16 సీజన్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను (ఐపీఎల్) విజయవంతంగా నిర్వహించిన అనంతరం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరో కొత్త లీగ్‌ను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లీగ్‌ను కూడా ఐపీఎల్ తరహాలోనే భారీ ప్రణాళికతో రూపొందించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లీగ్‌ను టీ20 ఫార్మాట్‌లో కాకుండా టీ10 ఫార్మాట్‌లో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట.
ఇందుకు సెప్టెంబర్-అక్టోబర్ మాసాలను పరిశీలిస్తున్నట్లు వినికిడి. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ రెండు నెలల్లో పెద్ద టోర్నీలేవీ లేకపోవడంతో సెప్టెంబర్-అక్టోబర్ మాసాలయితే కొత్త లీగ్ నిర్వహణకు అనువుగా ఉంటాయని బీసీసీఐ పెద్దల చర్చించినట్లు తెలుస్తుంది. కొత్త టీ10 లీగ్ ఆలోచన ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ స్పాన్సర్‌షిప్‌ల కోసం బడా కంపెనీలు ఎగబడుతున్నట్లు సమాచారం. కొత్త లీగ్ ప్రతిపాదనను బీసీసీఐ కార్యదర్శి జై షా లేవనెత్తగా బీసీసీఐ పెద్దలందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.
కాగా, బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో పరుడు పోసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి క్యాష్ రిచ్ లీగ్ నిరంతరాయంగా 16 సీజన్ల పాటు విజయవంతంగా సాగింది. తదుపరి సీజన్ (2024) సన్నాహకాలు కూడా ఇదిరవకే ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఫ్రాంచైజీలు సైతం ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment