IPL chairman Rajiv Shukla
-
గంట ముందుగా...
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల సమ యాల్లో మార్పులు చేశారు. స్టేడియంలోనూ, టెలివిజన్‌లోనూ వీక్షించే ప్రేక్షకుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ల సమయాన్ని గంట ముందుకు జరిపారు. ఈ మార్పు ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవ్వాల్సిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభమవుతాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 22న వాంఖెడే (ముంబై)లో తొలి క్వాలిఫయర్, 23న ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)లో ఎలిమినేటర్, 25న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ముంబైలో 27వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
మ్యాచ్‌కు టిమ్ కుక్
కాన్పూర్: ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన జీవితంలో తొలి సారి క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌లో ఉన్న కుక్ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఆహ్వానం మేరకు స్టేడియానికి వచ్చి గుజరాత్, కోల్‌కతా మ్యాచ్‌ను తిలకించారు. ‘చాలా అద్భుతంగా ఉంది. నాకు తెగ నచ్చేసింది. ఇంత వేడిలో మ్యాచ్ చూడటం అంత సులువు కాకపోయినా నాకు ఇదో కొత్త అనుభూతి. క్రికెట్ ఏమిటో, క్రీడల ప్రాధాన్యత ఏమిటో ఇక్కడ కనిపించింది’ అని కుక్ ఆనందపడ్డారు. -
పుణేకు సౌరభ్ తివారి, మోర్కెల్
న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన బ్యాట్స్‌మన్ సౌరభ్ తివారి, ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ ఇప్పుడు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు మారారు. ‘మోర్కెల్, తివారిల రాకతో రైజింగ్ పుణే బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టం కానుంది’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. -
పాక్‌తో చర్చలు జరుపుతాం
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వ్యాఖ్య న్యూఢిల్లీ: డిసెంబరులో పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య సిరీస్ జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. ఈ విషయం గురించి అక్టోబరు 25 తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు చర్చలు జరుపుతారని చెప్పారు. ‘చర్చల కోసం భారత్‌కు వచ్చిన షహర్యార్ ఖాన్ బృందానికి మేం మంచి ఆతిథ్యం ఇచ్చాం. ఊహించని పరిణామాల వల్ల చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబరు 25న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు సమావేశమై సిరీస్ గురించి చర్చిస్తారు’ అని శుక్లా తెలిపారు. అటు పాక్ బోర్డు అధికారులు కూడా బీసీసీఐ నుంచి సానుకూల సంకేతాలు అందాయని తెలిపారు. బీసీసీఐలో అంబుడ్స్‌మన్ ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పారదర్శకతను పెంచేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు 9న జరిగే ఏజీఎమ్‌లో దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇకపై బోర్డులో పదవుల్లో ఉన్న ఎవరైనా ఎలాంటి నిబంధనలను అతిక్రమించినా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తలెత్తినా ఈ అంబుడ్స్‌మన్ వాటిని పరిశీలిస్తుంది. అలాగే ఇకపై సెలక్షన్ కమిటీ ఎంపిక తర్వాత ఆ జట్టును అధ్యక్షుడు ఆమోదించాల్సిన అవసరం లేకుండా నిబంధనలను మార్చనున్నారు. ఇకపై రాష్ట్రాల సంఘాలు ఆడిట్ చేసిన అకౌంట్స్‌ను అప్పగిస్తేనే తర్వాతి ఏడాదికి నిధులు ఇస్తారు. ఇలా అనేక అంశాలపై మార్పులు, చేర్పులను 9న జరిగే సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది.