సాక్షి, భీమవరం: భీమవరంలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురికాగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వన్‌టౌన్ సీఐ అడబాల శ్రీను మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు గన్‌బజార్‌కు చెందిన పటాన్ శంషేర్‌ఖాన్ కుమార్తె అఫీరాను భీమవరం 11వ వార్డుకు చెందిన షేక్ మహబూబ్‌జానీ కుమారుడు కరీముల్లాకిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు.
అప్పటినుంచి శంషేర్‌ఖాన్‌కు, అతని కుమార్తె అఫీరా మధ్య మాట్లల్లేవు. శంషేర్‌ఖాన్ రెండో భార్య షకీలా ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోవడంతో శంషేర్‌ఖాన్ అతని మొదటి భార్య కుమార్తె యాసీన్, అల్లుడు ముదిబీ, కొడుకు అప్రోజ్‌తో కలిసి సోమవారం అర్ధరాత్రి భీమవరంలోని షేక్ మహబూబ్‌జానీ ఇంటికి వెళ్లి షకీలా గురించి ఆరా తీశారు.
ఆమె తమ ఇంటికి రాలేదని చెబుతుండగానే శంషేర్‌ఖాన్ చాకుతో మహబూబ్‌జానీని పొడవగా అడ్డువచ్చిన అఫీరా, జానీ రెండో కుమారుడు రహీమ్‌లను తీవ్రంగా గాయపర్చాడు. దీంతో బాధితులు ముగ్గుర్ని భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా మహబూబ్‌జానీని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానీ మంగళవారం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అడబాల శ్రీను చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment