సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ కారణంగా గన్నవరంలో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి విమానం యూటర్న్ తీసుకుని మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. మరికొన్ని విమానాలు అక్కడే గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.
గన్నవరంలో విమానాశ్రయంలో వద్ద దట్టమైన పొగమంచు కుమ్ముకుంది. దీని కారణంగా విమానాల ల్యాండింగ్ ప్రతికూలంగా మారింది. దీంతో, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. చెన్నై నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం.. అలాగే, ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాయి. సదరు విమాన సర్వీసులను దారి మళ్లీంచినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment