మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్‌గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్‌కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.
తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.
మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్‌తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్‌లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్‌ను సింగిల్ టేక్‌లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్‌కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్‌లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.
(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)
కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్‌లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment