డెహ్రడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పతకాల బోణీ కొట్టాయి. శుక్రవారం పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కొమెర నీలం రాజు పసిడి పతకాన్ని సాధించాడు. నీలం రాజు మొత్తం 289 కేజీలు (స్నాచ్ లో 128+క్లీన్ అండ్ జర్క్ లో 161) బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. పురుషుల సైక్లింగ్ రోడ్ రేసు మాస్ స్టార్ట్ ఈవెంట్ లో తెలంగాణ ప్లేయర్ ఆశీర్వాద్ సక్సేనా (2గం:48ని:39.029 సెకన్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
మరోవైపు భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి జాతీయ క్రీడల్లో పసిడి పతకంతో సత్తాచాటింది. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి 201 కేజీల (88+113) బరువెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. బింద్యారాణి స్నాచ్‌లో 88 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో మీరాబాయి చాను ఈ విభాగంలో 86 కేజీల బరువెత్తగా... ఇప్పుడు బింద్యారాణి దాన్ని బద్దలు కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment