డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. బుధవారం మహిళల కనోయ్ స్లాలోమ్ కే–1 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగిడి గాయత్రి పసిడి పతకం సాధించింది. అంతకుముందు వెయిట్‌లిఫ్టింగ్‌లో నీలంరాజు, పల్లవి బంగారు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. బుధవారమే ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి.
కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తిరుమూరు గణేశ్ మణిరత్నం–మాదాల సూర్య హంసిని జోడీ రజత పతకం గెలిచింది. ఫైనల్లో గణేశ్–సూర్య హంసిని ద్వయం 148–154 పాయింట్ల తేడాతో రిషభ్ యాదవ్–దీప్షిక (హరియాణా) జంట చేతిలో ఓడింది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తిరుమూరు గణేశ్ మణిరత్నం కాంస్య పతకం సంపాదించాడు.
తెలంగాణకు కాంస్యం
మరోవైపు తెలంగాణ ఖాతాలో బుధవారం ఒక కాంస్య పతకం చేరింది. మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, మానస నయన, శ్రేష్ణ రెడ్డి, మన్సూరా హసీబాలతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
తెలంగాణ జట్టు 232 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో 18వ స్థానంలో... తెలంగాణ 1 స్వర్ణం, 3 కాంస్యాలతో కలిపి 4 పతకాలతో 25వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment