Shakila
-
హీరో అల్లరి నరేశ్ తండ్రి నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు: షకీల
టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో టార్చర్ వల్ల సినిమాలే వదిలేశానంటూ ఇటీవల నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన ప్రవర్తన వల్ల ఇండస్ట్రీని వదిలేశానని, 20 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించనేలేదని చెప్పింది. తాజాగా షకీల.. విచిత్రకు మద్దతు తెలుపుతూ తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ తండ్రి తనను అడ్జస్ట్మెంట్ గురించి అడిగాడని ఆరోపించింది. విచిత్ర అతడి పేరు చెప్పాల్సింది తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విచిత్ర నా స్నేహితురాలు. మేమిద్దరం కొన్ని సినిమాల్లో కలిసి నటించాం కూడా! ఏ హీరో తనను గదిలోకి పిలిచాడు? ఎవరి వల్ల ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందనేది చెప్తే బాగుండేది. అతడి పేరు బయటపెట్టి ఉండాల్సింది. నేను ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. గతంలో నేను కూడా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో అల్లరి నరేశ్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు. అడ్జస్ట్ అయిపో.. ఇంకో సినిమా ఇస్తా.. తనతో అడ్జస్ట్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అప్పుడు నేను.. సర్, ఇప్పుడీ సినిమాలో నటించినందుకు నాకు డబ్బులిచ్చేశారు. ఇంకో సినిమా ఛాన్స్ నాకు అక్కర్లేదు. అంత అవసరం కూడా లేదు అని ముఖం మీదే చెప్పాను. ఇప్పుడాయన బతికి లేరు. దీని గురించి నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు పిలిచి అడిగినా చెప్తా.. అవును, ఆ రోజు ఆయన నన్ను తన గదికి పిలిచాడు. ఇదే నిజం..' అని చెప్పుకొచ్చింది షకీల. ఈమె వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాగా బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న షకీల ఇటీవలే బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టింది. రెండు వారాలకే హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయింది. చదవండి: నా కూతురు సహజీవనం చేస్తానంటే బలవంతంగా మొదటి పెళ్లి చేశా.. చివరకు.. -
Shakeela: ఒకప్పుడు గ్లామర్ డాల్.. ఇప్పుడు ట్రెడిషనల్ అవతార్ (ఫోటోలు)
-
'బిగ్‌బాస్'లో అనుకున్నదే జరిగింది.. వెళ్తూ షకీలా ఏడిపించేసింది!
'బిగ్‌బాస్'లో మిగతా రోజుల సంగతెలా ఉన్న వీకెండ్ వస్తే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎలిమినేషన్ టెన్షన్ కచ్చితంగా ఉంటుంది. శనివారం అందరికీ ఓ రౌండ్ వేసిన నాగార్జున.. ప్రశంసలతో పాటు కౌంటర్స్ ఇచ్చేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్లో బోలెడంత ఫన్ ఇస్తూనే, చివర్లో ఎలిమినేషన్ కూడా చేశాడు. అనుకున్నట్లే ఆమె ఇంటినుంచి బయటకెళ్లినప్పటికీ.. కాస్త డిఫరెంట్‌గా జరిగింది. ఇంతకీ ఆదివారం (Day-14) హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) శివాజీకి కౌంటర్స్ సోమవారం వినాయక చవితి కాబట్టి.. గణేశుడి పాటకు డ్యాన్స్ చేస్తూ హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. అయితే శనివారం ఎపిసోడ్లో పవరస్త్ర గెలుచుకున్న శివాజీ.. దాన్ని హాల్లో అలానే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో నాగ్ చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనే తీసుకుని ఉంటే, అది వాళ్లది అయ్యేదని చెప్పాడు. ఎవరూ తీసుకోకపోవడంతో దాన్ని శివాజీకే ఇచ్చేశారు. సండే ఫండే ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. అయితే దాని కంటే ముందు కాస్త హౌస్ అంతా ఫన్ జనరేట్ చేయడం కామన్. ఈసారి కూడా భళ్లాలదేవ, కట్టప్ప అని రెండు బొమ్మలు పెట్టారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్.. హౌసులో తనకి ఎవరు భళ్లాలదేవ? ఎవరు కట్టప్ప? అనేది చెప్పి కారణాలు చెప్పాలని నాగ్ 'BB సామ్రాజ్యం' అనే గేమ్ పెట్టాడు. ఇందులో తేజని నలుగురికి కట్టప్ప అయ్యాడు. గౌతమ్.. ముగ్గురికి కట్టప్ప అయ్యాడు. పూర్తి లిస్ట్ దిగువన ఉంది చూసేయండి. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) కంటెస్టెంట్ - కట్టప్ప, భళ్లాలదేవ శోభాశెట్టి.. గౌతమ్, ప్రిన్స్ గౌతమ్ - రతిక, ప్రిన్స్ రతిక - తేజ, గౌతమ్ తేజ - గౌతమ్, శివాజీ శివాజీ - తేజ, ప్రశాంత్ ప్రశాంత్ - తేజ, శివాజీ దామిని - శుభశ్రీ ,సందీప్ సందీప్ - శివాజీ, శుభశ్రీ శుభశ్రీ - తేజ , సందీప్ ప్రియాంక - శివాజీ , సందీప్ ప్రిన్స్ - సందీప్, శివాజీ అమరదీప్ - గౌతమ్, సందీప్ షకీలా - ప్రిన్స్, ప్రశాంత్ వాళ్లు సేఫ్ ఓవైపు పైన చెప్పిన జరుగుతుండగానే మరోవైపు మధ్యలో ఓసారి ఎలిమినేషన్ గురించి నాగ్ చెబుతూ వచ్చాడు. అలా తొలి రౌండులో ప్రిన్స్, రెండో రౌండులో రతిక, మూడో రౌండులో శోభాశెట్టి, ప్రశాంత్, నాలుగో రౌండులో గౌతమ్ సేవ్ అయ్యారు. ఇకపోతే ఎలిమినేషన్ కంటే ముందు 'కొంచెం గెస్ చేయ్ గురూ' అని నాగ్.. మరో గేమ్ పెట్టాడు. ఈ వారం ఆడిన రణధీర, మహాబలి గ్రూపులని ఇందులో అలానే పార్టిసిపేట్ చేయమన్నాడు. దీంతో మాయస్త్ర టాస్కులో ఓడిన మహబలి టీమ్ ఇక్కడ గెలిచారు. లగ్జరీ బడ్జెట్ సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: రజనీకాంత్‌తో ఉన్న ఈ పిల్లాడు స్టార్ హీరో.. గుర్తుపట్టారా!?) షకీలా ఎలిమినేట్ ఇక చివరగా మిగిలిన తేజ, షకీలా.. యాక్టివిటీ రూంలోకి వెళ్లారు. ఎవరి ఫొటో బయటకొస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు అని నాగ్ చెప్పారు. తేజ ఫొటో ఉండటంతో అతడు బతికిపోయాడు. షకీలా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆమె వెళ్లిపోవడంతో సందీప్, అమర్దీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తేజ కూడా ఎమోషనల్ అయ్యాడు. షకీలా తనకు అమ్మలా అనిపించారని అన్నాడు. దామిని అయితే 'పెదవే పలికిన మాటల్లోనే' పాట పాడింది. అయితే ఈ సాంగ్ పాడుతున్నప్పుడు షకీలా.. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా వెళ్తూ వెళ్తూ హౌసు మొత్తాన్ని ఏడిపించేశారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. షకీలా ఉండాల్సింది అయితే అప్పట్లో వ్యాంప్ తరహా పాత్రలతో కుర్రాళ్లని పిచ్చెక్కించిన షకీలా వేరు. హౌసులోకి వచ్చిన షకీలా వేరు. ఎందుకంటే 'బిగ్‌బాస్'లో చాలా హుందాగా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో ఈమెకి తక్కువ ఓట్లు పడ్డాయి. బహుశా ఇంకొన్నాళ్లు హౌసులో షకీలా ఉండుంటే బాగుండేది. (ఇదీ చదవండి: నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!) -
అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!
'బిగ్‌బాస్' హౌస్ రోజురోజుకీ క్రేజీగా మారుతుంది. లేకపోతే ఏంటబ్బా.. ఈరోజు ఫ్రెండ్ గా ఉన్నోళ్లు రేపటికి శత్రువులు అయిపోతున్నారు. ఇప్పుడు ఒకే టీమ్ లో ఉన్నోళ్లు.. రోజు మారేసరికి ఒకరిని ఒకరు ఎలా పడగొట్టాలా అని స్కెచ్ లు వేసుకుంటున్నారు. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? 12వ రోజు ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. తొలివారం ఎంతో సరదాగా సాగిన బిగ్ బాస్.. రెండో వారంలోకి ఎంటరయ్యేసరికి చాలావరకు మారిపోయింది. ఎప్పుడు చూడు గొడవలే అవుతున్నాయి. మాట్లాడితే చాలు కంటెస్టెంట్స్.. ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. తాజాగా 12వ రోజు కూడా గౌతమ్-ప్రిన్స్ గొడవపడ్డారు. దీంతో ప్రిన్స్ ఏడ్చేశాడు. ఇక కన్ఫెషన్ రూంలోకి వెళ్లొచ్చిన తర్వాత రతికతో మాట్లాడుతూ కనిపించాడు. ఆమె కూడా ఇతడితో పులిహోర కలుపుతూ కనిపించింది. (ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) అయితే రతిక-ప్రిన్స్ మధ్య ప్రేమలాంటిది పుట్టడం కాదు.. అదంతా ప్రశాంత్ ముందే జరగడం.. అయ్యో పాపం అనిపించేలా ఉంది. మరోవైపు పవర్ అస్త్ర కోసం గేమ్స్ గెలుచుకున్న మహాబలి గ్రూపులో షకీలా, శివాజీ అర్హులని అందరూ నిర్ణయించారు. అయితే సడన్ ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్.. సందీప్ ని మరో వ్యక్తిని కంటెండర్ గా సెలెక్ట్ చేసే అవకాశం కల్పించాడు. దీంతో సంచాలకుడు సందీప్.. అమర్‌దీప్‌ని పవర్ అస్త్ర పోటీ కోసం ఎంచుకున్నాడు. దీంతో ఇప్పటికే పోటీలో ఉన్న షకీలా, శివాజీ అసహనం వ్యక్తం చేశారు. తాము ఇంట్లో నుంచి వెళ్లిపోతామని అరిచి కేకలు పెట్టడం మీరు తాజా ప్రోమోలో చూడొచ్చు. మరి పూర్తిగా ఏం జరిగిందనేది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్) -
రెండో భార్య షకీలా అదృశ్యం.. వియ్యంకుడిపై అనుమానంతో
సాక్షి, భీమవరం: భీమవరంలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురికాగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వన్‌టౌన్ సీఐ అడబాల శ్రీను మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు గన్‌బజార్‌కు చెందిన పటాన్ శంషేర్ఖాన్ కుమార్తె అఫీరాను భీమవరం 11వ వార్డుకు చెందిన షేక్ మహబూబ్‌జానీ కుమారుడు కరీముల్లాకిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. అప్పటినుంచి శంషేర్‌ఖాన్‌కు, అతని కుమార్తె అఫీరా మధ్య మాట్లల్లేవు. శంషేర్ఖాన్ రెండో భార్య షకీలా ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోవడంతో శంషేర్ఖాన్ అతని మొదటి భార్య కుమార్తె యాసీన్, అల్లుడు ముదిబీ, కొడుకు అప్రోజ్‌తో కలిసి సోమవారం అర్ధరాత్రి భీమవరంలోని షేక్ మహబూబ్‌జానీ ఇంటికి వెళ్లి షకీలా గురించి ఆరా తీశారు. ఆమె తమ ఇంటికి రాలేదని చెబుతుండగానే శంషేర్ఖాన్ చాకుతో మహబూబ్‌జానీని పొడవగా అడ్డువచ్చిన అఫీరా, జానీ రెండో కుమారుడు రహీమ్‌లను తీవ్రంగా గాయపర్చాడు. దీంతో బాధితులు ముగ్గుర్ని భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా మహబూబ్‌జానీని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానీ మంగళవారం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అడబాల శ్రీను చెప్పారు. -
ఐటీ అల్టిమేటం
ఐటీ దాడుల్లో ఆధారాలు లభించినా, కొన్ని కీలకరికార్డులు, దస్తావేజుల ఒరిజినల్స్ తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటన్నింటిని రెండ్రోజుల్లోపు సమర్పించాల్సిందే అని చిన్నమ్మ కుటుంబం, సన్నిహితులకు ఐటీ వర్గాలు అల్టిమేటం ఇచ్చాయి ఆరుగురికి సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక, విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళ అన్న జయరామన్ కుమార్తెలు కృష్ణప్రియ, షకీల బుధవారం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లను ఎక్కారు. ఐటీ దాడులు సహజమేఅని, ఇందులో రాజకీయం లేనే లేదంటూ కృష్ణప్రియ వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడులు, సోదాలు ముగియడంతో విచారణల వేగం పెరిగింది. అధికారుల పరిశీలనలో అక్రమార్జన బండారం బయటపడుతోంది. అదే సమయంలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల వివరాలు లభించినా, ఒరిజినళ్లు దాడుల్లో తమకు చిక్కకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. ప్రధానంగా కీలక ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్స్ ఎక్కడ దాచారన్న చర్చ బయలుదేరింది. దాచి పెట్టిన వాళ్లే వాటిని బయటకు తీసి, తమకు అప్పగించే రీతిలో ఐటీ వర్గాలు గడువును నిర్ణయిస్తూ అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. వివేక్ చుట్టూ ఉచ్చు చిన్నమ్మ శశికళ అన్నయ్య జయరామన్, ఇళవరసి దంపతుల కుమారుడు వివేక్ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే. వివేక్ పేరిట అత్యధికంగా ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించి, ఆ దిశలో విచారణ వేగం పెరిగింది. తమకు లభించిన ఆధారాలను పరిశీలించే క్రమంలో కొన్ని ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు లభించని దృష్ట్యా, వాటన్నింటిని రెండు రోజుల్లో తమకు స్వయంగా సమర్పిస్తే సరి..! అన్న హెచ్చరికతో వివేక్‌కు సమన్లు వెళ్లినట్టు సమాచారం. ఇక, వివేక్ సన్నిహితులుగా భావిస్తున్న సురానా ఫైనాన్స్, శ్రీలక్ష్మి జువలరీస్ తెన్నరసు, సునీల్, సెంథిల్, విండ్ ఎనర్జీ సుబ్రమణ్యంలకు సైతం ఒరిజినల్స్ సమర్పించే విధంగా హెచ్చరికతో కూడిన సమన్లు వెళ్లినట్టు సమాచారం. జాస్ సినిమాస్ కొనుగోలు వ్యవహారంతో పాటు, అనేక డాక్యుమెంట్లు జిరాక్స్‌లుగా తేల్చిన అధికారులు , దాచిపెట్టిన వాటిని బయటకు తీస్తారా..? లేదా, రిజిష్ట్రేషన్ల శాఖను ఆశ్రయించి, వివరాల్ని రాబట్టి, కఠినంగా వ్యవహరించమంటారా.? అన్న హెచ్చరికతో ఈ సమన్లు జారీ చేసినట్టు ఐటీ కార్యాలయంలో చర్చ. మనో వేదనలో చిన్నమ్మ, ఇళవరసి ఈ దాడులు, విచారణల పుణ్యమా అని పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశి కళ, ఇళవరసిలకు మనశ్శాంతి కరువైనట్టు సమాచారం. ఈ ఇద్దరు తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, దినకరన్‌కు చిన్నమ్మ లేఖ రాసినట్టు సమాచారం. ఆ లేఖలో ఐటీ దాడులు, వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాలు, ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాల గురించి వివరించిన ట్టు తెలిసింది. ఈ లేఖ బుధవారం దినకరన్‌కు అందించినట్టుంది. అందుకే కాబోలు, ఆయన తరఫున ప్రతినిధులు ఓ ప్రకటన వెలువరించడం గమనార్హం. గత రెండు రోజులుగా మౌనంగా ఉన్న దినకరన్, తాజాగా జారీచేసిన ప్రకటనలో చిన్నమ్మ కుటుంబంలో ఉన్న వాళ్లంతా చదువుకున్న వాళ్లేనని, బాధ్యత గల సంస్థల్ని నిర్వర్తిస్తున్నారని, మోసాలతో, పన్ను ఎగవేతతో కాలం నెట్టుకు రావాల్సినంత దిగజారే పరిస్థితిలో లేదన్నట్గుగా ఆ ప్రకటన ఉండడం గమనార్హం. జీవనానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నుంచి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికి ఉన్నారు. విచారణకు కృష్ణ ప్రియ, షకీల చిన్నమ్మ శశికళకు తోడుగా పరప్పన అగ్రహార చెరలో ఇళవరసి కూడా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కుమారుడు వివేక్‌ను ఐటీ గురిపెట్టింది. ఇక, ఆమె కుమార్తెలు కృష్ణప్రియ, షకీలలను కూడా ఐటీ వర్గాలు విచారణకు పిలిచాయి. బుధవారం ఆ ఇద్దరు తమ భర్తలతో కలిసి నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. ఈ ఇద్దర్ని వేర్వేరుగా కూర్చోబెట్టి ఐటీ వర్గాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ప్రధానంగా కృష్ణప్రియ ఆధీనంలోని సంస్థలతో పాటు ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు బదిలీలు సాగి ఉండడాన్ని పరిగణించి, అందుకు తగ్గ ప్రశ్నల్ని సంధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అనేక ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించగా, షకీల అయితే, సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహించినట్టు సమాచారం. ఈ విచారణ అనంతరం మీడియాతో కృష్ణప్రియ మాట్లాడుతూ, ఐటీ విచారణకు పూర్తి సహకారం అందించామన్నారు. తన ఇంట్లో నుంచి ఎలాంటి రికార్డులు పట్టుకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. ఐటీ దాడులు సహజమేనని, దీనిని వ్యతిరేకించడం, ఖండించడం అనవసరంగా పేర్కొన్నారు. ఈ దాడులు, విచారణల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారని, ఎప్పుడు పిలిచినా సంపూర్ణ సహకారం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, జయ టీవీ మేనేజర్ నటరాజన్ సైతం విచారణకు హాజరు అయ్యారు. కొడనాడు చుట్టూ ఐటీ విచారణ చిన్నమ్మ కుటుంబంతో పాటు నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్, గ్రీన్ టీ ఎస్టేట్ల చుట్టూ సాగుతోంది. ఇక్కడ సోదాలు ముగిసినా, ఐటీ అధికారులు విచారణ మాత్రం ముగించలేదు. తమ విచారణను ముమ్మరం చేశారు. కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్, పక్కనే ఉన్న గ్రీన్ టీ ఎస్టేట్ మేనేజర్ పళనికుమార్లతో పాటు 20 మందిని ఒకరి తర్వాత మరొకరు చొప్పున విచారించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ పాత నోట్లు బయటపడడమే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలు ఓట్ల కొనుగోలుకు పంపించినట్టు ఓ జాబితా అధికారులకు చిక్కినట్టు సమాచారం. అందుకే ఆ జాబితా ఆధారంగా విచారణ ముమ్మరంగా సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ములాఖత్‌కు వివేక్ మేనత్త శశికళ, తల్లి ఇళవరసిలతో ములాఖత్‌కు వివేక్ కసరత్తుల్లో ఉన్నారు. ఇందుకు తగ్గట్టు న్యాయవాదులు పరప్పన అగ్రహార చెరలో వినతి పత్రాన్ని సమర్పించారు. పరప్పన అగ్రహార చెరలో శశికళ, ఇళవరసిలతో న్యాయవాదులు మూర్తి రావు, కృష్ణప్ప సమావేశం కావడం వెలుగు చూసింది. తాజా, పరిణామాల నేపథ్యంలోనే ఈ భేటీ సాగి ఉంటుందని, చట్టపరంగా ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆ న్యాయవాదుల్ని మీడియా ప్రశ్నించగా, తల్లి ఇళవరసిని కలిసేందుకు వివేక్ సమయం కోరి ఉన్నారని, అందుకు తగ్గ వినతి పత్రం, వివేక్ రాసిన లేఖ జైలు వర్గాలకు సమర్పించామని పేర్కొన్నారు. కాగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ దీనిపై మాట్లాడుతూ ఐటీ దాడుల్లో వెలుగుచూసిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. శశికళ కుటుంబానికి సంబంధించిన కేసులన్నీ ప్రత్యేక న్యాయమూర్తిని నియమించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నా ఆత్మకథకు నేనే దర్శకురాలు
తన ఆత్మ కథకు తానే దర్శకత్వం వహిస్తానంటున్నా రు నటి షకీలా. ఈ సంచలన తార ఒకప్పుడు తన శృంగారాత్మక నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఉర్రూత లూగించారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్కిన్ షో కు దూరంగా వివిధ కథా పాత్రలను పోషిస్తున్న షకీలా తాజాగా దర్శకురాలి అవతారమెత్తారు. ఈమె మెగాఫోన్ పట్టి తెలుగు, హిందీ భాషల్లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రాలోని ఒక కుగ్రామంలో సెలైంట్‌గా జరుగుతోంది. షకీలా మాట్లాడుతూ, దర్శకత్వం చేయూలన్నది తన చిరకాల వాంఛగా పేర్కొన్నారు. అది నెరవేరే సరైన సందర్భం రావడంతో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఇది ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అని, కథానాయిక పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో అనువాదం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు చెప్పలేనన్నారు. అయితే తదుపరి తన ఆత్మకథతో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. దీన్ని తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించనున్నట్లు తెలిపా రు. తన ఆత్మకథను పుస్తక రూపంలో కి తీసుకొచ్చి ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ బహుభాషా నటి ఆ కథతో చిత్రం తీసి ఇంకెం త కలకలం సృష్టించనున్నారో వేచి చూడాల్సిందే. -
షకీలాగా అంజలి?
సంచలన శృంగార తార షకీలా జీవిత చరిత్ర వెండితెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు నటి సిల్క్ స్మిత జీవితం బాలీవుడ్లో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొంది ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్‌ను జాతీయ అవార్డు వరించింది. ఇక నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మలయాళంలో ఈమె సూపర్ నటి అని చెప్పక తప్పదు. షకీలా నటించిన శృంగార భరిత చిత్రాలకు విశేష ఆదరణ ఉండేది. బయ్యర్లు కొనడానికి పోటీ పడేవాళ్లు. ఇతర భాషల్లో అనువాద హక్కులకు మంచి డిమాండ్ ఉండేది. షకీలా చిత్రం విడుదలవుతుందంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మమ్ముట్టి చిత్రాల విడుదలను వాయిదా వేసుకునేవారు. ఒక వేళ పోటీగా, విడుదల చేసినా ఆ చిత్రాలకు కలెక్షన్లు ఉండేవి కావు. దీంతో అక్కడి నటులు కొందరు షకీలాపై కుట్రపన్ని కేరళ నుంచి బయటకు పంపించేశారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో నివశిస్తున్న షకీలా తమిళం, తెలుగు భాషల్లో హాస్యభూమికను పోషిస్తున్నారు. జీవిత చరిత్ర రాసుకున్నారు షకీలా తన జీవిత చరిత్రను రాసుకున్నారు. ఇందులో ఆమె వ్యక్తి గత విషయాలు, సినిమా సంగతులు, తానెదుర్కొన్న కిష్టపరిస్థితులు, సినిమా వ్యక్తులు తనను ఎలా వాడుకున్నారు? తదితర విషయాలను పరిపూర్ణంగా ఈ పుస్తకంలో రాసుకున్నారు. ఇంకా మార్కెట్లోకి విడుదల కాని షకీలా జీవిత చరిత్రపై ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఇలాంటి కథతో సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రం తెరకెక్కడానికి అంగీకరించరాదంటూ నటి షకీలాకు బెదిరింపులు కూడా మొదలయ్యాయట. అయినా ఇలాంటి వాటికి భయపడేది లేదంటున్నారట ఈ శృంగార తార. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో షకీలా పాత్రకు నటి అంజలి చక్కగా నప్పుతారని చిత్ర దర్శక నిర్మాతలు భావించడంతో ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. సిల్క్ స్మిత జీవిత కథలో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును అందుకోవడంతో నటి అంజలి కూడా షకీలా పాత్రలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. -
షకీలా ఆత్మకథ
దక్షిణాదిని ఉర్రూతలూగించిన శృంగారతార షకీలా చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. తన వ్యక్తిగత, వృత్తిపర వివరాలతో, విశేషాలతో ఆత్మకథ రాస్తోంది షకీలా. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న తీపి, చేదు అనుభవాలను చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఇందులో ఆమె ఆవిష్కరించబోతున్నారట. ఈ విషయం తెలియగానే కొంతమంది సినిమా వ్యక్తులు కలవరపాటుకి గురవుతున్నారట. ఆ ఆత్మకథలో తమ గురించి ఏమైనా నిజాలు చెబుతుందేమో అని ముందే భుజాలు తడుముకుంటున్నారట. ఈ ఆత్మకథ త్వరలోనే మార్కెట్లో విడుదల కానుందట.