IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహించని బీసీసీఐ.. 2022 సీజన్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌లతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డుతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీతో కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు 45 నిమిషాల పాటు ఈ ప్రోగ్రాంను నిర్వహించనున్నారని సమాచారం.
ముగింపు వేడుకల సందర్భంగా బీసీసీఐ మరో ప్రోగ్రాంను కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించిన వారందరినీ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించాలని భావిస్తుందట. అలాగే స్వతంత్ర భారతావనిలో భారత క్రికెట్ ప్రస్థానానికి సంబంధించి ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా రూపొందించినట్టు సమాచారం.
కాగా, ప్రస్తుతం ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో కీలక దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరబోయే 4 జట్లలో గుజరాత్ టైటాన్స్ తొలి బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విషయానికొస్తే..
- మే 24న కోల్‌కతాలో తొలి ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్ టీమ్ 1 వర్సెస్ టీమ్ 2) జరుగనుంది.
- మే 25న అదే స్టేడియంలో ఎలిమినేటర్ (టీమ్ 3 వర్సెస్ టీమ్ 4)ను నిర్వహిస్తారు.
- మే 27న అహ్మదాబాద్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ (ఎలిమినేటర్ గేమ్ విజేత వర్సెస్ క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు) జరుగుతుంది.
- మే 29న అదే స్టేడియంలో క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 2 విజేతల మధ్య ఫైనల్ జరుగుతుంది.
చదవండి: 'పృథ్వీ షాను మిస్సవుతున్నాం.. కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకుంటాం'
Comments
Please login to add a commentAdd a comment