IPL Final Match
-
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్‌కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్‌గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్‌గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్‌కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్‌తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
IPL 2024: మే 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మే 26న ఐపీఎల్ ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యమిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 2012 తర్వాత చెన్నైలో మళ్లీ ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండటం విశేషం. మే 19వ తేదీతో లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తవుతాయి. అనంతరం మే 21న క్వాలిఫయర్–1 మ్యాచ్‌కు... మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మే 24న చెన్నైలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 26న ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కాకముందు ఫిబ్రవరిలో బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్‌లతో కూడిన తొలి దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది. -
IPL 2024: ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారు
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని వేదిగా నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్లు అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక కాదని తేలిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుందని తెలుస్తుంది. మరో ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లు మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోం గ్రౌండ్‌లోనే ఆరంభ మరియు ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇదే సంప్రదాయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ సీజన్‌కు కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత్‌లోనే అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియం కావడంతో ఇక్కడ ఫైనల్ జరిగితే బాగుంటుందని కొందరు పెద్దలు అభిప్రాయపడినప్పటికీ.. గవర్నింగ్ బాడీ అంతిమంగా చెన్నైనే ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ (మార్చి 24) మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్, లక్నో జట్లు (జైపూర్) తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్) ఢీకొట్టనున్నాయి. -
ఐదోసారి టైటిల్ పై చెన్నై కన్ను...రెండో టైటిల్ పై గుజరాత్ గురి
-
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..?
ఈ ఏడాది (2022) మే 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా) వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1,01,566 మంది హాజరయ్యారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడం అదే తొలిసారి. దీంతో ఐపీఎల్-2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPL pic.twitter.com/PPhalj4yjI— BCCI (@BCCI) November 27, 2022 ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇవాళ (నవంబర్ 27) వెల్లడించింది. బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి నుంచి అవార్డు ప్రతిని అందుకున్న దృష్యాన్ని షేర్ చేసింది. భారతీయులకు ఇదో గర్వించదగ్గ క్షణం. భారత్.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇది మా అభిమానులకు అంకితం.. మొతేరా, ఐపీఎల్‌కు అభినందనలు అంటూ బీసీసీఐ ట్విటర్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే, నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఆడిన తొలి లీగ్‌లోనే అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఛాంపియన్‌గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి, 30 బంతుల్లో 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. -
Laal Singh Chaddha Trailer: తలరాతను ఎలా రాస్తారు ?
Aamir Khan's Laal Singh Chaddha Trailer: ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ‘ఎక్స్‌పీరియన్స్‌ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఏ సింపుల్మేన్’ అంటూ ‘లాల్ సింగ్ చద్దా’ హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమా ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ ఉత్కంఠంగా సాగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తింగా సాగిన ఈ ట్రైలర్లో ఆమీర్ ఖాన్, నాగ చైతన్య లుక్ కొత్తగా ఉంది. ఈ సినిమాలో అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్‌గంప్’కు హిందీ రీమేక్‌గా రూపొందింది. Experience the extraordinary journey of #LaalSinghChaddha, a simple man whose heart is filled with love, hope and warmth.#LaalSinghChaddhaTrailer out now! Releasing in cinemas worldwide on 11th Aug.https://t.co/yahghWFhJA — Aamir Khan Productions (@AKPPL_Official) May 29, 2022 -
IPL 2022 Final: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫైనల్ మ్యాచ్ అప్పుడే!
IPL 2022- Final Match: ఐపీఎల్-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టైమింగ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్‌ను 8 గంటలకు ఆరంభించనున్నట్లు సమాచారం. తాజా ఎడిషన్ ముగింపు వేడుకలను నిర్వహించే క్రమంలో మ్యాచ్ వేళలో ఈ మార్పు చేసినట్లు క్రిక్‌బజ్ కథనం వెల్లడించింది. ఇందులోని వివరాల ప్రకారం.. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు బాలీవుడ్ తారలతో కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏడున్నరకు టాస్ వేస్తే.. ఎనిమిదింటి నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక మే 24 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. కోల్‌కతాలో ఫస్ట్ క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరుగనుంది. ఇప్పటికే కొత్త ఫ్రాంఛైజీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. చదవండి: IPL 2022 RCB Vs GT Prediction: నిలవాలంటే గెలవాలి.. అదీ భారీ తేడాతో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు.. సందడి చేయనున్న ఆస్కార్ విన్నర్
IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహించని బీసీసీఐ.. 2022 సీజన్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌లతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డుతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీతో కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు 45 నిమిషాల పాటు ఈ ప్రోగ్రాంను నిర్వహించనున్నారని సమాచారం. ముగింపు వేడుకల సందర్భంగా బీసీసీఐ మరో ప్రోగ్రాంను కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించిన వారందరినీ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించాలని భావిస్తుందట. అలాగే స్వతంత్ర భారతావనిలో భారత క్రికెట్ ప్రస్థానానికి సంబంధించి ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా రూపొందించినట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో కీలక దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరబోయే 4 జట్లలో గుజరాత్ టైటాన్స్ తొలి బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విషయానికొస్తే.. మే 24న కోల్‌కతాలో తొలి ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్ టీమ్ 1 వర్సెస్ టీమ్ 2) జరుగనుంది. మే 25న అదే స్టేడియంలో ఎలిమినేటర్ (టీమ్ 3 వర్సెస్ టీమ్ 4)ను నిర్వహిస్తారు. మే 27న అహ్మదాబాద్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ (ఎలిమినేటర్ గేమ్ విజేత వర్సెస్ క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు) జరుగుతుంది. మే 29న అదే స్టేడియంలో క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 2 విజేతల మధ్య ఫైనల్ జరుగుతుంది. చదవండి: 'పృథ్వీ షాను మిస్సవుతున్నాం.. కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకుంటాం' -
MS Dhoni: టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది.. మేమైతే..
IPL 2021 Winner CSK Captain MS Dhoni Commnets: ‘‘సీఎస్కే కంటే ముందు నేను కేకేఆర్ గురించి మాట్లాడాలి. సీజన్ తొలి దశలో ఎదురైన పరాభవాల నుంచి తేరుకుని... ఇక్కడి వరకు రావడం నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈసారి ఐపీఎల్ టైటిల్ విజేత అయ్యే అర్హత ఏ జట్టుకైనా ఉందంటే.. అది కేకేఆర్. వాళ్ల ఆట తీరు అమోఘం. నిజానికి... విరామం (ఐపీఎల్ వాయిదా)వాళ్లకు మేలే చేసింది’’ అంటూ చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో మోర్గాన్ సేన అద్భుత ప్రద్శనతో ఆకట్టుకుందని కితాబిచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే.. కేకేఆర్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి (2010, 2011, 2018, 2021) చాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని స్పందిస్తూ... ‘‘గణాంకాలను బట్టి చూస్తే... నిలకడ జట్టుగా మాకు మంచి పేరు ఉంది. అదే సమయంలో మేం ఫైనల్లో ఓడిన సందర్భాలు అనేకం. అందుకే ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అనుకున్నాం. బాగా ఇంప్రూవ్ అయ్యాం. జట్టు సమిష్టి విజయం ఇది. తొలుత కాస్త ఒత్తిడికి గురైన మాట వాస్తవం. అయితే, వ్యక్తిగతంగా.. గొప్పగా రాణించే ఆటగాళ్లు ఉండటం మాకు కలిసి వచ్చింది.’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా అభిమానులను ధన్యవాదాలు తెలిపిన ధోని... ‘‘ఇప్పుడు మేం దుబాయ్‌లో ఉన్నాం. ఒకవేళ సౌతాఫ్రికాలో ఉన్నా సరే.. ఫ్యాన్స్ మద్దతు మాకు ఇలాగే ఉంటుంది. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను చెన్నైలోని చెపాక్‌లోనే ఉన్నట్లుగా భావిస్తున్నా. చెన్నై అభిమానుల కోసం మేం మళ్లీ అక్కడ ఆడే అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని ఫ్యాన్స్‌పై ప్రేమను కురిపించాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా Of the Fans, By the Fans, For the Fans 💛 #EverywhereWeGo#THA7A #SuperCham21ons#CSKvKKR #WhistlePodu #Yellove🦁pic.twitter.com/6OXgZUeOjA — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 We are the Chennai boys… Making all the noise… Everywhere we Gooo…💛💛 For all of you #SuperFans.! 💛🦁#WhistlePodu #Yellove #SuperCham21ons 💛🦁 pic.twitter.com/6nQS9zWovf — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 -
IPL 2021 CSK Vs KKR: అప్పుడు టార్గెట్ 190/3, ఇప్పుడేమో.. 192/3!
IPL 2021 FInal: ఐపీఎల్-2021 విజేతగా నిలిచేందుకు చెన్నై సూపర్‌కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్(32), డుప్లెసిస్(86) శుభారంభం అందించగా... రాబిన్ ఊతప్ప తనకు దక్కిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మొయిన్ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన 3 వికెట్లు కోల్పోయి... 192 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా.... 6 ఓవర్లు ముగిసేసరికి 55 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. ఇదిలా ఉండగా... ఐపీఎల్ విజేత ఎవరన్న అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. దుబాయ్ పిచ్ హిస్టరీ, అదే విధంగా గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన సమయంలో కేకేఆర్ 180 కంటే ఎక్కువ టార్గెట్ ఛేజ్ చేసిన నేపథ్యంలో మోర్గాన్ బృందానికే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2012లో చెన్నైలో సీఎస్కేతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ 192(19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) పరుగులు చేసి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2014లో బెంగళూరులో జరిగిన ఫైనల్లో పంజాబ్‌తో తలపడిన కోల్‌కతా 200(19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరుగులు సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు కూడా 2012 నాటి ఫలితమే పునరావృతమవుతుందని కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తలా ధోని అభిమానులు సైతం... ‘‘ఇక్కడ ఉంది మిస్టర్ ధోని.. అది గుర్తుంచుకోండి’’ అంటూ ధీటుగా బదులిస్తున్నారు. 2012 ఫైనల్ స్కోర్లు చెన్నై... 190-3 (20 ఓవర్లు) కేకేఆర్.... 192-5 (19.4 ఓవర్లు) విజేత: కోల్‌కతా 2021 ఫైనల్ చెన్నై: 192-3 (20 ఓవర్లు) విజేత... ? -
MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్
MS Dhoni Practices Helicopter Shot Video Goes Viral: కరోనా కారణంగా వాయిదా పడి.. సెప్టెంబరు 19న పునః ప్రారంభమైన ఐపీఎల్-2021 తుది అంకానికి చేరుకుంది. సూపర్ ఆటతో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్... ఈ సీజన్లో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు(అక్టోబరు 15)న తుది పోరు జరుగనుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో జరుగనున్న ఈ ఆసక్తికర ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు టైటిల్ సాధించాలన్న కసితో ఉన్న మాజీ చాంపియన్లు.. ప్రాక్టీసులో తలమునకలయ్యాయి. ఈ క్రమంలో సీఎస్కే.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న తమ ఆటగాళ్ల వీడియోను షేర్ చేసింది. ఇది చెన్నై అభిమానులను.. ముఖ్యంగా తలా ధోని ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. మిస్టర్ కూల్ తనదైన శైలిలో హెలికాప్టర్ షాట్ ప్రాక్టీసు చేయడం ఇందులో చూడవచ్చు. మరోవైపు.. సురేశ్ రైనా సైతం వీడియోలో కనిపించడంతో తుది జట్టులో అతడు చోటుదక్కించుకుంటాడా.. లేదంటే రాబిన్ ఊతప్ప వైపే సారథి మొగ్గు చూపుతాడా అని నెటిజన్లు చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: IPL Final CSK Vs KKR: అతనే బలం... ‘సూపర్’ దళం! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
IPL Final CSK Vs KKR: అతనే బలం... ‘సూపర్’ దళం!
పాత చాంపియన్ల మధ్య కొత్త చాంపియన్‌షిప్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్ చేరి లీగ్‌కే వన్నె తెచి్చన ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో టైటిల్‌పై కన్నేయగా... రెండు సార్లు ఫైనల్ చేరితే ఆ రెండుసార్లూ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఆనవాయితీని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మూడో ఐపీఎల్ టైటిల్‌తో దుబాయ్ నుంచి దిగి్వజయంగా తిరిగి రావాలని ఆశిస్తోంది. దుబాయ్: అవాంతరాలతో ఆగి, భారత్‌నుంచి విదేశం తరలి వెళ్లి మళ్లీ మొదలైన 2021 ఐపీఎల్‌కు ఇంకొన్ని గంటల్లో దుబాయ్‌లో శుభం కార్డు పడనుంది. 14వ సీజన్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సై అంటే సై అంటున్నాయి. గత ఏడాది ప్లే ఆఫ్స్‌కే అర్హత సాధించని ఇరు జట్లను కెపె్టన్లు ధోని, మోర్గాన్ ఈ సీజన్లో సమర్థంగా నడిపించారు. ఇప్పుడు అసలు పోరులో వారి సారథ్యం, బ్యాటింగ్ సామర్థ్యం జట్టుకు గెలిపిస్తాయా అనేది ఆసక్తికరం. ధోని నాయకత్వంలోనే చెన్నై మూడు సార్లు చాంపియన్‌గా నిలవగా, ధోనిలాగే వరల్డ్ కప గెలిపించిన మోర్గాన్ సారథిగా తొలి ఐపీఎల్ టైటిల్‌పై కన్నేశాడు. అతనే బలం... ‘సూపర్’ దళం బ్యాటింగ్ మెరిసినా, మెరిపించకపోయినా ధోని ధోనినే! ఈ క్రికెట్ జ్ఞాని శిబిరంలో ఉంటే ఆ జట్టుకు వంద ఏనుగుల బలం. అందుకే భారత క్రికెట్ బోర్డు కూడా వచ్చే టి20 ప్రపంచకప్ వేటకు వెళ్లే కోహ్లి సేనకు ధోనిని మెంటార్‌గా నియమించింది. తొలి క్వాలిఫయర్‌లో ధోని మెరుపులు జట్టుని గెలుపుతీరానికి చేర్చాయి. ఈ ధనాధన్ టి20ల్లో అతని విశేషానుభవం, సారథ్య సామర్థ్యం జట్టుకు అదనపు బలం. అందుకే 12 సీజన్లు ఐపీఎల్ ఆడితే ఏకంగా 9 సార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత ధోనిదే! ఓపెనింగ్ రుతురాజ్ గైక్వాడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. దీనికి డుప్లెసిస్ ధాటి కూడా తోడైతే సూపర్ కింగ్స్ భారీస్కోరు చేయడం ఖాయమవుతుంది. టాపార్డర్ నుంచి దీపక్ చహర్ దాకా పది మందికి పరుగులు చేసే సత్తా ఉండటం కూడా చెన్నైలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. దీంతోపాటు ఈ సీజన్లో అక్కడా... ఇక్కడా... రెండు సార్లు కోల్‌కతాపై గెలిచిన సానుకాలంశం చెన్నైని మురిపిస్తోంది. ముంబై, అబుదాబీలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లలో సూపర్‌కింగ్స్ జట్టే గెలిచింది. టాపార్డర్ కీలకం... మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ సీజన్ క్లైమాక్స్ దశలో రెచి్చపోతోంది. అయితే భారీ స్కోర్లతో, మెరిపించే బ్యాట్స్‌మెన్‌తో కాదు... తిప్పేసే స్పిన్ ద్వయంతో పాయింట్ల పట్టికలో తనకన్నా మెరుగైన బెంగళూరు, ఢిల్లీ జట్లను కంగుతినిపించింది. ఇప్పుడు ఫైనల్ మజిలీకొచి్చంది. ఇక్కడి దాకా వస్తే టైటిల్‌తోనే వెళ్లిన రికార్డూ ఊరిస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు తమ స్పిన్ మాయాజాలంతో సూపర్‌కింగ్స్‌ను కట్టిపడేస్తే... లీగ్‌లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవచ్చు. అయితే గత రెండు మ్యాచ్‌లు షార్జా పిచ్‌పై జరిగాయి. కానీ ఇది దుబాయ్ వికెట్. యూఏఈ అంచెలో మెరుగైన స్కోర్లు నమోదైన వేదిక కూడా ఇదే! టాపార్డర్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలతో పాటు అనుభవజు్ఞలైన కెపె్టన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్‌లు పరుగుల బాధ్యతను పంచుకోవాలి. చక్కని బ్యాటింగ్‌కు జతగా స్పిన్ మ్యాజిక్ పనిచేస్తే కోల్‌కతాకు ఫైనల్లో తిరుగుండదు. దుబాయ్‌లో మూడో స్పిన్నర్ అవసరం పెద్దగా ఉండకపోవడంతో పాటు రసెల్ ఫిట్‌గా ఉంటే షకీబ్ స్థానంలో అతనికి చోటు దక్కవచ్చు. తుది జట్లు (అంచనా) చెన్నై సూపర్‌కింగ్స్: ధోని (కెపె్టన్), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, ఉతప్ప, రాయుడు, జడేజా, బ్రావో, శార్దుల్, దీపక్ చహర్, హాజల్‌వుడ్. కోల్‌కతా నైట్‌రైడర్స్: మోర్గాన్ (కెపె్టన్), గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, షకీబ్ / రసెల్, నరైన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్. -
5 కోసం ముంబై.. 1 కోసం ఢిల్లీ
ఐపీఎల్ అసలు 2020లో జరుగుతుందా అనే సందేహాలను దాటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా 52 రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీ ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది. ఆసాంతం అద్భుత వినోదం పంచిన లీగ్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఒకవైపు... పదమూడో ప్రయత్నంలో ఫైనల్ చేరి మొదటి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు పోరుకు ‘సై’ అంటున్నాయి. మైదానంలో ప్రేక్షకులు లేకపోయినా... టీవీ వీక్షకుల ఆనందానికి ఏమాత్రం లోటు రాకుండా సాగిన ఈ సీజన్ ఐపీఎల్‌కు మరో అద్భుత ముగింపు లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాలుగు బేసి సంవత్సరాల్లో (2013, 2015, 2017, 2019) చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మళ్లీ గెలిస్తే వారి ఖాతాలో ఐదో టైటిల్ చేరుతుంది. ఇప్పటికే లీగ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అత్యంత విజయవంతమైన టీమ్‌గా నిలిచిన రోహిత్ శర్మ బృందం ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుంది. ‘డేర్‌డెవిల్స్’గా విఫలమైన ఢిల్లీ... ‘క్యాపిటల్స్’గా మారి గత ఏడాది మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్ నెగ్గని మూడు జట్లలో ఒకటైన ఢిల్లీ గెలిస్తే మొదటి ట్రోఫీ వారి చెంతకు చేరుతుంది. లీగ్‌లో టాప్–2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. ముంబై ఇండియన్స్ టోర్నీలో జట్టు ప్రస్థానం: లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో అతి సునాయాసంగా ఢిల్లీని 57 పరుగులతో చిత్తు చేసి ఎలాంటి తడబాటు లేకుండా దర్జాగా ఫైనల్‌కు చేరింది. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థి జట్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్ ను మినహాయిస్తే తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యల్ప స్కోరు కూడా 162 పరుగులు ఉందంటే జట్టు బ్యాటింగ్ బలమేమిటో అర్థమవుతోంది. లక్ష్యాన్ని నిర్దేశించినా... లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా సానుకూల ఫలితాలు పొందగలిగింది. ఆటగాళ్ల ప్రదర్శన: డిఫెండింగ్ చాంపియన్ మళ్లీ ఫైనల్ చేరేందుకు జట్టులో ప్రతీ ఒక్కరు తమదైన పాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే ఒకరితో మరొకరు పోటీ పడి బాగా ఆడేందుకు ప్రయత్నించారు. ఇషాన్ కిషన్ (483 పరుగులు), డికాక్ (483), సూర్యకుమార్ యాదవ్ (461)ల బ్యాటింగ్ ప్రధానంగా జట్టును నడిపించింది. ఇక పొలార్డ్ (190.44), హార్దిక్ పాండ్యా (182.89)ల స్ట్రయిక్‌రేట్ చూస్తే ఎలాంటి ప్రత్యర్థి అయినా ఆందోళన చెందాల్సిందే. రోహిత్ శర్మ స్థాయి ఆటగాడు విఫలమైనా... ముంబైకు ఆ లోటు ఏమాత్రం కనిపించలేదు. ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ చెలరేగి ప్రత్యర్థులను దెబ్బ కొట్టారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా (27 వికెట్లు), బౌల్ట్ (22) ప్రదర్శన ముంబైని ముందంజలో నిలిపింది. వీరిద్దరి ఎనిమిది ఓవర్లే మ్యాచ్‌లను శాసించాయంటే అతిశయోక్తి కాదు. ఈ బృందాన్ని నిలువరించాలంటే ఢిల్లీ రెట్టింపు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో జట్టు ప్రస్థానం: లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 8 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడినా... రెండో క్వాలిఫయర్‌లో సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి ఫైనల్ చేరింది. లీగ్ ఆరంభంలో అద్భుతంగా ఆడినా రాన్రానూ ఆట దిగజారుతూ వచ్చింది. నాలుగు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయంలో ప్లే ఆఫ్స్ చేరగా... ముంబై చేతిలో భారీ ఓటమి జట్టు బలహీనతను చూపించింది. అయితే గత మ్యాచ్‌లో తుది జట్టులో సరైన మార్పులు, సరైన వ్యూహాలతో విజయాన్ని అందుకుంది. అయితే ఐదు మ్యాచ్‌లలో 150 లోపే పరుగులు చేయగలిగింది. ఆటగాళ్ల ప్రదర్శన: 16 మ్యాచ్‌లలో 4 సార్లు డకౌట్ అయి కూడా మొత్తంగా 603 పరుగులు (2 సెంచరీలు) చేయగలిగిన శిఖర్ ధావన్ ఇప్పుడు జట్టుకు అత్యంత విలువైన ఆటగాడు. 145.65 స్ట్రయిక్‌రేట్‌తో అతను ఈ పరుగులు చేయడం ఓపెనర్‌గా ధావన్ ఇచ్చే ఆరంభంపై ఢిల్లీ ఎంతగా ఆధారపడుతుందో చెప్పవచ్చు. అయితే అతనికి ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించలేదు. అదే బ్యాటింగ్ వైఫల్యం ఢిల్లీని లీగ్ చివరి దశలో దెబ్బ తీసింది. శ్రేయస్ అయ్యర్ 454 పరుగులతో రెండో స్థానంలో ఉన్నా... అతని స్ట్రయిక్‌రేట్ (122.37) పేలవం. ఎలిమినేటర్‌లో ఆడిన ఇన్నింగ్స్‌లా (20 బంతుల్లో 21) మళ్లీ అయ్యర్ ఆడితే అది ఆత్మహత్యా సదృశ్యమే. టోర్నీలో స్టొయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన (352 పరుగులు, 12 వికెట్లు) జట్టును బలంగా మార్చింది. ఫైనల్లోనూ అతను ఇదే జోరు కనబర్చాల్సి ఉంది. హెట్‌మైర్ కూడా కీలకం. రబడ (29 వికెట్లు), నోర్జే (20)తో పేస్ పదునుగా కనిపిస్తుండగా...అశ్విన్, అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలరు. విజేతకు రూ. 10 కోట్లు ఈసారి ఐపీఎల్లో ప్రైజ్‌మనీని భారీగా తగ్గించారు. చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ఇవ్వనున్నారు. గత ఏడాది విజేత జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. ఈసారి రన్నరప్ జట్టుకు రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతాయి. గత ఏడాది రన్నరప్ జట్టు ఖాతాలో రూ. 12 కోట్ల 50 లక్షలు చేరాయి. ఈసారి ప్లే ఆఫ్ దశలో ఓడిన రెండు జట్లకు రూ. 4 కోట్ల 37 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్‌మనీ కేటాయించారు. ► టోర్నీలో ముంబై 130 సిక్సర్లు బాదితే, ఢిల్లీ 84 సిక్సర్లు మాత్రమే కొట్టడం ఇరు జట్ల మధ్య దూకుడులో తేడాను చూపిస్తోంది. ► లీగ్ దశలో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌లతోపాటు తొలి క్వాలిఫయర్‌లో కూడా గెలిచి ముంబై 3–0తో ఆధిక్యంలో ఉంది. ► గత నాలుగు ఐపీఎల్‌లలో క్వాలిఫయర్–1లో విజేతగా నిలిచిన జట్టే మూడు సార్లు టైటిల్ సాధించింది. ఒక్కసారి మాత్రమే (2017లో) క్వాలిఫయర్–2 ద్వారా ఫైనల్ చేరిన జట్టు గెలిచింది. ► రోహిత్ శర్మకు ఇది ఆరో ఐపీఎల్ ఫైనల్. అతను భాగంగా ఉన్న జట్లు ఐదుసార్లు ఫైనల్‌కు వెళితే ప్రతీసారి నెగ్గింది. ముంబై తరఫున 4 టైటిల్స్‌తో పాటు 2009లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. 2010లో ఫైనల్లో ఓడిన ముంబై జట్టులో రోహిత్ లేడు. ఎన్నో ఆశలతో మేం యూఏఈకి వచ్చాం. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే సమయం వచ్చింది. మొత్తంగా సీజన్ బాగానే గడిచినా... అసలు పని మాత్రం పూర్తి కాలేదు. ఐపీఎల్ టైటిల్ గెలవాలనేదే మా లక్ష్యం. అందుకోసం ఫైనల్లో మా అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తాం. ఎంతో క్రికెట్ ఆడినా ఒక్కసారి కూడా ఐపీఎల్ ఫైనల్లో ఆడే అవకాశం రానివారితో పోలిస్తే మీరు ఎంతో అదృష్టవంతులు. కాబట్టి మైదానంలో ఎలాంటి ఒత్తిడి పెంచుకోకుండా ప్రశాంతంగా ఆడాలని మాత్రమే మా కుర్రాళ్లకు చెప్పాను. సీజన్లో ఇప్పటికే మూడు సార్లు ఓడినా సరే... ముంబైపై గెలిచే సత్తా మా జట్టుకు ఉందని నమ్ముతున్నా. –రికీ పాంటింగ్, ఢిల్లీ హెడ్ కోచ్ గతంలో ఐపీఎల్ ఫైనల్లో ఆడిన అనుభవం ఉండటం వల్ల ప్రత్యర్థిపై మానసికంగా మాది కొంత పైచేయిగా కనిపిస్తున్నా... లీగ్‌లో ప్రతీ రోజూ కొత్తదే. ఆ రోజు ఎవరు ఎలా ఆడతారనేదే ముఖ్యం. ఇది ఎన్నో సార్లు జరిగింది. కాబట్టి గతంలో ఏం జరిగిందనేది ఎక్కువగా ఆలోచించడం అనవసరం. ఇప్పుడు కొత్త ప్రత్యర్థితో తలపడుతున్నట్లే భావించి అదే ప్రణాళికతో ఆడతాం. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు మా జట్టులో ఎలాంటి బలహీనతా కనిపించడం లేదు. అయితే ఇంత పటిష్ట జట్టు ఒక్కసారిగా తయారు కాలేదు. ఈ ఆటగాళ్లంతా అన్ని జట్లకు అందుబాటులో ఉన్న రోజుల్లో వారిని గుర్తించి సానబెట్టి మాకు కావాల్సిన విధంగా మార్చుకున్నాం. వారిపై నమ్మకం ఉంచాం కాబట్టే ఫలితాలు వచ్చాయి. –రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ -
మురళీ విజయ్ హీరో అయిన వేళ!
చెన్నై: టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్ ఓ టీ20 మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. 52 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 95 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా టాప్ స్కోరర్‌గా నిలిచిన విజయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్- 2011లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్- ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో విజయ్ ఈ గణాంకాలు నమోదు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా సీఎస్కే, గ్రూప్ స్టేజ్‌లో అత్యధిక పాయింట్లతో ఉన్న ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్ జరిగి నేటిక తొమ్మిదేళ్లవుతున్న సందర్భంగా ఆనాటి మ్యాచ్ విశేషాలు మీకోసం.. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) టాస్ గెలిచిన సీఎస్కే సారథి ధోని ‘మనసులో లక్ష్యంతో బరిలోకి దిగాలనుకోవడం లేదు’అని పేర్కొంటూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మైక్ హస్సీ, విజయ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. హస్సీ(63; 45 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో వీరిద్దరు తొలి వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన విజయ్(95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక మిగతా బ్యాట్స్‌మన్ తమ వంతు మెరుపులు మెరిపించడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. (ప్రపంచకప్ వాయిదా.. పాక్‌కు కడుపు మంట) అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అందరి ఆశలను ఆవిరి చేస్తూ డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌరభ్ తివారి(42) మినహా మిగతా బ్యాట్స్‌మన్ అంతగా రాణించకపోవడంతో డానియల్ వెటోరీ సారథ్యంలోని ఆర్సీబీ మరోసారి భంగాపాటుకు గురైంది. ఐపీఎల్-2009 ఫైనల్ మ్యాచ్‌లోనూ అప్పటి డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఆర్సీబీ ఓటమిచవిచూసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 58 పరుగుల భారీ విజయం సాధించిన సీఎస్కే అటు మ్యాచ్‌తో పాటు ఇటు ఐపీఎల్-2011 ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మురళీ విజయ్ హీరోచిత ఇన్నింగ్స్ ఆడాడని సారథి ధోని పేర్కొనడం విశేషం. -
ఐపీఎల్ ఫైనల్ టిక్కెట్లున్నాయ్.. త్వరపడండి
హైదరాబాద్: తెలుగు గడ్డపై తొలిసారిగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకించేందుకు టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 21న (ఆదివారం) రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. రూ. 1500, రూ.2000, రూ.4000 టికెట్లు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారిక వెబ్సైట్ ‘బుక్‌మైషో’ గురువారం వెల్లడించింది. ఉప్పల్ మైదానంలో కనీస టిక్కెట్ ధర రూ. 800, అత్యధిక టిక్కెట్ ధర రూ. 7500. అయితే ఈ రెండు విభాగాల్లో టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. స్టేడియం కెపాసిటీ 30 వేలు ఉండగా రెండు వేల సీట్లకు హోర్డింగులు అడ్డు వస్తున్నందున్న రద్దు చేశామని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ తెలిపారు. మిగిలిన 28 వేల సీట్లలో 19 వేల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయని మిగిలిన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. జింఖానా గ్రౌండ్లోనూ ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. -
ఐపీఎల్ ఫైనల్‌కు భారీ బందోబస్తు
ఉప్పల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈనెల 21న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గురువారం ఉప్పల్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు భద్రతా అంశాల గురించి ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, జాయింట్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్గిరి డీసీపీ రమా ఉమామహేశ్వర్ వర్మ, ట్రాఫిక్ డీసీపీ రమేశ్ నాయుడు, అదనపు డీసీపీ దివ్యచరణ్ పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 1800 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 250 మంది సెక్యూరిటీ వింగ్, 270 మంది ట్రాఫిక్ పోలీసులు, 870 లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటున్ల ఆర్మ్డ్ ఫోర్స్ బృందాలు, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ స్టాఫ్‌తో పాటు 88 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 8 బాంబ్ డిస్పోజల్ బృందాలు మ్యాచ్ ముగిసేవరకు నిరంతరం పహారా కాస్తాయని పేర్కొన్నారు. సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గతంలో లాగానే షీ టీమ్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. బ్లాక్ టిక్కెట్ల విక్రయ సమాచారాన్ని అందించాలనుకునే వారు 100కు డయల్ చేయాలని లేదా 94906 17111 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీఐపీల సెక్యూరిటీకి అనుమతి లేదు వీఐపీల వెంట వచ్చే గన్మెన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని లోపలికి అనుమతించబోమన్నారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు గత అనుభవాల దృష్ట్యా పార్కింగ్‌కు ఇబ్బందులు కలగకుండా అధికంగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. 5150 ద్విచక్రవాహనాలకు, 4000 ఫోర్ వీలర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పార్కింగ్‌లోకి వచ్చే ప్రతీ వాహనంలో టిక్కెట్ కలిగిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఇతర వ్యక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. -
షారుక్‌ను అనుమతించక తప్పదా!
ఐపీఎల్ షరతులతో సంకటంలో ఎంసీఏ ముంబై: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విషయంలో నెలకొన్న వివాదం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఫైనల్ మ్యాచ్‌ను తిరిగి వాంఖడే స్టేడియానికే కేటాయించాలంటే తాము విధించే షరతులకు అంగీకరించాలని ఎంసీఏకు ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ షరతుల్లో ఫ్రాంచైజీ యజమానులందరినీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తప్పనిసరిగా అనుమతించాలని ఉంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని అయిన షారుక్ఖాన్నూ వాంఖడేలోకి అనుమతించాల్సి వస్తుంది. 2012లో కోల్‌కతా జట్టు ఫైనల్ మ్యాచ్‌లో నెగ్గాక ఎంసీఏ సిబ్బందితో షారుక్ గొడవకు దిగడంతో అతనిపై ఐదేళ్లపాటు నిషేధం విధించారు. వాంఖడేతోపాటు ఎంసీఏ పరిసరాల్లోకి కూడా షారుక్‌ను అనుమతించరాదని ఎంసీఏ అప్పటి అధ్యక్షుడు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐపీఎల్ అధికారుల తాజా షరతుతో ఎంసీఏ సంకటంలో పడింది. షారుక్‌ను అనుమతించడమంటే అతనిపై నిషేధాన్ని ఎత్తివేయడమేనన్న అభిప్రాయంతో ఉంది. అయితే... ఫ్రాంచైజీ యజమానుల్ని ఫైనల్ మ్యాచ్‌కు తప్పనిసరిగా అనుమతించాలన్న నిబంధనేదీ ఐపీఎల్లో లేదని ఎంసీఏకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. -
ఆ షరతులు ఒప్పుకుంటేనే..!
ముంబైకి ఫైనల్ అవకాశం ఐపీఎల్ నుంచి ఎంసీఏకు లేఖ! ముంబై: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పు వ్యవహారం మరో మలుపు తిరిగింది. వాంఖడే నుంచి ఈ మ్యాచ్‌ను బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి మార్చిన వైనంపై ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఐపీఎల్ పాలకమండలి (జీసీ)కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఎంసీఏ నిరసనపై జీసీ సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. మరోవైపు లీగ్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ ఎంసీఏ నిరసనపై సమాధానమిచ్చారు. కానీ ఈ అంశంపై కొన్ని షరతులు కూడా విధించారు. తమ తరఫున రానున్న అతిథుల కోసం హాస్పిటాలిటీ బాక్సుల నిర్వహణ తమకే అప్పగించడం, రాత్రి పది తర్వాత బాణసంచా కాల్చడానికి, పెద్ద శబ్దంతో సంగీతం పెట్టుకునేందుకు ముంబై పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడంలాంటి షరతులు వీటిలో ఉన్నట్టు సమాచారం. ‘బిశ్వాల్ నుంచి మాకు లేఖ అందింది. షరతులపై చర్చించేందుకు మా మేనేజింగ్ కమిటీ సమావేశమవుతుంది’ అని ఎంసీఏ ఉపాధ్యక్షుడు సావంత్ తెలిపారు.