నా ఆత్మకథకు నేనే దర్శకురాలు
తన ఆత్మ కథకు తానే దర్శకత్వం వహిస్తానంటున్నా రు నటి షకీలా. ఈ సంచలన తార ఒకప్పుడు తన శృంగారాత్మక నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఉర్రూత లూగించారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్కిన్ షో కు దూరంగా వివిధ కథా పాత్రలను పోషిస్తున్న షకీలా తాజాగా దర్శకురాలి అవతారమెత్తారు. ఈమె మెగాఫోన్ పట్టి తెలుగు, హిందీ భాషల్లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రాలోని ఒక కుగ్రామంలో సెలైంట్‌గా జరుగుతోంది. షకీలా మాట్లాడుతూ, దర్శకత్వం చేయూలన్నది తన చిరకాల వాంఛగా పేర్కొన్నారు. అది నెరవేరే సరైన సందర్భం రావడంతో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
ఇది ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అని, కథానాయిక పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో అనువాదం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు చెప్పలేనన్నారు. అయితే తదుపరి తన ఆత్మకథతో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. దీన్ని తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించనున్నట్లు తెలిపా రు. తన ఆత్మకథను పుస్తక రూపంలో కి తీసుకొచ్చి ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ బహుభాషా నటి ఆ కథతో చిత్రం తీసి ఇంకెం త కలకలం సృష్టించనున్నారో వేచి చూడాల్సిందే.