పీటర్సన్ వస్తున్నాడు! | Kevin Pietersen joins Sunrisers Hyderabad squad | Sakshi
Sakshi News home page

పీటర్సన్ వస్తున్నాడు!

Published Wed, May 13 2015 7:10 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

పీటర్సన్ వస్తున్నాడు!

పీటర్సన్ వస్తున్నాడు!

హైదరాబాద్: ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ శుక్రవారం ఐపీఎల్ అడుగుపెట్టనున్నాడు. ఈనెల 15న అతడు జట్టులో చేరతాడని సన్ రైజర్స్ హైదరాబాద్ తెలిపింది. ఈ సీడన్ లో పీటర్సన్ ను వేలంలో హైదరాబాద్ కొనుక్కుంది. అయితే ఫ్రాంచైజీ అనుమతితో అతడు కౌంటీ క్రికెట్ ఆడేందుకు స్వదేశంలోనే ఉండిపోవడంతో ఇప్పటివరకు ఐపీఎల్-8లో బరిలోకి దిగలేదు.

మే 17న ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో పీటర్సన్ ఆడే అవకాశముంది. కౌంటీలో పరుగుల వరద పారించిన పీటర్సన్ రాకతో సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ బలం పెరగనుంది. 2009లో ఐపీఎల్ లో ప్రవేశించిన కేపీ ఇప్పటివరకు 32 మ్యాచ్ లు ఆడి 136.07 స్టైక్ రేట్ తో 928 పరుగులు చేశాడు. కాగా, ఈ సీజన్లో14 పాయింట్లతో హైదరాబాద్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement