Mahendra singh dhoni
-
కొత్త వ్యాపారంలోకి ధోనీ...
-
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్ తగిలింది. ధోనీ అభ్యర్థనమేరకు ఆమ్రపాలి గ్రూప్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ధోనీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. యూయూ లలిత్, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆమ్రపాలి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. ఆమ్రపాలి గ్రూప్ పాత యాజమాన్యం మధ్య వర్తిత్వ ప్రక్రియలో గృహ కొనుగోలుదారులకు న్యాయం జరగాలని వ్యాఖ్యానించారు. ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా తన సేవలకు చెల్లింపులో డిఫాల్ట్ అయ్యారంటూ ఆమ్రపాలి గ్రూపుపై మధ్యవర్తిత్వ చర్యలు కోరుతు కోర్టును ఆశ్రయించాడు. ధోనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఎమ్‌పిఎల్)తో ఆమ్రపాలి గ్రూప్ ‘షామ్ ఒప్పందాలు’ కుదుర్చుకునిఇంటి కొనుగోలుదారులసొమ్మును అక్రమంగా మళ్లించిందని అత్యున్నత న్యాయస్థానం నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు ధర్మాసనానికి తెలిపారు. కాగా 2019, మార్చిలో ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్ట్‌లో 10 సంవత్సరాల క్రితం బుక్ చేసిన 5,500 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌పై తన యాజమాన్య హక్కులను కాపాడాలని కోరుతూ సుప్రీం కోర్టు తలుపు తట్టాడు ధోని. రియల్ ఎస్టేట్ కంపెనీకి తన సేవలకు సంబంధించి రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్‌పై మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది. ఆమ్రపాలి, దాని డైరెక్టర్లు ఉపయోగించని ఆస్తులను విక్రయించడం ద్వారా 700 కోట్ల రటపాయల నిధిని ఎలా ఏర్పాటు చేయవచ్చో అన్వేషించాలని నోయిడా ,గ్రేటర్ నోయిడా అధికారులను కోర్టు కోరింది. కొనుగోలుదారులపై అనవసరంగా భారం పడకూడదని పేర్కొంటూ, ప్రాజెక్టుల నిర్మాణానికి లోటును తీర్చేందుకు గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్ల కోసం చదరపు అడుగుకు రూ. 200 చొప్పున అదనపు మొత్తాన్ని జమ చేయాలనే ఎస్సీ నియమించిన రిసీవర్ ప్రతిపాదనను కోర్టు మళ్లీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
ఆ ముద్దు పేరును జీవితాంతం మర్చిపోలేను : రైనా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు వెలకట్టలేనిదని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) వైఎస్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అన్నారు. తనకు, ధోనీకి చెన్నై ఫ్యాన్స్ పెట్టిన ముద్దుపేర్లను జీవితాంతం మర్చిపోలేమన్నారు. కాగా, రైనా, ధోనీ గత 12 ఏళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి తమిళనాడు వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. వారంత ధోనీని తాల, రైనాను చిన్న తాలగా పిలుచుకుంటారు(తాల అంటే పెద్దన్న అని అర్థం). ఈ ముద్దు పేర్లపై సురేష్ రైనా స్పందిస్తూ .. ధోనీని, తనను తాల, చిన్న తాల అని పిలిచినప్పుడు చాలా సంతోషం కలుగుతుందని చెప్పారు. 1975లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘షోలే’లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పోషించిన పాత్రలు జై, వీరూ మాదిరి ధోనీ, తాను కూడా మంచి స్నేహితుల్లా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుందన్నారు. (చదవండి : డ్రీమ్' ధనాధన్) ‘వారి పిలుపులో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. మేము తొలుత దక్షిణాది వైపు వెళ్లినప్పుడు మాపై చాలా బాధ్యత ఉండేది. మా ఆటతో వారిని మెప్పిస్తామో లేదో అని భయపడ్డాం. కానీ దక్షిణాది ప్రజలు మా ఆటను ఆస్వాదించారు. దానికి కారణం మా ఫ్యాన్సే. వాళ్లు మాకు చాలా మద్దతుగా నిలిచారు. చాలా స్వేచ్ఛను ఇచ్చారు. వారి ప్రేమ, మద్దతుతోనే ఐపీఎల్లో రానించగలిగాం. ధోనీని, నన్ను తాల, చిన్న తాల అని చెన్నై ఫ్యాన్స్ పిలిస్తే.. షోలే సినిమాలో జై, వీరులాంటి వాళ్లమనే ఫీలింగ్ కలిగేది. వారిచ్చిన ముద్దు పేరు, చూపించిన ప్రేమ, మద్దతును జీవితాంతం మర్చిపోలేను’అని రైనా చెప్పుకొచ్చారు. కాగా, ఈ నెల 15న ధోనీ, రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో మాత్రం వీరిద్దరు కొనసాగనున్నారు. (చదవండి : ధోని కెప్టెన్ అవుతాడని అప్పుడే ఊహించా) -
నువ్వు బహుమతులకు లొంగని వ్యక్తివి: సాక్షి ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మంగళవారం(జూలై7) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజుతో ధోని 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా క్రీడాకారులతోపాటు కోట్లాది మంది అభిమానులు ధోనికి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ధోని బర్త్‌డే సందర్భంగా స్పెషల్ వీడియోను రూపొందించాడు. ధోని ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోని నెంబర్ 7' పేరిట బ్రావో ఆ పాటను ఈ రోజు రిలీజ్ చేసాడు. దీంతో ధోనిపై ఉన్న తన ప్రేమని బ్రావో చాటుకున్నాడు. (ధోని ఆంతర్యం ఏమిటో ?) కాగా ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తన భర్త కోసం ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘నీ పుట్టిన రోజును గుర్తుకుచేసుకుంటూ ఒక ఏడాది గడిచిపోయింది. కొంచెం వయసు పెరిగింది. ఇంకొంచెం తెలివిగా, మరింత తియ్యగా మారాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే బహుమతులకు లొంగని వ్యక్తివి. కేక్ కట్ చేసి, క్యాండిల్స్ వెలిగించి నీ జీవితంలోని మరో ఏడాదిని సెలబ్రేట్ చేసుకుందాం. హ్యపీ బర్త్‌డే హస్బెండ్’ అంటూ విష్ చేశారు. (టి20 ప్రపంచకప్ వాయిదా?) View this post on Instagram Marking the date you were born, another year older, greyed a bit more, become smarter and sweeter. (Literally 😂😂) You are a man who will not be moved by all the sweet wishes and gifts. Let’s celebrate another year of your life by cutting a cake and blowing the candles! Happy Birthday, Husband!! A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Jul 6, 2020 at 10:23pm PDT ధోని జార్ఖండ్‌లోని రాంచీలో 1981, జూలై7న జన్మించాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడేళ్లకే 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌తో ధోని టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపాడు. అంతేగాక 2011లో వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న మొదటి కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు. ఇక 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, 2017లో టీ 20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ జరిగిన తర్వాత నుంచి ధోని భారత జట్టు తరఫున ఆడలేదు. దాంతో అతని రిటైర్మెంట్పై రకరకాలు కథనాలు వస్తూనే ఉన్నాయి (ఐపీఎల్ ఆతిథ్యానికి మేము సిద్ధం: న్యూజిలాండ్) -
‘ఆ ట్వీట్ పాఠం నేర్పింది’
‘ధోనితో నా భాగస్వామ్యం గురించి చేసిన ట్వీట్ రిటైర్మెంట్ వదంతులకు కారణమవుతుందని అనుకోలేదు. నిజానికి నా మనసులో ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. ఏదో ఇంట్లో కూర్చొని అలా ఫోటోతో సహా ట్వీట్ చేశానంతే. అది వార్తగా మారిపోయింది. నేను ఆలోచించిన విధంగానే ప్రపంచం ఆలోచించదని అర్థమైంది. ఎలాంటి ట్వీట్లు చేయకూడదో దీనినుంచి నేర్చుకున్నాను. నాటి మ్యాచ్ నాకు ఎంతో ప్రత్యేకం కాబట్టి దాని గురించి చెప్పాలని భావిస్తే జనం తప్పుగా అర్థం చేసుకున్నారు. రిటైర్మెంట్ ధోని వ్యక్తిగత విషయం. అతను ఎప్పుడైనా భారత క్రికెట్ బాగు గురించే ఆలోచిస్తాడు. ఈ విషయంలో మా అందరిదీ ఒకే తరహా ఆలోచన. అతని అనుభవం వెలకట్టలేనిది’ – కోహ్లి -
కీపింగ్‌లో మొనగాడు ఎంఎస్ ధోని
సాక్షి, స్పోర్ట్స్ (మాంచెస్టర్): మూడు టీ20ల భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్ చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్ సాధించాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరిట ఉన్న రికార్డును ‘మిస్టర్ కూల్’ ధోని అధిగమించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది. అదే ఫామ్ కొనసాగిస్తే ఆతిథ్య జట్టుకు 200 పరుగులు సులువే. కానీ 14వ ఓవర్లో కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. ఈ చైనామన్ బౌలర్ మూడో(ఇన్నింగ్స్14వ) ఓవర్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. ఓ ఓవర్ తొలి బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అందుకోగా నిరాశగా వెనుదిరిగాడు. అపై అదే ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతంగా స్టంపింగ్ చేయడంతో జానీ బెయిర్‌స్టో (0) ఔటయ్యాడు. ఈ వికెట్‌తో కమ్రాన్ అక్మల్ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ఎంఎస్ ధోని సమం చేశాడు. ఆ మరుసటి బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్ చేసి డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు మహీ. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ (33) చేసిన వికెట్ కీపరగా ధోని నిలిచాడు. ధోని ఆలోచనల్ని సరిగ్గా అమలుచేసిన కుల్దీప్(5/24) అద్భుత బౌలింగ్‌కు ఇంగ్లండ్ నుంచి సమాధానం కరువై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ శతకంతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) పరవాలేదనిపించాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి రాహుల్ లక్ష్యాన్ని పూర్తి చేసి సిరీస్‌లో టీమిండియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్లు 33 ఎంఎస్ ధోని 32 కమ్రాన్ అక్మల్ 28 మహ్మద్ షెహజాద్ 26 ముష్ఫీకర్ రహీం 20 కుమార సంగక్కర -
సాహో ధోని.. ఫీల్డ్‌లోకి వచ్చి వీరాభిమాని హల్చల్
సాక్షి, మొహాలీ : భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో రెండో వన్డే జరుగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్రికెట్ యువ అభిమానం అమాంతం పిచ్‌లోకి దూసుకొచ్చాడు. నేరుగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ దోని వద్దకు పరుగులు తీశాడు. వెంటనే తన చేతిలో ఉన్న అట్టాముక్కపై ఆటోగ్రఫీ ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి వ్యవహారం చూసి ధోని ఆశ్చర్యపోయాడు. భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్‌మెన్ చేలరేగిపోయారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ (208 నాటౌట్) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. తర్వాత శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా కీపర్‌గా ధోనీ ఫీల్డ్‌లో ఉన్నారు. అదే సమయంలో ఆట జరుగుతుండగానే ఓ వీర అభిమాని ధోని వైపు దూసుకొచ్చాడు. వెంటనే ఆయన ఆటోగ్రఫీని అడిగి అనంతరం ధోని పాదాలు తాకి వందనం చేసుకున్నాడు. అతడు చేసిన పనికి ఏమాత్రం విసుక్కోని ధోని సంతోషంగానే అతడిని తిరిగి పంపించాడు. ఇది చూసిన అక్కడి కెమెరామెన్ ఆ దృశ్యాలను క్లిక్ మనిపించాడు. -
ధోనీ కెప్టెన్సీలో ఆడలేకపోయాను.. కానీ!
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడలేకపోయానని యువ సంచలనం బాసిల్ థంపి అన్నాడు. శ్రీలంకతో త్వరలో జరగనున్న ట్వంటీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో థంపి ఉన్నాడు. భారత జట్టుకు ఎంపికయ్యానని తెలియగానే ఎంతో సంతోషించాను. నిజంగా అది గర్వించే సమయమన్నాడు. బౌలర్ థంపి ఇంకా ఏమన్నాడంటే.. టీమిండియాకు ఎంపికయ్యానని కేరళ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జయేష్ జార్జ్ నాకు చెప్పగానే చాలా గర్వంగా అనిపించింది. ప్రతి క్రీడాకారుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటారు. ప్రస్తుతం నాకు ఛాన్స్ దొరికింది. అయితే ధోనీ లాంటి కెప్టెన్ నేతృత్వంలో ఆడాలని ఆశగాఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం. నేను బౌలింగ్ చేస్తుంటేనైనా.. నా బంతులకు ధోనీ కీపింగ్ చేయడం గౌరవంగా భావిస్తాను. ధోనీతో కలిసి ఆడుతూ విలువైన సలహాలు, సూచనలు సిద్ధంగా ఉన్నానని' వివరించాడు. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన థంపి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
'సామ్'తో ధోనీ డ్యాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే!
మహేంద్రసింగ్ ధోనీ మంచి 'పెట్ లవర్'. ఈ విషయాన్ని ఆయనే చెప్తారు. తనకు కుక్కలంటే ప్రాణమని.. ధోనీ సోషల్ మీడియా అకౌంట్ చూసినా ఈ విషయం స్పష్టమవుతుంది. కుక్కలపై ధోనీ చూపే ప్రేమ తెలిసిపోతుంది. ధోనీకి 'సామ్' అనే పెంపుడు కుక్క ఉంది. 'సామ్'తో కలిసి ధోనీ డ్యాన్స్ చేస్తున్న క్యూట్ వీడియోను తాజాగా ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. ఈ వీడియోలో ధోనీ ఎలా చేస్తే.. అలాగే సామ్ అనుకరించడం.. ఆయన ప్రేమగా దానిని అక్కున చేర్చుకోవడం చూడొచ్చు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ధోనీ ప్రస్తుతం రాంచీలో ఉన్నాడు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ-20 సిరీస్‌లో పాల్గొనేముందు దొరికిన తీరిక సమయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ధోనీ ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్ 4-1తేడాతో సిరీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్ విజయంలో ధోనీ కూడా కీలక పాత్ర పోషించాడు. -
వారు అలా ఆడితే ఏమీ చేయలేం!
గేల్, డివిలియర్స్‌పై ధోని వ్యాఖ్య పెర్త్: క్రిస్ గేల్, డివిలియర్స్ జోరు మీదున్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు, కెప్టెన్ ఏమీ చేయలేరని, వారిపై ఎలాంటి వ్యూహం పని చేయదని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ విఫలం కాగా, శుక్రవారం విండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గేల్‌ను ఎలా అడ్డుకుంటారనే ప్రశ్నకు స్పందిస్తూ ధోని ఈ మాట అన్నాడు. ‘ఈ ఇద్దరిపై ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడమే పెద్ద ప్రణాళిక అనవచ్చు. వారు సిక్సర్లు బాదుతున్నప్పుడు ఏ ఫీల్డింగ్ పనికొస్తుంది. షార్ట్ పించ్ బంతులపై కూడా చెలరేగుతుంటే ఏం చేయగలం. వారి కోసం ఒక ప్రత్యేక వ్యూహంలాంటిది ఏమీ రూపొందించలేం. కొన్ని సార్లు బౌలర్లకు స్వేచ్ఛ ఇచ్చి వైవిధ్యమైన బంతులు ప్రయత్నించడం ఒక్కటే మిగిలిన అవకాశం’ అని ధోని అభిప్రాయ పడ్డాడు. -
ధోనికి పాప పుట్టింది
న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌కు ముందే మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో ఆనందం వచ్చింది. శుక్రవారం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ తండ్రయ్యాడు. అతని భార్య సాక్షిసింగ్ గుర్గావ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఆస్పత్రిలో సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ‘పాప 3.7 కిలోలతో చాలా ఆరోగ్యంగా ఉంది. వాస్తవానికి మార్చిలో డెలివరీ కావాల్సి ఉన్నా నెల రోజుల ముందే అయిపోయింది. ఈ వార్తతో ధోని చాలా సంతోషంగా ఉన్నాడు’ అని అతని కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. 2010 జులైలో సాక్షిసింగ్‌తో ధోని పెళ్లి జరిగింది. -
అభిమానులతో సరదాగా...
మెల్బోర్న్: మూడో టెస్టు సన్నాహాల్లో ఉన్న భారత క్రికెటర్లు మంగళవారం ఇక్కడి అభిమానులతో సరదాగా గడిపారు. ఎంసీజీ బయట ‘ఫ్యామిలీ డే’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి జట్టు ఆటగాళ్లంతా హాజరయ్యారు. ముఖ్యంగా భద్రతాపరమైన కట్టుబాట్లు లేకుండా వారంతా అభిమానులకు బాగా దగ్గరగా రావడం విశేషం. కెప్టెన్ ధోనితో సహా ఆటగాళ్లంతా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఫొటోలు కూడా దిగారు. అత్యుత్సాహంతో అభిమానులు ‘సెల్ఫీ’ కోసం అడిగినా... భారత ఆటగాళ్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వీరిలో భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆటతో సంబంధం లేని అనేక ఆసక్తికర అంశాలపై ఆటగాళ్లు ప్రశాంతంగా, మనసు విప్పి మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాకు మేం ఎప్పుడు వచ్చినా మాకు మంచి మద్దతు లభిస్తుంది. బాగా ఆడితే ఆసీస్ స్థానికులు కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. మూడో టెస్టులోనూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం’ అని కోహ్లి, రోహిత్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో భారతీయ వంటకాలైన భేల్ పూరి, ఆలూ చాట్, పావ్‌భాజీ, కుల్ఫీవంటివి అమ్మకానికి ఉంచారు. ఈ కార్యక్రమం అనంతరం ఎంసీజీ నెట్స్‌లో టీమిండియా ప్రాక్టీస్‌ను కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తిలకించారు. -
ధోని వచ్చేస్తున్నాడు!
తొలి టెస్టు బరిలో కెప్టెన్ కోహ్లికి చేజారిన నాయకత్వ అవకాశం హ్యూస్ అంత్యక్రియలకు ముగ్గురు భారత ఆటగాళ్లు అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. ఈ నెల 9నుంచి ఈ మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. చేతి గాయం కారణంగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లని ధోని, ఇప్పుడు నేరుగా అడిలైడ్ చేరుకోనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ మీడియా మేనేజర్ ఆర్.ఎన్. బాబా ధ్రువీకరించారు. తొలి టెస్టు ఆరంభానికి చాలా ముందుగానే ధోని జట్టుతో కలుస్తాడని ఆయన వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల 4నుంచి తొలి టెస్టు జరిగితే ధోని ఆడే అవకాశం లేకపోయేది. అయితే హ్యూస్ మరణంతో షెడ్యూల్లో మార్పు జరిగింది. దాంతో గాయంనుంచి కోలుకునేందుకు ధోనికి తగిన సమయం లభించింది. గురువారంనుంచి జరగాల్సిన భారత్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌కు మాత్రం మహి అందుబాటులో ఉండడు. అయితే తగినంత విరామం లభించినా... ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలి టెస్టు ఆడతాడా, లేదా అనేదానిపై మాత్రం ఇంకా సందిగ్ధం వీడలేదు. నమన్ ఓజా వెనక్కి! భారత టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు విరాట్ కోహ్లి మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పేట్లు లేదు. అడిలైడ్ టెస్టుకు ధోని సిద్ధం కావడంతో కోహ్లికి నాయకత్వం అవకాశం పోయింది. మరో వైపు ధోని గైర్హాజరీలో ఒక టెస్టు కోసం రిజర్వ్ కీపర్‌గా వెళ్లిన నమన్ ఓజాకు కూడా నిరాశే ఎదురు కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో సాహా రూపంలో రిజర్వ్ కీపర్ ఉండటంతో ధోని రాకతో ఓజా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంది. మరో వైపు మాక్స్‌విలేలో బుధవారం జరిగే హ్యూస్ అంత్యక్రియలకు భారత జట్టు తరఫున కోహ్లి హాజరు కానున్నాడు. మరో ఇద్దరు క్రికెటర్లు రోహిత్ శర్మ, మురళీ విజయ్‌లతో పాటు ఫ్లెచర్, రవిశాస్త్రి, మేనేజర్ అయూబ్ కూడా వెళుతున్నారు. వీరంతా అంత్యక్రియల్లో పాల్గొని ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పడం తొందరపాటు: సీఏ తొలి టెస్టు కోసం తమ ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉన్నారా? లేదా? అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని సీఏ వెల్లడించింది. ‘సమయం వచ్చినప్పుడు జట్టులోని ప్రతి సభ్యుడు ఆడాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం ఏ ఆటగాడూ ఆడేందుకు సుముఖంగా లేడు. క్రికెటర్లపై ఒత్తిడి తేవొద్దని వైద్య బృందం సలహా ఇచ్చింది. దీన్ని మేం పూర్తిగా అర్థం చేసుకున్నాం. అభిమానులు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. టెస్టు క్రికెట్ అనేది చాలా పెద్దది. రెండు గంటల్లో ముగిసేది కాదు’ అని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌ను బట్టి తుది జట్టును ఎంపిక చేయడం ఆనవాయితీ అని చెప్పిన సదర్లాండ్ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత టెస్టు గురించి ఆలోచిస్తామన్నారు. మరోవైపు తొలి టెస్టులో తాను ఆడటంపై కచ్చితంగా హామీ ఇవ్వలేనని రేయాన్ హారిస్ తెలిపాడు. తొలి రెండు వన్డేల షెడ్యూల్ మార్పు భారత జట్టుకు తగినంత విశ్రాంతినివ్వడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ముక్కోణపు వన్డే సిరీస్ షెడ్యూల్లో కూడా స్వల్ప మార్పు చేసింది. సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ ఆడాల్సిన అవసరం లేకుండా దీనిని మార్చింది. పాత షెడ్యూల్ ప్రకారం జనవరి 16న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ ఇప్పుడు జనవరి 18కి మారింది. జనవరి 18న జరగాల్సిన ఆసీస్, ఇంగ్లండ్ మ్యాచ్‌ను రెండు రోజుల ముందుగానే సిరీస్‌లో తొలి వన్డేగా నిర్వహిస్తారు. -
ఆసీస్‌తో తొలిటెస్టుకు ధోనీ దూరం
ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ధోనీ కుడి బొటనవేలికి గాయం కావడంతో అతనికి విశ్రాంతినిచ్చారు. మహీ స్థానంలో కీపార్ నమన్ ఓజాకు అవకాశం దక్కింది. రెండో టెస్టుకు ధోనీ అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత్ జట్టు ఆ దేశానికి బయల్దేరింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని 18 మంది సభ్యులతో కూడిన జట్టు వెళ్లింది. భారత్, ఆసీస్‌ల మధ్య వచ్చే నెల 4 నుంచి బ్రిస్బేన్‌లో తొలి టెస్టు జరగనుంది.