'కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే ఓడాం' | MI lacking in confidence, says captain Rohit Sharma | Sakshi
Sakshi News home page

'కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే ఓడాం'

Published Wed, Apr 15 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

'కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే ఓడాం'

'కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే ఓడాం'

ముంబై: ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే తమ జట్టు విజయాలు సాధించలేకపోతోందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఐపీఎల్-8లో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి ముంబై 'హ్యాట్రిక్' కొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఎటువంటి సమస్య లేదని రోహిత్ శర్మ అన్నాడు. కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే తమ టీమ్ గెలవలేకపోతోందని తెలిపాడు. తమ ఆటగాళ్లతో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించాడు.

ఎమ్ఐ-రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమంలో రోహిత్ శర్మ పాల్గొన్నాడు. తమ ఆటగాళ్లు బాగానే ఆడుతున్నప్పటికీ విజయాలు దక్కించుకోలేకపోయామని కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. గత ఎడిషన్ లో ముంబై టీమ్ మొదట్లో విజయాలు సాధించలేదు. తర్వాత ఐదు వరుస విజయాలతో ప్లేఆప్ కు దూసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement