో తాను ప్రధానమంత్రి అవుతానని భావించినట్టు ఆయన పేర్కొన్నారు. శరద్ పవార్ కూడా ప్రధాని పదవి ఆశించారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ తర్వాత కీలక సమయంలో పివి నరసింహారావు సుస్థిరమైన నాయకత్వం అందించారని ప్రశంసించారు. ఆర్థిక, విదేశాంగ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని గుర్తు చేశారు. -
హిట్లర్ సంతకం@17వేల పౌండ్లు
లండన్: తొలిపేజీలో హిట్లర్ సంతకం చేసిన ఓ పుస్తకం వేలంలో 17,000 పౌండ్ల ధర పలికింది. ఈ పుస్తకాన్ని చాలా అరుదైన పుస్తకమని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ఎందుకంటే తన సంతకం విషయంలో ఈ జర్మన్ నియంత చాలా కఠినంగా వ్యవహరించేవాడట. ఎప్పుడో ఒకసారి మాత్రమే సంతకం చేసేవాడట. హిట్లర్ జీవితచరిత్ర ఆధారంగా రాసిన ఈ పుస్తకం తొలిపేజీలో హిట్లర్ సంతకం చేయడమనేది అరుదైన విషయమేనని, అందుకే దీనికి భారీ ధర పలికిందని నిర్వాహకులు తెలిపారు. ఇంగ్లిష్ రచయిత పీటర్ క్యాడోగన్ 1930లో హిట్లర్‌ను కలిసిన సందర్భంగా తాను రాసిన పుస్తకంపై జర్మనీ అధినేత నుంచి సంతకం తీసుకున్నాడు. పుస్తకం తొలి పేజీపై హిట్లర్ సంతకం చేసిన ఈ పుస్తకం 1935లో బయటకు వచ్చింది. -
థ్రిల్ ఆఫ్ లైఫ్
మీకు నచ్చింది చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నది అందరికీ నచ్చుతుంది! మన పిల్లలకు కూడా మనం ఇదే చెప్పాలేమో. మనకు నచ్చింది వాళ్లతో చేయించడం కంటే... వాళ్ల అభిరుచిని అర్థం చేసుకుని ప్రోత్సహించాలేమో..! ఎవరైనా అనుకున్నారా.. ఒకరోజు మనం పక్షిలా ఎగరగలమని! ఎవరైనా అనుకున్నారా..ఒకరోజు మనం చంద్రుడిపై కాలు పెట్టగలమని! సచిన్ లైఫ్ లోని థ్రిల్‌ని చూస్తే ఇదే అనిపిస్తోంది. సచిన్ అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నాడు. మన పిల్లలు కనవలసిన బిలియన్ డ్రీమ్స్‌కి స్ఫూర్తిని ఇచ్చాడు. విఖ్యాత సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్పై అభిమానంతో తల్లిదండ్రులు సచిన్ అని పేరు పెట్టారు. ప్రొఫెసర్‌గా పని చేసిన తండ్రి రమేశ్ టెండూల్కర్ ప్రఖ్యాత మరాఠీ రచయిత కూడా. సచిన్‌కు ఇద్దరు సోదరులు నితిన్, అజిత్, సోదరి సవిత ఉన్నారు. వీరిద్దరు రమేశ్ తొలి భార్య సంతానం కాగా, తల్లి రజనికి సచిన్ ఒక్కడే. ఈ విషయాన్ని సచిన్ తన సొంత ఆటోబయోగ్రఫీలో కూడా ప్రస్తావించలేదు. చిన్నప్పుడు టెన్నిస్ స్టార్ జాన్ మెకన్రోను విపరీతంగా అభిమానించిన సచిన్ అతనిలాగే రింగుల జుట్టు పెంచుకొని హెడ్ బ్యాండ్‌తో కనిపించేవాడు. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాటలను సచిన్ అమితంగా ప్రేమిస్తాడు. వేసవి సెలవుల్లో ఓ సాయంత్రం దూరదర్శన్ గైడ్ సినిమా ప్రసారమవుతున్న సమయంలో చెట్టుపైనుంచి పక్కింట్లో చూడబోయే ప్రయత్నంలో సచిన్ కింద పడ్డాడు. దాంతో అతని అన్న అజిత్ పనిష్మెంట్ కింద క్రికెట్ కోచింగ్ క్లాస్‌లకు తీసుకెళ్లాడు. మొదటిసారి గురువు రమాకాంత్ అచ్రేకర్ ముందు వెళ్లినప్పుడు ఆయన ముందు భయంతో సరిగా బ్యాట్ కూడా పట్టలేకపోయాడు. అయితే సచిన్‌లో మంచి ప్రతిభ ఉందని, ఎదురుగా నిలబడకుండా మరో అవకాశం ఇవ్వమని అజిత్ కోరాడు. దాంతో సచిన్‌ను ఆడమని చెప్పిన అచ్రేకర్ చెట్టు చాటునుంచి పరీక్షించారు. అంతే... ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత తన అకాడమీలోకి తీసుకోవడం, చరిత్ర సృష్టించేందుకు అడుగులు పడటం అక్కడే జరిగిపోయాయి. సచిన్ అక్కడ సుదీర్ఘంగా సాధన చేసేవాడు. కుర్రాడిని ఉత్సాహపరిచేందుకు కోచ్ స్టంప్స్‌పై ఒక రూపాయి నాణాన్ని ఉంచేవారు. సెషన్ మొత్తం అవుట్ కాకుండా ఉంటే అది సచిన్‌కు, ఎవరైనా అతడిని అవుట్ చేస్తే అది వారికి దక్కుతుంది. ఈ రకంగా ఎన్నో సెషన్లలో అసలు అవుట్ కాకుండా ఆడిన సచిన్ వద్ద ఆ రూపాయి నాణాలు ఎన్నో భద్రపరిచి ఉన్నాయి. అవన్నీ తన అపురూపమైన కానుకలని అతను అంటాడు. శారదాశ్రమ్ విద్యా మందిర్ స్కూల్ తరఫున సచిన్, వినోద్ కాంబ్లీ కలిసి స్కూల్ క్రికెట్లో ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హారిస్ షీల్డ్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సెయింట్ జేవియర్ స్కూల్‌పై వీరిద్దరు ఏకంగా 664 పరుగులు జోడించారు. ఇందులో సచిన్ 326 పరుగులు, కాంబ్లీ 349 పరుగులు చేశారు. జట్టు అసిస్టెంట్ కోచ్ లక్ష్మణ్ చౌహాన్ ఇక చాలు డిక్లేర్ చేయమని ఎన్ని సందేశాలు పంపించినా... వీరిద్దరు పట్టించుకోకుండా తమ జోరును కొనసాగించారు. ఆ తర్వాత అచ్రేకర్ సర్ తిట్లు తినాల్సి వచ్చింది. ఏ స్థాయికి చేరినా తన మూలాలు మరచిపోని సచిన్, నాలుగు నెలల సుదీర్ఘ పర్యటన తర్వాత 1992 వరల్డ్ కప్‌నుంచి తిరిగొచ్చాక స్థానిక లీగ్‌లలో కీర్తి కాలేజ్ తరఫున ఆడాడు. ప్రేమ... సచిన్‌కంటే అతని భార్య అంజలి వయసులో ఐదేళ్లు పెద్ద. చిన్న పిల్లల వైద్యురాలు. టీనేజర్‌గానే సచిన్, అంజలిపై మనసు పారేసుకున్నాడు. తొలిసారి 1990 న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న సమయంలో సచిన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అంజలి కలిసింది. జర్నలిస్ట్‌గా తనను తాను పరిచయం చేసుకొని నేరుగా అతని ఇంటికే వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఆ ప్రేమ అలాగే పెరిగింది. మూడేళ్ల స్నేహం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో సచిన్ వయసు 22 ఏళ్లు మాత్రమే. సాధారణంగా బయట ఏ కెరీర్ చూసుకున్నా ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం అరుదు. కానీ అంతర్జాతీయ క్రికెటర్‌కు కుటుంబం అవసరం ఎక్కువగా ఉందని భావించిన సచిన్ 1995లో అంజలిని వివాహమాడాడు. సచిన్ విషయంలో కూడా అప్పట్లో అనేక గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా నాటి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌తో ప్రేమ వ్యవహారం అంటూ టెండూల్కర్, శిరోద్కర్ కులాలు కూడా ఒక్కటే... సమస్య లేదు, ఇక పెళ్లే తరువాయి అంటూ కథనాలు ఇచ్చాయి. అయితే సచిన్ తాను అనుకున్నట్లుగా పెళ్లి చేసుకొని వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశాడు. సచిన్ పెళ్లి లైవ్ కవరేజి కోసం ఒక ఛానల్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా అతను తిరస్కరించాడు. 1987 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య వాంఖెడేలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ బాల్ బాయ్‌గా పని చేశాడు. తర్వాతి ఏడాది బ్రబోర్న్ స్టేడియంలో పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా, ఆ టీమ్ తరఫున సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం విశేషం. సునీల్ గావస్కర్ బహుమతిగా ఇచ్చిన ప్యాడ్స్ కట్టుకొని అతను తన తొలి టెస్టు (కరాచీ)లో బరిలోకి దిగాడు. ఎడమ కాలికి ముందుగా ప్యాడ్ కట్టుకునే సెంటిమెంట్ అతడికి ఉంది. ముంబై సహచరుడు ప్రవీణ్ ఆమ్రే తొలి సారి సచిన్‌కు అంతర్జాతీయ క్రికెటర్లు ధరించే బ్రాండింగ్ షూస్‌ను కానుకగా ఇచ్చాడు. సచిన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమ్రే కొత్త అడిడాస్ స్పైక్స్ తీసుకొని అక్కడికి వచ్చాడు. అవి సచిన్‌ను బాగా ఆకర్షించడంతో పదే పదే ఆమ్రేను వాటి గురించి అడిగాడు. దాంతో ఆమ్రే నువ్వు సెంచరీ కొడితే చాలు షూస్ నీవే అన్నాడు. అంతే...తర్వాతి వారమే స్కూల్ క్రికెట్లో సచిన్ శతకం మోత మోగింది. సచిన్ తన కెరీర్ చివర్లో అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం. కెరీర్లో పెద్ద సంఖ్యలో ప్రకటనలకు ప్రచారకర్తగా కోట్లాది రూపాయలు ఆర్జించిన సచిన్ తొలి ప్రకటన బ్యాండ్ – ఎయిడ్. తనతో ఆడుతూ గాయపడిన ఫీల్డర్ వేలికి అతను బ్యాండ్ ఎయిడ్‌తో చికిత్స చేస్తాడు. 1996 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన సమయంలో సచిన్ బ్యాట్‌కు స్పాన్సర్ ఎవరూ లేరు. ఆ తర్వాత అతనితో జత కట్టిన ఎంఆర్ఎఫ్ సుదీర్ఘ కాలం ఆ అనుబంధాన్ని కొనసాగించింది. ప్రకటనల విషయంలో కూడా సచిన్ ఆటను ఏ మాత్రం తక్కువ చేయడానికి ఇష్టపడడు. ఒక సారి పెప్సీ యాడ్‌లో అతను బంతిని ఫ్లై స్వాటర్ (దోమలను కొట్టే పరికరం)తో కొట్టే విధంగా రూపొందించారు. అది క్రికెట్ విలువను తగ్గించినట్లే అని చెప్పడంతో రూపకర్త ప్రహ్లాద్ కక్కడ్ చివరకు స్టంప్స్‌తో బంతిని కొట్టే విధంగా మార్చారు. 1999 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో సచిన్ తండ్రి రమేశ్ కన్నుమూశారు. హుటాహుటిన ఇంగ్లండ్‌నుంచి తిరిగొచ్చిన సచిన్ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్లీ వచ్చి జట్టుతో చేరాడు. కీలకమైన మ్యాచ్‌లో కెన్యాపై సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు. అప్పటినుంచి అతను తాను చేసి ప్రతీ సెంచరీకి ఆకాశం వైపు చూసి తండ్రిని గుర్తు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. 1988లో సచిన్ తొలి సారి రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అంతకు కొద్ది రోజుల ముందు అతను ఒక మ్యాచ్‌లో అతను మరో ఆటగాడు సాయిరాజ్ బహుతులే (భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు) బ్యాట్‌తో బరిలోకి దిగి మంచి స్కోర్ సాధించాడు. దాంతో సెంటిమెంట్‌గా మరో ఫ్రెండ్‌కు చెప్పి అదే బ్యాట్ తెప్పించమని కోరాడు. అదే బ్యాట్‌తో గుజరాత్‌తో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదడంతో చరిత్రకు తొలి అడుగు పడింది. బ్యాట్లను కానుకలుగా ఇచ్చే అలవాటు సచిన్‌కు కూడా ఉంది. 1989లో సచిన్ ఆడిన తొలి టెస్టు పాక్ దిగ్గజ పేస్ బౌలర్ వకార్ యూనిస్‌కు కూడా మొదటి టెస్టే. ఈ సిరీస్ చివరి టెస్టులో వకార్ బౌలింగ్‌లో ముక్కుకు గాయమై రక్తం కారినా కూడా ఇన్నింగ్స్ కొనసాగించి సచిన్ అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత వకార్‌తో మంచి స్నేహం కుదిరింది. ఒక సారి సచిన్ తన బ్యాట్‌ను అభిమానంతో వకార్‌కు కానుకగా ఇచ్చాడు. కొన్నాళ్లకు షాహిద్ ఆఫ్రిది ఇదే బ్యాట్‌తో 37 బంతుల్లో ప్రపంచరికార్డు సెంచరీ సాధించాడు. అంటే పరోక్షంగా ఆ రికార్డులో సచిన్‌దే పాత్ర ఉంది. సచిన్ ఆరంభంలో తాను ఫాస్ట్ బౌలర్‌ను కావాలని కోరుకున్నాడు. మద్రాస్‌లోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ సెలక్షన్స్‌కు కూడా అతను హాజరయ్యాడు. అయితే అక్కడి డైరెక్టర్, దిగ్గజ బౌలర్ డెన్నిస్ లిల్లీ నువ్వు బౌలింగ్‌కు పనికి రావని తేల్చేశాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెడితే మంచిదని మందలించి వెనక్కి పంపించాడు. ఆ రోజు అలా జరగకబోతే క్రికెట్ ప్రపంచం వేల కొద్దీ పరుగులను చూసి ఉండకపోయేదేమో. ►సచిన్ బ్యాటింగ్‌లో రైట్ హ్యాండరే అయినా... తినడం, ఆటోగ్రాఫ్ ఇవ్వడం అంతా ఎడమ చేత్తోనే చేస్తాడు. ►తన తొలి రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్. ►భారతరత్న కూడా అయిన సచిన్‌కు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ ఉంది. మూవీ రివ్యూ సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ సచిన్ అంటే క్రికెట్ ఒక్కటే కాదు... అతని జీవితంలోనూ అందరిలాగే అమ్మా నాన్నల ఆప్యాయత ఉంది...అండగా నిలిచిన అన్న ఉన్నాడు... అడుగులో అడుగు వేసి నడిచిన అంజలి ఉంది. అందులో అందరికీ తెలిసిందే కొంతే. కొడుకుగా, భర్తగా, నాన్నగా మనం చూడని సచిన్‌ను అతను కొత్తగా వెండి తెరపై ‘సచిన్– ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో తనను తను ఆవిష్కరించుకున్నాడు. ఈ చిత్రం నిన్న శుక్రవారం విడుదలైంది. సచిన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సమ్‌థింగ్ స్పెషల్ ‘సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్’ అనేది పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ కాదు. డాక్యుమెంటరీ కమ్ మూవీ. ధోని, అజహర్, మిల్కా సింగ్‌ల తరహాలో మరొకరు సచిన్ పాత్రను పోషిస్తూ సన్నివేషాలను షూట్ చేయలేదు. ఇందులో సచిన్ మాత్రమే కనిపిస్తాడు. వినిపిస్తాడు. తన చిన్ననాటి అల్లరి, ఆట పాటల మొదలు దిగ్గజంగా ఎదిగే వరకు వేర్వేరు దశల్లో సచిన్ తన గురించి తాను చెప్పుకుంటాడు. మధ్యలో గొప్ప మ్యాచ్‌లు, విజయాలు, పరాజయాలు, వివాదాలు.... ఇలా అన్నీ రియల్స్ విజువల్స్ చూపిస్తూ మనల్ని మరోసారి పాత రోజుల్లోకి ఈ సినిమా తీసుకెళుతుంది. దాదాపు 10 వేల గంటల వ్యవధి గల సచిన్ వీడియోలను తీసుకొని వాటిని సందర్భానుసారం ఈ సినిమాలో వాడుకున్నారు. అలాగే తనకు మాత్రమే పరిమైతమైన కొన్ని అరుదైన ఫ్యామిలీ వీడియోలు కూడా సచిన్ మనకు చూపించాడు. – మొహమ్మద్ అబ్దుల్ హాది, సాక్షి క్రీడా ప్రతినిధి -
పరిపూర్ణ స్వీయచరిత్రలో ఒక పేజీ
నేను పోతే పిల్లల గతేంటి? వాళ్లని కనీసం దగ్గరికి తియ్యని ఈ తండ్రి ఎలా రక్షిస్తాడు? తల్లిని అయిన నేను నిర్దయగా వాళ్లని వదిలి వెళ్లడం ఏం న్యాయం? నిజానికి పిల్లలు తమకు తాముగా వచ్చారా ఈ లోకంలోకి? పెద్దలమేగా తీసుకొచ్చింది? అలాంటప్పుడు వాళ్లను దిక్కుమాలిన వాళ్లను చేసి వెళ్లిపోవడం ఎంత దుర్మార్గం? మా కామ్రేడ్(దాసరి నాగభూషణరావు) బాగా మితభాషి. ఇంట్లో వున్నప్పుడూ, ఇంటి సంబంధ విషయాల్లోనూ ఈ రీతి మరికొంత అధికంగా వుండేది. వారాల పర్యటనల తరువాత ఇంటికి చేరినా అనునయ పలకరింపులు శూన్యం! అయితే ఇంటికైనా, ఆఫీసుకైనా వస్తుండే వారితో సంభాషణలు ధారాళంగా సాగుతుండేవి. భార్యకూ, బిడ్డలకూ చనువు బొత్తిగా ఇవ్వని ఈయనగారి ఈ రీతి అతని భూస్వామ్య లక్షణంగా అనిపించేది నాకు. ఆ ఇళ్లల్లో స్త్రీలకు తగు స్థానం ఉండదు, గౌరవం ఉండదు. మగాళ్లకు వీలైనంత దూరంగా వుంచడం రివాజే. అయితే అన్నింటా సమత్వాన్ని కాంక్షించే ఆదర్శ కమ్యూనిస్టు నేతకు అవే రీతులు, అవే నీతులా? నన్ను మిక్కిలిగా బాధిస్తుండిన సంగతి ఈయన పిల్లల్ని దగ్గరికి రానివ్వకపోవడం! వాళ్లనసలు పలకరించకపోవడం! ఆ తండ్రి ఇంటికొచ్చినప్పుడు, ఇంట్లో వున్నప్పుడు పిల్లలు భయంతో బిక్కుబిక్కుమనడమేమిటి? ఇంట్లోని ముందరి గది తనకు ప్రత్యేకించుకుని, తాళం వేసుకుని బయటకు వెళ్లడం, పిల్లలను అందులో కాలుబెట్టనివ్వకపోవడం ఏ బాంధవ్యానికి చిహ్న? ఈ అంటీ ముట్టని స్థితి ఒక ఘటన సందర్భంలో అంత్యస్థితికి చేరింది. ఇంట్లో ఒక మూలగదిలో ఇంటివాళ్ల తాలూకు ‘గడమంచి’ ఒకటుండేది. మా నాలుగేళ్ల (దాసరి) అమరేంద్ర అదొక ఆటగా దాని మీద నించి కిందకి దూకినప్పుడు కిందపడి, మోచేతి కీలు తొలిగింది. పొరుగింటి సుబ్బమ్మ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లి, చేతికి కట్టు కట్టించి తీసుకొచ్చాను. అప్పుడీయన ఇంట్లోనే వున్నా, బిడ్డను కనీసం పలకరించలేదు, ఓదార్చలేదు. చెయ్యి బాగా వాచి, కదల్చలేక బాగా ఏడ్చేవాడు. తండ్రిగారు తన గదినించి అసలు బయటికొచ్చి, పిల్లాణ్ణి చూస్తేనా? నాకప్పుడు ఏమనిపించిందంటే మేము తన సాటికులం వాళ్లమయి వుంటే బిడ్డ మీద ప్రేమ కనబరచి, ముద్దు చేసి ఉండేవాడేమోనని. నన్ను కోరి చేసుకుంటేనేం? తనలో పసితనం నించీ జీర్ణించిన కులాధిక్యత, ఇటు నా హీనకుల దీనస్థితి నాకు పుట్టిన బిడ్డల్ని చులకనగా, నిర్లక్ష్యంగా చూచేట్టు చేస్తున్నాయేమో అని అనుకుంటుండేదాన్ని. ఇంతలో సరిగ్గా వేసవి సెలవుల ముందు సెలవు కాలంలో జీతమివ్వవలసి వస్తుందని నన్నూ, మరో ఇద్దరు టీచర్లనూ ఉద్యోగాల్నించి తొలగించారు మేనేజిమెంటు వాళ్లు. సంసారానికి తోడ్పడుతున్న ఆ నా కొంచెం సంపాదనా ఆగిపోయింది. రానురాను ఇల్లు గడవడం కష్టమవసాగింది. ఇల్లు నిప్పచ్చరంగా మారింది. పార్టీ పనుల్లో, పర్యటనల్లో యథారీతిని నిమగ్నమై వుంటున్న దాసరిగారికి ఇంటి పరిస్థితిని గురించిన స్పృహే వుండేది కాదు. క్రమక్రమంగా బ్రతుకు ఏ రోజుకారోజు గడవడం గగనంగా వుండసాగింది. పిల్లలకు దొరుకుతున్నది అరకొర తిండి, విడవా మడవా రెండు జతల బట్టలు. అవైనా బాగా పాతబడ్డవి. అరుదుగానే అయినప్పటికీ ఆర్థిక సమస్యలు మా ఇద్దరి మధ్య కలహాలు రేపుతుండేవి. ఒక సందర్భంలో నా మూలంగా పోగొట్టుకున్న వేల కట్నాల ప్రస్తావన ఆయన నోటి వెంట వచ్చింది. తన పెండ్లి మరోవిధంగా అయివుంటే కనీసం ఏభై వేలు కట్నంగా వచ్చి వుండేవనీ, తన విలువను నేను గుర్తించడం లేదనీ అంగలార్చడం మొదలుపెట్టాడు. మరికొన్ని కఠినమైన, అవమానకరమైన మాటలతో విపరీతంగా నన్ను గాయపరిచిన దినమది. కామ్రేడ్ దాసరి ఆంతర్యం వెలుగు జూచిన దినమది. ఆ రాత్రి నేనూ పిల్లలూ పడుకున్న మా వేరు గదిలో నిద్రపోతున్న ముగ్గుర్నీ(దాసరి శిరీష, అమరేంద్ర, శైలేంద్ర) తడిమి చూస్తూ దుఃఖించసాగాను. వాళ్లనలా వదిలేసి, పక్కింటివారి బావిలో ఎలా పడిపోవాలా అనుకుంటూ, ఎన్నడూ కలగని పిరికితనంతో, దైన్యంతో ఒకటే దుఃఖం! బాల్యంనించీ పార్టీ అందిస్తున్న స్ఫూర్తితో ధైర్యానికీ పట్టుదలకూ మారుపేరుగా వుండిన నాకు ఎందుకింత నిస్పృహ! ఎందుకింత పిరికితనం! నేను పోతే పిల్లల గతేంటి? వాళ్లని కనీసం దగ్గరికి తియ్యని ఈ తండ్రి ఎలా రక్షిస్తాడు? తల్లిని అయిన నేను నిర్దయగా వాళ్లని వదిలి వెళ్లడం ఏం న్యాయం?. నిజానికి పిల్లలు తమకు తాముగా వచ్చారా ఈ లోకంలోకి? పెద్దలమేగా తీసుకొచ్చింది? అలాంటప్పుడు వాళ్లను దిక్కుమాలినవాళ్లను చేసి వెళ్లిపోవడం ఎంత దుర్మార్గం? పైగా వాళ్లని కడుపారా కన్న కన్నతల్లులు ఇలా చెయ్యతగునా? దయ, కరుణ అన్న స్పందనలు మగవాళ్లకు వుండకపోవచ్చు– తల్లి హృదయం స్పందించకుండా వుండగలదా? మధ్య రాత్రి వరకూ ఈ విధమైన ఆలోచనలు, సంవేదనలతో కల్లోలపడిన మనసు, క్రమంగా స్థిరత్వం పొంది, నన్ను బావి దగ్గరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. -
నా ఆటోబయోగ్రఫీ నేను రాసుకోలేను: సల్మాన్
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఎవరికి తెలుసుకోవాలని ఉండదు చెప్పండి. సల్మాన్ ఖాన్ కూడా తన ఆత్మకథ రాస్తే బాగుండు. తన కలర్ ఫుల్ లైఫ్ గురించి మరింత తెలుసుకోవచ్చని ప్రతి ఒక్కరి మనసులో మెదలాడుతూ ఉంటుంది. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం తన ఆటోబయోగ్రఫీ రాసుకోవడానికి తను సాహసించలేనని చెప్పేశారు. తాజ్ ల్యాండ్స్ లో జరిగిన ఆశా పరేఖ్ ఆటో బయోగ్రఫీ'' ది హిట్ గర్ల్'' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ''నేను ఇక్కడ నిల్చుని మాట్లాడే అర్హత కలిగిఉన్నానని తాను భావించడం లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆశా ఆంటీ మా కుటుంబానికి చాలా ప్రియమైన వారు. ఆటోబయోగ్రఫీ రాయడం, జీవిత చరిత్రను ఆవిష్కరించడం నిజంగా చాలా సంక్లిష్టమైన అంశం. అలాంటి దాన్ని నేను రాయలేనేమో'' అని సల్మాన్ చెప్పారు. ఎందుకో ధరమ్ జీ(ధర్మేంద్ర)కి అర్థమయ్యే ఉంటుందని అన్నారు. అప్పట్లో ప్రొఫిషినల్ గా పోటీ ఎలా ఉండేదో వివరించారు. ఆశా ఆంటీ, సైరా ఆంటీ, హెలెన్ ఆంటీలు స్నేహానికి ప్రతిరూపమని అభివర్ణించిన సల్మాన్, ప్రస్తుత తరం వారు వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. వారు ఎంతో గొప్పజీవితాన్ని లీడ్ చేశారని, ప్రస్తుత తరం వారు దాన్ని మిస్ అవుతున్నారని పేర్కొన్నారు. సల్మాన్ తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన ఆశా, సినిమా రంగంలో తనకు సహకరించిన వారందరికీ, అభిమానులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. సలీమ్ ఖాన్, ధర్మేంద్ర, జితేంద్ర, వాహీదా రెహ్మన్, హెలెన్, అర్పితా ఖాన్, ఇమ్రాన్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఈ బుక్ ఓపెనింగ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. -
దళిత స్త్రీ వాదాన్ని ఎత్తిపట్టిన మొదటి ఆత్మకథ
ఆవిష్కరణ జనవరి 28న సాయంత్రం 5:30కి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘మా బతుకులు’ పుస్తకావిష్కరణ జరగనుంది. మరాఠీ మూలం: బేబీ కాంబ్లే. మరాఠీ–ఇంగ్లిష్: మాయ పండిట్. తెలుగు: బి.అనూరాధ. ఆవిష్కర్త: ప్రొఫెసర్ సుజితారు. ప్రచురణ: ‘మలుపు’. ఫోన్: 9866559869. అంబేడ్కర్ నడిపిన చారిత్రాత్మక దళిత ఉద్యమంలో తొలితరం మహిళా కార్యకర్త బేబి కాంబ్లే. ఆమె రాసిన ‘జీనా అమూచ’(మా బతుకులు) తెలుగులోకి చాలా ఆలస్యంగా వస్తోంది. మరాఠీ దళిత సాహిత్యం నుంచి కొన్ని కవితలు, కథలు తెలుగులోకి వచ్చాయి కానీ ఆత్మకథలు, నవలలు రాలేదు. ఆలస్యంగానైనా దళిత ఆత్మకథ తెలుగులోకి రావడం ఆహ్వానించదగినది. బేబి కాంబ్లే తన భర్తతో పాటు చిన్న కిరాణా షాపు నడుపుకునేది. పెద్దగా చదువుకోలేదు. తన జీవితకాలంలో మహర్ల జీవితంలో వచ్చిన మార్పుల్ని తన అనుభవాల రూపంలో రాసింది. 1960లలోనే చాలా నోట్స్ పుస్తకాలు నింపేసింది. తన రాతలను భర్త చూస్తే అభ్యంతర పెడతాడని ఆ నోట్స్ పుస్తకాలని పాత పుస్తకాలు, పత్రికలతో పాటు అటకపై దాచేసింది. 1980లలో మహారాష్ట్రలో పరిశోధన చేయటానికి వచ్చిన సామాజిక శాస్త్ర పరిశోధక విద్యార్థి మాక్సీన్ బెర్నస్టీన్... బేబీ కాంబ్లేను కలిసింది. బేబీ కాంబ్లే చెప్పిన ఉద్యమ అనుభవాల్ని విని, ఈ అనుభవాల్ని రాస్తే బాగుంటుందని అన్నది. అవి విన్న బేబీ కాంబ్లే తాను ఎప్పుడో రాశానని చెప్పింది. బెర్నస్టీన్ ఆ పుస్తకాల్ని తెప్పించుకుని చదివింది. ఒక మహిళా పత్రిక వారితో మాట్లాడి ఈ ఆత్మకథని 1982లో ధారావాహికంగా ప్రచురించడానికి సహాయపడింది. అది పుస్తకరూపంలో 1986లో వచ్చింది. మరాఠీ సాహిత్యంలో, బహుశా భారతీయ భాషల్లోనే దళిత మహిళ రాసిన మొదటి ఆత్మకథగా దీన్ని చెప్పవచ్చు. ఈ పుస్తకాన్ని ‘ద ప్రిజన్స్ వియ్ బ్రోక్’ పేరుతో 2008లో ఇంగ్లిష్‌లో ప్రచురించారు. ‘మా బతుకులు’ రాసిన తరువాత 20 ఏళ్లకు మరాఠీ భాషలో పుస్తకరూపంలో వచ్చింది. మరో 20 ఏళ్ల తరువాత ఇంగ్లిష్‌లో ప్రచురితమైంది. దళిత మహిళల అనుభవాలు, ఆలోచనలు వెలుగులోకి రావటం ఎంత కష్టమో ‘మా బతుకులు’ ప్రచురణ చరిత్ర చదివితే అర్థమవుతుంది. మరాఠీ దళిత సాహిత్య చరిత్రలో ఆత్మకథా ప్రక్రియ ఒక విశిష్టతను సంతరించుకుంది. ఆత్మకథా ప్రక్రియ అనగానే ‘‘ప్రముఖులు’’, తత్వవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, అందులోనూ పురుషుల వ్యక్తిగత జీవిత చరిత్రని రికార్డు చేసే రూపంగా మనకి తెలుసు. అరకొర చదువులతో, సాధారణ వ్యక్తులైన దళితులు తమ జీవిత చరిత్రలు రాసి ఆ మొదటి ప్రయత్నంలో రచయితలుగా ఎదిగారు. ఆత్మకథా ప్రక్రియ రూపురేఖల్ని మార్చి వేసారు. ఈ ప్రక్రియ చుట్టూ ఏర్పరిచిన సరిహద్దుల్ని చెరిపేసారు. దయాపవార్ రాసిన ‘బలూత’, శరణ్ కుమార్ లింబాలే రాసిన ‘అక్కర్ మాషీ’ లాంటి ఆత్మకథలు సంచలనం సృష్టించాయి. సాధారణ వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా మొత్తం దళితుల సామూహిక జీవన దృశ్యాన్ని చిత్రించే ప్రయత్నం చేశాయి. ‘మా బతుకులు’ దళిత మహిళ దృష్టికోణం నుంచి, దళిత జీవితాన్ని, మొత్తంగా సమాజపు స్వభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ‘మా బతుకులు’లో మహారాష్ట్రలో అంటరాని కులస్తులైన మహర్ల జీవితాన్ని రెండు భాగాలుగా విభజించి చూపించారు. మొదటి భాగంలో మహర్ల సాంప్రదాయక సంస్కృతి, జీవితం, రెండవ భాగంలో అంబేడ్కర్ ఉద్యమ వెలుగులో మహర్లు ఆధునికత వైపు అడుగులు వేయటాన్ని చూడవచ్చు. మహారాష్ట్రలోని పూనా సమీపంలోగల వీర్‌గాంవ్ గ్రామంలోని మహర్ల జీవితం గురించి బేబీ కాంబ్లే రాసింది. ఆ గ్రామంలో తన అమ్మమ్మగారి ఇంట్లో ఆమె పుట్టింది. బేబీ కాంబ్లే తన వ్యక్తిగత జీవిత వివరాల కంటే మహర్ కుల ప్రజల జీవిత చరిత్రకే ప్రాధాన్యత ఇచ్చింది. మహర్ల జీవిత చరిత్రలోనే ఆమె జీవిత చరిత్ర ఉందని ఆమె భావించింది. అంటరానితనం, కులవివక్ష, పేదరికం, అజ్ఞానంలో బతుకుతున్న మహర్లు దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ప్రతి కుటుంబానికి 8 నుంచి 15 మంది పిల్లలు ఉంటారు. పూరి గుడిసెల్లో సరైన బట్టలు, వంట పాత్రలు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఆనాటి మహర్లని చూస్తే ‘‘ఎలుకలు కొరికేసిన గుడ్డ బొమ్మల్లాగుంటారు’’. మహర్ కులంలో మహిళలది చాలా కీలకమైన పాత్ర. కుల సంప్రదాయాలు, ఆచారాలు పాటించడంలో వారు చాలా నిష్టగా ఉంటారు. ఆషాడ మాసంలో జరిగే ‘పవిత్ర’ స్నానాలు, ఆచారాల గురించి చాలా వివరమైన, సుదీర్ఘమైన వర్ణనలు ఉన్నాయి. స్నానం తరువాత గోచిగుడ్డ, చింకిపాతల చీరలే, కొత్త దుస్తులుగా కట్టుకుంటారు. పండుగలకు, జాతర్లకు అలంకరణ చేయడం, వంటలు, నైవేద్యం తయారు చేయడం నుంచి అమ్మవారిలా పూనకం ఊగే వరకు అన్ని రకాల మంత్రతంత్రాలు, తంతుల్లో మహర్ మహిళలు పాల్గొంటారు. ఈ ఆత్మకథలో మూడు తరాల మహర్ మహిళలు కనిపిస్తారు. అమ్మమ్మలు/ నాన్నమ్మలు, అమ్మలు/ అత్తలు, కూతుళ్లు/ కోడళ్లు. చిన్న వయస్సులోనే కష్టాలకు, అణచివేతకు గురయ్యే కూతుళ్లు, కోడళ్ల గురించి కొంత తెలుసుకోవాలి. మహర్ కులంలో అమ్మాయిలకు 7 లేదా 8 ఏళ్లకే పెళ్లయిపోతుంది. శారీరకంగా ఎదగకుండానే గర్భవతులవుతారు. అనేక అనారోగ్య సమస్యలతో వారిలో చాలామంది ప్రసవ సమయంలో చనిపోతారు. ఇక కోడళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వేకువ జామునే లేచి జొన్నలు దంచాలి. రొట్టెలు చేయాలి. నీళ్లు మోసుకురావాలి. మొత్తం ఇంటిపనంతా కొత్త కోడలే చేయాలి. అత్తగారు, ఆడపడుచులు, బావగార్ల తిట్లు, వేధింపులు భరించాలి. ఈ పని ఒత్తిడి, వేధింపులు భరించలేక కొందరు కొత్త కోడళ్లు పారిపోతారు. వాళ్లను పట్టుకొని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తారు. మహర్వాడలో ప్రతి ఇంటినుంచి కోడళ్ల ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉంటాయి. కొందరి తలలు పగలడం, ఎముకలు విరగడం, వారు స్పృహ తప్పి పడిపోవడం సర్వసాధారణం. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల గురించి, పెళ్లిళ్లలో మిగిలిన ఆహారం తినడం, చచ్చిన గొడ్డు మాంసాన్ని దాచుకుని రోజుల తరబడి తినడం, ఆకలితో చావలేక బ్రహ్మజెముడు కాయలు తిని కడుపు పాడై ఇబ్బందులకు గురికావడం లాంటి అనేక విషయాల్ని బేబీ కాంబ్లే విపులంగా వర్ణించారు. అందుకే మహర్లు తోకలేని జంతువులుగా బతికారని అంటుంది. ‘‘జంతువులుగా జీవిస్తున్న వారిని మనుషులు’’గా అంబేడ్కర్ మార్చారని బేబీ కాంబ్లే అంటుంది. చిన్న బాలికగా ఉన్నప్పుడు అంబేడ్కర్ ఒక సమావేశంలో చేసిన ప్రసంగాన్ని ఆమె విన్నది. ఆయన మాటల్ని ఆచరణలో పెట్టింది. అంబేడ్కర్ ‘‘మనమూ మనుషులమే. మనకూ మనుషులుగా జీవించే హక్కు’’ ఉందని ప్రకటించాడు. ఆత్మగౌరవంతో బతకలేకపోతే చావడం మేలన్నాడు. చచ్చిన గొడ్డు మాంసాన్ని తినవద్దన్నాడు. తిండిలేక కొందరు చనిపోయినా, బతికినవారు గౌరవంగా, మర్యాదతో బతుకుతారని అన్నాడు. ఈ బానిస బతుకు మనపై రుద్దబడింది. ఇది పోవాలంటే పోరాటం తప్పదన్నాడు. ముఖ్యంగా ఈ విప్లవాత్మక సంస్కరణలో మహిళలే ముందుండాలి అన్నాడు. జాతిని మేల్కొలిపి, పోరాటాల ద్వారా చైతన్యపరచి మహర్ కుల ప్రజల్ని ఆధునికత వైపు నడిపించాడు. ఈ ఆత్మకథలో అంబేడ్కర్ ఒక పాత్రగా చారిత్రక వ్యక్తిగా ఉద్యమ ప్రతీకగా కనిపిస్తారు. అంబేడ్కర్ జయంతినాడు తెల్లని బట్టలు ధరించి ఆత్మగౌరవంతో నడుస్తూ కొత్త మనుషుల్లా మహర్లు కనిపించడంతో కథ ముగుస్తుంది. కొస మెరుపుగా, చదువుకున్న దళితులు స్వార్థంతో జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారనీ, అంబేడ్కర్ ఆశించింది ఇదేనా? అనీ బేబీ కాంబ్లే ప్రశ్నిస్తుంది. కె.సత్యనారాయణ పై వ్యాసం, ముందుమాటనుంచి సంక్షిప్తం చేసింది. -
గొంగళి పురుగు ముద్దు
నటి రేఖ (62) జీవితంలోని ఎన్నో విషాదాలలో ఒకటి... పదిహేనేళ్ల వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా ముద్దు పెట్టించుకోవడం! ‘నో’ అని చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్వడం. జీవితాంతం ఆ దుఃఖాన్ని మోస్తూనే ఉండడం! ‘లాస్ట్ టాంగో ఇన్ పారిస్’ అనే ఇటాలియన్ మూవీ 1972లో వచ్చింది. డైరెక్టర్ బెర్నార్డో బెర్తొలూచీ. ‘అంజానా సఫర్’ 1969 నాటి బాలీవుడ్ చిత్రం. దాని డైరెక్టర్ రాజా నవేథి. ఒకదానికొకటి సంబంధం లేని ఈ రెండు చిత్రాలు అకస్మాత్తుగా ఇప్పుడు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవిగా కనిపిస్తూ వార్తల్లోకి వచ్చాయి! లాస్ట్ టాంగో చిత్రంలో 19 ఏళ్ల ఫ్రెంచి నటి మారియా షినీడేర్ను రేప్ సీన్ షూటింగ్ సాకుతో ఆ చిత్ర దర్శకుడు, నటుడు కూడబలుక్కుని ‘అబ్యూజ్’ చేశారు. అంజానా సఫర్లో ఆ చిత్ర దర్శకుడు, హీరో ఒకరికొకరు కన్నుగీటుకుని 15 ఏళ్ల రేఖను ముద్దు సీన్ షూటింగ్ సాకుతో ‘అబ్యూజ్’ చేశారు. లాస్ట్ టాంగో కన్నా మూడేళ్ల ముందే అంజానా సఫర్ విడుదలైనప్పటికీ, 2013లో లాస్ట్ టాంగో డైరెక్టర్ ఆనాటి అబ్యూజ్ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టి, అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హాలీవుడ్ నివ్వెరపోయింది. సినిమా ఫీల్డులో మహిళలు ఇంత అమాయకంగా లైంగిక దోపిడీకి గురవుతారా అనే ఒక అశ్చర్యంతో కూడిన చర్చ మొదలైంది. అదింకా కొనసాగుతుండగానే, ‘మనవాళ్లేం తక్కువా?’ అని నిఖితా దేశ్‌పాండే అనే అమ్మాయి.. ‘అంజానా సఫర్’ చిత్రం షూటింగులో డైరెక్టర్ రాజా నవేథి.. రేఖను హీరో బిస్వజీత్కు ఉద్దేశపూర్వకంగా ఎలా ‘అప్పగించిందీ’ తన ట్వీట్లో వివరంగా రాసింది. అందుకు రుజువుగా ఇటీవలే విడుదలైన రేఖ బయోగ్రఫీ (రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరీ – రచన యాసర్ ఉస్మాన్) లోని ఒక పేజీని అటాచ్ చేసింది. ‘‘నవేథి యాక్షన్ అని చెప్పగానే బిస్వజీత్ పదిహేనేళ్ల రేఖను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె పెదవులపై తన పెదవులను గట్టిగా అదిమి పట్టాడు. ‘యాక్షన్’ అని చెప్పిన నవేథి ఐదు నిమిషాల తర్వాత కానీ ‘కట్’ చెప్పలేదు. ఆ ఐదు నిమిషాలలో చిన్న చిన్న బ్రేక్‌లతో ఆ ముద్దు సీన్ అలా కంటిన్యూ అయినంత సేపూ రేఖ కళ్లు మూసుకుని, బాధను ఓర్చుకుంటూ, మనసును చిక్కబట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ తర్వాత రేఖ చాలాసేపు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది’’ అని యాసర్ ఉస్మాన్ ఆ పేజీలో రాశారు. నిఖిత ట్వీట్ తర్వాత సినిమా ఫీల్డుతో పాటు ఇప్పుడు మిగతా రంగాలలోని మగవాళ్లూ భుజాలు తడుముకుంటున్నారు. ఊరికే తడుముకుంటే కాదు బాస్.. ఆత్మ విమర్శ చేసుకోవాలి. రేఖ ఆత్మకథలోని ఓ పేజీ -
హంతకురాలి ఆత్మకథ
-
రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..
చెన్నై: ‘నా కూతుర్ని చూసి పదేళ్లైంది. తను లండన్‌లో డాక్టర్ అయిందని బంధువులు చెప్పారు. ఈ మధ్యే తనకో ఉత్తరం రాశా. నా కూతురు, జైల్లోనే ఉన్న నాభర్తతో కలిసి ఒకే ఒక్కరోజు గడపాలి. కని, అనాథగా వదిలేసినందుకు క్షమాపణ అడగాలి. తనను గుండెలనిండా కౌగిలించుకోవాలి’ ఇది..ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మహిళ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళిని శ్రీహరన్ చివరికోరిక. ఉరిశిక్ష పడిన దోషిగా గడిచిన 25 ఏళ్లుగా చెన్నైలోని వేలూరు సెంట్రల్ జైలులో ఉంటోన్న నళినిపై ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ మొదటిసారి ఆమె తన ఆత్మకథను చెప్పుకుంటున్నారు. తమిళంలో 500 పేజీల్లో పొందుపర్చిన నళిని ఆత్మకథ నవంబర్ 24న విడుదల కానున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.. తన తల్లి పేరు పద్మావతి అని, చెన్నైలో నర్స్ గా పనిచేసేదని, మహాత్మా గాంధీ ఓ సారి చెన్నై వచ్చినప్పుడు ఆమెకు పేరు పెట్టారని నళిని చెప్పుకొచ్చింది. 1991లో.. శ్రీహరన్ అనే వ్యక్తి నళిని ఇంట్లో ఇంట్లోకి అద్దెకు దిగడం, క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, తల్లిని ఒప్పించి శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ ని నళిని పెళ్లి చేసుకోవడం, కొంతకాలానికి ఇంట్లో చుట్టాల తాకిడి పెరిగగడం, శ్రీహరన్ కోసం శ్రీలంక నుంచి చాలా మంది వస్తూపోతుండటం తదితర విషయాలను నళిని తన ఆత్మకథలో పూసగుచ్చినట్లు వివరించారు. ఒక భయంకరమైన రోజు భర్తతో కలిసి ఇల్లు విడిచి పారిపోయానని, కొద్ది రోజులకే సీబీఐ వాళ్లు తమతోపాటు 14 మందిని అరెస్ట్ చేశారని, దాదాపు 50 రోజులపాటు ఇంటరాగేషన్ లో థార్డ్ డిగ్రీలో ఎన్నిరకాలుగా టార్చర్ పెడతారో అన్నీ అనుభవించానని నళిని పేర్కొన్నారు. ఇటీవల కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో నళిని(ఇన్సెట్ నళిని-శ్రీహరన్ ల కూతురు అరిత్రా) ‘ఒక సారి జైల్లో నాతో మాట్లాడటానికి ఒకామెవచ్చింది. తనను తాను ప్రియాంకా గాంధీ అని పరిచయం చేసుకుంది. చాలా సేపు నాతో మాట్లాడింది. ‘మా నాన్న చాలా మంచివారు. ఆయనను ఎందుకు చంపారు?’అని పదేపదే ప్రశ్నించింది. నావరకు అది సమాధానం తెలియని ప్రశ్న! అసలు రాజీవ్ గాంధీ గురించి నాకేమీ తెలియదు. ప్రియాంకా గాంధీ నన్ను ఎందుకు కలిశారో అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థంకాదు. నా భర్త పేరు శ్రీహరన్ అని కాకుండా మురుగన్ గా మారిపోవడమూ నాకు అంతుపట్టని విషయం. అరెస్ట్ అయ్యే నాటికి నేను రెండు నెలల గర్భవతిని. థార్డ్ డిగ్రీ టార్చర్ ను భరించానంటే కేవలం నా కడుపులో పెరుగుతున్న నలుసు కోసమే. కోర్టు విచారణకు తీసుకెళ్లినప్పుడా పోలీసులు మాకు వైద్యపరీక్షలు చేయిచేవాళ్లు. ఉరిశిక్ష పడబోతున్న నాకు అబార్షన్ చేయాలని పోలీసులు డాక్టర్లమీద ఒత్తిడి చేసేవారు. అందుకు డాక్టర్లు ఒప్పుకోలేదు. ఆ డాక్టర్లు ఎక్కడున్నారోగానీ వాళ్లకు నా నమస్కారాలు. జైలులోనే బిడ్డను కన్నా. పక్కనే మగవాళ్ల జైలులో నా భర్త శ్రీహరన్ ఉంటాడు. అప్పట్లో కలుసుకునే వీలండకపోయేది. పాపకు అరిత్రా అని పేరుపెట్టుకున్నాం. తనకు రెండేళ్లు నిండాక మా ఆయన తరఫు బందువులు అరిత్రను తీసుకెళ్లారు. 2005లో చివరిసారిగా నా కూతుర్ని చూశా. ఇప్పుడు తను లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోందని, నన్ను, నా భర్తను విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని బంధువుల ద్వారా తెలిసింది. 2000లో నాకు క్షమాభిక్ష పెట్టినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి భర్తను కలిసి మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ కొద్దిసేపే కాస్త ఊరట దొరుకుతుంది. జైలు అధికారులు.. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఏఐడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తారు. జయలలిత సీఎంగా ఉన్నన్నాళ్లూ మాపై వేధింపులు ఉండవు. ఈ మధ్యే కొందరు బెదిరింపులు పంపుతున్నారు.. ‘నీ బిడ్డను లండన్ నుంచి శ్రీలంక వెళ్లిపొమ్మను.. లేకుంటే చంపేస్తాం’ అంటున్నారు. వాళ్ల చంపుళ్లు ఎలా ఉన్నా నాకు మాత్రం ఒక్కసారైనా బిడ్డను కలుసుకోవాలని ఉంది. నేను, నా భర్త, కూతురు.. ముగ్గురం కలిసి ఒక్కరోజు గడపాలి’ అని నళిని తన ఆత్మకథలో చివరి కోరికను వెల్లడిస్తారు. నవంబర్ 24న విడుదల కానున్న ఈ పుస్తకానికి మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి డి. హరిపరానథమన్, ఎండీఎంకే పార్టీ నేత వైకో, వీసీకే నేత తిరుమావలవన్, రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు సీమాన్ తదితరులు ముందు మాటలు రాశారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం సీబీఐ అదుపులో మురుగన్ అలియాస్ శ్రీహరన్, నళిని(ఫైల్ ఫొటో) రాజీవ్ హత్యకేసుకు సంబంధించి కీలక పరిణామాలు.. -
కృష్ణవేణమ్మ ప్రేమ ఒడిలో...
తుంగభద్ర ఒక నది కాదు. తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒకటైపోయాయి. తుంగడు యాదవ బాలుడు. గోవులనూ, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. వయసు ఇరవై వుండవచ్చు. యౌవనం అతనిలో తొణికిసలాడింది. తుంగడు మురళి వాయించేవాడు. గోవులూ, గొర్రెలు, చెట్లు, చేమలూ తలలూపుతూ తన్మయత్వంతో వినేవి. ఈ ప్రాంతాన్ని ఒక కన్నడరాజు పాలిస్తున్నాడు. అతని కూతురు పేరు భద్ర. అందాల రాశి. భద్ర- తుంగడు మ్రోగించే మురళి విన్నది. గోపాలకృష్ణ వద్దకు రాధ వెళ్లినట్లు, భద్ర... తుంగడి వద్దకు వెళ్లిపోయింది. ఇది కొన్నాళ్లు సాగింది. రాజుకు తెలిసింది. ఇద్దరినీ అడివిలో కదంబవృక్షం క్రింద పట్టుకున్నారు. ‘‘మమ్మల్ని యెవ్వరూ విడదీయలేరు’’ అంది భద్ర. తుంగణ్ణి చితక్కొట్టించాడు రాజు. అతని రక్తాన్ని తిలకంగా ధరించింది భద్ర. ఇద్దర్నీ విడదీశారు రాజభటులు. భద్ర కరిగినీరై, నదియై ప్రవహించింది. తుంగడు కరిగి నీరై, నదియై ప్రవహించాడు. అలా విడివిడిగా ప్రవహిస్తూ వెళ్లిపోయారు. రాజు గుండె పగిలి చచ్చాడు. మైళ్లు, బీళ్ళు, రాళ్ళు, బోళ్ళు, గుళ్ళు దాటి వెళ్ళి ఒకచోట తుంగ, భద్ర కలుసుకొని తుంగభద్ర అయింది. వారు ప్రేయసీప్రియులు, భార్యాభర్తలు. కనుక ఇక సముద్ర సంగమం సాధ్యపడే విషయం కాదు. అందుకే తల్లిలాంటి కృష్ణవేణమ్మ ఒడిలో చేరిపోయారు. - డా. దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి... -
పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సల్మాన్!
ఔను! బాలీవుడ్ మోస్ట్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ స్వయంగా తన పెళ్లి తేదీని ప్రకటించాడు. నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయినా.. ఆయన మహిళా అభిమానులు.. అయ్యో సల్మాన్ పెళ్లి చేసుకుంటున్నాడని బాధపడక్కర్లేదు. ఎందుకంటే నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని సల్మాన్ ప్రకటించాడు.. అది ఏ సంవత్సరంలో అన్నది మాత్రంలో చెప్పలేదు. ముంబైలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ ను స్వయంగా సానియానే 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న ఎంతో కీలకమైనది కావడం వల్ల సమాధానం చెప్పాలని కోరింది. ఈ ఊహించని ప్రశ్నతో కాస్త ఇబ్బంది పడ్డ సల్మాన్ కొంత ఆలోచించుకొని.. నవంబర్ 18న అని చెప్పాడు. తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అదే తేదీన పెళ్లి చేసుకోవాలని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఇలాంటి నవంబర్ లో 20-25 వచ్చిపోయాయని, నవంబర్ 18న పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ, అది ఏ సంవత్సరంలోనో తెలియదని సల్మాన్ భాయ్ చెప్పాడు. మీరు పెళ్లి చేసుకోకపోవడంపై మహిళలెవరూ మిమ్మల్ని అడగటం లేదా? అని సానియా అడుగగా.. హా.. కొందరు అడుగుతున్నారు.. మీకు తెలియదు ఎంతో ఒత్తిడి చేస్తున్నారు? సల్మాన్ బదులిచ్చాడు. ఆ మహిళలు ఎవరు అని అడుగగా.. మా అమ్మ, చెల్లెళ్లు.. వారు నేను పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నారంటూ తెలిపాడు. -
పెళ్లి తేదీని ప్రకటించిన సల్మాన్!
-
ఆత్మకథ రాసే ఆలోచన లేదు: సల్మాన్
న్యూఢిల్లీ : తన జీవిత చరిత్రను రాసుకునే ఆలోచనేదీ లేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆదివారం స్పష్టం చేశారు. తన కథను తనతోపాటు సమాధి చేస్తానన్నారు. సానియా మీర్జా ఆత్మకథ ‘ఏస్ అగేనెస్ట్ ఆడ్స్’ విడుదల సందర్భంగా.. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నారు. ‘ఆత్మకథ రాయటం మొదలుపెడితే.. పాత గాయాలన్నీ మళ్లీ గుర్తొస్తాయి’ అని అన్నారు. -
సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్
-
సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్
హైదరాబాద్: కొద్దికాలంగా అభిమానులు ఎదురు చూసిన రోజు రానేవచ్చింది. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' విడుదలైంది. బుధవారం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. (16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?) చిన్నవయసులోనే ఆత్మకథ పూర్తిచేయగలిగినంత అనుభవాన్ని సానియా సంపాదించుకుందని షారూఖ్ సరదాగా అన్నారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన బాద్ షాకు సానియా కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సంస్థ హూపర్ కొలిన్స్ పబ్లికేషన్ లో వచ్చిన 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' బుధవారం నుంచి పుస్తకాల షాపుల్లో లభించనుంది. -
పోతు తోక పట్టుకొని...
సాహిత్య మరమరాలు ఒకప్పుడు పోతులు కాచుటకు నన్ను నియమింపగా పొలములో మేపి యేటిలో బోతులు కడుగుచుంటిని. ఏరు వడిగా రెండొడ్లు తీసి పారుచున్నది. పోతు తోక పట్టుకొని నట్టేట నీదుటకు నాకు వేడ్క పుట్టెను. నట్టేటికి నన్ను దీసికొనిపోయి పోతు తలముంచెను. దాని వీపుపై తోకపట్టుకొని నిలుచుంటిని కాని కొంతమేర పోతు మునిగిపోవుటచే నేనూ మునుగుచుదేలుచుంట తటస్థించుచుండెను. ఇటులొక యరమైలు కొట్టుకొని పోతిని. తుదకు పోతు నన్నంటక ప్రత్యేకము పోవుచుండెను. ఈదుచుంటిని కాని యొడ్డు చేరుటకు శక్తి చాలకుండెను. అంతట వార్త తెలిసి మా పెద్దన్న మొదలగువారు వచ్చి నన్గాపాడిరి. (అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ఆత్మకథ ‘నా యెఱుక’లోంచి...) -
16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?
హైదరాబాద్/న్యూఢిల్లీ: పట్టుమని పదహారేళ్లైనా నిండకముందే టెన్నిస్ ప్లేయర్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది సానియా మిర్జా. ఏ రేంజ్ లో కష్టపడితే అంత చిన్నవయసులోనే అంత పేరు సాధించిందామె? ఆ దిశగా ఇన్ స్పైర్ చేసింది ఎవరు? అన్నింటికన్నా మించి, స్టార్ గా ఎదిగిన తర్వాత కెరీర్ ను నిలబెట్టుకోగలగడం, పాకిస్థానీతో పెళ్లి విషయంలో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే మెంటల్ బ్యాలెన్స్ ఎలా సాధించింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జులైలో సమాధానాలు తెలియనున్నాయి. సానియా మిర్జా బయోగ్రఫీ 'ఏస్ ఎగనెస్ట్ ఆడ్స్' ను జులైలో విడుదల చేయనున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత పబ్లిషర్స్ హార్పర్ కొలిన్స్ బుధవారం వెల్లడించింది. 'దాదాపు గుర్తెరిగినప్పటి నుంచి చేతిలో టెన్నిస్ రాకెట్ మాత్రమే పట్టుకున్న సానియా దాన్ని పక్కన పెట్టి మొదటిసారి పెన్ పట్టుకుని, తండ్రి ఇమ్రాన్ మిర్జా సహకారంతో ఆత్మకథ రాశారు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అడ్డంకులు, వాటిని అధిగమించిన తీరు, సాధించిన విజయాల వెనుక రహస్యాలు.. అన్నీ పుస్తకంలో రాసినట్లు, భవిష్యత్ లో క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి ఇన్ స్పిరేషనల్ బుక్ గా రూపొందించినట్లు సానియా చెప్పారు. ఇండియా నంబర్ వన్ మాత్రమేకాదు.. వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సానియా ఆటోబయోగ్రఫీని పబ్లిష్ చేసే అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నమని, జులై నుంచి అన్ని పుస్తక దుకాణాల్లో 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' అందుబాటులో ఉంచుతామని హూపర్ కొలిన్స్ (ఇండియా) చీఫ్ ఎడిటర్ కార్తిక అన్నారు. ఈ పుస్తకం ఆధారంగా సానియా జీవితంపై ఓ సినిమా కూడా రూపొందించాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఐశ్వర్య ఆత్మకథ
చెన్నై: చిత్ర నిర్మాతగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఐశ్వర్య ధనుష్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, కోలీవుడ్ స్టార్ ధనుష్ సతీమణి అయిన ఐశ్వర్య తన ఆత్మకథ రాస్తోందట. తన నిజ జీవితంలోని సంఘటనలు, జ్ఞాపకాలతో కూడిన పుస్తక రచన చేస్తున్నట్టు ఆమె తెలిపింది. 'స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్' అనే టైటిల్ తో తన జీవిత కథను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఐశ్వర్య స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి తన రచన పూర్తి కావచ్చని తెలిపింది. సెలబ్రిటీ కూతురుగా, హీరో భార్యగా, తల్లిగా వివిధ భావోద్వేగాల మిశ్రమంగా తన పుస్తకం ఉంటుందని పేర్కొన్నారు. తాను రాస్తుంది తొలిసారి అయినప్పటికీ... తన జీవిత కథ పాఠకులకు మంచి అనుభూతులను మిగులుస్తుందని ఐశ్వర్య ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సహజంగా ముభావంగా ఉండే తన వ్యక్తిగత జీవితంలోని ఉత్థాన పతనాలు, ఆగ్రహం, అభినందనలతో పాటు కొన్ని ఫిలాసఫికల్ అంశాలు కూడా ఉంటాయని ఆమె వివరించింది. -
సచిన్ ఆత్మకథ మరో 'రికార్డు'!
న్యూఢిల్లీ:ఇప్పటికే పుస్తక ప్రపంచంలో అనేక రికార్డునులను కొల్లగొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో 'ప్లేయింగ్ ఇట్ మై వే' కు స్థానం దక్కింది. ఈ పుస్తకం అమ్మకాల్లో టాప్ లో నిలవడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. అటు ఫిక్షన్, ఇటు నాన్ ఫిక్షన్ కేటగిరీలలో ప్లేయింగ్ ఇట్ మై వే తనదైన ముద్రను వేసింది. ఇదిలా ఉండగా, రూ.899 కవర్ పేజీ ధర కల్గిన సచిన్ ఆత్మకథ ఇప్పటివరకూ రిటైల్‌గా రూ. 13.51 కోట్లను వసూలు చేయడం మరో విశేషం. నవంబర్ 6, 2014వ సంవత్సరంలో సచిన్ ఆత్మకథ విడుదలైన సంగతి తెలిసిందే. సచిన్ ఆత్మకథను హచిటే ఇండియా సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం విడుదలకు ముందే 1,50,289 కాపీల మేర ఆర్డర్లను దక్కించుకుని పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే ‘యాపిల్’ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవితచరిత్ర రికార్డును వెనక్కునెట్టడంతో పాటు, డాన్ బ్రౌన్ ఇన్ ఫెర్నీనో, జేకే రోలింగ్ క్యాజువల్ వెకెన్సీ తదితర పుస్తకాల రికార్డును సచిన్ ఆత్మకథ అధిగమించింది. -
'ఆ నియంత పుస్తకాన్ని నిలిపేయండి'
బ్రసిలియా: బ్రెజిల్లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జీవిత చరిత్ర ప్రచురణను నిషేధించారు. ఇకపై హిట్లర్ జీవిత చరిత్ర 'మెయిన్ క్యాంప్' ప్రచురణలు చేయోద్దని బ్రెజిలియన్ న్యాయమూర్తి అల్బర్టో సాలోమావో జూనియర్ ఆదేశించారు. ఆమేరకు కోర్టు ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. యూదుల సామాజిక మత పరిస్థితుల్లో అసహనానికి తావివ్వకుండా ఉండాలంటే ఆ పనిచేసి తీరాలని అన్నారు. హిట్లర్ పుస్తకం బ్రెజిల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, అందులోని అంశాలు జాతి వివక్షను పురికొల్పే విధంగా ఉన్నాయంటూ రియో డి జనిరో కోర్టు జస్టిస్ అల్బర్ట్ అన్నారు. తన తీర్పును ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించారు. మెయిన్ క్యాంప్ ను హిట్లర్ 1925లో రచించాడు. జర్మనీ నియంత అయిన హిట్లర్ యూదులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే. -
ఆత్మకథ రాయబోనన్న ముఖ్యమంత్రి
రాజకీయాల్లోకి రాకముందే రచయితగా ఖ్యాతిగడించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో అనూహ్యంగా రాజకీయరంగప్రవేశం చేసిన ఆయన.. 1997 నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఆ ట్రాక్ రికార్డును గుర్తుచేస్తూ 'ఎన్నికల్లో గెలవటం ఎలా?' అనే టైటిల్ తో నవీన్ పట్నాయక్ ఆత్మకథరాస్తే బాగుంటందని శనివారం ప్రారంభమైన భువనేశ్వర్ లిటరరీ ఫెస్టివల్ లో కొందరు రచయితలు సలహాఇచ్చారు. దీనికి స్పందిస్తూ 'నా నిజజీవితకథ అంత ఆసక్తికరంగా ఉండదు. అందుకే ఆత్మకథ రాసే ఉద్దేశం లేదు' అని నవీన్ పట్నాయక్ బదులిచ్చారు. పని ఒత్తిడి వల్ల పెన్ను పట్టలేకపోతున్నానని, మళ్లీ రాస్తే కాల్పనిక గాథలేగానీ స్వీయగాథ రాయబోనని తేల్చిచెప్పారు. స్థానిక భాషా రచనలకు ఆదరణ కొరవడిందన్న సీఎం.. ఆయా పుస్తకాలను మూలం చెడిపోకుండా ప్రధానశ్రేణి భాషల్లోకి అనువదించడం ద్వారా కాపాడుకోవచ్చన్నారు. వనమూలికా వైద్యంపై 'ది గార్డెన్ ఆఫ్ లైఫ్', రాజస్థాన్ ఎడారిలోని బికనీర్ పై 'డెసర్ట్ కింగ్ డమ్', 1590-1947 మధ్య భారతదేశ చరిత్రను వివరిస్తూ 'ఎ సెకండ్ పారడైజ్' నవీన్ పట్నాయక్ రాసిన పుస్తకాల్లో బెస్ట్ సెల్లర్స్. -
సోనియా విదేశీ మూలాలే కాదు.. అంతకుమించి!
-
సోనియా విదేశీ మూలాలే కాదు.. అంతకుమించి!
మరాఠా రాజకీయ యోధుడు శరద్‌పవార్ కాంగ్రెస్ పార్టీని వీడి.. సొంత పార్టీ ఎన్సీపీని స్థాపించడానికి కారణాలేమిటి? ఆయన చెప్పినట్టు సోనియాగాంధీ విదేశీ మూలాలే ఇందుకు కారణమా? ఇంకా బలమైన కారణాలు కూడా ఉన్నాయా? అంటే శరద్‌పవర్ తాజా ఆత్మకథ ఔననే అంటోంది. సోనియా విదేశీ మూలాలే కాదు.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పదవిని తనకు నిరాకరించడం, తన నిర్ణయాలను సోనియా లెక్కచెయకపోవడం అందుకు కారణమని ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. తన 75వ జన్మదినం సందర్భంగా 'ఆన్ మై టెర్మ్స్- ఫ్రం ద గ్రాస్రూట్స్ టు ద కారిడార్స్ ఆఫ్ పవర్' పేరిట శరద్‌పవర్ రాసిన ఆత్మకథ విడుదలైంది. 'కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ)ని సోనియాకు అనుగుణంగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో దిగ్భ్రాంతికర సవరణ తీసుకొచ్చారు. దీనిద్వారా సీపీపీ లీడర్ పదవిని చేపట్టేందుకు ఎంపీ అయి ఉండాలన్న నిబంధనను పక్కనబెట్టారు. ఈ నిర్ణయం నన్ను తీవ్రంగా బాధించింది. ఈ దురదృష్టకర పరిణామంతో సోనియాగాంధీకి నాకు మధ్య భారీ అగాథం ఏర్పడింది. లోక్‌సభలో చాలావరకు నా నిర్ణయాలను సోనియా పక్కనబెట్టడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. నేను, ఆమె కలిసి ఏదైనా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొంటే.. దానికి పూర్తి విరుద్ధంగా ఆమె వ్యవహరించేది. ఈ పరిస్థితి దాదాపు ఏడాదిపాటు ఇదేవిధంగా కొనసాగి..చివరకు బద్దలైంది' అని శరద్‌పవార్ ఈ పుస్తకంలో తెలిపారు. 1999 ఏప్రిల్ 17న వాజపేయి ప్రభుత్వం పడిపోవడం, ఏప్రిల్ 21న ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తూ సోనియాగాంధీ అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను కలువడం వంటి రాజకీయ పరిణామాల గురించి ఆయన తన పుస్తకంలో వివరించారు. సోనియాగాంధీ తమకు 272మంది ఎంపీల మద్దతు ఉన్నదని ప్రకటించారు. అయితే చివరినిమిషంలో ములాయంసింగ్ కాంగ్రెస్‌కు మద్దతు నిరాకరించడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నం విఫలమైంది. 'లోక్‌సభలో నేను పార్టీ నాయకుడిగా ఉన్నా.. రాష్ట్రపతి వద్దకు వెళ్లేముందు నన్ను సంప్రదించాలని సోనియా భావించలేదు' అని శరద్‌పవర్ వివరించారు. -
గన్స్ అండ్ థైస్.. వర్మ ఆత్మకథ
హైదరాబాద్: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడిని ఇడియట్ అనడం ఆయనకే చెల్లు. అండర్ వరల్డ్ తో తనకు సంబంధాలు ఉన్నాయని కూడా బహిరంగంగా చెప్పగలడు. అలాంటి రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఆత్మకథ రాశారు. అది కూడా మొత్తం సిద్ధమైపోయింది. పుస్తకం మాత్రం వచ్చే నెలలోనే విడుదలై మార్కెట్లను ముంచెత్తనుంది. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. పుస్తకం కవర్ పేజిని కూడా ఆయన చూపించారు. రూపా పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోందని తెలిపారు. అందులోని కొన్ని చాప్టర్లలో... తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తోను, మహిళలతోను ఉన్న సంబంధాల గురించి కూడా ఉంటుందంటూ ఓ టీజర్ వదిలేశారు. ఇంకేముంది.. నెటిజన్లు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేశారు, చేస్తున్నారు. అసలు వర్మ ఓ ఐదు నిమిషాలు మాట్లాడితేనే సంచలనం అనుకుంటే.. ఆయన తన జీవితంలోని అన్ని విషయాలు, విశేషాలతో కలిపి ఆత్మకథ రాశారంటే అది ఇంకెంత సంచలనం అవుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. The book's Cover design of my autobiography to be released next month by Rupa publications pic.twitter.com/0fnWgz8KT1 — Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2015 Some chapters in it..When I called Amitabh bachchan an idiot,My affair with the Underworld,Women in My Filmy Life pic.twitter.com/qWqhsZHapn — Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2015 -
కలాం విగ్రహాన్ని అవిష్కరించిన కేసీఆర్
-
ఆత్మకథ రాసుకుంటే కలాంకు ప్రత్యేక పేజీలు
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్లో పదేళ్ల పాటు పరిశోధనలు జరిపి ఐదు రకాల క్షిపణులను రూపొందించారని, ఈ సమయంలోనే భారత క్షిపణి పితామహుడిగా కీర్తికెక్కారని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కలాం నిరాడంబర జీవితాన్ని గడిపారన్నారు. కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం కంచన్‌బాగ్ డీఆర్డీఎల్ ఎదుట కలాం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలాం సేవలకు గుర్తింపుగా డీఆర్డీఎల్కు ‘ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రం’గా పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. ఒకవేళ తాను ఆత్మకథ రాసుకుంటే అందులో కలాంకు ప్రత్యేకంగా కొన్ని పేజీలను కేటాయిస్తానని సీఎం చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం అందించిన జాతిపిత మహాత్మాగాంధీ తర్వాత అంతటి కీర్తి గడించిన వ్యక్తి అబ్దుల్ కలామేనని అభిప్రాయపడ్డారు. ‘‘భారత దేశ ముద్దుబిడ్డ కలాం. ఆయన కృషి వల్ల నేడు హైదరాబాద్ కేంద్రంగా రాకెట్ల తయారీకి సంబంధించిన విడి భాగాలు తయారవుతున్నాయి. కలాం లాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని సీఎం అన్నారు. కలాం విగ్రహాన్ని రూపొందించిన శిల్పి పి.వై.రాజును సీఎం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఎల్ డెరైక్టర్ డాక్టర్ జయరామన్, పలువురు శాస్త్రవేతలు, మేనేజ్మెంట్ సైన్స్ డెరైక్టర్ వైవీ రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'నీ యన్యాయము సిగగొయ్య'
నా రెండవ ఫారములో రాగం సత్యనారాయణ యని యొక డుండెడివాడు. అతని తండ్రి ఫారెస్టు ఆఫీసరు. ధనవంతులు వారు. కాపు లనుకొందును. అతడు కొంచెము బొద్దుగా నుండెడి వాడు. జుట్టు మాత్రము- హిందీలో గొప్పకవి సుమిత్రానందన్ పంత్, తెలుగులో నొక గొప్పకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి- వీరి జుట్టువలె నుండెడిది. వీరిద్దఱిని నేను పెద్దనైన తరువాత నెఱుగుదును. ఆ జుట్టు మాత్రము చిన్నప్పుడు యెఱుగుదును. అప్పటి నా వేషము చెప్పినచో మీకిప్పుడు నవ్వు వచ్చు ననుకొందును. ఒక లాగు, ఒక చొక్కా, చేతులకు మురుగులు, కాళ్ళకు కడియాలు, నెత్తిమీద జుట్టు, ముందు వసారా గొఱిగింపు, జుట్టుముడి వెనుక గిరజాలు, ముందు సన్నని గిరజాలు- ఇది నా వేషము. ఆ రాగం సత్యనారాయణ జుట్టు నా కబ్బురము గొల్పెడిది. నా వేషము సహజ మన్నమాట! వింత యనగా మన మెఱుగనిది. ఈ యజ్ఞానముతో పాటు నహంకారము కూడ నున్నచో పరిహాసము కూడ చేయుదురు. ఈ రాగము సత్యనారాయణ నాకు తమలపాకు కిల్లీలు లంచము పెట్టెడివాడు. ఒక యేడా! రెండేండ్లా!! నాలుగైందేడ్ల లంచము. ఇది యలవాటైనది. తాంబూలము లేకుండ మరియు భోజనము చేసిన వెంటనే లేకుండ నాకానాటి నుండి యీనాటి వఱకు ననగా నరువది యేండ్లు కడచిన దినములు మొత్తము మీద పది యుండునేమో! అనగా అరువది మూడువందల యరువదులు. హెచ్చవేసుకొనుడు. ఈ తాంబూల సేవనమునకు నా నాల్గవ ఫారమైన తరువాత నొక గట్టి దోహదము జరిగినది. అది నా భార్య కాపురముకు వచ్చుట. నేను తమలపాకులు వక్కలు కొనినచో మా నాయనగా రేమనుటకు వీలులేదు కదా! తాంబూలము వాజీకరణము. నేను రెండవ ఫారము చదువుచుండగా నొక మార్పు జరిగినది. అప్పటినుండి యిప్పటి వఱకు నింగ్లీషు బడులలో నేమి, అనుసరించి తక్కిన బడులలో నేమి, పెద్ద పరీక్షలు వేసగి కాలమునకు ముందు మార్చి ఏప్రిలు మాసము లందు జరుగును. తత్పూర్వము అనగా 1909, 1910 అనుకొందును. పెద్ద పరీక్షలు డిసెంబరులో జరిగెడివి. నేను రెండవ ఫారములో నుండగా పెద్ద పరీక్షలను డిసెంబరు నుండి మార్చికి మార్చిరి. ఆ సంవత్సరము దేశములో నన్ని పాఠశాలలలో కళాశాలలలో అన్ని తరగతులను, అన్ని ఫారములను, అన్ని పరీక్షలను పదునాల్గు నెలలు చదివిరి. అనగా నా రెండవ ఫారము చదువు సంవత్సరమున్నర చదువన్న మాట. నేను తరగతికి మానిటరును. తెలివి గలవాడను. నేనల్లరి చేయకూడదు. ప్రక్క కుఱ్ఱవానితో మాటాడకూడదు. నా ప్రవర్తన తక్కిన పిల్లలకు మార్గదర్శిగా నుండవలెను. కాని నాకంటె నల్లరి పిల్లవాడు లేడు. అది మాస్టర్లకు తెలియదు. ఒకనాడు నేను ప్రక్కవానితో మాటాడుచుంటిని. పాఠము చెప్పినాయన చూచినాడు. గద్దించినాడు. 'నీవు పాఠము వినుట లేదు' అన్నాడు. 'వినుచుంటిని' అని నేనంటిని. 'ఏమి చెప్పితినో చెప్పు' మనెను. చెప్పితిని. ఏమి చేయును! ఆయనకు కోపము వచ్చినది. ఆయన పాఠములో ప్రశ్నలు వేయనారంభించెను. పది పండ్రెండ్రు ప్రశ్నలు వేసెను. అన్నిటికి సమాధానము చెప్పితిని. నేను తప్పు చెప్పువఱకు ప్రశ్నలు వేయుచునే యుండెను. చివర కొక తప్పు వచ్చినది. ఇంతపొడుగు ప్రేప బెత్తము... కొట్టుటకు చేయి చాపు మన్నాడు. నాకేడుపు వచ్చినది. ఏడ్చుచు చేయి చాచి 'కొట్టు... నీ యన్యాయము సిగగొయ్య' అన్నాను. నేను పల్లెటూరి వాడను గదా! మా మాటలే అవ్వి. ఆయనకు పకాలున నవ్వు వచ్చినది. నేను తెలివిగల పిల్లవాడనని కొంత ముద్దున్నది కదా! (విశ్వనాథ సత్యనారాయణ 'ఆత్మకథ' నుండి; సౌజన్యం: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్, 8019000751) -
ఒక సంపాదకుడి స్వీయచరిత్ర
విధి నా సారథి (స్వీయచరిత్ర) రచన: పొత్తూరి వెంకటేశ్వరరావు పేజీలు: 384; వెల: 175 ప్రతులకు: సాహితి ప్రచురణలు, 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2; ఫోన్: 0866-2436643 ‘బీఎస్సీ తరువాత ఏమి చేయాలని అనుకొంటున్నారు?’ అని అడిగిన లెక్చరర్‌తో, ‘జర్నలిస్టును కావాలనుకొంటున్నాను’ అని చెప్పారు పొత్తూరి. ‘ఓ! యు వాంట్ టు బికమ్ ఎ నార్ల’ అన్నారాయన. అన్నట్టుగానే, ‘నార్ల’(వెంకటేశ్వరరావు) లాగే ఎడిటర్ అయ్యారు పొత్తూరి(వెంకటేశ్వరరావు). ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన 81 ఏళ్ల పొత్తూరి ప్రయాణం సుదీర్ఘమైనది. గూడబండ్ల ప్రయాణం చూశారు. బొగ్గుతో నడిచే బస్సుల్లో ప్రయాణించారు. ‘పప్పు తినే బేంబడి’గా సహ విద్యార్థుల హేళనకు గురయ్యారు. ఆ కారణంగా వస్తాదులా బాడీ పెంచారు. పాత్రికేయం మీద ఆసక్తితో గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. ‘చిట్టి రాష్ట్రానికి పొట్టి గవర్నర్’ అని బూర్గుల రామకృష్ణారావు గురించి పెట్టిన తమాషా హెడ్డింగుకు ‘ఆంధ్రజనత’లో తిట్లు తిన్నారు. ఆంధ్రభూమిలో పనిచేస్తూనే రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివారు. ఈనాడులో జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. పోటీ వారపత్రికలో వస్తున్న ‘క్షుద్ర’రచనకు అదే రచయితతో ప్రభ వీక్లీలో పేరడీ రాయించారు. రాజీవ్‌గాంధీ- అంజయ్య వివాదంలో అసలు జరిగిందేమిటో రాజీవ్‌గాంధీనే ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్నారు. ‘లా’ చదవకపోయినా స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ కమిషన్‌లో పనిచేయగలిగారు. ‘పేలుడు పదార్థాల స్టోరీ’ ఆపించినందుకు ఆత్మగౌరవంతో ఉదయం నుంచి బయటికి వచ్చారు. నక్సలైట్లతో శాంతి చర్చలు విఫలమైనందుకు కన్నీరు కార్చారు. ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. తిరుమల నగల లెక్కింపు కమిటీలో ఉన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పాతపత్రికల డిజిటైజేషన్ చేయించారు. పారమార్థిక పదకోశం వెలువరించారు. వీటితోపాటు, ఆయనపడ్డ ఆర్థిక ఇబ్బందులు, ఆయన్ని ఆదరించిన పెద్దల వివరాలు ఈ ‘స్వీయచరిత్ర’లో తెలుస్తాయి. ఎంత ఎత్తులో ఉన్నా తన నిజస్థితిని గురించిన ‘ఎరుక’ కూడా కనిపిస్తుంది. స్థూల స్థాయిలో ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆయనలోని సూక్ష్మస్థాయి పరిణామం మరో ఎత్తు. కేరళలోని అనంతపద్మనాభస్వామి దర్శనానికి విధిగా చొక్కా తీయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ లోనికి కూడా వెళ్లని ఈ నాస్తికుడు... తదనంతర కాలంలో కూతురి మరణంతో జిల్లెల్లమూడి అమ్మ దగ్గర సాంత్వన పొందారు; ఏదీ తన చేతిలో లేదనే అభిప్రాయంలోకి వచ్చారు. అందువల్లే ‘ఎమెస్కో’ ప్రచురించిన ఈ పుస్తకం పేరు ‘విధి నా సారథి’ అయింది. పాత్రికేయులతోపాటు, పత్రికల వ్యవహారాలు తెలుసుకోగోరే పాఠకులకు ఆసక్తికర పుస్తకం. ఈతరం కోసం కథాస్రవంతి ఈతరం కోసం కథాస్రవంతి (10 పుస్తకాల సీరిస్) ప్రధాన సంపాదకుడు: వల్లూరు శివప్రసాద్ ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ, 101,బృందావన్ పార్క్ రెసిడెన్సీ, 7వ లేన్, ఎస్.వి.ఎన్. కాలనీ, గుంటూరు-522006; ఫోన్: 9291530714 ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ చేసిన ఒక పద్ధతైన పని ఇది. వల్లూరు శివప్రసాద్ ప్రధాన సంపాదకుడిగా ‘సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడి హృదయానికి సన్నిహితమైన’ పదిమంది కథకుల ఎంపిక చేసిన కథలు కథాస్రవంతి పేరిట పునర్ముద్రణయ్యాయి. అన్నీ సుమారు నూరు పేజీల పుస్తకాలు. ఒక్కోటీ యాభై రూపాయలు. వేర్వేరు సంపాదకులు. వేర్వేరు విశ్లేషణలు. కొడవటిగంటి కుటుంబరావు కథలు (కృష్ణాబాయి), చాసో కథలు (చాగంటి తులసి), మధురాంతకం రాజారాం కథలు (ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు), పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (రాచపాళెం చంద్రశేఖరరెడ్డి), కేతు విశ్వనాథరెడ్డి కథలు (సింగమనేని నారాయణ), కొలకలూరి ఇనాక్ కథలు (మేడిపల్లి రవికుమార్), ఓల్గా కథలు (కె.శ్రీదేవి), పి.సత్యవతి కథలు (కె.ఎన్.మల్లీశ్వరి), అల్లం శేషగిరిరావు కథలు (జగన్నాథశర్మ), అల్లం రాజయ్య కథలు (ముక్తవరం పార్థసారథి); ‘ఈయన కథలు ఫార్ములా కథలు కావు. అంటే ఖాయంగా ఒకే పద్ధతిలో అన్ని కథలూ పరిణామం చెందాలి. చివర ఒక నిర్ణయం ఉండాలనడం చాసోకథలోని నియమం కాదు’(చాసో గురించి తులసి). పినిశెట్టి ముఖచిత్రాల ఈ సీరిస్‌లో కమ్మ తెమ్మెర, జీవన్ముక్తుడు(రాజారాం), చీకటి, వఱడు(శేషగిరిరావు), మనిషి లోపలి విధ్వంసం, మహాదేవుని కల(రాజయ్య), ఇంగువ, ఏస్ రన్నర్(సుబ్బరామయ్య), సూపర్‌మామ్ సిండ్రోమ్, ఇల్లలకగానే(సత్యవతి) లాంటి ఎన్నో చక్కటి కథలు చదవొచ్చు. సూర్యోదయం ‘నిషిద్ధం’ అన్న అలెగ్జాండర్‌కు 1886లో రాసిన లేఖలో చెహోవ్ (1860-1904) కథలో ప్రకృతి వర్ణన ఏమేరకు ఎలా ఉండాలో ఇలా రాశారు(అనువాదం: ముక్తవరం పార్థసారథి): ‘‘నా అభిప్రాయంలో ప్రకృతి వర్ణన వీలైనంత తక్కువగా ఉండాలి. ప్రకృతి కూడా కథలో ఒక పాత్ర కావాలి. అయితే, ‘సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలు, బాలభానుని బంగారు కిరణాలు, నీలాకాశంలో బారులు తీరిన పక్షుల గుంపులు, కిలకిలారావాలు’ నిషిద్ధం. ప్రకృతిలోని ఏ అంశాన్ని ప్రత్యేకంగా చిత్రిస్తే కథమీద అది ప్రభావాన్ని కలిగించబోతున్నదో తెలుసుకోగలగాలి కథకుడు. మన వర్ణనను బట్టి పాఠకుడు ఆ దృశ్యాన్ని వూహించుకోగలడా? ‘వెన్నెల కిరణం ఒకటి పెంకుటింటి చూరులోంచి గదిలో ఉన్న గాజుసీసా మీద పడి మెరిసింది’ అంటే కథా, వర్ణనా కలిసిపోవూ! పాత్రలు చేసే పనులతో కలసిపోవాలి ప్రకృతి వర్ణన. పాఠకుడు ముందే వూహించగలిగింది మళ్లీ చెప్పడం రచయిత ప్రతిభకు నిదర్శనం కానేరదు. పాత్రల మనస్తత్వం వాళ్ల ప్రవర్తన ద్వారా తెలియాలి. సంబంధాలలో ఓ టెన్షన్ - గురుత్వాకర్షణ శక్తితో గ్రహాలు తమ తమ స్థానాలలో ఉన్నట్టుగా పరస్పర సంబంధం - ఓ బిగువు - ఏ క్షణాన ఏ మార్పు వస్తుందోనన్న వుత్కంఠ, ఉద్విగ్నత కథ పండటానికి సహాయం చేస్తాయి. మనిషికి అద్దం పట్టటమే కళ చెయ్యాల్సిన పని. సత్యాన్ని గ్రహించిన మనిషి తనే మారతాడు. ప్రతిభ ఒక్కటే సరిపోదు. శ్రమించగలిగే స్వభావం లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా వృథా. పైగా, ప్రతిభ జన్మసిద్ధం. అందులో నీ ప్రమేయం ఏముంది?’’ నేర్పుడు అల్కగ అతిసున్నితంగ మెసిలే బాధల్లోకి తొంగిచూసే తీరికలేనితనం ముద్దుగ పొందికగ చూపుల్ని మైదానంమీద పర్చలేనితనం సోయితోని సోపతితోని తొవ్వలనడుస్తున్న మనుషుల్ని మందలించలేనితనం గదిల మతిల జ్ఞాపకాలని పలవరించనితనం సుఖంగ దుఃఖంగ కండ్లు చెమ్మగిల్లనితనం ఇప్పుడు నడుస్తున్న ఈకాలం ఠి వేముగంటి మురళీకృష్ణ ఫోన్: 9676598465 తెల్లపువ్వుల మధ్య నుంచి బయటికొచ్చింది తెల్లసీతాకోకచిలక గింజలు వేసి కోళ్ల కేదో చెప్పి వెళ్లాడు ముసలాయన పొగమంచు- ‘‘వృద్ధాశ్రమం ఇటేనా?’’ ఎవరో అడుగుతున్నారు నిండు చంద్రుడు- గుడిసెపై నుంచున్న కోళ్ల నిశ్శబ్దం ఈ రాత్రి వాన- ఇస్మాయిల్ లేరు కదా అన్న తలపు -గాలి నాసరరెడ్డి కొత్త పుస్తకాలు సమర సమయ విచార వివేకము (ఉద్యోగపర్వం-3 భాగాలు) వ్యాఖ్యానం: సాంప్రతి సురేంద్రనాథ్ పేజీలు: 338+276+316; వెల: 400 (మూడింటికీ) ప్రతులకు: భారత ధర్మ ప్రచార పరిషత్, పుచ్చా లలిత - రమణ చారిటబుల్ ట్రస్ట్, 601, సెంటర్ పాయింట్, 18 రోడ్, చెంబూర్, ముంబై-400071; (డాక్టర్ లలిత, హైదరాబాద్- ఫోన్: 9848060579). అక్షర గోదావరి పురస్కారాలు మొజాయిక్ సాహిత్య సంస్థ, సాహిత్య సురభి, రిత్విక్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో విశాఖ పౌరగ్రంథాలయంలో నేడు ఉదయం 10 నుంచి గోదావరి పుష్కర ప్రత్యేక కవి సమ్మేళనం జరగనుంది. రామతీర్థ (ఫోన్: 9849200385) అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో అద్దేపల్లి రామ్మోహనరావు, దాట్ల దేవదానం రాజు, ఎల్.ఆర్.స్వామికి ‘అక్షర గోదావరి’ పురస్కారాల ప్రదానం కూడా చేయనున్నారు. ఆకెళ్ల రవిప్రకాష్, ద్రోణంరాజు శ్రీనివాస్, చలసాని ప్రసాద్ విశిష్ట అతిథులు. మీ అభిప్రాయాలూ, రచనలూ పంపవలసిన మా చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34; ఫోన్: 040-23256000 sakshisahityam@gmail.com -
నా జీవితంపై త్వరలో సినిమా తీస్తా..
హైదరాబాద్ : తనకు జరిగిన అన్యాయంపై త్వరలో సినిమా తీస్తానని సినీ నటి తారా చౌదరి అన్నారు. ఆమె సోమవారం ఈ విషయాన్ని సాక్షితో వెల్లడించారు. సినిమా కథకు కసరత్తు జరుగుతుందని, సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తానే చేపట్టే అవకాశముందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన లాభాలతోనే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఓ భారీ బడ్జెట్ సినిమాను తీసి, తర్వాత తన జీవిత కథ ఆధారంగా మరో సినిమా ఉంటుందన్నారు. ప్రజా సేవే ధ్యేయంగా తాను జీవితంలో ముందుకు వెళతానన్నారు. -
మాస్కోలో తెలుగును వెలిగించినవాడు.....
స్మరణీయులు ‘నేను సామాన్యులలోకెల్లా సామాన్యుడిని. అయినా సరే వినకుండా నా ఆత్మకథ రాయమంటున్నారు. అందుకే రాస్తున్నాను’ అని చెప్పుకున్నారు వుప్పల లక్ష్మణరావు తన ఆత్మకథ ‘బతుకు పుస్తకం’లో. ఆ కాలం మనుషులు అలాగే ఉండేవారు. అసామాన్యమైన పనులు చేసినా సామాన్యమైనవిగా భావిస్తూ వినమ్రంగా ఉండేవారు. నిజంగా వుప్పల లక్ష్మణరావు చేసిన పనులు సామాన్యమైనవా? ఎక్కడి బరంపురం? ఎక్కడి సబర్మతి? ఎక్కడి ఎడిన్‌బరో? వుప్పల లక్ష్మణరావు ఒక బిందువు నుంచి మరో బిందువుకు చేసిన ప్రయాణం విలక్షణమైనది. పొందిన సాక్షాత్కారం కూడా. ఆయన చదువు వృక్షశాస్త్రం. అందులోనే డాక్టరేట్ చేశారు. దానినే విద్యార్థులకు బోధించారు. అయితే సంతృప్తి కలగలేదు. జాతీయోద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన ఊరికే ఉండలేకపోయారు. బోధనను పక్కన పెట్టారు. నేరుగా సబర్మతి ఆశ్రమానికి చేరుకుని అక్కడ ఖాదీ పరిశ్రమ మీద పరిశోధన సాగించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి అనేక ఇంజనీరింగ్ సంస్థలపై పరిశోధనలు సాగించారు. మళ్లీ వృక్షశాస్త్రం కోసం జర్మనీ వెళ్లి అక్కడ ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పరిశోధనలు సాగించారు. అనేక దేశాల విశ్వ విద్యాలయాలు ఆయన ప్రతిభను గుర్తించాయి. విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించాయి. అయినా ఆయనకు సంతృప్తి కలగలేదు. తన మనసు నిమగ్నమై ఉన్నది సాహిత్యంలోనే అని చివరకు కనిపెట్టగలిగారు. ఆ తర్వాత మడమ తిప్పలేదు. సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేశారు. వుప్పల లక్ష్మణరావు జీవితంలో కీలక మలుపు ఆయన 1958లో మాస్కో చేరుకోవడం. అప్పటి నుంచి 1970 వరకూ అక్కడే ఉన్నారు. ‘ప్రగతి’ ప్రచురణాలయంలో అనువాదకునిగా ఉంటూ అక్కడి వారికి తెలుగు నేర్పించడం, తెలుగు పుస్తకాల ప్రచురణకు విస్తృతి కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇక్కడ ఒక సంఘటన చెబుతారు. లెనిన్గ్రాడ్లో సోవియెట్ విజ్ఞానకేంద్రం నిర్వహించిన ఒక ఇష్టాగోష్టిలో వుప్పల లక్ష్మణరావుకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సోవియెట్వారు భారతదేశం అంటే ఉత్తరాది భాషలే అని భావిస్తున్నారని, ద్రవిడ భాషల సారస్వతాన్ని పట్టించుకోవడం లేదని అభ్యంతరం ప్రకటించారు. ఆ తర్వాతనే సోవియెట్‌లో తెలుగుకు ప్రాముఖ్యం పెరిగిందనీ మాస్కో రేడియోలో ఇతర భాషలతో పాటు తెలుగు వాణి వినిపించిందనీ తెలుగువారందరూ ఇందుకు లక్ష్మణరావుకు రుణపడి ఉండాలనీ అంటారు. మాస్కోలో ఉండగా వుప్పల లక్ష్మణరావు దాదాపు నలభై రష్యన్ పుస్తకాలకు తెలుగు అనువాదం చేశారు. వాటిలో మాక్సిమ్ గోర్కి ‘నా బాల్యం’, చెంగిజ్ ఐత్మాతోవ్ ‘జమీల్యా’, ‘తల్లి భూదేవి’ ముఖ్యమైనవి. ద్మీత్రియ్ మెద్వేదేవ్ ‘దిటవు గుండెలు’ కూడా. ఇవి గాక ఆర్మేనియన్ సాహిత్యాన్ని చాలా ఇష్టంగా తెలుగులోకి తీసుకువచ్చారు. ‘ఎందరు రచయితలు ఉన్నా గోర్కియే నా అభిమాన రచయిత. వాస్తవిక దృష్టి లేకుండా రచనలు చేయరాదని ఆయన చెప్పాడు. ఒకసారి గోర్కి ఒక రచయితల సమావేశంలో- మీ గుండెల మీద తుపాకీ పెట్టి కాలిస్తే ముందుకు పడిపోతారా వెనక్కు పడిపోతారా? అని అడిగాడు. చాలా మంది వెనక్కు పడిపోతామని చెప్పారు. కాని గోర్కి- కాదు. ముందుకే పడిపోతాం. నేనలా ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ముందుకే పడ్డాను అని చెప్పాడు. దీనర్థం ప్రతిదీ తెలుసుకొని చేయాలని కాదు. ప్రతిదీ ఊహించరాదని’ అంటారు లక్ష్మణరావు. తెలుగు నేల వుప్పల లక్ష్మణరావును కేవలం అనువాదకునిగానే చూడలేదు. ఆయన నవల ‘అతడు-ఆమె’కు విశిష్టస్థానం ఇచ్చి అక్కున జేర్చుకుంది. భారత స్వాతంత్య్ర పోరాటం నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులను ఈ నవల సాకల్యంగా ముసుగులు లేకుండా పాఠకుల ముందు పరుస్తుంది. ఆ విధంగా వుప్పల లక్ష్మణరావు తెలుగు సాహిత్యంలో రాజకీయాలను నేరుగా సాహిత్యం చేసిన మహీధర రామమోహనరావు తర్వాతి స్థానాన్ని అందుకున్నారు. ‘అతడు-ఆమె’ నవలలో లక్ష్మణరావు పాటించిన టెక్నిక్ కూడా వినూత్నమైనదే. అది ‘డైరీ టెక్నిక్’. ఒక స్త్రీ, ఒక పురుషుడు డైరీ రాసుకున్నట్టుగా సాగే ఈ నవలలో- అది డైరీ కనుక- వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకోకుండా నిజాయితీగా అభిప్రాయాలు సాగుతాయి. ఉద్వేగ సమయాల్లో ఉద్వేగం కలుగుతుంది. విచార సమయాల్లో విచారం. పాత్రలు తమకు తాముగా ప్రజాస్వామికంగా ఎదగడం అంటే ఏమిటో ఈ నవల చదివితే తెలుస్తుంది. లక్ష్మణరావులో ఉండే జిజ్ఞాస అసామాన్యమైనదని అంటారు. ఆయన తన అరవయ్యవ ఏట రష్యన్ అక్షరాలు దిద్ది, నేర్చుకుని, తయారు చేసిన రష్యన్-తెలుగు నిఘంటువును అందుకు ఉదాహరణగా చూపుతారు. మంచి ఎక్కడ ఉన్నా ప్రోత్సహించడం, కొత్త రచయితలను ఉత్సాహపరచడం ఆయన వ్యక్తిత్వంలో భాగం. లక్ష్మణరావు స్విస్ వనిత మెల్లి శాలింజర్ను వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు సమాజానికి విడ్డూరమైన సంగతే అయినా వారి కుటుంబం ఆమెను స్వీకరించింది. ‘అందుకు నా ఇద్దరు తమ్ముళ్లకూ మరదళ్లకూ కృతజ్ఞుడనై ఉంటాను’ అంటారాయన. అంతేకాదు తన ఆత్మకథ ‘బతుకు పుస్తకం’ను వారికే అంకితం ఇచ్చారు. 1970లో మాస్కో నుంచి తిరిగి వచ్చాక లక్ష్మణరావు బరంపురంలోనే ఉండిపోయారు. విజయనగరం, రాయగఢ్, జయపురం వంటి చోట్ల సాహిత్య కార్యక్రమాలు చురుగ్గా సాగేలా కృషి చేశారు. ఇన్ని చేసినా ఆయన ఏనాడూ తన ఘనతలు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అవార్డులు, రివార్డుల కోసం పట్టుపట్టలేదు. ఒక చెట్టు నిశ్శబ్దంగా ఎదిగి నీడనిచ్చి, ఫలాలనిచ్చి, కలపనిచ్చి ఏమీ ఆశించకనే తన కర్తవ్యాన్ని ముగించుకుంటుంది. బహుశా లక్ష్మణరావు కూడా అంతే. ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు ‘మీరు రాసినదానికీ మీ నిజ జీవితానికీ తేడా ఉందా?’ అని?. దానికి ఆయన జవాబు- ‘నా బతుకు పుస్తకం చదవండి. మీకే తెలుస్తుంది’. మహా మహా విజేతలు కూడా తలెత్తి చూడక తప్పని నిరాడంబరులు- సామాన్యులు- వుప్పల లక్ష్మణరావుగారు. - సాక్షి సాహిత్యం లక్ష్మణరావులో ఉండే జిజ్ఞాస కూడా అసామాన్యమైనదని అంటారు. ఆయన తన అరవయ్యవ ఏట రష్యన్ అక్షరాలు దిద్ది, నేర్చుకుని తయారు చేసిన రష్యన్- తెలుగు నిఘంటువును అందుకు ఉదాహరణగా చూపుతారు. వుప్పల లక్ష్మణరావు -
రావి కొండలరావు జ్ఞాపకాలు నాగావళి నుంచి మంజీర వరకు...
రావి కొండలరావు ఇప్పటికి చాలా పుస్తకాలే రాశారు. ఇది మరొకటి. కాని పెద్దవాళ్లలో ఉండే విశేషం ఏమంటే వాళ్ల దగ్గర ఎంత జీవితం ఉంటుందో అన్ని జ్ఞాపకాలుంటాయి. పదహారేళ్ల వయసులో మద్రాసు పారిపోయిన వ్యక్తి దాదాపు 60-70 ఏళ్లు ఆ రంగంతో పెనవేసుకుపోతే జ్ఞాపకాలకేం కొదువ? అయితే ఈ పుస్తకం కొంచెం ఆత్మకథ వరుసలో సాగింది. ‘నాగావళి నుంచి మంజీర వరకు’ అనడంలో ఆ వరుస కనిపిస్తుంది. కళింగాంధ్ర నాగావళి తీరం నుంచి తెలంగాణ మంజీర తీరం వరకూ తన ప్రస్థానంలో తారసపడిన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. చేయి తిరిగిన కలం కనుక చకచకా నడిపించుకొని పోతుంది. సినిమా అంటే ఎవరికైనా ఆసక్తి కనుక కుతూహలం నిలబెడుతుంది. ‘ఆనందవాణి’ పత్రిక యజమాని ‘వంద ఇస్తాను. చేరు’ అంటే చేరారు రావి కొండలరావు. కాని ఆ వంద ఎప్పటికీ రాదు. రేపిస్తాను అంటుంటాడు యజమాని. అదాయన ఊతపదం అని ఈయనకు తెలియదు. ఆ సీట్లోనే అంతకు ముందు శ్రీశ్రీ, ఆరుద్ర చేసి ఆ వంద అందక పారిపోయారు. ఈయనా పారిపోక తప్పలేదు. ఈ పుస్తకం చదివితే అర్థమయ్యేదేమంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. వినయం ఉంటే అవకాశం లభిస్తుంది అని. ఈ రెంటినీ రెండు చేతులు చేసుకొని పెద్దల ప్రోత్సాహం, ఆశీర్వాదంతో జీవితాన్ని ఈదేశారు రావి కొండలరావు. రేలంగి, పింగళి, చక్రపాణి, పెండ్యాల, మల్లాది, బాపు, రమణ... ఎందరు పెద్దలవో జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి. ఇంతకు మించిన అనుభవాలు ఉన్నవారు ఉండొచ్చు. వారు రాయరు. రాసే అదృష్టం రావి కొండలరావుకు దక్కింది. పాఠకులకు ఈ అనుభవఫలం సంప్రాప్తమయ్యింది. వెల: రూ.150 ప్రతులకు: 98480 71175, 7893809839 -
ఆత్మకథ రాస్తున్న షీలాదీక్షిత్
న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆత్మకథ రాస్తున్నారు. ఇప్పటికే రాయడం మొద లు పెట్టానని, ఈ సంవత్సరాంతం వరకు అది పూర్తవుతుందని ఆమె చెప్పారు. తన పుస్తకంలో తన జీవితంతో పాటు ఒక నగర జీవితం కూడా ఉంటుందని ఆమె అంటున్నారు. తన ఆత్మకథలో ఆసక్తికరమైన కథలు ఉంటాయని, అయితే తన ఆత్మకథ గురించి ఎవరూ భయపడనవసరం లేదని ఆమె హామీ ఇస్తున్నారు. రాజకీయ విరోధుల విషయంలో నిర్మొహమాటంగా మాట్లాడే షీలాదీక్షిత్... తన పుస్తకం మాత్రం సకారాత్మకంగా ఉంటుందని, వ్యవస్థను గానీ, వ్యక్తులను గానీ విమర్శించే మాధ్యమం కాబోదని హామీ ఇస్తున్నారు. తనకు ఎదురైన సవాళ్లు, అనుభవాలు, భావనలు, ఊగిసలాటల గురించి రాస్తానని ఆమె చెబుతున్నారు. తన పుస్తకంలో విశ్లేషణలు ఉండవని, ఎవరూ తన పుస్తకం రాస్తున్నానంటే భయపడనవసరం లేదని నవ్వుతూ చెబుతున్నారు. తన పుస్తకం బోరింగ్‌గా కూడా ఉండదని ఆమె అంటున్నారు. ఒకవేళ బోరింగ్‌గా అనిపించినట్లయితే తానే దానిని చెత్తబుట్టలో పడేస్తానని ఆమె అంటున్నారు. తాను చాలా అదృష్టవంతురాలినని, దేశం, నగరరాజకీయాలలో వచ్చిన మార్పులను కళ్లారా చూశానని ఆమె చెప్పారు. కొన్ని విషయాలు మదిలో నిలిచిపోతాయంటూ బంగ్లాదేశ్ యుద్ధం తరువాత దేశంలోని వాతావరణాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు దేశవాసులు తమకు రెక్కలొచ్చినట్లుగా భావించారు. అది తమ వ్యక్తిగత విజయమైనట్లు భావించారని ఆమె చెప్పారు. ఇటువంటి ఘటనలు తన జీవితంలో ఎన్నింటినో చూశానని, వాటిని తన ఈ పుస్తకంలో పొందుపరుస్తానని ఆమె చెప్పారు. పుస్తకం కోసంపరిశోధన కూడా చేయాల్సిఉందని ఆమె చెప్పారు. తన మామ గురించి కూడా పుస్తకంలో రాస్తానని, ఆయన స్వాతంత్య్ర సమరయోధుడని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీకి సన్నిహితుడని చెప్పారు. ఆయన గురించి రాయడం కోసం ఆ రోజుల గురించి పరిశోధన చేయాల్సి ఉందన్నారు. రాజకీయాలలో మార్పుల గురించి కూడా ఈ పుస్తకం ప్రస్తావిస్తుందని ఆమె చెప్పారు. ఈ పుస్తకాన్ని ఏ ప్రచురణ సంస్థకు ఇవ్వాలనే విషయం ఇంకా నిర్ణయించలేదని ఆమె వివరించారు. -
ఏప్రిల్‌లో ఎం.ఎస్. ఆత్మకథ
ఇటీవలే మరణించిన నటుడు ఎమ్మెస్ నారాయణ ఆత్మకథ త్వరలో పుస్తకంగా రానుంది. ఏప్రిల్ 16న ఆయన జయంతికి ‘ఎం.ఎస్. నారాయణ - విజయం కోసం పోరాటం’ పేరుతో పుస్తకం విడుదల కానుంది. ‘‘నాన్న చెబుతుంటే, మిత్రుడు కూనపరాజు కుమార్ ఆ ఆత్మకథ రాశారు. నాన్న జీవిత, సినీ ప్రస్థానమంతా అందులో ఉంటుంది’’ అని బుధవారం జరగనున్న ఎమ్మెస్ పెద్దకర్మ సందర్భంగా ఆయన కుమారుడు విక్రవ్‌ు కుమార్ తెలిపారు. -
ఆత్మహత్యలపై ఆత్మకథ
* కరెంటు కోత నుంచి గుండె కోత దాకా... * హృదయాలను కదిలించే కథలు * రైతు వ్యథలపై డాక్టర్ లచ్చయ్య కలంపోరు కామారెడ్డి: ఆయన కలం.. సామాజిక సమస్యలపై అక్షర సమరం చేస్తోంది. సమాజ శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరు సల్పుతోంది. ప్రజల ఆవేదనలు, ఆందోళనలు, ఆక్రందనలు.. రచనలుగా, విమర్శలుగా, కాలమ్స్ రూపంలో పోరాడుతోంది. ఆయన మనసు ఆ కలానికి తెలుసు. అందుకే ఆయన రాసిన కథనాలు, కథలు హృదయాలను కదిలించేవిగా.. ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఏళ్ల తరబడి గాండ్ల లచ్చయ్య ఎన్నో కథనాలను రాశారు. సరిగ్గా ముప్పై ఎనిమిదేళ్ల నాడు బెల్లం వండుతున్న రైతులు ఎదుర్కొన్న కరెంటు కష్టాలపై ‘కోత’ కథ రాశారు. ఆ కథ అప్పట్లోనే పత్రికల్లో అచ్చయ్యింది. ఆ కథ ఆధారంగా తమిళంలో ఓ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అప్పటి పరిస్థితిలకు భిన్నంగా లేవని అందుకు ఓ రైతు ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ‘ఓ ఆత్మహత్య ఆత్మకథ’ రాశారు. ఈ రెండు కథలను ‘కరెంటు కోత నుంచి..రైతు గుండె కోత దాకా...’ అన్న పేరుతో బుక్లెట్ రూపొందించారు. ఇటీవలే ఈ కథనాల సంపుటిని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కథగా రైతన్న గుండె‘కోత’ కామారెడ్డికి చెందిన డైట్ రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ లచ్చయ్య 1976లో రాసిన ‘కోత’ కథలో చలి విసురుతున్నా రాత్రిళ్లో సైతం చెరుకు గానుగాడించి పాలను తీసి రాత్రంతా పాలను ఉడికించి బెల్లం తయారు చేసే రైతు కుటుంబం వ్యథలను కళ్లకు కట్టారు. వరుసగా మూడురోజుల పాటు కరెంటు కోతలతో క్రషింగు కోసం నరికిన చెరుకు ఎండిపోతుందని ఆందోళన చెందుతున్న గంగన్న అనే రైతు వ్యథకు అక్షరరూపం ఇచ్చారు. మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు అనే రైతు ఈ మధ్యనే తన పంట చేనులోనే ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నర్సింహులు ఆత్మహత్యపై పత్రికల్లో వచ్చిన వార్తలను చదివిన డాక్టర్ లచ్చయ్య చలించిపోయారు. నర్సింహులు ఆత్మహత్యకు కారణాలేమిటన్నదానిపై లోతుగా ఆలోచించారు. బలవన్మరణానికి పాల్పడిన నర్సింహులు కుటుంబాన్ని, గ్రామస్తులను కలిసి వివరాలు తెలుసుకుని, నర్సింహులు చావుపై ‘బలంత లేదు..బతుకు లేదు..ఉరితాడే నేస్తమాయే’ అంటూ ఆత్మహత్యపై ఆత్మకథ రాశారు. బతుకులెట్ల మారినయో.. నర్సింహులు ఆత్మఘోషకు అక్షరరూపం ఇవ్వడమే కాదు.. ప్రపంచీకరణ ప్రభావం ప్రజల బతుకులను ఎట్లా దెబ్బతీసిందో తన కథనంలో లచ్చ య్య వివరించారు. కులవృత్తి చేసుకుని బతికిన రోజుల్లో ఆ రైతు కుటుం బం ఏ కష్టం లేకుండా బతికేది. అటు కుల వృత్తి, ఇటు వ్యవసాయం ద్వారా అందరూ పని చేసుకుంటూ హాయిగా బతికేవారు. శేనుకాడ బోరు తవ్వించే ప్రయత్నంలో చేసిన అప్పు వడ్డీలు పెరిగిపోయి నర్సింహులు కుటుంబం అప్పులపాలై, ఆ తరువాత గల్ఫ్ వలస, అక్కడా మోసం ఇంటికాడ ఏ ఆధారం లేదు. అయినా ఏదో ఆశ చావని నర్సింహులు మరో బోరు తవ్వించి అందులో వచ్చిన కొద్దిపాటి నీళ్లతోని ఎవుసం మొదలుపెట్టిండు. ఓ దినం పాము కరిసి దవఖానపాలైన నర్సింహులుకు ఆస్పత్రి ఖర్చు తడిసిమోపెడై. భూమి మీద దీస్కున్న బాకీ మాఫీ అయితదని తెలిసి జెరంత భారం తగ్గుతదని ఆశతోని బ్యాంకుకు బోయిన నర్సింహులు తన పేరు లేదని తెలిసి పుట్టెడు దు:ఖంతోని శేనుకాడికి బోయి ఉరిబోసుకుని సచ్చిన వైనంపై ఆత్మహత్య ఆత్మకథగా రాశారు. రైతు కుటుంబానికి ఆసరాగా.. తాను రాసిన కథలను ‘కరెంటు కోత నుంచి..రైతు గుండె కోత దాకా..’ అన్న శీర్షికన బుక్లెట్ వేశారు లచ్చయ్య. దాని ఖరీదు ఐదు రూపాయలుగా నిర్ణయించారు. వాటిని అమ్మగా వచ్చే డబ్బును రైతు కుటుంబానికి ఆసరాగా అందించాలనుకుంటున్నారు. ఇలా రైతన్నల గోసను అక్షరీకరించడమే కాకుండా.. తనవంతుగా రైతుకుటుంబానికి ఆసరా కావాలనుకుంటున్న డాక్టర్ జి.లచ్చయ్యను అభినందిద్దాం. -
పీవీ నరసింహారావు 'లోపలి మనిషి' పుస్తక ఆవిష్కరణ
-
దాటవేతలెందుకు దాదా?
గాంధీ మహాత్ముడు కాక మునుపు 1927లో రాసిన ఆత్మకథ (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్)లోనే అన్ని వాస్తవాలూ రాయలేదనీ, కొన్నిటిని దాచారనీ విమర్శలు వచ్చినప్పుడు పదవులలో ఉన్నవారూ, పదవులు కోరుకునేవారూ అక్షరసత్యాలు రాస్తారని విశ్వసించడం కష్టం. కొన్ని ఇబ్బందికరమైన వివరాలను ప్రస్తావించకపోవచ్చు కానీ శుద్ధ అబద్ధాలు రాసి తప్పించుకోవడం కూడా ఈ సమాచార యుగంలో సాధ్యం కాదు. ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన సమయంలో అందుకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఇందిరాగాంధీకి బొత్తిగా తెలియవా? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రచించిన ఆత్మకథ మొదటి భాగంలో ఇందిర పాలనను సమర్థించారా లేక ఎండగట్టారా? ముఖర్జీ ప్రచురించదలచిన మూడు పుస్తకాల కాలవిభజనలో 1989-1998 మధ్య కాలాన్ని పరిహరించడంలో ఉద్దేశం ఏమిటి? రాష్ట్రపతిగా మరో పదవీకాలం (ఐదేళ్ళు) కొనసాగాలనే ఆకాంక్షేనా? ప్రణబ్ కుమార్ ముఖర్జీ రచించిన ఆత్మకథ ‘ది డ్రెమాటిక్ డికేడ్: ది ఇందిరాగాంధీ ఇయర్స్’ విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. రాజకీయ ప్రముఖులూ, కీలక పదవులు నిర్వహించిన ఉన్నతాధి కారులూ, అధికార కేంద్రాన్ని దగ్గరగా పరిశీలించిన జర్నలిస్టు దిగ్గజాలూ రచించిన పుస్తకాలు విడుదలైన సందర్భంలో అనేక వివాదాలు చర్చనీయాంశాలైనాయి. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీగా పనిచేసిన మాధవ్ గాడ్బోలే, కేంద్ర మాజీ మంత్రులు నట్వర్‌సింగ్, జశ్వంత్‌సింగ్, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమాచార సలహాదారుగా పని చేసిన సంజయ బారు, బొగ్గు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, కాగ్ మాజీ అధినేత వినోద్ రాయ్, సీఎన్ఎన్-ఐబిఎన్ మాజీ ప్రధాన సంపాదకుడు రాజదీప్ సర్దేశాయ్, తదితరులు రచించిన గ్రంథాలలో కఠోర సత్యాలుగా కనిపించే కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా కేవలం సత్యాలే రాశారా లేక ఉన్న వాస్తవాలన్నీ రాశారా లేక తమ వాదనలకు అవసరమైన వాస్తవాలను మాత్రమే ఉటంకించి తక్కినవాటిని వదిలేశారా అన్నది పాఠకులు నిర్ణయించుకోవలసిందే. గాంధీ మహాత్ముడు కాక మునుపు 1927లో రాసిన ఆత్మకథ (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్)లోనే అన్ని వాస్తవాలూ రాయలేదనీ, కొన్నిటిని దాచారనీ విమర్శలు వచ్చినప్పుడు పదవులలో ఉన్నవారూ, పదవులు కోరుకునేవారూ అక్షర సత్యాలు రాస్తారని విశ్వసించడం కష్టం. కొన్ని ఇబ్బందికరమైన వివరాలను ప్రస్తా వించకపోవచ్చు కానీ శుద్ధ అబద్ధాలు రాసి తప్పించు కోవడం కూడా ఈ సమాచార యుగంలో సాధ్యం కాదు. నట్వర్‌సింగ్, సంజయ బారు మాత్రం కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీపైన పరోక్షంగా, ప్రత్యక్షంగా కొన్ని విమర్శలు చేశారు. తక్కినవారు మన్మోహన్సింగ్పైన ప్రధానంగా తమ దాడిని కేంద్రీకరించారు. వీరందరికీ సమాధానం చెబుతూ మాజీ ప్రధాని ఆత్మకథ రాసితీరతారని ఆయన కుమార్తె ప్రకటించారు. ఆయన రాస్తారో లేదో తెలియదు. వీరందరిలోనూ అత్యధిక పదవులు నిర్వహించి, అనేక నాటకీయ రాజకీయ పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచిన వ్యక్తి ప్రణబ్‌దా. నాలుగున్నర దశాబ్దాల భారత రాజకీయాలపైన ఆయన చేసే వ్యాఖ్యలకూ, చెప్పే తీర్పులకూ ఎనలేని విలువ ఉంటుంది. పైగా ఆయన గ్రంథాన్ని ప్రచురించిన రూపా పబ్లికేషన్స్ సమస్త విక్రయాధికా రాలనూ గుత్తగా అమెజాన్.ఇన్‌కు కట్టబెట్టడం పెద్ద వివాదమై కూర్చుంది. 595 రూపాయల వెల కలిగిన పుస్తకంపై 33 శాతం డిస్కౌంటు ఇచ్చి రూ. 399కే ఆన్ లైన్లో విక్రయిస్తున్న అమెజాన్‌తో పుస్తక విక్రేతలు తగవుపడుతున్నారు. పుస్తకాన్ని బహిష్కరించాలని నిర్ణయిస్తున్నారు. ఈ విధంగా ఒకే ఒక సంస్థకు గుత్తాధిపత్యం కట్టబెట్టడం అన్యాయమని వాదిస్తున్నారు. ముఖర్జీ జన్మదినమైన డిసెంబర్ 11వ తేదీన అమెజాన్ సంస్థ ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్టు ప్రకటించిన సమయానికే బెస్ట్ సెల్లర్స్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇది ఒక రకమైన చరిత్ర. సరికొత్త రికార్డు. కంపెనీలకూ, ఈ-టైలర్లకూ (రిటైర్లలాగా) మధ్య వ్యాపార స్పర్థను రేకెత్తిం చిన సందర్భం. అపారమైన అనుభవం ఎనభై ఏళ్ళ కిందట పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని చిన్న గ్రామంలో పుట్టిపెరిగిన ‘పొట్లా’ క్రమంగా ప్రణబ్ కుమార్ ముఖర్జీగా ఎదిగి, రాజకీయశాస్త్రం, చరిత్ర, న్యాయశాస్త్రంలో పట్టాలు పుచ్చుకొని కొంతకాలం న్యాయశాస్త్రం బోధించి రాజకీయాలలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీనుంచి చీలిపోయిన అజయ్ ముఖర్జీ స్థాపించిన బంగ్లా కాంగ్రెస్‌లో ప్రవేశించి రాజకీయాలలో తొలిఅడుగులు వేశారు. 1969లో రాజ్యసభకు ఎన్నికైనారు. అప్పుడే ఆయన మొట్టమొదటిసారి ఢిల్లీ సందర్శించారు. బ్యాంకుల జాతీయీకరణపైన జరిగిన చర్చ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించిన ఇందిరాగాంధీ అప్పుడు విప్‌గా పనిచేస్తున్న ఓంమెహతాను అడిగి బెంగాలీబాబు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీపీఐ అగ్రనాయకుడు భూపేశ్‌గుప్తా ప్రణబ్‌ను ఇందిరాగాంధీకి పరిచ యం చేశారు. 1972లో బంగ్లా కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత ప్రణబ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇందిరకు దగ్గరై 1973లో పరిశ్రమలశాఖలో ఉపమంత్రిగా స్థానం సంపాదించారు. ఇందిర హత్యానంతరం రాజీవ్‌గాంధీతో విభేదాలు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్న సందర్భాన్ని మినహాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలన్నిటి లోనూ ప్రణబ్ మంత్రిగా పనిచేశారు. దేశీయాంగం, ప్రధానమంత్రి పదవి మినహా తక్కిన శాఖలలో ముఖ్యమైనవాటిని అన్నింటినీ నిర్వహించారు. ముఖ్యంగా మన్మోహన్ హయాంలో రాజకీయపరమైన, పరిపాలనపరమైన సంక్షోభం ఏర్పడిన ప్రతిసారీ సోనియాగాంధీ ప్రణబ్ ముఖర్జీకే పరిష్కార బాధ్యతను అప్పగించారు. రాజకీయ, పరిపాలన రంగాలలో అంతటి విస్తారమైన అనుభవం కలిగిన వ్యక్తి రాసిన పుస్తకంలో భావి తరాలు తెలుసుకోవలసిన అంశాలు అనేకం ఉంటాయనడంలో సందేహం లేదు. ఇందిరకు నిబంధనలు తెలియవా?! తిరుగులేని వాస్తవాలతోపాటు కొన్ని వివాదాస్పదమైన అంశాలూ ఉన్నాయి. వాటి లో చెప్పుకోదగింది ఇందిరకు రాజ్యాంగంలో ఆత్యయిక పరిస్థితికి సంబంధిం చిన నిబంధనలు తెలియవన్నది. అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థశంకర్ రే సలహా పాటించి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని ప్రణబ్ రాయడం ఆశ్చర్యం. 1961-62లో ఇండియాపైన చైనా దాడిచేసినప్పుడు ఆత్యయిక పరిస్థితి ప్రకటించిం ది ప్రభుత్వం. అప్పటికే ఇందిర కాంగ్రెస్ అధ్యక్షపదవి నిర్వహించారు. 1971 బంగ్లా దేశ్ విమోచన కోసం పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు సైతం దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించారు. అప్పుడు ఇందిర స్వయంగా ప్రధానమంత్రి. అటువంటి అగ్ర శ్రేణి నాయకురాలికి రాజ్యాంగ నిబంధనలు తెలియవనుకోవడం అమాయకత్వం. బహుశా తనను రాజకీయంగా ప్రోత్సహిం చిన ఇందిరాగాంధీని నిర్దోషిగానో, తప్పుడు సలహా విని పొరబాటు నిర్ణయం తీసుకున్న నేతగానో చిత్రించే ప్రయత్నం ప్రణబ్ చేసి ఉండవచ్చునని అనుకోవాలి. ఆత్యయిక పరి స్థితి ప్రకటించినప్పుడు దేశీయాంగశాఖ తెలుగు ప్రముఖుడు కాసు బ్రహ్మానందరెడ్డి చేతిలో ఉంది. తనకు ఆ నిర్ణయం ఇష్టం లేదనీ, బలవంతంగా సంతకం చేయించారనీ కాసు తనతో చెప్పినట్టు ప్రణబ్ రాశారు. నిజమే. 1992లో కాసు బ్రహ్మానందరెడ్డిని నేను సుదీర్ఘంగా ఇంటర్య్వూ చేశాను. అనేక ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్నకూడా అడిగాను. ఇందిరాగాంధీ తన అభిప్రాయానికి విలువ ఇచ్చేవారు కాదనీ, తాను కూడా దూరంగా ఉండేవాడిననీ ఆయన చెప్పారు. కారు డ్రైవర్ రాలేదనే కారణంపై ఒకసారి కేబినెట్ సమా వేశానికి రాలేనని చెప్పానని అన్నారు. దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఓంమెహతానే ‘హోం మెహతా’గా చెలామణి అయ్యేవారంటూ చమత్కరించారు. దేశీ యాంగ మంత్రిగా సంతకం చేసిన మాట నిజమేనని అన్నారు. ఇష్టం లేనప్పుడు సంత కం ఎందుకు చేశారని అడిగితే ‘మేడమ్‌కి ఎదురు చెప్పే పరిస్థితులు అప్పుడు లేవు. ఆ తర్వాత ఎదురు తిరిగాం’ అన్నారు. మొత్తం మీద ప్రణబ్ ముఖర్జీ ఆత్యయిక పరిస్థితి కారణంగా ప్రజాస్వామ్యానికి కొంత విఘాతం కలిగినా మూల్యం అంతా ఇందిరా గాంధీ స్వయంగా చె ల్లించారనీ, ఆత్యయిక పరిస్థితి వల్ల వివిధ రంగాలలో క్రమశిక్షణ నెలకొనడం వంటి మంచి పరిణామాలు కూడా సంభవించాయనీ సమర్థించారు. సాహసం కంటే విచక్షణే మేలనుకున్నారా? పీవీ హయాం గురించీ, బాబరీ మసీదు కూల్చివేత గురించీ రాయకుండా ఎందుకు దాటవేస్తున్నారు? ఈ ప్రశ్నకు సీనియర్ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు సాక్షిటీవీ చర్చలో సమాధానం చెప్పారు. పీవీకి ప్రణబ్ అత్యంత సన్నిహితుడనీ, పీవీ పాలన గురించి రాస్తే ఆర్థిక సంస్కరణల విషయంలో ఆయనను అభినందించవలసి వస్తుందనీ, ఇది సోనియాకు ఇష్టం ఉండదు కనుక మౌనంగా ఉండటమే ఉత్తమం అనుకొని ఉంటారనీ అన్నారు. కావచ్చు. దీనితో పాటు మరి రెండు కారణాలు కూడా ఉండవచ్చు. ఒకటి, బాబరీ మసీదు కూల్చివేత గురించి రాయవలసి వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నవారిలో చాలామందిని దోషులుగా బోనులో నిలబెట్టవలసి వస్తుంది. ‘‘ఏక్ ధక్కా ఔర్ దో’ అంటూ కరసేవకులను ప్రోత్సహించిన ఉమాభారతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నీటివనరుల మంత్రి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని తప్పు పట్టడం ద్వారా రాష్ట్రపతిగా మరో ఐదేళ్ళు కొనసాగే అవకా శాన్ని కాలదన్నుకోవడం అవుతుందని ప్రణబ్ భావించి ఉండవచ్చు. రాష్ట్రపతి భవ న్లో నివసిస్తూ మొఘల్ గార్డెన్ సౌందర్యం ఆస్వాదించిన వ్యక్తికి అక్కడే మరికొంత కాలం నివ సించాలని అనిపించడం సహజం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రపంచమెరిగిన తత్త్వవేత్త. ఆయన సైతం రెండో టరమ్ రాష్ట్రపతిగా ఉండే అవకాశం ఇందిరాగాంధీ ఇవ్వలేదని నొచ్చుకున్నారు. వెంకట్రామన్ సంగతీ అంతే. ఉన్నత పదవిలో కొనసా గాలనీ, మరికొంతకాలం దేశానికి సేవ చేయా లనీ కోరుకోవడంలో తప్పు లేదు. రెండు- ప్రస్తుతం అధికారంలో ఉన్నవారికి వ్యతిరే కంగా వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పెట్టి రాజ్యాంగ సంక్షోభం దిశగా ప్రయాణించడం ఎందుకని కూడా ప్రణబ్‌దా భావించి ఉండ వచ్చు. బహుశా పదవీ విరమణ తర్వాత ఇప్పుడు మినహాయించిన కాలం గురించి రాయవచ్చు. సాహసం కంటే విచక్షణ పాటించడం మేలు (డిస్క్రిషన్ ఈజ్ బెటర్ పార్ట్ ఆఫ్ వ్యాలర్)అని తలబోసి ఉండవచ్చు. మూడో కారణమే ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించనిది. రాసిన అంశాల కంటే రాయబోయే అంశాలు గంభీరమైనవి. వాజపేయి నేతృ త్వంలో మొదటి ఎన్డీఏ సర్కార్, మన్మో హన్‌సింగ్ నాయకత్వంలో రెండు యూపీఏ ప్రభుత్వాల వెలుగునీడల గురించి ప్రణబ్ ఏమి చెబుతారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజ నలో తన పాత్ర గురించి ఏమి చెబుతారో చదవాలని అనేకమందికి ఉంటుంది. ఆత్య యిక పరిస్థితి ముగిసి 1977నాటి ఎన్నికల అనంతరం మొరార్జీదేశాయ్ ప్రధానిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. జనతా పార్టీ ప్రభుత్వం పతనమైన తర్వాత 1980 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘనవిజయం సాధించినప్పటి నుంచి 1996లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే వరకూ పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలు కాంగ్రెస్ పార్టీలో మేథావులుగా, చదువుకున్న, రాయడం తెలిసిన (లిఖాపఢా నేతాలోగ్) నాయకులుగా చెలామణి అయ్యారు. వీరిద్దరి మధ్యా మంచి సంబంధాలు ఉండేవి. 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత తనకు ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తుందని ప్రణబ్ ఆశించారు. రాజీవ్‌గాంధీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆశాభంగం చెందిన దాదా సొంత కుంపటి పెట్టుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపొందే ప్రాబల్యంలేని నాయకుడు కనుక ఆ పార్టీ బతికి బట్టకట్టలేదు. ఆ తర్వాత పీవీ చొరవతోనే ప్రణబ్ కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి స్వీకరించారు. క్రమంగా ప్రధాన స్రవంతిలో ప్రవేశించారు. పీవీ ప్రభుత్వంలో ద్వితీయ స్థానం కోసం అర్జున్‌సింగ్, శరద్ పవార్ పోటీపడినా వాస్తవంగా అది దాదాదే. పీవీని అంత సన్నిహితంగా చూసిన వ్యక్తి, అంతగా అభిమానించిన వ్యక్తి పీవీ పాలన కాలాన్ని ఆత్మకథలో పరిహరించడం అన్యాయం. ఆత్యయిక పరిస్థితిని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యాయంగా అభివర్ణించి కూడా ఇందిరను నిర్దోషిగా చిత్రించగలిగిన ప్రణబ్‌కు బాబరీమసీదు విధ్వంసాన్ని గర్హిస్తూనే విధ్వంసకుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించకుండా ఉండటం కష్టం కాదు. రెండో భాగాన్ని 1989 నుంచి ప్రారంభిస్తేనే సమంజసంగా ఉంటుంది. ఎవ్వరినీ నిందించకుండా, గాయపరచకుండా చరిత్ర చెప్పే నేర్పు ప్రణబ్‌దా కు దండిగా ఉంది. ఇందుకు మొదటి భాగమే సాక్ష్యం. murthykondubhatla@gmail.com - కె. రామచంద్రమూర్తి -
ఒక తెలంగాణ దళితుడి ఆత్మకథ- నియతి
బేగరి కులం అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు. మాల సామాజిక వర్గంలో కాటికాపరులుగా పని చేసేవారిని తెలంగాణలో ఈ కులంవారిగా పరిగణిస్తారు. ఒకప్పుడు తెలంగాణలో శవం దహనకాండ నిర్వహించినందుకు కాటికాపరికి ఏం దక్కేదో తెలుసా? శవం మీద కప్పిన గుడ్డ. శవం తల దగ్గర పెట్టిన కుండలోని చిల్లర. అంతే. ‘ఆ గుడ్డతో మా అయ్య సొక్కా కుట్టించుకునేటోడు’ అంటారు భూతం ముత్యాలు తన ఆత్మకథలో. నల్లగొండ జిల్లాలోని నాంపల్లి ప్రాంతంలో ఒక నలభై ఏళ్ల క్రితం పుట్టిన ఈ రచయిత తన కుటుంబం, తన కులం పట్టెడు మెతుకుల కోసం ఎంత పోరాటం సాగించవలసి వచ్చిందో, కాసింత ఆత్మగౌరవం కోసం, తామూ మనుషులమే అనే ఉనికి కోసం ఎంత పెనుగులాడవలసి వచ్చిందో తన ఆత్మకథ ‘నియతి’లో వినిపిస్తారు. దాదాపు 80 పేజీలు ఉన్న ఈ ఆత్మకథంతా ఈ రచయిత అందరిలాగే తనూ చదువుకోవడానికి చేసిన పోరాటం. ఎందుకు దీనిని పోరాటం అనవలసి వస్తోందంటే తన వాడలో తన కులంలో టెన్త్ పాసైన మొదటి పోరడు ఈ రచయితే. కాని అతడు టీచరయ్యాక సాటి టీచర్లు, పెద్ద కులం వాళ్లు ‘ఇంకా మీకు రిజర్వేషన్లు కావాల్నా’ అని అడుగుతారు, అంతా బాగుపడిపోయారు కదా అనే ధోరణిలో. ఎందుకు అవసరంలేదు? అంటాడు రచయిత. తన తర్వాత తన వాడలో మరొక కుర్రాడు టెన్త్ పాసైతే కదా. అంబేద్కర్ పుణ్యమా అని దళితుల జీవితాల్లో వచ్చిన కాసింత వెలుగునూ తట్టుకోలేక తీవ్రమైన వివక్ష చూపి, వేధింపులకు గురిచేసే అనుభవాలు ఈ పుస్తకంలో చూస్తాం. మంచి టీచర్‌గా పేరు తెచ్చుకున్నందుకు, కేవలం పాఠాలు చెప్పడంతో సరిపుచ్చక బొమ్మలు గీయడం, వాల్ పెయింటింగ్‌లాంటి పనులు చేసినందుకు ‘అన్నల’తో సంబంధం అంటగట్టి హింసించడంతో ఇంత మనిషీ ఆత్మహత్యాయత్నం చేయవలసిరావడం కంటే విషాదం ఏమైనా ఉందా? దారుణమైన పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చి రిక్షా తొక్కి ఆ వచ్చిన డబ్బుతో డిగ్రీ చదువుకుని టీచర్ అయిన భూతం ముత్యాలు కంటికి కనపడవచ్చు. ఇదంతా చేయలేక రాలిపోయిన వేలాది, లక్షలాది దళితుల మాటేమిటి? ఈ దేశంలో దళితుల జీవితం ఒకప్పుడు సులువు కాదు. ఇప్పుడూ సులువు కాదు. నిత్యపోరాటం అది. దానిని ఎన్ని విధాలుగా మరెన్ని వైనాలుగా చూపి, రాస్తేనే సమాజానికి దళితుల గురించి తెలుస్తుంది. ప్రతీదానికి వారు ఎందుకు సమానమైన హక్కుదారులో ఇంకా చెప్పాలంటే కాసింత ఎక్కువ హక్కుదారులో కూడా తెలుస్తుంది. ‘నియతి’ ఉర్దూ మాట. ‘నియ్యత్’ నుంచి వచ్చింది. అంటే బుద్ధి అని అర్థం. ‘జైసీ నియ్యత్ వైసీ బర్కత్’ అని తెలంగాణలో సామెత. దళితుల నియతి ఏమిటి? కష్టించడం, పని చేయడం. ఒకరిని ముంచకుండా బతుకుదాం అనుకున్నా కూడా ఎప్పుడూ తమను అణచే రాజకీయాలు ఎందుకు జరుగుతుంటాయి అని ఆవేదన చెందుతారు రచయిత. తెలంగాణ శుద్ధ పలుకుబడిలో రాసిన ఈ ఆత్మకథ హాయిగా చదివిస్తుంది. ఒక కాలపు జీవితాన్ని శకల మాత్రంగానైనా పరిచయం చేస్తుంది. ముఖ్యంగా దళితుల పట్ల దళితేతరుల వైఖరిలో విశాలత్వాన్ని ప్రతిపాదిస్తుంది. నియతి- భూతం ముత్యాలు ఆత్మకథ వెల: రూ.50, ప్రతులకు: 9490437978 -
జీవిత చరిత్ర రెడీ అవుతోంది: సానియా
-
జీవిత చరిత్ర రెడీ అవుతోంది: సానియా
తన జీవిత చరిత్ర సిద్ధం అవుతోందని, వచ్చే సంవత్సరమే.. అంటే 2015లో దాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తానని హైదరాబాదీ టెన్నిస్ తార సానియామీర్జా తెలిపింది. ప్రస్తుతం తాను 2016 ఒలింపిక్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నానని, అంతేతప్ప తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే.. జేమ్స్ బాండ్ సినిమాలో సానియా కనిపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘మూడుసార్లు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచా. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌నూ గెలిచా. ఇక మిగిలింది మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిలే. అందుకే దీనిపై దృష్టిపెట్టా’ అని సానియా వ్యాఖ్యానించింది. కాగా, సోనీపిక్స్ ఛానల్లో సానియా మీర్జా రొమాంటిక్ లుక్‌లో కనపడుతుందన్నది తాజా సమాచారం. అమ్మాయిలను పడగొట్టాలంటే అబ్బాయిలు ఎలా మెలగాలో రహస్యాలు చెబుతుంది. ఫిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ పేరుతో వచ్చే ఈ కార్యక్రమం నవంబర్ 22 నుంచి 12 వారాలు ప్రసారం కానుంది. అందులో ఆమె కొత్త అవతారంలో కనిపిస్తుంది. -
తెలుగులోకి సచిన్ ఆత్మకథ
-
తెలుగులోకి సచిన్ ఆత్మకథ
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'కు అమితాదరణ లభిస్తోంది. అభిమానుల కోసం ఈ పుస్తకాన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రచురించనున్నారు. సచిన్ ఆత్మకథను తెలుగులో సహా ఇతర భారతీయ ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయాలని నిర్ణయించారు. హచెట్ ఇండియా సహ పబ్లిషర్‌గా వ్యవహరించనుంది. వివిధ భాషల పబ్లిషర్స్‌తో చర్చలు జరుపుతున్నట్టు హచెట్ ఇండియా పబ్లిషర్ పౌలోమి ఛటర్జీ చెప్పారు. తెలుగు భాషతో పాటు మరాఠీ, హిందీ, మలయాళం, అస్సామీ, బెంగాలీలో ప్రచురించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. నవంబర్ 6న విడుదలైన సచిన్ ఆత్మకథకు మార్కెట్లో భలే డిమాండ్ ఏర్పడింది. రెండు లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. -
ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా!
తొలి అంతర్జాతీయ సిరీస్‌ను గుర్తు చేసుకున్న సచిన్ న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ద్వారా... అతని కెరీర్లో, జీవితంలో జరిగిన అనేక సంఘటనలు అభిమానులకు తెలుస్తున్నాయి. వాటిలో బాగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా 16 ఏళ్ల వయసులో సచిన్ తొలిసారి పాకిస్థాన్ వెళ్లి అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి అనుభవాలు మరీ ఆసక్తికరం. ఆ విశేషాలు మాస్టర్ మాటల్లోనే... 1989లో పాకిస్థాన్‌లో నా తొలి అంతర్జాతీయ పర్యటనకు గొప్ప బౌలర్లందరినీ ఒకేసారి ఎదుర్కొన్నాను. అక్రమ్ బౌలింగ్‌లో తొలిసారి ఆడాను. వరుసగా నాలుగు బౌన్సర్లు వేశాడు. నాకు నేనే ‘టెస్టు క్రికెట్‌కు స్వాగతం’ అని చెప్పుకున్నాను. ఇమ్రాన్, అక్రమ్, వకార్, ఆకిబ్, ముస్తాక్ అహ్మద్, అబ్దుల్ ఖాదిర్... ఇంత గొప్ప బౌలర్లను ఆ సిరీస్‌లో ఆడాను. ఆ సిరీస్‌లో నాలుగో టెస్టులో తొలిసారి భయపడ్డాను. వకార్ వేసిన బంతి వచ్చే ఎత్తు విషయంలో పొరబడ్డాను. దీంతో బంతి నా ముక్కుకు తగిలింది. కళ్లు మసకబారాయి. తల బరువుగా అనిపించింది. బంతి ఎటు వెళ్లిందో చూస్తున్నాను. ఈలోగా చొక్కా మీద రక్తం కనిపించింది. ఈ లోగా మియందాద్ దగ్గరకు వచ్చాడు. ‘అరే... నీ ముక్కు పగిలిపోయింది. నువ్వు హాస్పటల్‌కి వెళ్లాలిగా’ అని వెక్కిరించాడు. ఇది చాలదన్నట్లు స్టాండ్స్‌లో ఒక అభిమాని బ్యానర్ తీశాడు. ‘పిల్లాడా... ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా’ అని రాశాడు. దీంతో చాలా అసహనంగా అనిపించింది. చాలా భయపడ్డాను అలాగే భారత్-పాక్ సిరీస్ ఎంత ఉద్రిక్తంగా ఉంటుందో కూడా అంతర్జాతీయ క్రికెట్లో నా తొలి రోజే తెలిసింది. లంచ్ తర్వాత సెషన్లో ఒక వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. సల్వార్ కమీజ్ వేసుకుని బాగా గడ్డం పెంచుకుని ఉన్నాడు. నేరుగా కపిల్ దగ్గరకు వెళ్లి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ప్రభాకర్నీ తిట్టాడు. ఆ వెంటనే కెప్టెన్ శ్రీకాంత్ దగ్గరకి దూసుకెళ్లి కొట్టడం మొదలుపెట్టాడు. ఆ పక్కనే నేను ఉన్నా. చాలా భయపడ్డా. ఇక తర్వాత నా వంతే అనిపించింది. ఒకవేళ నా వైపు వస్తుంటే డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వెళదామని నిర్ణయించుకున్నా. అసలు అది క్రికెట్ మ్యాచ్‌లా అనిపించలేదు. -
నన్ను అవమానించారు!
ముంబై: సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో సంచలనాలకు కొదువ లేదు. మాస్టర్ తాను చెప్పినట్లుగా ఇప్పటి వరకు బయటికి వెల్లడించని అనేక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. నిజాలే చెప్పానన్న అతను నాటి ఘటనలపై తన ఆగ్రహావేశాలు దాచుకోలేదు. వేర్వేరు అంశాలపై సచిన్ రాసిన విశేషాలు అతని మాటల్లోనే... కనీసం చెప్పలేదు: నన్ను కెప్టెన్సీనుంచి తొలగించిన విధానం చాలా బాధగా, అవమానకరంగా అనిపించింది. బీసీసీఐ నుంచి ఎవరూ నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. నేను కెప్టెన్‌ను కాదని మీడియా ద్వారానే తెలిసింది. అయితే అలా చేయడం నేను ఇంకా బాగా ఆడాలనే పట్టుదల నాలో పెంచింది. అయితే నా కోపం మాత్రం తగ్గలేదు. కెప్టెన్సీ బాధనుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది’ కోచ్‌గా కపిల్ విఫలం: నేను రెండో సారి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో భారత దిగ్గజం కపిల్‌దేవ్ కోచ్‌గా ఉన్నారు. 1999-2000 ఆస్ట్రేలియాలాంటి కఠిన సిరీస్‌లో ఆయన నుంచి నేను చాలా ఆశించాను. జట్టు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించడంలో కోచ్‌దే కీలక పాత్ర అని నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఆయన మాత్రం అన్నీ కెప్టెన్‌కే వదిలేశారు. మైదానంలో ఉపయోగపడగల వ్యూహ ప్రతివ్యూహాలు, చర్చల్లో ఆయన పెద్దగా పాల్గొనకపోయేవారు. ఒక కోచ్‌గా కపిల్ నన్ను తీవ్రంగా నిరాశపరిచారు. నన్ను ఒంటరిగా వదిలెయ్: ముల్తాన్ టెస్టులో నేను 194 పరుగులతో ఆడుతున్నాను. మేం ముందుగా అనుకున్నదానికంటే ఒక ఓవర్ ముందే డిక్లరేషన్ జరిగింది. ఇలా చేయడంలో అర్థమే లేదు. నిరాశతో, బాధతో డ్రెస్సింగ్ రూమ్ చేరాను. ఆ సమయంలో చాలా ఆగ్రహంతో ఉన్నాను. జాన్ రైట్ వచ్చి తన తప్పేమీ లేదని క్షమాపణ చెప్పారు. కోచ్‌కే తెలియకపోతే సారీ చెప్పటం ఎందుకన్నాను. గంగూలీ వచ్చి నాకూ తెలీదంటూ సారీ చెప్పినా అదే అన్నాను. చివరికి ఇక నటించలేనంటూ నా అసంతృప్తిని ద్రవిడ్ ముందు ప్రకటించేశాను. జట్టు గెలుపు కోసం నిర్ణయమంటూ అతను చెప్పిన వివరణతో నేను సంతృప్తి చెందలేదు. నేను కూడా జట్టు కోసం ఆడుతున్నానని, 194 పరుగులు జట్టుకే ఉపయోగపడతాయని చెప్పాను. ఈ కోపాన్ని నేను మైదానంలో చూపించను కానీ మైదానం బయట నన్ను ఒంటరిగా వదిలెయ్. కోలుకోవడానికి సమయం పడుతుంది అని ద్రవిడ్‌తో అన్నాను.