Indian cricket
-
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
'మీ అమ్మగారు అస్పత్రిలో ఉన్నా.. జట్టు కోసం ఆలోచించావు'
టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ టెస్ట్ ముగిసిన వెంటనే తన 14 ఏళ్ల కెరీర్‌కు అశ్విన్ ముగింపు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడి నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులే కాకుండా సహచరలు సైతం అశ్చర్యపోయారు. ఈ నిర్ణయాన్ని ఎంత సడన్‌గా అశ్విన్ ఎందుకు తీసుకున్నాడో ఆర్ధం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికి 14 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించినందుకు గాను అశ్విన్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.అతడికి ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అశ్విన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశించారు. అతడొక లెజెండ్ అని మోదీ కొనియాడారు."అంతర్జాతీయ క్రికెట్ నుంచి మీ ఆకస్మిక రిటైర్మెంట్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అందరిని ఆశ్చర్యపరిచింది. మీ నుంచి మరెన్నో ఆఫ్-బ్రేక్‌ల కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మీరు క్యారమ్ బాల్ని విసిరి అందరినీ బౌల్డ్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని మీరు ఎంతగానో ఆలోచించి తీసుకున్నారని మాకు ఆర్ధమవుతోంది. భారత క్రికెట్ తరపున సుదీర్ఘ కాలం పాటు ఆడిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.భారత క్రికెట్ కోసం 14 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి అద్భుతమైన ప్రదర్శన చేశారు. అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకపై జెర్సీ నంబర్ 99ను మేము మిస్ అవ్వనున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా నిలిచారు. మీ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధులను హడలెత్తించారు. అంతర్జాతీయ క్రికెట్లో మీరు పడగొట్టిన ఒక్కో ఒక్క వికెట్ వెనక మీ కష్టం దాగి ఉంది. టెస్టు క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల రికార్డు మీ పేరిట ఉండడం అందుకు నిదర్శం.అరంగేట్రంలోని 5 వికెట్లు పడగొట్టి మీ సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా మీరు భాగమయ్యారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవంలో మీరు కీలక పాత్ర పోషించారు. క్రికెట్ పట్ల మీకెంతో అంకితభావం ఉంది మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు ప్రయోజనాల కోసం ఆడావు. చెన్నైలో వరదల సమయంలో కుటుంబ సభ్యులతో కాకుండా జట్టుతోనే ఉన్నావు. నిజంగా మీరు ఒక లెజెండ్. మీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అంత మంచి జరగాలని కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ అంటూ అశ్విన్‌కు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నాడు. -
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్‌లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని మూడో టెస్ట్‌తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్‌లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్‌బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్‌తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్‌కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్‌కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్‌లోని రెండో టెస్ట్‌లో మాత్రమే అశ్విన్‌కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్‌ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్‌లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
ధోని శిష్యుడి సంచలన నిర్ణయం.. భారత క్రికెట్‌కు విడ్కోలు
ఉత్తరప్రదేశ్ స్టార్ పేసర్ అంకిత్ రాజ్‌పూత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 31 ఏళ్ల రాజ్‌పూత్ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అంకిత్ వెల్లడించాడు. "భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయిచుకున్నాను. 2009-2024 మధ్య కాలంలో నా క్రికెట్ ప్రయాణం అత్యద్భుతం. నాకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. క్రికెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఏదేమైనప్పటికీ నాకు ఇష్టమైన క్రీడను మాత్రం ఇప్పటిలో విడిచిపెట్టను" అని తన రిటైర్మెంట్ నోట్లో అంకిత్ రాజ్‌పూత్ పేర్కొన్నాడు.ఇండియన్ క్రికెట్‌తో పూర్తి సంబంధాలు తెంచుకున్న రాజ్‌పూత్.. ఐపీఎల్ మినహా ఇతర ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. ఇక 2012-13 రంజీ సీజన్లోఉత్తరప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన రాజ్‌పూత్.. మొత్తం తన రెడ్ బాల్ కెరీర్లో 248 వికెట్లు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికి అతడికి భారత జట్టు తరపున అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం లభించలేదు. రాజ్‌పూత్ ఐపీఎల్లో కూడా ఆడాడు. 2013 ఐపీఎల్ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.అప్పటి సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడాడు. ధోని శిష్యుడిగా అతడు పేరొందాడు. ఆ తర్వాత సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 29 మ్యాచ్‌లు ఆడిన రాజ్‌పూత్ 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్‌కూడా ఉంది.చదవండి: IND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
భారత క్రికెట్‌కు దుర్దినం.. ఒకే రోజు మూడు పరాభవాలు
భారత క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 122 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఇవాళే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో యంగ్ ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఇలా ఒకే రోజు భారత క్రికెట్ జట్లు మూడు పరాభవాలు ఎదుర్కోవడంతో సగటు భారత క్రికెట్ అభిమాని బాధ పడుతున్నాడు. భారత క్రికెట్‌కు ఇవాళ దుర్దినం అని అభిప్రాయపడుతున్నాడు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. తద్వారా ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది.అండర్-19 ఆసియా కప్ విషయానికొస్తే.. ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. -
Vinod Kambli: కాంబ్లీకి ఏమైంది..?
-
ఇట్స్ బేబీ బాయ్: సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమోషన్(ఫొటోలు)
-
2024-25 దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
2024-25 దేశవాళీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (జూన్ 6) విడుదల చేసింది. ఈ సీజన్ సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్ 1న జరిగే సీనియర్ మహిళల ఛాలెంజర్ ట్రోఫీతో ముగుస్తుంది. ఈ మధ్యలో సీనియర్ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్ ట్రోఫీలతో పాటు పలు జూనియర్ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి. 2024-25 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.దేశవాళీ క్రికెట్లో ప్రముఖ టోర్నీలైన రంజీ ట్రోఫీ ఈ ఏడాది అక్టోబర్ 11న మొదలై వచ్చే ఏడాది మార్చి 2న ముగుస్తుంది. రంజీ ట్రోఫీకి ముందు దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్.. రంజీ ట్రోఫీ మధ్యలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ జరుగనున్నాయి.2024-25 దేశవాళీ సీజన్ క్యాలెండర్..ముఖ్యమైన టోర్నీలకు సంబంధించిన వేదికల వివరాలు..VENUES & DATES OF INDIAN DOMESTIC CRICKET 2024-25...!!!! pic.twitter.com/LBuRy4hSjg— Johns. (@CricCrazyJohns) June 6, 2024 -
బిగ్‌బాస్ విన్నర్ చేతిలో ఔటైన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
థానే వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) తొట్టతొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ లీగ్ ప్రారంభ వేడుకలలో సెలబ్రిటీలు, క్రికెటర్లు సందడి చేశారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మెగా పపర్ స్టార్ రాంచరణ్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తమిళ నటుడు సూర్య, భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, సురేష్ రైనా ఈ వేడుకల్లో భాగమయ్యారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహకులు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుపడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన మంచి ఊపు మీద కన్పించిన సచిన్.. స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన సచిన్.. మరో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ విషయానికి వస్తే.. ఇది టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్‌తో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి. రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. .@ispl_t10 is poised to amaze us all, much like Munawar did by dismissing the 𝐌𝐚𝐬𝐭𝐞𝐫 𝐁𝐥𝐚𝐬𝐭𝐞𝐫 👀 🤯 #SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo pic.twitter.com/801LO25ilh — Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024 -
దివికేగిన దిగ్గజం
టి20 క్రికెట్ మాయలో పడి, సత్తా ఉన్నా... ఐదు రోజుల ఆటకు బైబై చెప్పేసి... జస్ట్ నాలుగు ఓవర్లేసే లీగ్‌లకు జైకొట్టే బౌలర్లున్న ఈ రోజుల్లో సంప్రదాయ టెస్టులకే సర్వం ధారపోసిన స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీ. ఆయన మునివేళ్లతో బంతిని సంధిస్తే వికెట్. ఆయన స్పిన్ ఉచ్చు బిగిస్తే ప్రత్యర్థి ఆలౌట్. అంతలా... భారత క్రికెట్లో తన స్పిన్‌తో వికెట్లను దున్నేసిన దిగ్గజం బేడీ. ఎరాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్లతో కలిసి దుర్బేధ్యమైన స్పిన్ త్రయంగా ప్రత్యర్థి జట్లను విలవిలలాడించాడు. ఈ త్రయానికి తర్వాత శ్రీనివాస్ వెంకటరాఘవన్ జతయ్యాక బ్యాటర్లకు చిక్కులు, చుక్కలే కనిపించేవంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ జగాన్ని స్పిన్ మాయాజాలంతో ఊపేసిన బిషన్ సింగ్ ఆఖరి శ్వాస విడిచి దివికేగాడు. భారత క్రికెట్‌ను కన్నీట ముంచాడు. న్యూఢిల్లీ: భారత క్రికెట్లో స్పిన్‌కే వన్నెలద్దిన బౌలింగ్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. స్పిన్ శకాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నెల క్రితం మోకాలు ఆపరేషన్ జరిగింది. అనారోగ్యంతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. మోకాలు శస్త్రచికిత్స అనంతరం సోకిన ఇన్ఫెక్షన్ క్రమంగా పెరగడంతోనే మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ఈ పంజాబీ క్రికెట్ స్టార్ 1946లో సెపె్టంబర్ 25న అమృత్‌సర్‌లో జన్మించారు. తదనంతరం క్రికెట్లో చెరగని ముద్ర వేసి ఢిల్లీలో సెటిలయ్యారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్ బేడీ (సినీనటుడు) ఉన్నారు. అంగద్ భార్య నేహ ధూపియా బాలీవుడ్ హీరోయిన్. మొదటి భార్య గ్లెనిత్ మైల్స్ ద్వారా ఇద్దరు సంతానం కొడుకు గావసిందర్, కుమార్తె గిలిందర్ ఉన్నారు. స్పిన్నర్లు ఉపఖండానికే పరిమితమనే విమర్శల్ని తన స్పిన్ మంత్రతో విదేశీ గడ్డపై తిప్పిగొట్టిన ఘనత బిషన్ సింగ్‌ది. తన కెరీర్ అనంతరం కూడా క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు విశేష సేవలందించారు. విరాట్ కోహ్లి సహా ఎంతో మంది కుర్రాళ్లకు ఫిట్నెస్ గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. కోహ్లి తను ఫిట్నెస్ను కాపాడుకోవడానికి బేడీనే కారణమని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇదీ చరిత్ర... సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి లాంటి బ్యాటర్లు అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాటేనని ఘంటాపథంగా చెప్పే సంప్రదాయ క్రికెట్లో స్పిన్నర్‌గా బేడీ ఓ వెలుగు వెలిగాడు. ఈ తరం క్రికెటర్లు మెరుపుల టి20లకు అలవాటు పడి టెస్టు క్రికెట్‌ను పక్కన బెడుతున్నారు. మరి బిషన్ సింగ్ ఐదు రోజుల టెస్టుల్లో, నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుదీర్ఘకాలం దేశానికి, రాష్ట్రానికి సేవలందించాడు. 1967 నుంచి 1979 వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులాడిన స్పిన్ లెజెండ్ 266 వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 14 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/98. ఇక 370 ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 1,560 వికెట్లను చేజిక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బిషన్ సింగ్ పేరిటే ఇంకా రికార్డు ఉండటం విశేషం. ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్లో బిషన్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను ఏకంగా 106 సార్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లను 20 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/5. వన్డే ఫార్మాట్లో తక్కువగా 10 మ్యాచ్‌లే ఆడాడు. 7 వికెట్లు తీశాడు. 1975 తొలి వన్డే వరల్డ్‌కప్‌లో, 1979 రెండో వన్డే వరల్డ్‌కప్‌లో బేడీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1975 వరల్డ్‌కప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బిషన్ 12 ఓవర్లు వేసి 8 మెయిడెన్లు తీసుకొని కేవలం 6 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అంతేకాదు...‘బేడీ సాబ్’ విజయవంతమైన సారథి కూడా! 22 టెస్టులకు నాయకత్వం వహించి 6 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. ఇందులో మూడైతే విదేశీ గడ్డపై సాధించిన ఘనవిజయాలున్నాయి. బేడీ కెప్టెన్సీలోనే భారత జట్టు 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 403 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు 27 ఏళ్ల పాటు (2003 వరకు) చరిత్ర పుటల్లో నిలిచింది. 1970లో కేంద్ర ప్రభుత్వంనుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న బిషన్ సింగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2004లో ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుతో సత్కరించింది. ఇదీ ఘనత... ఈ భారత స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అంటే అరివీర ఆజానుబాహులైన విండీస్ బ్యాటర్లకు వణుకే! ముఖ్యంగా 1970వ దశకంలో ప్రపంచ క్రికెట్‌ను తన స్పిన్ తో శాసించాడు. 1969–70 సీజన్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరిగిన ముఖాముఖి టెస్టు సిరీస్‌లో 20.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 1972– 73 సీజన్లో ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 25.28 సగటుతో 25 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యే వెస్టిండీస్ బ్యాటర్లను వారి సొంతగడ్డపై గడగడలాడించిన బౌలర్ ఎవరైన ఉన్నారంటే అది బేడీనే! 1975–76 సీజన్లో 25.33 సగటుతో 18 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి సీజన్లో న్యూజిలాండ్‌ను తిప్పేసి 13.18 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ 1976–77 సీజన్లోనే ఇంగ్లండ్ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1977–78 సీజన్లో ఈసారి ఆ్రస్టేలియా పనిపట్టాడు. 23.87 సగటులో 31 వికెట్లు తీశాడు. అరుణ్ జైట్లీ పేరుపెడితే నొచ్చుకున్నారు! ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని స్టాండ్‌కు బిషన్ సింగ్ బేడీ పేరు పెట్టారు. అయితే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మృతి అనంతరం ఆ స్టేడియానికి జైట్లీ పేరు పెట్టడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. క్రికెటేతరుడి పేరు పెట్టడాన్ని సహించలేక స్టాండ్‌కు తన పేరు తొలగించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర బిషన్ సింగ్ మరణ వార్తను తట్టుకోలేకపోయా. స్పిన్‌పై ఆయనకున్న పట్టు, ఆటపై కనబరిచే పట్టుదల అసాధారణం. భావి క్రికెటర్లకు, భవిష్యత్ తరాలకు అతని అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. –ప్రధాని నరేంద్ర మోదీ బేడీ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. –ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అలర్డైస్ స్పిన్ బౌలింగ్‌తో క్రికెట్ పుటల్లోకెక్కారు. భారత క్రికెట్లో స్పిన్‌కు మూలస్తంభంలా ఉన్నారు. అలాంటి దిగ్గజం మనమధ్య లేకపోవడం బాధాకరం. –బీసీసీఐ కార్యదర్శి జై షా బేడీ మార్గదర్శనం వల్లే ఇంగ్లండ్‌లో నా తొలి శతకం సాకారమైంది. అలాంటి లెజెండ్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. –బ్యాటింగ్ దిగ్గజం సచిన్ స్పిన్నర్లందరికి ఆయనే స్ఫూర్తి. యువతరానికి దిక్సూచి. బిషన్‌సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి. –మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బిషన్ సింగ్ లేరన్న వార్త జీర్జించుకోలేనిది. భారత క్రికెట్‌కోసం ఎంతో చేశారు. ఆయన కుటుంబానికి దేవుడు స్థయిర్యాన్ని ఇవ్వాలి. –మాజీ ఓపెనర్ గంభీర్ చాలా బాధగా ఉంది. ముమ్మాటికీ బిషన్‌సింగ్ గ్రేటెస్ట్ క్రికెటర్. యువ క్రికెటర్లు ఎదిగేందుకు ఎంతో పాటుపడ్డారు. –సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బేడీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను. –మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అంత్యక్రియలకు హాజరైన కపిల్, సెహ్వాగ్ ‘సర్దార్ ఆఫ్ స్పిన్’ బిషన్ సింగ్ బేడీ పార్థివ దేహానికి 1983 ప్రపంచకప్ కెప్టెన్ , దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, 2011 ప్రపంచకప్ విజేత సభ్యుడు సెహ్వాగ్ తదితర మేటి, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. స్థానిక లోధి స్మశానవాటికలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలకు కీర్తి ఆజాద్, మదన్‌లాల్, నెహ్రా, అజయ్ జడేజా, మురళీ కార్తీక్, జహీర్, అజహరుద్దీన్ తదితర క్రికెటర్లు హాజరయ్యారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన అభిమానులు, జూనియర్ క్రికెటర్ల అశ్రునయనాల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. -
టీమిండియా మాజీ కెప్టెన్ మృతి..
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం (అక్టోబర్ 23) సోమవారం తుది శ్వాస విడిచారు. బేడీ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా బిషన్ సింగ్ బేడీ కొనసాగారు. టీమిండియా తరపున 67 టెస్టులు ఆడిన బేడి.. ఏకంగా 266 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా పది వన్డేల్లో కూడా భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. 10 వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. ఎర్రపల్లి ప్రసన్న, బేడీ, బీఎస్ చంద్రశేఖర్ , ఎస్. వెంకటరాఘవన్ లతో భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు. అదే విధంగా భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1975 ప్రపంచ కప్‌లో భాగంగా తూర్పు ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టారు. అయన బౌలింగ్ కోటాలో ఏకంగా 8 మెయిడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. 1970లోనే పద్మ శ్రీ అవార్డు అందుకున్న బేడీ.. దేశీవాళీ క్రికెట్లో ఎక్కువగా ఢిల్లీ తరపున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన చాలా మంది క్రికెటర్లకు కోచ్‌గా, మెంటర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఈ జెంటిల్మెన్ గేమ్‌లో కొంతకాలంగా వ్యాఖ్యాతగా తన సేవలు అందించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఆయన ఉన్నారు. మణిందర్ సింగ్,మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు భారత క్రికెట్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనది. 1990 తర్వాత బీసీసీఐ ఛీప్ సెలక్టర్‌గా కూడా పనిచేశారు. -
బొజ్జ గణపయ్య నిమజ్జనంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (ఫొటోలు)
-
దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు
సౌరవ్ చండీదాస్ గంగూలీ.. ఈ పేరు తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండడు. ఇతన్ని అందరూ ముద్దుగా దాదా (బెంగాలీలో అన్న అని అర్ధం) అని పిలుచుకుంటారు. 90వ దశకంలో (1992) అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగపెట్టి, దాదాపు 16 ఏళ్ల పాటు (2008) దిగ్విజయంగా కెరీర్‌ను కొనసాగించిన ఈ కోల్‌కతా ప్రిన్స్.. అత్యుత్తమ బ్యాటర్‌గా, ఆల్‌రౌండర్‌గా, అత్యుత్తమ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకున్నాడు. 1992లో విండీస్‌తో వన్డేతో ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించిన దాదా.. ఆ మ్యాచ్‌లో విఫలం కావడంతో దాదాపు నాలుగేళ్ల పాటు భారత జట్టుకు ఆడలేకపోయాడు. అనంతరం 1996 ఇంగ్లండ్ పర్యటనలో రెండో టెస్ట్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన గంగూలీ.. తానాడిన తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, సెన్సేషన్‌గా మారాడు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని గంగూలీ భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగాడు. టీమిండియాలో ఓ పక్క సచిన్ హవా నడుస్తున్నా, బ్యాటర్‌గా గంగూలీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. దూకుడే మంత్రంగా గంగూలీ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అప్పటివరకు గంగూలీలా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన భారత బ్యాటర్లు లేరు. 1997లో శ్రీలంకపై తొలి వన్డే శతకాన్ని బాదిన దాదా.. ఆ తర్వాతి కాలంలో వన్డే క్రికెట్లో దాదాగిరి కొనసాగించాడు. 1998లో పాక్‌తో జరిగిన సహారా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న గంగూలీ, ఆ సిరీస్‌తో తనలోని బౌలర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 1999 వరల్డ్‌కప్‌లో గంగూలీ బ్యాటింగ్ శిఖరాగ్ర స్థాయికి చేరింది. ఆ మెగా టోర్నీలో అతను ఎన్నో రికార్డులను సాధించాడు. ప్రపంచ క్రికెట్‌పై మొదలైన దాదాగిరి.. అనూహ్య పరిణామాల మధ్య 2000 సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. కెప్టెన్‌గా తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆట పరంగా, వ్యక్తిగతంగా దూకుడు స్వభావి అయిన గంగూలీ అదే మంత్రాను కెప్టెన్‌గానూ కొనసాగించాడు. అదే దూకుడును భారత జట్టుకు కూడా నేర్పించాడు. అప్పట్లో ఆటతో పాటు మాటకు కూడా పని చెప్పే ఆస్ట్రేలియన్లతో సై అంటే సై అన్నాడు. అప్పటిదాకా నిదానంగా ఉండిన టీమిండియా ఆటగాళ్లలో ధైర్యాన్ని నూరిపోశాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు డిఫెన్సివ్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్‌కు గేర్ మార్చింది. దీని ఫలితంగా టీమిండియా ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఆ సమయంలో భారత జట్టు తిరుగులేని జట్టుగా చలామణి అయ్యింది. ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లన్నీ టీమిండియా దెబ్బకు గడగడలాడాయి. భారత క్రికెట్‌కు అది స్వర్ణయుగంగా చెప్పవచ్చు. మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు దాదా హయాంలో వెలుగులోకి వచ్చారు. ఓరకంగా చెప్పాలంటే వారు దాదా అండర్లోనే రాటుదేలారు. ఆతర్వాత ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా పేరొందారు. ఈ క్రమంలోనే దాదా సారధ్యంలో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అప్పటివరకు విదేశాల్లో అడపాదడపా విజయాలు సాధించిన టీమిండియా గంగూలీ నేతృత్వంలో ఆసీస్ లాంటి జట్టును వారి స్వదేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. అదే దాదాగిరితో 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2003 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది. Making us believe in our abilities with pride & passion, he turned us into "Overseas Tigers". We've had many great leaders & will keep having them. But the foundation you built at the time of crisis will never ever be forgotten. HBD @SGanguly99 "Dada" ❤pic.twitter.com/WzN9yQGIob — North Stand Gang - Wankhede (@NorthStandGang) July 8, 2023 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచాక గంగూలీ షర్ట్ విప్పి చేసుకున్న సంబురాలు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అత్యన్నత శిఖరాలు అధిరోహించిన గంగూలీ.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అత్యుత్తమ కెప్టెన్లలో ప్రథముడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌పై దాదాగిరి చేసిన గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలను మార్చాడని వేనోళ్ల కీర్తించబడ్డాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు అత్యుతన్న శిఖరాలను అధిరోహించిందని, కెప్టెన్‌గా గంగూలీ జమానా భారత క్రికెట్‌కు స్వర్ణయుగం లాంటిదని విశ్లేషకులు సైతం అభివర్ణిస్తారు. -
కత్తి మీద సాములా సాగిన కపిల్ దేవ్ జమానా.. వరల్డ్‌కప్ విజయం మినహా..!
భారత క్రికెట్ అంటే సగటు క్రికెట్ అభిమానికి ముందుగా గుర్తొచ్చేది 1983 వరల్డ్‌కప్. ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. నాటి అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి జగజ్జేతగా అవతరిచింది. ఈ వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 నాటౌట్), విండీస్‌తో జరిగిన ఫైనల్లో మొహిందర్ అమర్నాథ్ మ్యాజిక్ బౌలింగ్ (7-0-12-3) భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అలాగే ఈ టోర్నీలో కపిల్ దేవ్ భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన తీరును భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఈ గెలుపు తర్వాత ప్రతి భారతీయుడు గర్వంతో పొంగియాడు. ఈ విజయం ప్రతి భారత క్రీడాకారుడిలో స్పూర్తి నింపింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం కపిల్ డెవిల్స్ అందించిన స్పూర్తితోనే తన కెరీర్‌ను విజయవంతంగా సాగించాడు. అయితే, ఇంత గొప్ప విజయం సాధించి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కపిల్‌కు కెప్టెన్‌గా ఆ తర్వాతి కాలం మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు, ఫామ్ లేమి, సహచరుడు, మాజీ కెప్టెన్ గవాస్కర్‌తో విభేదాల కారణంగా వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదిలోపే కెప్టెన్సీని కోల్పోయాడు. వరల్డ్‌కప్‌కు ముందు 1982లో సారథ్య బాధ్యతలు చేపట్టిన కపిల్ రెండేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగాడు. కెప్టెన్‌గా తన టర్మ్‌లో కపిల్ వరల్డ్‌కప్ విజయం, అంతకుముందు విండీస్ పర్యటనలో ఓ వన్డేలో విజయం మినహా పెద్దగా సాధించింది లేదు. అయితే వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ పర్యటనలో మాత్రం కపిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో అతను ఓ మ్యాచ్ సేవింగ్ సెంచరీతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. కపిల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాక సెలెక్టర్లు మళ్లీ భారత జట్టు పగ్గాలు గవాస్కర్‌కు అప్పగించారు. ఈ విడత గవాస్కర్ ఏడాది పాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనంతరం మళ్లీ 1985 మార్చిలో కపిల్ టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా ఘనంగా పునరాగమనం చేసిన కపిల్.. 1986లో భారత్‌కు అపురూప విజయాలను అందించాడు. ఆ ఏడాది భారత్.. ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇదే ఊపులో 1987 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో కపిల్ నిజాయితీ భారత్ కొంపముంచింది. ఆసీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కపిల్ అంపైర్ చేసిన ఓ పొరపాటును సరిచేయగా.. అప్పటివరకు 268 పరుగులుగా ఉన్న ఆసీస్ స్కోర్ 270కి చేరింది. ఆ మ్యాచ్‌లో అంపైర్ పొరపాటున సిక్సర్‌ను ఫోర్‌గా పరిగణించగా, కపిల్ ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం స్వచ్ఛందంగా వెళ్లి ఈ విషయాన్ని అంపైర్‌తో చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ 270 అయ్యింది. ఛేదనలో భారత్ 269 పరుగులకు పరిమితం కావడంతో పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి తర్వాత కపిల్ భారత సారధ్య బాధ్యతలను ఎప్పుడూ చేపట్టలేదు. భారత్‌కు వరల్డ్‌కప్ అందించానన్న తృప్తి తప్ప కెప్టెన్‌గా కపిల్‌కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత క్రికెట్లో చెప్పుకోగదగ్గ, చారిత్రాత్మక విజయాన్ని అందించిన సారథిగా మాత్రం కపిల్ దేవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా అతను సాధించిన పలు రికార్డులు క్రికెట్ అభిమానులకు సదా గుర్తుండిపోతాయి. సంచలనాలకు ఆధ్యుడిగా కపిల్ చరిత్రలో నిలిచిపోతాడు. కాగా, 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ డెవిల్స్ అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి, అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌కు ఓటమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. -
అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్
స్మృతి మంధాన భారత క్రికెట్ జట్టులో ప్రముఖ క్రీడాకారిణి. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే . క్రీజ్‌లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్‌గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి సోషల్‌మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య తను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్‌తో డేటింగ్లో ఉన్నట్లు తరుచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా తన పుట్టినరోజును జులై 18న ఢాకాలో జరుపుకుంది. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండటంతో ఆమె అక్కడే ఈ వేడుకలను జరుపుకుంది. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ కూడా ఢాకా వెళ్లి స్మృతి మంధానకు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పాడు. అది బాగా వైరల్ అయింది. (ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ!) ఈ వార్త మరిచిపోక ముందే తాజాగా పలాష్ ముచ్చల్‌తో సినిమా షూటింగ్ స్పాట్లో స్మృతి మంధాన కనిపించింది. బాలీవుడ్ కమెడియన్, నటుడు రాజ్‌పాల్ యాదవ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ప్రకటన కార్యక్రమంలో ఆమె మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించింది. ఈ చిత్రానికి పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్‌గానే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఫోటోలను కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రెండు నెలల క్రితం, పలాష్ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, అతను తన చేతిపై 'SM 18' అని పచ్చబొట్టును గుర్తుగా రాపించాడు. స్మృతి మందన క్రికెట్ జెర్సీ నంబర్ '18' అనేది అందరికీ తెలిసిందే. అందుకే వీరిద్దరి డేటింగ్ చర్చ బాగా పాపులర్ అయింది. కానీ ఈ విషయంపై వీరద్దరూ బహిరంగంగా ఇప్పటికి వరకు ఒప్పుకోలేదు. అన్నీ సజావుగా జరిగితే వీరిద్దరూ త్వరలో శుభం కార్డుతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెడతారని సమాచారం. View this post on Instagram A post shared by Rajpal Naurang Yadav (@rajpalofficial) -
విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యత
విశాఖ: భారత్ హోం సిరీస్‌లో విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యతనిచ్చిందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి చెప్పారు. దీనిలో భాగంగానే వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు భారత్‌తో తలపడనున్నాయని తెలిపారు. ఆయన బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. వరల్డ్ కప్ వ్యచ్లు ముగియగానే ఆస్ట్రేలియా ఆడనున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 23న, ఫిబ్రవరి 2 నుంచి భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను విశాఖలో నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసిందని వివరించారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియం ఇప్పటికే అన్ని ఫార్మాట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిందని, ఇటీవల సీఎం జగన్ విశాఖలో మరో స్టేడియం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్‌తో పాటు అన్ని క్రీడలు ఆడుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను 25 ఎకరాల్లో నిర్మించాలన్నారు. దీనిపై ఏసీఏ ప్రణాళిక సిద్ధం చేస్తుందని, స్థల కేటాయింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గోపీనాథ్ రెడ్డి తెలిపారు. చదవండి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు.. -
MS ధోని బయోగ్రఫీ
-
కొత్త పొద్దుపొడుపు
అవును... భారత క్రికెట్లో ఇది కొత్త పొద్దుపొడుపు. దక్షిణాఫ్రికాలో మహిళల తొలి అండర్–19 టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం సాయంత్రం భారతీయ బాలికలు ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి, ప్రపంచ విజేతలుగా నిలిచిన క్షణాలు అలాంటివి. షఫాలీ వర్మ సారథ్యంలో తెలుగమ్మాయి సునీత గొంగడి సహా 15 మంది సభ్యుల టీనేజ్ బాలికల జట్టు తమ విజయంతో దేశ మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్వయంగా దక్షిణాఫ్రికాకు వచ్చి ఫైనల్‌కు ముందు స్ఫూర్తి నింపిన ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా సహా అందరి ఆశలనూ, అంచనాలనూ నిజం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పురుషులకు సమానంగా మహిళలకూ వేతనమివ్వాలని గత అక్టోబర్ చివరలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించిన వేళ... తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏర్పాటైన క్షణాన... వీస్తున్న మార్పు పవనాలకు ప్రపంచ కప్ సాధన ఓ కొత్త జోడింపు. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం 1983లో పురుషుల ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత భారత క్రికెట్ మరింత మెరుగైన రీతిలో సమూలంగా మారిపోయింది. తాజాగా మన బాలికలు సాధించిన విజయం మన మహిళా క్రికెట్‌కు సరిగ్గా అలాంటి ఉత్ప్రేరకమే. గతంలో మన మహిళా క్రికెట్ జట్టు ఒకటి కన్నా ఎక్కువ సార్లే ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరింది. అయితే, ఏ ఫార్మట్‌లోనైనా మన మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ సాధించడం ఇదే తొలిసారి. బీసీసీఐ మహిళా క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో ఈ విజయం ఒక కొత్త ఉత్సాహం, ఊపునిచ్చాయి. విరాట్ కోహ్లీ తదితరులది ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం కాగా, షఫాలీ వర్మ సారథ్యంలోని అండర్–19 వరల్డ్ ఛాంపియన్ బాలికలను రానున్న డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం అనుకోవచ్చు. 2008 బాలుర అండర్–19 వరల్డ్ కప్‌లో కోహ్లీ బృందం ఇలాగే విజయం అందుకుంది. అదే సమయంలో ఐపీఎల్ రావడంతో రాత్రికి రాత్రి పలువురు లక్షాధికారులయ్యారు. ఆటకు అవతార మూర్తులై, ఇంటింటా పాపులర్ అయ్యారు. భారత క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. ఇప్పుడు మన బాలికల జట్టు ప్రపంచ ఛాంపి యన్లుగా అవతరించిన సమయానికి డబ్ల్యూపీఎల్ కొత్తగా వచ్చింది. త్వరలో తొలి డబ్ల్యూపీఎల్ వేలంతో ఈ క్రికెటర్లలో కొందరు లక్షాధికారులు కానున్నారు. కష్టాలు కడతేరి, ఆర్థిక, సామాజిక హోదా మారిపోనుంది. ఈ మ్యాచ్‌ల ప్రసార హక్కులు, పలు ఫ్రాంఛైజీల బిడ్లు దాదాపు రూ. 5.5 వేల కోట్ల పైగా పలికినట్టు వార్త. మహిళా క్రికెట్‌కు ఇవి బంగారు క్షణాలంటున్నది అందుకే. అయితే, ఎన్ని లీగ్‌లు వచ్చినా అంతిమంగా అగ్రభాగాన నిలిపేది ప్రతిభే. భారత అండర్–19 బాలికల క్రికెట్ జట్టు ఈ ఐసీసీ వరల్డ్ కప్‌లో మొదటి నుంచి తన సత్తా చాటుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఆట మెరుగుపరుచుకుంటూ ఆస్ట్రేలియా (ప్రాక్టీస్ మ్యాచ్‌లో) సహా అనేక జట్లను అధిగమించి, ఫైనల్స్‌కు చేరింది. కప్ సాధించింది. మన బాలికల క్రికెట్ ఈ వరల్డ్ కప్ ఘనత సాధించడం వెనుక ఆటగాళ్ళతో పాటు పలువురి పాత్ర ఉంది. జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ) శ్రద్ధ, మహిళా కోచ్ నూషిన్ అల్ ఖదీర్ అసాధారణ అంకితభావం లాంటివి అండగా నిలిచాయి. పద్ధెనిమిదేళ్ళ క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత సీనియర్ మహిళా జట్టులో సభ్యురాలైన నూషిన్ ఆకలిగొన్న పులిలా బరిలోకి దిగి, ఈ టీనేజ్ బాలికలను తీర్చిదిద్దారు. పోటీలోని వివిధ జట్ల క్రికెటర్ల కన్నా ప్రతిభావంతులుగా నిలిపారు. ఈ ప్రతిభాపాటవాలు భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాది. కాలగతిలో సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యంతో బాలికలు ఉరకలెత్తుతున్నారు. దేశంలో మహిళా క్రికెట్ ప్రమాణాలు మెరుగవుతున్నాయనడానికి ఇది ఓ సూచన. నిజానికి, అర్ధశతాబ్ద కాలంలో మన మహిళా క్రికెట్ అనేక శృంఖలాలు తెంచుకొంది. పంజరాలను దాటింది. సామాన్య స్థాయి నుంచి అసామాన్యతకు ఎదిగింది. గడచిన రెండు సీనియర్ల టీ20 వరల్డ్ కప్‌లలో మన మహిళా జట్టు సెమీ ఫైనలిస్టుగా, ఫైనలిస్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో ఈ తొలి అండర్–19 టీ20 కప్‌లో బాలికలు ఏకంగా విజేతలయ్యారు. ఇది వారి జీవితాల్లోనే కాదు... మొత్తం భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు. దేశంలో ఆడపిల్లలకు ప్రత్యేక క్రికెట్ అకాడెమీలు వెలుస్తున్న రోజులివి. ఈ విజయం వాటికి కొత్త ఉత్తేజం. విజేతలకు ఆత్మవిశ్వాసం పెంచే ఔషధం. పురుషులకు భిన్నంగా తగిన పారితోషికం లేకున్నా, ఇంటా బయటా అవమానాలు ఎదురైనా, ఆర్థిక – సామాజిక అవరోధాలున్నా – అవన్నీ దాటుకొని వచ్చిన స్త్రీలు కాబట్టి తాజా విజయం మరింత గొప్పది. ఇది... కూతురు సోనా యాదవ్ క్రికెట్ షూస్ కోసం అదనపు షిఫ్ట్‌లు పనిచేసిన గ్లాస్ ఫ్యాక్టరీ కార్మికుడు, ఆడబిడ్డ త్రిష శిక్షణ కోసం ఉద్యోగం వదిలి భద్రాచలం నుంచి హైదరాబాద్ మారిన తండ్రి... ఇలా ఎందరో తల్లితండ్రుల త్యాగఫలం. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కుటుంబానికే కాదు... దేశానికీ ఎంతటి పేరు తెస్తారో చెప్పడానికి ఇది తాజా దర్పణం. బ్యాడ్మింటన్ తర్వాత భారత మహిళా క్రీడాంగణంలో ఇక క్రికెట్ కొత్త దీపశిఖ. దీన్ని మరింత ప్రజ్వరిల్లేలా చేయాల్సింది ఆటల సంఘాలు, అధికారంలోని పెద్దలే. -
సీక్రెట్ రివీల్ చేసిన సూర్య.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే
న్యూఢిల్లీ: భారత డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన 360 డిగ్రీ మెరుపుల రహస్యం చెప్పాడు. స్కూల్ రోజుల్లో సిమెంట్ ట్రాక్‌పై ఆడే సమయంలోనే తన ‘360’ ఆట మొదలైందన్నాడు. రబ్బర్ బంతులతో క్రికెట్ ఆడే సమయంలో లెగ్‌సైడ్ బౌండరీ 95 గజాల దూరంలో ఉంటే, ఆఫ్‌సైడ్ 25–30 గజాల దూరంలో ఉండేదని...వేగంగా లెగ్‌సైడ్ వైపు దూసుకొచ్చే బంతులను కాకుండా తక్కువ దూరంలో ఉన్న వైపు బౌండరీలు కొట్టేందుకు చేసిన ప్రయత్నమే 360 డిగ్రీ బ్యాటింగ్‌కు కారణమైందన్నాడు. అయితే నెట్స్‌లో మాత్రం అలా ప్రత్యేకించి 360 కోణంలో ఏనాడు ప్రాక్టీస్ చేయలేదని సూర్యకుమార్ చెప్పాడు. స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమన్నాడు. కోహ్లితో ఇటీవల మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. రోహిత్‌తో అయితే తనకు పెద్దన్న అనుబంధమన్నాడు. ముంబై ఇండియన్స్‌లో 2018లో చేరినప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతోందన్నాడు. ‘నా క్రికెట్ ప్రయాణంలో ముంబై ఇండియన్స్, నా భార్య దివిష కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ నుంచి ముంబై ఫ్రాంచైజీకి మారిన తర్వాతే దశ కూడా మారింది. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దింపడంతో నన్ను నేను నిరూపించుకున్నాను. దీనికి సరిగ్గా రెండేళ్ల ముందు 2016లో దివిషతో వివాహమైంది. మేం ఒకటైనట్లే మా ఆలోచనలు ఒకటయ్యాయి. ఆమె వచ్చాక... నేను ముంబైలో చేరాక నా కెరీర్ మరో దశకు చేరింది’ అని వివరించాడు. దశాబ్దం క్రితమే భారత ఎమర్జింగ్ టీమ్ (అండర్–23) కెప్టెన్‌గా ఉన్న తనకు టీమిండియాలో ఎంపికయ్యేందుకు చాలా సమయమే పట్టిందన్నాడు. అయితే ఏనాడు కూడా నిరాశ చెందకుండా జాతీయ జట్టుకు ఎలా చేరాలన్న లక్ష్యంతోనే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నానని సూర్యకుమార్ వివరించాడు. ఒత్తిడిని ఎదుర్కోవడంపై మాట్లాడుతూ పదేళ్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన తనకు ఆటలో ఎదురయ్యే పరిస్థితులు తెలుసని, ఎలా అధిగమించాలో కూడా తెలుసని చెప్పాడు. అవకాశం లభిస్తే భారత టెస్టు జట్టులో కూడా సత్తా చాటగలనని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. -
సంజూ శాంసన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పరాయి దేశం
Sanju Samson: టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్న టీమిండియా యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు పరాయి దేశం ఐర్లాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తమ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని శాంసన్‌కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆహ్వానం పలికినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ, భారత క్రికెట్‌తో తెగదెంపులు చేసుకుని తమ దేశానికి వస్తే, తమ జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను సంజూ తిరస్కరించాడని తెలుస్తోంది. తాను భారత్ తరఫున తప్ప మరే దేశం తరఫున క్రికెట్ ఆడేది లేదని ఖరాకండిగా తెలిపినట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ ఆడితే టీమిండియాకు మాత్రమే ఆడాలని కోరుకుంటానని, ఇతర దేశం తరఫున క్రికెట్ ఆడటాన్ని కలలో కూడా ఊహించలేనని తనను సంప్రదించిన ఐరిష్ ప్రతినిధులకు సంజూ తెలిపాడని వార్తలు వస్తున్నాయి. కాగా, అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్, హిట్టింగ్ అన్నింటికీ మించి మంచి ఫామ్‌లో ఉన్నా, సంజూకు సరైన ఛాన్స్‌లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని అతని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అయినా స్పందించని బీసీసీఐ.. సంజూ మినహా చాలామందికి అవకాశాలు ఇస్తూ పోతుంది. ఇలాంటి ఓ అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్.. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ బాది సంజూకు పోటీగా నిలిచాడు. 28 ఏళ్ల సంజూ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో కేవలం 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. -
మహిళల ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అంటే..?
మహిళల ఐపీఎల్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు వచ్చింది. మహిళల ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఇవాళ (అక్టోబర్ 18) అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ 91వ సాధారణ వార్షిక సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో మహిళల క్రికెట్‌కు క్రమేపీ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ క్రీడల దగ్గర నుండి తాజాగా ముగిసిన ఆసియా కప్ వరకు మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు ఊహించని టీఆర్పీ వచ్చింది. మ్యాచ్‌లు చూసేందుకు జనాలు స్టేడియంలకు ఎగబడ్డారు. దీంతో ఈ ఊపును క్యాష్ చేసుకోవాలని భావించిన బీసీసీఐ వుమెన్స్ ఐపీఎల్‌కు పచ్చజెండా ఊపింది. చాలాకాలంగా ప్రచారంలో ఉన్న విధంగా మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలి ఎడిషన్‌ను ఐదు జట్లతో స్టార్ట్ చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీగ్ ప్రారంభ తేదీ తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా, భారత్‌లో మహిళల క్రికెట్‌కు సంబంధించి టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. 2018లో ప్రారంభమైన ఈ టోర్నీలో మూడు జట్లు (వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్) పాల్గొంటున్నాయి. -
T20 World Cup: అయ్యో బుమ్రా..!
టి20 ప్రపంచకప్‌కు బయల్దేరక ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద షాక్! ఆసీస్ గడ్డపై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించగలడని భావించిన స్టార్ పేసర్ ఇప్పుడు టోర్నీకే దూరం కానున్నాడు. వెన్ను నొప్పి గాయం (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా నొప్పి తిరగబెట్టడంతో తప్పనిసరిగా ఆటకు విరామం పలకాల్సి వచ్చింది. దాంతో అతను టి20 ప్రపంచకప్ వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో మెగా టోర్నీనుంచి తప్పుకోగా, ఇప్పుడు బుమ్రా కూడా లేకపోవడం టీమిండియాను బలహీనంగా మార్చింది. న్యూఢిల్లీ: గాయంనుంచి కోలుకొని విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆట రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో, మూడో టి20లో ఆడిన అతను బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చిందని, అందుకే మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ వెన్ను బాధ అంతటితో ఆగిపోలేదని బుధవారం సాయంత్రం తేలింది. తిరువనంతపురంనుంచి బుమ్రా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి చేరుకున్నాడు. పరీక్షల అనంతరం గాయం తీవ్రమైందని తేలగా, కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావాల్సి ఉందని అర్థమైంది. బీసీసీఐ అధికారికంగా బుమ్రా గాయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన చేయకపోయినా...బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘బుమ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ టి20 ప్రపంచకప్ ఆడే అవకాశం లేదు. అతని వెన్ను గాయం చాలా తీవ్రమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్ కాబట్టి కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది’ అని ఆయన వెల్లడించారు. వరల్డ్ కప్‌కు ప్రకటించిన జట్టులో స్టాండ్‌బైలుగా ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉన్నారు. మొహమ్మద్ షమీ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బుమ్రా గాయాన్ని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తారని, టీమ్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న అక్టోబర్ 15 వరకు వేచి చూడవచ్చని చెబుతున్నా... పూర్తి ఫిట్‌గా లేని ఆటగాడిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. బలమే బలహీనతై... ‘బుమ్రా పూర్తి స్థాయిలో మళ్లీ బౌలింగ్ చేయడం సంతోషంగా అనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే వెన్ను నొప్పితో రెండు నెలలు విశ్రాంతి తీసుకొని మళ్లీ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. అతని ప్రదర్శన ఎలా ఉందన్నది అనవసరం. మెల్లగా లయ అందుకుంటున్నాడు. అతను తిరిగి రావడమే విశేషం. ’...ఆసీస్‌తో రెండో టి20 తర్వాత బుమ్రా గురించి రోహిత్ వ్యాఖ్య ఇది. అయితే మరో మ్యాచ్‌కే గాయం తిరగబెట్టి బుమ్రా మళ్లీ అందుబాటులో లేకుండా పోతాడని బహుశా రోహిత్ కూడా ఊహించి ఉండడు. విజయావకాశాలు ప్రభావితం చేయగల తన స్టార్ బౌలర్ లేకపోవడం ఏ కెప్టెన్‌కైనా లోటే. అయితే బుమ్రా గాయాన్ని బోర్డు వైద్యులు, ఎన్సీఏ పర్యవేక్షించిన తీరే సరిగా కనిపించడం లేదు. బుమ్రా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ఏమీ ఆడటం లేదు. బోర్డు రొటేషన్ పాలసీ, వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతను చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. 2022లో అతను ఐపీఎల్‌తో పాటు 5 టెస్టులు, 5 వన్డేలు, 5 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడాడు. నిజానికి బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కొత్త కాదు. 2019లోనే అతను ఇదే బాధతో మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. నిపుణులు చెప్పినదాని ప్రకారం అతని భిన్నమైన శైలే అందుకు ప్రధాన కారణం. వెన్నునొప్పితోనే అతను ఇటీవలే ఆసియా కప్‌లోనూ ఆడలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ తొందరపాటు కనిపిస్తోంది. అతను పూర్తి స్థాయిలో కోలుకోకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసినట్లుగా అనిపిస్తోంది. లేదంటే ఎన్సీఏ బుమ్రా గాయాన్ని సరిగ్గా అంచనా వేయలేక తగినంత రీహాబిలిటేషన్ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే పూర్తి ఫిట్‌గా ఉంటే రెండు మ్యాచ్‌లకే గాయం తిరగబెట్టడం ఊహించలేనిది. ‘తక్కువ రనప్‌తో ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎంత కాలం ఇలా అతని శరీరం సహకరిస్తుందనేదే నా సందేహం. అది మానవశరీరం. మెషీన్ కాదు’ అని రెండేళ్ల క్రితం దిగ్గజ పేసర్ మైకేల్ హోల్డింగ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు వాస్తవంగా మారినట్లు అనిపిస్తోంది. -
టీమిండియా క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లకు కారణం అదేనా..?
ఇటీవలి కాలంలో టీమిండియా క్రికెటర్లు వరుస పెట్టి రిటైర్మెంట్లు ప్రకటిస్తున్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే భారత ఆటగాళ్లు రాహుల్ శర్మ, సురేశ్ రైనా, ఈశ్వర్ పాండే, తాజాగా రాబిన్ ఉతప్ప భారత క్రికెట్‌తో బంధం తెంచుకున్న విషయం విధితమే. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ క్రికెటర్లు, వయసు ఏమంత పైబడనప్పటికీ వరుసగా క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాలు విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది వీరందరి అభిమతంగా తెలుస్తోంది. క్రికెట్ ఆడేందుకు శరీరం సహకరిస్తున్నప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకోవాలని వీరు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెట్‌తో అనుబంధమున్న ఏ ఆటగాడూ ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో కానీ మరే ఇతర క్రికెట్ బోర్డుల ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో కానీ పాల్గొనే వీలు లేదు. ఈ నిబంధనే వయసు, టాలెంట్ ఉన్న చాలా మంది భారత క్రికెటర్లకు ప్రాణసంకటంలా మారింది. యువ క్రికెటర్లైతే ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడే అవకాశం రాకపోదా అన్న ఆశతో భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకునే సాహసం చేయలేకపోతుంటే.. వయసు పైబడిన ఆటగాళ్లు మాత్రం బీసీసీఐని నమ్ముకుంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న చందంగా తమ బతుకులు మారతాయని ఇష్టం లేకపోయినా భారత క్రికెట్‌తో అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. ఇలా బీసీసీఐతో బంధం తెంచుకున్న వారికి దేశవాళీ క్రికెట్లో కానీ, జాతీయ జట్టుకు కానీ, బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే ఐపీఎల్లో కానీ ఆడే అవకాశాలు రాకపోయినా భారీ ధన ప్రవాహం నడిచే ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వారంతా ఈ కారణంగానే బీసీసీఐతో బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ లీగ్స్ పుట్టుకొచ్చాయి. వీటికి ప్రస్తుతం భారీ గిరాకీ ఉంది. ఐపీఎల్ అంత కాకపోయినా ఆ రేంజ్లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు పర్సులు రెడీ చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఈసీబీ ఆధ్వర్యంలో నడిచే హండ్రెడ్ లీగ్, వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బంగ్లాదేశ్ లీగ్, శ్రీలంక క్రికెట్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఇలా ప్రతి ఐసీసీ అనుబంధ దేశంలో ఓ లీగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో రెండు లీగ్‌లు (యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్) ప్రారంభంకానున్నాయి. ఆటగాళ్లు ఈ లీగ్స్‌లో ఏదో ఒక లీగ్‌లో సక్సెస్ అయితే డబ్బుతో పాటు ఏడాదంతా ఖాళీ లేకుండా క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రారంభంకాబోయే యూఏఈ, సౌతాఫ్రికా లీగ్ల్లోని ఫ్రాంచైజీలను దాదాపుగా ఐపీఎల్ యాజమాన్యాలే కొనుగోలు చేయడంతో భారత వెటరన్ క్రికెటర్ల ఫోకస్ అంతా వీటిపైనే ఉంది. -
బీసీసీఐ సరికొత్త ప్రయోగం.. ఇకపై వయసు దొంగల ఆట కట్..!
క్రికెట్లో వయసు దొంగల పని పట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వయసు దాచి దొంగ సర్టిఫికెట్లతో వివిధ స్థాయిల క్రికెట్లో అవకాశాలు పొందాలనుకునే వారికి ఈ ప్రయోగంతో చెక్ పెట్టనుంది. ఇందుకోసం బీసీసీఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన సరికొత్త సాఫ్ట్వేర్ సేవలను వినియోగించుకోనుంది. ఈ సాఫ్ట్వేర్ వల్ల అతి తక్కువ సమయంలో వయసు మోసాలను గుర్తించడంతో పాటు ఖర్చులు కూడా 80 శాతం మేరకు ఆదా అవుతాయని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం వయసు సంబంధిత మోసాలను గుర్తించేందుకు బీసీసీఐ టీడబ్ల్యూ3 (ఎడమ చేయి, మణికట్టు ఎక్స్‌రే ఆధారంగా) విధానాన్ని ఉపయోగిస్తోంది. ఈ విధానంలో ఒక్కో పరీక్షకు రూ.2400 ఖర్చవుతోంది. అంతేకాకుండా 3-4 రోజుల సమయం పడుతోంది. అదే బోన్ ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ సాయంతో అయితే ఫలితం క్షణాల్లో రావడంతో పాటు ఖర్చు కూడా రూ. 288 రూపాయలే అవుతుంది. దీంతో బీసీసీఐ ఈ సరికొత్త సాఫ్ట్వేర్ సాయంతో వయసు దొంగల ఆట కట్టించాలని నిర్ణయించింది. దీంతో పాటు సంప్రదాయ టీడబ్ల్యూ3 టెస్ట్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, భారత క్రికెట్లో వయసు తక్కువగా చూపుతూ (తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలతో) వివిధ స్థాయిల క్రికెట్లో అవకాశాలు పొందాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. 2019 జూన్‌లో జమ్ముకశ్మీర్ పేసర్ రసిక్ ఆలమ్ తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కేసులో రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. ఇలా తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారిలో చాలా మంది పాపులర్ క్రికెటర్లు కూడా ఉన్నారు. చదవండి: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..! -
షేక్ రషీద్‌కు రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం
సాక్షి, అమరావతి: భారత క్రికెట్ అండర్ –19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను వైఎస్ జగన్ అభినందిస్తూ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం కేటాయింపుతో పాటు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ రషీద్ గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన 17 ఏళ్ల రషీద్.. అంతర్జాతీయ క్రికెట్లో చక్కగా రాణిస్తూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలో, అండర్ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలో ఇతను కీలకపాత్ర పోషించాడు. కాగా, రషీద్ సీఎంను కలిసిన సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు ఉన్నారు. -
తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు..!!
-
మ్యాగజైన్ స్టోరీ 01 November 2021
-
అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను!
లండన్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం వచ్చే టి20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఆ తర్వాత కొనసాగించేందుకు అతను ఆసక్తి చూపించడం లేదు. కోచ్‌గా ఎంతో సాధించానని, గడువు పూర్తయిన తర్వాత ఆగిపోయే మనస్తత్వం తనది కాదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటికే కోచ్‌గా నేను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను. టెస్టుల్లో ఐదేళ్లు నంబర్‌వన్‌గా ఉండటం, ఆ్రస్టేలియాలో రెండుసార్లు సిరీస్ సాధించడం, కరోనా సమయంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టులు గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవడంలాంటివి అద్భుతం. నా నాలుగు దశాబ్దాల క్రికెట్లో ఇది ఎంతో సంతృప్తికర క్షణం. వీటికి తోడు టి20 ప్రపంచకప్ కూడా గెలిస్తే అది అదనపు ఆనందాన్నిస్తుంది. గెలవగల సత్తా మా టీమ్‌కు ఉంది కూడా. మనకు ఇచ్చిన సమయంకంటే అదనంగా ఒక్క క్షణం కూడా ఆగవద్దని నేను నమ్ముతాను. అందుకే సరైన సమయంలోనే తప్పుకుంటున్నాను’ అని రవిశాస్త్రి వివరించాడు. -
టి20లకు సారథ్యం వహించను: కోహ్లి
భారత క్రికెట్లో కీలక పరిణామం. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లి టి20 కెపె్టన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ప్రపంచకప్ తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకే అంటూ కోహ్లి చెప్పుకున్నా... రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పెరుగుతున్న డిమాండ్లు సహా ఇతర అంశాలు కూడా అతనిపై ప్రభావం చూపించి ఉండవచ్చు. అన్నింటిని మించి టి20 వరల్డ్‌కప్ తర్వాత తప్పుకునేట్లయితే టోర్నీకి ముందు అలాంటి ప్రకటన చేయడం మాత్రం అనూహ్యం. ముంబై: సోమవారం... టి20 ఫార్మాట్ కెపె్టన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నట్లు మీడియాలో వార్తలు. దీనిని ఖండించిన బీసీసీఐ ప్రతినిధులు... సారథిగా కోహ్లినే కొనసాగుతాడని, అసలు భారత క్రికెట్లో వేర్వేరు కెప్టెన్ల పద్ధతి పని చేయదని స్పష్టీకరణ! గురువారం... టి20 వరల్డ్‌కప్ తర్వాత కెపె్టన్‌గా ఉండనని కోహ్లి మనసులో మాటను వెల్లడించగా, గత ఆరు నెలలుగా దీనిపై తాము చర్చిస్తున్నామని బోర్డు ప్రకటన! మొత్తంగా సారథి హోదాలో తన తొలి టి20 ప్రపంచకప్ తర్వాత ఆ బాధ్యతల నుంచే దూరమయ్యేందుకు విరాట్ నిర్ణయించుకున్నాడు. ధోని రాజీనామాతో జనవరి 26, 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లి కెపె్టన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు. చదవండి: అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని సరైన నిర్ణయమేనా! కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు భారత్ 67 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ 45 మ్యాచ్‌లే ఆడాడు. కాబట్టి పని భారం అనలేం! కోహ్లి స్థాయి ఆటగాడు ఇకపై ఏడాదికి 10–12 మ్యాచ్‌లలో నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటే పెద్ద తేడా ఏముంటుంది. 45 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే 27 గెలిచి, 14 ఓడిపోగా, మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఇది మెరుగైన రికార్డే. పైగా ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో టి20 సిరీస్‌లు గెలిచిన ఏకైక ఆసియా కెపె్టన్‌గా ఘనత. కాబట్టి కెపె్టన్‌గా విఫలమయ్యాడని చెప్పలేం! 2017 నుంచి ఓవరాల్‌గా చూస్తే టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో (1,502) ఉన్నాడు. ఎంతో మంది రోహిత్ అద్భుతం అని చెబుతున్నా... ఈ కాలంలో రోహిత్‌తో పోలిస్తే 5 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి కూడా అతనికంటే (1,500) రెండు పరుగులు ఎక్కువే చేశాడు. అంటే సారథ్యంలోనూ బ్యాట్స్‌మన్‌గా సూపర్ సక్సెస్! మరి తప్పుకోవడానికి బలమైన కారణం ఏమిటి? పైగా భారత జట్టు నాయకత్వానికి సంబంధించి ఆరు నెలలుగా తమ మధ్య చర్చలు సాగుతున్నాయని జై షా చెప్పడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇదేమీ కోహ్లి అనూహ్య నిర్ణయం కాదని అనిపిస్తోంది. గణాంకాల లోతుల్లోకి వెళ్లకుండా సగటు అభిమాని కోణంలో చూస్తే టి20లకు రోహిత్ సరైన కెప్టెన్ అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. చదవండి: టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్! ముఖ్యం గా ఐపీఎల్ ప్రదర్శన ఇద్దరి మధ్య నాయకత్వ అంతరాన్ని బాగా చూపించింది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిస్తే... 2011 సీజన్ నుంచి కెప్టెన్‌గా ఉన్నా కోహ్లి ఒక్కసారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. దాంతో భారత జట్టు టి20 మ్యాచ్‌లు ఆడిన ప్రతీ సందర్భంలో పోలిక మొదలైంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ కెప్టెన్సీలో 19 మ్యాచ్‌లు ఆడిన భారత్ 15 గెలిచి, 4 ఓడింది. అతని సారథ్యానికి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో మరింత చర్చలకు అవకాశం ఇవ్వకుండా కెపె్టన్సీ విషయంలో కొంత ఉపశమనం పొందాలని కోహ్లి భావించి ఉంటాడు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రకటన సమయం మాత్రం సరైంది కాదు. గెలిచినా, ఓడినా వరల్డ్‌కప్ తర్వాతే దీని గురించి చెప్పి ఉంటే మెరుగ్గా ఉండేది! భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం కూడా వహించే అదృష్టం నాకు దక్కింది. సారథిగా ఉన్న నాకు ఈ ప్రయాణంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, కోచ్‌లతో పాటు జట్టు గెలవాలని కోరుకున్న ప్రతీ భారతీయుడికి నా కృతజ్ఞతలు. గత 8–9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతూ 5–6 ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాపై తీవ్ర పనిభారం ఉంది. దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించేందుకు నాకు కొంత ఉపశమనం అవసరం. సారథిగా జట్టుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన నేను, ఇకపై టి20 బ్యాట్స్‌మన్‌గా కూడా అదే తరహాలో శ్రమిస్తాను. ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది. మున్ముందూ భారత జట్టుకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. –కోహ్లి -
భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్
ఢిల్లీ: భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మనన్ శర్మ భారత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విదేశీ లీగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని.. అందుకే భారత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా త్వరలోనే యూఎస్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడేందుకు కాలిఫోర్నియా బయలుదేరి వెళుతున్నట్లు మనన్ శర్మ స్ఫష్టం చేశాడు. చదవండి: భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ చంద్ 2017లో ఢిల్లీ తరపున భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన మనన్ శర్మ 35 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1208 పరుగులు(ఒక సెంచరీ.. 8 అర్థసెంచరీలు) ,113 వికెట్లు తీశాడు.ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 560 పరుగులు చేసిన మనన్ శర్మ 26 టీ20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీశాడు. ఇక 2016లో మనన్ శర్మను రూ.10 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కాగా ఢిల్లీ క్రికెట్లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, గౌతమ్ గంభీర్లతో మనన్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. కాగా మనన్ శర్మ తండ్రి అజయ్ శర్మ భారత మాజీ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. 1988లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అజయ్ శర్మ టీమిండియా తరపున 31 వన్డేలు.. ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతలో దోషిగా తేలిన అజయ్ శర్మపై జీవితకాల నిషేదం పడింది. అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరమయ్యాడు. చదవండి: నీరజ్ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్ ఆగ్రహం -
భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ చంద్
ముంబై: భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ శుక్రవారం భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్ చంద్ స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్మక్త్ ట్విటర్ వేదికగా బీసీసీఐకి సుధీర్ఘ నోట్ రాశాడు. కాగా 2012 అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్ చంద్ (111 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఈ మధ్య కాలంలో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఇండియా జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. స్వతహాగా మంచి టెక్నిక్‌తో షాట్లు ఆడే ఉన్ముక్త్ ఆ తర్వాత ఎందుకనో మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేక వెనుకబడిపోయాడు. ఇక ఉన్ముక్త్ చంద్ 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్లో 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన చంద్ 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్ చంద్ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు. ఇక భారత్ క్రికెట్‌కు తన రిటైర్మెంట్పై ఉన్ముక్త్ చంద్ స్పందిస్తూ..'' భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం కాస్త బాధ కలిగించింది. తాజా రిటైర్మెంట్తో భారత్ క్రికెట్‌కు ఇక ప్రాతినిధ్యం వహించలేననే విషయం ఒక నిమిషం నా గుండెను ఆపేసింది. కానీ విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకాలం నాకు అండగా నిలిచిన భారత క్రికెట్ ప్రేమికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. T1- On to the next innings of my life #JaiHind🇮🇳 pic.twitter.com/fEEJ9xOdlt — Unmukt Chand (@UnmuktChand9) August 13, 2021 -
కార్తీక్ నాయకత్వంలో తమిళనాడు తడాఖా
అహ్మదాబాద్: ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న తమిళనాడు క్రికెట్ జట్టు దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో బరోడాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీని అజేయంగా ముగించిన తమిళనాడు 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చాంపియన్ అయ్యింది. చివరిసారి తమిళనాడు 2007లో టైటిల్ గెల్చుకుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా తమిళనాడు, బరోడా ఫైనల్ చేరగా... తుది పోరులో తమిళనాడుదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (49; ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తమిళనాడు బౌలర్ మణిమారన్ సిద్ధార్థ్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తమిళనాడు, 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. హరి నిశాంత్ (35; 3 ఫోర్లు, సిక్స్), బాబా అపరాజిత్ (29 నాటౌట్; ఫోర్), దినేశ్ కార్తీక్ (22; 3 ఫోర్లు), షారుఖ్ ఖాన్ (18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. -
ఘనంగా భారత క్రికెటర్ విజయ్ శంకర్ వివాహం
చెన్నై: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గురువారం వివాహం చేసుకున్నాడు. గతేడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం చేసుకోగా తాజాగా గురువారం వైశాలి విశ్వేశ్వరను పెళ్లాడాడు. అయితే ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య చెన్నెలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విజయ్ శంకర్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు ఆటగాడు. దీంతో విజయ్ శంకర్‌కు సన్‌రైజర్స్ బృందం శుభాకాంక్షలు తెలిపింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను విజయ్ శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వివాహం చేసుకున్న విజయ్ శంకర్‌కు భారత జట్టు ఆటగాళ్లు రాహుల్, చాహల్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ శంకర్ 2018లో భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు. తొలిమ్యాచ్ శ్రీలంకతో జరిగిన టీ- 20లో ఆడాడు. 2019 వరల్డ్ కప్ భారత జట్టులో విజయ్ ఉన్నాడు. ఇప్పటివరకు విజయ్‌శంకర్ 12 వన్డేలు, 9 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. -
రోహిత్ శర్మకు ప్రమోషన్
న్యూఢిల్లీ: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు కొత్త ఏడాది వస్తూనే కానుక ఇచ్చింది. ఇప్పుడు ‘హిట్‌మ్యాన్’ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. ఐపీఎల్లో చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన రోహిత్‌ను కోహ్లి లేని భారత టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ రహానేకు చేదోడు–వాదోడుగా నియమించారు. దీంతో వైస్ కెప్టెన్ బాధ్యతల్లేని చతేశ్వర్ పుజారా ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ‘బాక్సింగ్ డే’ టెస్టులో పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ తాత్కాలికమే! రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి పెటర్నటీ లీవ్స్ ముగించుకొని రాగానే మళ్లీ రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు వెల్లడించారు. అతను తుది జట్టులో ఖాయమైనప్పటికీ ఓపెనింగ్‌లో దిగుతాడా లేదంటే మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడా అన్నదానిపై స్పష్టత లేదు. 14 రోజుల క్వారంటైన్ పూర్తయిన రోహిత్ శర్మ జట్టుతో చేరాడు. ప్రస్తుతం మూడో టెస్టు కోసం అతను సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరుగుతుంది. (చదవండి: ఆ మ్యాచ్‌లో నన్ను గెట్ అవుట్ అన్నారు) -
విరాట్‌లో మార్పు తెచ్చిన పుస్తకం
విరాట్ కోహ్లి... యంగ్ జెనరేషన్‌కు రోల్‌మోడల్. ఆయనకు బాగా నచ్చిన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. ‘జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసిన పుస్తకం’ అని కోహ్లి అంటున్న ఈ పుస్తకంలో ఏముంది?‘క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్వీల కన్నా, జ్ఞానమార్గాన్ని అనుసరించే వారి కన్నా, కర్మమార్గాన్ని అనుసరించే వారికన్నా యోగి ఉన్నతుడుగా భావించబడతాడు. ఓ అర్జునా...నువ్వు యోగివి కమ్ము’ అంటూ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. పరమహంస యోగానంద (1893–1952) అచ్చంగా అలాంటి యోగి. ఆయన ఆత్మకథ ఈ పుస్తకం. యోగానంద అద్భుతమైన బాల్యానుభవాలు, జ్ఞాని అయిన ఒక గురువు కోసం యవ్వనంలో ఆయన చేసిన అన్వేషణలో తారసపడిన అనేకమంది సాధుసంతులతో జరిగిన విలువైన పరిచయాలు, దైవసాక్ష్యాత్కారం పొందిన గురుదేవుల ఆశ్రమంలో పదిసంవత్సరాలు సాగిన శిక్షణా, రెండు శరీరాలున్న సాధువులు, టైగర్స్వామి, నిద్రపోని సాధువు, గ్రహాల్ని ఓడించడం, సన్యాస స్వీకరణ, క్రియాయోగశాస్త్రం, యుక్తేశ్వర్ పునరుత్థానం, గాలిలో తేలే సాధువు, హిమాలయాల్లో మహాభవన సృష్టి, నిరాహార యోగిని, సనాతన భారతీయ ధ్యానప్రక్రియ విశ్వవ్యాప్తం చేసే కృషి...ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు పుస్తకంలో మనల్ని కట్టిపడేస్తాయి. యోగుల గురించి ఒక యోగి స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాఠకులను ఆకట్టుకుంది. గోరఖ్‌పూర్‌లో పుట్టిన ముకుందలాల్ ఘోష్ పరమహంస యోగానందగా పరివర్తన చెందిన క్రమమే ఈ పుస్తకం. మనసు, ఆత్మకిటికీలు తెరిచే అద్భుతమైన పుస్తకం. -
గంగూలీ చేసిందేమీ లేదు!
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్(ఐసీఏ)లో డైరెక్టర్లతో ఏమీ చర్చించకుండానే బహిరంగ విమర్శలు చేస్తున్న ప్రెసిడెంట్ అశోక్ మల్హోత్రా మరోసారి వివాదానికి తెరలేపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ ఇప్పటివరకూ 10 నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నా వృద్ధాప్యంలో ఉన్న మాజీ క్రికెటర్ల డిమాండ్ల విషయంలో చేసేందేమీ లేదంటూ బహిరంగ విమర్శలు చేశారు. సోమవారం పీటీఐతో మాట్లాడుతూ.. ‘ గంగూలీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మాజీ క్రికెటర్లకు ఇప్పటివరకూ ఎటువంటి మేలు జరగలేదు. భర్తలు కోల్పోయిన మాజీ క్రికెటర్ల భార్యలు దగ్గర్నుంచీ, మెడికల్ ఇన్సురెన్స్‌ను ఐదు నుంచి పది లక్షల రూపాయలకు పెంచమన్న ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు. (‘రిషభ్ పంత్‌ను చూస్తే బాధేస్తోంది’) బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ 10 నెలల నుంచి కొనసాగుతున్నా మాజీ క్రికెటర్లకు అందించాల్సిన చేయూతలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. మాజీ క్రికెటర్ల సంక్షేమం కోసం పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించండి. చాలా మంది ఇప్పటికే 70 ఏళ్ల ఒడిలో ఉన్నారు. వారిని ఇంకా నిరీక్షించాలే చేయడం తగదు.. వారు కూడా వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉండదు గంగూలీతో పాటు ఐసీఏ ప్రతినిధులుగా ఉన్న శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్‌లు మా డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలి. పరిస్థితిని అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని అశోక్ మల్హోత్రా విజ్ఞప్తి చేశారు. అశోక్ మల్హోత్రా బీసీసీఐకి అభ్యర్ధించిన దాంట్లో మానవతా కోణం ఉన్నప్పటికీ బహిరంగంగా చెప్పడమే వివాదంగా మారుతూ వస్తోంది. ప్రధానంగా ఐసీఏలో డైరెక్టర్లతో ఎవరితో కనీసం చర్చించకుండానే మల్హోత్రా ఇలా మీడియా ఎదుట మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఐసీఏలో డైరెక్టర్లంతా తమకు ఈ విషయంతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ మల్హోత్రాను దోషిగా నిలబెట్టే యత్నం చేస్తున్నారు. -
ధోని ఆంతర్యం ఏమిటో ?
సాక్షి క్రీడా విభాగం: మ్యాచ్‌లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్‌తో గెలిపించడం మహేంద్ర సింగ్ ధోనికి ‘ఐస్’తో పెట్టిన విద్య. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకోవడం అతనికి అలవాటైన ఆట. అనూహ్య ఆలోచనలు, వ్యూహాలు అతనికి కొత్త కాదు. అభిమానులను అలరిస్తూ అరుదైన విజయాలు అందించినా... అవమానకర పరాజయాల్లో కూడా అదే నిగ్రహాన్ని ప్రదర్శించినా అది ధోనికే చెల్లింది. కొందరి దృష్టిలో అతనో అద్భుతమైతే మరికొందరి దృష్టిలో అతనో ‘సుడిగాడు’ మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్లో ధోని ఒక అద్భుతం. ‘నేను సిరీస్ గెలిచినా ఓడినా నా ఇంట్లో పెంపుడు కుక్కలు నన్ను ఒకే తరహాలో చూస్తాయి’ అంటూ విమర్శకులకు ఘాటుగా జవాబిచ్చినప్పుడు ‘మిస్టర్ కూల్’లోని మరో రూపం బయటకు వస్తుంది. ఓటమికి కారణాలు విశ్లేషించమని కోరినప్పుడు ‘మీరు చనిపోవడం ఖాయమైనప్పుడు ఎలా చస్తే ఏం. అది కత్తితోనా, తుపాకీతోనా అని అడిగితే ఎలా’ అన్నప్పుడు అతనిలో వ్యంగ్యం వినిపిస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి ధోని ధోనిలాగే ఉన్నాడు. ఎవరి కోసమో అతను మారలేదు. ధోని పేరు ప్రఖ్యాతులను పట్టించుకోలేదు. కానీ అవే అంగవస్త్రాల్లా అతని వెంట నడిచాయి. తాను బ్యాట్స్‌మన్‌గా ఆటలో ఎంతో నేర్చుకున్నాడు. అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నాడు. అంతే కానీ తన బ్యాటింగ్ శైలి బాగుండకపోవడం గురించి ఎప్పుడూ చింతించలేదు. కీపింగ్ శైలి కూడా ఇంటి ఆవరణలో తనకు తాను నేర్చుకున్నదే తప్ప కోచింగ్ సెంటర్లో కుస్తీలు పట్టడం వల్ల రాలేదు. కానీ అదే అతనికి కీర్తి కనకాదులు తెచ్చి పెట్టింది. నాయకత్వ ప్రతిభ కవచ కుండలాల్లా ధోనితో కలిసిపోయింది. ఫలితంగా ఎన్నో అరుదైన ఘనతలు, గొప్ప విజయాలు, మరెన్నో రికార్డులు. మహేంద్రుడి సారథ్యం మన క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది. 2019 జూలై 9న ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోని తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇప్పుటికి సరిగ్గా ఏడాదవుతోంది. ఆ తర్వాత అతను కనీసం స్థానిక మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. రేపు నిజంగా ఏదైనా సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి వస్తే ఈ సంవత్సరపు విరామాన్ని సెలక్టర్లు ఎలా చూస్తారు. ఎంత గొప్ప ధోని అయినా అసలు ఇంత కాలం ఆడకుండా అతడిని నేరుగా జాతీయ జట్టులోకి తీసుకురాగలరా అనేదానిపై కూడా తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఎమ్మెస్ తనంతట తానుగా ఏదైనా చెబితే తప్ప ఏదీ తెలీదు. అయినా ధోని నిజంగా తప్పుకోవాలనుకుంటే ముహూర్తాలు, పుట్టిన రోజు సందర్భాలు చూసుకునే రకం కాదు. భవిష్యత్తు ఎలా ఉన్నా క్రికెట్ అభిమానులకు ఎమ్మెస్ పంచిన మధుర జ్ఞాపకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరుగులు, గణాంకాల గురించి కాసేపు పక్కన పెడితే ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్‌స్టయిల్’ అనే కేక మీ చెవుల్లో ఎప్పటికీ మారు మోగిపోతూనే ఉంటుంది. ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ముగిసిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ధోని క్రికెట్ పరుగు పిచ్ మధ్యలో ఆగిపోయింది. ఏదో ఒక ఎండ్‌కు చేరుకోకుండా ఒక రకమైన గందరగోళ స్థితిలో ఉంది. నిస్సందేహంగా మాహికి ఆటపై పిచ్చి ప్రేమ ఉంది. కానీ కనుచూపు మేరలో క్రికెట్ కనిపించని వేళ అతని ఆలోచనలేమిటో కనీసమాత్రంగా కూడా ఎవరూ ఊహించలేరు. తన ఆంతర్యం ఏమిటో బయట పెట్టడు. తన మౌన ముద్రను వీడి మాట్లాడడు. బాహ్య ప్రపంచానికి దూరంగా తన మానాన తాను ఫామ్ హౌస్‌లో కుటుంబంతో, పెంపుడు కుక్కలతో ఆడుకోవడం మినహా క్రికెట్ గురించి పట్టించుకోడు. ఐపీఎల్ కోసం మొదలు పెట్టిన సాధన కరోనా దెబ్బతో ఆగిపోయింది. అక్కడ ఆడితే అనుభవం కోసమైనా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌కు వెళ్లవచ్చని అంతా అనుకున్నారు. కానీ అటు ఐపీఎల్ లేదు ఇటు ప్రపంచకప్ సంగతి దేవుడెరుగు. అనుభవాన్ని, అందించిన విజయాలను గౌరవిస్తూ గత సెలక్షన్ కమిటీ విశ్రాంతి అంటూనో, మరో కారణం చెప్పో అధికారికంగా వేటు మాట చెప్పలేకపోయింది. బోర్డులో మరెవరూ ధోని ఆట ముగిసిందని చెప్పే సాహసం చేయలేదు. గంగూలీ కూడా నాకు అతని భవిష్యత్తు గురించి అంతా తెలుసు అంటాడే తప్ప ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కచ్చితంగా చెప్పడు. కోచ్ రవిశాస్త్రితోనో, కోహ్లి నోటి వెంటనో ధోనికి ఆసక్తి తగ్గిందన్నట్లుగా పరోక్ష సంకేతాలే వస్తాయి తప్ప ఆట ముగిసిపోయిందని స్పష్టంగా ఎవరూ ఏమీ చెప్పరు. కొత్త సెలక్షన్ కమిటీకి ఇంకా ఇప్పటి వరకు పని చేయాల్సిన అవసరమే రాలేదు. -
కరోనాపై గెలుపొందాలి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కోవిడ్–19పై విజయం ఓ మెగా ప్రపంచకప్ విజయం లాంటిదని అన్నారు. బుధవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘అన్ని ప్రపంచకప్‌లకంటే పెద్దది ఈ మహమ్మారి. దీనిపై పోరాటం చేయాలి. గెలవాలి. ఇందులో గెలిస్తే ప్రపంచకప్‌ను సాధించినట్లే. దీని కోసం మనం రెండు లక్ష్యాలు పెట్టుకోవాలి... ఒకటి ఇంట్లోనే ఉండటం. రెండోది భౌతిక దూరం పాటించడం’ అని ఈ వీడియోలో పేర్కొన్నారు. శాస్త్రి ఓ కోచే కాదు... మాజీ ఆల్‌రౌండర్, ఆ తర్వా త మంచి వ్యాఖ్యాత కూడా! అం దుకే తనదైన కామెంటేటర్ శైలిలో వీడియో సందేశమిచ్చారు. ‘కరోనా మనల్ని ఇంట్లోనే కట్టేసింది. నాలుగ్గోడలకు పరిమితం చేసిన ఈ మహమ్మారిని ఛేదించడం ప్రపంచకప్ లక్ష్యాన్ని ఛేదించడం లాంటిది. అందుకే అందరం కలసికట్టుగా ఈ కప్ గెలవాలంటే... కరోనాను ఓడించాల్సిందే. నిజానికి ఇది మామూలు ప్రపంచకప్ కప్ కాదు సుమా! అందుకే దీన్ని ఓడించేందుకు ఫైనల్ ఎలెవన్ జట్టు సరిపోదు. కోట్ల మంది టీమిండియా తరఫున పోరాడాలి. అప్పుడే గెలుస్తాం. అందరూ దృఢ సంకల్పంతో ఉండండి. కరోనాను భారత్ నుంచి తరిమేయండి’ అని రవిశాస్త్రి ప్రజల్ని జాగృతం చేస్తున్నారు. -
భారత్ క్రికెట్ చరిత్రలో ‘రికార్డు’ స్కోరు
కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. అత్యధిక తొలి ఇన్నింగ్స్ లీడ్‌లో చండీగఢ్ నయా అధ్యాయాన్ని లిఖించింది. రంజీ ట్రోఫీలో రౌండ్-9 ప్లేట్ గ్రూప్‌లో భాగంగా మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌కు 609 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మణిపూర్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 26. 4 ఓవర్లలో63 పరుగులకే కుప్పకూలగా, ఆపై చండీగఢ్ 672/8 వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. బిపుల్ శర్మ(200; 276 బంతుల్లో 27 ఫోర్లు, 4 సిక్స్‌లు), గురిందర్ సింగ్( 200 నాటౌట్; 171 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి చండీగఢ్ భారీ స్కోరులో పాలుపంచుకున్నారు. వీరికి జతగా కీపర్ ఉదయ్ కౌల్(148) భారీ సెంచరీ సాధించడంతో చండీగఢ్ ఆరొందలకు పైగా స్కోరును నమోదు చేసింది. ఫలితంగా భారత క్రికెట్ చరిత్రలో నాల్గో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చండీగఢ్ లిఖించింది. ఫిబ్రవరి 12వ తేదీన(బుధవారం) మ్యాచ్ ఆరంభం కాగా, రెండో రోజు ఆటకే మణిపూర్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం గమనార్హం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్ జట్టు వికెట్ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. కాగా, మణిపూర్ జట్టును నిన్న తొలి సెషన్లోనే ఆలౌట్ చేసి, దాదాపు రెండు రోజులు పాటు ఆడిన చండీగఢ్ అరుదైన రికార్డును నమెదు చేసింది. ఇప్పటివరకూ భారత క్రికెట్ ఫస్ట్‌క్లాస్ హిస్టరీలో తాజా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కంటే మూడు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యం సాధించిన జట్లలో హెల్కర్ జట్టు 722 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ను సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. 1945-46 సీజన్లో హోల్కర్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో912 పరుగులకు డిక్లేర్ చేయగా, మైసూర్ 190 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత 1993-94 సీజన్లో హైదరాబాద్ 681 పరుగుల ఆధిక్యాన్ని సాధించి రెండో స్థానంలో ఉంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తన తొలి ఇన్నింగ్స్‌లో 944/6 వద్ద డిక్లేర్డ్ చేయగా, ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.ఇక 2014-15 సీజన్లో కర్ణాటక 628 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. తమిళనాడు జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 762 పరుగులు చేయగా, తమిళనాడును 134 పరుగులకు ఆలౌట్ చేసింది. -
రంజీ జరుగుతుంటే ‘ఎ’ మ్యాచ్‌లు ఎందుకు?
ముంబై: భారత క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన రంజీ ట్రోఫీ స్థాయిని బీసీసీఐ అధికారులే రాన్రానూ దిగజారుస్తున్నారని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ విమర్శించారు. రంజీ ట్రోఫీలో కొనసాగుతున్న సమయంలో ‘ఎ’ జట్టు పేరుతో అగ్రశ్రేణి ఆటగాళ్లను విదేశీ పర్యటనలకు పంపడంలో ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే మరోవైపు అండర్–19 ప్రపంచకప్ కూడా జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఎక్కువ క్రికెట్ ఆడటం వల్ల మన ఆటగాళ్లు అలసిపోతున్నారనే మాట గత కొన్నేళ్లలో తరచుగా వినిపిస్తోంది. ఒక్కసారి ఐపీఎల్ వచి్చందంటే చాలు ఎవరికీ అలసట ఉండదు. ఇలా చేసే రంజీ ట్రోఫీ విలువను తగ్గిస్తున్నారు. సీనియర్ టీమ్ కివీస్ పర్యటనలో ఉందంటే అది ద్వైపాక్షిక ఒప్పందం కాబట్టి అర్థముంది. అదే సమయంలో ‘ఎ’ జట్టును అక్కడకు పంపాల్సిన అవసరం ఏమిటి. దీనివల్ల ప్రతీ రాష్ట్ర జట్టులో కీలక ఆటగాళ్లు రంజీ ట్రోఫీకు దూరమై టోర్నీ కళ తప్పుతోంది. పైగా నాకౌట్‌కు అర్హత సాధించాల్సిన సమయంలో కొన్ని టీమ్‌లు ఒక్కసారిగా బలహీనంగా మారిపోతున్నాయి. సీనియర్ జట్టులో ఎవరైనా గాయపడితే దగ్గరలో అందుబాటులో ఉంటారనే వాదన సరైంది కాదు. ప్రపంచంలో ఏ జట్టు కూడా ఇలా చేయడం లేదు. తమ దేశవాళీ సీజన్ సమయంలో ఏ టీమ్ కూడా విదేశీ పర్యటనలకు ఆటగాళ్లను పంపించదు.ఐపీఎల్ జరిగే సమయంలో ‘ఎ’ టూర్లు, అండర్–19 సిరీస్‌లు ఏర్పాటు చేస్తారా?’ అని ఆయన సూటిగా ప్రశి్నంచారు. -
ఇదంతా రాహుల్ ద్రవిడ్ సర్ వల్లే..
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత జట్టకు ఎంపిక కావడంతో భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను అండర్-19 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం వెనుక మాజీ కోచ్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందన్నాడు. ఇప్పుడు తాను నిలకడగా పరుగులు చేస్తున్నానంటే అదంతా ద్రవిడ్ సర్ వల్లే అంటూ జైస్వాల్ స్పష్టం చేశాడు. ‘ ఆడే ప్రతీ బంతిపై ఫోకస్ పెట్టమని ద్రవిడ్ సర్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవారు. ఏ బంతిని నువ్వు ఎదుర్కొంటున్నావో అప్పుడు ఆ బంతిపై దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేవారు. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషనల్లో ఏ ఏరియాల్లో నేను బలహీనంగా ఉన్నానో వాటిని సరిచేసేవారు. ఇలా ద్రవిడ్ సర్ చెప్పిన ప్రతీ విషయం నాకు చాలా ఉపయోగపడింది’ యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు. ఇక తన ప్రదర్శన గురించి జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ నేను ప్రతీ మ్యాచ్‌ను ఒకే రకంగా ఆస్వాదిస్తాను. నేను కింది స్థాయిలో ఎంత సహజ సిద్ధంగా ఆడానో అదే ప్రదర్శనను రిపీట్ చేయడంపై ఫోకస్ చేస్తా. నా ఆటపైనే దృష్టి పెడతా.. ఫలితాలపై కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తా’ అని జైస్వాల్ తెలిపాడు. విజయ్ హజారే ట్రోఫీలో మూడు డబుల్ సెంచరీలతో యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నాడు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. దాంతో అండర్-19 వరల్డ్‌కప్ జట్టులో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. అక్టోబర్‌లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి 203 పరుగులు సాధించాడు. ఫలితంగా అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. -
అనుభవం కాదు... అంకితభావం ముఖ్యం!
ఎమ్మెస్కే ప్రసాద్ ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎన్ని...? అతని అనుభవం ఎంత? ఏడాది పాటు సెలక్టర్‌గా, ఆ తర్వాత చీఫ్ సెలక్టర్‌గా పని చేసిన మూడేళ్ల కాలంలో అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి లెక్క లేనన్ని సందర్భాల్లో ఈ ప్రశ్న ఎదురవుతూ వచ్చింది. ముఖ్యంగా కీలక, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నప్పుడైతే వీరంతా ప్రసాద్‌ను విమర్శించడంలో ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. కానీ సెలక్టర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించడం తప్ప విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెస్కే వ్యాఖ్యానించారు. ముంబై: భారత జట్టు సాధిస్తున్న విజయాలే తమ సెలక్షన్ కమిటీ పనితీరుకు సూచిక అని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘మేం ఎన్ని మ్యాచ్‌లు ఆడామన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా, ఎంత అంకితభావంతో పని చేశామన్నదే ముఖ్యం. మాకంటే ఎక్కువ క్రికెట్ ఆడినవాళ్లు కూడా సెలక్టర్లుగా విఫలమయ్యేవారేమో. ఏదేమైనా విజయాలే మన గురించి చెబుతాయి. ప్రస్తుతం భారత జట్టు అన్ని ఫార్మాట్లలో ఎలా ఆడుతుందో చూస్తే చాలు. గతంలో ఏ సెలక్షన్ కమిటీకి కూడా మా అంత మెరుగైన రికార్డు లేదు. అనుభవం లేనివాళ్లమే అయినా విజయవంతమైన జట్లను ఎంపిక చేశాం. సీనియర్ టీమ్ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా ‘ఎ’ జట్లయితే విశేషంగా రాణించాయి. 13 సిరీస్‌లు ఆడితే అన్నీ గెలిచాయి. సీనియర్ టీమ్‌లో ఇప్పుడు మ్యాచ్ ఫలితాలను శాసించగల ఎనిమిది మంది ఫాస్ట్ బౌలర్లు, ప్రధాన స్పిన్నర్లతో పాటు మరో ఆరుగురు స్పిన్నర్లు, ఆరుగురు సమర్థులైన ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. ఇంకా మా నుంచి ఏం ఆశిస్తున్నారు’ అని ఎమ్మెస్కే వివరించారు. ప్రపంచకప్ సెమీస్‌లో పరాజయానికి ‘నాలుగో స్థానం’ కారణం కాదని, సెమీఫైనల్ మ్యాచ్ వరకు కూడా నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడటం జరగనే లేదని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు మినహా తాము అవకాశం ఇచ్చిన కొత్త ఆటగాళ్లంతా సత్తా చాటారన్న మాజీ వికెట్ కీపర్... బుమ్రాను టెస్టుల్లోకి ఎంపిక చేయడం తమ అత్యుత్తమ నిర్ణయమన్నారు. సెలక్టర్‌గా పని చేసేటప్పుడు విమర్శలు రావడం సహజమేనన్న ఎమ్మెస్కే... ధోని, కోహ్లిలతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ‘మేనేజ్మెంట్ విద్యార్థినైన నేను ఆంధ్ర క్రికెట్ డైరెక్టర్‌గా ఇంతకంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సెలక్టర్‌గా ఉన్న సమయంలో నేను దిగ్గజ క్రికెటర్ల సలహాలు తీసుకుంటూ వచ్చాను. ధోని, కోహ్లిలతో నా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినలేదు. జనం ఏమైనా అనుకోవచ్చు గానీ వారిద్దరు నన్ను ఎంతగా గౌర విస్తారో నాకు తెలుసు’ అని ప్రసాద్ అన్నారు. -
‘మనం కన్నీళ్లను దాచనవసరం లేదు’
ముంబై: సరిగ్గా ఆరేళ్ల క్రితం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి మ్యాచ్ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశాడు. ఆ రోజు మాట్లాడుతుండగానే అతని కళ్లల్లో నీళ్లు తిరగడం భారత క్రికెట్ అభిమానులెవరూ మరచిపోలేరు. ఆ సమయంలో తన మనసులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతుండటం వల్ల తనను తాను నియంత్రించుకోలేకపోయానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ‘ఆ సమయంలో కన్నీళ్లను ఆపాలని నేను ప్రయతి్నంచలేదు. మగాళ్లయినా సరే... నా దృష్టిలో కన్నీళ్లను దాచనవసరం లేదు. కన్నీళ్లు బయటకు రావడం సిగ్గు పడాల్సిన విషయమేమీ కాదు. కష్టాలు చుట్టుముట్టినా బలవంతంగా నటించడం ఎందుకు? మన సమాజంలో మగాళ్లు అసలు ఏడవరాదని, వారు బలహీనులని ప్రచారంలో ఉంది. నేనూ అదే నమ్ముతూ పెరిగాను. కానీ అది తప్పని నాకు అర్థమైంది. నా పోరాటం, బాధలే నన్ను ఇంతటివాడిని చేశాయి’ అని సచిన్ అన్నాడు. ‘ఇంటర్నేషనల్ మెన్స్ వీక్’ సందర్భంగా పురుష ప్రపంచానికి రాసిన బహిరంగ లేఖలో అతను ఇదంతా వివరించాడు. -
నేనీ స్థాయిలో ఉన్నానంటే.. అందుకు ఆయనే కారణం!
ఢిల్లీ : ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీనీ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పొగడ్తతలతో ముంచెత్తాడు. తాను అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా రాణించడంలో దాదా పాత్ర మరువలేనిదని పేర్కొన్నాడు. కెరీర్ బిగినింగ్‌లో మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న తనను గంగూలీ గుర్తించి ఓపెనర్‌గా పంపించకపోయుంటే క్రికెట్ ప్రపంచంలో సెహ్వాగ్ పేరు ఎవరికీ గుర్తుండేది కాదని మీడియాతో వెల్లడించాడు. ‘ప్రాక్టీస్ సందర్భంలో నీకు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇద్దామనుకుంటున్నా అని గంగూలీ నా వద్దకు వచ్చి చెప్పాడు. దానికి నువ్వే ఓపెనర్‌గా ఆడొచ్చుగా అని బదులిచ్చా. ప్రస్తుతం ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంది. అందుకే మొదట ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నీకు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇస్తాను. ఒకవేళ ఓపెనర్‌గా ఫెయిలైనా మిడిల్ఆర్డర్లో నీ స్థానానికి ఢోకా ఉండదని దాదా చెప్పాడు' అని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఓపెనర్ అవకాశం ఇవ్వడం వల్లే తాను రాణించానని, తరువాతి 12 ఏళ్లు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం తనకు రాలేదని తెలిపాడు. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సెహ్వాగ్ కొన్ని రోజులు మిడిల్ ఆర్డర్లో ఆడిన సంగతి తెలిసిందే. 2001లో శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్ సెహ్వాగ్ కెరీర్‌ను మలుపుతిప్పింది. సచిన్ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన సెహ్వగ్ న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్‌గా సెహ్వాగ్.. అజహర్, యువరాజ్ సరసన నిలిచాడు. ఇక అక్కడి నుంచి సెహ్వాగ్‌కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు(వన్డే, టెస్టు, టీ20) ఫార్మాట్లు కలిపి 17వేలకుపైగా పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో భారత జట్టు తరపున రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ ఘనత సాధించాడు. -
యశస్వి డబుల్ యశస్సు
బెంగళూరు: భారత క్రికెట్లో మరో కొత్త టీనేజీ సంచలనం! సంచలన బ్యాటింగ్ ప్రదర్శనలకు కేరాఫ్ అడ్రస్‌వంటి ముంబై మైదానాల నుంచి వచ్చిన మరో కుర్రాడు కొత్త ప్రపంచ రికార్డుతో సంచలనం సృష్టించాడు. ముంబైకి చెందిన యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఈ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యశస్వి 154 బంతుల్లో 17 ఫోర్లు, 12 సిక్సర్లతో 203 పరుగులు సాధించాడు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన అలన్ బారో 20 ఏళ్ల 276 రోజుల వయసులో చేసిన డబుల్ సెంచరీ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వికి తోడుగా ఆదిత్య తారే (78; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించడంతో ముంబై 50 ఓవర్లలో 3 వికెట్లకు 358 పరుగులు చేసింది. అనంతరం 319 పరుగులకు ఆలౌటైన జార్ఖండ్ 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. విరాట్ సింగ్ (77 బంతుల్లో 100; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. పానీపూరి నుంచి పరుగుల వరద వరకు... 11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై’ అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. ఏదైనా పని ఇప్పిస్తానంటూ డెయిరీ దుకాణంలో నౌకరీ ఇప్పించిన ఆ బంధువు ఇల్లు మాత్రం రెండో మనికి అవకాశమే లేనంత చిన్నది! దాంతో తను పని చేస్తున్న చోటే రాత్రి కూడా పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో వారు పనికిరావంటూ పంపించేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్ క్లబ్’ క్రికెట్ గ్రౌండ్లో ఒక మూలన ఉండే టెంట్లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి ప్రపంచమైపోయింది. స్థానికంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే 200–300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు యశస్వి అక్కడ పానీ పూరీలు కూడా అమ్మాడు! తనతో ఆడే కుర్రాళ్లు ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని అతను కోరుకునే పరిస్థితి. టెంట్లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. యశస్వి గాథలు ఆజాద్ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్ జ్వాలా సింగ్ అందరికంటే ముందుగా స్పందించాడు. యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌కు బహుశా అతనిలో తన ప్రతిరూపం కనిపించి ఉంటుంది! అందుకే ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్–19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో అండర్–19 ముక్కోణపు టోరీ్నలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్ అందించిన అతను ఇప్పుడు సీనియర్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 ఆసియా కప్ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్ విజేతగా నిలిచిన ఆ టోరీ్నలో యశస్వి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్ టీమ్‌కు ఎంపిక కావడం అతని కెరీర్లో కీలక మలుపు. 44, 113, 22, 122, 203... విజయ్ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్ వరుస స్కోర్లు ఇవి. ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు ఉన్నాయి. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా. వీటిని చూస్తే యశస్వి ప్రదర్శన ఒక సంచలన ఇన్నింగ్స్‌కే పరిమితం కాదని, అతని ఆటలో ఎంత నిలకడ ఉందో అర్థమవుతుంది. తాజా ప్రదర్శన యశస్విని భవిష్యత్ తారగా ఆశలు రేపేలా చేసింది. మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్ విరామం సమయంలో నా సహచరులు లేదా వాళ్ల తల్లిదండ్రులు మంచి భోజనాలు తీసుకు రావడం చాలా సార్లు చూశాను. నేను మాత్రం ఏదైనా వండుకుంటేనే తినే పరిస్థితి. బ్రేక్ ఫాస్ట్ అనేది దాదాపుగా లేనట్లే. వాళ్లలోనే ఎవరో ఒకరిని బతిమాలి పని కానిచ్చేయడమే. ఈ విషయంలో నేను ఏమాత్రం సిగ్గు పడకపోయేవాడిని. ‘డబ్బులు లేవు కానీ ఆకలి మాత్రం ఉంది’ అంటూ వారిని అడిగి తినేందుకు సిద్ధపడిపోయేవాడిని.నా పరిస్థితి చూసుకున్నప్పుడు చాలా సార్లు తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఏడుస్తూ కుమిలిపోయేవాడిని. వేసవిలో ప్లాస్టిక్ టెంట్లో పడుకున్నప్పుడు వేడితో చచి్చపోయేవాడిని. దాంతో గ్రౌండ్‌లోనే పడుకునేందుకు సిద్ధమైపోయా. అయితే ఒక రాత్రి ఏదో పురుగు కుట్టి కన్ను వాచిపోవడంతో ఆ తర్వాత ఎంత వేడి అయినా టెంట్‌లోకే మారిపోయా. క్రికెట్లో ఒత్తిడి అనే మాటే నాకు తెలీదు. ఎన్నో ఏళ్లుగా రోజూ అనుభవించిన వాడిని. బరిలోకి దిగితే పరుగులు చేయగలనని నమ్మకం ఉండేది కానీ ఆ రోజు భోజనం దొరుకుతుందా లేదా అనే దాని గురించే ఆందోళన చెందిన రోజులు ఉన్నాయి. –యశస్వి జైస్వాల్ లిస్ట్–ఎ క్రికెట్లో భారత్ ‘డబుల్ సెంచరీ’ హీరోలు అంతర్జాతీయ క్రికెట్లో... ►రోహిత్ శర్మ 264 (శ్రీలంకపై, కోల్‌కతాలో 2014) ►రోహిత్ శర్మ 209 (ఆ్రస్టేలియాపై, బెంగళూరులో 2013) ►రోహిత్ శర్మ 208 నాటౌట్ (శ్రీలంకపై, మొహాలీలో 2017) ►సచిన్ టెండూల్కర్ 200 నాటౌట్ (దక్షిణాప్రికాపై, గ్వాలియర్‌లో 2010) ►వీరేంద్ర సెహా్వగ్ 219 (వెస్టిండీస్‌పై, ఇండోర్‌లో 2011) దేశవాళీ క్రికెట్లో... ►శిఖర్ ధావన్ 248 (దక్షిణాఫ్రికా ‘ఎ’పై, ప్రిటోరియాలో 2013) ►కరణ్ కౌశల్ 202 (సిక్కింపై, గుజరాత్లో 2018) ►సంజూ సామ్సన్ 212 నాటౌట్ (గోవాపై, బెంగళూరులో 2019) ►యశస్వి జైస్వాల్ 203 (జార్ఖండ్‌పై, బెంగళూరులో 2019) -
బెంగాల్ టైగర్ ఈజ్ బ్యాక్
-
భారత క్రికెట్లో మళ్లీ ‘దాదా’గిరి!
దాదాపు 20 ఏళ్ల క్రితం... భారత క్రికెట్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడే బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం బీసీసీఐ పరువు తీసింది. కెప్టెన్సీ నా వల్ల కాదంటూ సచిన్ స్వచ్ఛందంగా తప్పుకుంటూ కీలక సమయంలో కాడి పడేశాడు. అలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దగలడంటూ గంగూలీని నమ్మి బోర్డు బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్‌గా తన తొలి వన్డే సిరీస్‌ను గెలిపించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సౌరవ్... తదనంతర కాలంలో భారత క్రికెట్ రాత మార్చిన అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పుడు కూడా... భారత క్రికెట్ పరిపాలన పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు... ఎన్నికైన ఆఫీస్ బేరర్లతో కాకుండా 33 నెలలుగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేతృత్వంలోనే పాలన నడుస్తోంది. అవగాహనలేమి, అనుభవలేమివంటి సమస్యలతో సీఓఏ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు క్రికెట్‌ను దెబ్బ తీశాయి. అర్థంపర్థం లేని నిబంధనలు సరైన నిర్ణయాధికార వ్యవస్థ లేకుండా గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి సమయంలో గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా వస్తున్నాడు. అభిమానులు ఆత్మీయంగా ‘దాదా’ అని పిలుచుకునే బెంగాలీ బాబు ఇక్కడా తన ముద్ర చూపించగలడా! వేచి చూడాలి. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని బాగు చేసేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు కాబోయే కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. అందు కోసమే ఇక్కడ అడుగు పెట్టినట్లు అతను చెప్పాడు. సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై తన ఆలోచనలు, ప్రణాళికల గురించి సౌరవ్ వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... పూర్వ వైభవం తెస్తా... దేశం తరఫున ఆడి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన నాకు ఈ పెద్ద పదవి దక్కడం కూడా గొప్పగా అనిపిస్తోంది. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇప్పటికే బోర్డు పేరు ప్రఖ్యాతులు బాగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో నేను బాధ్యతలు చేపడుతున్నాను. కాబట్టి దీనిని చక్కబెట్టేందుకు నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా. వచ్చే కొన్ని నెలల్లో అన్నీ సరిదిద్ది సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం. అపెక్స్ కౌన్సిల్‌లోని నా సహచరులందరితో కలిసి పని చేసి బీసీసీఐకి పూర్వ వైభవం తీసుకొస్తాం. వారి మ్యాచ్ ఫీజు పెంచాలి... ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అందరం కలిసి చర్చిస్తాం. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల బాగోగులు చూడటం గురించే. అప్పట్లో దీని గురించి నేను సీఓఏకు కూడా సూచనలు చేసినా వారు పట్టించుకోలేదు. మన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంపై ముందుగా దృష్టి పెడతా. వారికి లభిస్తున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇదో సవాల్.... ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా లేక ఏకగ్రీవంగా ఎంపికైనా బాధ్యతలో మాత్రం తేడా ఉండదు. అందులోనూ ప్రపంచ క్రికెట్లో పెద్ద బోర్డుకు నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. ఆర్థికంగా బీసీసీఐ ఎంతో పరిపుష్టమైన వ్యవస్థ కాబట్టి నాకు ఇది సవాల్లాంటిది ఊహించలేదు... నేను బోర్డు అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. మీరు అడిగినప్పుడు నేను కూడా బ్రిజేష్ పటేల్ పేరే చెప్పాను కానీ నేను పైకి వెళ్లేసరికి అంతా మారిపోయింది. నేను బోర్డు ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కాబట్టి ఇలా కూడా అవకాశం దక్కుతుందని అనుకోలేదు. 10 నెలలకే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనుండటం పట్ల ఎలాంటి బాధ లేదు. అది నిబంధన కాబట్టి పాటించాల్సిందే. నాకు తండ్రిలాంటి జగ్మోహన్ దాల్మియా నిర్వహించిన బాధ్యతలను నేను కూడా చేపట్టగలనని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో శ్రీనివాసన్‌లాంటి అనేక మంది వ్యక్తులు సమర్థంగా బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలు మాట్లాడలేదు... కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాతో ఏ రాజకీయ నాయకుడు కూడా సంప్రదింపులు జరపలేదు. నాకు అభినందన సందేశం పంపిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు. సమర్థుడు కావాలని.... భారత జట్టు కెప్టెన్‌గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్ అయినప్పుడు కూడా ఫిక్సింగ్‌లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం. ఐసీసీకి 75–80 శాతం ఆదాయం భారత క్రికెట్ నుంచే వస్తున్నా... గత మూడు నాలుగేళ్లుగా మనకు న్యాయంగా వారి నుంచి ఆశించిన రీతిలో నిధులు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొంటాం. అదో పెద్ద సమస్య.... పరస్పర ప్రయోజనం (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా అయితే క్రికెట్ వ్యవస్థలో అత్యుత్తమ వ్యక్తులను తీసుకొచ్చి పని చేయించుకోవడం కష్టమైపోతుంది. వారు వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తారు. ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే నిబంధన పాటిస్తే మాజీ ఆటగాళ్లెవరూ ముందుకు రారు. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత వారికి ఆర్థిక భద్రత లేకపోతే మనసు పెట్టి ఎలా పని చేస్తారు. -
‘ఆ ట్వీట్ పాఠం నేర్పింది’
‘ధోనితో నా భాగస్వామ్యం గురించి చేసిన ట్వీట్ రిటైర్మెంట్ వదంతులకు కారణమవుతుందని అనుకోలేదు. నిజానికి నా మనసులో ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. ఏదో ఇంట్లో కూర్చొని అలా ఫోటోతో సహా ట్వీట్ చేశానంతే. అది వార్తగా మారిపోయింది. నేను ఆలోచించిన విధంగానే ప్రపంచం ఆలోచించదని అర్థమైంది. ఎలాంటి ట్వీట్లు చేయకూడదో దీనినుంచి నేర్చుకున్నాను. నాటి మ్యాచ్ నాకు ఎంతో ప్రత్యేకం కాబట్టి దాని గురించి చెప్పాలని భావిస్తే జనం తప్పుగా అర్థం చేసుకున్నారు. రిటైర్మెంట్ ధోని వ్యక్తిగత విషయం. అతను ఎప్పుడైనా భారత క్రికెట్ బాగు గురించే ఆలోచిస్తాడు. ఈ విషయంలో మా అందరిదీ ఒకే తరహా ఆలోచన. అతని అనుభవం వెలకట్టలేనిది’ – కోహ్లి -
నాలుగో స్థానానికి అయ్యరే సరైనోడు
న్యూఢిల్లీ: భారత మిడిలార్డర్లో సమస్యగా మారిన నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్ సరిగ్గా సరిపోతాడని భారత దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించడం కంటే అయ్యర్‌ని ఆడిస్తేనే జట్టుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన విశ్లేషించారు. జట్టు మేనేజ్మెంట్ నాలుగో స్థానాన్ని శాశ్వతంగా ఆయ్యర్కు కేటాయించాలని గావస్కర్ సూచించారు. ‘ నా దృష్టిలో పంత్ ధోనిలా ఫినిషర్... అతనికి ఐదు లేదా ఆరో స్థానాన్ని కేటాయిస్తే మంచిది. కానీ అయ్యర్ అలా కాదు ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. అందుకోసం అయ్యర్‌కు... భారత్‌ను చాలా కాలం నుంచి వేధిస్తోన్న నాలుగో స్థానాన్ని కేటాయిస్తే మంచిది’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. -
నరైన్, పొలార్డ్‌లకు పిలుపు
సెయింట్‌జాన్స్: చాలాకాలం తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్’ సునీల్ నరైన్ వెస్టిండీస్ టి20 జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు గాను తొలి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ప్రకటించిన జట్టులో అతడితో పాటు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కు చోటుదక్కింది. నరైన్ విండీస్ తరఫున రెండేళ్ల క్రితం చివరి టి20 ఆడాడు. మొత్తం 14 మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆంథోని బ్రాంబెల్ ఒక్కడే కొత్తముఖం. ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ సారథ్యం వహిస్తాడు. గాయంతో ప్రపంచ కప్ మధ్యలో తప్పుకొన్న మరో స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అందుబాటులోకి రాగా... విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అందుబాటులో ఉండనని ప్రకటించాడు. అతడి స్థానంలో ఎడంచేతి వాటం ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. వచ్చే ఏడాది జరుగనున్న టి20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకునే ప్రణాళికల్లో భాగంగా సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు వెస్టిండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాబర్ట్ హేన్స్ తెలిపారు. సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20లు ఆగస్ట్ 3, 4 తేదీల్లో ఫ్లోరిడా (అమెరికా)లోని లాడర్‌హిల్‌లో జరుగుతాయి. ఆగస్ట్ 6న మూడో టి20కి గయానా ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి రెండు టి20లకు విండీస్ జట్టు: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), సునీల్ నరైన్, కీమో పాల్, ఖారీ పియర్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, అంథోని బ్రాంబెల్ (వికెట్ కీపర్లు), రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రసెల్, ఒషాన్ థామస్, జాన్ క్యాంప్‌బెల్, షెల్డన్ కాట్రెల్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్. -
క్రికెట్‌ను వదిలేస్తున్నా...
తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు ఆవేదనతో తన ఆటను ముగించాడు. ఒకటి కాదు రెండు సార్లు తాజా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఆశించి భంగపడిన అతను పూర్తిగా క్రికెట్‌కే దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫార్మాట్లు, అన్ని స్థాయిల ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. నిలకడగా రాణించినా తనపై నమ్మకముంచని సెలక్షన్ కమిటీపై చేసిన ఒకే ఒక్క వ్యంగ్య వ్యాఖ్య చివరకు అతని ఆటకే చిక్కు తెచ్చింది. ఫలితంగా ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. భారత్ నుంచి వన్డేల్లో కనీసం వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లి, ధోని, రోహిత్ తర్వాత అత్యధిక సగటు (47.05) రాయుడుదే. సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని బుధవారం బీసీసీఐకి లేఖ ద్వారా తెలియజేశాడు. ఇందులో రిటైర్మెంట్కు కారణాలు వెల్లడించకపోయినా... ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ జట్టులో చోటు లభించకపోవడమే కారణమని అర్థమవుతోంది. ఏప్రిల్ 15న వరల్డ్ కప్‌ను టీమ్‌ను ప్రకటించిన సమయంలో 33 ఏళ్ల రాయుడుకు అందులో స్థానం లభించలేదు. అతనికి బదులుగా మూడు విభాగాల్లో సరైనవాడంటూ సెలక్టర్లు విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. అయితే తర్వాతి రోజు ప్రకటించిన ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో రాయుడు ఉన్నాడు. ఈ కప్‌లో శిఖర్ ధావన్ గాయంతో తప్పుకోగా... సెలక్టర్లు రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించారు. నాలుగో స్థానంలో ఆడిన విజయ్ శంకర్ గాయంతో వెనుదిరగడంతో అతనికి గతంలో పోటీగా నిలిచిన రాయుడు ఈ సారైనా తనకు స్థానం లభిస్తుందని ఆశించాడు. కానీ ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ వైపు భారత టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాయుడు ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాజా ప్రకటనతో రాయుడు ఇకపై ఐపీఎల్‌ల్లోనూ కనిపించే అవకాశం లేదు. నేను ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అన్ని ఫార్మాట్లు, అన్ని స్థాయిలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. క్రికెట్‌తో నా పాతికేళ్ల ప్రయాణం చాలా బాగా సాగింది. వేర్వేరు దశల్లో ఒడిదుడుకులు ఎదురైనా ఎంతో నేర్చుకునే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించి, మద్దతుగా నిలిచిన బీసీసీఐకి... కెప్టెన్లు ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు... రంజీ క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చిన హైదరాబాద్, ఆంధ్ర, బరోడా, విదర్భ అసోసియేషన్లకు, ఐపీఎల్ టీమ్‌లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలకు... నా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. – బీసీసీఐకి పంపిన లేఖలో అంబటి రాయుడు అంబరమంత ప్రతిభ ఉన్నా... ‘పదేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాత కూడా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోలేకపోయాననే నిరాశలో నేను ఉండదల్చుకోలేదు. ఇక్కడ ఆడితే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతా. ఇప్పుడు జనం నా ఆటను టీవీలో చూస్తారు. నేనేంటే అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఏదో ఒక రోజు భారత్‌కు ఆడకపోను’... 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో చేరే సమయంలో రాయుడు చెప్పిన మాటలు ఇవి. హైదరాబాద్ క్రికెట్ అధమ స్థాయికి చేరి యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి రాకుండా పోతున్న సమయంలో 22 ఏళ్ల రాయుడు ఎంచుకున్న దారి ఇది. ఐసీఎల్ వల్ల ఉపయోగం లేదని తెలిసిన తర్వాత హైదరాబాద్ టీమ్‌ను వదిలి బరోడా బాట పట్టింది కూడా టీమిండియాలో చోటుపై ఆశలతోనే. చివరకు 12 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ తర్వాత కానీ అతని కల నెరవేరలేదు. ఎప్పుడో భారత్‌కు ఆడతాడని భావించిన రాయుడు దాదాపు 28 ఏళ్ల వయసులో 2013 జూలైలో సీనియర్ల గైర్హాజరులో తొలి సిరీస్ ఆడాడు. తన 55 వన్డేల స్వల్ప కెరీర్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. ఓపెనింగ్ నుంచి 7వ స్థానం వరకు బరిలోకి దిగాడు. గత రెండేళ్లలో మరింత నిలకడగా ఆడి స్థానం ఖాయం చేసుకున్న తర్వాత 2019 ప్రపంచ కప్ జట్టులో భాగం కావాలనే అతని కల మాత్రం అనూహ్యంగా కుప్పకూలింది. 2015 ప్రపంచ కప్ జట్టులో ఉన్నా రాయుడుకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం మాత్రం రాలేదు. టీనేజర్‌గా ఉన్నప్పుడు రాయుడు మరో సచిన్ అవుతాడని చాలా మంది భావించారు. చూడచక్కటి బ్యాటింగ్ శైలి, చక్కటి స్ట్రోక్‌మేకర్‌గా రాయుడు బ్యాటింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. 2002లో అండర్–19 ఆటగాడిగా ఇంగ్లండ్‌పై వన్డేలో 177 పరుగులు చేసినప్పుడు అతని ప్రతిభ ఏమిటో అందరికీ తెలిసింది. 2004 అండర్–19 ప్రపంచ కప్‌లో అతను భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టీమ్‌లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, ధావన్ సభ్యులుగా ఉన్నారు! ఆ తర్వాత రంజీ ట్రోఫీలో రాణిస్తే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్న స్థితిలో అతను పదేపదే విఫలమయ్యాడు. పైగా వరుస వివాదాలు, గొడవలు రాయుడు ఆటను దెబ్బ తీశాయి. 2007లో ఐసీఎల్‌లోకి వెళ్లడంతో అతని కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే బీసీసీఐ క్షమాభిక్షతో మళ్లీ అవకాశం దక్కించుకున్న అతను బరోడా రంజీ జట్టులో చేరడంతో అతని జీవితం మరో మలుపు తిరిగింది. 2010 ఐపీఎల్లో రాయుడును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ అతని ఆటతో సంతృప్తి చెంది వరుసగా ఎనిమిదేళ్ల పాటు కొనసాగించింది. మూడు టైటిల్స్ విజయాల్లో భాగమైన రాయుడు ఐపీఎల్‌తోనే క్రికెట్ ప్రపంచం దృష్టిలో మళ్లీ పడ్డాడు. గత రెండేళ్లు చెన్నై తరఫున ఆడిన అంబటి మరోసారి చాంపియన్‌గా నిలిచిన టీమ్‌లో భాగమయ్యాడు. వివాదాలతోనే సమస్య... వ్యక్తిగతంగా ఆవేశం కొంత ఎక్కువగా ఉండటం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం కూడా రాయుడు కెరీర్లో ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. హైదరాబాద్ రంజీ ఆటగాడిగా ఉన్నప్పుడు కోచ్‌లు రాజేశ్ యాదవ్, వివేక్ జైసింహలతో గొడవలు, అనంతపురంలో అర్జున్ యాదవ్‌తో దాదాపు కొట్టుకున్నంత పరిస్థితి, మైదానంలో కూడా నియంత్రించుకోలేని దుందుడుకు స్వభావం, కొన్నాళ్ల క్రితం రోడ్డుపై ఒక వృద్ధుడిని దుర్భాషలాడటం రాయుడు ఇమేజ్ను తగ్గించాయి. అవేవీ అతను ఆటను దెబ్బ తీయలేదు కానీ రాయుడుపై ఒక ‘రెబల్’ ముద్ర పడిపోయింది. ‘3డి’ ట్వీట్ కూడా అదే తరహాలో ఆవేదన, ఆక్రోశం కలగలిపి చేసిందే. అదే ట్వీట్ అతడి కెరీర్‌ని ముగించిందని ఇప్పుడు సగటు క్రికెట్ అభిమానులందరూ నమ్ముతున్నారంటే తప్పు లేదు. రాయుడు జూనియర్ ఆటగాడిగా ఉన్నప్పుడు భారత్ కోచ్ ఉన్న రోజర్ బిన్నీ... ‘ఆట పట్ల రాయుడు అంకితభావం గొప్పది. అసలు ఓటమిని అంగీకరించేవాడు కాదు. గెలిచే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే కూడా అతను ఏడ్చేశాడు. సరిగ్గా చెప్పాలంటే అండర్–19 స్థాయి ముగియగానే సెలక్టర్లు అతడిని ఎంపిక చేసి సరైన దిశానిర్దేశం చేయాల్సింది’ అనడం రాయుడు కెరీర్ గురించి ఒక్క మాటలో చెబుతుంది. రిటైర్మెంట్కు ఇలా దగ్గరై... ‘యు ఆర్ ఎ టాప్ మ్యాన్’... రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాయుడు గురించి కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. అయితే అసలు సమయంలో రాయుడుపై కోహ్లి నమ్మకం కోల్పోవడమే తాజా పరిణామానికి కారణమైందనడంలో తప్పు లేదు. గత ఏడాది అక్టోబరులో ‘నాలుగో స్థానానికి సరైనవాడు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తిన కెప్టెన్... మూడు నెలలు తిరిగే లోపే నాలుగో స్థానం ఇంకా ఖరారు కాలేదంటూ కొత్త చర్చను లేవనెత్తి రాయుడు ఆటపై సందేహాలు సృష్టించాడు. సహజమైన నైపుణ్యంతో మిడిలార్డర్లో సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా రాయుడు తనకు లభించిన పరిమిత అవకాశాలతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. వన్డేలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు గత నవంబర్‌లో రాయుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఏడాదిన్నర విరామం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన అనంతరం రాయుడు ఆసియా కప్‌లో, ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌పై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో 2 మ్యాచ్‌లే ఆడినా... కివీస్‌పై సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఎక్కడైనా ఆడగల సామర్థ్యం ఉందని నిరూపించేందుకు చివరి మ్యాచ్‌లో కఠినమైన పిచ్‌పై అతను చేసిన 90 పరుగుల ఇన్నింగ్స్ చాలు! కానీ సెలక్టర్లు వేరేలా ఆలోచించారు. ‘3డి’ ఆటగాడు అంటూ విజయ్ శంకర్‌ను నాలుగో స్థానానికి తీసుకున్నారు. దాంతో సహజంగానే అసంతృప్తి చెందిన రాయుడు ‘ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే 3డి అద్దాలు కొన్నాను’ అంటూ ట్వీట్ చేయడం వివాదం రేపింది. నేరుగా దీనిపై బోర్డు అధికారులు ఆగ్రహం ప్రదర్శించకపోయినా... ఇప్పుడు దాని ప్రభావం కనిపించింది. రెండు సార్లు అవకాశం వచ్చినా సెలక్టర్లు ప్రపంచ కప్ జట్టులోకి రాయుడును మాత్రం ఎంపిక చేయలేదు. మున్ముందూ తనను ఎంపిక చేయకపోవచ్చని భావించిన రాయుడు మొత్తానికే గుడ్‌బై చెప్పేశాడు. రాయుడు గురించి చాలా బాధపడుతున్నా. అతని రిటైర్మెంట్కు సెలక్టర్లే కారణం. వారి ఎంపిక పద్ధతినే తప్పు పట్టాలి. ఐదుగురు సెలక్టర్లు కలిపి కూడా రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదు. కెరీర్లో మంచి ప్రదర్శన కనబర్చిన అతని రిటైర్మెంట్ భారత క్రికెట్లో దుర్దినం. –గౌతమ్ గంభీర్ ప్రపంచ కప్‌కు ఎంపిక చేయకపోవడం రాయుడును నిజంగా చాలా బాధపెట్టి ఉంటుంది. భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా –సెహ్వాగ్ బాగా ఆడిన తర్వాత కూడా వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించకపోతే రాయుడు ఎంత బాధపడ్డాడో, ఆవేదన చెందాడో అర్థం చేసుకోగలను. జీవితంలోని రెండో ఇన్నింగ్స్ సంతోషంగా, శాంతితో సాగాలని కోరుకుంటున్నా. –వీవీఎస్ లక్ష్మణ్ -
రిటైర్మెంట్ తర్వాత... పెయింటర్‌గా మారుతానన్న ధోని
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోని... భారత్‌ను రెండు ప్రపంచకప్‌లలో (టి20, వన్డే) విజేతగా నిలబెట్టిన మాజీ సారథి. ఇపుడు నాలుగో వన్డే ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అది ముగిశాక రిటైర్మెంట్కు రెడీ అయ్యాడు. అందుకేనేమో బైబై తర్వాత తన పెయింటింగ్ కళను బయటికి తీస్తానని చెబుతున్నాడు. తన చిన్ననాటి కల అని పేర్కొన్న ధోని ఇప్పటికే పలు పెయింటింగ్‌లు వేశానని చెప్పుకొచ్చాడు. తను సామాజిక సైట్లో పెట్టిన వీడియోలో ఇంకా ఏమన్నాడంటే... ‘నేను మీతో ఓ రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నేను చిత్రకారుడిని కావాలని కలలు కన్నా. ఇప్పటిదాకా ఎంతో క్రికెట్ ఆడేశా. ఇక రిటైర్మెంట్ తర్వాత నా బాల్య స్వప్నాన్ని నెరవేర్చుకునే పనిలో ఉంటా’ అని 37 ఏళ్ల ధోని అన్నాడు. తను ఇదివరకే వేసిన పెయింటింగ్‌ల ముచ్చటని ఆ వీడియోలో పంచుకున్నాడు. త్వరలోనే తను పెయింటింగ్ ప్రదర్శన (ఎగ్జిబిషన్) నిర్వహిస్తానని, వాటిని చూసిన అభిమానుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తానని చెప్పాడు. -
కప్పులు 11... విజేతలు ఐదే!
‘ప్రపంచ’ విజేత... ఈ మాట వింటుంటేనే మహా గొప్పగా అనిపిస్తుంది. ఇక అదే పేరుతో పిలుస్తుంటే ఇంకెంత ఘనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడేవి 10 దేశాలపైనే అయినా క్రికెట్లో ఇలాంటి ఖ్యాతి దక్కిన దేశాలు ఐదే. మిగతా వాటిలో మూడు మినహా మరే జట్టుకూ కప్‌ను అందుకునేంత స్థాయి లేదనేది వాస్తవం. అయితే, కప్ నెగ్గిన ఐదింటిలోనూ ఒక్క జట్టుది ఏకఛత్రాధిపత్యం. రెండు దేశాలు ఓ పదేళ్లు ట్రోఫీని తమ దగ్గర ఉంచుకున్నాయి. మిగతా వాటిలో ఓ జట్టు నాలుగేళ్లు సంపూర్తిగా, మరోటి సాంకేతికంగా తక్కువ వ్యవధితో జగజ్జేతగా ఉన్నాయి. అసలు ఏ జట్టు ఎంత కాలం కప్‌ను అట్టిపెట్టుకున్నాయో ఓసారి చూస్తే... తొలినాళ్లలో వెస్టిండీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా ‘ప్రపంచ కప్ విజేత’ హోదాకు పర్యాయపదంగా నిలిచాయి. ఈ రెండు జట్లు అంతగా తమ ముద్ర చాటాయి. 44 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఆసీస్ ఏకంగా 20 ఏళ్లు (వరుసగా 12 ఏళ్లు), వెస్టిండీస్ వరుసగా ఎనిమిదేళ్లు వరల్డ్ చాంపియన్లుగా పిలిపించుకున్నాయి. భారత్ రెండు వేర్వేరు దఫాల్లో, పాకిస్తాన్ ఒకసారి జగజ్జేతగా ఉన్నాయి. శ్రీలంక అతి తక్కువగా మూడేళ్ల మూడు నెలల కాలం పాటు మాత్రమే హోదాను అనుభవించింది. ఇందులో మరో ప్రత్యేకతేమంటే... ఇద్దరు కెప్టెన్లు క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) తమ జట్లను రెండుసార్లు విజేతలుగా నిలిపి, మరోసారి విఫలమయ్యారు. ఆసీస్‌దే అగ్రాధిపత్యం అలెన్ బోర్డర్ సారథ్యంలో తొలిసారి 1987లో చాంపియన్ అయిన తర్వాత ఆస్ట్రేలియా ఆటతీరు అంతకంతకూ రాటుదేలుతూ పోయింది. మొదటిసారి నిర్ణీత 4 ఏళ్ల వ్యవధి కంటే నాలుగు నెలలుగా అధికంగా జగజ్జేత హోదాలో కొనసాగిన ఆసీస్... ఆ తర్వాత ఏడేళ్లు దానికి దూరమైంది. 1999 నుంచి మాత్రం మరే జట్టుకూ అవకాశం ఇవ్వకుండా పుష్కర కాలం రాజ్యమేలింది. ఈ క్రమంలో వరుస గా ఆసియా దేశాలు పాక్, భారత్, లంకలను ఓడిస్తూ, వెస్టిండీస్‌కు త్రుటిలో చేజారిన ‘కప్‌ల హ్యాట్రిక్’నూ కొట్టేసింది. మధ్యలో (2011–15) నాలుగేళ్లు విరామం వచ్చినా, తర్వాత సొంతం చేసుకుంది. 1992లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లీగ్ దశలోనే వెనుది రిగింది. అయితే 2015లో రెండోసారి ఆతిథ్యంలో క్లార్క్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. భారత్ తర్వాత స్వదేశంలో వరల్డ్ కప్ నెగ్గిన రెండో జట్టుగా ఆసీస్ నిలిచింది. ఓవరాల్‌గా 20 ఏళ్లు ప్రపంచ కప్ కంగారూ దేశం వద్దే ఉంది. భారత్ 28 ఏళ్ల తర్వాత సంచలనాత్మక రీతిలో అది కూడా విదేశంలో 1983లో కప్ గెలిచిన టీమిండియా... కపిల్ నాయకత్వంలో 1987లో, అజహరుద్దీన్ కెప్టెన్సీలో 1996లలో ఆతిథ్య సానుకూలతలోనూ దానిని నిలబెట్టుకోలేకపోయింది. అనంతరం 28 ఏళ్ల సుదీర్ఘ కాలం నిరీక్షించింది. 2011లో ధోని సారథ్యంలో కోరిక మరోసారి నెరవేరింది. అయితే 2015లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో మన చాంపియన్ హోదాకు తెరపడింది. 32 ఏళ్ల (1983–2015) వ్యవధిలో వరల్డ్ కప్ కిరీటం భారత్ వద్ద ఎనిమిదేళ్లు ఉంది. పాక్... అప్పుడెప్పుడో! రౌండ్ రాబిన్ ఫార్మాట్‌కు చివరిదైన 1992 కప్‌ను గెల్చుకున్నది పాకిస్తాన్. మళ్లీ ఇప్పటివరకు అందుకోలేకపోయింది. సహ ఆతిథ్యంతో పాటు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగి 1996లో సెమీస్‌కూ చేరలేకపోయింది. 1999లో ఫైనల్‌కు వెళ్లినా ఆస్ట్రేలియాకు తేలిగ్గా తలొంచింది. 2011లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆతిథ్యంలో నిర్వహించిన కప్‌లో సెమీస్‌కు రావడం తప్ప 2003, 2007, 2015లలో దారుణ ప్రదర్శనే. పాక్ కప్ విజేత హోదాకు దూరమై 23 ఏళ్లు అవుతోంది. లంక... అతి తక్కువ కాలం అంచనాలకు అందకుండా అదరగొట్టి 1996లో తొలిసారిగా కప్ నెగ్గింది శ్రీలంక. దీంతో ట్రోఫీ వరుసగా తొమ్మిదేళ్లు (1992–99) ఆసియా దేశాల వద్దే ఉన్నట్లైంది. అయితే, 1999, 2003లలో పేలవ ప్రదర్శనతో లంక స్థాయి పడిపోయింది. అనూహ్యంగా పుంజుకొని 2007, 2011లో వరుసగా ఫైనల్‌కు చేరినా చాంపియన్ కాలేకపోయింది. విశేషమేమంటే... ‘ప్రపంచ చాంపియన్’ హోదాలో అతి తక్కువ కాలం (3 ఏళ్ల 3 నెలలు) ఉన్న జట్టు లంకే. ఆ స్థాయి కోల్పోయి కూడా 20 ఏళ్లవుతోంది. ఆ ఎనిమిదేళ్లు కరిభీకరం 1975–1983 మధ్య జరిగిన మూడు కప్‌లూ వెస్టిండీస్ ఆధిపత్యానికి ప్రతిరూపం అన్నట్లు సాగాయి. లాయిడ్ సారథ్యంలో 1975 జూన్ 21 నుంచి 1983 జూన్ 25 వరకు ఎనిమిదేళ్ల పాటు చాంపియన్ హోదాను అనుభవించిన వెస్టిండీస్... మూడో సారీ అతడి కెప్టెన్సీలోనే గెలిచే ఊపులో కనిపించింది. కానీ, కపిల్ నేతృత్వంలోని టీమిండియా దెబ్బకొట్టాక మరి కోలుకోలేకపోయింది. సరికదా, అప్పటి నుంచి ఏనాడూ ఫేవరెట్‌గా బరిలో దిగలేదు. కనీసం సంచలనాలు సృష్టించే అండర్ డాగ్గానూ కనిపించలేదు. 1996లో మినహా, స్వదేశంలో జరిగిన 2007 కప్‌లోనూ సెమీ ఫైనల్‌కు చేరలేకపోయింది. మొత్తానికి విండీస్ వన్డే ఫార్మాట్లో ప్రపంచ విజేత స్థాయికి దూరమై 36 ఏళ్లయింది. ఇంకెన్నాళ్లో నిరీక్షణ! క్రికెట్‌తో పాటు ప్రపంచ కప్ పుట్టిల్లు ఇంగ్లండ్. నాలుగుసార్లు ఆతిథ్యం (1975, 79, 83, 99), మూడుసార్లు (1979, 87, 92) ఫైనల్‌కు వెళ్లినా ఆ దేశ జట్టుకు మాత్రం కప్ అందని ద్రాక్షే. ప్రస్తుతం మినహా... ఇంగ్లిష్ బృందం కప్‌నకు ప్రధాన పోటీదారుగా ఉన్న సందర్భాలు తక్కువే. ప్రపంచ కప్‌లకు దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకెళ్లే జట్టు దృక్షిణాఫ్రికా. 1992 నుంచి పెద్ద జట్టుగా, కప్ గెలిచే జట్టుగా బరిలో దిగుతున్నా ఒక్కసారీ దగ్గరకు రాలేకపోయింది. ప్రకృతితో పాటు స్వయంకృతాపరాధాలు సఫారీలను దెబ్బతీశాయి. కివీస్‌ను ‘సెమీస్ జట్టు’ అనడం సముచితం. ఇప్పటివరకు ఏకంగా 6 సార్లు (1975, 79, 92, 99, 2007, 2011) సెమీస్ చేరింది న్యూజిలాండ్. సహ ఆతిథ్యంలో 2015లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లింది. కానీ, అంత పెద్ద టోర్నీ తుది సమరంలో తడబడి ఆస్ట్రేలియాకు కప్‌ను చేజార్చుకుంది. కప్పు కప్పుకో పేరు ఇప్పుడంటే ‘ఐసీసీ ప్రపంచ కప్’గా పిలుస్తున్నారు కానీ, 1996 వరకు ఈ కప్‌కు ముందు ఒక్కో పేరు ఉండేది. ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లోని బడా కంపెనీలు స్పాన్సర్షిప్ చేస్తూ... పనిలో పనిగా ప్రచారానికీ కలిసొచ్చేలా తమ సంస్థల పేర్లు తగిలించి ట్రోఫీలనూ రూపొందించేవి. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 1975, 1979, 1983 టోర్నీలను ఆ దేశంలో ఆర్థిక సేవలు–జీవిత బీమా రంగంలో ప్రఖ్యాతిగాంచిన ప్రుడెన్షియల్ సంస్థ ప్రాయోజితం చేసింది. దీంతో తొలి మూడు కప్‌లను ‘ప్రుడెన్షియల్ కప్’లుగా వ్యవహరిం చారు. అనంతరం భారత్ వేదికగా జరిగిన 1987లో కప్‌కు రిలయన్స్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ప్రపంచ కప్‌తో రిలయన్స్ ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు పోగేసుకుంది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 1992 కప్‌ను ‘బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ కప్’గా, భారత్ వేదికైన 1996 కప్‌ను ‘విల్స్ వరల్డ్ కప్’గా పిలిచారు. విల్స్... ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్ (ఐటీసీ) సంస్థకు చెందిన ఓ బ్రాండ్. అయితే, టోర్నీని తాము నిర్వహిస్తూ, వేరేవరి పేరుకో ప్రాచుర్యం కల్పించడం ఎందుకని భావించి 1999 నుంచి ఐసీసీ మేల్కొంది. అప్పటి నుంచి ఎంత పెద్ద స్పాన్సర్ ఉన్నా... పేరు మాత్రం ‘ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్’గానే స్థిరపడింది. అదేవిధంగా 99లోనే ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీనే ఇప్పుడు కొనసాగుతోంది. –సాక్షి క్రీడా విభాగం -
వరల్డ్ కప్ : భారత్ ‘తీన్’మార్ మోగిస్తుందా?
మొన్నటివరకు సంప్రదాయ టెస్టుల సొగసును చవిచూశాం నిన్నటివరకు ధనాధన్ టి20ల మజాను ఆస్వాదించాం ఇప్పుడిక... రెండింటి వారధి వన్డేలను ఆహ్వానిద్దాం క్రికెట్ పుట్టింట్లో ప్రపంచ కప్‌ను చూసొద్దాం...! 10 జట్లు పాల్గొనే 46 రోజుల మహా సంగ్రామంలో ఈ తరానికి కొత్తనిపించే రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతి ప్రత్యర్థితో ఒకసారైనా తలపడే సుదీర్ఘ పద్ధతిలో మహా సంగ్రామాన్ని కనులారా వీక్షిద్దాం...! వేడివేడి వార్తలు వండే ఇంగ్లిష్ మీడియా మనసు దోచే అందమైన మైదానాలు వసతులకు లోటు లేని ఆతిథ్యం మధ్య క్రికెట్ పెద్ద పండుగను జరుపుకొందాం...! ఆస్ట్రేలియా ‘ఆరే’స్తుందా? భారత్‘తీన్’మార్ మోగిస్తుందా? పాకిస్తాన్, శ్రీలంక మళ్లీ కప్పందుకుంటాయా? వెస్టిండీస్ నాటి వైభవాన్ని చాటుతుందా? దక్షిణాఫ్రికా దురదృష్టం ఇప్పుడైనా వీడుతుందా? ఇంగ్లండ్ చిరకాల కోరిక నెరవేరుతుందా? న్యూజిలాండ్ ఎంతవరకు నెగ్గుకొస్తుంది? బంగ్లాదేశ్ ఎవరిని దెబ్బకొడుతుంది? అఫ్గానిస్తాన్ పయనం ఎందాక? ఒక్కో జట్టు భాగ్య చక్రం ఎలా ఉంది? వాటి బలాలేంటి? బలహీనతలేంటి? ఎవరెవరికి ఎలాంటి అడ్డంకులున్నాయి? ఆఖరికి విఖ్యాత లార్డ్స్‌లో విజేతగా నిలిచేదెవరు? ... ప్రపంచ కప్ ప్రత్యేక కథనాలు నేటి నుంచి కప్‌లలో ఈ ‘కప్పు’ వేరయా! ఆడేది తక్కువ దేశాలైనా... ఆదరణలో ఒలిం పిక్స్, ఫుట్బాల్లకు ఏమాత్రం తగ్గనిది క్రికెట్ వన్డే ప్రపంచ కప్. అభిమానులంతా ఎదురుచూస్తున్న అలాంటి మెగా టోర్నీకి దాని జన్మస్థానమైన ఇంగ్లండ్‌లో ఈ నెల 30న తెరలేవనుంది. జూలై 14 వరకు 46 రోజుల పాటు సాగే క్రీడా సంబరంలో 10 జట్లు పాల్గొననున్నాయి. గతంలో ఇంగ్లండ్ 1975, 1979, 1983, 1999లలో వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వేదికగా మారింది. ఫార్మాట్ మారింది గురూ... 44 ఏళ్ల ప్రస్థానంలో 1975–1987 మధ్య జరిగిన నాలుగు కప్‌లలో జట్లను ‘గ్రూప్’లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. 1992లో మాత్రం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతి పాటించారు. మళ్లీ 1996 నుంచి 2015 వరకు ఆరు కప్‌లలో గ్రూప్ ఫార్ములాకే మొగ్గారు. అనేక చిన్న జట్లకూ అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం రాశి తక్కువైనా, వాసి పెంచాలనే ఉద్దేశంతో పోటీని 10 జట్లకే పరిమితం చేశారు. 1992 నాటి రౌండ్ రాబిన్ ఫార్మాట్ తీసుకొచ్చారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఈసారి వంద కోట్లపైనే వీక్షకులు పుట్టింది ఇంగ్లండ్‌లో అయినా ఇప్పుడు క్రికెట్ అంటే భారత్. భారత్ అంటే క్రికెట్. బీసీసీఐని ప్రపంచంలోనే ధనిక బోర్డును చేసిన మన ప్రేక్షకులు... వీక్షణలోనూ రికార్డులు బద్దలుకొడుతున్నారు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన సెమీఫైనల్ వరకు పరిగణనలోకి తీసుకుంటే ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ లెక్కల ప్రకారం 63.50 కోట్ల మంది భారతీయులు టీవీల్లో వీక్షించారు. ఈసారి వంద కోట్ల మార్కును తాకుతుందని అంచనా. ఆ రెండుసార్లు ముందుగానే! ఆదరణ, ఆకర్షణ తగ్గకూడదనే ఉద్దేశంతో సాధారణంగా ప్రపంచ స్థాయి ఈవెంట్లు ఏవైనా నాలుగేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. ఇందుకు క్రికెట్ కూడా మినహాయింపేం కాదు. అయితే, రెండుసార్లు మాత్రం ప్రపంచ కప్ ‘వ్యవధి’ మారింది. ఈ రెండూ ఒకే దశాబ్దంలో జరగడం మరో విశేషం. సంవత్సరాల వారీగా చూసినా, తేదీల ప్రకారం లెక్కించినా తొలి నాలుగు కప్‌లు (1975, 79, 83, 87) నాలుగేళ్ల నిబంధన ప్రకారమే నడిచాయి. కానీ, ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 1992 కప్, ఇంగ్లండ్ చివరిసారిగా వేదికగా నిలిచిన 1999 కప్ షెడ్యూల్ తప్పాయి. ఎందుకంటే...? భారత్.. పాకిస్తాన్‌తో కలిసి తొలిసారిగా 1987లో ప్రపంచ సమరానికి ఆతిథ్యమిచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 మధ్య టోర్నీ జరిగింది. ఆస్ట్రేలియా మొదటిసారి విజేతగా నిలిచిందీ ఇప్పుడే. అనంతరం ఆ దేశం న్యూజిలాండ్‌తో కలిసి కప్ నిర్వహించింది. ఏడాది ప్రకారం చూస్తే 1991 అక్టోబరు– నవంబరు మధ్యనే కప్ జరగాలి. కానీ, ఈ సమయంలో తమ దేశాల్లో వాతావరణం క్రికెట్‌కు అనుకూలం కాదని చెప్పాయి. దీంతో ఐసీసీ ఈవెంట్‌ను 1992 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 25 మధ్య ఏర్పాటు చేసింది. అంటే, నిర్ణీత గడువు కంటే అదనంగా నాలుగు నెలల కాలం పొడిగించారు. దేశమేదైనా... ప్రతి నాలుగో వేసవి కాలంలో కప్ నిర్వహణ జరగాలనే సంప్రదాయాన్నీ దీనికి కారణంగా చూపుతారు. ఇక రెండోసారి 1999లో అనుకున్న దానికంటే ముందుగానే ప్రపంచ కప్ జరిగింది. 1996లో భారత్ ఫిబ్రవరి14–మార్చి 17 మధ్య ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మరుసటి కప్ 2000లో జరగాలి. అయితే, 92లో పొడిగించిన సమయాన్ని కవర్ చేస్తూ 1999 మే 14–జూన్ 20 మధ్యనే నిర్వహించారు. ఈసారి మరీ తక్కువ కాలానికే (3 ఏళ్ల 3 నెలలు) కప్ ప్రేక్షకులను పలకరించింది. –సాక్షి క్రీడావిభాగం -
సచిన్@47
ముంబై: భారత క్రికెట్ దేవుడు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్‌కు బుధవారంతో 46 ఏళ్లు నిండనున్నా యి. ఆధునిక క్రికెట్లో సాటి లేని మేటి ఆటగాడిగా నిలుస్తూ లిటిల్ మాస్టర్ నుంచి మాస్టర్ బ్లాస్టర్గా ఎదిగి అనంతరం క్రికెట్ దేవుడిగా సచిన్ ఖ్యాతినార్జించాడు. దేశానికి 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఈ మాస్టర్ బ్యాట్స్‌మన్... ఆ క్రమంలో టెస్టులు (200 మ్యాచ్‌లు–15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు–18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూనే... దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నాడు. దీనికిముందే 1994లో అర్జున అవార్డు, 1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను పొందాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్న సచిన్... 2011లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడిగా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. -
ఇప్పుడు త్వరగా పేరు రావడం కష్టం
ముంబై: ప్రస్తుతం పోటీ ఎక్కువైన క్రికెట్లో స్టార్‌గా ఎదగడం కష్టమని భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. 1980, 90 దశకంలోని పరిస్థితులు ఇప్పుడు లేవని... నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా క్రికెటర్లు ఎదుగుతున్నారని దీంతో పేరున్న క్రికెటర్ కావడం కష్టమన్నాడు. ‘ఇప్పుడు పిల్లలంతా క్రికెట్‌ను సరదాగా ఆడటం లేదు. ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకొని ఆడుతున్నారు. దీంతో ఇప్పుడు క్రికెట్లో చాలా పోటీ నెలకొంది. ఈ పోటీ వాతావరణంలో మేటి క్రికెటర్‌గా ఎదగడం అంత సులభం కాదు. అయితే తమలోని ప్రతిభను నిలకడగా ప్రదర్శించడం ద్వారా క్రికెటర్‌గా ఎదగొచ్చు. పేరున్న లీగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరిస్తేనే జట్టులోకి ఎంపికయ్యే అవకాశముంది. అప్పుడే అతని క్రికెట్ భవిష్యత్తుకు భరోసాతో పాటు 10–12 ఏళ్లు ఆడే ఆడొచ్చు... డబ్బూ సంపాదించుకోవచ్చు’ అని సెహ్వాగ్ వివరించాడు. ప్రస్తుతం పలు నగరాల నుంచి శివమ్ దూబే (ముంబై), కమలేశ్ నాగర్కోటి (రాజస్తాన్), ఇషాన్ పొరెల్ (బెంగాల్), హార్విక్ దేశాయ్ (గుజరాత్), అన్మోల్ప్రీత్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (పంజాబ్)లు వెలుగులోకి వచ్చారు. అదే 80, 90 దశకాల్లో మాత్రం కేవలం మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల నుంచే ఎక్కువ మంది క్రికెటర్లు వచ్చేవారని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. -
భారత క్రికెట్‌కు ఫ్యూచర్ స్టార్ అతడే!
సాక్షి, ముంబై: రిషభ్ పంత్ ఎదగడానికి ఎక్కువ అవకాశాలివ్వాలని, అతడు భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణమని ముంబై ఇండియన్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ అన్నారు. ఐపీఎల్లో ఆదివారం జరిగినన ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు రిషభ్ పంత్ 27 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో యువరాజ్ మాట్లాడుతూ.. పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుంది. ఎదిగేందుకు సరైన అవకాశాలిస్తే అతడు భారత క్రికెట్‌కు ఫ్యూచర్ స్టార్ అవుతాడ’ని యువీ అన్నారు. ప్రపంచ కప్ ఎంపిక గురించి తాను చెప్పలేనని, కానీ పంత్ ప్రస్తుత ప్రదర్శన మాత్రం సూపర్‌గా ఉందని యువీ పేర్కొన్నారు. 21 ఏళ్ల వయసులో విదేశాల్లో రెండు శతకాలు బాదడం పంత్ టాలెంట్‌కు నిదర్శనమని 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ ప్రశంసించారు. ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపై స్పందించిన యువీ.. రోహిత్ శర్మ త్వరగా ఔటవడం తమ అవకాశాల్ని దెబ్బతీసిందని.. డికాక్, పొలార్డ్‌లు తమకు లభించిన ఆరంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారని, సరైన భాగస్వామ్యాల్ని నెలకొల్పలేకపోవడంతో 215 పరుగల భారీ స్కోరును చేధించడం తమకు కష్టమైపోయిందని విశ్లేషించాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో 53 పరుగులతో యువరాజ్ చివరిదాకా పోరాడాడు. కానీ అతడికి మిగతా బ్యాట్స్మెన్ల మద్దతు కరువవడంతో ముంబై చేధనలో ఓడిపోయింది. అతడు మా గెలుపు గుర్రం: ఢిల్లీ ఓపెనర్ కొలిన్ ఇంగ్రామ్ ‘గత ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన రిషభ్ పంత్ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ముంబైపై మ్యాచ్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటం సంతోషం. తనదైన రోజున పంత్ మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి సులువుగా లాక్కుంటాడు. శిఖర్ ధావన్‌తో నేను నెలకొల్పిన 83 పరుగుల భాగస్వామ్యం జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. టీ20ల్లో త్వరగా వికెట్లు చేజార్చుకుంటే ఎక్కువ పరుగులు చేయడం కష్టం. వరల్డ్‌కప్ సన్నాహకాల నేపథ్యంలో నేను ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఈలోపు మిగతా క్రికెటర్లతో తక్కువ సమయంలో సాన్నిహిత్యం పెంచుకుంటే సమష్టిగా రాణించి జట్టుకు ఎక్కువ విజయాలు దక్కుతాయ’ని ఢిల్లీ ఓపెనర్ కొలిన్ ఇంగ్రామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
క్రికెటర్లకు ‘డోపింగ్’ పరీక్షలు!
ముంబై: ‘డోపింగ్‌ను గుర్తించేందుకు మా సొంత వ్యవస్థ ఉంది, ఆటగాళ్లు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో అడుగుతున్నారు కాబట్టి వేరేవారితో కలిసి పని చేసే ప్రసక్తే లేదు’... ఇప్పటి వరకు భారత క్రికెటర్లకు డోపింగ్ విషయంలో బీసీసీఐ వైఖరి ఇది. కానీ ఇప్పుడు అది మారబోతోంది. ఇకపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పని చేసేందుకు సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఇది ఆరు నెలలు మాత్రమేనని... ఫలితాలతో తాము సంతృప్తి చెందితేనే కొనసాగిస్తామని, లేదంటే ఒప్పందాన్ని రద్దు చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌తో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, సీఓఏ సభ్యుల సమావేశం జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తమ క్రికెటర్లకు స్వీడన్‌లోని ఐడీటీఎంలో బీసీసీఐ డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. బీసీసీఐని తమ పరిధిలోకి తీసుకురావాలని గతంలోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఐసీసీని హెచ్చరించింది. ‘నిబంధనల ప్రకారం కనీసం పది శాతం శాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షల కోసం మేం ముందుగా వాటిని అందజేస్తాం. ఇందులో భారత క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు కూడా ఉంటారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఐపీఎల్లో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయరాదంటూ స్టార్ స్పోర్ట్స్‌కు బీసీసీఐ స్పష్టతనిచ్చింది. -
డబ్బులపై అసంతృప్తితోనే...
హైదరాబాద్: భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న అనుబంధం ముగిసింది. ధావన్ తమ ఫ్రాంచైజీని వీడినట్లు సన్‌రైజర్స్ యాజమాన్యం సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే సాధారణంగా పరస్పర కృతజ్ఞతలతో జరిగే ఇలాంటి మార్పుపై ‘సన్’ చేసిన బహిరంగ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. ధావన్ తాము ఇస్తున్న డబ్బులపై అసంతృప్తి కారణంగానే వెళ్లిపోయాడని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ కుండబద్దలు కొట్టింది. 2018 ఐపీఎల్లో ధావన్‌ను కొనసాగించేందుకు ఇష్టపడని హైదరాబాద్ టీమ్ అతడిని వేలానికి ముందు విడుదల చేసింది. మళ్లీ వేలంలో ‘రైట్ టు మ్యాచ్ కార్డ్’తో రూ. 5.2 కోట్లకే తిరిగి సొంతం చేసుకుంది. 2017లో ధావన్‌కు ఇచ్చిన రూ. 12.5 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ కావడం గమనార్హం! ఈ అసంతృప్తి ధావన్‌లో ఉండిపోయింది. ‘రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఈ ఏడాది ధావన్‌ను తిరిగి సొంతం చేసుకున్నాం. దురదృష్టవశాత్తూ అతనికి ఇస్తున్న మొత్తంపై సంతృప్తిగా లేడని మాకు కనిపిస్తూనే ఉంది. కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం మేం అందులో మార్పులు చేయడానికి వీలులేదు. ధావన్ సన్‌రైజర్స్‌కు చేసిన సేవలను మేం గుర్తిస్తున్నాం. అయితే ఆర్థికపరమైన కారణాలతో అతను జట్టును వీడాలని నిర్ణయించుకోవడం బాధాకరం’ అని సన్‌రైజర్స్ తమ ప్రకటనలో పేర్కొంది. ధావన్ తమ జట్టులోకి రావడాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ స్వాగతించగా... అతనికి బదులుగా సన్‌రైజర్స్ ముగ్గురు ఆటగాళ్లు విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మలను తీసుకుంది. 2013 నుంచి ఆరు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు ఆడిన ధావన్ 85 మ్యాచ్‌లలో 124.28 స్ట్రయిక్ రేట్‌తో 2,518 పరుగులు చేశాడు. ఇందులో 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. -
భువనేశ్వర్ గురించే ఆందోళన!
భారత జట్టు బ్రబోర్న్ స్టేడియంలో ఎలాంటి లోపాలు లేని ఆటను ప్రదర్శించి సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కొన్ని క్యాచ్‌లు వదిలేయడం మినహా ఈ మ్యాచ్ మొత్తంగా జట్టుకు సానుకూలంగా సాగింది. విరాట్ కోహ్లి కూడా అప్పుడప్పుడు విఫలమవుతాడని, అతను సెంచరీ చేయకపోయినా కూడా జట్టు భారీ స్కోరు సాధించగలదని కూడా ఈ మ్యాచ్ నిరూపించింది. క్రికెట్ అంటే కేవలం బ్యాట్‌కు, బంతికి మధ్య జరిగే సమరం మాత్రమే కాదు. ఇందులో మానసికంగా కూడా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. పుణే వన్డేలో హోల్డర్ అద్భుత బంతికి బౌల్డయిన్ రోహిత్ శర్మ ఈ సారి స్వింగ్‌కు దొరక్కుండా ఉండేందుకు ఆరంభంలోనే ముందుకు దూసుకొచ్చి షాట్లు ఆడాడు. ఇదే జోరులో అతను భారీ సెంచరీ సాధించడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అంబటి రాయుడు కూడా అద్భుతమైన ఆటతో సెంచరీ నమోదు చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పునరాగమనం చేయడం ఎప్పుడూ సులువు కాదు కానీ రాయుడు తనపై నమ్మకం పెంచేలా, అదీ అవసరమైన సమయంలో చేసి చూపించాడు. బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ బంతిని చక్కగా స్వింగ్ చేసి చూపించాడు. అనుభవజ్ఞుడైన శామ్యూల్స్‌ను అతను ఔట్ చేసిన తీరు మాత్రం హైలైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో రోహిత్ స్లిప్ క్యాచింగ్ కూడా ఆకట్టుకుంది. ఒకే ఒక ఆందోళన భువనేశ్వర్ గురించే. ప్రస్తుతం అతను ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అతను ఎంత ఎక్కువగా బౌలింగ్ చేస్తే ఆస్ట్రేలియాలో అంత మేలు జరుగుతుంది. సిరీస్‌ను సమం చేయాలంటే విండీస్‌లో అందరూ అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. కానీ బ్రబోర్న్‌లో వారి శారీరక భాష చూస్తే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే వైజాగ్, పుణేల తరహాలో వారు అందరినీ ఆశ్చర్యపరచవచ్చు కూ డా. అదేజరిగితే అద్భుతమైన ముగింపు కాగలదు. -
భారత క్రికెట్ ప్రమాదంలో పడింది!
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దాదాపు రెండేళ్లుగా పరిపాలకుల కమిటీ (సీఓఏ) నియంత్రణలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించడం కాకుండా తామే ఒక వ్యవస్థగా మారి సీఓఏ అన్ని అధికారాలు చెలాయిస్తోంది. అయితే సుప్రీం కోర్టు నియమించిన కమిటీ కావడంతో ఇప్పటి వరకు ఎవరూ బహిరంగంగా ఈ కమిటీని విమర్శించే సాహసం చేయడం లేదు. ఇప్పుడు మొదటిసారి ఒక క్రికెట్ స్టార్ దీనిపై నోరెత్తాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష హోదాలో సీఓఏ పనితీరును ప్రశ్నించాడు. తన ప్రశ్నలతో అతను నేరుగా ఒక లేఖ రాశాడు. ఇందులో ప్రధానాంశాలు గంగూలీ మాటల్లోనే... ‘భారత క్రికెట్ పరిపాలన ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం కారణంగా ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నాను. ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడటంతో మా జీవితాలు గెలుపోటములతో ముడిపడిపోయాయి. భారత క్రికెట్ పరువు మర్యాదలు కూడా మాకు ఎంతో ముఖ్యం. అందుకే తాజా పరిస్థితి గురించి ఆలోచించాల్సి వస్తోంది. రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ప్రపంచం దృష్టిలో భారత క్రికెట్ పరిపాలన స్థాయి పడిపోతోంది. అదే విధంగా లక్షలాది అభిమానుల నమ్మకం కూడా సడలిపోతోందని ఆందోళనతో చెప్పాల్సి వస్తోంది. వాస్తవాలేమిటో నాకు తెలీదు గానీ ఇటీవల వచ్చిన వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా వాటిని ఎదుర్కొన్న తీరు మొత్తం బీసీసీఐ పరువు తీసేశాయి. సీఓఏ నలుగురు సభ్యుల నుంచి ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నట్లున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మధ్యలో క్రికెట్ నిబంధనలు మారిపోతున్నాయి. కమిటీలు తీసుకున్న నిర్ణయాలను అగౌరవపరుస్తూ పక్కన పెట్టేస్తున్నారు. కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది (దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది). బోర్డు వ్యవహారాల్లో భాగంగా ఉన్న నా మిత్రుడొకడు తాము ఎవరిని సంప్రదించాలని నన్ను అడిగితే సమాధానం ఇవ్వలేకపోయాను. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఒక క్రికెట్ సంఘం నుంచి ఎవరినైనా పిలవాలని భావిస్తే ఎవరికి ఆహ్వానం పంపాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా గొప్ప క్రికెటర్లు, అద్భుతమైన పరిపాలకులు చేసిన శ్రమ వల్ల వేలాదిమంది అభిమానులు మైదానాలకు వచ్చారు. దాని వల్లే భారత క్రికెట్ ఈ స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది ప్రమాదంలో పడిందని చెప్పగలను. జనం దీనిని వింటున్నారని భావిస్తున్నా!’. -
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి నంబర్‌వన్
-
శిఖరాన విరాట్
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి తన అద్భుత కెరీర్లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి చిరస్మరణీయ బ్యాటింగ్ తర్వాత కూడా భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో 149, 51 పరుగుల ప్రదర్శన కోహ్లిని అగ్రస్థానానికి చేర్చింది. 934 రేటింగ్ పాయింట్లతో విరాట్ శిఖరాన నిలబడగా, 929 పాయింట్లతో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) రెండో స్థానానికి పడిపోయాడు. 2015 డిసెంబర్ నుంచి నంబర్‌వన్‌గా ఉన్న స్మిత్... బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో గత మార్చి నుంచి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగలేదు. గతంలో భారత్ తరఫున సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. 2011 జూన్‌లో సచిన్ చివరిసారిగా అగ్రస్థానం సాధించిన తర్వాత ఒక భారత బ్యాట్స్‌మన్ ఈ మైలురాయిని చేరడం ఇదే మొదటిసారి. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాను చూస్తే కోహ్లి (934) ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్నాడు. ఇందులో డాన్ బ్రాడ్‌మన్ 1948లో సాధించిన 961 పాయింట్లు అత్యుత్తమం కాగా... స్మిత్ (947)ది రెండో స్థానం. కోహ్లి ఇప్పటికే వన్డేల్లో కూడా ఎవరికీ అందనంత ఎత్తులో 911 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. -
ఇలాంటి జర్నలిజం అవసరమా: కైఫ్
హైదరాబాద్ : ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ ‘ది వైర్’ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి జర్నలిజం అక్కర్లేదని చురకలింటించాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కైఫ్.. ప్రతి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటాడు. అయితే ‘ది వైర్’ భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్ కులాల ఆటగాళ్లకు దక్కిన ప్రాధాన్యత గురించి ప్రస్తావించింది. అయితే ఈ కథనంపై కైఫ్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. ‘ మీ సంస్థల్లో ఎంత మంది ప్రైమ్ టైమ్ జర్నలిస్టులు ఎస్సీ, ఎస్టీలున్నారు? సీనియర్ ఎడిటర్లు ఎందరున్నారు? కులాల అడ్డుంకులను దాటింది ఒక క్రీడల్లోనే, ఆటగాళ్లు ఎలాంటి విభేదాలు లేకుండా ఆడుతారు. అలాంటప్పుడు ఇలాంటి విద్వేషాలు వ్యాపింప జేసే జర్నలిజం అవసరమా.’ అని ట్వీట్ చేశాడు. ఇంతకీ ది వైర్ కథనం ఏమిటంటే.. ‘భారత్‌కు టెస్ట్ క్రికెట్ హోదా వచ్చి 86 సంవత్సరాలు అవుతోంది, ఇన్నేళ్లలో ఆడిన 290 మంది క్రికెటర్లలో కేవలం నలుగురు మాత్రం ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. జనాభ ప్రకారం 70 మందికి దక్కాల్సిన అవకాశం కేవలం నలుగురికే దక్కింది. ఇది కేవలం అసమానత్వమే.. దీన్ని తేలికగా తీసుకోలేము’’ అని ఆ ఆర్టికల్‌లో రాసుకొచ్చింది. ఈ ఆర్టీకల్‌పై కైఫే కాకుండా నెటిజన్లు మండిపడుతున్నారు. క్రికెట్లోకి కులాన్ని తీసుకొచ్చి విబేధాలు సృష్టించవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. How many prime time journalists are SC or ST or for that matter how many senior editors in your organisation are SC or ST. Sports is perhaps one field which has successfully broken barriers of caste,players play with inclusiveness but then we have such journalism to spread hatred https://t.co/ludDNpPi3x — Mohammad Kaif (@MohammadKaif) July 29, 2018 చదవండి: క్రికెట్‌కు కైఫ్ వీడ్కోలు -
ఆసియాకప్ ఆడనవసరం లేదు!
న్యూఢిల్లీ: ఆసియా కప్ షెడ్యూల్‌పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. టీమిండియా వరుసగా రెండు రోజులు వన్డేలు ఆడాల్సి ఉండటాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అతడు పేర్కొన్నాడు. అసలు భారత్ ఈ టోర్నీలో పాల్గొనా ల్సిన అవసరమే లేదని... ఆ సమయంలో మరేదైనా టోర్నీ ఆడొచ్చని సూచించాడు. ‘ఈ రోజుల్లో ఏ జట్టు వరుసగా రెండు వన్డేలు ఆడుతోంది? ఇంగ్లండ్‌తో ఇటీవల టి20 మ్యాచ్‌లను కూడా రెండు రోజుల విరామంతో నిర్వహించారు. అలాంటిది వేడి వాతావరణం ఉండే దుబాయ్‌లో విరామం లేకుండా వన్డే మ్యాచ్‌లా? పూర్తిగా అసాధ్యం. నా దృష్టిలో ఇది సరైన షెడ్యూల్ కాదు’ అని నిష్కర్షగా వ్యాఖ్యానించాడు. -
కోహ్లి పోస్టుకు రూ. 82 లక్షలు
ముంబై: టెస్టు, వన్డే, టి20 ఇలా ఏ ఫార్మాట్లోనైనా అత్యుత్తమంగా దూసుకెళ్తోన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సామాజిక మాధ్యమాల ద్వారా సంపాదనలోనూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఎంతలా అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేస్తే అక్షరాలా 82 లక్షలు అందుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తోన్న వారి జాబితాను హోపర్స్ హెచ్‌క్యూ సంస్థ విడుదల చేయగా క్రీడాకారుల జాబితాలో 9వ స్థానంలో నిలిచిన కోహ్లి... ఓవరాల్‌గా 17వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్–10లో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ను దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. ఈ ఫాలోవర్ల సంఖ్య కారణంగా తమ కంపెనీ ఉత్పత్తికి సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటే కోహ్లికి స్పాన్సర్లు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారు. క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా... నెమార్, మెస్సీ, బెక్‌హామ్, గ్యారెత్ బేల్, ఇబ్రహిమోవిచ్, సురెజ్, మెక్‌గ్రెగర్ (ఫైటర్)లు తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. బాస్కెట్‌బాల్ ప్లేయర్ స్టీఫెన్ కరీ పదో స్థానంలో నిలిచాడు. -
వచ్చే ఐదేళ్లు బిజీ బిజీ...
దుబాయ్: సుదీర్ఘ కాలంగా చర్చోపచర్చలు, సమావేశాల అనంతరం ఎట్టకేలకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు మోక్షం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన ఐదేళ్ల భవిష్యత్తు పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ)లో దీనికి కొత్తగా చోటు లభించింది. టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ లీగ్‌కు కూడా ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. కొత్త ఎఫ్టీపీ ప్రకారం జూన్ 2019 నుంచి మొదలు పెట్టి వచ్చే రెండేళ్ల కాలంలో టాప్–9 టెస్టు జట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం పోటీ పడతాయి. లీగ్ దశలో ఆరు సిరీస్‌లు జరిగే అవకాశం ఉం డగా, పాయింట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్లో తలపడతాయి. వన్డే లీగ్ 2020లో ప్రారంభమవుతుంది. ఇందులో 12 టెస్టు జట్లతో పాటు వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ కూడా బరిలోకి దిగుతుంది. పాయింట్ల ప్రకారం టాప్–8లో నిలిచిన జట్లు 2023 వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే అన్ని టెస్టు మ్యాచ్‌లు వరల్డ్ చాంపియన్‌షిప్‌కు, అన్ని వన్డే మ్యాచ్‌లు వన్డే లీగ్‌కు పరిగణలోకి తీసుకోరు. ఈ రెండు మెగా ఈవెంట్లలో భాగంగా ఉండే సిరీస్‌లు మాత్రమే కాకుండా అన్ని జట్లు విడిగా ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడతాయి. సొంతగడ్డపై 102 మ్యాచ్‌లు... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కోసం జరిగే పోరులో భాగంగా వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో భారత్ తమ తొలి సిరీస్ ఆడుతుంది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత కరీబియన్ గడ్డపై భారత్ 2 టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఊహించినట్లుగానే తాజా ఎఫ్టీపీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఎలాంటి టెస్టులు లేవు. పాక్‌తో పాటు ఐర్లాండ్‌తో కూడా భారత్ ఒక్క టెస్టూ ఆడటం లేదు. మిగతా జట్లతో మాత్రం ఇంటా, బయటా తలపడుతుంది. వన్డే లీగ్‌లో కూడా పాక్, ఐర్లాండ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం లేదు. మొత్తంగా ఐదేళ్ల కాలంలో భారత్ 200కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండగా వాటిలో 102 సొంత గడ్డపైనే జరగనున్నాయి. ఐదేళ్ల ఎఫ్టీపీలో అన్ని జట్లకంటే ఎక్కువ మ్యాచ్‌లు భారత జట్టే ఆడనుండటం విశేషం. 2018–2023 మధ్య కాలంలో భారత జట్టు స్వదేశంలో వరుసగా వెస్టిండీస్ (3 టెస్టులు), దక్షిణాఫ్రికా (3), బంగ్లాదేశ్ (2), జింబాబ్వే (1), ఇంగ్లండ్ (5), న్యూజిలాండ్ (2), శ్రీలంక (3), ఆస్ట్రేలియా (4)లతో ... విదేశీ గడ్డపై వరుసగా ఇంగ్లండ్ (5), ఆస్ట్రేలియా (4), వెస్టిండీస్ (2), న్యూజిలాండ్ (2), ఆస్ట్రేలియా (4), ఇంగ్లండ్ (5), దక్షిణాఫ్రికా (3), బంగ్లాదేశ్ (2)లతో టెస్టు సిరీస్‌లలో తలపడుతుంది. -
భారత్ నం.1 పదిలం... పటిష్టం
దుబాయ్: టెస్టుల్లో భారత నంబర్‌వన్ ర్యాంకు మరింత పదిలమైంది, పటిష్టమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో టీమిండియా ఎవరికీ అందనంతగా 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 2015–16, 2016–17 సీజన్లలో కోహ్లి సేన ఇంటాబయటా సాధించిన చిరస్మరణీయ విజయాలతో భారత్‌కు 50 శాతం వెయిటేజీ కలిసొచ్చింది. దీంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (112) కంటే 13 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో టాప్‌ర్యాంకును పటిష్టం చేసుకుంది టీమిండియా. ఏప్రిల్ 3తో ముగిసిన కటాఫ్ తేదీతో ఇరు జట్లు టాప్–2 ర్యాంకులతో వరుసగా రూ. 6.67 కోట్లు (1 మిలియన్ డాలర్లు), రూ. 3.34 కోట్లు (5 లక్షల డాలర్లు) అందుకోనున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా (106) మూడోస్థానానికి ఎగబాకినప్పటికీ... కటాఫ్ తేదీ వరకు న్యూజిలాండ్ (102; ప్రస్తుతం నాలుగో ర్యాంకు) టాప్–3లో ఉండటంతో రూ. కోటి 33 లక్షలు (2 లక్షల డాలర్లు) నజరానాకు అర్హత పొందింది. ఈ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ (9వ)ను బంగ్లాదేశ్ (8వ) అధిగమించింది. టెస్టు ర్యాంకుల చరిత్రలో విండీస్ అథమ స్థానానికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ జట్టు కేవలం జింబాబ్వే కంటే మాత్రమే ముందుంది. -
బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురండి: లా కమిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని ‘లా’ కమిషన్ ప్రతిపాదించింది. అది ప్రజా అధికారమని కమిషన్ స్పష్టం చేసింది. దీని వల్ల క్రికెట్లో బీసీసీఐ గుత్తాధిపత్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ‘ప్రజా పరిశీలన పరిధిలోకి తీసుకొస్తే జవాబుదారీతనం పెరుగుతుంది. ఇలాంటి వాతావరణాన్ని పోత్సహించేందుకు తోడ్పడుతుంది’ అని లా కమిషన్ బుధవారం తెలిపింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం కిందకు తేవాలనుకుంటున్నారా అని 2016 జూలైలో సుప్రీం కోర్టు లా కమిషన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
క్రికెటర్ల బెస్ట్ ట్వీట్స్ ఇవే..
సాక్షి, స్పోర్ట్స్ : టెక్నాలజీ ఆటలో కూడా ఓ భాగమైంది. భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్లో మాత్రం దీని ప్రభావం మరింత ఎక్కువే. ఒకప్పుడు తమ అభిప్రాయాలు తెలియజేయాలంటే.. ఆటగాళ్లు మీడియా ముందుకు రావల్సిందే. సోషల్‌మీడియా వచ్చిన తర్వాత ఒక్క ట్వీట్, పోస్ట్‌లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలా క్రికెటర్లు తమ అభిమానులకు మరింత చేరువయ్యేలా చేసింది.. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్. ప్రతి విషయాన్ని ఒక్క ట్వీట్‌తో తెలియజేస్తూ అభిమానులను అలరిస్తున్నారు క్రికెటర్లు. అభిమానుల సైతం తమ భావాలను ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇలా ఈ ఏడు ట్రెండ్ అయిన ట్వీట్ల గురించి ఓ లుక్కేద్దాం. టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు కోహ్లి చేసిన ట్వీట్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్, టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ల మధ్య నడిచిన ధర్జీ ట్వీట్లు నెట్టింట్లో బాగా పేలాయి. చాంపియన్స్ ట్రోఫి సందర్భంగా ధోని పాక్ ప్లేయర్ సర్ఫరాజ్ బేబీతో దిగిన ఫోటోపై జర్నలిస్టు రాజ్‌దీప్ సర్ధేశాయ్ చేసిన ట్వీట్, మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి, పాక్ మహిళా క్రికెటర్‌తో దిగిన ఫోటోకు ఐసీసీ చేసిన ట్వీట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాయి దాడి జరిగినప్పుడు ఆ దేశ క్రికెటర్ హెన్రీక్స్ చేసిన ట్వీట్.. ధోని బ్యాక్ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్లు సైతం ట్రెండ్ అయ్యాయి. విరుష్క పెళ్లి ప్రకటన ట్వీట్ అయితే ఏకంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ‘చుట్టు కుర్రాళ్లను కోరుకునే నాయకుడికి ధన్యవాదాలు. నువ్వేప్పుడు మా నాయకుడివే ధోని భాయ్’- విరాట్ కోహ్లి ‘చాంఫియన్స్ ట్రోఫీలో అద్భుత చిత్రం. దేశాలకతీతంగా సర్ఫరాజ్ బేబీతో ధోని’- రాజ్‌దీప్ సర్ధేశాయ్ ‘మహిళల ప్రపంచకప్‌లో అద్భుత క్రీడా స్పూర్తి.. తన రోల్‌మోడల్ గోస్వామితో పాక్ ప్లేయర్’- ఐసీసీ ‘బస్సుపై జరిగిన దాడి ఆదర్శంగా లేదు. కానీ భారత అభిమానులు, అస్సాం యువకులు మాకు మద్దిత్వడం సంతోషంగా ఉంది’- హెన్రీక్స్ ‘బాగా ఆడావూ.. ధర్జీజీ( టేలర్ ని కాస్త టైలర్ గా మార్చి).. దీపావళి సీజన్ ఆర్డర్ ఒత్తిడిలో సైతం బానే ప్రయత్నించావు’.-వీరేంద్ర సేహ్వాగ్ ‘సింహాల అరుపులు మొదలయ్యాయి.. జట్టులోకి ఎవరుస్తున్నారో ఊహించండి’- చెన్నైసూపర్ కింగ్స్ ‘మేమిద్దరం కలకాలం కలిసుంటామనే పెళ్లి ప్రమాణం చేశాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలతో ఈ అందమైన రోజు మాకెంతో ప్రత్యేకం. మా పెళ్లి ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్’. – కోహ్లి, అనుష్క శర్మ -
భారత అంధుల క్రికెట్ సారథి అజయ్
ముంబై: ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇతని సారథ్యంలోని భారత జట్టు అంధుల వన్డే ప్రపంచకప్‌లో తలపడుతుంది. ఈ టోర్నీ వచ్చే నెల 7 నుంచి 21 వరకు పాకిస్తాన్, దుబాయ్ వేదికల్లో జరుగుతుంది. ఎంపికైన జట్టుకు ఈనెల 6 నుంచి వచ్చేనెల 4 వరకు బెంగళూరులో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే జట్టు 5న పాక్‌కు బయల్దేరనుంది. 17 మంది సభ్యులున్న భారత జట్టులో కెప్టెన్ సహా నలుగురు ఏపీ ఆటగాళ్లు ప్రేమ్ కుమార్, వెంకటేశ్వర్ రావు, దుర్గారావులకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి మహేందర్ వైష్ణవ్ ఉన్నాడు. అజయ్ సారథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత జట్టు టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. జట్టు: అజయ్ (కెప్టెన్), ప్రేమ్ కుమార్, వెంకటేశ్వర్ రావు, దుర్గారావు (ఏపీ), జాఫర్, పంకజ్ భుయ్ (ఒడిశా), నరేశ్‌భాయ్ తుందా, గణేష్‌భాయ్ ముహుద్కర్, అనిల్ భాయ్ గరియా (గుజరాత్), వైష్ణవ్ (తెలంగాణ), సోను గోల్కర్ (మధ్యప్రదేశ్), బసప్పా వాద్గల్, ప్రకాశ్, సునీల్ రమేశ్ (కర్ణాటక), సురజిత్ ఘర (బెంగాల్), దీపక్ మలిక్, రామ్‌బీర్ (హరియాణా). -
బీసీసీఐకి రూ.52 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ఇప్పటికే సుప్రీం కోర్టు మొట్టికాయలతో విలవిల్లాడుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మరో పిడుగు జరిమానా రూపంలో పడింది. మీడియా రైట్స్ గుత్తాధిపత్యంపై కన్నెర్ర జేసిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 52.24 కోట్లు జరిమానా కట్టాలని బీసీసీఐని ఆదేశించింది. గత మూడేళ్ల బోర్డు ఆదాయం నుంచి సుమారు 4.48 శాతాన్ని జరిమానాగా కట్టాలని 44 పేజీల ఉత్తర్వులో పేర్కొంది. ఐపీఎల్ మీడియా రైట్స్ విషయంలో బోర్డు ఏకంగా పదేళ్ల హక్కులను ఒక్క మీడియా (సోనీ) సంస్థకే గుత్తాధిపత్యంగా కేటాయించడం వల్ల మిగతా బ్రాడ్కాస్టర్లు పోటీపడే అవకాశాల్ని కోల్పోయారని ఆ ఉత్తర్వులో వెల్లడించింది. దీంతో 2013–14, 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాల్లోని బోర్డు సగటు వార్షికాదాయం రూ. 1164.7 కోట్లను లెక్కలోకి తీసుకొని జరిమానాను ఖరారు చేసింది. నాలుగేళ్ల క్రితం 2013లో కూడా సీసీఐ ఇంతే మొత్తాన్ని జరిమానాగా విధించినప్పటికీ ట్రిబ్యునల్‌లో సవాలు చేయడం ద్వారా బోర్డు జరిమానా నుంచి బయటపడింది. బెదిరింపుపై వివరణ కోరిన సుప్రీం...: బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి... చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) సంతోష్ రంగ్నేకర్‌ను బెదిరించడంపై సుప్రీం కోర్టు మండిపడింది. ఆరోపణలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖన్విల్కర్, చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ బుధవారం ఆదేశించింది. లోధా సిఫార్సులను చేర్చిన బీసీసీఐ నియమావళిపై సలహాలు, సూచనలతో కూడిన నివేదికను జనవరి 15లోపు అందజేయాలని పరిపాలక కమిటీని సుప్రీం బెంచ్ ఆదేశించింది. -
క్రికెట్ నాశనమైంది!
భారత క్రికెట్లో సంస్కరణలకు సంబంధించి జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులపై ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ మరోసారి విరుచుకు పడ్డారు. ‘లోధా కమిటీ నివేదిక క్రికెట్‌ను నాశనం చేసిందని కచ్చితంగా చెప్పగలను’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సుప్రీం మార్గదర్శకాలతో లోధా కమిటీ పని చేయడం ప్రారంభించిననాటినుంచి దానిని వ్యతిరేకిస్తూ వచ్చిన పవార్... 70 ఏళ్లు దాటినవారు పదవులకు అనర్హులు, ఒక రాష్ట్రం ఒకే ఓటు వంటి ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కావాలంటే పిచ్ మార్చగలను!
పుణే: భారత క్రికెట్లో ‘ఫిక్సింగ్’ వివాదం ఇప్పుడు ఆటగాళ్లను దాటి పిచ్ క్యురేటర్ల దాకా చేరింది! స్థాయికి తగినట్లుగా బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసిన ఉదంతాలు గతంలో ఉండగా... మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే విధంగా ‘పిచ్’లో మార్పులు చేసి కూడా ఫిక్సింగ్ చేయవచ్చని కొత్తగా తేలింది! పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం పిచ్ క్యురేటర్ పాండురంగ సాల్గావ్కర్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాడు. జాతీయ వార్తా ఛానల్ ‘ఇండియా టుడే టీవీ’ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఇది బయటపడింది. చానల్ కథనం ప్రకారం... భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేకు ముందు రోజు తమను తాము బుకీలుగా పరిచయం చేసుకొని రిపోర్టర్లు సాల్గావ్కర్తో ముచ్చటించారు. పుణే పిచ్‌పైనే నిలబడి క్యురేటర్ వారి ప్రశ్నలకు సందేహాస్పద రీతిలో సమాధానాలిచ్చారు. ‘మీరు కోరిన విధంగా పిచ్‌లో మార్పులు చేసేందుకు నేను సిద్ధం’ అని 68 ఏళ్ల సాల్గావ్కర్ చెబుతున్నట్లుగా అందులో రికార్డయింది. ‘ఇక్కడ ఉన్న ఎనిమిదో నంబర్ పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. కనీసం 337 పరుగులు చేయవచ్చు. ఆపై దానిని ఛేదించవచ్చు కూడా’ అని సాల్గావ్కర్ వీడియోలో చెప్పాడు. మరో వీడియో క్లిప్‌లో వేరే క్యురేటర్లు చూస్తున్నారు, జాగ్రత్త అని రిపోర్టర్లను హెచ్చరించినట్లుగా ఉంది. ఇతర క్లిప్‌లలో ఒక చోట పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలిస్తుందని, మరో చోట ‘ఫలానా’ ఆటగాడికి మరింత బాగా సరిపోతుంది కాబట్టి అతనిపై బెట్టింగ్ చేయవచ్చని క్యురేటర్ అభయం ఇస్తున్నట్లుగా ఉంది. బీసీసీఐ చర్యలు... ఐసీసీ విచారణ న్యూస్ ఛానల్లో ‘పిచ్ ఫిక్సింగ్’ వార్తలు రాగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెంటనే చర్యలు తీసుకుంది. ముందు పాండురంగ సాల్గావ్‌కర్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లుగానే ప్రకటించిన బోర్డు, ఆ తర్వాత కొద్ది సేపటికే పూర్తిగా అతడిని డిస్మిస్ చేసింది. బోర్డు పిచెస్ కమిటీ సభ్యుడైన రమేశ్ మామున్కర్కు ప్రత్యేకంగా పిచ్ బాధ్యతలు అప్పజెప్పడంతో హడావిడిగా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేశారు. దీనికి ఐసీసీ ఆమోదముద్ర కూడా వేయడంతో మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. బీసీసీఐ ఇప్పటికే చర్యలు తీసుకున్నా...తాజా ఘటనకు సంబంధించి ఐసీసీ, ఎంసీఏ కూడా తమ వైపు నుంచి ప్రత్యేక విచారణ జరపాలని నిర్ణయించాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌పై ఆసీస్ ఘన విజయం సాధించిన తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా పుణే పిచ్ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. టాంపరింగ్ సాధ్యమా! టీవీ ఛానల్ కథనం ప్రకారం చూస్తే పిచ్‌ను తమకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చని అనిపిస్తున్నా... ఈ విషయంలో నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఇది ఏ మాత్రం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. ‘వాతావరణ పరిస్థితులు కలిసొస్తేనే క్యురేటర్ ఎంతో కొంత ప్రభావం చూపించగలరు. లేదంటే నెల రోజుల్లో కూడా కావాల్సినట్లుగా తయారు చేయడం ఎవరి వల్లా కాదు. సాల్గావ్కర్ ఊరికే అబద్ధాలు చెబుతున్నాడు’ అని ఒక బీసీసీఐ క్యురేటర్ కుండబద్దలు కొట్టాడు. ‘ఒక్క రోజులో బుకీలకు అనుకూలంగా అతను పిచ్‌ను ఎలా మారుస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. అతను ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పాడో తెలీదు’ అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే క్యురేటర్లకు సాధారణంగా తక్కువ జీతభత్యాలు ఉంటాయి కాబట్టి వారు బుకీల వలలో పడే అవకాశం ఉంటుందని కూడా మాజీ క్యురేటర్ వెంకట్ సుందరమ్ చెప్పారు. బీసీసీఐ క్యురేటర్లకు ప్రస్తుతం వారి అనుభవాన్ని బట్టి రూ. 35 వేల నుంచి రూ. 70 వేల వరకు జీతాలు ఉన్నాయి. మరోవైపు ఛానల్ తమ కథనంలో రిపోర్టర్లు బుకీలుగా పరిచయమయ్యారని చెప్పుకున్నా... వీడియోలో ఆ విషయం మాత్రం ఎక్కడా లేదు. భారత్‌కు ఆడకపోయినా... పాండురంగ సాల్గావ్కర్ 70వ దశకంలో భారత్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. శ్రీలంకతో ఒకసారి అనధికారిక టెస్టు సిరీస్‌లో పాల్గొన్నా... ఎప్పుడూ భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. సత్తా ఉన్న పేస్ బౌలర్ అయి ఉండీ దురదృష్టవశాత్తూ భారత్‌కు ఆడలేకపోయాడంటూ సునీల్ గావస్కర్ తన ఆటోబయోగ్రఫీలో కూడా సాల్గావ్కర్ గురించి ప్రత్యేకంగా రాశారు. 63 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో సాల్గావ్కర్ కేవలం 26.70 సగటుతో 214 వికెట్లు పడగొట్టడం విశేషం. పాండురంగ ప్రస్తుతం క్యురేటర్ హోదాలో ఎంసీఏ నుంచి రూ. 65 వేల జీతంతో పాటు బీసీసీఐ నుంచి పెన్షన్ కూడా పొందుతున్నారు. -
జంబో భుజాలు అరిగిపోయేలా..
ఒకప్పుడు టీమిండియాలో సచిన్ పెద్దన్నగా ఉండేవాడు. కెప్టెన్ కాకపోయినప్పటికీ జట్టులో ఏదైనా వివాదం తలెత్తితే సచిన్ రంగంలోకి దిగేవాడు. బోర్డుతోనూ పెద్దన్నగానే వ్యవహరించేవాడు. ఆ తర్వాత జట్టులో పెద్దన్నగా వ్యవహరించింది....ఆనాటి మేటి బౌలర్ అనిల్ కుంబ్లే. భుజాలు అరిగిపోయేలా అతనితో కెప్టెన్లు ఎడాపెడా బౌలింగ్ చేయించినా కుంబ్లే ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. క్రికెట్లో కుంబ్లే సాధించిన విజయాలు ఒక ఎత్తయితే వివాద రహితుడిగా కెరీర్‌ను కొనసాగించడం మరోఎత్తు. కెప్టెన్, జట్టులోని ఆటగాళ్లు, బోర్డుతోనూ ఏనాడూ కుంబ్లే వివాదాలకు తెరతీయలేదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుంబ్లే గురించి మరిన్ని విశేషాలు..! బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా ఎప్పుడూ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించిన అతి కొద్దిమందిలో కుంబ్లే కచ్చితంగా చోటు సంపాదించుకుంటాడు. ఇన్ని ప్రత్యేకతలున్న కుంబ్లే రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రికార్డులకన్నా గొప్పది అతని వ్యక్తిత్వం. బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా ఎప్పుడూ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించిన అతి కొద్ది మందిలో కుంబ్లే ఖచ్చితంగా చోటు సంపాదించుకుంటాడు. ఇన్ని ప్రత్యేకతలున్న కుంబ్లే రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రికార్డులకన్నా గొప్పది అతని వ్యక్తిత్వం. కుంబ్లే అసలుపేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. 1970 అక్టోబర్ 17న బెంగళూరులోని కృష్ణస్వామి, సరోజ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే కుంబ్లేకు క్రికెట్‌పై మక్కువ ఉండేది. బెంగళూరు వీధుల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. 13 ఏళ్ల ప్రాయంలోనే యంగ్ క్రికెటర్స్ క్లబ్లో చేరాడు. ఇతనికి దినేశ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. కుంబ్లే విసిరిన బంతి జంబోజెట్ వేగంతో వస్తుందని అతనికి జంబో అనే ముద్దుపేరు పెట్టారు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. 1989 నవంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన కుంబ్లే 4 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత అండర్–19 జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి సెంచరీ సాధించాడు. 1990 ఏప్రిల్ 5న మొదటిసారిగా శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏటా ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత భారత్‌లో జరిగిన 3 టెస్టుల సిరీస్‌లో 19.8 సరాసరితో 21 వికెట్లు సాధించాడు. టెస్టుల్లో మొదటి 50 వికెట్లను కేవలం 10 మ్యాచ్‌ల్లోనే సొంతం చేసుకున్నాడు. 21 టెస్టుల్లో 100 వికెట్లు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే 6 వికెట్లును చేజిక్కించుకున్నాడు. 1996 వన్డే ప్రపంచకప్‌నాటికి కుంబ్లే బౌలింగ్ శిఖరాలకు చేరింది. ఆ ప్రపంచకప్‌లో 16 వికెట్లను తీసాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ కుంబ్లే. ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ టెస్టుల్లో తన సెంచరీని 118వ మ్యాచ్‌లో పూర్తిచేసాడు. ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన భారతీయ బౌలర్ కుంబ్లే. 2004లో కపిల్‌దేవ్ రికార్డును అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. షేన్‌వార్న్ తర్వాత 600 వికెట్ల క్లబ్లో చేరిన రెండో బౌలర్ కుంబ్లే. వన్డేల్లో 300 వికెట్ల క్లబ్లో చేరిన రెండో బౌలర్. కెప్టెన్‌గా.. అనిల్ కుంబ్లే టేస్టుల్లో 14 మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. వీటిలో భారత్ 3గెలిచి 5 ఓడగా 6 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 5 టెస్టు సిరీస్‌ల్లో 2007 పాకిస్థాన్ సిరీస్, 2008 ఆస్ట్రేలియా సిరీస్‌లను భారత్ గెలిచింది. వన్డేల్లో ఒకె ఒక మ్యాచ్‌కు నాయకత్వం వహించగా ఈ మ్యాచ్ భారత్ గెలిచింది. కోచ్‌గానూ.... 2007 ప్రపంచకప్‌లో భారతజట్టు పేలవ ఆటతీరుకు సీనియర్ ఆటగాళ్లపై విమర్శలు రావడంతో బాధ్యతాయుతంగా వన్డే క్రికెట్‌నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు ఫిట్‌గా లేనందును టెస్టులోంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసాడు. పదివికెట్లు తీసిన ఫిరోజ్‌షా కోట్ల మైదానంలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక భారత జట్టు కోచ్‌గానూ కుంబ్లే సేవలందించాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్న కాలంలో వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో వరుస టెస్టు సిరీస్‌లను భారత్ గెలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫి ఫైనల్‌కు చేరి పాక్ చేతిలో ఓడిన విషయం అందరికి తెలిసిందే. తదనాంతరం భారత ఆటగాళ్లు కోచ్‌గా కుంబ్లేపై అయిష్టత కనబర్చడంతో తనంతట తానే కోచ్‌పదవి రేసులో నుంచి తప్పుకున్నాడు. -
మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం
హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు శనివారం రాత్రి ఘన సన్మానం జరిగింది. మాజీ రంజీ క్రికెటర్ రాజేశ్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంబజార్‌లోని మాన్సింగ్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మిథాలీ రాజ్‌తో పాటు నగరానికి చెందిన టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను కూడా సత్కరించారు. దినేశ్ మాన్సింగ్ మిథాలీ రాజ్‌కు వెండి బ్యాట్‌ను బహుకరించగా, నక్మల్ గెహ్లాట్ ఆమెకు బంగారు గొలుసును అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరిఫ్, కోచ్ ఆర్. మూర్తి, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, అంతర్జాతీయ బాడీబిల్డర్ మోతేషామ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
అలసట అని చెప్పను!
∙ బిజీ షెడ్యూల్ అలవాటైంది ∙ క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తేనే ఫలితం ∙ భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ మనోగతం భారత క్రికెట్లో అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాడిగా రోహిత్ శర్మకు పేరుంది. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అతను ఇటీవలే ముగిసిన శ్రీలంక పర్యటనలోనూ శతకాలతో మెరిశాడు. అయితే గాయం కారణంగా గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ ముంబైకర్ క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది. లండన్‌లో సర్జరీ అనంతరం జాతీయ క్రికెట్ శిబిరం (ఎన్సీఏ)లో పునరావాసానికి వెళ్లాడు. అయితే ఈ విరామమేదీ అతడి నైపుణ్యాన్ని వెనక్కి నెట్టలేదు. ఆరు నెలల అనంతరం భారత జట్టు తరఫున తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టిన ఓపెనర్ రోహిత్ అదరగొట్టే ప్రదర్శన చేశాడు. మొత్తం 10 వన్డేల్లో మూడు సెంచరీలతో రాణించాడు. దీనికి ముందు తను ఐపీఎల్లో ఆడి ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించగలిగాడు. కానీ గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసి రాణించడం అంత తేలికేమీ కాదని రోహిత్ చెబుతున్నాడు. ప్రత్యర్థి ఎవరనేది కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటమే తన ఉద్దేశమని అన్నాడు. ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న రోహిత్ నాలుగేళ్ల క్రితం వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీని కూడా వారిపైనే సాధించాడు. విరామం తర్వాత కష్టమే... ఏ ఆటగాడికైనా గాయాల తర్వాత తిరిగి జట్టులోకి రావడమంటే సవాలే. శస్త్రచికిత్స అనంతరం అంతర్గత భయాలను అధిగమించడం చాలా కష్టం తో కూడుకుంది. ఎవరికి వారు ఈ సమస్య నుంచి బయటపడాల్సి ఉంటుంది. నా బ్యాటింగ్ చాలా సులువుగా అనిపించవచ్చు కానీ అది మీ కంటికి కనిపించినంత సులువు మాత్రం కాదు. ఐపీఎల్ బాగానే ఆడినా... నిజానికి నా పునరావాస శిబిరం పూర్తయ్యాక ఐపీఎల్ ప్రారంభం కావడం లాభించింది. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు ఒకవేళ తిరిగి గాయపడితే ఎలా? అనే ఆందోళన ఎప్పుడూ కలగలేదు. అయితే భారత జట్టుకు ఆడుతూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నా మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అలక్ష్యానికి తావు లేదు. కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ధనంజయ బౌలింగ్ అర్థమైంది శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో స్పిన్నర్ ధనంజయ ఆరు వికెట్లతో చెలరేగాడు. అయితే నేను అర్ధ సెంచరీతో రాణించినా అతడి బంతులను ఎక్కువగా ఎదుర్కోలేదు. అతడు బౌలింగ్‌కు వచ్చిన తొలి ఓవర్లోనే నేను వెనుదిరిగాను. అయితే ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో అతడి బౌలింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకొని ఆడాను. పరిస్థితులకు తగ్గట్టుగానే నా సన్నాహకాలు ఎప్పుడైనా ప్రత్యర్థిని బట్టి కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగానే ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్లో చాలా జట్ల కోర్ గ్రూప్ ఒకేలా ఉంటుంది. ఫలానా పిచ్‌లపై ఎలాంటి షాట్లు ఆడితే మేలు అనే విషయాలు తెలిసి ఉండాలి. నీ ఇన్నింగ్స్‌ను ఎలా ఆడబోతున్నావనే దానిపై స్పష్టత అవసరం. స్టార్క్ లేకపోవడం లోటే ఆసీస్ జట్టులో మిషెల్ స్టార్క్ లేకపోవడం వారికి లోటుగానే చెప్పవచ్చు. స్టార్క్ జట్టులో ఉంటే అదనపు బలంగా ఉంటుంది. అయితే జట్టులోని చాలామంది ఆటగాళ్లుఐపీఎల్లో ఆడి ఉండటంతో వారికి ఇక్కడి పిచ్‌లపై పరిజ్ఞానం ఉంటుంది. కచ్చితంగా వారిని మేం తేలిగ్గా తీసుకోం. కెప్టెన్సీ ఓ గౌరవం టీమిండియా వైస్‌కెప్టెన్‌గా ఉండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. మైదానంలో విరాట్‌కు సహాయపడటమే నా విధి. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అనుకుంటున్నాను. రొటేషన్ పాలసీపై కఠినమైన షెడ్యూల్, ఎక్కువ క్రికెట్ ఆడాల్సి రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. చాలా రోజులుగా దీనికి అలవాటు పడిపోయాం. మన శరీరం ఎలా స్పందిస్తుందనేదానిపై మనకు అవగాహన ఉండాలి. ఏదైనా సమస్య వస్తే జట్టుతో పాటు ఫిజియో, ట్రైనర్, డాక్టర్ ఎలాగూ ఉన్నారు. ప్రతీ ఆటగాడు వంద శాతం ఫిట్‌గా ఉండాలనే రొటేషన్ పాలసీని అమలు చేస్తున్నారు. క్రికెటర్ల కెరీర్ చాలా చిన్నది. ఉన్న సమయాన్నే పూర్తిగా ఉపయోగించుకొని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. కాబట్టి అలసిపోయాను అని, షెడ్యూల్ ఇబ్బందికరంగా ఉందని సాకులు చెప్పరాదు. -
9 ఏళ్ల తర్వాత...
ఆగస్టు 18, 2008... విరాట్ కోహ్లి భారత్ తరఫున తొలి వన్డే ఆడిన రోజు. దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి కోహ్లి 12 పరుగులు చేశాడు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత కోహ్లి ఒక సూపర్ స్టార్. ఒకదాని తర్వాత మరో రికార్డును బద్దలు కొడుతూ ఈతరంలో నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యాట్స్‌మన్. మరోసారి దంబుల్లాలో మ్యాచ్‌కు సిద్ధమైన వేళ కోహ్లి తన తొలి మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ తాను ఆనాడు కూర్చున్న కుర్చీతో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ‘ఇదే రోజు ఇదే మైదానంలో ఇదే కుర్చీతో అలా ప్రస్థానం మొదలైంది. భారత క్రికెట్‌తో తొమ్మిదేళ్లు! చాలా గొప్పగా అనిపిస్తోంది’ అని కోహ్లి వ్యాఖ్య జోడించాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం దంబుల్లా మైదానంలో జరిగే తొలి వన్డేతో ప్రారంభమవుతుంది. -
‘కూల్’గా ఆడగలడా!
∙ ధోనిపై పెరిగిన ఒత్తిడి ∙ ఇకపై ప్రతీ సిరీస్ సవాలే ∙ సెలక్టర్ల ప్రత్యేక దృష్టి ‘ధోని ఆటను బట్టే అతడిని జట్టులో కొనసాగించడం గురించి మున్ముందు ఆలోచిస్తాం. మంచి ప్రదర్శన ఇవ్వకపోతే ప్రత్యామ్నాయాన్ని చూడాల్సి ఉంటుంది’... భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ మాట చెప్పగానే దేశంలోని ధోని అభిమాన గణం మొత్తం ఆయనపై విరుచుకు పడింది. మా ఎమ్మెస్ గురించి మాట్లాడే స్థాయి ఈ ఎమ్మెస్కేకు ఎక్కడ ఉందంటూ వారంతా విమర్శలకు దిగారు. అయితే భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఉన్న సెలక్టర్లు గానీ, అందులో ఎంతో మంది కెరీర్లు అర్ధాంతరంగా ముగిసిన సమయంలో ఉన్న సెలక్టర్లు గానీ ఆయా ఆటగాళ్లకంటే గొప్పవాళ్లు కాకపోవచ్చు. కానీ సెలక్టర్ హోదాలో వారు నిర్దాక్షిణ్యంగా సంచలన నిర్ణయాలు తీసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. ధోనిలాంటి సూపర్ స్టార్ గురించి బహిరంగ ప్రకటన చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకపోయినా ధోనికి పరిస్థితి అంత సానుకూలంగా ఏమీ లేదని అర్థమవుతోంది. బోర్డు వ్యవహారాలు, సెలక్షన్ రాజకీయాల గురించి ధోనిలాంటి వాడికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగాలని పట్టుదలగా ఉన్న ఈ మాజీ కెప్టెన్... నేరుగా హెచ్చరికలు అందుకుంటున్న ఇలాంటి స్థితిలో తన సహజ శైలిలో ఆడగలడా? సత్తా చాటి తన స్థానం మరో రెండేళ్ల పాటు సుస్థిరం చేసుకోగలడా? సాక్షి క్రీడా విభాగం : ధోని స్థాయి ఆటగాడికి తన ఇష్ట ప్రకారమే తప్పుకునే హక్కు ఉంది తప్ప ఎవరూ బలవంత పెట్టకూడదు, తాను జట్టుకు ఉపయోగపడనని తెలిసిన రోజున అతనే వెళ్లిపోతాడు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడడు... ‘మిస్టర్ కూల్’ గురించి చాలా మంది క్రికెటర్లు, మాజీలు, సన్నిహితులు తరచుగా చెప్పే మాట ఇది. అతను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న రోజున అందరూ దీనిని ఉదాహరణగా చూపించారు. గత జనవరిలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు వన్డే, టి20 కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధోని ప్రకటించిన రోజున కూడా అంతా ఇదే అనుకున్నారు. అయితే తదనంతర పరిణామాల్లో ధోని స్వయంగా తప్పు కోలేదని, సెలక్టర్లు అతడితో చర్చించిన తర్వాతే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. ధోని ప్రకటనకు ఒక రోజు ముందే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సుదీర్ఘంగా ధోనితో మాట్లాడిన విషయం దానిని నిర్ధారించింది. ఇప్పుడు అదే ప్రసాద్, ధోని భవిష్యత్తు గురించి చెబుతున్నారంటే అదేదో ఊరికే నోటిమాటగా భావించడానికి వీల్లేదు. కచ్చితంగా సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ విషయంలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరమే ప్రసాద్ తమ ఉద్దేశం బయటకు వెల్లడించారు. కాబట్టి మహి విషయంలో వారికి స్పష్టత ఉంది. అందుకే ప్రదర్శన, ప్రత్యామ్నాయం గురించి వారు చెబుతున్నారు. ఆట బాగున్నా... కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని 13 వన్డేలు ఆడాడు. ఇందులో నాలుగు సార్లు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. మిగతా మ్యాచ్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు అంటే చాలా మంచి ప్రదర్శనగానే లెక్క. వికెట్ కీపర్‌గా, ఫిట్నెస్ పరంగా కూడా అతను చురుగ్గా ఉన్నాడు. అంతా బాగున్నప్పుడు సమస్య ఏముంది అనిపించవచ్చు. అయితే సెలక్టర్ల దృష్టిలో ఇప్పుడు సిద్ధం చేస్తున్న జట్టు 2019 ప్రపంచ కప్ కోసమే. ఆలోగా జట్టు వచ్చే రెండేళ్ల పాటు నిలకడైన ప్రదర్శన ఇవ్వాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా వైఫల్యాలతో సంబంధం లేకుండా కుర్రాళ్లందరికీ వరుసగా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కోహ్లి నాయకత్వంలోని ఈ యువ జట్టులో ధోని ఒక్కడే బాగా సీనియర్. కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి ప్రణాళికల్లో బహుశా ధోని లేకపోవచ్చు. కోచ్‌గా తన తొలి సిరీస్‌కు ముందు శాస్త్రి మాట్లాడుతూ... ‘ఇద్దరు చాంపియన్ క్రికెటర్ల గురించి సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం. కెప్టెన్‌తో చర్చించిన తర్వాతే ఏం చేయాలో ఆలోచిస్తాం’ అని చెప్పారు. మరి వారిద్దరు ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరిపారో తెలీదు కానీ... ఇప్పటికే యువరాజ్ సింగ్‌ను తప్పించి సెలక్టర్లు భవిష్యత్తు గురించి తమ ఆలోచనలను వెల్లడించారు. అడిగినా, అడగకపోయినా జట్టు ఫిట్నెస్ గురించే శాస్త్రి పదే పదే మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమీ కనిపించడం లేదు. కాబట్టి వచ్చే రెండేళ్ల పాటు ధోని ఫిట్నెస్ను కాపాడుకోగలడా అనేది కూడా కీలకం. సత్తా చాటాల్సిందే... రాహుల్ ద్రవిడ్‌లాంటి దిగ్గజాలు కూడా యువీ, ధోనిలపై నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయం ఇటీవల వ్యక్త పరిచారు. వారు ఏ స్థానాల్లో ఆడతారులాంటివి కూడా ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే పరోక్షంగా వారు లేకుండానే జట్టును నిర్మించడం మంచిదనే సూచన కనిపిస్తోంది! వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో మెరుగైన స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌ను ముగించలేని పరిస్థితి ధోని బయోడేటాను దెబ్బ తీసింది. ధోని ఇప్పుడు కూడా మెరుగైన ఆటగాడే అయినా... సహజంగానే అతని పాత తరహా ఆటతో పోల్చి చూస్తున్నారు. ఆ రకంగా చూస్తే ‘ఇలాంటి ధోని’ అవసరం జట్టుకు అంతగా కనిపించడం లేదేమో! ఒక ప్రధాన బ్యాట్స్మన్కంటే కూడా ఇప్పుడు ధోని రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్లాగే కనిపిస్తున్నాడనేది వాస్తవం. ఇక కెప్టెన్‌గా కూడా రాటుదేలిన కోహ్లికి మున్ముందు సలహాల విషయంలో ధోని అవసరం రాకపోవచ్చేమో. అందుకే ప్రత్యామ్నాయం చూస్తామంటూ స్వయంగా వికెట్ కీపర్ అయిన ప్రసాద్ అంత గట్టిగా చెప్పగలిగారు. ప్రస్తుత శ్రీలంక సిరీస్‌లో 5 వన్డేలతో పాటు ఇదే ఏడాది భారత్ సొంతగడ్డపై మరో ఎనిమిది వన్డేలు కూడా ఆడనుంది. దాదాపు ఇదే జట్టు ఆ మ్యాచ్‌లకు కూడా కొనసాగవచ్చు. సెలక్టర్ల మాటలను బట్టి చూస్తే గత రికార్డు, గొప్పతనంలాంటివేవీ ఇప్పుడు ధోనిని ఆదుకునే పరిస్థితి మాత్రం లేదనేది అర్థమైంది. 2019 వరల్డ్ కప్ గురించి ఆలోచించాలంటే దాదాపు ప్రతీ మ్యాచ్‌లో అతను బాగా ఆడాల్సి ఉంటుంది. జట్టు పరాజయంలో ఏదో ఒక రూపంలో ధోని పరోక్షంగా కారణమైనా...సెలక్టర్లకు సాకు దొరికినట్లే! మరో 4 ఆడితే... ధోని తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం 296 వన్డేలు ఆడిన మాజీ కెప్టెన్, మరో నాలుగు మ్యాచ్‌లు ఆడితే 300 మ్యాచ్‌ల క్లబ్లో చోటు దక్కించుకుంటాడు. భారత్ తరఫున సచిన్, ద్రవిడ్, అజహర్, గంగూలీ, యువరాజ్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఓవరాల్‌గా 19 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. వన్డే కెరీర్లో 9,496 పరుగులు చేసిన ధోని ప్రస్తుత సగటు 51.32. తర్వాతి నాలుగు వన్డేల్లో అతను ఒక్క పరుగూ చేయకపోయినా కూడా అతని సగటు 50.24గా ఉంటుంది. 300 మ్యాచ్‌లు ఆడిన తర్వాత కూడా వన్డే సగటు కనీసం 50 పరుగులు ఉండే ఏకైక ఆటగాడు ధోనినే కానుండటం విశేషం. ప్రాక్టీస్... ప్రాక్టీస్... దంబుల్లా: వన్డే సిరీస్‌కు ముందు ధోని తొలిసారి శ్రీలంకలో తన సన్నాహకాలకు పదును పెట్టాడు. గురువారం అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత తన సహజ శైలిలో షాట్లు ఆడాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో టెస్టు సిరీస్ ఆడిన ఆటగాళ్లెవరూ ప్రాక్టీస్‌కు రాలేదు. ధోనితో పాటు జాదవ్, పాండే, చహల్, శార్దుల్ సాధన చేశారు. -
37 ఏళ్ల అనుభవం పనికొస్తుంది!
►కోచ్‌గా కొత్తగా చేయాల్సిందేమీ లేదు ►ఆడే వాతావరణం కల్పిస్తే చాలు రవిశాస్త్రి వ్యాఖ్యలు కొలంబో: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ఎంపిక విషయంలో ఇటీవలి కాలంలో ఎంతో చర్చ జరిగింది. విభేదాలు, వివాదాలు అన్నీ వార్తల్లో నిలిచాయి. ఇలాంటి స్థితిలో రవిశాస్త్రి ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే భారత క్రికెట్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు ప్రత్యేకంగా ఉన్న సమయంలో శాస్త్రి బాధ్యతలు ఏమిటనేది అస్పష్టం. దీనికి ఆయన తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ‘నేను సహాయక సిబ్బంది మొత్తానికి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాను. మన జట్టు సభ్యులు మనసులో ఎలాంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా మైదానంలోకి వెళ్లి స్వేచ్ఛగా, భయం లేకుండా, సానుకూల దృక్పథంతో తమ ఆటను ప్రదర్శించేలా సిద్ధం చేయడమే నా పని. అదో రకమైన కళ. అది నాకు తెలుసు కాబట్టే ఈ పదవిలో ఉన్నాను’ అని ఆయన జవాబిచ్చారు. తాను గతంలో టీమ్ డైరెక్టర్‌గా ఎక్కడ పనిని ముగించానో, ప్రస్తుతం అక్కడి నుంచే దానిని కొనసాగిస్తున్నానని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ‘నేను అదనపు బాధ్యతలతో ఇక్కడికి రాలేదని నా అభిప్రాయం. జట్టు కూడా అదే కాబట్టి మరో ఆలోచన లేకుండా అలా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోతే సరి. అంతా అలవోకగా సాగిపోతుంది. కొత్తగా నేను చేయాల్సిందేమీ లేదు. ఆట ఆడమని చెప్పి నేను పక్కకు తప్పుకుంటే సరిపోతుంది’ అని శాస్త్రి అన్నారు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో తమపై అజమాయిషీ చలాయించారని, ఒక రకంగా నియంతలా వ్యవహరించారని కూడా ఆటగాళ్లు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి అంశాలను చక్కబెట్టడంలో శాస్త్రి శైలి ఏమిటనే దానికి కూడా ఆయన పంచ్ డైలాగ్ చెప్పారు. ‘నేను 37 ఏళ్లుగా క్రికెట్లో కొనసాగుతున్నాను. ఆటగాడిగా, కామెంటేటర్‌గా అనుభవం ఉంది. కాబట్టి ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో నాకు బాగా తెలుసు. ఇన్నేళ్ల పాటు నిరంతరాయంగా క్రికెట్‌తో అనుబంధం ఉంది. అందువల్ల ఈతరం క్రికెటర్లను కూడా అర్థం చేసుకోగలను. అసలు ఈ దశలో వారికి కోచింగే అవసరం లేదు. చక్కటి వాతావరణం కల్పించి వారు ఆడేలా ప్రోత్సహిస్తే చాలు’ అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. వారు కూడా సాధించలేనిది... భారత క్రికెట్లో గొప్ప పేరున్న అనేక మంది క్రికెటర్లకు కూడా సాధ్యం కాని ఘనతను ప్రస్తుత జట్టు సాధించిందని రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘ఉదాహరణకు శ్రీలంక గడ్డపై 20 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలవడం అలాంటిదే. ఎంతో మంది క్రికెటర్లు 20 ఏళ్ల పాటు భారత్‌కు ఆడారు. అనేక సార్లు లంకలో పర్యటించారు కానీ సిరీస్ గెలవలేకపోయారు. గత జట్లకు సాధ్యం కాని విధంగా ఈ కుర్రాళ్లు వన్డే సిరీస్ కూడా గెలిచారు’ అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో సిరీస్‌ల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, దానిని కూడా సవాల్‌గా భావించి గెలవగల సామర్థ్యం ఈ జట్టుకు ఉందని శాస్త్రి చెప్పారు. నాయకుడిగా ఇప్పటికే అనేక విజయాలు సాధించిన కోహ్లి, భారత అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.