
2012 తర్వాత మళ్లీ టైటిల్ పోరుకు ఆతిథ్యం
అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్–1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మే 26న ఐపీఎల్ ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యమిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 2012 తర్వాత చెన్నైలో మళ్లీ ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండటం విశేషం. మే 19వ తేదీతో లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తవుతాయి.
అనంతరం మే 21న క్వాలిఫయర్–1 మ్యాచ్‌కు... మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మే 24న చెన్నైలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కాకముందు ఫిబ్రవరిలో బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్‌లతో కూడిన తొలి దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment