షకీలాగా అంజలి? | anjali as shakila ? | Sakshi
Sakshi News home page

షకీలాగా అంజలి?

Published Wed, Feb 19 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

షకీలాగా అంజలి?

షకీలాగా అంజలి?

 సంచలన శృంగార తార షకీలా జీవిత చరిత్ర వెండితెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు నటి సిల్క్ స్మిత జీవితం బాలీవుడ్‌లో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొంది ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్‌ను జాతీయ అవార్డు వరించింది. ఇక నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మలయాళంలో ఈమె సూపర్ నటి అని చెప్పక తప్పదు. షకీలా నటించిన శృంగార భరిత చిత్రాలకు విశేష ఆదరణ ఉండేది. బయ్యర్లు కొనడానికి పోటీ పడేవాళ్లు. ఇతర భాషల్లో అనువాద హక్కులకు మంచి డిమాండ్ ఉండేది. షకీలా చిత్రం విడుదలవుతుందంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మమ్ముట్టి చిత్రాల విడుదలను వాయిదా వేసుకునేవారు. ఒక వేళ పోటీగా, విడుదల చేసినా ఆ చిత్రాలకు కలెక్షన్లు ఉండేవి కావు. దీంతో అక్కడి నటులు కొందరు షకీలాపై కుట్రపన్ని కేరళ నుంచి బయటకు పంపించేశారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో నివశిస్తున్న షకీలా తమిళం, తెలుగు భాషల్లో హాస్యభూమికను పోషిస్తున్నారు.
 
 జీవిత చరిత్ర రాసుకున్నారు
 షకీలా తన జీవిత చరిత్రను రాసుకున్నారు. ఇందులో ఆమె వ్యక్తి గత విషయాలు, సినిమా సంగతులు, తానెదుర్కొన్న కిష్టపరిస్థితులు, సినిమా వ్యక్తులు తనను ఎలా వాడుకున్నారు? తదితర విషయాలను పరిపూర్ణంగా ఈ పుస్తకంలో రాసుకున్నారు. ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాని షకీలా జీవిత చరిత్రపై ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఇలాంటి కథతో సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రం తెరకెక్కడానికి అంగీకరించరాదంటూ నటి షకీలాకు బెదిరింపులు కూడా మొదలయ్యాయట. అయినా ఇలాంటి వాటికి భయపడేది లేదంటున్నారట ఈ శృంగార తార. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో షకీలా పాత్రకు నటి అంజలి చక్కగా నప్పుతారని చిత్ర దర్శక నిర్మాతలు భావించడంతో ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. సిల్క్ స్మిత జీవిత కథలో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును అందుకోవడంతో నటి అంజలి కూడా షకీలా పాత్రలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement