![Rasi phalalu: Daily Horoscope On 07 Feb 2025 In Telugu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Friday.jpg.webp?itok=AOp_w_s8)
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.దశమి రా.11.05 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: రోహిణి రా.8.33 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.12.59 నుండి 2.27 వరకు, తదుపరి రా.2.10 నుండి 3.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.52 నుండి 9.40 వరకు, తదుపరి ప.12.40 నుండి 1.28 వరకు, అమృత ఘడియలు: సా.5.33 నుండి 7.04 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.35, సూర్యాస్తమయం: 5.53.
మేషం.... రాబడికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృషభం... శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
మిథునం.... కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది.
కర్కాటకం.... కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహ్నానిస్తాయి.
సింహం... ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య.. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు మార్పులు.
తుల... మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం.... పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
ధనుస్సు.. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
మకరం... పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం... బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం... శుభవార్తలు వింటారు. భూవివాదాలు తీరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
Comments
Please login to add a commentAdd a comment