Indian Premier League (IPL)
-
IPL 2024 MI Vs DC: ముంబై అదిరే బోణీ...
ముంబై: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి బంతిదాకా బ్యాటర్లంతా దంచేయడంతో ముంబై 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం ఢిల్లీ బౌలర్లను చేష్టలుడిగేలా చేసింది. అక్షర్ పటేల్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగలిగింది. పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్ కొయెట్జీ 4 వికెట్లు తీశాడు. మూడు దశల్లో ముంబై వీర విహారం ఓపెనర్లు రోహిత్, ఇషాన్ తొలిదశకు అద్భుతంగా శ్రీకారం చుట్టారు. ఇద్దరు అడ్డుఅదుపులేని బాదుడుతో 4.1 ఓవర్లో ముంబై స్కోరు 50కి చేరింది. ఇంకో మూడు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 దాటింది. అక్కడే రోహిత్ అవుట్‌కాగా స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (0), ఇషాన్ కిషన్‌లు కూడా అవుటయ్యారు. తిలక్‌వర్మ (6) అవుటయ్యాక రెండో దశను హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ ధాటిగా నడిపించారు. 16వ ఓవర్లో 150 దాటింది. డేవిడ్ సిక్స్‌లతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లలో 200 (19వ ఓవర్లో) మైలురాయిని చేరుకుంది. ఆఖరి దశ మాత్రం షెఫర్డ్ అరివీర బాదుడుతో స్టేడియం ఊగిపోయింది. నోర్జే వేసిన 20వ ఓవర్ అసాంతం ఆడుకున్న షెఫర్డ్ 4, 6, 6, 6, 4, 6లతో ఏకంగా 32 పరుగులు పిండేశాడు. ఏ ఒక్కరు కనీసం ఫిఫ్టీ అయినా బాదకుండా టి20 క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డు నమోదు చేసింది. పృద్విషా, స్టబ్స్ మెరుపులు మ్యాచ్‌లో ఓడింది కానీ... ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరిదాకా పోరాడింది. వార్నర్ (10)తో ఆరంభం కుదరకపోయినా పృథ్వీ షా చక్కని షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అభిõÙక్ పోరెల్ (31 బంతుల్లో 41; 5 ఫోర్లు)తో రెండో వికెట్‌కు చకచకా 88 పరుగులు జోడించాక 12వ ఓవర్లో బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌కు పృథ్వీ షా నిష్క్రమించాడు. తర్వాత స్టబ్స్ భారీ సిక్సర్ల విధ్వంసంతో ముంబై ఇండియన్స్ బౌలర్లను వణికించాడు. కానీ అవతలి వైపు నిలిచే బ్యాటరే కరువవడంతో ఛేజింగ్‌లో వెనుకబడింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) అక్షర్ 49; కిషన్ (సి అండ్ బి) అక్షర్ 42; సూర్యకుమార్ (సి) సబ్–ఫ్రేజర్ (బి) నోర్జే 0; హార్దిక్ (సి) సబ్–ఫ్రేజర్ (బి) నోర్జే 39; తిలక్ వర్మ (సి) పటేల్ (బి) ఖలీల్ 6; టిమ్ డేవిడ్ (నాటౌట్) 45; షెఫర్డ్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–80, 2–81, 3–111, 4–121, 5–181. బౌలింగ్: ఖలీల్ 4–0–39–1, ఇషాంత్ 3–0– 40–0, రిచర్డ్సన్ 4–0–40–0, అక్షర్ 4–0– 35–2, లలిత్ 1–0–15–0, నోర్జే 4–0– 65–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) బుమ్రా 66; వార్నర్ (సి) పాండ్యా (బి) షెఫర్డ్ 10; పోరెల్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 41; స్టబ్స్ (నాటౌట్) 71; రిషభ్ పంత్ (సి) హార్దిక్ (బి) కొయెట్జీ 1; అక్షర్ పటేల్ (రనౌట్) 8; లలిత్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 2; కుశాగ్ర (సి) తిలక్ వర్మ (బి) కొయెట్జీ 0; రిచర్డ్సన్ (సి) రోహిత్ (బి) కొయెట్జీ 2; ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–22, 2–110, 3–144, 4–153, 5–194, 6–203, 7–203, 8– 205. బౌలింగ్: కొయెట్జీ 4–0–34–4, బుమ్రా 4–0–22–2, ఆకాశ్ మధ్వాల్ 4–0–45–0, రొమారియో షెఫర్డ్ 4–0–54–1, నబీ 2–0– 17–0, పీయూశ్ చావ్లా 2–0– 32–0. ఐపీఎల్లో నేడు చెన్నై X కోల్‌కతా వేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: మే 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మే 26న ఐపీఎల్ ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యమిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 2012 తర్వాత చెన్నైలో మళ్లీ ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండటం విశేషం. మే 19వ తేదీతో లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తవుతాయి. అనంతరం మే 21న క్వాలిఫయర్–1 మ్యాచ్‌కు... మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మే 24న చెన్నైలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కాకముందు ఫిబ్రవరిలో బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్‌లతో కూడిన తొలి దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది. -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రచిన్ 10 మ్యాచ్‌లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్‌గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్‌గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్‌తో కొయెట్జీ గత వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్‌గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్‌రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్‌కు ఆల్‌రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్‌కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్‌ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్‌కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్‌ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
ఐపీఎల్ వేలం కాసేపట్లో.. అందలం ఎక్కేదెవరు?
విశ్వవ్యాప్త క్రికెట్ అభిమానాన్ని యేటికేడు పెంచుకుంటున్న ఐపీఎల్లో ఆటకు ముందు వేలం పాట జరగబోతోంది. దుబాయ్‌లో నేడు నిర్వహించే మినీ వేలానికి 333 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 మంది కాగా... ఇటీవల ప్రపంచకప్‌తో పాటు పరిమిత ఓవర్ల ఆటలో మెరిపిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలన్నీ సై అంటున్నాయి. దుబాయ్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు నేడు దుబాయ్‌లో ఆటగాళ్ల మినీ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగనుంది. ఒక రోజు ముందు సోమవారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాక్ వేలం కూడా నిర్వహించారు. ఇక కోట్ల పందేరం, ఆటగాళ్లకు అందలం పలికేందుకు ఒకటోసారి, రెండోసారి అని సుత్తి బద్దలు కొట్టే ప్రక్రియే తరువాయి. 1,166 మంది నమోదు చేసుకుంటే... ఈ మినీ వేలం కోసం ఐసీసీ సభ్య, అనుబంధ దేశాలు, దేశవాళ్లీ ఆటగాళ్లు ఆసక్తి చూపారు. ఏకంగా 1,166 మంది ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకుంటే... ఫ్రాంచైజీ జట్లతో సంప్రదింపుల అనంతరం లీగ్ పాలకమండలి 333 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది మాత్రం 77 మంది ఆటగాళ్లు. ఇందులో 30 ఖాళీలను విదేశీ ఆటగాళ్లతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంది. అత్యధికంగా 12 ఖాళీలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు సహా 12 మందిని కొనేందుకు కోల్‌కతా వద్ద రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. హాట్ కేక్... రచిన్? భారత్‌లో ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో డాషింగ్ బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర అందరికంటా పడ్డాడు. ఆరంభంలో ఎదురుదాడికి దిగి న్యూజిలాండ్ విజయాలకు గట్టి పునాది వేసిన రచిన్ ఈ మినీ వేలంలో హాట్‌కేక్ కానున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో ఫ్రాంచైజీల్ని ఆకర్షిస్తున్నాడు. ఆసీస్ స్పీడ్‌స్టర్స్ స్టార్క్, కమిన్స్, బ్యాటర్ ట్రావి హెడ్, దక్షిణాఫ్రికా సంచలనం కొయెట్జీ, హసరంగ (శ్రీలంక) తదితర స్టార్ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎగబడే అవకాశాలు న్నాయి. భారత్ నుంచి శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ల సెట్ నుంచి షారుఖ్ ఖాన్‌లపై రూ.కోట్లు కురిసే అవకాశముంది. వేలం కోసం ప్లేయర్ల ప్రత్యేకతను బట్టి 19 సెట్లుగా విభజించారు. అంటే బ్యాటర్, ఆల్‌రౌండర్, పేసర్, స్పిన్నర్, వికెట్ కీపర్, క్యాప్డ్, అన్క్యాప్డ్ ఇలా సెట్ల వారీగా వేలం ప్రక్రియ జరుగుతుంది. -
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024..?
సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న కథనాల ప్రకారం ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ సీజన్ మే చివరి నాటి పూర్తవుతుందని సమాచారం. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాతే తదనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలవుతుందని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే హడావుడి మొదలైంది. 2024 సీజన్ వేలం రేపు (డిసెంబర్ 19) జరుగనుండటంతో అన్ని ఫ్రాంచైజీలు సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్నాయి. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు వేలం జరుగనుంది. ఈ వేలం భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది. వేలం ప్రక్రియ మొత్తం స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియో సినిమాలో (డిజిటల్) ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ వేలంలో 77 స్లాట్ల కోసం 333 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేర్వేరు బేస్ ప్రైజ్ విభాగాల్లో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో మిచెల్ స్టార్క్, గెరాల్డ్ కొయెట్జీ, పాట్ కమిన్స్, హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, రచిన్ రవీంద్రలపై అందరీ దృష్టి ఉంది. ఈ ఆటగాళ్లు వేలంలో గత రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఆయా జట్ల పరిస్థితి ఇది..!
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నెహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ , పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (13 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (84.75 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (17.75 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (68.6 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (31.4 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (38.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-15 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (9), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్ , అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, దేవదత్ పడిక్కల్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేష్ ఖాన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్ హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ కుమార్ వైశాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జితేష్ శర్, సికందర్ రజా, రిషి ధవన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్ ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2) కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. సామ్ కర్రన్- 18.5 కోట్లు (2023, పంజాబ్ కింగ్స్) కెమారూన్ గ్రీన్- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్) బెన్ స్టోక్స్- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్ కింగ్స్) క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (2021,రాజస్తాన్ రాయల్స్) నికోలస్ పూరన్- 16 కోట్లు (2023, లక్నో సూపర్ జెయింట్స్) యువరాజ్ సింగ్-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్ డెవిల్స్) పాట్ కమిన్స్-15.5 కోట్లు (2020, కేకేఆర్) ఇషాన్ కిషన్-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్) కైల్ జేమీసన్-15 కోట్లు (2021, ఆర్సీబీ) బెన్ స్టోక్స్-14.5 కోట్లు (2017, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు.. 2023: సామ్ కర్రన్- 18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్) 2022: ఇషాన్ కిషన్-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్) 2021: క్రిస్ మోరిస్- 16.25 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2020: పాట్ కమిన్స్-15.5 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్) 2019: జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP) 2018: బెన్ స్టోక్స్- 12.5 కోట్లు (రాజస్తాన్ రాయల్స్) 2017: బెన్ స్టోక్స్-14.5 కోట్లు (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) 2016: షేన్ వాట్సన్- 9.5 కోట్లు (ఆర్సీబీ) 2015: యువరాజ్ సింగ్-16 కోట్లు (ఢిల్లీ డేర్ డెవిల్స్) 2014: యువరాజ్ సింగ్- 14 కోట్లు (ఆర్సీబీ) 2013: గ్లెన్ మ్యాక్స్‌వెల్- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్) 2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్కే) 2011: గౌతమ్ గంభీర్- 14.9 కోట్లు (కేకేఆర్) 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్- 4.8 కోట్లు (కేకేఆర్, ముంబై) 2009: కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్కే) 2008: ఎంఎస్ ధోని- 9.5 కోట్లు (సీఎస్కే) ఐపీఎల్లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లికి ఆర్సీబీ యాజమాన్యం 2023 సీజన్ కోసం 17 కోట్లు ముట్టజెప్పింది. కోహ్లి తర్వాత అత్యధిక మొత్తం అందుకున్న భారత ఆటగాళ్లుగా రోహిత్ శర్మ (2023 సీజన్లో 16 కోట్లు), రవీంద్ర జడేజా (2023లో 16 కోట్లు, రిషబ్ పంత్ (2023లో 16 కోట్లు, యువరాజ్ సింగ్ (2015లో 16 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాత ఇషాన్ కిషన్ (2022లో 15.25 కోట్లు), యువరాజ్ సింగ్ (2014లో 14 కోట్లు), దినేశ్ కార్తీక్ (2014లో 12.5 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (2022లో 12.25 కోట్లు) అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్.. ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
16 సీజన్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను (ఐపీఎల్) విజయవంతంగా నిర్వహించిన అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరో కొత్త లీగ్‌ను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లీగ్‌ను కూడా ఐపీఎల్ తరహాలోనే భారీ ప్రణాళికతో రూపొందించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లీగ్‌ను టీ20 ఫార్మాట్లో కాకుండా టీ10 ఫార్మాట్లో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. ఇందుకు సెప్టెంబర్-అక్టోబర్ మాసాలను పరిశీలిస్తున్నట్లు వినికిడి. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ రెండు నెలల్లో పెద్ద టోర్నీలేవీ లేకపోవడంతో సెప్టెంబర్-అక్టోబర్ మాసాలయితే కొత్త లీగ్ నిర్వహణకు అనువుగా ఉంటాయని బీసీసీఐ పెద్దల చర్చించినట్లు తెలుస్తుంది. కొత్త టీ10 లీగ్ ఆలోచన ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ స్పాన్సర్‌షిప్‌ల కోసం బడా కంపెనీలు ఎగబడుతున్నట్లు సమాచారం. కొత్త లీగ్ ప్రతిపాదనను బీసీసీఐ కార్యదర్శి జై షా లేవనెత్తగా బీసీసీఐ పెద్దలందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. కాగా, బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో పరుడు పోసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి క్యాష్ రిచ్ లీగ్ నిరంతరాయంగా 16 సీజన్ల పాటు విజయవంతంగా సాగింది. తదుపరి సీజన్ (2024) సన్నాహకాలు కూడా ఇదిరవకే ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఫ్రాంచైజీలు సైతం ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి. -
ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం.. తుది జట్లు ఇవే..!
2024 సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించిన వేలం జోహన్నెస్‌బర్గ్‌లో నిన్న ముగిసింది. ఈ లీగ్ రెండో ఎడిషన్‌లో పాల్గొనబోయే ఆరు జట్లు తమతమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. పర్స్ వ్యాల్యూ మేరకు అన్ని ఫ్రాంచైజీలు పటిష్టమైన జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ దయ్యన్ గలీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ అతన్ని 1.60 మిలియన్లకు దక్కించుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను వైల్డ్‌కార్డ్ పిక్‌గా ఎంపిక చేసుకోగా.. పార్ల్ రాయల్స్ లోర్కన్ టక్కర్‌ను బేస్ ధరకు వైల్డ్ కార్డ్ పిక్‌గా ఎంపిక చేసుకుంది. ఆయా జట్ల కెప్టెన్ల విషయానికొస్తే.. పార్ల్ రాయల్స్‌కు (రాజస్తాన్ రాయల్స్) జోస్ బట్లర్, డర్బన్ సూపర్ జెయింట్స్‌కు (లక్నో సూపర్ జెయింట్స్) కేశవ్ మహారాజ్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు (ఢిల్లీ క్యాపిటల్స్) వేన్ పార్నెల్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు (ముంబై ఇండియన్స్) రషీద ఖాన్, జోబర్గ్ సూపర్‌కింగ్స్‌కు (చెన్నై సూపర్ కింగ్స్) ఫాఫ్ డుప్లెసిస్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌కు (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహించనున్నారు. సౌతాఫ్రికన్ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2023) సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఖంగుతినిపించి ఛాంపియన్‌గా అవతరించింది. 2024 సీజన్ జనవరి 10న మొదలై ఫిబ్రవరి 10న ముగుస్తుంది. పూర్తి జట్ల వివరాలు.. ప్రిటోరియా క్యాపిటల్స్: పాల్ స్టెర్లింగ్, కైల్ వెర్రెన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, థీనిస్ డి బ్రుయిన్, విల్ జాక్స్, షేన్ డాడ్స్వెల్, డారిన్ డుపావిల్లోన్, మిగేల్ ప్రిటోరియస్, అన్రిచ్ నోర్ట్జే, ఆదిల్ రషీద్, ఈథన్ బాష్, కార్బిన్ బాష్, మాథ్యూ బోస్ట్, జిమ్మీ నీషమ్, సెనురన్ ముత్తసామి, వేన్ పార్నెల్ (కెప్టెన్), స్టీవ్ స్టోక్ పార్ల్ రాయల్స్: లోర్కన్ టక్కర్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేన్ విలాస్, మిచెల్ వాన్ బ్యూరెన్, లువాన్ డ్రే ప్రిటోరియస్, జాన్ టర్నర్, క్వేనా మఫాకా, ఒబెద్ మెక్కాయ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, కోడి యూసుఫ్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, విహాన్ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇవాన్ జోన్స్, ఫాబియన్ అలెన్ ఎంఐ కేప్ టౌన్: క్రిస్ బెంజమిన్, డెవాల్డ్ బ్రెవిస్, టామ్ బాంటన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, గ్రాంట్ రోలోఫ్సెన్, కానర్ ఎస్టర్‌హుజెన్, నీలన్ వాన్ హీర్డెన్, థామస్ కబెర్, కగిసో రబడ, రషీద్ ఖాన్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, ఒల్లీ స్టోన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డెలానో పాట్గెటర్, జార్జ్ లిండే, డువాన్ జన్సెన్ జోబర్గ్ సూపర్ కింగ్స్: వేన్ మాడ్సెన్, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), ల్యూస్ డు ప్లూయ్, రీజా హెండ్రిక్స్, డోనోవన్ ఫెర్రీరా, సిబోనెలో మఖాన్యా, రోనన్ హెర్మన్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, జహీర్ ఖాన్, సామ్ కుక్, లిజాడ్ విలియమ్స్, నాండ్రే బర్గ్డర్, ఆరోన్ ఫాంగిసొ, కైల్ సిమ్మండ్స్, దయ్యన్ గలీమ్, మొయిన్ అలీ, డేవిడ్ వీస్ డర్బన్ సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, భానుక రాజపక్స, హెన్రిచ్ క్లాసెన్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నవీన్ ఉల్ హక్, రీస్ టాప్లీ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), కైల్ అబాట్, జూనియర్ డాలా, జాసన్ స్మిత్, కైల్ మేయర్స్, డ్వేన్ ప్రిటోరియస్, కీమో పాల్, వియాన్ ముల్దర్, జోన్ జోన్ స్మట్స్, బ్రైస్ పార్సన్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా, జోర్డాన్ హెర్మాన్, ఆడమ్ రోసింగ్టన్, సరెల్ ఎర్వీ, కాలేబ్ సెలెకా, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, సిసంద మగాలా, బ్రైడన్ కార్స్, సైమన్ హెర్మెర్, క్రెయిగ్ ఒవర్టన్, బేయర్స్ స్వేన్పోల్, మార్కో జన్సెన్, అయా క్వామేన్, టామ్ అబెల్, ఆండిల్ సిమెలన్ -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్‌కు ముందు ఈ మూడు లీగ్‌ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్‌రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్రూక్‌ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్‌ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్‌గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్‌తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున 11 మ్యాచ్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ బరిలోకి అంబటి రాయుడు.. రేపే ముహూర్తం
టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి తిరుపతి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అధికారికంగా జాయిన్ అయ్యాడు. రేపు (ఆగస్ట్ 19) ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున సీపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్‌కు ప్రత్యామ్నాయంగా రాయుడు రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. దీంతో ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. Awesome to be back on the park.. excited to be a part of the @sknpatriots and the @CPL.. pic.twitter.com/dsHC4xtsi8 — ATR (@RayuduAmbati) August 17, 2023 సీపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌కు ముందు రాయుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ మెసేజ్ షేర్ చేశాడు. మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగడం అద్భుతంగా ఉంది.. కరీబియన్ లీగ్‌లో, ముఖ్యంగా సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందంటూ పేట్రియాట్స్ జెర్సీలోని తన ఫోటోను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, 2023 సీజన్ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే, ఏదో బలమైన కారణం చేత రాయుడు ఆ లీగ్‌లో ఆడలేకపోయాడు. మరోవైపు రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. -
IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్‌స్టార్.. అందుకే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో భాగమైన ఫ్రాంఛైజీలలో అత్యధికం బడా సంస్థలకు చెందినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఐపీఎల్లో సక్సెస్ అయితే ఎంతటి క్రేజ్ వస్తుందో.. ఏమాత్రం తేడా జరిగినా అదే స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది! ఐపీఎల్ రెండో సీజన్(2009)లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ ఆ తర్వాత కనుమరుగైన తీరే ఇందుకు నిదర్శనం. అయితే, అదే ఏడాది.. ఢిల్లీ క్యాపిటల్స్ తాము కూడా చార్జర్స్ మాదిరే చేతులు కాల్చుకోకుండా తీసుకున్న కీలక నిర్ణయం గురించి, దానితో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు ఉన్న సంబంధం గురించి బీసీసీఐ మాజీ జీఎం అమృత్ మాథూర్ సంచలన విషయాలు తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్‌తో అనుబంధం ఐపీఎల్‌కు ప్రాచుర్యం కల్పించే క్రమంలో బాలీవుడ్‌ను కూడా ఇందులో మమేకం చేసిన విషయం తెలిసిందే. బీ-టౌన్ బాద్షా షారుక్ ఖాన్, అలనాటి హీరోయిన్ జూహీ చావ్లా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యజమానులు కాగా.. శిల్పా శెట్టి కుంద్రా రాజస్తాన్ రాయల్స్‌కు, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంఛైజీ ఓనర్లుగానే గాకుండా ప్రమోషన్లలో భాగమైన, భాగమవుతున్న స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో 2009లో ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్) సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అక్కీతో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోగా ఆర్థికపరంగా నష్టాలూ చవిచూసింది. అనవసర ఖర్చులు ఎందుకు? అనవసర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అతడితో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు చట్టపరంగా చిక్కులు ఎదరవుతాయని భావించినా.. అక్షయ్ కుమార్ పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి ఫ్రాంఛైజీ తేలికగా బయటపడేలా చేశాడు. ‘‘ప్రమోషనల్ ఫిల్మ్స్, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ల కోసం అక్షయ్ కుమార్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కోట్లా మైదానంలో విన్యాసాలు మినహా క్యాపిటల్స్‌కు అతడి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికి అతడి సేవలు వినియోగించడంలో యాజమాన్యం విఫలమైంది. నష్టాలు వెంటాడాయి. దీంతో అర్ధంతరంగా అక్కీతో డీల్ ముగించాలని భావించింది. న్యాయపరంగా చిక్కులు.. అయితే న్యాయపరంగా అందుకు అనేక అడ్డంకులు ఉండటంతో అక్షయ్ కుమార్ దయపైనే అంతా ఆధారపడి ఉన్న సందర్భం. అక్కీ లాయర్లతో విషయం గురించి చెప్పాం. ఆ తర్వాత ఓరోజు సినిమా షూటింగ్లో ఉన్నపుడు.. షాట్ ముగిసిన తర్వాత అక్షయ్ వానిటీ వ్యాన్‌లోకి నేను వెళ్లాను. మరేం పర్లేదన్న అక్షయ్ కుమార్ సంశయిస్తూనే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి.. డీల్ రద్దు చేసుకోవాలనుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి వివరించాను. కానీ అక్షయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు. మరేం ప్రాబ్లం లేదండి! ఒకవేళ ఇదంతా వర్కౌట్ కాదనుకుంటే.. వెంటనే రద్దు చేసేయండి. పర్లేదు అన్నాడు. నేను విన్నది నిజమేనా నేను విన్నది నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాతుండగా.. ‘‘మీరేం ఇబ్బంది పడకండి. ఎలాంటి సమస్య రాకుండా దీనిని ఎలా ముగించాలో మా లాయర్లతో నేను మాట్లాడతా అని మళ్లీ అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు’’ అని అమృత్ మాథుర్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఆత్మకథలో నాటి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్‌గా నిలవలేదన్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ దారుణ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. అతడు నటించిన ఓ మై గాడ్ 2 సినియా ఇటీవలే విడుదలైంది. చదవండి: APL 2023: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో ఆ అదృష్టం మీదైతే! -
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం..
-
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్
-
'డబ్బు, అహంకారంతో'.. భారత ఆటగాళ్లపై కపిల్ దేవ్ ఆగ్రహం
ప్రస్తుతమున్న క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలే కారణమని తెలిపాడు. మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ''అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగటివిటీని పట్టించుకోరు.ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు'' అంటూ తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు కాసులు కురిపించే ఐపీఎల్లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ఆటగాళ్లు బతికేస్తున్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: #SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్‌ను తొలగించండి' ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
ఐపీఎల్ బ్యాన్ చేయాలి.. కోర్టులో దాఖలైన పిటిషన్
సాక్షి, చైన్నె: ఐపీఎల్ మ్యాచ్‌లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ విషయంపై బీసీసీఐను ఆశ్రయించాలని పిటిషనర్, ఐపీఎస్ అధికారికి హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ సూచించింది. వివరాలు.. ఐపీఎల్ మ్యాచ్‌ల క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు తండో పతండాలుగా అభిమానులు తరలిరావడం జరుగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లు అన్ని ఫిక్సింగ్, బెట్టింగ్‌లతో జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ బెట్టింగ్‌లు, ఫిక్సింగ్‌లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సంపత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఐపీఎల్ మ్యాచ్‌లను బెట్టింగ్, ఫిక్సింగ్ పూర్తిగా కట్టడి అయ్యే వరకు నిర్వహించకూడదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు సీజే గంగా పుర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనల అనంతం ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. బెట్టింగ్, ఫిక్సింగ్ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి సీమా, అంజూ.. ఇప్పుడు జూలీ.. సరిహద్దులు దాటిన ప్రేమలో బిగ్ ట్విస్ట్.. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్‌లోని (జిమ్-ఆఫ్రో టీ10 లీగ్) హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన సంజూ బాబా.. తాజాగా లంక ప్రీమియర్ లీగ్‌లోని (శ్రీలంక టీ20 లీగ్) బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. I, along with my brothers Omar Khan (OK) and H.H. Sheikh Marwan Bin Mohammed Bin Rashid Al Maktoum, are excited to announce that we have acquired the B-Love Kandy Cricket Team for the Lanka Premier League T20 2023. pic.twitter.com/ksMauYsHbH — Sanjay Dutt (@duttsanjay) June 25, 2023 తనతో పాటు ఒమర్ ఖాన్, షేక్ మర్వాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కలిసి బి-లవ్ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ బాబా ప్రకటించాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ బరిలో బి-లవ్ క్యాండీ బరిలో నిలువనున్నట్లు తెలిపాడు. కాగా, లంక ప్రీమియర్ లీగ్ 2023 జులై 30 నుంచి ఆగస్ట్ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20 నుంచి 29 వరకు జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్) పాల్గొంటాయి. ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్‌తో కలిసి సంజూ ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. -
IPL 2023 CSK Vs GT : ‘ఫైనల్’కు ముందెవరు?
చెన్నై: ఐపీఎల్లో రెండు దీటైన జట్ల మధ్య ఢీ అంటే ఢీ అనే మ్యాచ్‌కు నేడు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. చెన్నై వేదికగా మ్యాచ్ జరగడం ధోని సేనకు అనుకూలత అయినప్పటికీ... ఈ జట్టుపై ఓటమి ఎరుగని గుజరాత్ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీల మధ్య ఆసక్తికర సమరం గ్యారంటీ! దీంతో ప్రేక్షకులకు టి20 మెరుపులు, ఆఖరి ఓవర్ డ్రామాకు కొదవుండదు. ఇక చెన్నైలో గెలిచినా... ఓడినా... చివరి మజిలీ మాత్రం అహ్మదాబాదే! నెగ్గితే నేరుగా ఒక జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది. ఈ రెండూ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగనున్నాయి. చెన్నై చెలరేగితే... బరిలోకి దిగే రెండు జట్లు బలమైన ప్రత్యర్థులు. చెన్నై ఐపీఎల్ ఆరంభం నుంచే లీగ్ ఫేవరేట్లలో ఒకటిగా ఎదిగింది. ధోని నాయకత్వంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎన్నోసార్లు నిరూపించుకుంది. ఈ సీజన్లోనూ సూపర్‌కింగ్స్ ఆట మేటిగానే ఉంది. టాపార్డర్ లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే ధనాధన్ షోకు శ్రీకారం చుడితే ప్రత్యర్థికి చుక్కలే! వెటరన్ ధోని బ్యాటింగ్‌లో వెనుకబడొచ్చేమో కానీ... జట్టును నడిపించడంలో ఎప్పటికీ క్రికెట్ మేధావే. మిడిలార్డర్లో అంబటి రాయుడు నుంచి ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బహుశా ఈ మ్యాచ్‌లో ఆ వెలతి తీర్చుకుంటాడేమో చూడాలి. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ... ఇక బౌలింగ్ దళంలో దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే పవర్ ప్లేలో పరుగులిస్తున్నప్పటికీ వికెట్లను మాత్రం పడగొట్టేస్తున్నారు. తీక్షణ, పతిరణల వైవిధ్యం కూడా జట్టుకు కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది. టైటాన్స్ ‘టాప్’షో టోర్నీ మొదలైన మ్యాచ్‌లోనే చెన్నైపై గెలిచిన గుజరాత్ టైటాన్స్ లీగ్‌లో ఘనమైన ఆరంభమిచ్చింది. బెంగళూరుతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ టైటాన్స్‌దే ఆధిపత్యం. సొంతగడ్డపై బెంగళూరు భారీస్కోరు చేసినా ఛేదించి మరీ నెగ్గింది. పాయింట్ల పట్టికైనా... ఆటలోనైనా... డిఫెండింగ్ చాంపియన్‌కు లీగ్ దశలో అయితే ఎదురే లేకపోయింది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌ను పాండ్యా సేన సమర్థంగా సరైన దిశలో వినియోగించుకుంటుంది. శుబ్‌మన్ గిల్ లేదంటే విజయ్ శంకర్ల ‘ఇంపాక్ట్’ జట్టుకు అదనపు పరుగుల్ని కట్టబెడుతోంది. జట్టులో వీళ్లిద్దరే కాదు... సాహా నుంచి రషీద్ ఖాన్ దాకా ఇలా ఎనిమిదో వరుస బ్యాటర్ కూడా బాదేయగలడు. షనక, మిల్లర్, రాహుల్ తెవాటియాలు ధాటిగా ఆడగల సమర్థులు. దీంతో పరుగులకు, మెరుపులకు ఏ లోటు లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, షమీ, రషీద్ ఖాన్ కలిసొచ్చే పిచ్‌పై మ్యాచ్‌నే మలుపుతిప్పే బౌలర్లు. ఏ రకంగా చూసుకున్నా ఎవరికీ ఎవరు తీసిపోరు కాబట్టి హేమాహేమీల మధ్య వార్ వన్‌సైడ్ అయితే కానే కాదు! తుది జట్లు (అంచనా) గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, గిల్, విజయ్ శంకర్, షనక, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ/యశ్ దయాళ్. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రుతురాజ్, కాన్వే, దూబే/పతిరణ, జడేజా, రహానే, మొయిన్ , రాయుడు, దీపక్ చహర్, తుషార్, తీక్షణ. పిచ్, వాతావరణం ఎప్పట్లాగే చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశముంది. అయితే రాత్రయ్యేకొద్దీ తేమ కారణంగా బౌలర్లకు కష్టాలు తప్పవు. టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపువచ్చు. వర్ష సూచన లేదు. 3: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా... మూడింటిలోనూ గుజరాత్ జట్టే గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై నిర్దేశించిన లక్ష్యాలను గుజరాత్ ఛేదించింది. అయితే చెన్నై వేదికగా మాత్రం ఈ రెండు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. 43: ఐపీఎల్ టోర్నీలో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం 61 మ్యాచ్‌లు ఆడింది. 43 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 24: ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో చెన్నై మొత్తం 24 మ్యాచ్‌లు ఆడింది. 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. (తొలుత బ్యాటింగ్ చేసినపుడు 7 సార్లు... ఛేజింగ్ లో 8 సార్లు). మిగతా 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. -
నీ వల్లే ద్రవిడ్‌కు ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది! ఆరోజు నేను సిక్స్ కొట్టడంతో..
Mumbai Indians vs Rajasthan Royals 2014: ‘‘అప్పుడు నేను ద్రవిడ్ రియాక్షన్ చూడలేదు. కానీ ఆయన చాలా సీరియస్ అయ్యారని చాలా మంది చెప్పారు. నీ వల్లే రాహుల్ ద్రవిడ్‌కు ఎన్నడూ లేనంత కోపం వచ్చింది. ఆయనను మేము ఎప్పుడూ అలా చూడలేదు’’ అంటూ ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ ఆదిత్య తారే 2014 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ముంబై తరఫున అరంగేట్రం మహారాష్ట్రకు చెందిన ఆదిత్య 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతడు.. అదే జట్టు మీద ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున 2017లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 35 మ్యాచ్‌లు ఆడిన ఆదిత్య 339 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. కీలక పోరులో ఇక ఆదిత్య తారే కెరీర్లో 2014 నాటి.. ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ తప్పక గుర్తుండిపోతుంది. ఆ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్, ముంబై మధ్య కీలక పోరు జరిగింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే, రన్‌రేటు దృష్ట్యా ఈ మ్యాచ్‌లో ముంబై సుమారు 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. లేనిపక్షంలో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరితే.. ముంబై ఇంటిబాట పట్టాల్సి వస్తుంది. ఆదిత్య తారే, ద్రవిడ్ రియాక్షన్ ఆండర్సన్, రాయుడు విజృంభించడంతో ఇలాంటి ఉత్కంఠభరిత స్థితిలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్(12), మైకేల్ హస్సీ(22) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కోరే ఆండర్సర్ తుపాన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో 44 బంతుల్లోనే 95 పరుగులు చేసిన అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు(10 బంతుల్లో 30 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అతడికి సహకరించాడు. ఇక 15వ ఓవర్ మూడో బంతికి.. క్రీజులో ఉన్న ఆదిత్య తారే బౌండరీ కొడితే ముంబై ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. లేదంటే రాజస్తాన్ టాప్-4లో అడుగుపెడుతుంది. నరాలు తెగే ఉత్కంఠ నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఆ బంతికి ఆదిత్య ఏకంగా సిక్సర్ బాదడంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ చేరుకుంది. అప్పటిదాకా ప్లే ఆఫ్ బెర్తు తమదే అని సంతోష పడ్డ రాజస్తాన్‌కు నిరాశ తప్పలేదు. ఇక ఆదిత్య సిక్స్ కొట్టడంతో నాటి.. రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కోపంతో ఊగిపోయాడు. తమ జట్టు ఓడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో ఎన్నడూ లేని విధంగా సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కొత్తగా కనిపించాడు. ఈ విషయం గురించి తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో ఆదిత్య తారే గుర్తు చేసుకున్నాడు. అదే ద్రవిడ్ కోపానికి కారణం ‘‘నేను ఆ బంతిని గాల్లోకి లేపే ముందు తామే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించామని రాజస్తాన్ ఫిక్సైపోయింది. డగౌట్లో ఉన్న వాళ్ల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. అయితే, అప్పుడే మాకో విషయం తెలిసింది. మేము ప్లే ఆఫ్స్ చేరడానికి మాకు ఇంకో బంతి మిగిలే ఉంది. కాబట్టి బౌండరీ బాదాలని నిశ్చయించుకున్నాం. ముందేమో సిక్స్ కొట్టాలని భావించాం. తర్వాత తెలిసిందేంటే బౌండరీ బాదినా చాలని! అయితే, నేను అప్పటికే సిక్సర్ కొట్టాలని బలంగా నిశ్చయించుకున్నా. అదే అమలు చేశా. ఇదే ద్రవిడ్ కోపానికి కారణమైంది’’ అని 35 ఏళ్ల ఆదిత్య తారే చెప్పుకొచ్చాడు. కాగా 2014లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై కథ ముగియగా.. కేకేఆర్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? గావస్కర్..సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? వాళ్లిద్దరు అంతే! -
IPL 2023: రసెల్ ధమాకా...
కోల్‌కతా: ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అడుగంటిన కోల్‌కతా ఆశలకు సిక్సర్లతో జీవం పోశాడు. మళ్లీ ఆఖరి ఓవర్ డ్రామా కనిపించినా... నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ధావన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి గెలిచింది. నితీశ్ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. ధావన్ ఫిఫ్టీతో... కోల్‌కతా పవర్‌ప్లేలోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (12), రాజపక్స (0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరిని హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మిగతా జట్టు సభ్యుల నుంచి సహకారం కరువైనా... శిఖర్ ధావన్ జట్టును నడిపించాడు. లివింగ్‌స్టోన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21; 2 సిక్సర్లు) తక్కువే చేసినా... ధావన్ (41 బంతుల్లో) ఫిఫ్టీతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. జితేశ్, ధావన్ నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. పరుగుల వేగం పెరగాల్సిన దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు పంజాబ్ డీలా పడింది. 106/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించిన జట్టు స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది. స్యామ్ కరన్ (4), రిషి ధావన్ (11 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటిస్థితిలో షారుఖ్ (8 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్‌ప్రీత్ బ్రార్ ( 9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటితో ఆఖరి 16 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ ఇన్నింగ్స్... జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు) బౌండరీలతో కోల్‌కతా ఇన్నింగ్స్ వేగంగా సాగింది. అయితే గుర్బాజ్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వికెట్ పారేసుకోగా... కోల్‌కతా ఇన్నింగ్స్ కూడా కెప్టెన్ నితీశ్ రాణా అర్ధసెంచరీతోనే నడించింది. రాయ్ దూకుడుకు హర్‌ప్రీత్ బ్రేకులేయగా, నితీశ్... వెంకటేశ్ (11)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటింది. మధ్యలో పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగం తగ్గింది. 16వ ఓవర్లో రాణా అవుటయ్యాక ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం ఇరు జట్లకూ అవకాశమిచ్చింది. కానీ స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ 3 భారీ సిక్సర్లతో 20 పరుగులొచ్చాయి. దీంతో 6 బంతుల్లో 6 పరుగుల సమీకరణం కోల్కతావైపే మొగ్గింది. అయితే 2 పరుగుల దూరంలో ఐదో బంతికి రసెల్ రనౌట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా... అర్‡్ష దీప్ వేసిన చివరి బంతిని రింకూ సింగ్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీకి తరలించి గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రాన్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 12; ధావన్ (సి) వైభవ్ (బి) నితీశ్ రాణా 57; రాజపక్స (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 0; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 15; జితేశ్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 21; స్యామ్ కరన్ (సి) గుర్బాజ్ (బి) సుయశ్ 4; రిషి ధావన్ (బి) వరుణ్ 19; షారుఖ్ (నాటౌట్) 21; హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–53, 4–106, 5–119, 6–139, 7–139. బౌలింగ్: వైభవ్ 3–0–32–0, హర్షిత్ 3–0–33–2, రసెల్ 1–0–19–0, వరుణ్ 4–0–26–3, సుయశ్ 4–0–26–1, నరైన్ 4–0–29–0, నితీశ్ రాణా 1–0–7–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) షారుఖ్ (బి) హర్‌ప్రీత్ 38; గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 15; నితీశ్ రాణా (సి) లివింగ్‌స్టోన్ (బి) చహర్ 51; వెంకటేశ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) చహర్ 11; రసెల్ (రనౌట్) 42; రింకూ సింగ్ (నాటౌట్) 21; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–38, 2–64, 3–115, 4–124, 5–178. బౌలింగ్: రిషి ధావన్ 2–0–15–0, అర్‡్షదీప్ సింగ్ 4–0–39–0, ఎలిస్ 4–0–29–1, స్యామ్ కరన్ 3–0–44–0, లివింగ్‌స్టోన్ 2–0–27–0, హర్‌ప్రీత్ 1–0–4–1, రాహుల్ చహర్ 4–0–23–2. -
IPL 2023: తిరుగులేని టైటాన్స్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో గురువారం వరకు జరిగిన 47 మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఏ జట్టూ కూడా 18 ఓవర్లలోపు ఆలౌట్ కాలేదు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు సొంతగడ్డపై నిలవలేకపోయిన రాయల్స్ భారీ ఓటమిని ఎదుర్కొంది. 119 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఏకంగా 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన గుజరాత్... గత మ్యాచ్‌లో తమ వేదికపై రాజస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో లెక్క సరి చేసింది. జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ సామ్సన్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం గుజరాత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (34 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుబ్‌మన్ గిల్ (35 బంతుల్లో 36; 6 ఫోర్లు) గెలిపించారు. సమష్టి వైఫల్యం... పాండ్యా తొలి ఓవర్లోనే బట్లర్ (8) వెనుదిరగ్గా... షమీ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో జోరు ప్రదర్శించిన గత మ్యాచ్ హీరో యశస్వి జైస్వాల్ (14) దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. సామ్సన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌ను అభినవ్ చక్కటి ఫీల్డింగ్‌తో ఆపగా, బంతిని అందుకున్న మోహిత్ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. సింగిల్ కోసం ప్రయత్నించి జైస్వాల్ దూసుకురాగా, సామ్సన్ స్పందించలేదు. ఇద్దరూ ఒకేవైపు ఉండిపోగా, జైస్వాల్ వెనక్కి వెళ్లటంలో విఫలమయ్యాడు. టీమ్‌ను ఆదుకోవాల్సిన సామ్సన్ కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడం రాయల్స్‌ను దెబ్బ తీసింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ పట్టుదల ప్రదర్శించకపోవడంతో జట్టు కోలుకోలేకపోయింది. అలవోకగా... స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అందుకుంది. ఓపెనర్లు సాహా, గిల్ చకచకా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లతో 49 పరుగులకు చేరింది. తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు గిల్‌ను అవుట్ చేసి రాయల్స్ ఈ జోడీని విడదీసింది. జంపా ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 4, 6, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (రనౌట్) 14; బట్లర్ (సి) మోహిత్ (బి) పాండ్యా 8; సామ్సన్ (సి) పాండ్యా (బి) లిటిల్ 30; పడిక్కల్ (బి) నూర్ 12; అశ్విన్ (బి) రషీద్ 2; పరాగ్ (ఎల్బీ) (బి) రషీద్ 4; హెట్‌మైర్ (ఎల్బీ) (బి) రషీద్ 7; జురేల్ (ఎల్బీ) (బి) నూర్ 9; బౌల్ట్ (బి) షమీ 15; జంపా (రనౌట్) 7; సందీప్ శర్మ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 118. వికెట్ల పతనం: 1–11, 2–47, 3–60, 4–63, 5–69, 6–77, 7–87, 8–96, 9–112, 10–118. బౌలింగ్: షమీ 4–0–27–1, పాండ్యా 2–0–22–1, రషీద్ 4–0–14–3, లిటిల్ 4–0–24–1, నూర్ 3–0–25–2, మోహిత్ 0.5–0–5–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (నాటౌట్) 41; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 36; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–71. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–0, సందీప్ శర్మ 3–0–19–0, జంపా 3–0–40–0, చహల్ 3.5–0–22–1, అశ్విన్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు చెన్నైX ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) ఢిల్లీ X బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: కోల్‌కతా ప్రతీకారం
సన్‌రైజర్స్ విజయానికి ఒకదశలో 30 బంతుల్లో 38 పరుగులే కావాలి... చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ మార్క్రమ్ కూడా అప్పుడే జోరు పెంచాడు... సొంత గడ్డపై గెలుపు ఖాయమనిపించింది. కానీ అంతా తలకిందులైంది. ఓటమి దిశగా వెళుతున్న కోల్‌కతా ఒక్కసారిగా పుంజుకుంది. పదునైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చివరి వరకు ఆటను తీసుకొచ్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా 3 పరుగులే వచ్చాయి. దాంతో నైట్‌రైడర్స్ ఊపిరి పీల్చుకోగా, రైజర్స్ నిరాశలో మునిగింది. సాక్షి, హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్‌లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), క్లాసెన్ (20 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించినా ఫలితం దక్కలేదు. కీలక భాగస్వామ్యం... ఒక్కరూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడకపోయినా... కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్‌కతా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. మార్కో జాన్సెన్ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. జేసన్ రాయ్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్రమ్ అద్భుత క్యాచ్‌కు రాణా వెనుదిరగ్గా... ఆండ్రీ రసెల్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్ చివర్లో కూడా కేకేఆర్ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు 42 పరుగులే సాధించింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో రైజర్స్ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (18), అభిషేక్ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (0) వికెట్లను జట్టు కోల్పోయింది. అయితే మార్క్రమ్, క్లాసెన్ భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు పరుగులు రాబట్టారు. తన తొలి ఫోర్ కొట్టేందుకు మార్క్రమ్ 23 బంతులు తీసుకున్నా... అనుకూల్ రాయ్ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వెనుదిరిగాడు. అయితే మార్క్రమ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు రైజర్స్ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో కెప్టెన్ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేయలేకపోయారు. సమద్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) కార్తీక్ త్యాగి 20; గుర్బాజ్ (సి) బ్రూక్ (బి) జాన్సెన్ 0; వెంకటేశ్ అయ్యర్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 7; నితీశ్ రాణా (సి అండ్ బి) మార్క్రమ్ 42; రింకూ సింగ్ (సి) సమద్ (బి) నటరాజన్ 46; రసెల్ (సి) నటరాజన్ (బి) మార్కండే 24; నరైన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) భువనేశ్వర్ 1; శార్దుల్ ఠాకూర్ (సి) సమద్ (బి) నటరాజన్ 8; అనుకూల్ రాయ్ (నాటౌట్) 13; హర్షిత్ (రనౌట్) 0; వైభవ్ అరోరా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–8, 2–16, 3–35, 4–96, 5–127, 6–130, 7–151, 8–168, 9–168. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–0–24–2, కార్తీక్ త్యాగి 2–0–30–1, మార్క్రమ్ 3–0–24–1, నటరాజన్ 4–0–30–2, మార్కండే 4–0–29–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 9; మయాంక్ అగర్వాల్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 18; రాహుల్ త్రిపాఠి (సి) వైభవ్ అరోరా (బి) రసెల్ 20; మార్క్రమ్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ అరోరా 41; హ్యారీ బ్రూక్ (ఎల్బీ) (బి) అనుకూల్ రాయ్ 0; క్లాసెన్ (సి) రసెల్ (బి) శార్దుల్ ఠాకూర్ 36; సమద్ (సి) అనుకూల్ రాయ్ (బి) వరుణ్ చక్రవర్తి 21; జాన్సెన్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 1; భువనేశ్వర్ (నాటౌట్) 5; మార్కండే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–53, 4–54, 5–124, 6–145, 7–152, 8–165. బౌలింగ్: హర్షిత్ 4–0–27–1, వైభవ్ 3–0–32–2, శార్దుల్ 3–0– 23–2, రసెల్ 1–0–15–1, అనుకూల్ రాయ్ 3–0–26–1, నరైన్ 2–0–16–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–1. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ X గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్‌లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్‌సెట్‌ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్‌సెట్‌ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్‌సెట్‌ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్‌ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్‌ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్‌ను మూసివేయండి హెడ్‌సెట్‌ను పెట్టకుని స్ట్రాప్స్‌ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్‌ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
సన్‌రైజర్స్‌కు ఢిల్లీ షాక్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌ను గెలిపించేందుకు హైదరాబాద్ బౌలర్లు శ్రమిస్తే... బ్యాటర్ల అలసత్వం జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. ఓటమి తప్పదనుకున్న పోరులో ఢిల్లీ పోరాటం జట్టును 7 పరుగులతో గెలిపించింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (27 బంతుల్లో 34; 2 ఫోర్లు), అక్షర్ పటేల్ (34 బంతుల్లో 34; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారంతే! వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. మయాంక్ (39 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్, నోర్జే రెండేసి వికెట్లు తీశారు. ఐపీఎల్లో ఢిల్లీ చేతిలో హైదరాబాద్‌కిది వరుసగా ఐదో ఓటమి. ఆదుకున్న ఆ ఇద్దరు... ముందుగా హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిల్లాడారు. జట్టును నడిపించే స్కోరుగానీ, ప్రేక్షకుల్ని అలరించే ఆటగానీ ఇన్నింగ్స్‌లో కరువైంది. సాల్ట్ (0) డకౌట్ కాగా, చకచకా 5 బౌండరీలు బాదిన మార్‡్ష (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఆట ఐదో ఓవర్లోనే ముగిసింది. 8వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఉచ్చులో అనుభవజ్ఞుడైన వార్నర్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ (10), అమన్ హకీమ్ (4) చిక్కారు. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. బ్యాటర్ల నిర్లక్ష్యం... తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆపసోపాలు పడింది. బ్రూక్ (7), తర్వాత త్రిపాఠి (21 బంతుల్లో 15)తో కలిసి వేగంగా ఆడిన మయాంక్ 12వ ఓవర్లో పెవిలియన్ చేరడంతో సీన్ మారిపోయింది. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ పిచ్ అనుకూలతలతో బంతుల్ని సుడులు తిప్పారు. అభిషేక్ శర్మ (5) మార్క్రమ్ (3) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 85 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. చివర్లో క్లాసెన్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), సుందర్ (15 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు)ల బౌండరీలతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ గాడిన పడింది. కానీ క్లాసెన్ వేగానికి నోర్జే బౌలింగ్‌లో చుక్కెదురవడంతో ఓటమి తప్పలేదు. హైదరాబాద్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా ‘ఇంపాక్ట్’ బౌలర్ ముకేశ్ కేవలం 5 పరుగులే ఇచ్చాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) బ్రూక్ (బి) సుందర్ 21; సాల్ట్ (సి) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 0; మార్‡్ష (ఎల్బీడబ్ల్యూ) (బి) నటరాజన్ 25; సర్ఫరాజ్ (సి) భువనేశ్వర్ (బి) సుందర్ 10; మనీశ్ పాండే (రనౌట్) 34; అమన్ (సి) అభిషేక్ (బి) సుందర్ 4; అక్షర్ (బి) భువనేశ్వర్ 34; రిపాల్ (రనౌట్) 5; నోర్జే (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 4; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–39, 3–57, 4–58, 5–62, 6–131, 7– 134, 8–139, 9–139. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–11–2, జాన్సెన్ 2–0–27–0, సుందర్ 4–0–28–3, నటరాజన్ 3–0–21–1, మార్కండే 4–0–34–0, ఉమ్రాన్ 2–0–14–0, మార్క్రమ్ 1–0–7–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) నోర్జే 7; మయాంక్ (సి) అమన్ (బి) అక్షర్ 49; రాహుల్ త్రిపాఠి (సి) సాల్ట్ (బి) ఇషాంత్ 15; అభిషేక్ (సి అండ్ బి) కుల్దీప్ 5; మార్క్రమ్ (బి) అక్షర్ 3; క్లాసెన్ (సి) అమన్ (బి) నోర్జే 31; సుందర్ (నాటౌట్) 24; జాన్సెన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–31, 2–69, 3–75, 4–79, 5–85, 6–126. బౌలింగ్: ఇషాంత్ 3–0–18–1, నోర్జే 4–0–33–2, ముకేశ్ 3–0–27–0, అక్షర్ 4–0– 21–2, కుల్దీప్ 4–0–22–1, మార్‡్ష 2–0–16–0. -
IPL: ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం అంటూనే కోహ్లి షాకింగ్ కామెంట్స్
Virat Kohli- RCB: టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కీలక ప్లేయర్‌గా.. అటుపై కెప్టెన్‌గా ఎదిగి.. ఆర్సీబీ అంటే కోహ్లి... కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ముడిపడిపోయాడు. అలాంటి కోహ్లి పేరు లేని ఆర్సీబీని ఊహించడం కష్టం. 2013- 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించనప్పటికీ .. జట్టు అభిమానులను అలరించడంలో మాత్రం విఫలం కాలేదు. తనదైన శైలిలో దూకుడైన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్.. రోజురోజుకీ ఆర్సీబీ ఫ్యాన్ బేస్ పెంచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తాజా వెల్లడించిన ఓ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీబీతో అనుబంధాన్ని చెబుతూనే.. ఆరంభంలో తాను వేరే ఫ్రాంఛైజీకి మారాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు.. జియో సినిమా షోలో రాబిన్ ఊతప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీతో నా ప్రయాణం అద్భుతం. ఫ్రాంఛైజీ అంటే నాకు అమితమైన గౌరవం. ఎందుకంటే జట్టులో చేరిన తొలి మూడేళ్లలో వాళ్లు నన్ను చాలా బాగా సపోర్టు చేశారు. రిటెన్షన్ జరిగిన ప్రతిసారీ.. ‘‘మేము నిన్ను రిటైన్ చేసుకోబోతున్నాం’’ అని చెప్పేవారు. అప్పుడు.. నేను వాళ్లకు చెప్పిన మాట ఒకటే.. ‘‘టాపార్డర్‌లో ఆడాలనుకుంటున్నా. టీమిండియాకు ఆడేపుడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తా.. ఇక్కడ కూడా అదే చేయాలనుకుంటున్నా’’ అని విజ్ఞప్తి చేశా. అందుకు వాళ్లు సరేనన్నారు. నాపై నమ్మకం ఉంచారు. నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు. అలా ఆర్సీబీతో పాటే నా అంతర్జాతీయ కెరీర్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. నాకు వాళ్లు ఎంతో విలువ ఇస్తారు. నా మాట పట్టించుకోలేదు పేరైతే చెప్పను గానీ.. ఓ ఫ్రాంఛైజీతో అప్పట్లో నేను సంప్రదింపులు జరిపాను. కానీ వాళ్లు కనీసం నేను చెబుతున్నానో కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అప్పట్లో నేను 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు వాళ్లతో మాట్లాడాను. ‘‘ఒకవేళ నేను మీ జట్టులోకి వస్తే టాపార్డర్‌లో ఆడిస్తారా లేదంటే వేరే ప్లేస్‌లోనా’’.. అని అడిగాను. వాళ్లు పట్టించుకోనేలేదు. అయితే, 2011లో నేను టీమిండియా తరఫున అద్భుతంగా ఆడుతున్న తరుణంలో అదే ఫ్రాంఛైజీ వాళ్లు నా దగ్గరికి వచ్చారు. ‘ప్లీజ్.. వేలంలోకి రాగలరా?’’ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను కచ్చితంగా నో అని చెప్పేశాను. నాకు ఎల్లవేళలా అండగా నిలిచిన ఆర్సీబీతోనే ఉంటానని చెప్పాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లిని వద్దన్న ఫ్రాంఛైజీ ఉందా? ఇందుకు స్పందించిన ఊతప్ప.. కోహ్లి వస్తానంటే పట్టించుకోని ఫ్రాంఛైజీ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బదులుగా.. ‘‘అవును.. నిజం. వాళ్లు అప్పట్లో నా అభ్యర్థనను నిర్మొహమాటంగా కాదన్నారు. అదే మంచిదైంది’’ అని కోహ్లి.. ఊతప్పతో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023లో ఆర్బీసీ స్టార్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 220 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. చదవండి: ఎట్టకేలకు టెండుల్కర్ అంటూ సచిన్ ఉద్వేగ ట్వీట్! నీ మనసు బంగారం షారుఖ్! SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });