
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ శనివారం ముంబై చేరుకున్నాడు. ప్రొటోకాల్ ప్రకారం ‘బయో బబుల్’లో అడుగు పెట్టిన అతడు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను ముగించుకోవాల్సి ఉంది. అనంతరం స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుతో చేరతాడు. ‘డీసీ కుటుంబంలోకి స్మిత్‌కు స్వాగతం’ అంటూ స్మిత్ ఉన్న ఫోటోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో డీసీ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. 2020 ఐపీఎల్ ముగిసిన అనంతరం 31 ఏళ్ల స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్ విడుదల చేయగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని రూ. 2.2 కోట్లకు డీసీ దక్కించుకుంది. ఈ నెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌తో డీసీ ఐపీఎల్ టైటిల్ వేటను ఆరంభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment