రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని | Dhoni rues lack of individual match wining efforts | Sakshi
Sakshi News home page

రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని

Published Mon, May 25 2015 10:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని

రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని

కోల్ కతా: మ్యాచ్ ను గెలిచిపించే వ్యక్తిగత ప్రదర్శన చేయకపోవడంతో ఐపీఎల్-8 ఫైనల్లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ సింగ్ ధోని అన్నాడు. తమ జట్టు పూర్తిస్థాయిలో రాణించక పోవడం కూడా ఓటమికి కారణమని విశ్లేషించాడు. మొహిత్ శర్మ వేసిన రెండో ఓవర్ తమ కొంప ముంచిందని వాపోయాడు. ముంబై పుంజుకోవడానికి, మ్యాచ్ తమ చేయి జారడానికి ఈ ఓవరే కారణమన్నాడు. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, సిక్సర్ తో 16 పరుగులు పిండుకున్నాడు.

భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన తమకు శుభారంభం లభించకపోవడం దెబ్బతీసిందన్నాడు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ లేకపోవడం కూడా తమ విజయవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. ప్లే ఆప్ లో పుంజుకోలేకపోవడంతో టైటిల్ చేజారిందన్నాడు. మొత్తంగా చూసుకుంటే తమ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని ధోని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement