అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్! | Bigg Boss 7 Telugu Day 12 Latest Promo: Shivaji And Shakila Are Disapointed With Bigg Boss Decision - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Promo: షకీలాకు అన్యాయం చేసిన 'బిగ్‌బాస్'!

Published Fri, Sep 15 2023 5:34 PM | Last Updated on Fri, Sep 15 2023 5:51 PM

Bigg Boss 7 Telugu Day 12 Promo Latest - Sakshi

'బిగ్‌బాస్' హౌస్ రోజురోజుకీ క్రేజీగా మారుతుంది. లేకపోతే ఏంటబ్బా.. ఈరోజు ఫ్రెండ్ గా ఉన్నోళ్లు రేపటికి శత్రువులు అయిపోతున్నారు. ఇప్పుడు ఒకే టీమ్ లో ఉన్నోళ్లు.. రోజు మారేసరికి ఒకరిని ఒకరు ఎలా పడగొట్టాలా అని స్కెచ్ లు వేసుకుంటున్నారు. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? 12వ రోజు ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

తొలివారం ఎంతో సరదాగా సాగిన బిగ్ బాస్.. రెండో వారంలోకి ఎంటరయ్యేసరికి చాలావరకు మారిపోయింది. ఎప్పుడు చూడు గొడవలే అవుతున్నాయి. మాట్లాడితే చాలు కంటెస్టెంట్స్.. ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. తాజాగా 12వ రోజు కూడా గౌతమ్-ప్రిన్స్ గొడవపడ్డారు. దీంతో ప్రిన్స్ ఏడ్చేశాడు. ఇక కన్ఫెషన్ రూంలోకి వెళ్లొచ్చిన తర్వాత రతికతో మాట్లాడుతూ కనిపించాడు. ఆమె కూడా ఇతడితో పులిహోర కలుపుతూ కనిపించింది.

(ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్‌)

అయితే రతిక-ప్రిన్స్ మధ్య ప్రేమలాంటిది పుట్టడం కాదు.. అదంతా ప్రశాంత్ ముందే జరగడం.. అయ్యో పాపం అనిపించేలా ఉంది. మరోవైపు పవర్ అస్త్ర కోసం గేమ్స్ గెలుచుకున్న మహాబలి గ్రూపులో షకీలా, శివాజీ అర్హులని అందరూ నిర్ణయించారు. అయితే సడన్ ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్.. సందీప్ ని మరో వ్యక్తిని కంటెండర్ గా సెలెక్ట్ చేసే అవకాశం కల్పించాడు.

దీంతో సంచాలకుడు సందీప్.. అమర్‌దీప్‌ని పవర్ అస్త్ర పోటీ కోసం ఎంచుకున్నాడు. దీంతో ఇప్పటికే పోటీలో ఉన్న షకీలా, శివాజీ అసహనం వ్యక్తం చేశారు. తాము ఇంట్లో నుంచి వెళ్లిపోతామని అరిచి కేకలు పెట్టడం మీరు తాజా ప్రోమోలో చూడొచ్చు. మరి పూర్తిగా ఏం జరిగిందనేది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement