Kevin Pietersen
-
అదంతా అబద్దం.. మాకంటూ ఓ విధానం ఉంది: మెకల్లమ్ ఫైర్
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క నెట్ సెషన్ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్‌లో బిజీగా ఉన్నాం.అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్‌లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మాకంటూ ఒక విధానం ఉందిఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్‌కు దూరంగా లేమని పేర్కొన్నాడు.కాగా టెస్టుల్లో ‘బజ్‌బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్?
క్రికెట్ మికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ మహాసంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా.. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అప్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఈ ఈవెంట్లో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కి వెళ్తే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. తొలుత మొండి పట్టుపట్టినప్పటికి ఐసీసీ డిమాండ్లకు పీసీబీ తలొగ్గింది.ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడునుంది. ఆ తర్వాత ఈ నెల 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా గాయం రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగలింది. బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో సెలక్టర్లు భర్తీ చేశారు. అదేవిధంగా ఆఖరి నిమిషంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఎంపిక చేశాడు. పేసర్ హర్షిత్ రాణా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌లను పీటర్సన్ పట్టించుకోలేదు. ఓపెనర్లగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లకు తన జట్టులో పీటర్సన్ చోటిచ్చాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లకు ఫస్ట్ డౌన్, సెకెండ్ డౌన్లో అతడు అవకాశమిచ్చాడు.మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పీటర్సన్ సెలక్ట్ చేశాడు. ఫినిషర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను పీటర్సన్ ఎంపిక చేశాడు. కాగా ఈ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో భారత క్లీన్ స్వీప్ చేసింది. ఇదే జోరును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీకి పీటర్సన్ ఎంపిక చేసిన భారత తుది జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం -
సెమీస్‌కు చేరే జట్లు ఇవే.. పప్పులో కాలేసిన ఇంగ్లండ్ దిగ్గజం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి కరాచీ (పాకిస్తాన్) వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే అన్ని జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఎలాగైనా ఛాంపియన్స్‌గా నిలవాలని ఆయా జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఈ మినీ వరల్డ్‌కప్ కోసం టీమ్స్ ఒక్కొక్కటిగా పాకిస్తాన్‌కు చేరుకుంటున్నాయి. పాకిస్తాన్ 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుండడం ఇదే మొదటి సారి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీమిండియా తమ మొత్తం మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడనుంది.కాగా ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో ఏయే టీమ్స్ సెమీస్ చేరుతాయి, విజేత ఎవరన్నది? మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేరాడు. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుతాయని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.అదేలా సాధ్యం కెవిన్?అయితే ఇక్కడే పీటర్సన్ పప్పులో కాలేశాడు. ఎందుకంటే కెవిన్ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం. ఈ మినీ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. అందులో గ్రూప్-ఎలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి పాయింట్ల పట్టికలో తొలి రెండు రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. కానీ ఈ ఇంగ్లండ్ దిగ్గజం మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయని అంచనావేశాడు.మ్యాథమెటికల్‌గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్‌కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు పీటర్సన్‌ను ట్రోలు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీకి టీమిండియా స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో బీసీసీఐ భర్తీ చేసింది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి:Champions Trophy 2025: ఫేక్ అక్రెడిటేషన్‌తో కరాచీ స్టేడియానికి.. భద్రతపై సందేహాలు -
ఇంగ్లండ్‌తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వస్తారా?
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్‌లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్‌తో మూడు ఇన్నింగ్స్‌లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్‌గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
వాళ్లిద్దరు మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు: కెవిన్ పీటర్సన్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) మద్దతు పలికాడు. వీరిద్దరు మరో రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారని అంచనా వేశాడు. ఇప్పటికే తామేంటో ‘విరాహిత్’ ద్వయం నిరూపించుకున్నారని.. కొత్తగా వాళ్లు చేయాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు గత కొన్నినెలలుగా రోహిత్-విరాట్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్లో రోహిత్, కోహ్లి విఫలమవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇక ఆటకు సెలవిచ్చి యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లూ వినిపించాయి. ఇక టీ20 రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రమే పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఇంగ్లండ్‌తో వన్డేలకు సిద్ధమయ్యారు.సొంతగడ్డపై జరగుతున్న ఈ సిరీస్ అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి బిజీ అవుతారు. ఈ మ్యాచ్‌లలో వీరి ఆట తీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు‘‘ఎవరి ముందు వీరు ఇంకా నిరూపించుకోవాల్సిందేమీ ఏమీలేదు. ఇద్దరూ దిగ్గజాలే. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నారు. వారి వయసు 36- 37. అయినా సరే.. మరో రెండేళ్ల పాటు టీమిండియా తరఫున కొనసాగ గల సత్తా వారికి ఉంది.ఇక కోహ్లి విషయానికొస్తే.. భారత్ తరఫున అత్యుత్తమ చేజింగ్ కింగ్ అతడే. అంతేకాదు.. ప్రపంచంలో అతడి లాంటి ఆటగాడు మరొకరు లేరు. చేజింగ్‌లో దేశానికి ఇన్ని విజయాలు సాధించి పెట్టినవారూ లేరు. అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే.. ఎవరూ ఆపలేరు.కోహ్లి- రోహిత్ ఆటను చూస్తే ముచ్చటేస్తుంది. రోహిత్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత అతడు ఎదిగిన తీరు అమోఘం’’ అని పీటర్సన్ కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకానుంది. కటక్ వేదికగా ఫిబ్రవరి 9న రెండో వన్డే, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 12న మూడో వన్డే జరుగుతుంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు టీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.భారత్‌తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడనున్న భారత్.. లీగ్ దశలో ఆఖరిగా మార్చి రెండున న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్‌కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా కేపీ..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్‌బజ్‌లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.🚨 BATTING COACH FOR INDIA. 🚨- The BCCI exploring possibilities to add a batting coach to India's coaching staff. (Cricbuzz). pic.twitter.com/mIRTwPDxOX— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 202544 ఏళ్ల కెవిన్ పీటర్సన్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 104 టెస్ట్‌లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.తన కెరీర్లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్‌ల్లో 141.5 స్ట్రయిక్‌రేట్‌తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.2009 నుంచి 2016 వరకు ఐపీఎల్ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్‌లు ఆడి 134.7 స్ట్రయిక్‌రేట్‌తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్ కెరీర్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.రిటైర్మెంట్ అనంతరం కేపీ వివిధ క్రికెట్ లీగ్‌ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.కాగా, ప్రస్తుతం భారత కోచింగ్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్ కోచ్ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో వరుసగా ఆరు పరాజయాలు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుటైనట్లే ఇక అనుకున్న సమయంలో అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్.వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో అడుగు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత. ఈ గండం దాటితే క్వాలిఫయర్-2 ఆడొచ్చు. అక్కడా గెలిస్తే ఏకంగా ఫైనల్లో.. ఇక టైటిల్‌కు ఒకే ఒక్క అడుగు దూరం..ఆర్సీబీ జోరు చూస్తే ఈసారి కప్పు మనదే అనిపిస్తోందంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం.. రాజస్తాన్ రాయల్స్‌ను ఆర్సీబీ ఎలిమినేట్ చేయడం ఖాయమంటూ జోస్యాలు చెప్పారు.అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజస్తాన్ అద్భుత ఆట తీరుతో ఆర్సీబీ ఆశలను గల్లంతు చేసింది. వరుసగా ఓటముల తర్వాత.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫలితంగా ఆర్సీబీ పదిహేడేళ్ల కల ఈసారికీ కలగానే మిగిలిపోయింది. అయితే, సీజన్ ఆసాంతం ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.దుమ్ములేపిన కోహ్లి.. కానీ ఏం లాభం?ఈ ఎడిషన్‌లో కోహ్లి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇప్పటికైనా ఆర్సీబీని వదిలేయాలని విజ్ఞప్తి చేశాడు.‘‘ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ అదే చెప్తున్నా. ఇతర క్రీడల్లోని దిగ్గజాలు సైతం ఒకానొక సమయంలో తమ సొంత జట్లను వదిలి వేరే చోటకు వెళ్లి టైటిల్స్ సాధించారు.ఆర్సీబీని వీడటమే ఉత్తమంఇప్పటికే కోహ్లి ఎంతగానో ప్రయత్నించాడు. మరోసారి ఆరెంజ్‌క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం ఎంతో చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. బ్రాండ్‌వాల్యూ పరంగా ఫ్రాంఛైజీతో కోహ్లి బంధం ఎలాంటిదో తెలుసు. అయినప్పటికీ.. ట్రోఫీ ముద్దాడేందుకు కోహ్లి నూటికి నూరుపాళ్లు అర్హుడు. కాబట్టి టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్‌లోకి అతడు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని ఆర్సీబీ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.ఢిల్లీకి ఆడాలివచ్చే ఏడాది కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోవాలని సూచించాడు. సొంతగడ్డకు చెందిన ఫ్రాంఛైజీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తే చూడాలని ఉందని.. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజాలు బెక్హాం, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తదితరులు ఫ్రాంఛైజీలు మారి విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే 2008 నుంచి కోహ్లి ఆర్సీబీతోనే ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 8 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ఇక హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్, ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. పీటర్సన్ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే! -
టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్, కోహ్లి ఆడుతారా? ఇంగ్లండ్ లెజెండ్ సమాధానమిదే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా అతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత వీరిద్దరూ టీమిండియా తరపున టీ20ల్లో కన్పించలేదు. వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కూడా వీరిద్దరూ తప్పుకున్నారు. దీంతో రోహిత్, కోహ్లి త్వరలోనే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విరాట్, రోహిత్ వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగితే బాగుంటుందని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరికి ఛాన్స్ ఉంది. వారిద్దరూ ఐపీఎల్లో ఎలా ఆడుతారో చూడాలి. ఐపీఎల్లో వారు ఆట తీరు చాలా ముఖ్యం. వారిద్దరూ చాలా కాలం నుంచి భారత జట్టుకు తమ సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి అందుకు తగ్గ గౌరవం ఇవ్వాలి. వాళ్ల ఫామ్ చూసి, వాళ్లకు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరూ కూడా అద్బుతమైన క్రికెటర్లే. ఐపీఎల్లో వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేస్తే కచ్చితంగా జట్టులో ఉండాలి. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్‌కు టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి మధ్య పెద్దగా గ్యాప్ ఉండదు. వేచి చూద్దం ఏమి జరుగుతుందో" అని పీటీఈకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్సన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2024: అతడొక ఫినిషర్.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు -
సురేశ్ రైనా మెరుపులు.. కెవిన్ పీటర్సన్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ సారథ్యం వహిస్తున్న ఇండియా క్యాపిటల్స్‌పై సురేశ్ రైనా నాయకత్వంలోని అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప తేడాతో (3 పరుగులు) విజయం సాధించింది. ఈ టోర్నీలో అర్భన్‌రైజర్స్ వరుసగా రెండో విజయం సాధించగా.. ఇండియా క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్భన్‌రైజర్స్.. గుర్కీరత్ సింగ్ (54 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్), పీటర్ ట్రెగో (20 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అర్భన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (3), మార్టిన్ గప్తిల్ (2), స్టువర్ట్ బిన్నీ (1)నిరాశపరిచారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2 వికెట్లు పడగొట్టగా.. రస్టీ థీరన్, మునాఫ్ పటేల్, కేపీ అప్పన్న తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్.. గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడి, స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (48 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆష్లే నర్స్ (25 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రికార్డో పావెల్ (26) పర్వాలేదనిపించగా.. గౌతమ్ గంభీర్ (0), హషీమ్ ఆమ్లా (5), బెన్ డంక్ (5) విఫలమయ్యారు. అర్భన్‌రైజర్స్ బౌలర్లలో క్రిస్ మోఫు 2 వికెట్లు పడగొట్టగా.. పీటర్ ట్రెగో, టీనో బెస్ట్, పవన్ సుయల్ తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 24) మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. -
వరల్డ్‌కప్‌లో ఆ జట్టుతో జాగ్రత్త.. టీమిండియా కూడా ఫేవరేట్: పీటర్సన్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-3 తేడాతో దక్షిణాఫ్రికా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ప్రోటీస్ ఓటమి పాలైనప్పటికీ.. ఆఖరి మూడు వన్డేల్లో మాత్రం దుమ్ము రేపింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్ రేసులో దక్షిణాఫ్రికా కచ్చితంగా ఉంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఆసీస్‌తో నాలుగో వన్డేల్లో మెరుపు సెంచరీ సాధించిన హెన్రిస్ క్లాసెన్‌ను కూడా పీటర్సన్ పొగడ్తలతో ముంచెత్తాడు. "ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా అద్బుతమైన సిరీస్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌గా ప్రోటీస్ జట్టు మారిపోయింది. క్లాసెన్ వారికి ప్రధాన ఆస్తి. అతడు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగలడు. అయితే ఆసియాకప్‌ను కైసవం చేసుకున్న భారత జట్టు కూడా టైటిల్ బరిలో ఉంటుంది. అదే విధంగా వారి స్వదేశంలో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి కూడా మిగితా జట్లకు ముప్పు పొంచి ఉంది. ఫేవరెట్ ట్యాగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్ తర్వాతే ఉంటాయని" ట్విటర్(ఎక్స్)లో పీటర్సన్ పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఆక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు South Africa become contenders for the CWC after their win against Aus. Klaasen is the major asset. India favourites at home with Asia Cup win. Pakistan is always a threat. ALWAYS! England sitting just under India, in terms of favourites tag. And Australia, well they’ll be… — Kevin Pietersen🦏 (@KP24) September 18, 2023 -
బౌలింగ్‌లోనూ 'కింగే'.. చెక్కుచెదరని బౌలింగ్ రికార్డు విరాట్ సొంతం
ప్రపంచ క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా, రికార్డుల రారాజుగా కీర్తించబడే రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.. బౌలింగ్ విభాగంలోనూ తనదైన రికార్డు మార్కు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (2023 ఆగస్ట్ 18) ఈ ఆసక్తికర రికార్డు వివరాలు మీ కోసం. బాల్ వేయకుండానే వికెట్ తీసుకున్న ఏకైక క్రికెటర్‌గా.. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో తొలిసారి బంతి పట్టిన విరాట్.. బంతి వేయకుండానే తన ఖాతాలోకి వికెట్‌ను జమ చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇది ఓ రికార్డే. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. హేమాహేమీలైన బౌలర్లకు కూడా ఇది సాధ్యపడలేదు. బంతి వేయకుండానే వికెట్ ఎలా..? ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ బ్యాటింగ్ చేస్తుండగా.. నాటి కెప్టెన్ ఎంఎస్ ధోని బంతి విరాట్‌కు ఇచ్చాడు. విరాట్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి బంతినే వైడ్ బాల్‌గా వేయగా.. అది కూడా అతనికి కలిసొచ్చింది. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని ధోని అద్భుతంగా అందుకుని, షాట్ ఆడే క్రమంలో క్రీజ్ దాటిన పీటర్సన్‌ను స్టంపౌట్ చేశాడు. ఇలా బంతి కౌంట్లోకి రాకుండానే ఓ పరుగు ఇచ్చి ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు విరాట్. ఇదిలా ఉంటే, 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కాలక్రమంలో కోహ్లి ఏరకంగా రాటుదేలాడో.. ఎన్ని పరుగులు, రికార్డులు,సెంచరీలు చేశాడో విశ్వం మొత్తం చూసింది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోహ్లి! అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్
IPL 2023- RCB- Virat Kohli: ఒక్క టైటిల్.. ఒకే ఒక్క ట్రోఫీ.. అంటూ ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు గత పదిహేనేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ ప్రతి ఎడిషన్ ఆరంభం నుంచే ‘‘ఈసారి కప్ మనదే’’ అంటూ సందడి చేసే ఫ్యాన్స్‌కు ఎప్పటిలాగే ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఆర్సీబీ ఐపీఎల్-2023 ప్రయాణం ముగిసిపోయింది. ముఖ్యంగా ఈసారి విరాట్ కోహ్లి వింటేజ్ కింగ్‌ను గుర్తు చేస్తూ వరుస సెంచరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాళ్లపైనే ఆధారపడి ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన అజేయ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. ‘కేజీఎఫ్’(కోహ్లి, గ్లెన్, ఫాఫ్) రూపంలో తమకు లభించిన ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే ప్రతిసారీ ఆధారపడటం.. బౌలింగ్‌లోనూ సిరాజ్ మినహా మిగతా వాళ్లు మరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కోహ్లికి ఆర్సీబీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతున్న కింగ్.. నేటికీ బంధం కొనసాగిస్తున్నాడు. కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. ఆర్సీబీ ముఖచిత్రంగా మారాడు. బ్యాటర్‌గా తనపై భారం పడితే జట్టుకు నష్టం చేకూరుతుందేమోనన్న ఆలోచనతో గతేడాది సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఆ ఒక్క లోటు అయితే, క్యాష్ రిచ్ లీగ్‌లో ఎన్ని రికార్డులు సాధించినా.. శతకాల వీరుడిగా పేరొందినా.. ఒక్కసారి కూడా ఆర్సీబీ చాంపియన్‌గా నిలవలేదన్న లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. తాజా సీజన్లోనూ అదే పునరావృతమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోహ్లిని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీకి మారాల్సిన సమయం వచ్చేసింది! గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓటమి అనంతరం.. ‘‘ విరాట్ రాజధాని నగరానికి మారాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోహ్లి స్వస్థలం ఢిల్లీకి చెందిన జట్టుకు ఆడాల్సిందిగా పరోక్షంగా సూచన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారితేనైనా రాత మారుతుందేమోనని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అయితే, ఢిల్లీ అభిమానులకు పీటర్సన్ ట్వీట్ విపరీతంగా నచ్చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘అసలేం మాట్లాడుతున్నావు. కోహ్లి లేని ఆర్సీబీని ఊహించను కూడా ఊహించలేం. పోయి పోయి ఢిల్లీకి మారాలా? నీ ట్వీట్‌కు అర్థం ఏమిటి? ఐపీఎల్ ఆడటం మానేసినపుడే కోహ్లి ఆర్సీబీని వీడతాడు. లేదంటే తనకిష్టమైన ధోని సారథ్యంలోని సీఎస్కేకు ఆడతాడు. అంతేగానీ.. నీ చెత్త సలహాలు ఎవరికీ అవసరం లేదు’’ అంటూ పీటర్సన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా.. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్‌బేస్ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రధాన కారణంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2023లో కోహ్లి మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో కలిపి 639 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది. చదవండి: ముంబై కోసమే గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. సచిన్ ట్వీట్ వైరల్ #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి.. Time for VIRAT to make the move to the capital city…! #IPL — Kevin Pietersen🦏 (@KP24) May 22, 2023 -
'అంతా అబద్దం.. నేను ధోని తొలి వికెట్‌ను కాదు'
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కొద్దిరోజులుగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ట్విటర్లో ట్వీట్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇదంతా కేవలం సరదా కోసం మాత్రమే. ధోనీ తీసిన తొలి టెస్ట్ వికెట్ తనది కాదని ఈసారి వీడియో సాక్ష్యాన్ని కూడా బయటపెట్టాడు. నిజానికి ఈ ఇద్దరి మధ్య 2017 ఐపీఎల్ సందర్భంగా తొలిసారి సరదా ఫైట్ జరిగింది. అప్పుడు ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ టీమ్ తరఫున ఆడుతున్నాడు. ఆ సమయంలో మైక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న మనోజ్ తివారీతో.. ధోనీ కంటే నేను మంచి గోల్ఫర్ ని అని పీటర్సన్ అన్నాడు. దీనికి ధోనీ రిప్లై ఇస్తూ.. నువ్వే నా తొలి టెస్ట్ వికెట్ అని అదే మైక్ ద్వారా కేపీకి సమాధానమిచ్చాడు. కానీ ఆ రోజు డీఆర్ఎస్ తో నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకున్నట్లు పీటర్సన్ గుర్తు చేశాడు. ఇక తాజాగా మంగళవారం (మే 16) వీడియో సాక్ష్యంతో మరో ట్వీట్ చేశాడు. 2011లో ఇంగ్లండ్‌లో పర్యటించింది టీమిండియా. ఆ టూర్లో ఒక మ్యాచ్‌లో ధోనీ బౌలింగ్ చేశాడు. ధోని వేసిన బంతి పీటర్సన్‌ను దాటుకొని వికెట్ కీపర్ ద్రవిడ్ చేతుల్లో పడింది. అందరూ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. కానీ పీటర్సన్ వెంటనే రివ్యూ చేయడంతో అసలు బంతి.. బ్యాట్ కు తగల్లేదని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ వీడియోనే పీటర్సన్ షేర్ చేస్తూ.. "స్పష్టమైన సాక్ష్యం ఉంది. అదంతా ఫేక్.. నేను ధోనీ తొలి వికెట్ కాదు. కానీ ధోని నుంచి మాత్రం అది మంచి బంతి" అని క్యాప్షన్ పెట్టాడు పీటర్సన్. అంతటితో ఆగకుండా బుధవారం (మే 17) మరో ట్వీట్ చేశాడు. నిజానికి తానే ధోనీ వికెట్ తీశానంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్ 2007లో ఓవల్ లో జరిగింది. అప్పటికే 92 పరుగులు చేసి సెంచరీపై కన్నేసిన ధోనీని పీటర్సన్ ఔట్ చేశాడు. అయితే ఇలా రెండు రోజులుగా పీటర్సన్ తనను ట్రోల్ చేస్తున్నా ధోనీ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సమాధానం లేదు. The evidence is CLEAR! I was NOT Dhoni’s first Test wicket. Nice ball though, MS! 😂😂😂 Thanks for sending this through, @SkyCricket 🙏🏽 pic.twitter.com/XFxJOZG4me — Kevin Pietersen🦏 (@KP24) May 16, 2023 MS Dhoni c Cook b Pietersen pic.twitter.com/UdtXJH37xM — Kevin Pietersen🦏 (@KP24) May 17, 2023 చదవండి: హైదరాబాద్ బిర్యానీ మస్తుంది.. ఎస్ఆర్హెచ్ పని పడతం' -
ధోనికి సీఎస్కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు ఉద్వేగానికి లోనయ్యేవాడు!
MS Dhoni- CSK: టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి చెన్నై అన్నా.. అక్కడి మనుషులన్నా మహా ఇష్టమని.. నగరంతో అతడి అనుబంధం విడదీయలేనిదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైనా మిస్టర్ కూల్‌కు అమితమైన ప్రేమ ఉందని పేర్కొన్నాడు. అదే విధంగా ధోని పట్ల కూడా చెన్నై ప్రజలకు ఉన్న ప్రేమ వెలకట్టలేదని.. చెపాక్‌లో ఆదివారం నాటి దృశ్యాలే ఇందుకు నిదర్శనమని పీటర్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 లీగ్ దశలో సీఎస్కే ఆదివారం తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో.. మైదానంలో చోటుచేసుకున్న దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. అరుదైన దృశ్యాలు కేకేఆర్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి తర్వాత ధోని ముందుండి నడుస్తుండగా సీఎస్కే బృందం అతడిని అనుసరించింది. ఈ సందర్భంగా ధోని తాను సంతకం చేసిన టెన్నిస్ బంతులను స్టాండ్స్‌లోకి విసరగా.. వాటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే ఏకంగా తన షర్టు మీద ఆటోగ్రాఫ్ తీసుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పీటర్సన్ మాట్లాడుతూ ధోనితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ‘‘ధోని ఆటగాళ్లందరికీ స్ఫూర్తిదాయకం. అతడి కోసమైనా మనమంతా జట్టుగా బాగా ఆడాలి అనే ఫీలింగ్ వస్తుంది. అతడి కెప్టెన్సీ అలా ఉంటుంది మరి! గత కొన్నేళ్లుగా మిస్టర్ కూల్‌ను చూస్తూనే ఉన్నాం. జట్టు పట్ల, ఆటగాళ్ల పట్ల అతడు పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ప్లేయర్లంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు’’ అని పీటర్సన్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోని ఉద్వేగానికి లోనయ్యేవాడు ఇక రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు ఆడే సమయంలో ధోనిని దగ్గరగా గమనించానన్న పీటర్సన్.. ధోనికి సీఎస్కే అంటే ఎంతో ఇష్టమని, ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అతడు భావోద్వేగానికి లోనయ్యేవాడని గుర్తు చేసుకున్నాడు. కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగా కూడా ధోని ఒక అద్భుతం అంటూ కొనియాడాడు. ‘‘ధోని చూసేందుకు జనాలు ఎలా ఎగబడుతున్నారో చూడండి. తనని తాకేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఓ క్రికెటర్‌గానే కాదు మనిషిగానూ అతడిది అసాధారణ వ్యక్తిత్వం. ఈ అద్భుత దృశ్యాలు ఇందుకు నిదర్శనం. భావోద్వేగ క్షణాలు. చూడటానికి ఎంతో బాగుంది’’ అని పీటర్సన్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఎస్కేపై నిషేధం విధించగా.. 2016, 2017 సీజన్లలో ధోని పుణె ఫ్రాంఛైజీకి మారిన ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో పీటర్సన్ ధోనితో కలిసి ఆడాడు. చదవండి: ‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు! 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
'కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పరమ బోర్ కొట్టించింది'
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతులెదుర్కొని 39 పరుగులు చేశాడు. టి20 క్రికెట్లో అటాకింగ్ గేమ్ ఆడాల్సింది పోయి వన్డే తరహాలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ కేవలం నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టి ఔటయ్యాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో రాహుల్ ఆటతీరు ఇలాగే కొనసాగుతుంది. ఇక రాజస్తాన్, లక్నో మ్యాచ్‌కు కెవిన్ పీటర్సన్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. లైవ్ కామెంటరీలో పీటర్సన్ మాట్లాడుతూ.. ''కేఎల్ రాహుల్ బ్యాటింగ్ నాకు ఇంతకముందు ఎన్నడూ లేనట్లుగా పరమ బోరింగ్‌గా అనిపించింది.'' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ''పీటర్సన్ అన్న మాటలు అక్షరాల నిజం.. కేఎల్ రాహుల్ టి20ల్లో వన్డే, టెస్టు బ్యాటింగ్‌ను తలపిస్తున్నాడు''..'' నిజమేగా.. రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్నాడు.'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: బులెట్ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్ బ్రో! Oh man.. Kevin Pietersen said this in live commentary "Watching KL Rahul bat in the powerplay is the most boring thing I've ever done." pic.twitter.com/y8m4g2ZNT4 — Vishal. (@SPORTYVISHAL) April 19, 2023 -
ప్రధాని మోదీని కలిసిన కెవిన్ పీటర్సన్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. కాగా పీటర్సన్ ఢిల్లీలో నిర్వహించిన రైసీనా డైలాగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మొదట హోంమంత్రి అమిత్ షాతో పీటర్సన్ మాటామంతీ చేశాడు. అనంతరం ప్రధాని మోదీని కలిసిన పీటర్సన్.. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగిన విషయమన్నాడు. మోదీని కలవడాన్ని గొప్పగా భావిస్తున్నట్లు చెబుతూ పీటర్సన్ పోస్టు పెట్టారు. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి. భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది. చదవండి: IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ An honor to speak so passionately and warmly about the release of cheetahs on your birthday, Sir @narendramodi. Thank you for your infectious smile and firm handshake. I really look forward to seeing you again, Sir! 🙏🏽 pic.twitter.com/9gEe3e1wwV — Kevin Pietersen🦏 (@KP24) March 3, 2023 Met @KP24, former captain of the England cricket team. Had an engaging conversation with him on a wide range of topics. pic.twitter.com/gZzwJEWwrw — Amit Shah (@AmitShah) March 2, 2023 -
వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు!
Ben Stokes ODI Retirement- Eng Vs SA ODI Series: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, వన్డే వరల్డ్‌కప్-2019లో తమ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్‌స్టోక్స్. ఇటీవలే అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టి స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలవడంతో పాటు రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాను ఓడించి కెప్టెన్‌గా మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. అందుకే ఇలా! అయితే, అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెబుతూ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు 31 ఏళ్ల స్టోక్స్. అంతేకాదు.. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్ పోస్తే పరిగెత్తే కార్లు కాదని.. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లండ్ బోర్డుకు చురకలంటించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ, క్రికెట్ బోర్డుల తీరును తప్పుబడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘అప్పట్లో ఓసారి.. షెడ్యూల్ భయంకరంగా ఉంది.. నా వల్ల కాదని చెప్పాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. అయితే, ఈసీబీ నన్ను టీ20లు కూడా ఆడకుండా నిషేధం విధించింది’’ అంటూ పీటర్సన్ ఇంగ్లండ్ బోర్డు తీరును ఎండగట్టాడు. I once said the schedule was horrendous and I couldn’t cope, so I retired from ODI cricket & the ECB banned me from T20s too………….🤣 — Kevin Pietersen🦏 (@KP24) July 19, 2022 కాగా ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు పీటర్సన్. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 8181, 4440, 1176 పరుగులు సాధించాడు. అయితే, ఈసీబీతో అతడికి విభేదాలు తలెత్తగా బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన పీటర్సన్ ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 2013లో తన ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్.. 2014లో చివరిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టోక్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మంగళవారం(జూలై 18 )జరిగిన మొదటి వన్డే అతడికి చివరిది. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 5 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన రోజు వ్యవధిలోనే ఇంగ్లండ్ ప్రొటిస్‌తో పోరుకు సిద్ధమైంది. వన్డేలతో పాటు టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. 604 runs and 15 wickets on a sweltering day in Durham! Full highlights: https://t.co/AOpGzaJerX 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/VDjYwdNb0L — England Cricket (@englandcricket) July 20, 2022 -
'స్విచ్‌హిట్ బ్యాన్ చేస్తే ఎక్కువగా సంతోషించేది నేనే'
క్రికెట్లో కవర్‌డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్, స్క్వేర్డ్రైవ్, కట్‌షాట్, స్వీప్ షాట్, రివర్స్ స్వీప్, హుక్ షాట్.. ఇవన్నీ సంప్రదాయంగా వస్తున్నవి. ఇంకా చెప్పాలంటే క్రికెట్లో ఎక్కువ మంది బ్యాటర్స్ ఆడే షాట్లు. వీటితో పాటు ఇంకా ఎన్నో కళాత్మక షాట్లు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో హెలికాప్టర్, స్విచ్‌హిట్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని హెలికాప్టర్ షాట్ కనిపెడితే.. స్విచ్ హిట్ షాట్‌కు మాత్రం పెట్టింది పేరు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్. సంప్రదాయ క్రికెట్లో స్విచ్‌హిట్ అనేది కాస్త వినూత్నమైనది.. బౌలర్ బంతి విడుదల చేయగానే బ్యాటర్ తన పొజీషన్‌ను రివర్స్ చేసి ఆడడమే స్విచ్‌హిట్. 2006లో కెవిన్ పీటర్సన్.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌పై స్విచ్‌హిట్ షాట్‌ను ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు ఎక్కువ సందర్బాల్లో స్విచ్ హిట్ షాట్లు ఆడారు. అయితే స్విచ్‌హిట్ షాట్‌పై ఐసీసీకి పలుసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. స్విచ్‌హిట్ షాట్ ఆడే సమయంలో పొజీషన్‌ను మార్చి.. ఆ షాట్ ఆడడం మిస్ అయితే ఎల్బీడబ్ల్యూ ఇచ్చే అవకాశం ఎందుకు లేదని కొందరు బౌలర్లు ప్రశ్నించారు. ఇటీవలే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్విచ్‌హిట్ షాట్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''బ్యాట్స్‌మెన్ స్విచ్‌హిట్ ఆడడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ స్విచ్‌హిట్ ఆడే సమయంలో బంతి మిస్ అయితే మాత్రం ఎల్బీగా ఇవ్వాల్సిందే. ఎల్బీ ఎందుకు ఇవ్వకూడదనేది నాకు చెప్పాలి. ఒక బ్యాటర్ బంతి వేయగానే పొజిషన్‌ను మార్చినప్పుడే బంతి వికెట్ల మీదకు వెళ్తుంది. కాబట్టి కచ్చితంగా ఎల్బీడబ్ల్యూకి ఆస్కారం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్విన్ చేసిన వ్యాఖ్యలను న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ సమర్థిస్తూనే తప్పులను ఎత్తిచూపాడు. '' అశ్విన్ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని సమర్థిస్తున్నా.. అదే సమయంలో కొన్నింటిని తప్పుబడతా. స్విచ్ హిట్ అనేది ఫన్నీగా కనిపిస్తున్నప్పటికి బౌలర్‌కు ఎప్పటికి ప్రమాదకరం. అందుకే స్విచ్హిట్ను పూర్తిగా బ్యాన్ చేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే. బ్యాట్స్‌మన్ తర్వాతి బంతిని స్విచ్ హిట్ ఆడుతాడని ఎవరూ ముందుగా ఊహించరు. క్రికెట్లో మిగతా షాట్స్ అంటే ఎలా కొట్టినా ఆన్‌సైడ్, ఆఫ్‌సైడ్‌లో ఎక్కువగా వెళ్తాయి. కాబట్టి ఫీల్డర్లను ముందుగానే సెట్ చేసుకోవచ్చు. కానీ స్విచ్‌హిట్ విషయంలో ఆ క్లారిటీ లేదు. బౌలింగ్ సైడ్ కెప్టెన్ లేదా బౌలర్ ఫీల్డర్స్‌ను ఎక్కడ ఉంచాలనేది తెలియదు. అందుకే బ్యాటర్స్, బౌలర్స్‌కు ఉపయోగంగా ఉండాలంటే స్విచ్హిట్ను బ్యాన్ చేయాల్సిందే. స్విచ్‌హిట్ లానే కనిపించే రివర్స్ స్వీప్.. రివర్స్ హిట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి వీటిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే స్విచ్‌హిట్ ఆడే క్రమంలో బ్యాటర్ తన పొజీషన్‌ను పూర్తిగా మర్చేయడం.. అదే సమయంలో ఆ షాట్ మిస్ అయితే కచ్చితంగా ప్యాడ్లకు తాకుతుంది. ఇక్కడే అశ్విన్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని వాదించాడు. కానీ స్విచ్హిట్ను పూర్తిగా బ్యాన్‌చేస్తే ఆ ఇబ్బందే ఉండదు కదా'' అంటూ ముగించాడు. -
IPL 2022: పంత్‌పై మాజీ క్రికెటర్ల విమర్శలు.. క్రీడాస్ఫూర్తిని మరిచావు!
IPL 2022 DC Vs RR No Ball Controversy: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో రాజుకున్న నో- బాల్ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్ పంత్, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకపోతే మంచిది. ఆటను సాగనివ్వాలి. అంపైర్లు కొన్నిసార్లు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు సమంజసం’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి, ఐపీఎల్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ పంత్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించాడు. ‘‘ఇది క్రికెట్.. ఫుట్‌బాల్ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘పంత్ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్ పంత్’’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్లో నాలుగో పరాజయం నమోదు చేసింది. చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్ Bad sportsman spirit on display by #DelhiCapitals Cricket is a game of gentlemen and this behaviour is completely unacceptable. #IPL20222 #DCvsRR — Mohammed Azharuddin (@azharflicks) April 22, 2022 Didn’t expect Pant could do that. Not cricket. #IPL20222 pic.twitter.com/ab5yRzDQqg — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 What is Pant thinking ? It’s a street game , calling his team back . pic.twitter.com/WDEZvpRnay — SKS (@TweetSailendra) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి కాదు.. ఇప్పుడు డుప్లెసిస్ స్టార్ అయ్యాడు! అతడు మాత్రం ఇంకా!
IPL 2022- Virat Kohli- RCB: టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లి ఐపీఎల్-2022లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. గత సీజన్‌తో ఆర్సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇకపై బ్యాటర్‌గా జట్టుకు సేవలు అందిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారథ్య బాధ్యతల భారం తొలగిపోతే కోహ్లి బ్యాట్ ఝులిపించడం ఖాయమని, మునుపటి రన్‌మెషీన్‌ను చూడవచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ అలా జరగడం లేదు. ఐపీఎల్ తాజా సీజన్లో ఒకటీ రెండు మినహా మిగతా మ్యాచ్‌లలో కోహ్లి చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఇక ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కోహ్లి చేసిన పరుగులు 119. అత్యధిక స్కోరు 48. ఈ గణాంకాలను బట్టి కోహ్లి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెవిన్ పీటర్సన్ ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పుడు కెప్టెన్ కాదని, సాధారణ ఆటగాడిననే విషయాన్ని కోహ్లి త్వరగా గ్రహించాలని సూచించాడు. ఈ మేరకు.. ‘‘షో ఏదైనా తానే స్టార్‌గా ఉండాలని విరాట్ కోహ్లి కోరుకుంటాడు. అయితే, ఇప్పుడు ఫాఫ్ డుప్లెసిస్ స్టార్ అయ్యాడు. నావను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఫాఫ్‌నకు హోటల్లో విలాసవంతమైన గది కేటాయించారో లేదో తెలియదు కానీ.. కోహ్లికి మాత్రం ఫాఫ్ కంటే పెద్ద గదినే ఇస్తారు. నిజానికి ఓ కెప్టెన్ మళ్లీ సాధారణ ఆటగాడిగా మారాలంటే కాస్త కష్టమే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నీ పాత్ర ఉండకపోవచ్చు. మునుపటిలా ఆధిపత్యం ప్రదర్శించే వీలు ఉండకపోవచ్చు. కెప్టెన్‌గా ఉన్నపుడు అభిమానులు, సహచర ఆటగాళ్లు నిన్ను చూసే విధానం వేరుగా ఉంటుంది. అయితే, ఓ సోల్జర్(ఆటగాడి)గా నువ్వు మళ్లీ జట్టులో ఇమిడిపోతావా లేదా అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి అలా ఉండటం మనసుకు కష్టం’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు. కోహ్లి ఇంకా పూర్తిగా ఫామ్‌లోకి రాలేదని, అందుకు ఇంకాస్త సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక నెట్స్‌లో కోహ్లి వార్మప్ చేయడం చూశానన్న పీటర్సన్.. ‘‘తన పనేదో తాను చేసుకుంటున్నాడు. ఒక నవ్వు లేదు. హెలో చెప్పడాలు లేవు. ఎవరితోనూ పెద్దగా కలిసేది లేదు.. ప్రతిసారి.. ‘‘నేను ఆటపై దృష్టి పెట్టాను. సాధించి తీరాల్సిందే’’ అన్నట్లుగా సీరియస్‌గా ఉంటున్నాడు’’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లి ఒత్తిడిలో కూరుకుపోయాడని, దానిని అధిగమిస్తేనే మునుపటిలా బ్యాట్ ఝులిపించగలడన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో పీటర్సన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇక ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణిస్తూ అభిమానులు ప్రశంసలు అందుకుంటున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్(96 పరుగులు) ఆడి అతడు ఆర్సీబీని గెలిపించిన సంగతి తెలిసిందే. తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానాని(10 పాయింట్లు)కి చేరుకుంది. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! That's that from Match 31.@RCBTweets win by 18 runs against #LSG. Scorecard - https://t.co/9Dwu1D2Lxc #LSGvRCB #TATAIPL pic.twitter.com/oSxJ4fAukI — IndianPremierLeague (@IPL) April 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్‌కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ పాన్‌కార్డును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్‌స్పోర్ట్ బ్రాడ్‌కాస్టర్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఐపీఎల్ మెగావేలం కవర్ చేయడానికి భారత్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఆల్‌రౌండర్ పాన్‌కార్డు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. చదవండి: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య ''నా పాన్‌కార్డ్ ఎక్కడో పోయింది. ప్లీజ్ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్‌కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్‌కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా పీటర్సన్ ట్వీట్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్ కెవిన్ పీటర్సన్.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి పాన్‌కార్డు రీ ప్రింట్కోసం ప్రయత్నించండి. ఒకవేళ పాన్‌కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్‌కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. ⚠️INDIA PLEASE HELP⚠️ I’ve misplaced my PAN card & travelling Mon to India but need the physical card for work. Can some PLEASE PLEASE direct me to someone who I can contact asap to help me? 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) February 15, 2022 Dear @KP24, We are here to help you. If you have your PAN details with you, please visit these links for the procedure to apply for reprint of physical PAN Card: (1/2)https://t.co/M2RFFlDsCThttps://t.co/fySMs6nm62 — Income Tax India (@IncomeTaxIndia) February 15, 2022 -
చెలరేగిన అండర్సన్.. 8 సిక్స్‌లు, 7 ఫోర్లు.. ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తొలి ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఒమెన్ వేదికగా ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగులు తేడాతో విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్ విజయంలో కేవిన్ పీటర్సన్, కోరీ ఆండర్సన్ కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా వరల్డ్ జెయింట్స్ బ్యాటర్ కోరీ అండర్సన్ విద్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. అండర్సన్‌తో పాటు పీటర్సన్(48), బ్రాడ్ హాడిన్(37),సామీ(38) పరుగులతో రాణించారు. ఇక 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్ 8 వికెట్లు కోల్పోయి 231 పరుగులకే పరిమితమైంది. ఆసియా లయన్స్ బ్యాటర్లలో సనత్ జయసూర్య(38), మహ్మద్ యూసుఫ్(39), దిల్షాన్(25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో ఆల్బీ మోర్కెల్ మూడు వికెట్ల పడగొట్టగా, మాంటీ పనేసర్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Under 19 World Cup: రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్ -
టి20 ప్రపంచకప్ 2021: విజేత ఎవరో చెప్పిన పీటర్సన్
Kevin Pieterson Predicts Winner Of T20 World Cup 2021: టి20 ప్రపంచకప్ 2021 విజేతపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుందని.. కచ్చితంగా కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయమై పీటర్సన్ తన బ్లాగ్‌లో ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే ''న్యూజిలాండ్ ప్రస్తుతం అన్ని విభాగాల్లో(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) బలంగా కనిపిస్తోంది. కానీ ఆస్ట్రేలియానే నా ఫెవరెట్. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు ఫైనల్లో ఎదురుపడినప్పుడు ఆస్ట్రేలియా దుమ్మురేపిందని చరిత్ర చెబుతుంది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జరిగింది ఇదే. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరితే బలంగా తయారవుతోంది.. అది ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిగా మారుతోంది. ఈ ఆదివారం ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌ను ఎత్తడం ఖాయం. ఇక డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉండడం న్యూజిలాండ్‌కు ప్రమాదం. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున తీవ్రంగా నిరాశపరిచిన వార్నర్ అక్కడ మరిచిపోయిన ఫామ్‌ను..కోపాన్ని ఈ టి20 ప్రపంచకప్‌లో చూపిస్తున్నాడు. అతనికి తోడూ గత మ్యాచ్‌లో వేడ్, స్టోయినిస్‌లు అద్భుతం చేసి చూపించారు.ఆస్ట్రలియా జట్టు పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఏలారు. తాజాగా టి20 ప్రపంచకప్‌ను గెలిస్తే ఇకపై టి20ల్లోనూ తమ బలాన్ని చూపించే అవకాశం ఉంది'' అంటూ తెలిపాడు. చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్‌వన్ కాకపోవచ్చు -
ఆ జట్లే మమ్మల్ని ఓడించగలవు.. హా.. మరి మేము బూర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాం!
Wasim Jaffer Funny Troll On Kevin Pietersen After NZ Beats Eng: ‘‘కేవలం పాకిస్తాన్.. లేదంటే అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించగలవు’’... టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగానే.. ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఇది. గ్రూపు-1లో టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు... గ్రూపు-2లోని పాకిస్తాన్.. లేదంటే అఫ్గనిస్తాన్‌కు సెమీస్‌లో తమతో తలపడే అవకాశం ఉందని అతడు భావించాడు. కానీ.. పీటర్సన్ అంచనా తప్పింది. అనూహ్యంగా అద్భుత విజయాలు సాధించి.. గ్రూపు-2లో రెండోస్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకువచ్చింది న్యూజిలాండ్. అంతేకాదు వరుస విజయాలతో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సెమీ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో మోర్గాన్ బృందాన్ని ఓడించి.. సగర్వంగా తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది. డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... కెవిన్ పీటర్సన్‌ను అదిరిపోయే మీమ్‌తో ట్రోల్ చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వుతూ ఉన్నట్లుగా ఉన్న ఫొటోపై.. ‘‘హా.. మేము ఇక్కడికి కేవలం బూర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాము మరి’’ అని రాసింది. పీటర్సన్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వసీం జాఫర్ ఈ మేరకు మీమ్‌తో సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. వసీం జాఫర్ హాస్య చతురత నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి మరి! చదవండి: James Neesham: సెలబ్రేట్ చేసుకోని జిమ్మీ నీషమ్.... ఫొటో వైరల్.. పని పూర్తైందా? ఇంకా లేదేమో! #EngvNZ #T20WorldCup https://t.co/05Z143LKil pic.twitter.com/qn5jWJZnGO — Wasim Jaffer (@WasimJaffer14) November 11, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Kevin Pietersen: ఇంగ్లండ్‌పై గెలవగల సత్తా ఆ రెండింటికే.. కప్ మాత్రం మాదే!
Kevin Pietersen- Only These Teams can beat England : టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు... సమిష్టిగా ముందుకు సాగుతూ శ్రీలంకపై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది ఇంగ్లండ్ జట్టు. ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరిచి అధికారికంగా సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బలమైన జట్టుగా మారి ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. గ్రూపు-1 టాపర్ అయిన మోర్గాన్ బృందం సెమీస్‌లో తమతో తలపడే గ్రూపు-2లోని జట్టు కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు.. గ్రూపు -2లో పాకిస్తాన్.. టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్‌లపై విజయాలతో ముందంజలో ఉండగా.. అఫ్గన్ సైతం స్కాట్లాండ్, నమీబియాపై విజయాలతో జోరు మీద ఉంది. న్యూజిలాండ్ సైతం భారత్‌పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించగల సత్తా పాకిస్తాన్ లేదంటే అఫ్గనిస్తాన్‌కే ఉందన్నాడు. అయితే, పిచ్ ప్రభావం పైనే జట్ల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నాడు. ఈ మేరకు... ‘‘కేవలం పాకిస్తాన్.. లేదంటే అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించగలవు. కానీ... కా.... నీ... షార్జాలో ఇది వరకు ఉపయోగించిన పిచ్‌పై మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది’’ అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లోని చెల్సీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఇంగ్లండ్ జట్టుకు పోలిక తెచ్చిన పీటర్సన్... కప్ గెలవాలని ఆకాంక్షించాడు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో విభేదాలు.. కోహ్లి అనుకూల, వ్యతిరేక గ్రూపులు: అక్తర్ KL Rahul: కోహ్లి, రోహిత్ శర్మకు విశ్రాంతి.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్! Only Pakistan or Afghanistan can beat England in this T20 World Cup. BUT and it’s a BIG BUT, the game would have to be played on a used wicket in Sharjah. Anywhere else, just hand England the trophy like Chelsea should be handed the EPL trophy RIGHT NOW! 🏆🏆 — Kevin Pietersen🦏 (@KP24) November 2, 2021 -
వాళ్లేమీ రోబోలు కాదు.. ప్రతి మ్యాచ్ గెలవడానికి, అండగా నిలవండి..!
Kevin Pietersen Bats For Team India After Shocking Loss Against New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో జట్టు సభ్యులందరిపై ముప్పేట దాడి మొదలైంది. ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ అభిమానులు, విశ్లేషకులు మాటల దాడికి దిగుతున్నారు. భారత ఆటగాళ్ల వైఫల్యాలకు ఐపీఎల్ కారణమని కొందరంటుంటే.. మరికొందరేమో కీలక మ్యాచ్‌ల్లో టీమిండియా ఒత్తిడికి లోనై చిత్తుగా ఓడటం సర్వసాధారణమని సర్ధుకుపోతున్నారు. खेल में एक विजेता और एक हारने वाला होता है। कोई भी खिलाड़ी हारने के लिए बाहर नहीं जाता है। अपने देश का प्रतिनिधित्व करना सबसे बड़ा सम्मान है। कृपया महसूस करें कि खेल के लोग रोबोट नहीं हैं और उन्हें हर समय समर्थन की आवश्यकता है।— Kevin Pietersen🦏 (@KP24) November 1, 2021 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లి సేనకు బాసటగా నిలిచాడు. ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మద్దతు నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ఆటలో జయాపజయాలు సహజమని, ఓ జట్టు గెలిస్తే మరో జట్టు ఓడాల్సి ఉంటుందని అన్నాడు. ఏ ఆటగాడు కూడా ఓడిపోవాలని బరిలోకి దిగడని.. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆటగాళ్లు గొప్ప గౌరవంగా భావిస్తారని పేర్కొన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడానికి ఆటగాళ్లేమీ రోబోలు కాదని, వారికి అన్ని సమయాల్లో అభిమానుల మద్దతు అవసరమంటూ” సోమవారం ట్వీట్ చేశాడు. కేపీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు టీమిండియాకు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. కాగా, ప్రస్తుత మెగా టోర్నీ టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూడగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాల్ని ఎదుర్కొని సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత -
నరేంద్ర మోదీ ఒక హీరో.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ప్రశంసలు వర్షం
Kevin Pietersen Comments ON Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, పర్యావరణ పరిరక్షకుడు కెవిన్ పీటర్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఖడ్గమృగాల రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను పీటర్సన్ కొనియాడాడు. ఖడ్గమృగాలన్ని కాపాడటానికి అస్సాం ప్రభుత్వం చేస్తున్న కృషిని అతడు ప్రశంసించాడు. భారత ప్రధానిని అనుకరించాలని ఇతర ప్రపంచ నాయకులకు పీటర్సన్ పిలుపు నిచ్చాడు. ప్రధాని నరేంద్ర మోదీని అతడు ఒక "హీరో" గా అభివర్ణించాడు. "ఒక కొమ్ము గల ఖడ్గమృగం భారతదేశానికి గర్వకారణం.. దాని శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకోబడతాయి" అని ప్రధాని చెప్పారని పీటర్సన్ పేర్కొన్నాడు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే భారతదేశంలో ఖడ్గమృగాల సంఖ్య వేగంగా పెరుగుతోందని అతడు వెల్లడించాడు. ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం సెప్టెంబర్ 22 న, అసోం ప్రభుత్వం 2,479 ఖడ్గమృగాల కొమ్ములను బహిరంగంగా వేద ఆచారాల మధ్య దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ఒక కొమ్ము గల ఖడ్గమృగం భారతదేశానికి గర్వకారణం, దాని శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకోబడతాయి ”అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చదవండి: అతడు ఆద్భుతమైన ఆటగాడు: ఇర్ఫాన్ పఠాన్ -
వార్నర్ ఔట్ నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
Kevin Pietersen Comments On David Warner: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి మూట కట్టుకుంది. అయితే ముఖ్యంగా గంపెడు ఆశలు పెట్టెకున్న డేవిడ్ వార్నర్ ఆభిమానులను నిరాశపరిచాడు. నోర్జే వేసిన తొలి ఓవర్ మూడో బంతిని అంచనా వేయలేకపోయిన వార్నర్... అక్షర్ పటేల్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో డెవిడ్ వార్నర్ ఔటైన తీరుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. వార్నర్ ఔటైన తీరు తనను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదని అతడు తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలింగ్ ద్వయం అన్రిచ్ నార్ట్జే, కగిసో రబాడాకు డేవిడ్ వార్నర్‌కు ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు అని పీటర్సన్ పేర్కొన్నాడు. రబాడా ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో వార్నర్ వికెట్‌ని పడగొట్టాడని, వార్నర్‌కు ఢిల్లీ జట్టుతో మ్యాచ్ చాలా కష్టమైనదని కెవిన్ పీటర్సన్ చెప్పాడు. "డేవిడ్ వార్నర్‌కు బౌలింగ్ ఎలా చేయాలో నార్ట్జే , రబాడాలకు తెలుసు. రబాడా అతన్ని ఇప్పటికే 4-5 సార్లు ఔట్ చేశాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి వార్నర్‌కు ఎలా బౌలింగ్ చేయాలో వారికి తెలుసు . నిజానికి నాకు వార్నర్ ఔటైన తీరు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వార్నర్‌కు ఇది నిజంగా కఠినమైన సవాల్ అని నేను భావించాను”అని పీటర్సన్ స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యలో భాగంగా వెల్లడించాడు. డేవిడ్ వార్నర్ కూడా అన్రిచ్ నార్ట్జే , కగిసో రబాడా వంటి బౌలర్లను ఎలా ఎదర్కొవాలని మ్యాచ్ ముందు రోజు ఆలోచించి ఉంటాడని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌ని పెవిలియన్‌కు పంపడంలో నార్ట్జే విజయవంతం అయ్యాడని అతడు పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. చదవండి: IPL 2021 2nd Phase SRH Vs DC: ఎస్ఆర్హెచ్పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం -
పొలార్డ్ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్ అయ్యేది!
Kieron Pollards captaincy blunder vs CSK: ఐపీఎల్-2021 రెండో అంచె తొలి మ్యాచ్‌లో ముంబై ప్రదర్శనపై ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ పెదవి విరిచాడు. తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలర్లు అందించిన ఆరంభాన్ని చక్కగా వినియోగించుకోలేక తప్పిదాలు చేశాడని విమర్శించాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. సారథి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లేకుండానే మైదానంలో దిగిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై.. సీఎస్కే చేతిలో ఓటమి పాలైంది. 20 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. పవర్‌ప్లే ముగిసే వరకు చెన్నై కీలక వికెట్లన్నీ కోల్పోయినప్పటికీ.. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేపోయింది. అయితే, ఇందుకు ప్రధాన కారణం కెప్టెన్ కీరన్ పొలార్డ్ వ్యూహాలేనని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతడు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఘనంగా మ్యాచ్ ఆరంభించింది. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రెగ్యులర్ కెప్టెన్ దూరమైనప్పటికీ, ఆ ఒత్తిడిని జయించి శుభారంభం చేసింది. పవర్‌ప్లే ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంబటి రాయుడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇలా కీలక వికెట్లు పడిన వేళ.. ఆ అవకాశాన్ని ముంబై చక్కగా ఉపయోగించుకోవాల్సింది. కానీ, అక్కడే ముంబై ఇండియన్స్ కెప్టెన్ ట్రిక్ మిస్సయ్యాడు. జస్ప్రీత్ బుమ్రాతో 2 లేదా 3 ఓవర్లు వేయించి ఉండాల్సింది. అలా అయితే, 40 లేదా 50 పరుగులకే సీఎస్కే 7 వికెట్లు కోల్పోయి ఉండేది. 60, 70 లేదంటే 80 పరుగులకే ఆలౌట్ అయి ఉండేది. నేనేమీ ఇదంతా ఊరికే ఏం చెప్పడం లేదు. ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు స్టార్ బౌలర్లను బరిలోకి దించడం సత్ఫలితాలను ఇస్తుంది కదా’’అని అభిప్రాయపడ్డాడు. కాగా ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఒత్తిడిలోనూ సూపర్ ఇన్నింగ్స్(58 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడి సీఎస్కేకు మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇక ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండు వికెట్లు తీశారు. పొలార్డ్ చేసిన తప్పు ఇదేనా? కాగా ఆరు ఓవర్ల వరకు మిల్నే, బౌల్ట్‌తో బౌలింగ్ చేయించిన పొలార్డ్.... ఆ తర్వాతి ఓవర్లో బుమ్రాను రంగంలోకి దించాడు. అయితే, మళ్లీ 14వ ఓవర్ వరకు అతడిని బంతిని ఇవ్వలేదు. 16 ఓవర్లో మళ్లీ బుమ్రాకు అవకాశం ఇచ్చినా అప్పటికే రుతురాజ్.. నిలదొక్కుకుని తమ జట్టును గౌరవప్రదమైన స్కోరు సాధించే దిశగా తీసుకువెళ్లడంతో డెత్ ఓవర్లలో స్టార్ పేసర్‌ను దించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పీటర్సన్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. 🎥 Game TURner Rocket Raja's MOM moments! @ruutu1331#CSKvMI #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Hnny0FV4t3 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) September 20, 2021 -
Kevin Pietersen: ఈసారి ఆ జట్టే ఐపీఎల్ విజేత!
Kevin Pietersen On IPL 2021 Winner: క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేత పై ఇప్పటి నుంచే మాజీలు, క్రికెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన ఆభిప్రాయాన్ని తెలిపాడు. ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉందని అతడు చెప్పాడు. ఐపీఎల్ 2020లో చెన్నై ఆటతీరు పూర్తిగా నిరాశపరచిందని.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా వారు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేదని పీటర్సన్ చెప్పాడు. అయితే ధోనీ నేతృత్వంలోని జట్టు ఈసారి ఐపీఎల్ ఫేజ్-1లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గురించి పీటర్సన్ మాట్లాడుతూ.. ముంబై ప్రతిసారి నెమ్మదిగానే టోర్నీని ప్రారంభిస్తుందని.. లీగ్ మధ్యలో ఆ జట్టు ఊపు అందకుంటుందని అభిప్రాయపడ్డాడు. లీగ్ మధ్యలో ఉంది కనుక ముంబై టైటిల్ రేసులో నిలవాలంటే వాళ్లు ఆడే ప్రతి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలని అతడు సూచించాడు. మరోవైపు ప్రస్తుతం లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్ గెలవాలి -
టీమిండియాను ట్రోల్ చేసిన వాన్.. పీటర్సన్ కౌంటర్
లండన్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ మరోసారి టీమిండియాను ట్రోల్ చేశాడు. ఐదో టెస్టు రద్దు నేపథ్యంలో వాన్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో టీమిండియా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు నష్టం కలిగించింది. ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల ఈసీబీ భారీగా నష్టపోతుంది. సరిగ్గా గతేడాది దక్షిణాఫ్రికాతో ఇదే రీతిలో మేం సిరీస్‌ను రద్దు చేసుకున్నాం. మాకు శాపం తగిలినట్టుంది'' అంటూ గుర్తు చేశాడు. అయితే వాన్ వ్యాఖ్యలపై మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ టీమిండియాకు మద్దతిస్తూ కౌంటర్ ఇచ్చాడు. ''ఇది ఊహించని పరిణామం. ఇందులో టీమిండియా తప్పు ఎక్కడుంది. గతంలో కరోనా కారణంగానే ఈసీబీ దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేసుకుంది. మరి దక్షిణాఫ్రికా బోర్డు కూడా చాలా నష్టపోయింది. ప్రతీ విషయాన్ని పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. వెంటనే మాట మార్చిన ఈసీబీ ఇక కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు అయిన సంగతి తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్‌కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: IPL 2021: కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ India have let English Cricket down !!! But England did let South African Cricket down !!! — Michael Vaughan (@MichaelVaughan) September 10, 2021 England left the tour of SA for Covid scares & cost CSA plenty, so don’t go pointing fingers! 👀 — Kevin Pietersen🦏 (@KP24) September 10, 2021 -
2008లో ఇంగ్లండ్ ఏం చేసిందో మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..!
IND VS ENG 5th Test Reschedule: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ ప్రతిపాదనను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాడు. 2008లో ముంబై దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్ 26) కటక్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండింది. దాడుల కారణంగా 7మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి రెండు వన్డేలను రద్దయ్యాయి. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై సందిగ్ధత నెలకొంది. అయితే టెస్టు సిరీస్ ఆడటానికి ఇంగ్లండ్ జట్టు భారత్‌కు తిరిగి రావడంతో అప్పట్లో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. షెడ్యూల్లో ఉన్న ప్రకారం అహ్మదాబాద్, ముంబైలో కాకుండా అహ్మదాబాద్, చెన్నైలలో ఆ రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈ సిరీస్‌లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 0-1తో ఓడింది. కాగా, సునీల్ గవాస్కర్ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. 2008లో ఇంగ్లండ్ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని, ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు మళ్లీ భారత్‌కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపాలని కోరాడు. నాడు ఇంగ్లండ్ జట్టు ఉగ్రదాడి తర్వాత కూడా భారత్‌లో పర్యటించిందంటే.. అది కేవలం నాటి కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చొరవ వల్లేనన్నాడు. చదవండి: ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..? -
ఏ క్షణాన ఏ వార్త వినాల్సివస్తుందో.. రషీద్‌ఖాన్
Rashid Khan అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అరాచక పాలనతో రాజ్యమేలుతున్న వేళ ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం కుటుంబానికి అందుబాటులో లేకుండా పోయిన రషీద్ ఖాన్.. తన కుటుంబం ఏమౌతుందోననే భయాందోళనలో మునిగిపోయాడు. తన కుటుంబాన్ని కాపాడాలంటూ ఆవేదన చెందాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఇంగ్లండ్ వేదికగా హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రషీద్ యూకేలో ఉండిపోవడం.. తన కుటుంబసభ్యులు మాత్రం అఫ్గన్‌లో ఉండడంతో వారికేమైనా జరుగుతుందేమోనని కలవరపడుతున్నాడు.తాలిబన్ల అరాచక పాలన తట్టుకోలేక ఆ దేశ ప్రజలు ప్రాణ భయంతో వేరే చోటికి తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇదే విషయమై రషీద్ పీటర్సన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ''అఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రషీద్‌తో చర్చించా. ఈ విషయమై అతను చాలా బాధపడుతున్నాడు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నాడు. రషీద్‌కు కుటుంబం అంటే ప్రాణమని.. వారిని విడిచి ఉండలేడని.. అందుకే తన వాళ్లకు ఏం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కాబుల్ విమానాశ్రయానికి విమానాలు నిలిచిపోయాయి. దీంతో తన కుటుంబాన్ని అఫ్గన్ నుంచి తరలించిలేక కుమిలిపోతున్నాడు. ఈ ఒత్తిడి నుంచి రషీద్ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే అఫ్గనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు చొరవ తీసుకోవాలని రషీద్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమని.. వారు మద్దతిస్తారని.. మా కార్యకలపాలకు అడ్డుపడరని అఫ్గన్ క్రికెట్ సీఈవో హమీద్ షీన్వారీ మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. -
హిందీలో పీటర్సన్ ట్వీట్.. సూపర్ అంటున్న ఫ్యాన్స్
లండన్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ హిందీలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. '' భారతీయులందరికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం ఎన్నో విషాధాలు చూశాం.. వాటన్నింటిని మరిచి కొత్త ఆశలతో ముందడుగేయండి. మీ సెలబ్రేషన్స్‌ను నేను మిస్సవుతున్నా.. త్వరలోనే ఇండియాకు వస్తా అప్పుడు కలుద్దాం.. లవ్ కేపీ'' అని ట్వీట్ చేశాడు. ఇక పీటర్సన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాకా కామెంటేటర్‌గా బిజీ అయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాలీ టోర్నీలకు పీటర్సన్ కామెంటరీ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పీటర్సన్ హండ్రెడ్ టోర్నీలో కామెంటరీ చేస్తున్నాడు. ఇక కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరపున 104 టెస్టుల్లో 8181 పరుగులు, 136 వన్డేల్లో 4440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు సాధించాడు. भारत के 75वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। इस साल कई त्रासदियों का सामना करना पड़ा है लेकिन हम और भी मजबूत होकर वापस आएंगे। मैं आप सभी को याद करता हूं और जल्द ही फिर से आने का इंतजार नहीं कर सकता। लव KP 🇮🇳 — Kevin Pietersen🦏 (@KP24) August 15, 2021 -
అది గోల్ఫ్ బాబు; అక్కడెందుకు హెలికాప్టర్ షాట్
లండన్: క్రికెట్లో హెలికాప్టర్ షాట్ అంటే తెలియని వారుండరు. ఆ షాట్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఎంఎస్ ధోని. అంత పాపులర్ అయిన ఆ షాట్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఏదో ఒక సందర్భంలో ప్రయత్నించడం చాలసార్లే చూశాం. తాజాగా ఆఫ్ఘన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ గోల్ప్ ఆటలో హెలికాప్టర్ షాట్ ఆడడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం కౌంటీ ఆడేందుకు లండన్ వచ్చిన రషీద్ ఒక గోల్ప్కోర్టుకు వెళ్లాడు. రూఫ్ టాఫ్ ఎత్తులో ఉన్న గోల్ఫ్‌ను కొట్టే క్రమంలో ధోని హెలికాప్టర్ షాట్‌ను ఉపయోగించాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. '' రషీద్.. నీ గోల్ప్ చాలా బాగుంది.. కానీ ఒక విషయం మర్చిపోయావు. అది గోల్ప్ ఆట, అక్కడెందుకు హెలికాప్టర్ షాట్. ఎలాగు షాట్ కొట్టేశావు కాబట్టి ఈసారి స్విచ్ హిట్ కొట్టే ప్రయత్నం చేయ్'' అంటూ కామెంట్ చేశాడు. స్విచ్ హిట్‌కు కెవిన్ పీటర్సన్ పెట్టింది పేరు. 2006లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో పీటర్సన్ తొలిసారి స్విచ్ షాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ కూడా ఈ షాట్‌ను బాగా ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక రషీద్ ఇటీవలే కౌంటీ క్రికెట్ ఆడేందుకు దుబాయ్ నుంచి లండన్ చేరుకున్నాడు. విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ససెక్స్ షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉన్న రషీద్ బుధవారం నుంచి బరిలోకి దిగుతున్నాడు. కాగా ససెక్స్షైర్ ఈ సీజన్లో ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడగా నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఐదు డ్రాలతో ఉంది. రషీద్ రాకతో ఆ జట్టు కాస్త బలంగా తయారైందని చెప్పొచ్చు. ఇదే జట్టులో జో రూట్, డేవిడ్ మలాన్, వహబ్ రియాజ్‌లు ఉన్నారు. View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19) -
భారత్‌ను వదిలి వచ్చాను.. కానీ: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
లండన్: ‘‘నేను భారత్‌ను వదిలిపెట్టి వచ్చాను కానీ.. నా మనసంతా అక్కడే ఉంది. నాపై ఎంతో ప్రేమను కురిపించిన, ఆప్యాయత పంచిన దేశం గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను’’ అంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ ఉద్వేగభరిత ట్వీట్ చేశాడు. కరోనా సెకండ్‌వేవ్‌తో భారత్ అల్లాడిపోతోందని, ఈ కష్ట సమయాన్ని ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నాడు. దయచేసి అందరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2021 సీజన్ నిమిత్తం కెవిన్ పీటర్సన్ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. పలు మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అతడు.. టోర్నీ నిరవధికంగా వాయిదా పడటంతో స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కరోనా పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. ట్విటర్ వేదికగా సంఘీభావం ప్రకటించాడు. ఇక కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలోనూ... ‘‘నేనెంతగానో ప్రేమించే ఇండియాను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే హృదయం ముక్కలవుతోంది. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడగల సత్తా భారత్‌కు ఉంది. కరుణ, ప్రేమ కురిపించే దేశాన్ని మహమ్మారి ఏమీ చేయలేదు. ఇన్క్రెడిబుల్ ఇండియా’’ అని కెవిన్ పీటర్సన్ భారత్ పట్ల అభిమానం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్-2021లో ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. ఇక కరోనా కేసుల విషయానికొస్తే భారత్‌లో గడిచిన 24 గంటల్లో... 3,29,942 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 3876 కరోనా మరణాలు సంభవించినట్లు తెలిపింది. मैंने भारत छोड़ दिया हो सकता है, लेकिन मैं अभी भी ऐसे देश के बारे में सोच रहा हूँ जिसने मुझे बहुत प्यार और स्नेह दिया है। कृपया लोग सुरक्षित रहें। यह समय बीत जाएगा लेकिन आपको सावधान रहना होगा। 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) May 11, 2021 చదవండి: అమ్మా.. అక్కా.. గుండె పగిలిపోతోంది: క్రికెటర్ భావోద్వేగం -
'ఐపీఎల్ రద్దు అని తెలియగానే నా గుండె పగిలింది'
లండన్: ఐపీఎల్ 14వ సీజన్ రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించగానే.. ''నా గుండె పగిలిందంటూ'' ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా సోమవారం కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. సీఎస్కే జట్టులో సిబ్బందితో పాటు బౌలింగ్ కోచ్ బాలాజీకి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా ఎస్ఆర్హెచ్ నుంచి సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అమిత్ మిశ్రాలు కరోనా బారీన పడడంతో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపై పునరాలోచించింది. మొదట తాత్కాలికంగా వాయిదా వేయాలని భావించినా.. ఆటగాళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువే ఉండడంతో ఐపీఎల్ 14వ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లుగా మంగళవారం నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో వినూత్న రీతిలో కామెంట్లు వచ్చాయి. ఈ విషయంపై పీటర్సన్ తన ట్విటర్ ద్వారా స్పందించాడు. ' ఇండియాను ఇలా చూడడం బాధగా ఉంది. ప్రస్తుతం కరోనా విస్పోటనం ఆ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ సమయంలో ఐపీఎల్ 14వ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం నా గుండె పగిలేలా చేసింది. అయినా ఇలాంటి విపత్కర సమయంలో లీగ్‌ను రద్దు చేయడమే సరైన నిర్ణయం. బీసీసీఐని నేను స్వాగతిస్తున్నా. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతోపాటు కరోనాతో పోరాడుతున్న భారతదేశ ప్రజలను దృష్టిలో ఉంచుకొని పీటర్సన్ ఒక సందేశాన్ని ఇచ్చాడు. ''మీరు ఈ విపత్తు నుంచి బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దృడంగా ఉండాల్సిన సమయం ఇది.. ఇలాంటి సమయంలో మీరు ఆత్మనిర్భరంతో ఉంటూ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి'' అంటూ తెలిపాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్కే రెండో స్థానంలో ఉంది. చదవండి: IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ సందీప్ ఓకే.. కానీ వరుణ్ కోలుకోవాల్సి ఉంది India - it’s heartbreaking to see a country I love so much suffering! 😢 You WILL get through this! You WILL be stronger coming out of this! Your kindness & generosity NEVER goes unnoticed even during this crisis! 🙏🏽#IncredibleIndia ❤️ — Kevin Pietersen🦏 (@KP24) May 4, 2021 -
‘ఆ బంతుల్ని హిట్ చేయాలంటే అంత లేజీ పనికిరాదు’
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో ఘోరంగా విఫలమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. టాలెంట్ ఉన్నా పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడంలో తేలిపోతున్న గిల్ తన ఆట తీరును మార్చుకోవాలని మాజీలు హితవు పలుకుతున్నారు. కేకేఆర్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్ సైతం గిల్‌ను పరోక్షంగా తప్పుబట్టాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడకపోతే, స్థానాన్నే వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇదిలాఉంచితే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా గిల్ ఆడే విధానాన్ని సుతిమెత్తగా విమర్శించాడు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌తో పీటర్సన్ మాట్లాడుతూ.. గిల్ తన సమస్యను అతనే చక్కదిద్దుకోవాలన్నాడు. ‘ మనం గిల్ గురించి మాట్లాడదాం. గిల్ ఒక మంచి క్రికెటర్. ఒక ప్లేయర్‌గా అతను నాకిష్టం. కానీ ఇటీవల కాలంలో గిల్ ఎందుకో సరిగా ఆడటం లేదు. లేజీగా కనిపిస్తున్నాడు. అతని పూర్తి స్థాయి ఆటతో సత్తాచాటాలి. ఫీల్డ్‌లో మరింత బిజీ కావాలి. అతను ఔటైన కొన్ని సందర్భాలను తీసుకుంటే మరీ నాసిరకంగా పెవిలియన్‌కు చేరుతున్నాడు. గిల్‌ను చూస్తుంటే ఫిట్‌గా లేనట్లే కనబడుతున్నాడు. గేమ్‌లో స్పీడ్ తగ్గింది. బ్యాట్స్‌మన్‌గా మందకొడిగా ఉంటున్నాడు. ఇక నుంచైనా మరింత ఆకర్షణీయమైన క్రికెట్ ఆడతాడని ఆశిస్తున్నా. గేమ్‌పై తిరిగి పట్టు సాధిస్తే లెగ్‌పై వచ్చే బంతుల్ని మిస్ చేయకుండా హిట్ చేయడానికి యత్నిస్తావ్. నువ్వు చేయాలనుకున్నది క్లియర్‌గా చేస్తేనే మంచిది. అప్పుడు రిజల్ట్ వస్తుంది’ అని తెలిపాడు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన గిల్.. 15, 33, 21, 0, 11,9, 43 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాట్ నుంచి ఇంకా భారీ స్కోరు రాకపోవడం ఆ జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. ఇక్కడ చదవండి: IPL 2021: షర్ట్లు విప్పేసి మరీ హంగామా చేశారు! 'జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే' అదీ కెప్టెన్ అంటే: కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా! -
'ఐపీఎల్లో ఆడినా.. జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాలేడు'
ముంబై: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మొయిన్ అలీ 132 పరుగులతో పాటు 4 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమమంలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి గేమ్ చేంజర్ అయ్యాడు. అంతేగాక సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో వస్తూ పరుగులు చేస్తూ కీలకంగా మారాడు. గతేడాది ఆర్సీబీ తరపున ఆడిన మొయిన్ అలీని వేలానికి ముందు రిలీజ్ చేయగా.. సీఎస్కే అతని ఆటపై నమ్మకముంచి రూ. 7 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అలీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ''ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టుకు వచ్చేసరికి టీ20ల్లో మాత్రం ఆప్షనల్ ఆటగాడిగా ఉంటాడే తప్ప రెగ్యులర్ సభ్యుడు కాలేడు. ఎవరైనా గాయపడడం లేదా సిరీస్ నుంచి వైదొలిగితేనో అతనికి అవకాశం వస్తుంది. 20 ఏళ్ల కిందట ఆసీస్ జట్టుకు రెగ్యులర్‌గా ఆడడానికి మైక్ హస్సీ, డామియన్ మార్టిన్లు ఎంతకాలం ఎదురుచూడాల్సి వచ్చిందో.. అచ్చం అదే పరిస్థితిలో ప్రస్తుతం మొయిన్ అలీ ఉన్నాడు. అతను అద్భుతమైన ఆటగాడే.. కానీ అతని నుంచి మూడు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన రావాలని అందరు అనుకుంటున్నారు. ప్రస్తుతం అతను తన కెరీర్ పరంగా టాప్‌గా కొనసాగుతున్నాడు.. త్వరలోనే అతను ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటాడని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఫోన్ కోసం ఇంత పని చేస్తావా మ్యాక్సీ.. పాపం చహల్ -
16 కోట్ల ఆటగాడిపై ఒత్తిడి.. నేనైతే అంత ఇవ్వను!
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మోరిస్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న రాజస్థాన్.. అతనికి భారీ మొత్తం చెల్లించి తీసుకుంది. కానీ అతను రాజస్థాన్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో తప్పితే పెద్దగా ఆకట్టుకున్న సందర్భాలు లేవు. ప్రధానంగా బౌలింగ్‌లో మోరిస్ బారీ పరుగుల్ని సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన మోరిస్.. 14 ఓవర్లు బౌలింగ్ వేసి 139 పరుగులిచ్చాడు. ఇందులో అతను తీసుకున్న వికెట్లు ఐదు. ఆర్సీబీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లే వేసిన మోరిస్ 38 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. మోరిస్ ప్రదర్శనను ఎత్తిచూపాడు. ‘ భారీ మొత్తం చెల్లించి మోరిస్‌ను రాజస్థాన తీసుకుంది. మోరిస్‌పై అంత ధర పెట్టడం అంటే కాస్త ఆశ్చర్యమే అనిపించింది. దక్షిణాఫ్రికా తరఫున కూడా అతను ఫస్ట్ చాయిస్ కాదు. నిజాయితీగా చెప్పాలంటే మోరిస్‌ను అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదు. నేనైతే అంత ధర మోరిస్‌పై పెట్టను. ఇలా చేస్తే అతనిపై ఒత్తిడి పెంచినట్లు ఉంటుంది. మోరిస్ ప్రైస్ ట్యాగ్ ఏదైతే ఉందో అది అతన్ని ఒత్తిడిలోకి నెడుతుంది. ఈ ధరను అతను కూడా ఊహించలేదు. అందుకే ఒత్తిడి నెలకొంది. ఈ సీజన్లో నిలకడైన మోరిస్‌ను ఇంత వరకూ చూడలేదు. మోరిస్ ప్రదర్శన ఇలానే ఉంటే రాజస్థాన్ ఆడబోయే చాలా మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం కూడా కష్టమే అవుతుంది. మనం కూడా అతని నుంచి భారీ ప్రదర్శన ఆశిస్తున్నాం. అతని గురించే ఎక్కువ మాట్లాడుతున్నాం. ఒకవేళ రాజస్థాన్ తరఫున రాణించినా అతనిపై ఆ ఫ్రాంచైజీ పెట్టుకోలేదు. దాంతో కొన్ని మ్యాచ్‌లు మోరిస్ తప్పకుండా మిస్సవుతాడు’ అని బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్‌తో మాట్లాడిన పీటర్సన్ తెలిపాడు. ఇక్కడ చదవండి: ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..! సామ్సన్.. వారు నీలాగ 0, 1 చేయడం లేదు: గంభీర్ -
‘సామ్సన్ ఆటను ప్రేమిస్తా’
లండన్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మన్ కాదనే అపవాదు నుంచి బయటపడాలని కోరుతున్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. సామ్సన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతని షాట్లు కొట్టే తీరు ముచ్చటగా ఉంటుందన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్సన్ చేసిన సెంచరీ తనను ఎంతో ఆకట్టుకుందున్న కెవిన్.. ఆ మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకూ వచ్చి సరైన ముగింపు లేకపోవడం నిజంగా దురదృష్టమన్నాడు. ‘ప్రతీ ఏడాది సామ్సన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తా. సామ్సన్ షాట్లను నేను బాగా ఇష్టపడతా. నేను గతేడాది ఐపీఎల్లో కామెంటరీ ఎక్కువగా చెప్పాను. ఎక్కువగా అతని నిలకడ గురించి మాట్లాడా. గతేడాది అతను మధ్యలో ఫామ్‌ను కోల్పోయాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు.. అది అతనికి రెండో మ్యాచేనని, ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నందున సామ్సన్‌పై విమర్శలు అనవసరమన్నాడు. ప్రస్తుతం అతని బాధ్యతలు వేరే స్థాయిలో ఉన్నాయని, రాయల్స్ కెప్టెన్ అని పేర్కొన్నాడు. బెన్ స్టోక్స్ లేని లోటును పూడ్చుకోవాల్సిన అవసరం సామ్సన్‌పై ఉందన్నాడు. కాగా, సామ్సన్ అంతర్జాతీయ కెరీర్ గురించి పీటర్సన్ మాట్లాడుతూ.. ‘ భారత్ తరఫున ఏ పరిస్థితుల్లోనైనా తన పవర్ ప్లే క్రికెట్‌తో ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సామ్సన్. పరుగులు చేసిన తర్వాత ఇంకా పరుగులు చేస్తాడు. అలానే చాలాసార్లు విఫలం కూడా అయ్యాడు. అటువంటి సమయంలో డెడికేషన్ అవసరం. అతను అంతర్జాతీయ స్థాయి ఆడే క్రికెటర్. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఒకసారి క్లిష్ట సమయం వచ్చిందంటే అది మరిన్ని సమస్యల్ని తీసుకొస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడే పరిస్థితుల్ని మరింత క్లిష్టం చేసుకోవద్దు’ అని తెలిపాడు. ఇక్కడ చదవండి: 'రనౌట్ చేశానని నా మీదకు కోపంతో రావుగా' రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! -
భారత్-పాక్‌లు కలిస్తే నా కల నెరవేరినట్టే: కెవిన్ పీటర్సన్
న్యూఢిల్లీ : ఇటీవల కోవిడ్ బారిన పడ్డ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమం కోరుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. భారత్- పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగపడితే తన కల నేరవేరినట్టేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రజలందరూ ఒకరికొకరు అండగా ఉండటం చాలా ముఖ్యమని, అది ఈ ఏడాది ప్రతి ఒక్కరికి తెలుసొచ్చిందని ఆయన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, పాక్ ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్(చైనా వ్యాక్సిన్) వేయించుకున్న తరువాత వైరస్‌బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. This tweet by @narendramodi to @ImranKhanPTI made me smile! It would be a dream come true, to see India & Pak reunited and engaging both on & off the field! We all need each other & this year has shown us that! Let’s all hope a healthy friendship is on its way! 🙏🏽 https://t.co/jECZLQCDlI — Kevin Pietersen🦏 (@KP24) March 24, 2021 భారత్, పాక్‌ల మధ్య ఈ ఏడాది ఆఖర్లో ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా పీటర్సన్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకంది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి ఎనిమిదేళ్లవుతుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2012-13లో భారత్ వేదికగా తలపడ్డాయి. ఈ సిరీస్‌లో 2 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాక్‌లో పర్యటించింది. ఇవి మినహా ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడ్డాయి. భారత్, పాక్‌లు చివరిసారిగా 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగల తేడాతో(డక్‌వర్త్) పాక్‌పై ఘనవిజయం సాధించింది. చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్ పోరు..? చదవండి: ప్రసిద్ద్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా -
మీరు చేయలేనిది మేం చేసి చూపించాం: పీటర్సన్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈసీబీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పీటర్సన్ మెరుపులతో ఇంగ్లండ్ లెజెండ్స్ విజయాన్ని అందుకుంది. పీటర్సన్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ఇంగ్లండ్ లెజెండ్స్ టీమ్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఈసీబీని ట్యాగ్ చేశాడు. ''ఎట్టకేలకు ఇంగ్లండ్ జ్టటు భారత్‌ను తన సొంతగడ్డపై ఓడించింది.. ఎంత కూల్‌గా సాగిపోయిందో గేమ్ చెప్పండి ఇంగ్లండ్ సెలెక్టర్స్ .. ఇంకా మేము బరిలోనే ఉన్నాం'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. మీరు చేయలేకపోయారు.. మేం చూసి చూపించాం అన్నట్లుగా భారత్‌ను సొంతగడ్డపై ఓడించామని పీటర్సన్ మాటలు బట్టి అర్థమవుతుంది. పీటర్సన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను సొంతగడ్డపై ఇంగ్లండ్ ఓడించకపోడంతో పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇంగ్లండ్, భారత్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం(మార్చి 12న) జరగనుంది. చదవండి: యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్.. గుణతిలక ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ View this post on Instagram A post shared by Kevin Pietersen 🦏 (@kp24) -
యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్
రాయ్‌పూర్: రోడ్ సెఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇండియా లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెవిన్ పీటర్సన్ యువీ బౌలింగ్‌ను ఉతికారేశాడు. యువీ బౌలింగ్‌లో వరుస బంతుల్లో సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అయితే పఠాన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెవిన్ పీటర్సన్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా యువరాజ్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది 18 బంతుల్లోనే పీటర్సన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మాడీ 29 పరుగులతో పీటర్సన్‌కు సహకరించాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో యూసఫ్ పఠాన్ 3, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఇండియా లెజెండ్స్ విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గత మ్యాచ్ విన్నర్లు సెహ్వాగ్, సచిన్‌లు విఫలం కాగా.. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ (34 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61*పరుగులు) ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన అతను ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.యువరాజ్ 22 పరుగులు చేయగా.. మిగతావారు విఫలమయ్యారు. కాగా ఇంగ్లండ్ లెజెండ్స్ బౌలింగ్‌లో పనేసర్ 3, జేమ్స్ ట్రెడ్‌వెల్ 2, హోగార్డ్, సైడ్ బాటమ్‌లు చెరో వికెట్ తీశారు. చదవండి: టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్న ఆర్సీబీ ఓపెనర్ 'మ్యాక్స్‌వెల్.. 4,6,4,4,4,6.. నీకే తీసుకో' -
'థ్యాంక్స్ పీటర్సన్.. అర్థం చేసుకున్నందుకు'
ముంబై: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ థ్యాంక్స్ చెప్పాడు. అసలు విషయంలోకి వెళితే.. మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితంపై పలువురు మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పిన్ పిచ్‌కు అనుకూలించే ఈ పిచ్ టెస్టు మ్యాచ్‌లకు పనికిరాదంటూ విమర్శలు గుప్పించారు. అయితే పీటర్పన్ మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ బాల్ టెస్టుపై కాస్త భిన్నంగా స్పందించాడు. ''మ్యాచ్ తర్వగా ముగియడం నిరాశ కలిగించినా.. బ్యాట్స్‌మెన్ వైఫల్యమే అందుకు ప్రధాన కారణం. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరు జట్లు బ్యాటింగ్‌లో విఫలమయ్యాయి. ఆటగాళ్లు నిజాయితీగా ఉంటే ఫేలవంగా ఆడామని వారే ఒప్పుకుంటారు. కొందరు పని గట్టుకొని పిచ్‌ను విమర్శించడం నచ్చలేదు. అయినా మ్యాచ్‌లో 30 వికెట్లు పడితే .. అందులో 21 వికెట్లు నేరుగా వేసిన బంతుల వల్లే పడ్డాయి. వాస్తవానికి పిచ్‌తో ఎలాంటి ప్రమాదం లేదు. బ్యాట్స్‌మెన్ కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే మ్యాచ్ మూడు, నాలుగు రోజుల దాకా వెళ్లి ఉండేది. అంటూ చెప్పుకొచ్చాడు. పీటర్సన్ కామెంట్స్‌పై రోహిత్ శర్మ స్పందిస్తూ.. ''థ్యాంక్స్ పీటర్సన్.. కనీసం ఆట గురించి ఒక్కరైనా అర్థం చేసుకున్నందుకు'' అంటూ తెలిపాడు. మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మార్చి 4 నుంచి అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది. చదవండి: పింక్ బాల్ టెస్టు: పీటర్సన్ ట్వీట్ వైరల్ వాళ్లు ఆలోచించరు.. మాకు అవసరమా: రోహిత్ View this post on Instagram A post shared by Kevin Pietersen 🦏 (@kp24) -
పింక్ బాల్ టెస్టు: పీటర్సన్ ట్వీట్ వైరల్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్,టీమిండియాల మధ్య సిరీస్ ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. తొలి టెస్టులో ఇంగ్లండ్ మ్యాచ్ గెలవగానే.. టీమిండియా ఇప్పుడే సమాధానం ఇస్తారు చెప్పండి అంటూ ఘాటు విమర్శలు చేశాడు. అయితే టీమిండియా చెన్నైలోనే జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచి పీటర్సన్‌కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది. అయితే టీమిండియా ఇంగ్లండ్- బి టీమ్‌తో ఆడి గెలిచిదంటూ పీటర్సన్ ట్రోల్ చేసి విమర్శల పాలయ్యాడు. తాజగా మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకోగానే పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు. 'ఇది టాస్ ఎవరు గెలిస్తే వారు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకోను.. కేవలం మ్యాచ్‌లో వికెట్లు తీయడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పీటర్సన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా బౌలర్ల ఉచ్చులో పడిన ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అక్షర్ పటేల్ వేసిన 28వ ఓవర్ 5వ బంతికి స్టోక్స్ ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 81 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 86 పరుగులుగా ఉంది. చదవండి: 'ప్లీజ్.. పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయొద్దు' 'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను' Oops india , asha karta hoon ki yeh, toss jeeto match jeeto wala wicket na ho 😉 — Kevin Pietersen🦏 (@KP24) February 24, 2021 -
'ప్లీజ్.. పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయొద్దు'
చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగులతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ జీర్ణించుకోలేకపోయాడని అతని ట్వీట్ ద్వారా తెలుస్తుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా అభిమానులను కవ్విస్తూ పీటర్సన్ ఒక ట్వీట్ చేశాడు. 'భారత్‌కు శుభాకాంక్షలు. ఇంగ్లండ్-బి జట్టును ఓడించినందుకు' అంటూ పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో టీమిండియా మాజీ ఆటగాళ్లు పీటర్సన్‌కు అదిరిపోయే పంచులు ఇచ్చారు. తాజాగా వసీం జాఫర్, పీటర్సన్ల మధ్య ట్విటర్లో జరిగిన సంభాషణ అందరిని ఆకట్టుకుంది. పీటర్సన్ ట్వీట్‌ను షేర్ చేస్తూ..' ప్లీజ్.. కెవిన్ పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయకండి. కేపీ సరదాగానే ఇలా చేస్తున్నాడు. కానీ అతని ట్వీట్ ద్వారా నాకో విషయం అర్థమైంది. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లండ్ పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు ఎలా అవుతుంది? అంటూ' చురకలంటించాడు. కాగా పీటర్సన్ దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్‌కు వలస వెళ్లి ఇంగ్లండ్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జాఫర్ వ్యాఖ్యలను అభిమానులు మెచ్చకుంటూ తమదైన శైలిలో కామెంట్లు పెట్టారు. పీటర్సన్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చావు.. జాఫర్ సమాధానంతో పీటర్సన్ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది అని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా విధించిన 482 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఇంగ్లండ్ జట్టు 168 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. టీమిండియా బౌలర్ అక్షర్‌పటేల్ 5 వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. కాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మిగతా రెండు టెస్టులకు దూరం కానున్నట్లు కెప్టెన్ రూట్ తెలిపాడు. కుటుంబంతో గడిపేందుకు అలీ ఇంగ్లండ్‌కు బయలుదేరాడని.. అందుకే మిగతా టెస్టులకు అందుబాటులో ఉండడం లేదని తెలిపాడు. ఇక మూడో టెస్టుకు రొటేషన్ పాలసీ ప్రకారం అండర్సన్ తుదిజట్టులోకి రాగా.. జానీ బెయిర్ స్టో, మార్క్ వుడ్లు కూడా చోటు సంపాదించారు. ఇంగ్లండ్, భారత్‌ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24(బుధవారం) డే నైట్ మ్యాచ్ జరగనుంది. చదవండి: అశ్విన్ దెబ్బకు స్టోక్స్ బిక్కమొహం టీమిండియాకు ఒకటి.. ఇంగ్లండ్‌కు మాత్రం రెండు Don't troll KP guys. He's just trying to be funny. And I get it. I mean is it even a full strength England team if there are no players from SA?😉 #INDvsENG https://t.co/BhsYF1CUGm — Wasim Jaffer (@WasimJaffer14) February 16, 2021 -
పీటర్సన్ ట్వీట్‌కు స్పందించిన మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం పలు దేశాలకు కోవిడ్-19 టీకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న భారత్ కరోనా వ్యాక్సిన్‌ను దక్షిణాఫ్రికాకు పంపించింది. దీనికి సంబంధించి ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్లతో ఆ దేశంలో ల్యాండ్ అయిన విమానం ఫోటోను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ.. ‘భారతదేశం రోజురోజుకు చాలా దయ, ఉదారభావం పెంపొందించుకుంటూ ప్రపంచ దేశాలకు కష్టకాలంలో సాయం అందిస్తోంది’ అని ట్వీటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. Indian generosity and kindness grows more and more every single day. The beloved country! 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) February 2, 2021 పీటర్సన్ ట్వీట్‌పై భారత ప్రధాన మంత్రి నర్రేంద మోదీ స్పందిస్తూ.. ‘భారత్‌పై మీరు చూపించే ప్రేమ, అభిమానం’కు చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ‘ప్రపంచం ముత్తం ఒక కుటుంబమని తాము ఎల్లప్పుడూ బలంగా నమ్ముతాం. కరోనా మహామ్మరిపై పోరాటం చేయటంలో తమ దేశం శక్తిని కూడదీసుకొని కీలక పాత్ర పోషిస్తోంది’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. పీటర్సన్ దక్షిణాఫ్రికాలో జన్మించి తర్వాత ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ సాధించిన పలు విజయాల్లో ఈ మాజీ కెప్టెన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బాట్స్‌మెన్‌గా పలు మ్యాచుల్లో రాణించి ఇంగ్లండ్ జట్టును విజయ తీరాలకు తీసుకువెళ్లాడు. Glad to see your affection towards India. :) We believe that the world is our family and want to play our role in strengthening the fight against COVID-19. https://t.co/zwpB3CNxLG — Narendra Modi (@narendramodi) February 3, 2021 -
టీమిండియాకు ఇంగ్లండ్ మాజీ సారథి వార్నింగ్!
లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సాధించిన విజయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సరదాగా స్పందించాడు. మరీ ఇంత ఘోరంగా ఆసీస్‌ను ఓడించడం ఏమీ బాగాలేదన్న పీటర్సన్.. ఇంతటి అద్భుత ఘట్టానికి వేదికయ్యే అర్హత బ్రిస్బేన్‌కు లేదంటూ చమత్కరించాడు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే మంగళవారం నాటి మ్యాచ్‌లో పంత్ అనే కుర్రాడు, పెద్దవాడిగా మారిపోయాడంటూ అద్భుత ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. మొత్తానికి టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందంటూ హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా... ‘‘ఎన్నో అడ్డంకులు అధిగమించి భారత జట్టు ఈ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రానున్న కొన్ని వారాల్లో మీకు అసలైన సవాలు ఎదురుకాబోతోంది. ఇంగ్లండ్ జట్టు పర్యటనకు వస్తోంది. మీ సొంతగడ్డపై వారిని ఓడించాల్సి ఉంటుంది. జాగ్రత్త. వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి’’ అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. కాగా ఇంగ్లండ్ మాజీ సారథి వ్యాఖ్యలకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇదిగో భారత్‌లో సిరీస్ ముగిసిన అనంతరం మీ జట్టు పరిస్థితి ఇలాగే ఉంటుంది’’అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు, స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న చెన్నైలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. పెటర్నిటీ లీవ్‌పై ఆసీస్ నుంచి భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ సారథ్యంలో జరుగనున్న సిరీస్‌లో భాగంగా ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టులో చోటు దక్కించుకున్నారు. (చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే!) Only issue with India beating Australia in such an INCREDIBLE manner, is that the Test was played in Brisbane. A city that doesn’t deserve an event so good! 🤣 Pant - the boy who turned into a man today in Australia, in cricketing terms! 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 — Kevin Pietersen🦏 (@KP24) January 19, 2021 -
'పాపం పంజాబ్.. మ్యాక్స్‌వెల్ నుంచి ఏదో ఆశిస్తుంది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లీగ్ ప్రారంభానికి ముందు కింగ్స్‌పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. ఎందుకంటే ఆ జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉంది. దీనికి తోడు మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన మ్యాచ్‌లో కింగ్స్ ఓడిపోయినా ఆకట్టుకుంది.ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిచినంత పని చేసిన పంజాబ్ తీరా సూపర్ ఓవర్లో రబడ దాటికి మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి భోణీ కొట్టింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. (చదవండి : సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. దీంతో ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పంజాబ్ ఆటతీరు మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఇలాగే కొనసాగితే మొదట లీగ్ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలుస్తుంది. అయితే కింగ్స్ పంజాబ్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 1,5,13,11,11*, 7 పరుగులు చూస్తే అసలు మనం చూస్తున్నది మ్యాక్స్‌వెల్ ఆటేనా అనే అనుమానం కలుగుతుంది. గురువారం ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టి గేల్‌ను తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కింగ్స్ అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మ్యాక్స్ వెల్ ఆటతీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : రోహిత్ శర్మను గుడ్డిగా నమ్మాను.. అందుకే) 'పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్ నుంచి ఏదో ఆశిస్తుంది. కానీ అతను మాత్రం స్కోర్లు చేయలేక వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. కెప్టెన్ రాహుల్‌కు విదేశీ ఆటగాళ్ల నుంచి సరైన సహకారం అందడం లేదు. నికోలస్ పూరన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరు రాణించడం లేదు. అందులో మ్యాక్స్‌వెల్ కూడా ఒకడు. అయితే 10.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్న మ్యాక్స్‌వెల్ నుంచి పంజాబ్ ఆశించడంలో తప్పు లేదు. ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నందుకు పంజాబ్‌కు అతను కీలకం కావచ్చు.. కానీ మ్యాక్స్ విఫలమవుతున్న వేళ పక్కనైనా పెట్టాలి లేదా మరో మ్యాచ్ అవకాశమైనా ఇవ్వాలి. ఒకవేళ మ్యాక్స్‌వెల్ వద్దనుకుంటే గేల్‌కు అవకాశమిచ్చి చూడాలి. గేల్ మెరుస్తాడని కాదు కాని ఒకసారి అవకాశమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైతే ఏంటి ఆడకపోతే పక్కన పెట్టాల్సిందే. కింగ్స్ కెప్టెన్‌గా రాహుల్ మ్యాక్స్‌వెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను ఆడించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం చెప్పాడు. ఒకవేళ గేల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే నాకు తెలిసి పంజాబ్ జట్టు అతన్ని మూడు లేదా నాలుగు స్థానాల్లో ఆడించాల్సి ఉంటుంది. మరి పంజాబ్ తలరాత తర్వాతి మ్యాచ్ నుంచైనా మారుతుందేమో చూడాలంటూ తెలిపాడు. కాగా కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ రేపు(శనివారం) కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం') -
'సాకులు చెప్పడం ధోనికి మాత్రమే చెల్లుతుంది'
లండన్ : ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో చెన్నై మ్యాచ్ ఆడి రెండు రోజులు గడుస్తున్నా ఎంఎస్ ధోని ఏడో స్థానంలో రావడంపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. మంచి ఫినిషర్‌గా పేరున్న ధోని ఇలా ఏడో స్థానంలో రావడం ఏంటంటూ మాజీ క్రికెటర్లు గంబీర్, సునీల్ గవాస్కర్ పెదవి విరిచారు. దీనిని ధోని సమర్థించుకుంటూ.. క్వారంటైన్లో ఎక్కువ రోజులు ఉండడం వల్లే తనకు ప్రాక్టీస్ దొరకలేదని, పూర్తి సన్నద్ధత లేకపోవడం వల్ల ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చానని చెప్పడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ధోనికి చురకలంటించాడు. స్టార్‌స్పోర్ట్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కెవిన్ పీటర్సన్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : 'కోల్‌కతాపై విజయం మాలో జోష్ నింపింది') 'ధోని విషయంలో ఇదంతా నాకు నాన్ సెన్స్‌గా అనిపిస్తుంది.. ఏ జట్టుకైనా క్వారంటైన్ నిబంధనలను ఒకలాగే ఉంటాయి. మిగతా జట్లలోని ఆటగాళ్లు రాణించినప్పుడు ధోనికి మాత్రం ఎందుకు కష్టమనిపిస్తుంది. ఏది ఏమైనా సాకులు చెప్పడం ధోనికి మాత్రమే చెల్లుతుంది. అయినా ఇదేమీ ప్రయోగాలు చేసేందుకు సమయం కాదు. ప్రస్తుతం మనం ఐపీఎల్ టోర్నీలో తొలి దశలోనే ఉన్నాము. టీ-20లో ఏది జరిగినా చాలా త్వరగా అభిమానుల్లోకి వెళ్లిపోతుంది. వరుసగా ఐదు గేముల్లో ఓడిపోయిన జట్టు కూడా తర్వాత మ్యాచ్‌లు దాటిగా ఆడి ఫైనల్స్ వరకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అంతేకాని మ్యాచ్ ఓటమి అనంతరం ఇలాంటి సాకులు చెప్పాలని చూడొద్దు 'అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : ‘ధోని కొట్టిన బంతి దొరికింది’) బ్యాటింగ్ ఆర్డర్లో శామ్ కర్జన్ లేదా రవీంద్ర జడేజాలను ముందు పంపడం సరైన నిర్ణయమే కావచ్చు... అయితే ధోనికి తన మార్క్ ఇన్నింగ్స్ చూపించే వరకు అవకాశాల కోసం ఎదురుచూడడం వ్యర్థం. క్రీజులోకి రాగానే బ్యాట్ కు పని చెబితేనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇకనైనా ధోనిలాంటి అనుభవజ్ఞులు రాబోయే మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు తమ బాధ్యత నెరవేరుస్తారనే అనుకుంటున్నా. అంటూ' తెలిపాడు. -
‘ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’
దుబాయ్: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉద్వేగంగా ఎదురు చేస్తున్న ఐపీఎల్ 2020పై మాజీ క్రికెటర్లు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ 2020లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పీటర్సన్ స్పందిస్తూ యూఏఈలో సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 ఎంతో ఉత్కంఠగా సాగనుందని తెలిపాడు. కాగా ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టి 20 సిరీస్‌లో వ్యాఖ్యాత(కామంటేటర్‌గా) బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ పూర్తయినందున ఐపీఎల్‌ను వీక్షిస్తానని తెలిపాడు. తనకు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టమని, ఆసక్తికర మ్యాచ్‌లను ఆస్వాధిస్తానని పీటర్సన్ తెలిపాడు. అయితే పీటర్సన్ గత ఐపీఎల్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు. అయితే దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కాగా 104 టెస్టుల్లో 8,181 పరుగులు, 136 వన్డేల్లో 4,440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు చేశాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. (చదవండి: మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!) -
'పీటర్సన్.. రిటైర్మెంట్ తర్వాత వస్తా'
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఎంత ముందుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకుముందు కూడా కోహ్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేశాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆటకు కూడా విరామం దొరకడంతో కోహ్లి ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించాడు. తాజాగా వెయిట్‌లిప్టింగ్ చేస్తున్న వీడియో ఒకటి కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (కోహ్లితో పోల్చొద్దు: పాక్ కెప్టెన్ బాబర్) 'నేను రోజూ ఎక్సర్సైజ్లు చేయాలనుకున్నప్పుడు వెయిట్‌లిఫ్టింగ్ పుషప్ను తప్పకుండా ఉంచుకుంటా. ఎందుకంటే అది నా ఫేవరెట్. నాలో ఎంత పవర్ ఉందనేది బయటపెడుతుంది. అందుకే ఈ వర్కవుట్‌ను బాగా ఇష్టపడుతా' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ్‌ర్ కెవిన్ పీటర్సన్ కోహ్లిపై సరదాగా కామెంట్ చేశాడు. ' ఏయ్ కోహ్లి.. బైక్‌పై వచ్చేయ్.. ఇద్దరం కలిసి చేద్దాం' అంటూ పేర్కొన్నాడు. దీనికి కోహ్లి.. తప్పకుండా.. కానీ రిటైర్మెంట్ తర్వాత వస్తా అంటూ సరదాగా పేర్కొన్నాడు. -
ఛేజింగ్‌ల్లో సచిన్ కన్నా కోహ్లినే మిన్న
లండన్: లక్ష్య ఛేదనల విషయానికొస్తే భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లి తర్వాతేనని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి అసాధారణ రికార్డులతో పోలిస్తే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ప్రదర్శనలన్నీ తేలిపోతాయని పీటర్సన్ అన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ పోమీ ఎంబాగ్వాతో శనివారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన పీటర్సన్ ‘అత్యంత ఒత్తిడి అనుభవిస్తూ ఛేదనలో భారత్‌ను తరచుగా గెలిపించే కోహ్లి రికార్డు ముందు స్మిత్ దిగదుడుపే. స్మిత్ అతని దరిదాపుల్లోకి కూడా రాలేడు. మ్యాచ్ ఛేదనలో కోహ్లి సగటు 80. అతని వన్డే సెంచరీలన్నీ ఛేజింగ్‌లో వచ్చినవే. దీన్ని బట్టి చూస్తే నా దృష్టిలో సచిన్ కన్నా కూడా విరాటే ఉత్తమం. వ్యక్తిగత ప్రదర్శనల కన్నా దేశాన్ని గెలిపించడమే ముఖ్యం. నన్ను కూడా ఈ భావమే నడిపించేది. ఎన్ని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నామన్నది కాదు ఇంగ్లండ్‌ను ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిపించామన్నదే నాకు ముఖ్యం. భారత్ కోసం కోహ్లి కూడా ఇదే చేస్తున్నాడు. అతనో అసాధారణ క్రికెటర్’ అని పీటర్సన్ కొనియాడాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలో విరాట్ 50కి పైగా సగటును కలిగి ఉండగా... స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 62.74, వన్డేల్లో 42.46, టి20ల్లో 29.60 సగటుతో ఉన్నాడు. -
‘బుట్టబొమ్మ’కు పీటర్సన్ కూడా..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో’. తమన్ అందించిన స్వరాలు ఏ రేంజ్లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతీ పాట సోషల్ మీడియాలో ఓ సెన్సేషన క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలోని పాటల క్రేజ్ ఖండాతరాలు దాటింది. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ దంపతులు డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి డ్యాన్స్ టిక్‌టాక్‌లో తెగ హల్చల్ సృష్టించింది. తాజాగా ఇంగ్లండ్ మాజీ సారథి, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్‌కు కూడా ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు మంత్ర ముగ్దుడైనట్లు అనిపిస్తోంది. తాజాగా ఈ పాటకు పీటర్సన్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఈ పాటకు హుక్ స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ సాంగ్‌కు పీటర్సన్ చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక పీటర్సన్‌కు టిక్‌టాక్ వీడియోలు చేయడం కొత్తేం కాదు. ఇప్పటికే ఆయన చేసిన టిక్‌టాక్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. చదవండి: 'నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు' వార్నర్ నోట మహేశ్ పవర్ఫుల్ డైలాగ్ #ButtaBomma craze Crossed Continents This time famous X England cricketor #ButtaBomma FT.@KP24 😂😂@ArmaanMalik22 @MusicThaman @alluarjun @hegdepooja @AlwaysJani pic.twitter.com/Q2KAi7uxFI — Vamsidhar 🇮🇳 (@Vamsidhar467) May 11, 2020 -
'పీటర్సన్‌ను చూసి అసూయపడేవారు'
లండన్ : 2009 ఐపీఎల్ వేలం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ రూ. 9.8 కోట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే పెద్ద మొత్తంలో పీటర్సన్ అమ్ముడు పోవడంపై పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు అసూయ చెందారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు . స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్ మాట్లాడుతూ... 'నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఆ ఆటగాళ్లు ఒప్పుకోరు.. కానీ.. పీటర్సన్‌కు భారీ ధర దక్కినప్పుడు మాత్రం అసూయ చెందారనే పుకార్లు వినిపించాయి. గ్రేమ్ స్వాన్, టిమ్ బ్రెస్నన్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ , మాట్ ప్రియర్ లాంటి ఆటగాళ్లకు తక్కువ మొత్తంలోనే వేలంలో అమ్ముడుపోయారు. (టేబుల్ టెన్నిస్ ఇలా కూడా ఆడొచ్చా!) ఐపీఎల్లో ఆడటం వల్ల కెరీర్ చాలా స్పీడ్‌గా ఉంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.అయితే అతను డబ్బు కోసమే ఐపీఎల్ ఆడుతున్నట్లు ఇంగ్లండ్ ఆటగాళ్ళు భావించేవారు. ఐపీఎల్ ఆడితే ఆటను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని పీటర్సన్ చెప్పినా ఎవరూ వినలేదంటూ' మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు . 104 టెస్టుల్లో 8,181 పరుగులు, 136 వన్డేల్లో 4,440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు చేశాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాకా పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. (వైరల్ : నీ ఏకాగ్రతను మెచ్చుకోవాల్సిందే) -
పీటర్సన్ ఫేవరెట్ కెప్టెన్ ఎవరో తెలుసా?
మనం ఆడేది ఏ ఆటైనా సరే(కొన్నింటిని మినహాయిస్తే) అందులో కెప్టెన్ అనేవాడు తప్పకుండా ఉంటాడు. జట్టును ముందుండి నడిపిండమే గాక అవసరమైన సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. జట్టు గెలిచినా, ఓడినా మొదట అందరూ కెప్టెన్‌ను తిడుతారు. ఇక జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ విషయానికి వస్తే కెప్టెన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి హోదాను జట్టులోని ప్రతీఒక్కరు కావాలని కోరుకుంటారు. అయితే అది అందరికి దక్కదు.. ఒకవేళ దక్కినా దానిని నిలబెట్టుకోరు. కానీ కొందరికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే.(‘అక్కడ నువ్వెంత స్టార్ అనేది చూడరు’) 70వ దశకం నుంచి చూసుకుంటే విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ మొదలుకొని కపిల్‌దేవ్, ఇమ్రాన్ ఖాన్, స్టీవా, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలి, గ్రేమ్ స్మిత్ వరకు ఏదో ఒక దశలో తన ప్రాభల్యం ఘనంగానే చాటారు. అయితే వీరందరి కంటే తన ద్రుష్టిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యున్నత స్థానంలో ఉంటాడని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తెలిపాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పీటర్సన్ ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు సాధించిపెట్టిన ధోని అత్యున్నత కెప్టెన్‌గా నిలుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను ధోని కెప్టెన్సీని ప్రత్యక్షంగా ఎన్నోసార్లు చూశాను. మ్యాచ్ గెలిచే సమయంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న ప్రతీసారి మైదానంలో ధోని కూల్‌గా ఉంటాడు. అంత ఒత్తిడిలోనూ అతని తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు అనుకూలంగా మారాయి. అతని మనోదైర్యానికి, కెప్టెన్‌గా వ్యవహరించిన తీరుకు చాలా ముగ్దుడినయ్యా. నేను ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించా. కానీ అన్నిసార్లు నేను తీసుకున్న నిర్ణయాలు సఫలం కాలేదు. అందుకే అతన్ని అందరూ ముద్దుగా కూల్ కెప్టెన్ అని పిలుస్తుంటారు. ఇది నా అంచనా మాత్రమే.. కెప్టెన్లుగా సక్సెస్ చూసిన ఆటగాళ్ల గురించి నేను తక్కువ చేసి మాట్లాడడం లేదని' పీటర్సన్ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్లో ధోని కెప్టెన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను జట్టుకు అందించి తన పేరును మరింత సుస్థిరం చేసుకున్నాడు. అంతేగాక ధోని సారధ్యంలోనే టెస్టు క్రికెట్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ధోని టీమిండియాకు మొత్తం 60 టెస్టుల్లో నాయకత్వం వహించి 27 టెస్టుల్లో గెలిపించి గంగూలీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు సంపాధించాడు. ప్రస్తుతం అతని వారసత్వాన్ని అందుకున్న కోహ్లి జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ధోని కెప్టెన్‌గానే గాక బెస్ట్ ఫినిషర్ అనడంలో సందేహం అవసరం లేదు. జట్టు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి బరిలోకి దిగి ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలందించాడు. అందుకు 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చు. టీమిండియా కెప్టెన్‌గానే కాదు ఐపీఎల్‌లోనూ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ను మూడు సార్లు విజేతగా నిలిపి తన ప్రతిభేంటో చూపించాడు. అయితే 2019లో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం జట్టుకు దూరమైన ధోని అప్పటినుంచి ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. క్రికెట్ బతికున్నంతవరకు ధోని పేరు చిరస్థాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన కెరీర్లో 350 వన్డేలాడి 10773 పరుగులు, 90 టెస్టులాడి 4876 పరుగులు, 98 టీ20ల్లో 1627 పరుగులు చేశాడు. -
మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!
లండన్: ఇంగ్లండ్ క్రికెట్లో కెవిన్ పీటర్సన్ ఒక దిగ్గజ ఆటగాడైతే, గ్రేమ్ స్వాన్ కీలక స్పిన్నర్‌గా చాలాకాలం కొనసాగాడు. అయితే తామిద్దరం కలిసి ఆడిన సందర్భాల్లో ఒకరంటే ఒకరి ఇష్టం ఉండేది కాదని, తమ మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి స్నేహపూర్వక వాతావరణం ఉండేది కాదని అంటున్నాడు గ్రేమ్ స్వాన్. ఒకే జట్టులో ఉన్నా పీటర్సన్‌కు, తనకు పరస్పరం ఒకరంటే ఒకరికి పడేది కాదన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలుండేవనే విషయం క్రికెట్ ప్రేమికులందరికీ తెలుసన్నాడు. కాగా, పీటర్సన్ జట్టులో ఉండాలని తాను కోరుకునే వాడినని స్వాన్ పేర్కొన్నాడు. పీటర్సన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మితిమీరిన నిబంధనలను ఇష్టపడే వాడు కాదని స్వాన్ తెలిపాడు. (‘నాకు చెల్లి ఉంటే స్టోక్స్‌కి ఇచ్చి పెళ్లి చేసేవాడ్ని’) ‘జట్టులో పీటర్సన్ ఉండాలని నేను కోరుకునే వాడిని. ఎందుకంటే అతడు భారీ స్కోర్లు చేసేవాడు. బాగా ఆడేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో అతడు ఒకడు’అని స్వాన్ చెప్పాడు. కాకపోతే వ్యక్తిగతంగా మాత్రం ఒకరంటే ఒకరికి పడేది కాదన్నాడు. ఎందుకో పీటర్సన్ అంటే తనకు ఇష్టం ఉండేది కాదని, అలానే పీటర్సన్ కూడా తనతో సఖ్యతగా ఉండేవాడు కాదన్నాడు. 2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం తర్వాత పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2012లో అప్పటి కెప్టెన్స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్‌ను విమర్శిస్తూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పీటర్సన్ సందేశాలు పంపాడన్న ఆరోపణలు అతడిపై వేటు వేసేందుకు మరో కారణం. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా, 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. (‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’) -
‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’
సాక్షి, హైదరాబాద్ : కరోనో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్డౌన్ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రేమపక్షులు ఇప్పడు ఇంట్లోనే ఆనందంగా గడుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు. ఇక ఈ లాక్డౌన్ సమయంలో ఇంగ్లండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌తో కోహ్లికి మరింత బాండింగ్ ఏర్పడింది. తరుచూ ఇన్స్టాగ్రామ్ వీడియో కాలింగ్‌లో సరదాగా సంభాషించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు ముచ్చటించుకుంటూ.. ఇష్టమైన క్రికెట్ కామెంటేటర్(వ్యాఖ్యాత) ఎవరని టీమిండియా సారథిని కేపీ ఆడిగాడు. అయితే సమాధానం ఇవ్వడానికి కోహ్లి చాలా సమయమే తీసుకున్నాడు. ఇదే క్రమంలో దీనికి ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఇవ్వమని లేకుంటే ఇబ్బందుల్లో పడతావని హెచ్చరించాడు. ఈ గ్యాప్‌లో ఆలోచించిన కోహ్లి తనకు ఇష్టమైన వ్యాఖ్యాత ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ అని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యానం ఎందుకో నాకు బాగా నచ్చుతుందని, వివాదాల జోలికి వెళ్లకుండా చాలా సరదాగా మాట్లాడతాడని తెలిపాడు. చాలా తెలివిగా సమాధానం చెప్పావని కేపీ ప్రశంసించాడు. అదేవిధంగా లియన్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలలో రొనాల్డో తనకు ఎంతో ఇష్టమని మరో ప్రశ్నకు సమాధానంగా కోహ్లి పేర్కొన్నాడు. చదవండి: డివిలియర్స్‌ను స్లెడ్జింగ్ చేయలేదు! లాక్డౌన్: ‘ఖైదీననే భావన కలుగుతోంది’ -
షాట్ కొట్టి.. పరుగు కోసం ఏం చేశాడో తెలుసా!
లండన్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం దాదాపు లాక్డౌన్ అయిన నేపథ్యంలో అంతా తమ తమ ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక్కడ తమ అభిరుచులను ఏమాత్రం మిస్ కాకుండా లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్నారు. దీనిలో భాగంగా ఒక వ్యక్తి క్రికెట్‌ను ఎంజాయ్ చేసిన విధానం నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి లాక్డౌన్లో ఉన్న క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని తీసుకొచ్చాడు. ఇంతకీ ఏమిటంటే.. ఒక వ్యక్తి క్రికెట్ ప్రాక్టీస్‌ను ఇంట్లోనే మొదలుపెట్టేశాడు. క్రికెట్ మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్ధం అవుతామో.. అదే తరహాలో పూర్తి క్రికెట్ కిట్‌తో అంటే ఒంటి మీద క్రికెటర్లు వేసుకునే ప్రత్యేకమైన డ్రెస్స్, తలకు హెల్మెట్, చేతికి గ్లౌజ్ వేసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాడు. అది కూడా ఒక ఇరుకు సందులో షాట్ ఆడతాడు. అంతే వెంటనే పరుగు తీయడానికి మాత్రం పక్కనే ఉన్న ట్రెడ్మిల్ ఎక్కేస్తాడు. ఇది చూస్తే ఇలా కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేయొచ్చా అనిపిస్తోంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పీటర్సన్ పోస్ట్ చేసిన ఈ తాజా వీడియో మాత్రం ఫన్నీగా ఉంది. (డివిలియర్స్‌ను స్లెడ్జింగ్ చేయలేదు!) View this post on Instagram Whoever this is...GENIUS! Just been sent it on WhatsApp...🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 A post shared by Kevin Pietersen (@kp24) on Apr 4, 2020 at 1:21am PDT -
డివిలియర్స్‌ను స్లెడ్జింగ్ చేయలేదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి లాక్డౌన్ కారణంగా దొరికిన సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. దేశవ్యాప్త కర్ఫ్యూ ప్రకటించడానికి కాస్త ముందుగా అతను, తన భార్యతో కలిసి ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇన్స్ట్రగామ్’లో కోహ్లికి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కేపీ అడిగిన ప్రశ్నలకు కోహ్లి జవాబులిచ్చాడు. కొన్ని విశేషాలు విరాట్ మాటల్లోనే... ► నేను, అనుష్క ఒకే చోట ఇంత సమయం ఎప్పుడూ గడపలేదు. అయితే మనం ఏమీ చేయలేం. అంతా బాగుంటే ఈ సమయానికి చిన్నస్వామి స్టేడియంలో ఉండేవాడిని. ► ఒక్క సారి కూడా బెంగళూరు ఐపీఎల్ గెలవలేకపోవడం నిరాశ కలిగించేదే. పెద్ద స్టార్లు ఉండటంతో అందరి దృష్టి జట్టుపైనే ఉండేది. 3 సార్లు ఫైనల్, 3 సార్లు సెమీస్ చేరినా టైటిల్ గెలవకపోతే వీటికి అర్థం లేదు. అత్యుత్తమ జట్టుతో కూడా టైటిల్ సాధ్యం కాలేదు. మేం ఎంత గెలిచేందుకు ప్రయత్నిస్తే అది అంత దూరమైనట్లు అనిపించింది. ► భారత్ తరఫున ధోనితో, ఐపీఎల్లో డివిలియర్స్‌తో జోడిగా మైదానంలో ఆడటాన్ని బాగా ఇష్టపడతా. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉ న్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపిం చలేను. డివిలియర్స్ అలాంటి వాడే. అతనితో నా స్నేహం ఎంతో ప్రత్యేకం. కాబట్టి నా కెరీర్ లో ఎప్పుడూ అతడిని స్లెడ్జింగ్ చేయలేదు. అసలు కళ్లలో కళ్లు పెట్టి నేరుగా చూడలేదు. ► 2014 ఇంగ్లండ్ పర్యటన నా కెరీర్లో చేదు జ్ఞాపకం. బాగా ఆడాలని ఎంతగా ప్రయత్నించినా ఘోరంగా విఫలమయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే జట్టు కోసం కాకుండా వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి పెట్టి తప్పు చేశా. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో బాగా ఆడితే నాకు పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చేస్తాయని భావించడంతోనే సమస్య వచ్చింది. ► 2018 ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు శాకాహారిగా మారాను. అంతకు ముందు దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో నా మెడ భాగంలో వెన్నుముక సమస్యలతో తీవ్రంగా బాధపడ్డా. రాత్రి పడుకోలేకపోయేవాడిని. నా శరీరం ఎక్కువ మొత్తంలో యూరిక్ ఆసిడ్ విడుదల చేసేది. దాంతో అప్పటికప్పుడు మాంసాహారం మానేసేందుకు సిద్ధమయ్యా. ► 2008లో ఒక సారి గోల్ఫ్ ఆడాను. చక్కటి స్టాన్స్‌తో కవర్ మీదుగా సూపర్ షాట్ ఆడాను. డివిలియర్స్ నా వద్దకు వచ్చి బంతి నువ్వే తెచ్చుకోవాలని చెప్పాడు. అంతే...నేను మళ్లీ ఈ ఆట ఆడనని చెప్పేశా. చివరకు ఈ చర్చలో మధ్యలోకి వచ్చిన అనుష్క శర్మ ‘ఇక చాలు... డిన్నర్ టైమ్ అయింది’ అంటూ పోస్ట్ పెట్టడంతో పీటర్సన్ ఈ ఇంటర్వ్యూను ముగించాడు. -
మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికిన సంగతి తెలిసిందే. వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని కోరారు. దీనిలో భాగంగా ఆదివారం(మార్చి 22) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. దీనిలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’కు అందరూ సహకరించాలని కోరారు. దీనిపై పలువురు క్రికెటర్లు స్పందించారు. మోదీ పిలుపుతో కరోనా వైరస్‌పై పోరాటం చేద్దామని మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా గళం కలిపాడు. ‘నమస్తే ఇండియా.. అంతా ఒక్కటై కరోనాపై పోరాటం చేద్దాం. ఇంట్లో ఉండి స్వీయ నిర్భందం పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటిద్దాం’ అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా మోదీ స్పందించారు. ‘ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొని ఎన్నో జట్లను చూసిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ పీటర్సన్.. మనకోసం స్పందించాడు. మనమంతా కోవిడ్-19పై పోరాటం చేద్దాం’ అని మోదీ జవాబిచ్చారు. మీ నాయకత్వం కూడా విధ్వంసమే కదా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు పీటర్సన్ తిరిగి బదులిచ్చాడు. ‘థాంక్యూ మోదీ జీ.. మీ నాయకత్వం కూడా విధ్వంసమే కదా’ అని హిందీలో ట్వీట్ చేశాడు. తొలుత ట్వీట్ చేసిన కూడా పీటర్సన్ హిందీలోనే పోస్ట్ చేయగా, ఆ తర్వాత కూడా హిందీలోనే రిప్లే ఇవ్వడం విశేషం. కాగా, ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ అయిన పీటర్సన్‌కు మోదీ ఇంగ్లిష్‌లో ట్వీట్ చేస్తే, పీటర్సన్ మాత్రం హిందీలోనే అందుకు సమాధానం చెప్పడం ఆసక్తిగా మారింది. (మహ్మద్ కైఫ్ ట్వీట్‌పై మోదీ ఇలా..) Shukriya Modi ji , aapki leadership bhi kaafi bispotak hai 🙏🏻 — Kevin Pietersen🦏 (@KP24) March 20, 2020 -
'కోహ్లి నా దగ్గర సలహాలు తీసుకునేవాడు'
లండన్ : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లి ఎంతో గొప్ప ఆటగాడిగా తయారవుతాడనేది తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నాడు. 2009లో జరిగిన ఐపీఎల్ 2వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు కెవిన్ పీటర్సన్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు టీంలో యంగ్ప్లేయర్స్గా ఉన్న ఆటగాళ్లలో కోహ్లి ఒకడిగా ఉన్నాడు. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) పీటర్సన్ మాట్లాడుతూ.. '2009 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. మ్యాచ్‌లు ఆడడానికి బస్సులో వెళ్లే సమయంలో, అలాగే ప్రాక్టీస్ సమయంలోనూ నా దగ్గర ఎన్నో బ్యాటింగ్ సలహాలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతను ఆటను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఒక ఉత్తమ ఆటగానిగా తయారవ్వాలనే సంకల్పమే కోహ్లిని ఈరోజు ఉన్నత స్థానంలో నిలబెట్టింది. 2009 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి నన్ను రనౌట్ చేశాడు. కానీ నేను ఏమి అనకుండా మైదానంలో అతన్ని స్వేచ్చగా వదిలిపెట్టాను. ఒక యంగ్ ప్లేయర్‌గా జట్టును గెలిపించాలనే భావంతో మ్యాచ్ చివరి వరకు తన వికెట్ ఇవ్వకుండా జట్టును గెలిపించాడు. తన కంటే ఎంతో సీనియర్ ఆటగాడిగా ఆ సమయంలో అతన్ని ఏమి అనలేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. అప్పట్లో కోహ్లిని ఒక యంగ్ ప్లేయర్‌గా చూస్తూనే అతని కెరీర్ ఆరంభంలో నా వంతుగా సలహాలు, సూచనలు చేశాను. ఇప్పటికి మా మధ్య నమ్మకమైన స్నేహం మాత్రమే ఉంటుందని నేను నమ్ముతున్నా' అంటూ తెలిపాడు. ('ప్రపంచకప్ గెలిచే సత్తా ఆ మూడు జట్లకే ఉంది') ఇక విరాట్ కోహ్లి విషయానికి వస్తే 2011 నుంచి ఐపీఎల్లో ఆర్సీబీకి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కెరీర్లో అత్యదిక పరుగులు చేసిన రికార్డుతో పాటు ఐపీఎల్లో ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగానిగా గుర్తింపు పొందాడు. కాగా మొదటి స్థానంలో ఆరు సెంచరీలతో విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. కాగా కరోనా ప్రభావంతో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలా వద్దా అనేదానిపై మార్యి 14(శనివారం) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. (ట్రంప్‌ను ట్రోల్ చేసిన పీటర్సన్, ఐసీసీ) -
ట్రంప్‌ను ట్రోల్ చేసిన పీటర్సన్, ఐసీసీ
హైదరాబాద్: రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అహ్మదాబాద్‌లోని కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో భారతీయ పేర్లు, పండగలు, సినిమాల గురించి ప్రస్తావించారు. అయితే ఆ పేర్లను పలకడంలో తడబడ్డారు. ఈ క్రమంలో చాయ్ వాలాను చీవాలా అని, వేదాలను వేస్టాస్ అని, స్వామి వివేకానంద పేరును వివేకముందగా అని పేర్కొన్నారు. అదేవిధంగా భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల గురించి ప్రస్తావించారు. అయితే వారి పేర్లను ఉచ్చరించడంలో ట్రంప్ విఫలమయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ట్రంప్ నోటి నుంచి టీమిండియా దిగ్గజాల పేర్లు రావడం పట్ల పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరి పేర్లను సుచిన్ టెండూల్కర్, విరాట్ కోలీ అని ఉచ్చరించడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ కూడా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. లెజెండ్స్ పేర్లను పలికేముందు ట్రంప్ తగిన రీసెర్స్ చేయాలని ట్రంప్‌కు పీటర్సన్ సూచించాడు. ఐసీసీ కూడా ట్రంప్‌ను ట్రోల్ చేసింది. ‘sach, such, satch, sutch, sooch లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా?’అని అభిమానులను ఐసీసీ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. FFS, @piersmorgan, pls ask your mate to do some research in pronouncing legends names?! https://t.co/eUGuCNReaM — Kevin Pietersen🦏 (@KP24) February 24, 2020 Sach- Such- Satch- Sutch- Sooch- Anyone know? pic.twitter.com/nkD1ynQXmF — ICC (@ICC) February 24, 2020 చదవండి: తెల్లని దుస్తుల్లో రాజహంసలా.. ట్రంప్‌తో తేల్చుకోవాల్సినవి... హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా -
‘గెలవాలనుకుంటే ఆ ఇదర్దిలో ఒకర్ని తీసేయండి’
కేప్‌టౌన్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్ జట్టు.. రెండో టెస్టులో విజయం సాధించాలంటే ఒక పని చేయాలని ఆ దేశ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సూచించాడు. ప్రధానంగా ఇంగ్లండ్ తొలి టెస్టులో ఓటమికి పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లను తుది జట్టులో తీసుకోవడమే కారణమన్నాడు. ప్రతీ టెస్టులో వారిద్దరికీ కచ్చితంగా చోటు కల్పించాలనే యోచన మంచిది కాదన్నాడు. ఈ కారణంగానే సఫారీలతో తొలి టెస్టును కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఇక రెండో టెస్టులో ఇంగ్లండ్ గెలవాలంటే ఆ ఇద్దరిలో ఒకర్ని పక్కకు పెట్టాల్సి ఉందన్నాడు. ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఎటాక్ బాగానే ఉండటంతో అండర్సన్, బ్రాడ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలన్నాడు. అప్పుడు మరొక నాణ్యమైన స్పిన్నర్‌ను జట్టులో తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నాడు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ క్రిస్ సిల్వర్‌వుడ్ సైతం పేర్కొన్నాడు. రెండో టెస్టులో బ్రాడ్-అండర్సన్‌లలో ఒకరికి విశ్రాంతి ఇస్తామన్నాడు. దాంతో స్పిన్నర్ జాక్ లీచ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో లీచ్ తుది జట్టులో ఆడటం దాదాపు ఖాయమైంది. కాకపోతే రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ ఆడటం అనుమానంగా ఉంది. ఒకవేళ ఆర్చర్ ఆడకపోతే అండర్సన్-బ్రాడ్‌లను యథావిధిగా తుది జట్టులో కొనసాగించవచ్చు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కావడంతో జట్టు ఓటమిపై తీవ్ర ప్రభావం చూపింది. -
‘దశాబ్దపు ఫొటో’పై పీటర్సన్ కామెంట్
న్యూఢిల్లీ: ఇటీవల విఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ విజ్డెన్ ప్రకటించిన ఈ దశాబ్దపు టెస్టు కెప్టెన్‌గా టీమిండియా పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి ఎంపిక కాగా, తాజాగా విడుదల చేసిన తమ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నాడు. కాగా, ఐదు మందితో కూడిన ఈ జాబితాలో కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్‌లకు కూడా విజ్డెన్ దశాబ్దపు క్రికెటర్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇక ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్ చోటు దక్కించుకోగా, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఎలెసీ పెర్రీ కూడా స్థానం దక్కింది. ఇదిలా ఉంచితే, ఈ దశాబ్దపు పాత-కొత్త ఫొటోను కోహ్లి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన టీనేజ్‌లో ఉన్నప్పుడు ఫొటోకు ప్రస్తుతం ఉన్న ఫొటోను జత చేశాడు కోహ్లి. అయితే తన పాత ఫొటోపై ఇది తానేనా అన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్న ఫొటోను జత చేయడమే కాకుండా ఒక కామెంట్ కూడా చేశాడు. ‘ క్రమేపీ పరివర్తన చెందడంపై ఇది నా రియాక్షన్. నా నిలకడైన క్లియర్ కట్ ఫెర్ఫార్మెన్స్‌కు ఇక్కడ ఫిలిప్స్ ట్రిమ్మర్‌కు థాంక్స్’ అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్పందించాడు. ‘ ఆ ఎడమవైపును కుర్రాడు ఎవరో నాకు గుర్తుంది’ అంటూ చమత్కరించాడు. ఈ దశాబ్దంలో తన సమకాలీన క్రికెటర్ల కంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాతో పాటు అత్యధిక సెంచరీల చేసిన లిస్ట్‌లో కూడా కోహ్లినే టాప్‌లో ఉన్నాడు. ఇక్కడ తన సమీప క్రికెటర్ కంటే కోహ్లి అత్యధికంగా 5,775 అంతర్జాతీయ పరుగులు చేయగా, ఇక సెంచరీల్లో 22 అధికంగా చేశాడు. మరొకవైపు 2010 నుంచి చూస్తే కోహ్లి 20,964 పరుగులు సాధించాడు. అదే సమయంలో క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మట్లలో యాభైకి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ఆటగాడిగా కోహ్లి అరుదైన రికార్డును లిఖించాడు. ఇప్పటివరకూ కోహ్లి వన్డేల్లో 11, 609 పరుగులు చేయగా, టెస్టుల్లో 7,202 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో 2,633 పరుగులు సాధించాడు. -
అయ్యర్‌కు పీటర్సన్ చిన్న సలహా!
ముంబై : టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్స్‌న్ పలు సూచనలిచ్చాడు. టీమిండియాకు గత కొంత కాలంగా బ్యాటింగ్‌లో నాలుగో స్థానం ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినా ఫలితం దక్కలేదన్నాడు. అయితే నాలుగో స్థానానికి అయ్యర్ సరిగ్గా ఒదిగిపోతాడని పీటరన్స్ అభిప్రాయపడ్డాడు. అయితే అయ్యర్ బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిదిద్దుకోవాలని సూచించాడు. ఈ యువ క్రికెటర్ ముఖ్యంగా ఆఫ్ సైడ్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలన్నాడు. దీనికోసం నెట్స్‌లో ఎక్కువసేపు శ్రమించాలన్నాడు. నెట్స్‌లో ప్రత్యేకంగా ఓ బౌలర్‌చే ఆఫ్ స్టంప్ బంతులు వేయించుకొని ప్రాక్టీస్ చేయాలన్నాడు. అదేవిధంగా ఎక్స్ట్రా కవర్ షాట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పీటర్సన్ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో అయ్యర్(33 బంతుల్లో 62) అద్భుతంగా ఆడాడని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్యణ్ కొనియాడాడు. ఆ మ్యాచ్‌లో ఈ యంగ్ క్రికెటర్ రాణించడంతోనే టీమిండియా సులువుగా గెలిచిందని అభిప్రాయపడ్డాడు. అయ్యర్ ఎంతో ప్రతిభావంతుడని, భవిష్యత్‌లో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిని రెండు టీ20ల్లో అయ్యర్ అంతగా రాణించనప్పటికీ ముంబై వేదికగా జరిగే నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక తిరువనంతపురం వేదికగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 బుధవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. -
హేయ్ పీటర్సన్.. సైలెంట్ అయ్యావే?: యువీ
న్యూఢిల్లీ: ‘హేయ్ పీటర్సన్.. సైలెంట్‌గా ఉన్నావేంటి. అంతా ఓకేనా?’ అంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ కోసం కాదు.. ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం పీటర్సన్‌కు ఇలా చురకలంటించాడు యువీ. ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్- చెల్సీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 4-0 తేడాతో చెల్సీపై విజయం సాధించింది. దాంతో మాంచెస్టర్ జట్టుకు వీరాభిమాని అయిన యువీ చెల్సీ జట్టుకు అభిమాని అయిన కెవిన్ పీటర్సన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఇందుకు నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. ఫుట్‌బాల్ విషయంలో వీరిద్దరూ గతంలోనూ ట్విటర్లో మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టును ఉద్దేశించి పీటర్సన్ చేసిన ట్వీట్‌కు యువీ దీటుగానే స్పందించాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొన్నాడు. టోరంటో నేషనల్స్ జట్టుకు యువీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెనడా లీగ్‌లో యువీ మెరుపులు మెరిపించి తన పాత ఆటను గుర్తు చేశాడు. Hey mr @KP24 very quiet today all ok 😄 @ManUtd — yuvraj singh (@YUVSTRONG12) August 12, 2019 -
ఆ రెండు జట్లే ఫైనల్లో తలపడేవి: పీటర్సన్
మాంచెస్టర్: వరల్డ్‌కప్ సెమీస్ సమరానికి ముందు అటు క్రికెటర్లు, ఇటు విశ్లేషకుల అంచనాలు జోరందుకున్నాయి. భారత్-ఇంగ్లండ్ జట్లు వరల్డ్‌కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయని ఇప్పటికే దక్షిణాఫ్రకా సారథి డుప్లెసిస్ జోస్యం చెప్పగా, అదే అభిప్రాయాన్ని తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వ్యక్తం చేశాడు. తన అంచనా ప్రకారం భారత్-ఇంగ్లండ్ జట్లే టైటిల్ వేటలో పోటీ పడతాయని స్పష్టం చేశాడు. తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలవడం ఖాయమని, అదే సమయంలో రెండో సెమీస్‌లో ఆసీస్‌ను ఇంగ్లండ్ చిత్తు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం ‘హోమ్ ఆఫ్ ద క్రికెట్’ లార్డ్స్ మైదానంలో జరుగనున్న మెగా సమరంలో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటాయని పేర్కొన్నాడు. మొదట్నుంచీ భారత్ పైనల్‌కు చేరుతుందంటూ చెబుతున్న పీటర్సన్..అదే అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశాడు. టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశలో ఇంగ్లండ్‌పై మాత్రమే ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టినప్పటికీ తర్వాత పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోయి 11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. కాగా, దక్షిణాఫ్రికాపై ఓడిపోయి ఆస్ట్రేలియా అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి దిగజారింది. -
హా..! భారీ పాముతో బుడ్డోడి గేమ్స్.. క్రికెటర్ ఫిదా
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (కేపీ) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటాడు. తన సోషల్ మీడియా ఖాతాలో ఒకింత వికృతంగా ఉండే ఫన్నీ వీడియోలు పెడుతుంటాడు. తాజాగా కేపీ ఓ విచిత్రమైన వీడియో షేర్ చేశాడు. అత్యంత భారీ పాముతో ఏమాత్రం బెరుకు, భయపడకుండా ఆడుతున్న బుడ్డోడి వీడియోను కేపీ షేర్ చేశాడు. చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న పాముతో బుడ్డుడు ఆటలు ఆడటమే కాదు.. దాని మెడ పట్టుకొని ఎత్తుకునేందుకు ప్రయత్నించడం.. ఆ పాము మీద కూచొని.. అది కదులుతుంటే.. ఎంజాయ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.‘వాట్ ఆన్ ఎర్త్’ అంటూ కేపీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఇంగ్లండ్ Vs పాకిస్తాన్: పీటర్సన్ Vs అక్తర్
లండన్ : ప్రపంచకప్ 2019లో భాగంగా నేడు (సోమవారం) ఆతిథ్య ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సోమవారం సాయంత్రం ఉన్నప్పటీకీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మధ్య మాత్రం అప్పుడే ప్రారంభమైంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ల మధ్య ట్విటర్ వేదికగా మాటలయుద్దం జరుగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో కంగుతిన్న పాక్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని ఆ దేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్తర్ తమ ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా ఉండేలా ఓ ట్వీట్ చేశాడు. దానికి కెవిన్ పీటర్సన్‌ను ఔట్ చేసిన ఆనందంలో ఉన్న తన పాత ఫొటోను జత చేశాడు. పైగా దీనికి ‘ మీ జట్టుకు మీరు ప్రాతినిథ్యం వహించాలంటే రక్తం, చెమట, దూకుడు, గుండే వేగంగా కొట్టుకోవడం వంటివి ఉండాలి. ఇవే మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాయి. వెళ్లండి గట్టిపోటీనివ్వండి’ అంటూ ట్వీట్ చేశాడు. Blood, sweat, aggression, racing heartbeat, badmaashi. This is whats required when you represent your country. This star on your chest is your pride guys. Tagra khelo. Go get them. Larr jao. #Pakistan #PakvsEng #cwc2019 pic.twitter.com/b9JnTmBKOp — Shoaib Akhtar (@shoaib100mph) June 1, 2019 Love ya buddy! 👍🏻 — Kevin Pietersen🦏 (@KP24) June 2, 2019 ఇక ఈ ట్వీట్లో తన ఫొటో ప్రస్తావించడంతో కెవిన్ పీటర్సన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘నేను నీ ట్వీట్‌తో వాదించదల్చుకోలేదు బడ్డీ. నేనే నీ బౌలింగ్‌లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలానే సంబరాలు చేసుకుంటావు కదా! గొప్ప పిచ్చి’ అంటూ అక్తర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. దీనికి అక్తర్ కూడా బదులిచ్చాడు. ‘నా సహచరుడా నీవు నా బౌలింగ్‌లో ఔటైనప్పుడు నేను చేసే కోడి డ్యాన్స్ నీకు ఇష్టం కదా’ అని ట్వీట్ చేశాడు. అవును ఇష్టమే బడ్డీ అని పీటర్సన్ అనగా.. ‘నీ ఇష్టాన్ని నీ శైలిలో పంపించు’ అని అక్తర్ కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వార్ నెట్టింట హల్చల్ చేస్తోంది. క్రికెట్‌కు దూరమైనప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల పాక్ ఘోరపరాజయాన్ని తట్టుకోలేని అక్తర్.. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కొవ్వు ఎక్కువైందని ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
పీటర్సన్ ‘గల్లీ క్రికెట్’
బెంగళూరు: ఇంగ్లండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ బెంగళూరు వీధుల్లో సందడి చేశారు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ఈ స్టార్ బ్యాట్స్‌మన్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా భారత్‌లో అన్ని నగరాలను పర్యటిస్తున్నాడు. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంకు వెళ్తుండగా.. మార్గ మధ్యలో గల్లీలో పిల్లలు క్రికెట్ ఆడుతున్న విషయాన్ని గమనించాడు. దీంతో వెంటనే కార్ దిగి గల్లీ క్రికెటర్లతో కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశాడు. గల్లీ క్రికెట్ ఆడుతున్న వీడియోను పీటర్సన్ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ‘ఇండియాలో ఎప్పటినుంచో గల్లీ క్రికెట్ ఆడాలనే కోరిక ఉండేది. అది ఈ రోజు తీరింది. మ్యాచ్‌కు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన కొందరు పిల్లలు క్రికెట్ ఆడటం చూశాను. వెంటనే కారు ఆపి వారితో క్రికెట్ ఆడాను. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా అభి అనే పిల్లవాడి బౌలింగ్ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిలో మంచి టాలెంట్ ఉంది’అంటూ పీటర్సన్ పేర్కొన్నాడు. గతంలో ఆర్సీబీకి పీటర్సన్ సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
పీటర్సన్ పిచ్చి వ్యాఖ్యలు.. మండిపడ్డ అభిమానులు
నార్త్‌సౌండ్: వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్ దారుణ పరాభావాన్ని వెనక్కేసుకొచ్చిన ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్లతో తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. అయితే ఈ ఓటమిని సమర్ధిస్తూ... ‘గుర్తుపెట్టుకోండి.. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్‌కు టెస్ట్ క్రికెట్ అంత ప్రాధాన్యత కాదు. వారి లక్ష్యమంతా వన్డే ప్రపంచకప్ గెలవడమే.. దానిపైనే వారు కసరత్తులు చేస్తున్నారు’ అని ట్వీటర్ వేదికగా తమ ఆటగాళ్లను పీటర్సన్ వెనకేసుకొచ్చాడు. అయితే ఆటగాళ్లకు మద్దతుగా నిలిస్తే తప్పేం లేదు కానీ.. ఇక్కడ టెస్ట్ ఫార్మాట్‌నే తక్కువ చేసేలా స్టేట్మెంట్ ఇవ్వడం.. అభిమానులకు ఎక్కడ లేని ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా పీటర్సన్‌ను రోస్ట్ చేస్తున్నారు. ‘ఇదో పిచ్చి స్టేట్మెంట్.. ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఓడిపోతుంది. అప్పుడు తెలుస్తోంది నొప్పంటే ఎంటో.. ప్రపంచకప్ లీగ్ దశ నుంచే నిష్క్రమిస్తోంది’ అని ఒకరు.. ‘ఇలాంటి వ్యాఖ్యలతో ప్రపంచ క్రికెట్ పరిస్థితి ఎంటో అర్థమవుతోంది’ అని మరొకరు.. ‘90ల్లో టెస్ట్ ఫార్మాట్లో నెం.1గా ఉన్న ఆసీస్ ప్రపంచకప్‌లు గెలువలేదా? ఇంగ్లండ్ రెండు ఫార్మాట్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.. పీటర్సన్ నుంచి ఓ పిచ్చి వ్యాఖ్య’ అని ఇంకొకరు మండిపడ్డారు. విండీస్‌తో తొలి టెస్ట్‌లో 381 పరుగులతో ఇంగ్లండ్ దారుణ పరాభావాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. 2009 తర్వాత ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. మూడో టెస్టు ఈ నెల 9నుంచి గ్రాస్ ఐలెట్‌లో జరుగుతుంది. Remember - Tests weren’t a priority during this cycle for England Cricket. Their target was to win this years 50 over WC. They’re still on course. — Kevin Pietersen🦏 (@KP24) February 2, 2019 Haha.. bizarre statement.. next is losing Ashes to Aus to give u more pain and WC exit in knockouts — Gagandeep anand 🇮🇳🇮🇳 (@AnandGagandeep) February 3, 2019 The Aussies were No. 1 test team in 90’s while winning World Cups - England should be able to do both too. Ridiculous comment KP. — Gorseinon CC (@GorseinonCC) February 2, 2019 -
‘కోహ్లి తప్పితే ఇంకెవరూ లేరు’
లండన్: క్రీడలు అంటేనే వినోదం. అందులోనూ క్రికెట్లో ఎంటర్టైన్మెంట్ కాస్త ఎక్కువనే చెప్పాలి. అయితే దీనిపై ఆందోళన వ్యక్తం చేశాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. ప్రస్తుత క్రికెట్ శకంలో వినోదాన్ని పంచే క్రికెటర్లే కరువైపోయారంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తనను ఎక్కువగా కలవర పరుస్తుందన్నాడు. అసలు సిసలైన ఆట క్రికెటర్లలో కనిపించడం లేదని పెదవి విరిచాడు. కాకపోతే ఇక్కడ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మినహాయింపు ఇచ్చాడు. ‘ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లిని మినహాయిస్తే క్రికెట్లో నిజమైన వినోదాన్ని పంచేవారు కానీ, సూపర్ స్టార్లు కానీ కనిపించడమే లేదు. ఈ విషయం నన్ను ఆందోళన పరుస్తోంది. ఒకప్పటి సూపర్ స్టార్లు ముత్తయ్య మురళీధరన్, ఆంబ్రోస్, వాల్ష్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ ఫ్లింటాఫ్, వసీమ్ అక్రమ్‌లు అత్యంత వినోదాన్ని అందించిన క్రికెటర్లు. ఇప్పుడు ఆ తరహా ఆట కనిపించడం లేదు’ అని బీబీసీ రేడియోతో మాట్లాడిన పీటర్సన్ పేర్కొన్నాడు. -
నా ప్రియ నేస్తానికి ఈ సెంచరీ అంకితం : రోహిత్
బ్రిస్టన్: టీ20 సిరీస్ గెలుపుతో టీమిండియా సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో మంచి శుభారంభం చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఓపెనర్ రోహిత శర్మ ఆ సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్ శర్మ కూడా ఒకడు. సోమవారం ట్విటర్లో ‘ నిన్నటి నా సెంచరీని చనిపోయిన నా ప్రియ నేస్తం సూడాన్‌కు అంకితమిస్తున్నాను. మనమంతా మంచి జీవనానికి ఓ మార్గం కనుగోవాలనేమో’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఇది తెగ వైరల్ అయింది. ఈ అరుదైన రైనో మరణంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సైతం అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మనమంతా సూడాన్ రక్షించడంలో విఫలమయ్యాం. జంతు ప్రేమికులారా ఇప్పటికైనా మేల్కొనండి, రైనోస్ అన్నిటిని రక్షిద్దాం.’ అని పిలుపునిచ్చాడు. శతకంతో ఆకట్టుకున్న రోహిత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ జూలై 12న ప్రారంభం కానుంది. Yesterday’s innings is dedicated to my fallen friend Sudan 🦏 May we find a way to make this world a better place for all of us. pic.twitter.com/wayEjDlUyA — Rohit Sharma (@ImRo45) July 9, 2018 -
‘ఇంగ్లండ్ క్రికెట్ పయనం అర్థం కావడం లేదు’
లండన్: వన్డేలపైనే పూర్తిగా దృష్టిసారిస్తూ.. టెస్టు క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తు న్నదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ విమర్శలు గుప్పించాడు. రెండేళ్లుగా వన్డేల్లో మెరుగ్గా రాణిస్తున్న ఇంగ్లండ్.. యాషెస్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లను చేజార్చుకుంది. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండుటెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ పయనం తనకు అర్థం కావడంలేదన్న పీటర్సన్.. వరల్డ్‌కప్ కోసం టెస్టులను పణంగా పెడుతున్నారన్నాడు. ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదన్నాడు. అసలు వారు ఏ మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతున్నారో తనకు బోధ పడటం లేదన్నాడు. -
కెవిన్ పీటర్సన్ ట్వీట్.. భారతీయులు ఫిదా!
సాక్షి వెబ్‌డెస్క్: అచ్చమైన మాతృభాషలో మాట్లాడటం.. రాయడం కూడా ఇప్పుడు కష్టమైపోతోంది. భారతీయ భాషలన్నింటిలోనూ ఆంగ్ల పదాలు చొచ్చుకుపోయాయి. రోజువారీ జనజీవితంలో భాగమైపోయాయి. ప్రస్తుతం ఫోర్జీ స్పీడ్ యుగంలో పరభాష పదం లేకుండా మాట్లాడటం, రాయడం అంటే కష్టమేనేమో. కానీ ఒక పరదేశీయుడు స్వచ్ఛమైన మన భాషలో రాస్తే.. ఒక్క ఆంగ్ల పదాన్ని ఉపయోగించకపోతే.. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హిందీలో చేసిన ట్వీట్‌పై.. ఇలాగే ఆశ్చర్యపోతున్నారు మన నెటిజన్లు. కెవిన్ ఎంత స్వచ్ఛమైన హిందీలో ట్వీట్ చేశారని మురిసిపోతున్నారు. మనం కూడా హిందీలో ఇంత చక్కగా రాయలేమోనని ఉత్తరాది నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. కజిరంగా జాతీయ పార్కులో రైనోల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం తనకు ఆనందం కలిగిస్తోందని, భారతీయులు అన్నా, భారత్‌లోని జంతుజాలమన్నా తనకు ఎంతో ఇష్టమని కెవిన్ స్వచ్ఛమైన హిందీలో ట్వీట్ చేశాడు. అతని ట్వీట్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 3వేలమంది రీట్వీట్ చేశారు. 12వేలమందికిపైగా లైక్ చేశారు. భారతీయులు కూడా ఇలా ఒక్క ఆంగ్ల పదం లేకుండా రాయలేరని, మన కన్నా కెవిన్ బెటర్ అని నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. Yeh bohut achi Khabar hai, isse Padne ke liye mein bohut Khush hoon, india mein appse bohut pyar karta hoon aur aapke jaanwaro se bhi bohut pyar karta hoon. @sorai2018 aapke sabhi pyaare jaanwaro se pratibrad hai. Hum rhinos se suruwatt kar rahe hai. Mein bohut khush hoon. ❤️ pic.twitter.com/VUDlaJja0s — Kevin Pietersen (@KP24) 2 April 2018 to be honest. No indian would speak hindi like this. He would definitely use a english word in btwn. Damn u are bettr than us😂😂 — Utkarsh (@utkarshnigam76) 2 April 2018 😱 OMG Hindi me tweet kia apne Thnx @KP24 💪💪👏👏👏👏👏😘😘😘♥️♥️♥️♥️ — Mo Sohel🐦 (@_imsohel) 2 April 2018 Hey Kevin who is your Hindi Tutor😉?Anyways doing good job.All the best — Rahul Dravid (@rahulthewall00) 2 April 2018 -
హిందీలో ఇంగ్లండ్ క్రికెటర్ హార్ట్‌టచింగ్ ట్వీట్
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హిందీలో చేసిన ఓ ట్వీట్ అందరి మనసులను కదిలిస్తోంది. అసోం కజిరంగా నేషనల్ పార్క్ ప్రకటించిన జంతువుల లెక్కల్లో ఖడ్గమృగాల (రైనోస్) సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని అందరూ ఆహ్వానించగా.. జంతు ప్రేమికుడైన పీటర్సన్ వాటి సంఖ్య పెరగడంపై సంతోషం వ్యక్తం చేస్తూ హిందీలో ట్వీట్ చేశాడు. ‘చాలా మంచి వార్త విన్నాను. దీంతో చాలా సంతోషపడ్డా. భారత్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రైనోస్ సంఖ్య పెరగడం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ హిందీ ట్వీట్ విషయంలో అతనికి ఎవరు సహకరించారో తెలియరాలేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అనంతరం పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు ఆడిన పీటర్సన్ 2010 టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ రికార్డు నమోదు చేశాడు. Yeh bohut achi Khabar hai, isse Padne ke liye mein bohut Khush hoon, india mein appse bohut pyar karta hoon aur aapke jaanwaro se bhi bohut pyar karta hoon. @sorai2018 aapke sabhi pyaare jaanwaro se pratibrad hai. Hum rhinos se suruwatt kar rahe hai. Mein bohut khush hoon. ❤️ pic.twitter.com/VUDlaJja0s — Kevin Pietersen (@KP24) 2 April 2018