కోజికోడ్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్‌తో ఆమె రేస్‌ను పూర్తి చేసింది.
నిజానికి జ్యోతి నమోదు చేసిన టైమింగ్‌కు జాతీయ రికార్డుగా గుర్తింపు దక్కాలి. 2002లో అనురాధ బిశ్వాల్ నమోదు చేసిన 13.38 సెకన్లను ఆమె సవరించింది. అయితే నిబంధనల ప్రకారం గాలి వేగంలో ఉండే మార్పుతో అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉండటం వల్ల (టెయిల్ విండ్) దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. టెయిల్ విండ్‌ను 2 మీటర్/సెకన్ వరకు అనుమతిస్తుండగా, ఈ రేస్ సమయంలో అది 2.1 మీటర్/సెకన్‌గా నమోదు కావడంతో జ్యోతికి నిరాశ తప్పలేదు.
మహేశ్వరికి కాంస్యం...
మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తెలంగాణ అథ్లెట్ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment