ఇదో గొప్ప ప్రయాణం: రోహిత్ శర్మ | It has been a great journey, couldn't have asked for more, says Rohit Sharma | Sakshi
Sakshi News home page

ఇదో గొప్ప ప్రయాణం: రోహిత్ శర్మ

Published Mon, May 25 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

ఇదో గొప్ప ప్రయాణం: రోహిత్ శర్మ

ఇదో గొప్ప ప్రయాణం: రోహిత్ శర్మ

కోల్ కతా: ఐపీఎల్-8 టైటిల్ సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్ తమ ప్రయాణం గొప్పగా సాగిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ విజేతగా నిలిచిన తన జట్టును ఇంకేమీ అడగబోనని అన్నాడు.

ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 41 పరుగుల తేడాతో ఓడించి ముంబై టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.

'ఇదో గొప్ప ప్రయాణం. దీనికి మించి ఇంకేమీ అడగను. టైటిల్ పోరులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. మరిచిపోలేని విజయం అందించారు' అని రోహిత్ శర్మ అన్నాడు. వరుస ఓటముల నుంచి పుంజుకున్న తీరు అనూహ్యమని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement