
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల సమ యాల్లో మార్పులు చేశారు. స్టేడియంలోనూ, టెలివిజన్‌లోనూ వీక్షించే ప్రేక్షకుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ల సమయాన్ని గంట ముందుకు జరిపారు. ఈ మార్పు ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవ్వాల్సిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభమవుతాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 22న వాంఖెడే (ముంబై)లో తొలి క్వాలిఫయర్, 23న ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)లో ఎలిమినేటర్, 25న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ముంబైలో 27వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.