Play off matches
-
IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
ఈ దఫా ఐపీఎల్ సీజన్ మస్త్ మజాను పంచబోతోంది. ఫేవరెట్‌గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ వెంటనే పంజాబ్ కింగ్స్ జట్టు కూడా అవుట్ అయ్యింది. తాజాగా.. గుజరాత్ టైటాన్స్ కథ కూడా ముగిసింది. ఇంకోవైపు ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ అర్హత సాధించింది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్లు పోటీపడనున్నాయి.రాజస్థాన్ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఆ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లోనే 8 నెగ్గింది. కానీ తర్వాత వరుసగా మూడు ఓటములు చవిచూసింది. అయినప్పటికీ రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్తుకు ఢోకా లేనట్లే. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. ఆ జట్టుకు బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం ఆ జట్టు సొంతమవుతుంది. పంజాబ్, కోల్‌కతాలతో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాయల్స్ ముందంజ వేస్తుంది. కాకపోతే ఆ మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోకూడదు. తక్కువ తేడాతో ఓడితే ఇప్పుడున్న 16 పాయింట్లతోనే ప్లేఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది.ఆడినవి: 12పాయింట్లు: 16నెట్‌రన్‌రేట్: 0.349మిగిలిన మ్యాచ్‌లు: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్రాజస్థాన్ తర్వాత మెరుగైన అవకాశాలున్నది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్, పంజాబ్) గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. నెట్‌రన్‌రేట్ బాగుంది (+0.406) కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేయొచ్చు. రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.ఆడినవి:12పాయింట్లు: 14నెట్ రన్‌రేట్: 0.406మిగిలిన మ్యాచ్‌లు: గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్లక్నో, ఢిల్లీ చెరో 6 విజయాలు సాధించాయి. కానీ, ఆ రెండు జట్లూ నెట్ రన్‌రేట్‌లో మైనస్ పాయింట్లతో బాగా వెనుకబడ్డాయి. ఢిల్లీకి ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలే ఉంది. అదీ లక్నోతో. నెట్ రన్ రేట్ ఢిల్లీకి తక్కువగా ఉంది. కాబట్టి 14 పాయింట్లు వచ్చినా ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం కష్టం. ఒకవేళ సన్‌రైజర్స్ భారీ తేడాతో తన రెండు మ్యాచ్‌లలో ఓడితే, సీఎస్కే ఆర్సీబీపై భారీ విజయం సాధిస్తే.. లక్నో ఓడిపోయి రన్‌రేట్‌తో ఢిల్లీ కంటే దిగువన ఉంటే గనుక.. అప్పుడు ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశం ఉండొచ్చు. ఇదంతా కష్టమే కాబట్టి ఢిల్లీకి అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఆడినవి:13పాయింట్లు:12నెట్‌రన్‌రేట్:-0.482మిగిలిన మ్యాచ్: లక్నోలక్నో.. ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. ఎల్ఎస్జీ నెట్‌రన్‌రేట్ (0.769) ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏడో విజయం సాధించినా ముందంజ వేయడం కష్టమే.ఆడినవి:12పాయింట్లు:12నెట్ రన్‌రేట్: -0.769మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ, ముంబై ఇండియన్స్ బెంగళూరు.. ఐదు మ్యాచ్‌లలో గెలిచి అనూహ్యంగా రేసులోకి వచ్చింది. నెట్‌రన్‌రేట్ (+0.387) మెరుగ్గా ఉండడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో జట్లలో ఒక్కటే ముందంజ వేసి, రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నైబెంగళూరు మ్యాచ్ నాకౌట్‌గా మారుతుంది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే.. చెన్నైని వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్ చేరుతుంది.ఆడినవి:13పాయింట్లు: 12నెట్‌రన్‌రేట్: 0.387మిగిలిన మ్యాచ్: సీఎస్కే13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్ రన్‌రేట్ (+0.528) చాలా మెరుగ్గా ఉంది కాబట్టి వేరే ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్తు సొంతం కావచ్చు.ఆడినవి:13పాయింట్లు:14నెట్‌రన్‌రేట్: 0.528మిగిలిన మ్యాచ్: ఆర్సీబీ -
IPL 2023: ఢిల్లీ ఔట్.. ఆ జట్లకు ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక మిగిలింది 9 జట్లు. వీటిలో సన్‌రైజర్స్, కేకేఆర్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. అయితే టెక్నికల్‌గా వారి అవకాశాలను కొట్టిపారేయడానికి వీల్లేదు. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు: 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది. కేకేఆర్: 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది. ఆర్సీబీ: 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు (-0.345) సాధించి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి, నెట్ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్, ముంబై, పంజాబ్, లక్నో జట్ల గెలుపోటములు కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. పంజాబ్: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (-0.268) సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై, లక్నో జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రన్‌రేట్ కీలకంగా మారుతుంది. రాజస్థాన్: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (0.633) సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా రన్‌రేట్ కీలకంగా మారుతుంది. లక్నో: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు (0.309) సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లక్నో.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ, ముంబై జట్లు తలో మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే లక్నో 15 పాయింట్లతో ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ టీమ్‌లు 14 పాయింట్లతో లీగ్ నుంచి నిష్క్రమిస్తాయి. ముంబై: 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు (-0.117) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబై.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. రాజస్థాన్ కంటే మెరుగైన రన్‌రేట్ సాధించడమో లేక రాజస్థాన్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో ఓటమిపాలయ్యేందుకు ఎదురు చూడాలి. సీఎస్కే: 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 15 పాయింట్లు (0.493) సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సీఎస్కే.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అదే రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరే రెండో జట్టుగా నిలుస్తుంది. గుజరాత్: 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు (0.761) సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ అసభ్య ప్రవర్తన -
IPL 2023: ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ తేదీలు ఖరారు
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. కోవిడ్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో రెండేళ్ల పాటు కాస్త చప్పగా సాగిన ఐపీఎల్ ఈసారి మాత్రం దుమ్మురేపుతుంది. ప్రతీ మ్యాచ్ ఆసక్తిగా సాగడంతో పాటు స్టేడియాలన్ని ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఇక టీఆర్పీ రేటింగ్ అయితే మునుపెన్నడు లేని విధంగా రికార్డులు సృష్టిస్తోంది. మరో వారంలో లీగ్‌లో తొలి దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అయితే 16వ సీజన్ ప్రారంభంలో కేవలం లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్ చేసిన బీసీసీఐ తాజాగా శుక్రవారం ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ తేదీలు, వేదికల వివరాలను వెల్లడించింది. ఐపీఎల్ 16వ సీజన్లో లీగ్ మ్యాచ్‌లు మే21తో ముగియనున్నాయి. అనంతరం మే 23న(మంగళవారం) తొలి క్వాలిఫయర్, మే 24న(బుధవారం) ఎలిమినేటర్ మ్యాచ్, మే 26న(శుక్రవారం) క్వాలిఫయర్-2 జరగనున్నాయి. ఇక మే 28న(ఆదివారం) ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా తొలి క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ట్విటర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. IPL 2023 ప్లే-ఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్: మే 23(మంగళవారం) - క్వాలిఫయర్-1 మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు మే 24(బుధవారం) - ఎలిమినేటర్ మ్యాచ్, వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై, సమయం రాత్రి 7:30 గంటలు మే 26(శుక్రవారం) - క్వాలిఫయర్-2 మ్యాచ్, వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు మే 28(ఆదివారం) - ఫైనల్ వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, సమయం రాత్రి 7:30 గంటలు -
ఐపీఎల్ ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు.. సందడి చేయనున్న ఆస్కార్ విన్నర్
IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహించని బీసీసీఐ.. 2022 సీజన్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌లతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డుతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీతో కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు 45 నిమిషాల పాటు ఈ ప్రోగ్రాంను నిర్వహించనున్నారని సమాచారం. ముగింపు వేడుకల సందర్భంగా బీసీసీఐ మరో ప్రోగ్రాంను కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించిన వారందరినీ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించాలని భావిస్తుందట. అలాగే స్వతంత్ర భారతావనిలో భారత క్రికెట్ ప్రస్థానానికి సంబంధించి ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా రూపొందించినట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో కీలక దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరబోయే 4 జట్లలో గుజరాత్ టైటాన్స్ తొలి బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విషయానికొస్తే.. మే 24న కోల్‌కతాలో తొలి ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్ టీమ్ 1 వర్సెస్ టీమ్ 2) జరుగనుంది. మే 25న అదే స్టేడియంలో ఎలిమినేటర్ (టీమ్ 3 వర్సెస్ టీమ్ 4)ను నిర్వహిస్తారు. మే 27న అహ్మదాబాద్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ (ఎలిమినేటర్ గేమ్ విజేత వర్సెస్ క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు) జరుగుతుంది. మే 29న అదే స్టేడియంలో క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 2 విజేతల మధ్య ఫైనల్ జరుగుతుంది. చదవండి: 'పృథ్వీ షాను మిస్సవుతున్నాం.. కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకుంటాం' -
IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..!
Playoff Matches Likely To Be Played In Lucknow And Ahmedabad: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమై పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే ప్లే ఆఫ్స్ ముచ్చటేందీ అనుకుంటున్నారా..? అయితే, ఈ వార్త పూర్తిగా చదవండి. మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్ 15వ ఎడిషన్‌కు సంబంధించి లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలో (ముంబై, పూణే) నిర్వహిస్తున్న బీసీసీఐ.. ప్లే ఆఫ్స్‌ను ఎక్కడ నిర్వహిస్తారన్న విషయమై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తొలుత ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్ (గుజరాత్)లోని మొతేరా స్టేడియంలో నిర్వహించాలని భావించిన బీసీసీఐ.. దేశంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వేదికలను విస్తరించాలని యోచిస్తుంది. ఇందులో భాగంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను గుజరాత్‌తో పాటు లక్నో నగరంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు దఫాలు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) ఫ్రాంచైజీలు ఈసారి ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడి అభిమానులు కూడా తమ సొంత గ్రౌండ్లో మ్యాచ్‌లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను అహ్మదాబాద్, లక్నోల్లో నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, మే 22తో ఐపీఎల్ లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మరో వారం రోజుల పాటు జరుగుతాయి. మే 29న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: 'ఏంటి రాహుల్ భయపడ్డావా, ఫైన్ వేస్తారని'.. వీడియో వైరల్! -
గంట ముందుగా...
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల సమ యాల్లో మార్పులు చేశారు. స్టేడియంలోనూ, టెలివిజన్‌లోనూ వీక్షించే ప్రేక్షకుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ల సమయాన్ని గంట ముందుకు జరిపారు. ఈ మార్పు ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవ్వాల్సిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభమవుతాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 22న వాంఖెడే (ముంబై)లో తొలి క్వాలిఫయర్, 23న ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)లో ఎలిమినేటర్, 25న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ముంబైలో 27వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ఒక్క బెర్త్... మూడు జట్లు!
ఆసక్తికరంగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు మూడు జట్లకు బెర్త్‌లు దాదాపు ఖాయం రెండు జట్లకు ఆశలు లేవు ఐపీఎల్-7 కీలక దశకు చేరింది. ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 15 మ్యాచ్‌లు. మూడు జట్లు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ఖాయం చేసుకోగా... రెండు జట్లు అవకాశం లేని స్థితిలో నిలిచాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం మూడు జట్లు రేస్‌లో నిలిచాయి. కనీసం 16 పాయింట్లకు చేరుకునే జట్లు ప్లే ఆఫ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. ఇక లీగ్ దశలో టాప్-2లో నిలవడం కూడా కీలకం. ప్లే ఆఫ్ దశలో ఒక మ్యాచ్‌లో ఓడిపోయినా ఫైనల్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెన్నై, పంజాబ్, రాజస్థాన్ లాంటి జట్ల లక్ష్యం ఇది. ప్రస్తుత సమీకరణాలను బట్టి లీగ్‌లో ముందంజ వేసేందుకు ఆయా జట్లకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం. - సాక్షి క్రీడావిభాగం కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుత స్థితి: ఐదు మ్యాచ్‌లు గెలిచి ఐదు ఓడటంతో జట్టు ఖాతాలో 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. జట్టుకు మిగిలిన నాలుగు మ్యాచుల్లో కనీసం మూడు విజయాలు అవసరం. ఆడాల్సిన మ్యాచ్‌లు: హైదరాబాద్‌తో రెండు, చెన్నై, బెంగళూరులతో ఒక్కోటి ఆడాల్సి ఉంది. అవకాశాలు: వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గి ఫామ్‌లోకి రావడంతో ప్లే ఆఫ్‌పై ఆశలు నిలిచాయి. చెన్నై పటిష్టమైన ప్రత్యర్థి కాబట్టి ఇతర మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలి. నాలుగులో మూడు మ్యాచ్‌లు సొంతగడ్డపైనే జరుగుతుండటం అనుకూలాంశం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్తుత స్థితి: టోర్నీలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 2 మాత్రమే ఓడింది. ఆడాల్సిన మ్యాచ్‌లు: ఢిల్లీతో రెండు, ముంబై, రాజస్థాన్లతో ఒక్కో మ్యాచ్ అవకాశాలు: ప్లే ఆఫ్‌కు దాదాపుగా చేరినట్లే. మరో విజయం ఆ జట్టు ఖాతాలో చేరితే ఖరారు అవుతుంది. ఫామ్‌ను బట్టి చూస్తే కనీసం రెండు మ్యాచ్‌లు సునాయాసంగా గెలవవచ్చు. అయితే టాప్-2లో నిలవాలని జట్టు భావిస్తోంది. అలా అయితే తొలి ప్లే ఆఫ్‌లో ఓడినా మరో మ్యాచ్ అవకాశం దక్కుతుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత స్థితి: 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం కాకపోయినా చేరువలోనే ఉంది. ఆడాల్సిన మ్యాచ్‌లు: ముంబైతో రెండు, పంజాబ్‌తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అవకాశాలు: మ్యాచ్ ఆరంభానికి ముందు సాధారణంగా కనిపిస్తున్నా...మైదానంలో దిగాక రాజస్థాన్ జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో కొన్ని సంచలన విజయాలు నమోదు చేసిన ఈ టీమ్ ముంబైని కనీసం ఒక మ్యాచ్‌లో ఓడించినా 16 పాయింట్లకు చేరుకొని అవకాశాలు మెరుగు పర్చుకుంటుంది. పంజాబ్ బలంగా ఉంది కాబట్టి ముంబైపై రెండు మ్యాచ్‌లు గెలిస్తే టాప్-2 ఆశలు ఉంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత స్థితి: ఇప్పటి వరకు నాలుగే విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉంది. సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిన ఈ జట్టు సత్తాను విశ్లేషిస్తే నిరాశాజనకంగా కనిపిస్తుంది. ఆడాల్సిన మ్యాచ్‌లు: కోల్‌కతాతో రెండు, బెంగళూరు, చెన్నైలతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. అవకాశాలు: మిగిలిన నాలుగూ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరవచ్చు. కనీసం మూడు నెగ్గితే ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. కానీ ఫామ్ చూస్తే అది అంత సులువు కాదు. ఉప్పల్‌లో మిగిలిన రెండూ గెలిచినా చెన్నైపై విజయం అంత సులువు కాదు. కాబట్టి కోల్‌కతాను రెండుసార్లూ ఓడించాల్సిందే. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రస్తుత స్థితి: గత ఏడాదిలాగే ఈ సారి కూడా అందరికంటే ముందే లీగ్‌నుంచి ఈ జట్టు నిష్ర్కమించింది. 11 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచిన ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. ఆడాల్సిన మ్యాచ్‌లు: రెండు పంజాబ్‌తో, ఒక మ్యాచ్ ముంబైతో ఆడాల్సి ఉంది. అవకాశాలు: ఏ మాత్రం లేవు. ఇతరుల అవకాశాలు చెడగొట్టం కూడా ఆ జట్టుకు సాధ్యం కాదు. ఎందుకంటే దాదాపు ప్లే ఆఫ్‌కు చేరిన పంజాబ్‌తో, దాదాపుగా నిష్ర్కమించిన ముంబైతోనే మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక వేళ ముంబైని ఓడించగలిగినా పంజాబ్‌పై రెండు మ్యాచ్‌ల్లో గెలుపు అనేది ప్రస్తుత ఫామ్‌తో అత్యాశే అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత స్థితి: పాయింట్లలో పంజాబ్‌తో సమానంగా (16) ఉన్నా... రన్‌రేట్ కాస్త తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. ఆడాల్సిన మ్యాచ్‌లు: బెంగళూరుతో రెండు, హైదరాబాద్, కోల్‌కతాలతో ఒక్కోటి ఆడాల్సి ఉంది. అవకాశాలు: ఈ స్థితిలో ధోని సేన కూడా ప్లే ఆఫ్‌కు చేరువైనట్లే. ప్రత్యర్థి బలాలను బట్టి చూస్తే మరో రెండు మ్యాచ్‌లు కూడా నెగ్గవచ్చు. ఈ జట్టు కూడా కచ్చితంగా టాప్-2లో ఉండాలనే లక్ష్యంతో ఉంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుత స్థితి: సరిగ్గా సన్‌రైజర్స్ స్థితిలోనే బెంగళూరు కూడా నిలిచింది. ఆ జట్టుకూ 8 పాయింట్లే ఉన్నాయి. తమతో పోటీలో ఉన్న కోల్‌కతా, హైదరాబాద్‌లను వెనక్కి నెట్టాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు నెగ్గడం ఒక్కటే మార్గం. ఆడాల్సిన మ్యాచ్‌లు: చెన్నైతో రెండు, హైదరాబాద్, కోల్‌కతాలతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అవకాశాలు: గత మ్యాచ్‌లో భారీ విజయంతో టీమ్ అదృష్టం మారినట్లు కనిపించినా...లీగ్‌లో కీలక సమయాల్లో ఈ జట్టు మ్యాచ్‌లు చేజార్చుకుంటోంది. చెన్నైని కనీసం ఒక సారి ఓడించడంతో పాటు, ఇతర మ్యాచ్‌లు గెలిస్తే ప్రత్యర్థుల గణాంకాలపై ఆధార పడవచ్చు. కానీ వాస్తవికంగా ఇది అంత సులభం కాదు. ముంబై ఇండియన్స్ ప్రస్తుత స్థితి: ఆడిన 10లో ఏడు మ్యాచ్‌లు ఓడి 6 పాయింట్లతోనే ఉన్న ఈ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు నెగ్గినా 14 పాయింట్లకే పరిమితమవుతుంది. ఆడాల్సిన మ్యాచ్‌లు: రాజస్థాన్‌తో రెండు, ఢిల్లీ, పంజాబ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. అవకాశాలు: సీజన్లో ఘోర వైఫల్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న ఫామ్‌తో పంజాబ్, రాజస్థాన్‌లను ఓడించటం దాదాపుగా కష్టమే. కాబట్టి ముంబైకి దారులు మూసుకుపోయినట్లే. దీనికి తోడు మలింగ కూడా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లండ్‌తో టి20ల కోసం మలింగ లంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు వెళ్లాడు.