18 వేల 332 పరుగులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్ లో స్కోరు బోర్డుపై నమోదైన మొత్తం పరుగులు ఎన్నో తెలుసా. అక్షరాల 18 వేల 332 పరుగులు. ఇందులో బౌండరీల ద్వారా వచ్చిన రన్స్ 10,58. ఇందులో 89 అర్ధ సెంచరీలున్నాయి. పరుగుల వీరులు 692 సిక్సర్లు బాదారు. 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ అత్యధికంగా 38 సార్లు బంతిని బౌండరీ దాటించాడు. అత్యధికంగా 108 మీటర్ల వరకు బంతి వెళ్లింది. ఈసారి ఐపీఎల్ లో686 వికెట్లు పడ్డాయి. ఫాస్టెస్ట్ బాల్ వేగం 151.11 కేపీహెచ్(మిచెల్ జాన్సన్) గా నమోదైంది. వయసు పెరిగినా తన బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించిన ఆశిష్ నెహ్రా బెస్ట్ బౌలింగ్ (4/10) గణాంకాలు తన పేరిట లఖించుకున్నాడు. 26 వికెట్లతో డ్వెన్ బ్రేవో టాప్ బౌలర్ గా నిలిచాడు.
ఎలా బడితే అలా బాదేసే ఏబీ డివిలియర్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు(133) చేసిన ఆటగాడిగా నిలిచాడు. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్( 562) టాప్ స్కోరర్ అయ్యాడు. ఈసారి ఇండియా ఆటగాళ్లు సెంచరీలు కొట్టలేకపోయారు. డివిలియర్స్, క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కల్లమ్, షేన్ వాట్సన్ మాత్రమే శతకాలు బాదారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన పంజాబ్ చిత్తుగా ఓడిన రికార్డు సొంతం చేసుకుంది. బెంగళూరు చేతిలో 138 పరుగుల భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది.
గతేడాది లీగ్ దశలో 22 పాయింట్లతో టాప్'గా నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంబాబ్ ఈసారి అట్టడుగు నుంచి 'ఫస్ట్'కు పతనమైంది. చివరి నుంచి రెండో స్థానంలో కుదురుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ తలరాత ఈసారి కూడా మారలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదృష్టం కలిసి రాలేదు. డిపెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేఆప్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. తన చివరి లీగ్ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కు చేరలేకపోయింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తుది పోరులో తడబడింది. ఆరంభంలో ఎదురైన వరుస ఓటముల నుంచి అనూహ్యంగా పుంజుకుని ముంబై ఇండియన్స్ టీమ్ టైటిల్ ఎగరేసుకు పోవడం ఊహించని పరిణమామం.
ఈ ఐపీఎల్ లో ఎవరు బెస్ట్...
స్ట్రైక్ రేట్: ఆండ్రీ రసెల్(192.89)
బ్యాటింగ్ సగటు: అజింక్య రహానే(49.09)
అర్ధసెంచరీలు: డేవిడ్ వార్నర్(7)
సిక్సర్లు: క్రిస్ గేల్(38)
ఫోర్లు: డేవిడ్ వార్నర్(65)
వేగవంతం
సెంచరీ: క్రిస్ గేల్(46 బంతుల్లో)
అర్ధ సెంచరీ: రసెల్, హర్భజన్(19 బంతుల్లో)
అత్యుత్తమం
బౌలింగ్ సగటు: హెన్సిక్స్(14.36)
బౌలింగ్ ఎకానమి: అశ్విన్(5.84)
డాట్ బాల్స్: అశిష్ నెహ్రా( 170)
మెయిడిన్లు: సందీప్ శర్మ(4)
అవార్డులు
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: ఆండ్రీ రసెల్
ఎమర్జింగ్ ప్లేయర్: శ్రేయస్ అయ్యర్
బెస్ట్ క్యాచ్: డ్వేన్ బ్రేవో
ఫేయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్
ఆరెంజ్ క్యాప్: డేవిడ్ వార్నర్(562 రన్స్)
పర్పుల్ క్యాప్: డ్వేన్ బ్రేవో(26 వికెట్లు)