బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. దశాబ్దాల కరియర్‌లో అనేక బ్లాక్ బ్లస్టర్లు, సూపర్‌హిట్ మూవీలతో బాక్సాఫీసు కలెక్షన్లలో దుమ్ము రేపి రారాజుగా నిలిచాడు. ఇటీవలి కాలంలో కొన్ని ఫ్లాప్ మూవీలు, సౌత్ సినిమా హవా ఉన్నప్పటికీ, 'జవాన్' ,పఠాన్' సినిమాల విజయవంతంతో షారుఖ్ ఖాన్ నికర విలువ గణనీయంగా పెరిగింది. అందుకే సంపాదనలో టాప్‌లో నిలిచాడు.
ఇటీవల, IMDb డేటా సహాయంతో, ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తర ,దక్షిణ భారత నటీనటులు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 6300 కోట్ల నికర విలువో షారూఖ్ ఖాన్ టాప్‌లో నిలిచాడు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి ఇతర నటీనటులు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. షారూఖ్ కరియర్‌లో జవాన్, పఠాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.20000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘డుంకీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది..
ఇక ఈ లిస్ట్‌లో రూ. 2900 కోట్ల నికర సంపదతో స్టార్‌హీరో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. సల్మాన్ చిత్రం ‘టైగర్ 3’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 466.63 కోట్లను వసూలు చేసింది.
అక్షయ్ కుమార్ నికర విలువ దాదాపు 2500 కోట్లు ఉంటుందని అంచనా. 'OMG 2' కుమార్ అతిథి పాత్రను చూసింది , ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ నటుడు తరువాత చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్.'
ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్1862 కోట్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ నికర విలువ దాదాపు రూ. 474 కోట్లుగా లెక్కించారు. రజనీకాంత్ నికర విలువ దాదాపు 430 కోట్లు.
టాలీవుడ్‌కి సంబంధించి పుష్ప సినిమాతో కలెక్షన్ల సునామీ రేపిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లుగా ఉండగా, ప్రభాస్ నికర విలువ 241 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్ నికర విలువ రూ.196 కోట్లు. కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలతో 10వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment