National federation
-
తెలుగు రాష్ట్రాల సహకార సంస్థలకు నాఫ్స్కాబ్ అవార్డులు
న్యూ ఢిల్లీ: నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్స్కాబ్) 60ఏళ్ల ఉత్సవ వేడుకలు కొత్త ఢిల్లీలోని భారత్ మండపం సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత సహకారవేత్తలు కొండూరు రవీంద్రరావు, భీమా సుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్న ఈ జాతీయ సహకార సంస్థ 60ఏళ్ల వేడుకలను కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉత్తమ సేవలకు గాను నాఫ్స్కాబ్ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులను ఇదే వేదికపై మంత్రి అమిత్ షా ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు.కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కేడీసీసీబీ పర్సన్ ఇంచార్జ్, జెసి గీతాంజలి శర్మ, సీఈవో శ్యామ్ మనోహర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) మూడో బహుమతి పొందింది. ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మొదటి బహుమతిని, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మూడో బహుమతిని పొందాయి. కరీంనగర్ డిసిసి పొందిన అవార్డును అధ్యక్షులు రవీందర్ రావు, సీఈవో సత్యనారాయణ రావు కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. కెడిసిసి బ్యాంక్ బహుమతిని పర్సన్ ఇంచార్జ్, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. -
శెభాష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ జాతీయ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం తెలంగాణ మహిళా అథ్లెట్స్ అగసార నందిని స్వర్ణం, జీవంజి దీప్తి రజతం... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజ రజిత కాంస్యం సాధించారు. గుజరాత్లో జరుగుతున్న ఈ మీట్లో నందిని 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.97 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. ఈ ప్రదర్శనతో నందిని కొలంబియాలో ఆగస్టు 1 నుంచి 6 వరకు జరిగే ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. దీప్తి 100 మీటర్ల ఫైనల్ రేసును 12.17 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. రజిత 400 మీటర్ల ఫైనల్ రేసును 56.32 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. నందిని, దీప్తి, రజిత హైదరా బాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సాయ్’ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్నారు. చదవండి: Rafael Nadal: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
యర్రాజి జ్యోతికి స్వర్ణం
కోజికోడ్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్‌తో ఆమె రేస్‌ను పూర్తి చేసింది. నిజానికి జ్యోతి నమోదు చేసిన టైమింగ్‌కు జాతీయ రికార్డుగా గుర్తింపు దక్కాలి. 2002లో అనురాధ బిశ్వాల్ నమోదు చేసిన 13.38 సెకన్లను ఆమె సవరించింది. అయితే నిబంధనల ప్రకారం గాలి వేగంలో ఉండే మార్పుతో అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉండటం వల్ల (టెయిల్ విండ్) దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. టెయిల్ విండ్ను 2 మీటర్/సెకన్ వరకు అనుమతిస్తుండగా, ఈ రేస్ సమయంలో అది 2.1 మీటర్/సెకన్‌గా నమోదు కావడంతో జ్యోతికి నిరాశ తప్పలేదు. మహేశ్వరికి కాంస్యం... మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తెలంగాణ అథ్లెట్ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది. -
సాఫ్ట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా కపిల్ వర్మ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ ఫెడరేషన్ కప్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు ఎన్.కపిల్ వర్మ సారథ్యం వహిస్తాడు. ఈ పోటీలు ఈ నెల 9 నుంచి 11 దాకా అమృత్‌సర్‌లోని గురునానక్ యూనివర్సిటీలో జరుగుతాయి. జట్టు: ఎన్.కపిల్ వర్మ (కెప్టెన్), నాగరాజ్, రాహుల్, ఉదయ్ కుమార్, దయాకర్, సాయి తరుణ్, మధుసూదన్ గౌడ్, వినయ్ బాబు, నాగేందర్, వెంకట అనిరుతి, హేమంత్‌రెడ్డి, శివాజీ నానక్, కన్నా, చంద్రశేఖర్, సుమంత్‌రెడ్డి, జి.జ్ఞానేంద్రరెడ్డి, ప్రేమ్ కుమార్ యాదవ్ (కోచ్), వెంకటేశ్వర్ (మేనేజర్).