ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు వెలకట్టలేనిదని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) వైఎస్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అన్నారు. తనకు, ధోనీకి చెన్నై ఫ్యాన్స్ పెట్టిన ముద్దుపేర్లను జీవితాంతం మర్చిపోలేమన్నారు. కాగా, రైనా, ధోనీ గత 12 ఏళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి తమిళనాడు వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. వారంత ధోనీని తాల, రైనాను చిన్న తాలగా పిలుచుకుంటారు(తాల అంటే పెద్దన్న అని అర్థం). ఈ ముద్దు పేర్లపై సురేష్ రైనా స్పందిస్తూ .. ధోనీని, తనను తాల, చిన్న తాల అని పిలిచినప్పుడు చాలా సంతోషం కలుగుతుందని చెప్పారు. 1975లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘షోలే’లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పోషించిన పాత్రలు జై, వీరూ మాదిరి ధోనీ, తాను కూడా మంచి స్నేహితుల్లా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుందన్నారు. (చదవండి : డ్రీమ్' ధనాధన్)
‘వారి పిలుపులో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. మేము తొలుత దక్షిణాది వైపు వెళ్లినప్పుడు మాపై చాలా బాధ్యత ఉండేది. మా ఆటతో వారిని మెప్పిస్తామో లేదో అని భయపడ్డాం. కానీ దక్షిణాది ప్రజలు మా ఆటను ఆస్వాదించారు. దానికి కారణం మా ఫ్యాన్సే. వాళ్లు మాకు చాలా మద్దతుగా నిలిచారు. చాలా స్వేచ్ఛను ఇచ్చారు. వారి ప్రేమ, మద్దతుతోనే ఐపీఎల్‌లో రానించగలిగాం. ధోనీని, నన్ను తాల, చిన్న తాల అని చెన్నై ఫ్యాన్స్ పిలిస్తే.. షోలే సినిమాలో జై, వీరులాంటి వాళ్లమనే ఫీలింగ్ కలిగేది. వారిచ్చిన ముద్దు పేరు, చూపించిన ప్రేమ, మద్దతును జీవితాంతం మర్చిపోలేను’అని రైనా చెప్పుకొచ్చారు. కాగా, ఈ నెల 15న ధోనీ, రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో మాత్రం వీరిద్దరు కొనసాగనున్నారు.
(చదవండి : ధోని కెప్టెన్ అవుతాడని అప్పుడే ఊహించా)
Comments
Please login to add a commentAdd a comment