సాక్షి, ఢిల్లీ/అమరావతి: దేశంలో చలి తీవ్రత పెరిగింది. అలాగే, దట్టమైన పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఉత్తరాది సహా తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, ఢిల్లీలో జీరో విజిబిలిటీ కారణంగా పలు విమాన సర్వీసులు, రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. శుక్రవారం ఉదయం కాలుష్యం 408(ఎక్యూఐ)పాయింట్లకు చేరుకున్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దీంతో, గ్రాఫ్-3 అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి వరుసగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. రహదారులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగ మంచు కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శుక్రవారం ఉదయం పలుచోట్ల ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
#WATCH | Visibility reduced to zero as a blanket of dense fog witnessed in parts of Delhi-NCR
(Visuals from Rajokri area) pic.twitter.com/Pw89P7oavt— ANI (@ANI) January 10, 2025
#WATCH | UP | Layer of thick fog covers Ayodhya; minimum temperature to remain below 10 degrees Celsius today, as per IMD pic.twitter.com/hyanA22ELa
— ANI (@ANI) January 10, 2025
మరోవైపు.. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్ము కశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్ర పెరిగింది. దీంతో, ప్రజలు వణికిపోతున్నారు. ఇక, ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. పొగమంచు దట్టంగా కురుస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డల్లపల్లి 7.2, మినుములూరులో 8.5 డిగ్రీలుగా ఉంది.
26 trains to Delhi are running late due to fog conditions in the national capital and parts of north India, as per Indian Railways pic.twitter.com/gQniCQhFu8
— ANI (@ANI) January 10, 2025
తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ సహా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌లో 6.8 డిగ్రీలుగా నమోదు అయ్యింది.
Last Night North Telangana continues to shiver⛄️ #coldwave #Telangana #Hyderabad
🌡️Lowest — Ginnedari (Asifabad) : 6.8°C pic.twitter.com/qtxR47gTMQ— Weatherman Karthikk (@telangana_rains) January 10, 2025
Comments
Please login to add a commentAdd a comment