ద్రవిడ్ సహజసిద్ధ గురువు:పీటర్ సన్ | Pietersen salutes 'genuine guru' Dravid in autobiography | Sakshi
Sakshi News home page

ద్రవిడ్ సహజసిద్ధ గురువు:పీటర్ సన్

Published Sun, Oct 12 2014 6:26 PM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

ద్రవిడ్ సహజసిద్ధ గురువు:పీటర్ సన్

ద్రవిడ్ సహజసిద్ధ గురువు:పీటర్ సన్

లండన్: తన సహచర ఆటగాళ్లతో పాటు కోచ్ ఆండీ ఫ్లవర్‌పై ‘కేపీ: ది ఆటోబయోగ్ర ఫీ’ పుస్తకంలో విరుచుకుపడ్డ కెవిన్ పీటర్ సన్.. భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. పీటర్సన్ తన జీవిత చరిత్ర 'కేపీ' ను బహిర్గతంచేయడంతో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా భారతీయ క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను పీటర్ సన్ వేనోళ్ళ కొనియాడాడు. ద్రావిడ్ ఓ సహజసిద్ద గురువు అని, తనకెంతో సాయపడ్డాడని పేర్కొన్నాడు.
 
స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవడంపై ద్రావిడ్ అమూల్యమైన సలహాలు ఇచ్చాడని తెలిపాడు. స్పిన్‌ను ఎదుర్కొనడంలో ద్రావిడ్ మేటి అని కితాబిచ్చిన కేపీ, అతనిచ్చిన సూచనల ఫలితంగానే ఆటను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలిగానని చెప్పుకొచ్చాడు. తాము ఈ-మెయిళ్ళ ద్వారా సంభాషించుకునేవారమని తెలిపిన కేపీ, ఈ మేరకు ద్రావిడ్ మెయిల్‌ను కూడా తన పుస్తకంలో పొందుపరిచాడు.
 
కేపీ నువ్వు నిజంగా మంచి ఆటగాడివి. బంతిని సునిశితంగా పరిశీలించాలి, అదేసమయంలో నీపై నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. స్పిన్ ఆడలేవని నిన్ను వేలెత్తి చూపే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు. నువ్వు స్పిన్‌ను సమర్థంగా ఆడగలవు అని ఆ మెయిల్‌లో ద్రావిడ్ సలహా ఇచ్చినట్టు కేపీ తన జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement