
‘ధోనితో నా భాగస్వామ్యం గురించి చేసిన ట్వీట్ రిటైర్మెంట్ వదంతులకు కారణమవుతుందని అనుకోలేదు. నిజానికి నా మనసులో ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. ఏదో ఇంట్లో కూర్చొని అలా ఫోటోతో సహా ట్వీట్ చేశానంతే. అది వార్తగా మారిపోయింది. నేను ఆలోచించిన విధంగానే ప్రపంచం ఆలోచించదని అర్థమైంది. ఎలాంటి ట్వీట్‌లు చేయకూడదో దీనినుంచి నేర్చుకున్నాను. నాటి మ్యాచ్ నాకు ఎంతో ప్రత్యేకం కాబట్టి దాని గురించి చెప్పాలని భావిస్తే జనం తప్పుగా అర్థం చేసుకున్నారు. రిటైర్మెంట్ ధోని వ్యక్తిగత విషయం. అతను ఎప్పుడైనా భారత క్రికెట్ బాగు గురించే ఆలోచిస్తాడు. ఈ విషయంలో మా అందరిదీ ఒకే తరహా ఆలోచన. అతని అనుభవం వెలకట్టలేనిది’
– కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment