ధోని, గౌతీ సరసన రోహిత్ | Rohit Sharma joins Dhohi, Gambhir to win IPLcrown twice | Sakshi
Sakshi News home page

ధోని, గౌతీ సరసన రోహిత్

Published Mon, May 25 2015 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

ధోని, గౌతీ సరసన రోహిత్

ధోని, గౌతీ సరసన రోహిత్

కోల్ కతా: ఆరు వారాల పాటు క్రికెట్ అభిమానులకు అలరించిన ఐపీఎల్-8 ముగిసింది. అనూహ్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ విజేతగా నిలిచింది. అన్ని విభాగాల్లో పైచేయి సాధించి రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... మహేంద్ర సింగ్ ధోని, గౌతమ్ గంభీర్ సరసన చేరాడు. రెండుసార్లు జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ల జాబితాలో వీరు ముగ్గురూ ఉన్నారు. రాజస్థాన్, హైదరాబాద్ ఒక్కోసారి ఐపీఎల్ టైటిల్ అందుకున్నాయి.

ఈ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 34.42 సగటుతో 482 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 మ్యాచ్ లు ఆడిన ధోని 31 సగటుతో 372 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ 13 మ్యాచుల్లో 25.15 సగటుతో 327 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement