లండన్: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు దారుణ ఓటమికి కెవిన్ పీటర్సన్‌ను మాత్రమే బలిపశువును చేశారని విండీస్ గ్రేట్ వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 0-5తో కోల్పోవడంతో పీటర్సన్‌పై అన్ని ఫార్మాట్ల నుంచి ఈసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ‘ఆ పర్యటనలో ఓటములకు పీటర్సన్ కూడా తీవ్రంగా నిరాశపడి ఉంటాడు.
కానీ ఓవరాల్‌గా అతడు జట్టుకు శాయశక్తులా సేవలందించాడు. ఇలాంటి వాటికి ఎవరో ఒకరిని బలి చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పీటర్సన్ బలయ్యాడనిపిస్తోంది’ అని రిచర్డ్స్ అన్నారు. అటు రిచర్డ్స్ వ్యాఖ్యలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫ్లింటాఫ్ సమర్థించాడు. ఒకవేళ పీటర్సన్ నడవడిక సరిగ్గా లేకపోతే ఆసీస్‌తో ఐదు టెస్టులు ఎలా ఆడాడని ఫ్లింటాఫ్ ప్రశ్నించాడు.
పీటర్సన్‌ను బలి చేశారు: రిచర్డ్స్
Published Fri, Mar 7 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement