ఉత్తమ సేవలకు గాను కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న ఆప్కాబ్ ఎండి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి
న్యూ ఢిల్లీ: నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్స్కాబ్) 60ఏళ్ల ఉత్సవ వేడుకలు కొత్త ఢిల్లీలోని భారత్ మండపం సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత సహకారవేత్తలు కొండూరు రవీంద్రరావు, భీమా సుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్న ఈ జాతీయ సహకార సంస్థ 60ఏళ్ల వేడుకలను కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉత్తమ సేవలకు గాను నాఫ్స్కాబ్ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులను ఇదే వేదికపై మంత్రి అమిత్ షా ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు.
కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కేడీసీసీబీ పర్సన్ ఇంచార్జ్, జెసి గీతాంజలి శర్మ, సీఈవో శ్యామ్ మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) మూడో బహుమతి పొందింది. ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మొదటి బహుమతిని, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మూడో బహుమతిని పొందాయి. కరీంనగర్ డిసిసి పొందిన అవార్డును అధ్యక్షులు రవీందర్ రావు, సీఈవో సత్యనారాయణ రావు కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. కెడిసిసి బ్యాంక్ బహుమతిని పర్సన్ ఇంచార్జ్, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment