M S Dhoni
-
గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఎవరి బలమెంత..?
-
బుమ్రానే బౌల్డ్ చేసింది.. ఎవరీ సంజన?!
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాహం గురించిన చర్చే ఎక్కుగా నడిచింది. బుమ్రా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే దాని గురించి పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పలువురు పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే నేటితో ఈ ఊహాగానాలకు తెర పడింది. బుమ్రా మనసు గెలిచింది.. తన జీవితంలోకి ప్రవేశించింది ఎవరో తెలిసిపోయింది. కొన్ని గంటల క్రితమే బుమ్రా.. టీవీ ప్రెజెంటర్ సంజనా గణేశన్‌ను వివాహమాడారు. సిక్కు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి వేడుక సోమవారం జరిగింది. తమ పెళ్లి ఫొటోలను బుమ్రా, సంజన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రేమ, ఇది విలువైనదని మీరు గుర్తిస్తే.. అదే మీకు మార్గనిర్దేశం చేస్తుంది’’ అని మెసేజ్ కూడా ఇచ్చారు. ‘‘ప్రేమికులుగా ఉన్న మేము కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మా జీవితాల్లో ఎంతో సంతోషకరమైన రోజుల్లో ఈరోజు ఒకటి. మా పెళ్లి వార్తను, మా సంతోషాన్ని మీతో పంచుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. జస్ప్రీత్ అండ్ సంజన’’ అని తమ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో వీరిద్దరు పేర్కొన్నారు. ఇక పెళ్లికి ముందు వరకు కూడా వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఒక్క మాట మాట్లడలేదు. ఎక్కడా బయటపడలేదు. ఈ రోజు ఏకంగా పెళ్లి ముచ్చట చేప్పేశారు. బుమ్రా నాలుగో టెస్టు నుంచి తప్పుకోవడం పట్ల బీసీసీఐ తన ప్రకటనలో ‘ఆయన వ్యక్తిగత కారణాల వల్ల’ అని మాత్రమే పేర్కొంది. ఎక్కడా పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, రెండు రోజులుగా బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తానికి సోమవారం నాడు సంజనను పెళ్లాడి బుమ్రా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇదిలా ఉంటే, అసలు బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేషన్ ఎవరు.. అసలు వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది అనే తదితర అంశాల గురించి చర్చిస్తున్నారు నెటిజనులు. వాటికి సమాధానమే ఈ స్టోరి.. క్రీడలను ముఖ్యంగా క్రికెట్‌ను అభిమానించే వారికి సంజనా గణేశన్ పరిచయమే. ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ల సందర్భంగా పలు స్పేషల్ షోలు హోస్ట్ చేశారు సంజన. ఇక ఆమె వ్యక్తిగత వివరాలకు వస్తే.. సంజనా గణేశన్ స్వస్థలం పుణె. 1991 మే 6న ఆమె జన్మించారు. అక్కడే బీటెక్ వరకు చదివారు. మోడలింగ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టిన సంజన.. ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. 2014లో ఎంటీవీ స్ల్పిట్స్‌విల్లా షో సీజన్ 7 ద్వారా సంజన గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోనీ, నిఖిల్ చిన్నప్ప హోస్ట్ చేసిన ఈ షో మధ్యలోనే గాయం కారణంగా సంజన తప్పుకున్నారు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేస్తున్నారు సంజన. తన ఇన్స్టాగ్రామ్ బయోగ్రఫీలో ‘‘టీవీ ప్రెజెంటర్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ ఇండియా, డిజిటల్ హోస్ట్, దట్ మిస్ ఇండియా గర్ల్’’ అని పేర్కొన్నారు. గతేడాది దుబాయ్‌లో జరగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు ప్రజెంటర్‌గా పని చేశారు సంజన. ఈ సందర్భంగా సంజనా.. ఇండియా ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్ అంజుమా చోప్రాతో కలిసి దిగిన ఫోటోతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని ఇంటర్వ్యూ చేస్తూ దిగిన ఫోటోలని షేర్ చేశారు. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో ‘మ్యాచ్ పాయింట్’, ‘చీకీ సింగిల్స్’ వంటి షోలను ఆమె హోస్ట్ చేశారు. క్రికెట్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ వంటి ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను కూడా సంజన హోస్ట్ చేశారు. వీటితో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తోనూ సంజన ఒప్పందం చేసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కమర్షియల్ షో ‘ద నైట్ క్లబ్’కు సంజన యాంకర్‌గా వ్యవహరించారు. చదవండి: బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు.. సంజనా 'ప్యా'ర్కర్కు బుమ్రా క్లీన్ బౌల్డ్.. -
‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను’
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబైలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ క్రమంలో ధోని బయోపిక్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర కోసం తనను తీసుకోవాల్సిందిగా అక్షయ్ కుమార్ ఆ చిత్ర దర్శకుడు నీరజ్ పాండేను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో 2017లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘నీరజ్ పాండే ధోని బయోపిక్ తెరకెక్కిస్తున్నారని నాకు తెలిసింది. దాంతో ఆ చిత్రంలో ధోని పాత్ర కోసం నన్ను తీసుకోవాల్సిందిగా నీరజ్‌ను కోరాను. కానీ అతడు సున్నితంగా తిరస్కరించాడు’ అని తెలిపారు. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. (ఐ వాన్న అన్‌ఫాలో యు) దీనిపై నీరజ్ పాండే స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో ధోని యుక్తవయస్సులో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. 16-17 ఏళ్ల యువకుడిగా నటించాల్సి ఉంటుంది. ఆ వెర్షన్ అక్షయ్‌కు సూట్ కాదు. అందుకే అతడి అభ్యర్థనను తిరస్కరించాను’ అన్నాడు. అంతేకాక ఈ చిత్రంలో సుశాంత్ నటన గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి నటుడు. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు సుశాంత్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివాడు. ధోని బాడీ లాంగ్వేజ్‌ను ఎంతో బాగా అనుకరించాడు’ అని తెలిపారు. ‘ఎమ్ఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 133 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం) -
టీ 20లో టీమిండియా భారీ విజయం..సిరీస్ సొంతం
-
ధోనీకి అండగా నిలిచిన పుణె కెప్టెన్
రాజ్‌కోట్: ఐపీఎల్-2017 సీజన్లో బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోతున్న మహేంద్ర సింగ్ ధోనీకి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అండగా నిలిచాడు. ధోనీ ఫామ్‌పై తనకు ఆందోళన లేదని, అతను క్లాస్ ఆటగాడని అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్లో తమ జట్టు కేవలం మూడే మ్యాచ్‌లు ఆడిందని, ఈ టోర్నీమిగతా మ్యాచ్ ల్లో ధోనీ రాణిస్తాడని స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తమకు ధోని బ్యాటింగ్ తో ఎటువంటి ఇబ్బంది లేదని స్మిత్ పేర్కొన్నాడు. తాజా సీజన్లో పుణె కెప్టెన్‌గా ధోనీని తొలగించి, అతని స్థానంలో స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. శుక్రవారం గుజరాత్ లయన్స్‌తో పుణె తలపడనుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్ తనకు, తమ జట్టుకు నిరాశ కలిగించిందని స్మిత్ అన్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా తాను కడుపు నొప్పితో బాధపడ్డానని, ఇప్పుడు కోలుకున్నానని చెప్పాడు. గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కు పూర్తి ఫిట్నెస్తో ఉంటానని స్మిత్ అన్నాడు. -
ధోనీ ఎవరిని కలిశాడో తెలుసా?
చెన్నై: ఒకరు 'నిప్పురా..' అంటూ స్క్రీన్ పై చెలరేగుతారు. ఇంకొకరు 'మిస్టర్ కూల్'గా కనిపిస్తూ మైదానంలో దుమ్మురేపుతారు. ఆ ఇద్దరూ కలిస్తే మాత్రం ఇదిగో ఇలా సాదాసీదాగా సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. టీమిండియా వన్ డే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తన అభిమాన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలుసుకుని కాసేపు ముచ్చటించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) క్రికెటర్ జీవితకథ ఆధారంగా రూపొందించిన 'ఎమ్మెస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' ప్రమోషన్ లో భాగంగా గురువారం చెన్నైకి వచ్చిన చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. అనంతరం రజనీకాంత్ ను కలుసుకుని ఆశీర్వచనాలు తీసుకుంది. ధోనీతోపాటు సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దర్శకుడు నీరజ్ పాండేలు కూడా రజనీని కలిసినవారిలో ఉన్నారు. ధోనీ సినిమా హిట్ కావాలని సూపర్ స్టార్ మనస్ఫూర్తిగా ఆశ్వీర్వదించారు. సెప్టెంబర్ 30న 'ధోనీ అన్ టోల్డ్ స్టోరీ' విడుదలకానుంది. -
ధోనీ లక్ష్యంగా క్రికెటర్ పదునైన చురకలు!
క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ, గౌతం గంభీర్ ఇద్దరు సమకాలీనులు. ఒకప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి పోటాపోటీగా ఆడినవారు. ఆ తర్వాత ధోనీ క్రమంగా కెప్టెన్ భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగిపోగా.. గంభీర్ అంచెలంచెలుగా జట్టుకు దూరమై, ఇటు ఐపీఎల్‌లోనూ రాణించలేక చతికిలపడ్డాడు. ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. గంభీర్ తాజాగా పెట్టిన ఓ పోస్టు మాత్రం ఆన్లైన్లో పెద్ద యుద్ధానికే దారితీసింది. జీవిత కథలు ఆధారంగా వచ్చే సినిమాల (బయోపిక్)పై ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యతో ఉన్న తన ఫొటోను గంభీర్ ట్వీట్ చేశాడు. ’క్రికెటర్ల జీవిత చరిత్రల మీద వచ్చే సినిమాలను నేను నమ్మను. నిజానికి క్రికెటర్ల కన్నా దేశానికి ఎక్కువ సేవ చేసినవారిపైనే ఇలాంటి సినిమాలు తీయాలి. దేశం కోసం ఎన్నో మంచి పనులు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి గురించే బయోపిక్‌లు తీయాలి' అంటూ గంభీర్ పేర్కొన్నాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా త్వరలోనే 'ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న విడుదల కానున్న ధోనీ సినిమాను చులకన చేసేందుకు గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడంటూ ట్విట్టర్లో ధోనీ ఫ్యాన్ ఫైర్ అయ్యారు. అతనిపై విమర్శల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. అయినా వెనుకకు తగ్గని గంభీర్.. తాజా యూరి ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ.. క్రికెటర్ల కన్నా అమరులపై బయోపిక్‌లు తీయడం మంచిదని, దేశం కోసం ఓ యువకుడు చేసిన ప్రాణత్యాగం కంటే గొప్ప స్ఫూర్తి ఏముంటుందంటూ గంభీర్ పేర్కొన్నాడు. దీంతో రెచ్చిపోయిన ధోనీ ఫ్యాన్స్ తమదైన స్టైల్లో గంభీర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. pic.twitter.com/Uy7hwqipT3 — Gautam Gambhir (@GautamGambhir) September 18, 2016 -
టీమిండియా ప్రాక్టీస్
-
ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ
న్యూఢిల్లీ: భారత టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. గతంలో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదా పొందిన ధోనీ.. ప్రస్తుతం ఆగ్రాలోని ఎలైట్ పారా రెజిమెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ ఇటీవల ధోనీ ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతించారు. ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందనున్నాడు. ధోనీ శిక్షణ పొందిన తర్వాత ఐదు పారాచూట్ జంప్స్ చేయగలడని రక్షణ శాఖ ప్రతినిధి సీతాన్షు కర్ చెప్పారు. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించిన సంగతి తెలిసిందే. ధోనీకి కమెండో యూనిఫాం కూడా బహూకరించింది. -
రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని
కోల్ కతా: మ్యాచ్ ను గెలిచిపించే వ్యక్తిగత ప్రదర్శన చేయకపోవడంతో ఐపీఎల్-8 ఫైనల్లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ సింగ్ ధోని అన్నాడు. తమ జట్టు పూర్తిస్థాయిలో రాణించక పోవడం కూడా ఓటమికి కారణమని విశ్లేషించాడు. మొహిత్ శర్మ వేసిన రెండో ఓవర్ తమ కొంప ముంచిందని వాపోయాడు. ముంబై పుంజుకోవడానికి, మ్యాచ్ తమ చేయి జారడానికి ఈ ఓవరే కారణమన్నాడు. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, సిక్సర్ తో 16 పరుగులు పిండుకున్నాడు. భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన తమకు శుభారంభం లభించకపోవడం దెబ్బతీసిందన్నాడు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ లేకపోవడం కూడా తమ విజయవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. ప్లే ఆప్ లో పుంజుకోలేకపోవడంతో టైటిల్ చేజారిందన్నాడు. మొత్తంగా చూసుకుంటే తమ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని ధోని చెప్పాడు. -
నోయిడాలో మరో హైదరాబాదీ: షారుక్, సల్మాన్, ధోనీ, సచిన్ ఐటీ అకౌంట్లు హ్యాక్!
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఆదాయపు పన్ను రిటర్న్ అకౌంట్ హ్యాకింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులకు మరికొందరి ప్రముఖుల అకౌంట్లు కూడా హ్యాక్ గురైనట్టు దర్యాప్తులో వెల్లడైంది. ముంబై పోలీసుల దర్యాప్తులో క్రికెటర్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల అకౌంట్లను నోయిడాకు చెందిన మరో చార్టెడ్ అకౌంట్(సీఏ) స్టూడెంట్ హ్యకింగ్ పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నోయిడాలోని విశాల్ కుషాల్ కంపెనీలో సీఏ స్టూడెండ్ సంచింత్ కాతియాల్ అంబానీ అకౌంట్ ను హ్యక్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. సెప్టెంబర్ 16 తేదిన సైబర్ క్రైమ్ సెల్ సంచిత్ పై కేసు నమోదు చేసి కంప్యూటర్, హార్డ్ డిస్క్ లను సీజ్ చేశారు. మొదటిసారి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అకౌంట్ ను జూన్ 22న, ధోని అకౌంట్ ను జూన్ 24న, అంబానీ అకౌంట్ ను జూన్ 26 తేదిన హ్యాక్ చేసినట్టు తెలిపింది. మళ్లీ రెండవసారి ధోని అకౌంట్ ను జూన్ 28న, సచిన్ అకౌంట్ ను జూలై 4న హ్యాక్ చేశారు. విచారణలో భాగంగా హైదరాబాద్ కు చెందిన మనోజ్ దాగా అండ్ కంపెనీలో ఆర్టికల్ షిప్ చేస్తున్న అమ్మాయిని.. నోయిడాలో జరిగిన హ్యాకింగ్ గురించి ప్రశ్నించగా తనకు తెలియదని జవాబిచ్చినట్టు ముంబై క్రైమ్ బ్రాంచ్ కు చెందిన సైబర్ సెల్ సీనియర్ ఇన్స్ పెక్టర్ ముకుంద్ పవార్ తెలిపారు. తమ దర్యాప్తులో నోయిడా సీఏ స్టూడెంట్ హ్యాక్ చేసినట్టు తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు. అకౌంట్ల పాస్ వర్డ్ లను మార్చేందుకు ఐటీ డిపార్ట్ మెంట్ కు ఈ మెయిల్ కూడా రాసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ఇద్దరు సీఏ స్టూడెంట్స్ ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని, ఈ కేసులన్ని బెయిలబుల్ కిందికే వస్తాయని.. త్వరలోనే చార్జిషీట్లను దాఖలు చేస్తామన్నారు. అనిల్ అంబానీకి చెందిన అకౌంట్ హ్యకింగ్ కేసులో హైదరాబాదీ సీఏ స్టూడెంట్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సెప్టెంబర్ 7 తేదిన కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్
-
ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్
ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ లుక్‌తో అదరగొట్టే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి సరికొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిచ్చాడు. కుడి, ఎడమ వైపుల పూర్తిగా జుట్టు తీసేసి.. మధ్యలో మాత్రం జుట్టు ఉంచుకుని సరికొత్త లుక్‌తో కనిపించాడు.