ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ | Dhoni undergoing training with Army's elite Para Brigade | Sakshi
Sakshi News home page

ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ

Published Fri, Aug 7 2015 5:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ

ఆర్మీ శిక్షణకు వెళ్లిన ధోనీ

న్యూఢిల్లీ: భారత టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. గతంలో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదా పొందిన ధోనీ.. ప్రస్తుతం ఆగ్రాలోని ఎలైట్ పారా రెజిమెంట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ ఇటీవల ధోనీ ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతించారు.

ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందనున్నాడు. ధోనీ శిక్షణ పొందిన తర్వాత ఐదు పారాచూట్ జంప్స్ చేయగలడని రక్షణ శాఖ ప్రతినిధి సీతాన్షు కర్ చెప్పారు. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించిన సంగతి తెలిసిందే. ధోనీకి కమెండో యూనిఫాం కూడా బహూకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement