నోయిడాలో మరో హైదరాబాదీ: షారుక్, సల్మాన్, ధోనీ, సచిన్ ఐటీ అకౌంట్లు హ్యాక్!
నోయిడాలో మరో హైదరాబాదీ: షారుక్, సల్మాన్, ధోనీ, సచిన్ ఐటీ అకౌంట్లు హ్యాక్!
Published Thu, Sep 26 2013 3:56 PM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఆదాయపు పన్ను రిటర్న్ అకౌంట్ హ్యాకింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులకు మరికొందరి ప్రముఖుల అకౌంట్లు కూడా హ్యాక్ గురైనట్టు దర్యాప్తులో వెల్లడైంది. ముంబై పోలీసుల దర్యాప్తులో క్రికెటర్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల అకౌంట్లను నోయిడాకు చెందిన మరో చార్టెడ్ అకౌంట్(సీఏ) స్టూడెంట్ హ్యకింగ్ పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నోయిడాలోని విశాల్ కుషాల్ కంపెనీలో సీఏ స్టూడెండ్ సంచింత్ కాతియాల్ అంబానీ అకౌంట్ ను హ్యక్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. సెప్టెంబర్ 16 తేదిన సైబర్ క్రైమ్ సెల్ సంచిత్ పై కేసు నమోదు చేసి కంప్యూటర్, హార్డ్ డిస్క్ లను సీజ్ చేశారు. మొదటిసారి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అకౌంట్ ను జూన్ 22న, ధోని అకౌంట్ ను జూన్ 24న, అంబానీ అకౌంట్ ను జూన్ 26 తేదిన హ్యాక్ చేసినట్టు తెలిపింది. మళ్లీ రెండవసారి ధోని అకౌంట్ ను జూన్ 28న, సచిన్ అకౌంట్ ను జూలై 4న హ్యాక్ చేశారు.
విచారణలో భాగంగా హైదరాబాద్ కు చెందిన మనోజ్ దాగా అండ్ కంపెనీలో ఆర్టికల్ షిప్ చేస్తున్న అమ్మాయిని.. నోయిడాలో జరిగిన హ్యాకింగ్ గురించి ప్రశ్నించగా తనకు తెలియదని జవాబిచ్చినట్టు ముంబై క్రైమ్ బ్రాంచ్ కు చెందిన సైబర్ సెల్ సీనియర్ ఇన్స్ పెక్టర్ ముకుంద్ పవార్ తెలిపారు. తమ దర్యాప్తులో నోయిడా సీఏ స్టూడెంట్ హ్యాక్ చేసినట్టు తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు. అకౌంట్ల పాస్ వర్డ్ లను మార్చేందుకు ఐటీ డిపార్ట్ మెంట్ కు ఈ మెయిల్ కూడా రాసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ఇద్దరు సీఏ స్టూడెంట్స్ ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని, ఈ కేసులన్ని బెయిలబుల్ కిందికే వస్తాయని.. త్వరలోనే చార్జిషీట్లను దాఖలు చేస్తామన్నారు. అనిల్ అంబానీకి చెందిన అకౌంట్ హ్యకింగ్ కేసులో హైదరాబాదీ సీఏ స్టూడెంట్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సెప్టెంబర్ 7 తేదిన కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement